written by khatabook | September 12, 2020

మీ వ్యాపారాలకు UPI QR కోడ్‌ను పొందడం ఎలా?

×

Table of Content

భారతదేశంలో UPI QR కోడ్‌ల ప్రస్థానం

2016, నవంబర్ 8, రాత్రి 8-8:30 గంటలు. ఎవరు ఊహించని విధంగా మన దేశ ప్రధాన మంత్రి టివిలో ప్రసంగిస్తూ, అప్పటికప్పుడు ఆ రాత్రి నుండి దేశంలో 500 మరియు 1000 నోట్లు ఇకపై చెల్లవని ప్రకటన చేశారు. ఆ ప్రకటన విన్న దేశం విభ్రాంతికి లోనై, ఎక్కడా లేని కల్లోలం పుట్టుకొచ్చింది. ప్రభుత్వం చేసిన ఆ నిర్ణయం కారణంగా అప్పటికి చలామణిలో ఉన్న 86% కరెన్సీ నోట్లు ఒక్కసారిగా చెల్లకుండా పోయాయి. దేశంలో జరుగుతున్న అక్రమ క్యాష్ దందాలు, ఉగ్రవాద చర్యలు, నకిలీ నోట్ల చలామణి మరియు షాడో ఎకానమీ పై వేటు వేయడానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రధానమంత్రి అందరికి చెప్పారు. డీమానిటైజేషన్ జరిగిన నాటనుండి, భారత ప్రభుత్వం డిజిటల్ పేమెంట్లను అవలంభించమని ప్రజలను ప్రోత్సహిస్తుంది.

డిజిటల్ ఇండియా ఉద్యమాన్ని మరింత మందికి చేరే విధంగా ప్రమోట్ చేయడానికి, నగదు రహిత లావాదేవీలకు వీలు కల్పించడానికి భారతదేశ ప్రభుత్వం UPI, అంటే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో రూపించబడ్డ (భారత్ ఇంటర్ఫేస్ ఆఫ్ మనీ) BHIM అనే యాప్ ప్రజలు నగదు వాడకుండా లావాదేవీలను జరపడానికి సహాయపడుతుంది.

నగదు రహిత లావాదేవీలు

గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో చాలా విధాలైన నగదు రహిత విధానాలను మనం ఉపయోగిస్తూనే ఉన్నాము - డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ అనేవి వాటిలో కొన్ని. - కానీ వీటిని ఉపయోగించడంలో, స్వైప్ మెషిన్లు, కార్డులపై రుసుము , మరియు ఇతర ఛార్జీలని బ్యాంకులు విధించే రుసుములు లేకపోలేదు. కాబట్టి, కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా లావాదేవీలు జరపడానికి భారతదేశ ప్రభుత్వం, నెమ్మదినెమ్మదిగా ప్రజాధారణ పొందుతున్న BHIM UPI అనే యాప్‌ను ప్రవేశపెట్టింది.

UPI QR కోడ్ అంటే ఏమిటి?

QR (క్విక్ రెస్పాన్స్ ) కోడ్ అనేదానిని, యంత్రాల మధ్య సమాచారాన్ని దాటవేయడానికి ఉపయోగపడే, తెల్లని మరియు నల్లని చుక్కలు ఉండే ఒక గుర్తింపు ఆకారం అని అనొచ్చు. ఈ కోడ్‌లో వ్యాపారికి సంబంధించిన URL మరియు ఇతర సమాచారాన్ని ఉంచడానికి వీలుపడుతుంది. ఈ QR కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌లలో ఉండే కెమెరా ద్వారా UPI యాప్స్ లావాదేవీలు జరపడానికి వీలు కలుగుతుంది. భారత రిజర్వు బ్యాంక్ ప్రకారం, BHIM UPI కోడ్ అనేది ప్రపంచంలోనే మొదటి ఇంటర్-ఆపరేబుల్ పేమెంట్స్ వ్యవస్థ. ఇది సాంకేతిక సమస్యలు తలెత్తి, ప్రజలు మళ్ళీ కార్డులు ఉపయోగించాల్సిన అవసరం రాకుండా రూపొందించబడిన మరింత మెరుగైన విధానం. BHIM UPI కోడ్‌ను మీ స్మార్ట్ ఫోన్ కెమెరా నుండి స్కాన్ తీసి ఒకరి నుండి ఇంకొకరికి డబ్బును పంపించడానికి వీలు పడుతుంది.

QR కోడ్ ఎలా పని చేస్తుంది?

పేమెంట్ జరపడానికి డబ్బు స్వీకరించబోయే వ్యక్తి యొక్కBHIM UPI QR కోడ్‌ను కస్టమర్లు UPI యాప్ ఉన్న మొబైల్ నుండి స్కాన్ చేయాలి. మొదటిగా చెల్లించబోయే వ్యక్తి యొక్క అకౌంట్ నుండి ఆ వ్యక్తి బ్యాంక్ డబ్బును తీసుకుంటుంది. ఆ తర్వాత పొందవలసిన వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నుండి కొన్ని వివరాలు చెల్లించే వ్యక్తి బ్యాంక్ అకౌంట్‌కు వెళ్తాయి. తర్వాత పొందవలసిన వ్యక్తి బ్యాంక్, సంబంధిత వ్యక్తి అకౌంట్‌లో డబ్బు జమచేస్తుంది. ఒకసారి డబ్బు పొందవలసిన వ్యక్తి అకౌంట్‌లో జమచేయబడిన తర్వాత డబ్బు తీసుకోవడానికి వీలవుతుంది. .

Khatabook సహాయంతో QR కోడ్ పొందడం ఎలా?

Khatabook QR కోడ్ జనరేటర్ సహాయంతో, మీరు మీ వ్యాపారానికి చాలా సులభంగా UPI QR కోడ్‌ను పొందగలరు, అది కూడా ఉచితంగా. అదెలా చేయాలో ఇక్కడ వివరించాము:

  1. Visit the Khatabook QR page.
  2. ఈ వివరాలను చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి:
    • పేరు
    • ఫోన్ నంబర్
    • పిన్ కోడ్
  3. మీరు ఒక WhatsApp చాట్‌కి వెళ్తారు.
  4. చెల్లింపుదారు పేరు, VPA మరియు మరింత సంబంధిత సమాచారాన్ని అక్కడ ఎంటర్ చేయండి.
  5. ఆ తర్వాత ప్రక్రియ అంతటిలో మిమ్మల్ని నడిపించి చూపించిన తర్వాత, మీ QR కోడ్ జెనెరేట్ అవుతుంది.

మరొక గొప్ప విషయం ఏమిటంటే, ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా మీరు మీ ఇంటికి మీ సొంత QR కోడ్‌ను ఆర్డర్ చేయగలుగుతారు. 8-10 వ్యాపార దినాలలో మీ QR కోడ్ మీ చెంతకు చేరుతుంది. మీకు ఇవ్వబడిన మీ QR కోడ్‌ను మీ షాపు లేదా ఆఫీసులో ప్రింట్ తీసి పెటుకోవచ్చు. అలాగే, మీ స్నేహితులు, బందువులు అలాగే కస్టమర్లతో మీ QR కోడ్‌ను షేర్ చేసి దాని ద్వారా డబ్బు చెల్లించమని అడగండి. తమ UPI యాప్స్ నుండి స్కాన్ తీసి పేమెంట్స్ చేయగలరు అని చెప్పండి. ఒకసారి పేమెంట్ జరిగిన తర్వాత, నిర్ధారణకు మీ బ్యాంక్ నుండి SMS మరియు నోటిఫికేషన్ కూడా వస్తుంది.

UPI QR ఉండడం వల్ల ఉండే లాభాలు ఏమిటి?

ఒక దశాబ్దం క్రితం, ఇండోయాలో ఉన్న ఏ వ్యక్తి కూడా జపాను వారు సృష్టించిన ఈ - క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్ ద్వారా లభించే లాభాలను ఊహించి ఉండరు. ఒక QR కోడ్‌ను బార్‌కోడ్ లాగ కాకుండా, 4296 ఆల్ఫాన్యూమెరిక్ అక్షరాలతో తయారు చేస్తారు. అలాగే పేమెంట్ చేయడానికి, తీసుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు.

#1. అదనపు సెటప్ చేయవలసిన పని ఉండదు

వ్యాపారులు తమ షాపులలో ప్రత్యేకించి పాయింట్ ఆఫ్ సేల్ (PoS) అనే పరికరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన పని ఉండదు. అంతేకాక, రాను రాను ప్రజలు కూడా ఎక్కువ సేపు ఎదురుచూడడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి అందుకు పరిష్కారంగా, తక్షణమే పని పూర్తి కావాలనుకునే వారి కోసం చేయబడిందే QR కోడ్. UPI QR కోడ్ కొనేవారితో పాటు అమ్మే కారికి కూడా చాలా విధాలుగా సహాయపడుతుంది, లావాదేవికి సంబంధించిన ఎటువంటి సమాచారాన్ని ఫీడ్ చేయడానికి సమయం వెచ్చించవలసిన పని లేదు. ఇది యువ తరానికి కూడా సరిగ్గా సరిపోతుంది.

#2. లావాదేవీ సంబంధిత సమస్యలు తక్కువ

డీమానిటైజేషన్ తర్వాత, QR కోడ్ ఆధారిత పేమెంట్స్ పై ఆధరణ చాలా వేగంగా వెరుగుతుంది. ఉదాహరణకు, మీరు ఎక్కడ ఎలాంటి లావాదేవీ జరపడానికైనా సులభంగా QR కోడ్ స్కాన్ చేసి పూర్తి చేయవచ్చు. BHIM QR కోడ్ అనేది ప్రస్తుతం చలామణిలో ఉన్న రూపే, మాస్టర్ కార్డు మరియు వీసా అనే అన్ని రకాల కార్డుల స్కీంలతో కలిసి పనిచేయగలదు. అంతే కాకా, యూజర్లకు UPI లేదా కార్డు ద్వారా చెల్లింపు చేయడానికి సహకరిస్తుంది కాబట్టి వ్యాపారులకు మరింత లాభదాయకం..

#3. సురక్షితమైన లావాదేవీ & వెసులుబాటు

కేవలం QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీరు మీ సమాచారాన్ని బయటకు పోకుండా కాపాడగలుగుతున్నారు. UPI QR కోడ్‌ను కస్టమర్లు తమకు నచ్చిన UPI యాప్ సహాయంతో ఉపయోగించడానికి వీలు ఉంది. కాబట్టి, ATMల నుండి డబ్బు తీయడం లేదా ఇతర పరికరాల సహాయం తీసుకొని కార్డు వాడడం అవసరం లేకపోవడంతో మధ్యలో ఎటువంటి మాంద్యమాలకు అవకాశం లేదు. కాబట్టి మరింత సురక్షితం..

చివరి మాట

భారతదేశంలో ప్రజలకు ఆర్థికపరమైన విషయాలపై ఇంకా అవగాహన అంతంత మాత్రమే. కాబట్టి జనాభాలో ఉన్న నిష్పత్తిని దేశ ప్రయోజనానికి ఉపయోగించుకోవాలి. ప్రజలకు UPI పై అవగాహన వచ్చేలా చేయవలసిన బాధ్యత వారిపై ఉంది. ప్రత్యేకముగా ఫైనాన్సియల్ సెక్టార్‌లో భారతదేశం ఎన్నో కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో నింపబడుతుంది. ఒకవైపు ప్రభుత్వం ప్రజలను డిజిటల్ లావాదేవీలపై ప్రోత్సహస్తున్నా, టెక్నాలజీ మాత్రమే ఆ ప్రోత్సాహానికి నిజమైన బలాన్ని అందించగలదు. ఈ విధమైన పరివర్తన కారణంగాడిజిటల్ పేమెంట్స్ చిరు, మధ్య స్థాయి వ్యాపారాలకు చేస్తున్న మేలు చాలా ప్రాముఖ్యమైనది. మనకు ఉన్న ఒకే ఒక్క పెద్ద సవాలు ప్రజలందరూ ఈ విధానాలను అవలంభించేలా చేయడమే., అప్పుడే వ్యాపారాలన్నీ వీటి వల్ల వచ్చే అంతులేనన్ని లాభాలను పొందగలవు.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.