written by khatabook | October 17, 2020

ఆన్‌లైన్ మొబైల్ ఉపకరణాల షాప్ పెట్టి లాభాన్ని ఆర్జించడం ఎలా?

×

Table of Content

గత కొన్ని సంవత్సరాలుగా, మొబైల్ ఫోనులు మన జీవితాలలో చాలా ముఖ్యమైన భాగాలయ్యాయి. ఒకప్పటిలా అవి ఇంకెంతమాత్రం లగ్జరీ ఉత్పత్తులు కావు. కాకపోతే, ఒక మొబైల్ ఆక్సిస్సోరీస్ షాపును స్థాపించడం మంచి ఐడియా. ఎందుకంటే దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు, అలాగే లాభాలు కూడా బాగానే ఉంటాయి. మరి మీకు ఏదైనా వ్యాపారం చేయాలనీ ఎప్పటినుండో ఉంటే, ఈ అవకాశాన్ని వదులుకోకండి. కానీ, ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలంటే మీకు ఉండే భయాలను మేము అర్ధం చేసుకోగలము.

కానీ చింతించకండి, ఈ బ్లాగులో మీరు విజయవంతంగా ఎలా ఆన్‌లైన్ మొబైల్ ఆక్సిస్సోరీస్ షాప్‌ను తెరిచి నడిపించాలో వివరిస్తున్నాం.

మొబైల్ ఆక్సిస్సోరీస్ షాపును మొదలుపెట్టడం ఎలా?

ముందుగా, ఇది మంచి బిజినెస్ ఐడియా అనే విషయాన్నీ పక్కన పెడితే, మీరు దీనికి ఉన్న డిమాండ్‌కి న్యాయం చేయాలనీ గుర్తుంచుకోండి. ఈ ఆన్‌లైన్ వ్యాపారం దాదాపు 2016లోనే 140 కోట్ల డాలర్ల విలువైంది. మరొక ఏడాదిలో దాని విలువ 354 కోట్ల డాలర్లకు చేసుకోనుంది. అంటే దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల వ్యాపారానికి అవకాశం ఉంది. ఇంత వ్యాపారంలో మన దేశం కూడా ముందుంది.

ఈ మొబైల్ ఆక్సిస్సోరీస్ యొక్క ప్రాధాన్యతల పై రీసెర్చ్ researchnester.com అనే సైట్ వారు జరిపారు. అందులో తేలిన విషయం ఏమిటంటే, ప్రస్తుతం 7 ఆక్సిస్సోరీస్ వస్తువులకు మంచి డిమాండ్ ఉంది, కాబట్టి మీ మొబైల్ ఆక్సిస్సోరీస్ షాపు నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ.

ఆక్సిస్సోరీ ర్యాంక్
బ్యాటరీలు 4
ఛార్జర్లు 2
హెడ్సెట్ 3
మెమొరీ కార్దులు 5
పోర్టబుల్ స్పీకర్లు 7
పవర్ బ్యాంకులు 6
సెల్ ఫోన్ కేసులు 1

కాకపోతే, మీరు మీ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించడానికి కొని మార్కెటింగ్ స్టార్టెజిలను ఉపయోగించాలి.

ఆన‌లైన్ మొబైల్ ఆక్సిస్సోరీస్ షాప్‌ను తెరవడం ఎలా?

ఆన్‌లైన్ స్టోర్‌తో పోల్చినప్పుడు భౌతిక షోరూమ్ తెరవడం ఖరీదైనది. అలాగే, ఇటీవలి సంవత్సరాలలో ఆన్‌లైన్ స్టోర్లు ఆదరణ పొందుతున్నాయి మరియు ఈ COVID మహమ్మారి సమయంలో ఇది తప్పనిసరి అయ్యింది. రాబోయే సంవత్సరాల్లో జీవన క్రమం కాబోతున్న డిజిటలైజేషన్ గురించి తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం.

#1. అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవడం

ప్రస్తుతం అమ్మకాలు జరుపుతున్న మొబైల్ ఆక్సిస్సోరీస్ అమ్మకం దారుల లిస్టు వ్రాసుకొని, వారి రేటు అలాగే ఇతర విషయాలపై రీసెర్చ్ చేయండి. అప్పుడు మీకు మీ వెబ్సైట్‌లో ఎన్ని మొబైల్ ఉపకరణాల ఫోటోలు పెట్టాలనే విషయం మీద క్లారిటీ వస్తుంది. అలాగే వెబ్ డిజైనర్ దగ్గరకు వెళ్లే ముందు ఆక్సిస్సోరీస్ మీద అన్ని వివరాలు సేకరించండి.

#2. వెబ్సైట్ డిజైన్ మరియు హోస్టింగ్

ఏ వ్యాపారానికైనా ఒక విజయవంతమైన ఆన్‌లైన్ బిజినెస్ నడిపించడానికి ఒక మంచి వెబ్‌సైట్ అవసరం. కాబట్టి మీ వెబ్సైట్ సరిగ్గా నడవడానికి కాస్త డబ్బు ఖర్చు చేసినా పర్లేదు. ఎందుకంటే, ఒకవేళ మీ వెబ్సైట్ సరిగా లోడ్ కాకపోయినా, లేక సైట్‌లో ఫొటోలు సరిగా లోడ్ అవ్వకపోయినా, వెంటనే వదిలి వెళ్ళిపోతారు. మీ కస్టమర్లతో మాట్లాడేది మీ వెబ్సైట్ఏ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఫోన్ లేదా కంప్యూటర్‌లోనైనా సరిగ్గా లోడ్ అయ్యే విధంగా రెస్పాన్సివ్‌గా ఉండాలి. ఈ రంగంలో గెలవడానికి ఒక మంచి వెబ్సైటు ఉండడం చాలా ప్రాముఖ్యం.

#3. ఆఫర్స్‌తో ఉండే ఆక్సిస్సొరి లిస్టింగ్ ఆన్‌లైన్ స్టోర్

తర్వాత, అన్ని మొబైల్ ఆక్సిస్సోరీలు కస్టమర్లు వారికీ నచ్చిన బ్రాండ్, రేటు, అందుబాటును బట్టి సెర్చ్ చేసే విధంగా ఏర్పాటు చేయబడి ఉండాలి. ప్రతీ వస్తువుకు, కస్టమర్‌ను ఆకర్షించే విధంగా ఒక మంచి ఆఫర్ ఉండేలా చూసుకోవాలి. రకరకాల ఆఫర్స్ ఉండాలి. తమకు సరిపోయే ఆఫర్ లేక మరొక వెబ్సైట్‌కి వెళ్లకుండా జాగ్రత్త పడండి. వెబ్సైటు ప్రారంభించడానికి ముందు మీరు చేయాల్సిన రీసెర్చ్ చాలనే ఉంటుంది కాబట్టి అన్ని పరీక్షించి తెలుసుకోండి. అన్ని వస్తువులకు మంచి వివరణ ఉండాలి.

#4. మీ మొబైల్ ఆక్సిస్సోరీస్ షాపును సోషల్ మీడియాలో ప్రమోట్ చేయండి

కేవలం ఒక మంచి వెబ్సైటును ప్రారంభించి, అందులో ఆఫర్స్ పెడితే సరిపోదు. అసలు ముందు మీ వెబ్సైటు ఒకటి ఉందని అందరికి తెలియాలి. అంటే యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్, లాంటి సోషల్ మీడియా సైట్లలో ప్రజలకు మీ వెబ్సైట్ గురించి తెలియాలి. మీ వెబ్సైట్‌కు వచ్చే వారిని వారి సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేయమని అడగండి. అప్పుడు సైట్‌కి వచ్చే ట్రాఫిక్ పెరిగే అవకాశం కూడా ఉంది. అంతేకాక, మీరు అమ్మే ఆక్సిస్సోరీస్ యొక్క ఫోటోలు పెట్టి, వాటి రివ్యూలు వ్రాయమని కూడా అడగవచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్ అత్యంత చవకైన, మంచి మార్కెటింగ్ విధానం.

#5. కంటెంట్ మార్కెటింగ్

సోషల్ మీడియాలో చేసినట్టే, మీరు మీ వెబ్సైటలో ఉండే బ్లాగులో కూడా కంటెంట్ వ్రాస్తూ ఉండాలి. మీరు అమ్మే వస్తువుల గురించి, వాటిని ఎలా వాడాలి అనే విషయాలు వ్రాయండి. అప్పుడు మీ వెబ్సైటుకి వచ్చే వారికీ మీ సర్వీస్ పైన నమ్మకం ఏర్పడుతుంది. అంతేకాక, చాలామందికి ఈ ఆక్సిస్సోరీస్‌ని ఎలా వాడాలో తెలిసి ఉండదు కాబట్టి ఈ సూచనలు వారు మీ యొద్ద నుండి కొనేలా చేస్తాయ్.

#6. లొకేషన్-ఆధారిత సేవలు

లొకేషన్ ఆధారిత సేవల సహాయంతో మీ ఆన్‌లైన్ స్టోర్‌కి వచ్చేవారికిమీ వెబ్సైట్ కనిపించేలా చేయండి. దీని సహాయంతో మరింత మంది మీ షాపుకు వస్తారు.

#7. గెస్ట్ పోస్టింగ్ టెక్నీక్

తక్కువ ఖర్చుకే మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేయడానికి ఇది మరొక విధానం. మంచి బ్రాండ్ మరియు ట్రాఫిక్ ఉన్న సైట్స్‌లో మంచి సమాచారం ఉన్న ఆర్టికల్స్ వ్రాయండి. దీని సహాయంతో పాఠకులకు మీ గురించి, మీ వెబ్సైట్ గురించి తెలుస్తుంది. తద్వారా మీ సైట్‌కి జనం వచ్చే కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది.

#8. మీ ఆన్‌లైన్ మొబైల్ ఆక్సిస్సోరీస్ షాప్‌క్‌కి వ్యక్తిగత మెరుగులు దిద్దండి.

చివరిగా, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ కస్టమర్లతో కనెక్ట్ అయి ఉండాలి. అంటే, వారు షాపులో ఒకసారి కొన్నా, రెండు సార్లు కొన్నా, వారికి మీరు గుర్తుండేలా చూసుకోవాలి. కాబట్టి, ఎప్పటికప్పుడు వివిధ సందర్భాలకు వారికి ప్రమోషన్ చేయడానికి ఆఫర్స్, గ్రీటింగ్స్ లాంటివి మెయిల్ చేస్తుండాలి. అంతేకాక, వారు కొన్న వస్తువులు ఎలా ఉన్నాయని అడగడం, లేదా సర్వీస్‌కి తీసుకురమ్మమని చెప్పడం లాంటిది చేస్తే, చాలా బాగుంటుంది. అలాగే, ఒకవేళ ఎవరికైనా వారు కోరుకున్నది లేకపోతే, దానిని ఆర్డర్ చేసి, తర్వాత వారికీ ఆ వస్తువు అందుబాటులో ఉందని మెయిల్ చేస్తే కూడా మీకు ఆదరణ పెరుగుతుంది. ఇలాంటి చిన్న పనులే కస్టమర్లకు మనపై విశ్వసనీయత పెరిగేలా చేస్తాయ్.

టాప్‌లో నిలబడడానికి చివరి మెట్టు

పైన చెప్పిన అన్ని అడుగులు ఫాలో చేస్తూ, ఆన్‌లైన్ మొబైల్ ఆక్సిస్సోరీస్ షాపునునడిపిస్తుంటే మీరు మంచి మార్గంలో ఉన్నట్టే. కాకపోతే, ఎప్పటికప్పుడు మీ పోటీదారులు వేరే ఏం చేస్తున్నారనే విషయంపై ఒక కన్నేసి ఉంచడం మర్చిపోకండి. అలాగే, కస్టమర్లు మీ నుండి ఏదైనా కొన్నప్పుడు, వారి కొనుగోలులో ఎలాంటి ఇబ్బంది లేకుండాసాఫీగా జరిగే సరైన పేమెంట్ విధానం గురించి తెలుసుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ వెబ్సైట్ డిజైన్, వస్తువుల లిస్ట్, ఆఫర్లు, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా అందుబాటు, ఇవన్నీ మీ అమ్మకాలు పెరగడానికి సహాయపడతాయి.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.