written by Khatabook | June 24, 2021

శాలరీ క్యాలిక్యులేటర్ 2020-21 - టేక్ హోమ్ శాలరీని లెక్కించడం ఎలా?

×

Table of Content


ఎప్పుడైనా మీ శాలరీని క్యాలిక్యులేట్ చేయాలని ట్రై చేసారా? సాధారణంగా కంపెనీలు చూపించే విధానంలో, హౌస్ రెంట్ అలోవేన్స్, లీవ్స్ ట్రావెల్ అలోవేన్స్, స్పెషల్ అలోవేన్స్, బోనస్, పిఎఫ్ లాంటి కోతలన్నిటిని తీస్తే, చేతికి వచ్చే జీతం టోటల్ మొత్తం కంటే తక్కువే ఉంటుంది. కానీ ఈ లెక్కలు వాళ్ళు ఎలా వేస్తారు? అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

శాలరీ క్యాలిక్యులేటర్

శాలరీ క్యాలిక్యులేటర్ అనేది పేరులో ఉన్నట్టే, జీతం క్యాలిక్యులేట్ చేసే ఒక టూల్. ఇందులో ఒక ఫార్ములా ఉంటుంది. దాని సహాయంతో మీరు కంపెనీకి పడే కాస్ట్, అంటే CTC ఇంకా బోనస్ లాంటి వాటిని సెట్ చేయడం కుదురుతుంది. ఇది పిఎఫ్ కి ఎంత కట్ చేయాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంత పోతుంది, అలాగే చివరికి చేతికి ఎంత వస్తుందనే అన్నిటిని లెక్కించి పెడుతుంది. 

చేతికి వచ్చే ఇన్-హ్యాండ్ శాలరీని లెక్కించడానికి, ముందుగా కంపెనీ ఎంత ఇవ్వాలని అనుకుంటుందో ఆ మొత్తం, అలాగే బోనస్ ఏమైనా ఉంటే ఆ మొత్తాన్ని కలిపి ఎంటర్ చేయాలి. 

క్రింద ఉన్న టేబుల్ మీకు అది అర్ధం కావడంలో సహాయపడుతుంది. 
 

కంపెనీకి అయ్యే ఖర్చు

5,00,000

(-)బోనస్

30,000

గ్రాస్ శాలరీ

4,70,000

(-)ప్రొఫెషనల్ ట్యాక్స్

2,400

(-)EPF యజమాని వాటా

21,600

(-)EPF ఉద్యోగి వాటా

21,600

మొతం కోతలు

45,600

చేతికి అందే శాలరీ

4,24,400

  • ఉదాహరణకి, CTC, అంటే కంపెనీ భరించే కాస్ట్ రూ. 5 లక్షలు అనుకోండి, అలాగే, ప్రతీ ఏడాది ఉద్యోగి 30,000 బోనస్ గా పొందుతారు అనుకోండి, అప్పుడు స్థూల జీతం, అంటే కట్టింగ్స్ కాకుండా ఉండే గ్రాస్ శాలరీ 5,00,000-30,000 = 4,70,000 రూపాయలు అన్నమాట. మీ CTC నుండి బోనస్ అమౌంట్ ని తీసేస్తారని గుర్తుంచుకోండి. కాబట్టి ఏడాదికి మీ చేతికి వచ్చేది 5 లక్షలు అయినా, పేపర్‌లో మాత్రమే 4,70,000 నెల జీతాలకు అని ఉంటుంది. 
  • గ్రాస్ శాలరీ = రూ. 5,00,000 - రూ. 30,000 = రూ. 4,70,000
  • ఆపై, మీకు రూ. 2400 ప్రతీ ఏడాది ప్రొఫెషనల్ ట్యాక్స్ పడుతుంది. దీనిని నెలకు రూ. 200 చొప్పున కట్ చేస్తారు. 
  • దాని పైన, ఇప్పుడు ఉద్యోగి, అలాగే యజమాని ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్ కి సహకరించవలసి ఉంటుంది, ఆ ఖర్చును కూడా మీ రూ. 4,70,000 నుండే తీస్తారు. 
  • కాబట్టి, ప్రతీ ఏడాది మీ తరపున రూ. 21,600 మరియు మీ యజమాని తరపున రూ. 21,600 ఈపిఎఫ్ కి వెళ్తుంది. 
  • మొత్తం కోతలు = 21,600+21,600+2400 = రూ. 45,600
  • కాబట్టి మీ చేతికి వచ్చే జీతం మీ గ్రాస్ శాలరీ - రూ. 45,600 అంటే 5,00,000 - 45,600 = 4,24,400
  • ఇలా ఈ టేక్ హోమ్ జీతాన్ని లెక్కించాలి.

క్యాలిక్యులేటర్‌ని ఎలా వాడాలి?

  • ముందు ఏడాదికి కంపెనీ భరించే ఖర్చు ఎంతో ఎంటర్ చేయాలి
  • ఆపై CTC కాకుండ ఇచ్చే బోనస్ మొత్తాన్ని ఎంటర్ చేయండి
  • అప్పుడు శాలరీ క్యాలిక్యులేటర్ టోటల్ గ్రాస్ చెల్లింపు మరియు పెర్ఫార్మన్స్ బోనస్ ఎంతో చూపిస్తుంది. 
  • అంతే కాకుండా, అది మీ ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంప్లొయెర్ ప్రోవిడెంట్ ఫండ్, ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్, ఇన్సూరెన్సు, అలాగే టేక్ హోమ్ శాలరీ ఎంతో కూడా చూపిస్తుంది.

బేసిక్, గ్రాస్, నెట్ శాలరీ మరియు CTCకి మధ్య ఉన్న తేడా ఏమిటి?

టేక్ హోమ్ శాలరీ కాలిక్యులేటర్ గురించి మరియు అది పనిచేసే విధానం గురించి తెలుసుకోవడానికి బేసిక్ శాలరీ, గ్రాస్ శాలరీ, అలాగే బేసిక్ శాలరీ మరియు గ్రాస్ శాలరీ మధ్య వ్యత్యాసాలు, కంపెనీకి ఖర్చు, నెట్ శాలరీ గురించి తెలుసుకుందాం.

  • బేసిక్ శాలరీ అనేది ఉద్యోగులకు వారు చేసే పనికి చెల్లించే మొత్తం. ఓవర్ టైమ్, అలవెన్సులు, బోనస్, ఇంక్రిమెంట్ లు యాడ్ చేయకుండా ఉండే నెలవారీ జీతం కలిపితే వచ్చేది. కంపెనీ ఖర్చు యొక్క ఇతర విషయాల లాగ కాకుండా బేసిక్ శాలరీ ఒకేవిధంగా ఉంటుంది. బేసిక్ శాలరీ మొత్తం ఇన్ హ్యాండ్ శాలరీలో భాగం అవుతుంది.
  • గ్రాస్ శాలరీ విషయానికి వస్తే, ఒక ఉద్యోగి ఒక సంవత్సరంలో కంపెనీలో పనిచేసి సంపాదించిన మొత్తం. ఆదాయపు పన్ను, ప్రొఫెషనల్ ఫండ్, మెడికల్ ఇన్స్యూరెన్స్ మొదలైన ఎలాంటి మినహాయింపులను చేర్చని మొత్తం ఇది. దీనిలో బోనస్ లు, హాలిడే పే, ఓవర్ టైమ్ పే ఉంటాయి. 
  • ఇప్పుడు కంపెనీ (సిటిసి)కి అయ్యే ఖర్చు, ఒక ఉద్యోగి యొక్క సేవలను నియమించడానికి మరియు నిలుపుకోవడానికి కంపెనీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఖర్చు చేసే మొత్తం. మరో విధంగా చెప్పాలంటే, కంపెనీకి అయ్యే ఖర్చు. ఉద్యోగికి అందించబడ్డ మొత్తం వేతన ప్యాకేజీ. ఒక సంవత్సరం కాలంలో యజమాని ఉద్యోగిపై ఖర్చు చేసే మొత్తం ఖర్చును ఇది సూచిస్తుంది.

సిటిసి యొక్క అనేక కాంపోనెంట్‌లు దిగువ పేర్కొన్న విధంగా ఉంటాయి.

ప్రత్యక్ష ప్రయోజనాలు  

బేసిక్ జీతం

ప్రత్యక్ష ప్రయోజనాలు  

కన్వేయన్స్ అలోవేన్స్

ప్రత్యక్ష ప్రయోజనాలు  

డియర్నెస్ అలోవేన్స్

ప్రత్యక్ష ప్రయోజనాలు  

ఇంటి అద్దె అలోవేన్స్

ప్రత్యక్ష ప్రయోజనాలు  

మెడికల్ అలోవేన్స్

ప్రత్యక్ష ప్రయోజనాలు  

ప్రయాణ ఖర్చు అలోవేన్స్

ప్రత్యక్ష ప్రయోజనాలు  

వాహన అలోవేన్స్

ప్రత్యక్ష ప్రయోజనాలు  

మొబైల్ ఫోన్ అలోవేన్స్

ప్రత్యక్ష ప్రయోజనాలు  

బోనస్

ప్రత్యక్ష ప్రయోజనాలు  

ప్రత్యేక అలోవేన్స్

పరోక్ష ప్రయోజనాలు  

ఫుడ్ కూపన్లు

పరోక్ష ప్రయోజనాలు  

కంపెనీ అందించే ఇల్లు

పరోక్ష ప్రయోజనాలు  

వడ్డీ లేని రుణాలు

పరోక్ష ప్రయోజనాలు  

ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్

పరోక్ష ప్రయోజనాలు  

కంపెనీ చెల్లించే లైఫ్ ఇన్సూరెన్స్

పొదుపు కాంట్రిబ్యూషన్

రిటైర్మెంట్ ఫండ్

పొదుపు కాంట్రిబ్యూషన్

ఎంప్లొయెర్ ప్రోవిడెంట్ ఫండ్

  • ఇప్పుడు నెట్ శాలరీ గురించి తెలుసుకుందాం. టేక్ హోమ్ శాలరీ గా కూడా పేర్కొనబడే శాలరీ అనేది పన్నులు, ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇతర ఖర్చుల మినహాయింపుల తరువాత ఉద్యోగికి చెల్లించే మొత్తం.
  • నెట్ శాలరీ  = గ్రాస్ శాలరీ - పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - ప్రొఫెషనల్ ట్యాక్స్.
  • నెట్ శాలరీ సాధారణంగా గ్రాస్ శాలరీ కంటే తక్కువగా ఉంటుంది. ఆదాయపు పన్ను 0 గా ఉన్నప్పుడు మరియు ఉద్యోగికి చెల్లించే మొత్తం ప్రభుత్వ పన్ను శ్లాబ్ పరిమితుల కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇది సమానంగా ఉంటుంది.
  • గ్రాస్ శాలరీ మరియు నెట్ శాలరీ మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంటుంది. 
  • ఉద్యోగి యొక్క గ్రాస్ శాలరీలో హెచ్ ఆర్ ఎ, కన్వేయన్స్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ మొదలైన ప్రయోజనాలు ఉంటాయి. నెట్ శాలరీ = గ్రాస్ శాలరీ - ఆదాయపు పన్ను, పెన్షన్, ప్రొఫెషనల్ ట్యాక్స్ మొదలైన అన్ని మినహాయింపులు. నెట్ శాలరీని సాధారణంగా టేక్-హోమ్ శాలరీ అని కూడా అంటారు.

చేతికి అందే జీతం

ఇప్పుడు మన చేతికి అందే జీతం గురించి తెలుసుకుందాం, చేతికి అందే జీతం అంటే మనకు కట్టింగులు పోను ఇంటికి తీసుకెళ్లే జీతం. 

  • ఇన్ హ్యాండ్ శాలరీ నెలవారీ గ్రాస్ శాలరీ - ఆదాయపు పన్ను - ఉద్యోగి పిఎఫ్ - ఏవైనా ఉంటే ఇతర మినహాయింపులకు సమానం. మినహాయింపులు కంపెనీని బట్టి మారుతుంటాయి అలాగే మీపై కంపెనీకి అయ్యే ఖర్చు పై ఆధారపడి ఉంటాయి.
  • ఆదాయపు పన్ను, ప్రావిడెంట్ ఫండ్ మరియు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేవి ఉద్యోగుల జీతాల నుండి కట్ అయ్యే మూడు ముఖ్యమైన కట్టింగులు. 

CTC నుండి చేతికి వచ్చే జీతాన్ని ఎలా లెక్కించాలి?

  1. ఈపిఎఫ్ మరియు గ్రాట్యుటీని CTC నుంచి మినహాయించడం ద్వారా గ్రాస్ శాలరీని లెక్కించండి.
  2. మొత్తం ఆదాయం నుంచి అవసరమైన కోతలను మినహాయించడం ద్వారా పన్ను పరిధిలోకి రాగల ఆదాయాన్ని లెక్కించండి.
  3. పన్ను పరిధిలోకి రాగల ఆదాయంపై సంబంధిత శ్లాబ్ రేటును బట్టి ఆదాయపు పన్ను ఎంత పడుతుందో లెక్కించండి
  4. ఆపై చేతికి వచ్చే సాలారిని తెలుసుకోగలుగుతారు. 

ఈ విధంగా మనం మన చేతికి వచ్చే ఇన్-హ్యాండ్ సాలారిని తెలుసుకోగలుగుతాము. 

టేక్ హోమ్ శాలరీ కాలిక్యులేటర్ యొక్క ఉపయోగాలు:

  • శాలరీ కాలిక్యులేటర్ ఉద్యోగి తన జీతం ఎలా విభించబడిందని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే జీతం గురించి ఏదైనా సందేహం ఉన్నట్లయితే మానవ వనరుల విభాగం నుండి ఏదైనా సహాయం కూడా తీసుకోవచ్చు.
  • ఇది కంపెనీలో తన స్థానం గురించి ఉద్యోగికి చెబుతుంది. ఉద్యోగి ఇతరులతో పోల్చితే ఒకవేళ తక్కువ వేతనం పొందుతున్నాడా లేదా అని తెలుసుకోవడంలో కూడా ఇది సహాయపడుతుంది.
  • శాలరీ కాలిక్యులేటర్ మానవ వనరుల శాఖలో ఉన్న వారి పనిని సులభం చేయడానికి ఒక సాధనంగా పనిచేస్తుంది. జీతాన్ని లెక్కించడానికి మరియు మేనేజ్మెంట్ అలాగే సిబ్బందికి చెల్లించే జీతాన్ని లెక్కించడానికి దీనిని ఉపయోగించవచ్చు. తద్వారా, ఎక్కడెక్కడ కాస్త ఖర్చును తగ్గించాలో తెలుస్తుంది.
  • ఇది మానవ వనరుల విభాగంపై పని ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.

మరింత తెలుసుకోవడానికి మరియు శాలరీ కాలిక్యులేటర్ ఉపయోగించడానికి, Khatabook సందర్శించండి! మీ కస్టమ్ ప్రొఫైల్ ని తయారుచేసి, కొనసాగించండి. Khatabookతో మీ వ్యాపారానికి తగిన సరైన నిర్ణయాలు తీసుకోండి. 

ఈ బ్లాగును కూడా చదవండి: డబ్బు యొక్క సమయం విలువ అంటే ఏమిటీ? వివరణ, ఉదాహరణలతో!

తరచుగా అడిగే ప్రశ్నలు

శాలరీ క్యాలిక్యులేటర్ సహాయంతో నెలవారీ చేతికి అందివచ్చే జీతాన్ని ఎలా లెక్కించాలి?

ఆదాయ పన్ను, ఎంప్లాయ్ ప్రోఫిడెంట్ ఫండ్, ప్రొఫెషనల్ ట్యాక్స్ ని గ్రాస్ శాలరీ నుండి తియ్యాలి. 

CTC మరియు టేక్ హోమ్ జీతం మధ్య ఉన్న తేడా ఏమిటి?

CTC అంటే కంపెనీకి మొత్తం మీద అయ్యే ఖర్చు, కానీ టేక్ హోమ్ శాలరీ అంటే, ఉద్యోగి చేతికి ప్రతీ నెలా అందే జీతం. 

శాలరీ క్యాలిక్యులేటర్ సహాయంతో ఒక ఉద్యోగి గ్రాస్ శాలరీని ఎలా నిర్ణయిస్తాం?

CTCలో నుండి ఉదోగికి ఒకవేళ పెర్ఫార్మన్స్ బోనస్ ఏమైనా ఉంటే, దానిని తియ్యడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. 

శాలరీ క్యాలిక్యులేటర్ వాడడం సులభమేనా?

అది వాడడం చాలా సులభం. ఇంటి నుండే మీ చేతికి ఎంత వస్తుందని సులభంగా తెలుసుకోవచ్చు. 

CTCలో ప్రోవిడెంట్ ఫండ్ కూడా కలిసే ఉంటుందా?

ఒక ఉద్యోగికి అందే అన్ని రకాల భత్యాలు అందులో ఇమిడి ఉంటాయి, కాబట్టి ప్రోవిడెంట్ ఫండ్ కూడా అందులో భాగమే. 

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.