వ్యయ ద్రవ్యోల్బణ సూచిక అంటే ఏమిటి?
,కాలం గడుస్తున్న కొలది, మనం కొనే వస్తువులకు ధర పెరుగుతుందే కానీ తగ్గదు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? దానికి సమాధానం, డబ్బుకు ఉండే కొనుగోలు శక్తి. కొన్ని సంవత్సరాల క్రితం, రూ. 300 ఉంటే మూడు వస్తువులు కొనగలగితే, ఇప్పుడు అదే రేటుకు ఒక్క వస్తువును మాత్రమే కొనగలుగుతున్నాం. ఈ మార్పుకు కారణం, ద్రవ్యోల్బణం. గూడ్స్/సర్వీస్ల ధర క్రమేణా పెరగడం మరియు డబ్బుకు ఉండే విలువ తగ్గడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. అలాగే, ఈ ద్రవ్యోల్బణం కారణంగా ప్రతీ ఏడాది వస్తువుల ధర ఎంత వరకు పెరుగుతుందో లెక్కించడానికి వాడే దానినే వ్యయ ద్రవ్యోల్బణ సూచిక అంటారు.
వ్యయ ద్రవ్యోల్బణ సూచిక అనేది చాలా ముఖ్యమైన కొలత. దేశంలో ఉన్న ద్రవ్యోల్బణ స్థాయిని సూచిస్తుంది. భారతదేశ కేంద్ర ప్రభుత్వం వారి అధికారిక ప్రచురణ సంస్థ ద్వారా ప్రతీ ఏడాది ఈ సూచీని ప్రచురిస్తుంది. ఈ సూచీ ఆదాయ పన్ను చట్టం, 1961 క్రింద ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలవానే దానికి ప్రాథమిక సూచనలు కలిగి ఉంటుంది.
వ్యయ ద్రవ్యోల్బణ సూచిక యోక్క ఉద్దేశం ఏమిటి?
వ్యయ ద్రవ్యోల్బణ సూచికను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ను లెక్కించడానికి ఉపయోగిస్తారు. మరింత సులభంగా చెప్పాలంటే, ద్రవ్యోల్బణ రేటుకు ఆస్తుల రేటును మ్యాచ్ చేసి చూపుతుంది. క్యాపిటల్ గైన్ అంటే, స్థలం, స్టాక్స్, షేరులు, పేటెంట్, ట్రేడ్మార్క్ లాంటి వాటిని అమ్మగా వచ్చిన లాభాలు. నిర్దేశిత వ్యయ ద్రవ్యోల్బణ సూచిక కొరకు, మీరు ఆయా ఆస్తులను కొన్న సంవత్సరంలో ఉన్న వ్యయ ద్రవ్యోల్బణ సూచికను, అమ్మిన సంవత్సరంలో ఉన్న వ్యయ ద్రవ్యోల్బణ సూచికను పరిగణలోనికి తీసుకొంటారు.
సాధారణంగా అకౌంటింగ్ పుస్తకాలలో, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆస్తులను వాటి కాస్ట్ ధరకే నోట్ చేసి పెడతారు. కాబట్టి ఆస్తుల ఖరీదు పెరిగినా కూడా, క్యాపిటల్ ఆసెట్స్ ని మళ్ళీ సరిచేయడం కుదరదు. తద్వారా, అమ్మకం జరిపేటప్పుడు, కొన్న రేటు కంటే, అమ్మినప్పుడు లాభాన్ని పొందగలుగుతారు. కానీ దానివల్ల మీరు పొందుకున్న లాభాలపై ఎక్కువ ఆదాయ పన్ను చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఆదాయ ద్రవ్యోల్బణ సూచికను వాడితే, ప్రస్తుత అమ్మకం ధరకు, కొన్న ధరకు అనుగుణంగా మార్చుతారు. దీని కారణంగా లాభం తగ్గినా, వర్తించే ట్యాక్స్ కూడా తగ్గుతుంది.
ఒక ఉదాహరణను చూద్దాం:
మీరు 2014లో 70 లక్షలు ఖరీదు చేసే ఇల్లు కొన్నారు అనుకోండి, 2016లో దానిని 90 లక్షలకు అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ మీరు ఇంటిపై 20 లక్షలు లాభాన్ని పొందారు. అది మీ క్యాపిటల్ గెయిన్స్. కాబట్టి దీనిమీద మీరు ఎంత పన్ను కట్టాలో ఊహించుకోండి. చాలా డబ్బు ట్యాక్స్ రూపంలో పోతుంది.
కాబట్టి, ప్రజలను ఈ పెద్దమొత్తం ట్యాక్సుల నుండి కాపాడడానికి, భారతప్రభుత్వం ద్రవ్యోల్బణ సూచికను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో, మీరు కొన్నప్పటి రేటునే ఇండెక్స్ చేస్తారు, అంటే, ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణ రేటును బట్టి సర్దుబాటు చేస్తారు. కాబట్టి లాభము తగ్గుతుంది, అలాగే ట్యాక్స్ కూడా తగ్గుతుంది.
ద్రవ్యోల్బణ సూచికను ఎలా లెక్కేస్తారు?
పెట్టుబడి దారులను బట్టి, ఒక్కొక్కరికి ద్రవ్యోల్బణం అంటే ఒక అర్ధం ఉంటుంది. కాబట్టి, అందుకని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ వారు, ప్రతీ ఏడాది సూచిక వ్యయాన్ని లెక్కించడానికి వినియోగదారు ధర సూచికపై ఒక పామణిక ద్రవ్యోల్బణ సూచికను ప్రవేశపెడతారు.
ద్రవ్యోల్బణ సూచిక = గత ఏడాది పెరిగిన సగటు వినియోగ ధరల సూచీలో 75%.\
వినియోగ ధరల సూచీ అనేది గత ఏడాది ఉత్పత్తి యొక్క ధరలో చోటుచేసుకున్న మొత్తాన్ని ఏడాది రేటుతో పోల్చి తేడాను చూపిస్తుంది. 2017 బడ్జెట్ లో, కొత్త ద్రవ్యోల్బణ సూచిక ప్రవేశపెట్టిన తర్వాత, అది 2017-18 నుండి వర్తించడం ప్రారంభమైంది. ఈ మార్పులో పోల్చడానికని బేస్ ఏడాదిని 1981-82 నుండి 2001-02కు మార్చారు. ఈ మార్పు తీసుకురావడానికి కారణం 1981కి ముందు పన్ను కట్టే వారు కొన్న ఆస్తులపై ఎదురయ్యే విలువకు సంబందించిన సమస్యలను తీర్చడానికి.
వ్యయ ద్రవ్యోల్బణ సూచిక చార్ట్:
క్రింద గత 10 ఆర్థిక సంవత్సరాలకు గాను సవరించబడ్డ వ్యయ ద్రవ్యోల్బణ సూచిక చార్ట్ ఉంది.
ఆర్థిక సంవత్సరం | వ్యయ ద్రవ్యోల్బణ సూచిక |
2001 – 02 (మూల సంవత్సరం) | 100 |
2002 – 03 | 105 |
2003 – 04 | 109 |
2004 – 05 | 113 |
2005 – 06 | 117 |
2006 – 07 | 122 |
2007 – 08 | 129 |
2008 – 09 | 137 |
2009 – 10 | 148 |
2010 – 11 | 167 |
2011 – 12 | 184 |
2012 – 13 | 200 |
2013 – 14 | 220 |
2014 – 15 | 240 |
2015 – 16 | 254 |
2016 – 17 | 264 |
2017 – 18 | 272 |
2018 – 19 | 280 |
2019 – 20 | 289 |
వ్యయ ద్రవ్యోల్బణ సూచికలో మూల సంవత్సరం ప్రాధాన్యత ఏమిటి?
మూల సంవత్సరం, ఆ తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరాల సూచికకు మొదటిది. ఈ ఏడాదికి నిర్హేతుకంగా 100 విలువను పెడతారు. దానిని బట్టి ద్రవ్యోల్బణ ఎంత పెరిగింది, అలాగే మొదటి సంవత్సరంతో పోల్చితే తర్వాతి సంవత్సరాలలో సూచికలో ఎంత మార్పు వచ్చిందని తెలుస్తుంది.
అంతేకాక, ఈ మూల సంవత్సరానికి ముందు కొన్న ఆస్తులపై, పన్ను చెల్లింపుదారులు ఆ ఏడాదిలో ఉన్న మొదటి రోజున మార్కెట్ ధరనైనా ఎంచుకోవచ్చు, లేదా లెక్కించిన తర్వాత వచ్చిన లాభం/నష్టంన్ని బట్టి ఏర్పడిన విలువనైనా ఎంచుకోవచ్చు.
ఈ సూచిక ప్రయోజనాలు ఎలా వర్తిస్తాయి?
CII సూచికను ఆస్తి కొనుగోలు ధరకు (సముపార్జన ఖర్చు) వర్తింపజేసినప్పుడు, దానిని ఆస్తి కొన్నప్పుడు ఇండెక్స్ చేయబడ్డ ధరగా పిలుస్తారు
ఆస్తిని కొన్నప్పుడు ఇండెక్స్ చేయబడ్డ ధరకు ఫార్ములా ఇక్కడ ఇవ్వబడింది:
ఆస్తిని మెరుగుదలకు ఇండెక్స్ చేయబడ్డ ధరకు ఫార్ములా ఇక్కడ ఇవ్వబడింది::
భారతదేశంలో వ్యయ ద్రవ్యోల్బణ సూచిక గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు
వ్యయ ద్రవ్యోల్బణ సూచికను లెక్కించేటప్పుడు పన్ను చెల్లింపుదారులు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి:
- ఇలా ఇండెక్స్ చేయడం ఏప్రిల్ 1, 2001కి ముందు ఆస్తి మెరుగుపరచడానికి పెట్టిన పెట్టుబడిపై వర్తించదు.
- ఒకవేళ ఆస్తిని వారసత్వంగా, లేదా వీలునామా కారణంగా పొందుకుంటే, CIIని పొందుకున్న ఏడాది నుండి లెక్కించడం జరుగుతుంది. అలాగే ఆస్తిని కొన్న తేదీని పట్టుంచుకోరు.
- సావరిన్ గోల్డ్ బాండ్లు లేదా RBI జారీ చేసిన క్యాపిటల్ ఇండెక్సేషన్ బాండ్లు తప్పించి, ఇతర బాండ్స్, డిబెంచర్లను CII ఉపేక్షిస్తుంది.
ఈ గైడ్ మీకు వ్యయ ద్రవ్యోల్బణ సూచిక గురించి మరియు దాని లాభాల గురించి వివరించి సహాయపడిందని ఆశిస్తున్నాం.