written by | June 25, 2021

మీ సొంత జిమ్‌ని తెరవడం ఎలా?

×

Table of Content


ఫిట్నెస్ పరిశ్రమ అందులో నిలబడగల వారికి అద్భుతమైన, లాభసాధకమైన వ్యాపారం. జిమ్‌లకి దేశంలో మంచి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. ఇంట్లో వ్యాయామం చేయడం సాధ్యమే అయినప్పటికీ, జిమ్‌లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. జిమ్‌లు చాలా మందికి వ్యాయామం చేయడానికి అవసరమైన స్థలాన్ని అలాగే చాలా ఖరీదైన పరికరాలను అందించగలవు. అలాగే జనానికి తమకు నచ్చిన వ్యాయమ విధానాలను కూడా అందించగలవు. అన్నింటికంటే, జిమ్‌లు రోజంతా ఒకేచోట కూర్చుని ఒత్తిడిలో పనిచేసే వ్యక్తులకు, రిలాక్స్ అవ్వడానికి, ఆరోగ్యంగా ఉండడానికి అద్భుతమైన సాధనాలు. 

ఫిట్‌నెస్ పరిశ్రమ 2022 నాటికి మొత్తం $32 బిలియన్ల వృద్ధిని చూస్తుందని నిపుణులు భావిస్తున్నారు, జిమ్‌లు మరియు స్లిమ్మింగ్ సేవలు మొత్తం $6.6 బిలియన్ల మార్కెట్‌గా అవతరించాయి. కాబట్టి ఒక జిమ్ స్టార్టప్ పెడదామా అని ఆలోచించే వారికి, ఈ బ్లాగ్ మీరు జిమ్ బిజినెస్ ఎలా ప్రారంభించాలి మరియు దీర్ఘకాలంలో లాభదాయకవ్యాపారంగా ఎలా ఎదగాలనే విషయం పై అవసరమైన మొత్తం సమాచారాన్ని మీకు అందిస్తుంది. 

ముందుగా బిజినెస్ మోడల్ ఎంచుకోండి

మీరు ఎంచుకున్న విజినెస్ మోడల్ మీరు ఏర్పాటు చేసిన ప్రాంతంలో మీ జిమ్ ఎంత బాగా నడుస్తుందనే విషయాన్నీ నిర్ణయించగలదు. మీరు ఎలాంటి బిజినెస్ మోడల్‌ని ఫాలో అవ్వాలనే విషయాన్ని క్రింది వాటిని చదివి తెలుసుకోండి: 

  1. మెంబెర్షిప్ మోడల్ 
  • జిమ్‌లు సాధారణంగా ఫాలో అయ్యే బిజినెస్ మోడల్ ఇది. కస్టమర్‌లు నెలవారీ ఫీజు చెల్లిస్తారు, అలాగే యజమానికి రెగ్యులర్ ఆదాయాన్ని ఇస్తుంది. 
  • మంచి డిమాండ్ ఉన్న ప్రాంతంలో మీరు జిమ్‌ని ఏర్పాటు చేస్తే, మీకు ఎక్కువ మంది కస్టమర్‌లు ఉంటారు. ఈ మోడల్ చాలా లాభదాయకంగా ఉంటుంది. 
  • ఒకవేళ మీ నెలవారీ ఖర్చు రూ. 50,000 అయి, నెలవారీ సభ్యత్వ రుసుము రూ. 1000 అయితే, అప్పుడు మీ ఖర్చులను కవర్ చేయడం కొరకు మీకు కనీసం 50 మంది సభ్యులు అవసరం అవుతారు.
  1. వాడకాన్ని బట్టి చెల్లించే మోడల్ 
  • మీరు ఇప్పుడే కొత్తగా జిమ్ స్టార్ట్ చేస్తున్నట్లు అయితే కొత్త కస్టమర్ లను జిమ్‌కు పొందడానికి ఇది మంచి బిజినెస్ మోడల్. 
  • జిమ్‌కు రెగ్యులర్‌గా రాలేని వ్యక్తులకు ఇది గొప్ప ఛాయిస్. జిమ్ చేయడానికి వచ్చే వారు సభ్యత్వానికి బదులు, వచ్చిన ప్రతీ సారి కొంత డబ్బు చెల్లించి వ్యాయామం చేయవచ్చు. ఎలాంటి కమిట్మెంట్ ఉండదు కాబట్టి అస్తమాను రావడానికి వీలు కానప్పుడు ఏం వస్తాంలే అని ఆలోచించే వారిని ఆకర్షించడానికి ఇది మంచి మార్గం. 
  • ఉదాహరణకు, ఒక ప్యాకేజీ కాస్ట్ - 10 సందర్శనలకు రూ.1000 అయితే, వారు 1000 రూపాయలు కట్టి అవసరమైనప్పుడల్లా 10 సార్లు జిమ్ ని సందర్శించవచ్చు. 
  1. డైనమిక్ ప్రైసింగ్ మోడల్
  • బరువు తగ్గడం లేదా బాడీబిల్డింగ్ లేదా ఇతర ఫిట్‌నెస్ సంబంధిత ప్రోగ్రామ్‌ల కొరకు కోచ్‌లతో మీరు జిమ్ లేదా ఫ్రాంచైజీని ప్రారంభించినట్లయితే ఈ మోడల్ పనిచేస్తుంది. 
  • కస్టమర్‌లకు వారి అవసరాలు మరియు గోల్స్ ఆధారంగా విభిన్న ప్యాకేజీలు అందించబడతాయి. మీరు పెద్ద నగరాల్లోని ఉన్నత స్థాయి ప్రాంతాలకు దగ్గరగా మీ జిమ్‌ను తెరిస్తే ఇది మరింత లాభదాయకమైన మోడల్. 
  1. ఇంటిగ్రేటెడ్ మోడల్
  • ఈ మోడల్ మెంబెర్షిప్ అలాగే, పే-యాజ్-యు-గో మోడల్స్ రెండిటిని కలిపి నడిపించడం. జిమ్‌లు మరియు కస్టమర్‌లు ఇద్దరికీ సహాయపడుతుంది. 
  • రెగ్యులర్ సభ్యులు మెంబెర్‌షిప్ మోడల్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు, అయితే మిగతా వారు సందర్శించినప్పుడు మాత్రమే ఫీజు చెల్లించవచ్చు. 
  • మీకు అధిక కస్టమర్ బేస్ మరియు స్థిరమైన ఆదాయం ఉండేలా ఇది చూసుకుంటుంది. 

సరైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి

లొకేషన్ అనేది మీ జిమ్ వ్యాపారాన్ని నడుస్తుందా, లేక మూతపడుతుందా అనే విషయాన్నీ నిర్ణయించగలదు. నివాస ప్రాంతాలు, గేటెడ్ కమ్యూనిటీలు లేదా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లకు దగ్గరగా మీ జిమ్‌ని ఏర్పాటు చేయడం చాలా మంచి ఆలోచన. నివాస ప్రాంతానికి దగ్గరగా స్థలం అందుబాటులో లేనట్లయితే, తక్కువ అద్దెకు లభ్యం అయ్యే తదుపరి ప్రదేశంలో పెద్ద స్థలాన్ని ఎంచుకోండి. 

నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉన్న జిమ్‌లు ఉదయం మరియు సాయంత్రం గంటల్లో రద్దీగా ఉంటాయి. కాబట్టి తక్కువ రద్దీ మరియు మరింత రిలాక్స్డ్ స్థలంలో వ్యాయామం చేయాలనుకొనే వారు మరికాస్త దూరంగా ఉన్న జిమ్‌లకు వెళ్ళడానికి ఇబ్బంది అనుకోరు. 

జిమ్ తెరవడానికి అయ్యే ఖర్చు 

జిమ్ ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు దాని పరిమాణం, సౌకర్యాలు, పరికరాల నాణ్యత మరియు మీరు నియమించబోయే శిక్షకులను బట్టి మారవచ్చు. ఇక్కడ ఆ వివరాలను అందిస్తున్నాం చూడండి:

  • స్థలం మరియు అద్దె: ఎక్కువ మందిని ఆకర్షించడానికి జిమ్‌లు విశాలంగా ఉండాలి. కాబట్టి కనీసం 10,000 చదరపు అడుగుల ప్రాంతం అవసరం అవుతుంది. స్థలాన్ని బట్టి,రూ.30,000 నుంచి రూ.5,00,000 మధ్య అద్దెకు ఖర్చు అవుతుంది. 
  • ఎక్విప్‌మెంట్: మంచి జిమ్‌లు విస్త్రృతశ్రేణి ఎక్విప్‌మెంట్‌ని అందించాల్సి ఉంటుంది, అప్పుడే ఎక్కువ మంది ఒకే సమయంలో వ్యాయామం చేయగలరు. ఒకవేళ మీరు చిన్నగా ప్రారంభిస్తే, ప్రాథమిక పరికరాల ఖర్చులు సుమారు రూ. 5,00,000 వరకు ఉంటుంది, అధునాతన పరికరాలతో గొప్ప జిమ్ ఏర్పాటు చేయడానికి రూ. 50,00,000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.
  • ఇంటీరియర్స్: ఒకవేళ మీరు ఆ ప్రాంతంలోని ఉన్నత స్థాయి ప్రాంతాల నుంచి కస్టమర్ లను ఆకర్షించబోతున్నట్లయితే, అప్పుడు మీ ఇంటీరియర్‌లను క్లాసీగా ఏర్పాటు చేయాలి. ఇంటీరియర్ డిజైనింగ్ ఖర్చులు రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు ఉండవచ్చు.
  • మెయింటెనెన్స్ స్టాఫ్: ఫ్రంట్ డెస్క్ రిసెప్షనిస్ట్ తో సహా మెయింటెనెన్స్ సిబ్బందికి మీరు ఎంతమందిని నియమించుకున్నారో దానిని బట్టి రూ.30,000 నుంచి రూ.60,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
  • జిం ట్రైనర్: అర్హత కలిగిన ట్రైనర్‌లను నియమించడానికి కొంచెం ఖర్చు అవుతుంది. మీరు ఎంతమందిని నియమించుకు౦టారు అనే దాన్ని బట్టి ఖర్చు రూ. 1,00,000 కు పైగా వెళ్ళవచ్చు.

అవసరమైన లైసెన్స్ లు తీసుకోండి

అన్ని వ్యాపారాలు చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా, ప్రభుత్వం ద్వారా సెట్ చేయబడిన నిబంధనలను ఫాలో అవ్వాలి. మీరు వీటిపై దృష్టి సారించాలో ఇక్కడ ఉంది:

  • జిమ్ రిజిస్ట్రేషన్. ప్రతి వ్యాపారం లాగే, మీ జిమ్‌ని ఏకైక ప్రొప్రైటర్‌గా, పార్టనర్ షిప్ ఫర్మ్ లేదా కంపెనీగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇతర డాక్యుమెంట్‌ల్లో బిల్డింగ్ పర్మిట్‌లు, ప్రాథమిక పెట్టుబడి సంబంధిత అగ్రిమెంట్‌లు, ట్యాక్స్ రిజిస్ట్రేషన్‌లు, ప్రొసీజర్‌లు మొదలైనవి ఉంటాయి.
  • ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్, స్పా, లాకర్ రూమ్‌లు మరియు మరిన్ని జిమ్ సౌకర్యాల కొరకు ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 
  • ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా పరికరాలకు సంబంధించిన డ్యామేజీలు కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి  జిమ్‌ల్‌కి ఇన్సూరెన్సు చేయించడం కూడా చాలా ముఖ్యం. 
  • వ్యాపారం 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ టర్నోవర్‌ను నమోదు చేస్తే జిఎస్టి రిజిస్ట్రేషన్ తప్పనిసరి, కొన్ని రాష్ట్రాల్లో రూ. 10 లక్షలు నమోదు చేసిన చేయాలి.  
  • అన్ని ఫిట్‌నెస్ సంబంధిత వ్యాపారాలకు పోలీస్ డిపార్ట్‌మెంట్ క్లియరెన్స్ కూడా తప్పనిసరి.

ఫిట్నెస్ ట్రైనర్‌లను పనిలో పెట్టుకోండి

మీరు జిమ్ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఫిట్‌నెస్ ట్రైనర్‌లను నియమించుకోవడం ముఖ్యం. ఫిట్‌నెస్ ట్రైనర్‌లు సరైన ట్రైనింగ్ రొటీన్‌లను సభ్యులకు చెప్పి, క్లయింట్‌లకు వ్యక్తిగత సలహాలను అందిస్తారు. వీరి పనితనం జిమ్‌లో ఎక్కువమంది మెంబెర్షిప్ తీసుకోవడంలో సహాయపడుతుంది.

  • వారు వ్యాయామ సెషన్లను నడిపించి, రోజువారీగా వచ్చే సభ్యులకు అవసరమైన వ్యాయామ రొటీన్స్ మరియు యంత్రాలను కేటాయించవచ్చు. ఇది రద్దీ సమయాల్లో సభ్యులకు ఇబ్బంది కలుగకుండా చూస్తుంది. 
  • అనుభవజ్ఞులైన శిక్షకులను నియమించడం సభ్యులకు నాణ్యమైన సర్వీసులను అందించి మౌత్ మార్కెటింగ్‌లో మీకు సహాయపడుతుంది. అలాగే వారికి ఉండే ఎక్స్పీరియన్స్ మీ కొత్త వెంచర్ కోసం ఏర్పాటు చేయడంలో, అలాగే మరింత బెటర్‌గా దానిని నడిపించడంలో చాలా సహాయపడుతుంది. 
  • అయితే, ఫిట్‌నెస్ ట్రైనర్‌లను నియమించుకోవడం చాలా ఖరీదైన పని కాబట్టి, వారి ఎక్స్పీరియన్స్ మరియు ఎంతమందిని నియమించుకోవాలి అనే దానిని బట్టి రూ. 1,00,000 కు పైగా ఖర్చు కావచ్చని గుర్తుంచుకోండి.

ఫిట్‌నెస్ ట్రైనర్‌లను నియమించడానికి ముందు, మీరు చూడగల అన్ని క్రెడెన్షియల్స్ ఇక్కడ ఉన్నాయి:

  • GFFI (గోల్డ్స్ జిమ్ ఫిట్నెస్ ఇన్స్టిట్యూట్) 
  • BFY స్పోర్ట్స్ & ఫిట్నెస్
  • CBT (సర్టిఫైడ్ బాడీబిల్డింగ్ & జిమ్/పర్సనల్ ట్రైనర్) 
  • IAFT (ఇండియన్ అకాడమీ ఆఫ్ ఫిట్నెడ్ ట్రైనింగ్)

ఎక్యిప్మెంట్ మరియు ఇంటీరియర్స్

అన్ని జిమ్‌లకు అధిక నాణ్యత కలిగిన పరికరాలు ఉండడం చాలా ముఖ్యం. మీ జిమ్ సెటప్‌లో ఈ ప్రాథమిక పరికరాల ఉండాలి:

  • ట్రైనింగ్ బెంచీలు: ఇవి వివిధ రకాల ట్రైనింగ్ ఎక్సర్‌సైజులకు ఉపయోగించే ప్రాథమిక పరికరాలు. వెయిట్ ట్రైనింగ్ కొరకు ఉపయోగించబడతాయి కనుక మీకు ఇవి ఎక్కువ సంఖ్యలో అవసరం అవుతాయి. బెంచీలు అధిక నాణ్యత మరియు సర్దుబాటు చేయడానికి సులభంగా ఉండాలి.
  • ఫ్రీ వెయిట్స్: ఫ్రీ వెయిట్స్ అంటే డంబెల్ సెట్‌లు, బార్‌బెల్ సెట్‌లు, కెటిల్‌బెల్ సెట్‌లు, వెయిట్ ప్లేట్‌లు మరియు వెయిట్ రెసిస్టన్స్ ట్రయినింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలు. జిమ్‌లో ఇవి ఎక్కువగా ఉపయోగించే పరికరాలు కనుక, జిమ్ పూర్తి సామర్థ్యంలో ఉన్నప్పటికీ, ఎవరికీ వీటి కొరత లేకుండా ఉండడానికి వీటిని ఎక్కువ సంఖ్యలో కొనడం ముఖ్యం.
  • ఫుల్ అప్ ఫ్రేమ్‌లు మరియు బార్‌లు: వీటిని బాడీవెయిట్ వ్యాయామాల కొరకు వాడతారు. వీటికి మౌంటింగ్ కొరకు వాల్ లేదా సీలింగ్ సపోర్ట్ అవసరం అవుతుంది. బార్‌బెల్స్‌ని ఉంచడానికి స్క్వాటింగ్ ర్యాక్‌లు కూడా కావాలి.
  • కార్డియో ఎక్విప్‌మెంట్: ట్రెడ్ మిల్‌లు, స్టేషనరీ సైకిళ్లు మరియు పంచింగ్ బ్యాగులు కార్డియో పరికరాలు, ఇవి అన్ని జిమ్ ల్లో అవసరం అవుతాయి. పెద్ద జిమ్‌లో ఇది అందరికి అందుబాటులో ఉండడానికి 5 - 15 వరకు ఎక్విప్మెంట్స్ వరకు ఉండాలి. సీలింగ్ సపోర్ట్ కావాలి కాబట్టి పంచింగ్ బ్యాగులు తక్కువగా ఉన్నా, లేకపోయినా కూడా పర్లేదు. 
  • యాక్ససరీలు: రెసిస్టెన్స్ బ్యాండ్‌లు, ఫిట్‌నెస్ బాల్స్, రోయింగ్ మెషిన్‌లు, ఎబిఎస్ వీల్స్, మ్యాట్‌లు, బ్యాటిల్ రోప్‌లు మొదలైనవి జిమ్‌లలో వివిధమైన వ్యాయామాలు చేయడానికి సహాయపడతాయి.
  • ఇంటీరియర్స్: ప్రకాశవంతమైన లైట్లు, మంచి పెయింటింగ్ మరియు చుట్టూ మోటివేషనల్ పోస్టర్లతో ఇంటీరియర్‌ని బాగా తయారు చేయాలి. పరికరాలు దొర్లే అవకాశం ఉంటుంది కాబట్టి హాళ్లలో అద్దాలకు రక్షణ బంపర్లు ఉండాలి.

మెంబెర్ ఇన్సెటివ్ 

జిమ్ సభ్యులను ఎక్కువ కాలం ఉంచడానికి మంచి జిమ్ ప్యాకేజీలు ఉంటే మాత్రం సరిపోవు. మీరు ఫ్యాట్ లాస్ కార్యక్రమాలు, ఫిజియోథెరపీ, జుంబా, ఏరోబిక్స్ లేదా సభ్యులకు మరింత కొత్తదనాన్ని ఇచ్చే ప్రత్యేక శిక్షణ కార్యకలాపాలను కూడా అందించడం ఎంతైనా మంచిది. 

మీ జిమ్‌కి మార్కెటింగ్ చేయడం ఎలా?

మీ జిమ్‌కు మార్కెటింగ్ చేయడం మీదనే జిమ్ తెరిచిన ప్రారంభంలో ఎంత బాగానడుస్తుంది, అలాగే భవిష్యత్తులో ఎదుగుదల ఎలా ఉంటుందనేది ఆధారపడి ఉంటుంది. మీరు ఈ క్రింది మార్గాల్లో మీ జిమ్‌కి మార్కెటింగ్ చేయవచ్చు:

  • వెబ్‌సైట్ లేదా యాప్ ఏర్పాటు చేసి పాపులర్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాలపై ప్రచారం చేయడం ద్వారా మీ ఆన్ లైన్ గుర్తింపును సృష్టించడం ప్రారంభించండి.
  • మీ వెబ్‌సైట్‌లో మీ ఫెసిలిటీ మరియు ఆఫర్‌ల గురించి మొత్తం సమాచారం ఉండాలి. బ్లాగులు వ్రాయండి మరియు ఎస్.ఇ.ఓ కోసం కంటెంట్ పుష్కలంగా జనరేట్ చేయండి (సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్). ఎక్కువ మంది వినియోగదారులు తమకు అవసరమైనవాటిని కనుగొనడానికి గూగుల్‌ను ఉపయోగిస్తారు కాబట్టి, బలమైన ఎస్ఇఒ స్ట్రాటజీ ఉండటం చాలా మేలు చేస్తుంది. 
  • ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా ఫాలోవర్స్‌తో ఎంగేజ్ కావడం మీ వ్యాపారాన్ని త్వరగా డెవలప్ చేయడానికి మీరు చేయగల ఒక మంచి పని. మీ ఫెసిలిటీ మరియు జిమ్ చేసే వ్యక్తుల ఫోటోలను పోస్ట్ చేయండి. అప్పుడే మీ జిమ్‌లో ఏమి జరుగుతుందో ప్రజలు చూడగలరు.  

జిమ్ ఫ్రాంచైజ్ 

మీకు ఒకవేళ ఎక్కువ అనుభవం లేకుండానే జిమ్ బిజినెస్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, అప్పుడు ఏదైనా ఒక మంచి ఫ్రాంచైజీని ఎంచుకోవడం మంచి ఐడియా. మన దేశంలో జిమ్ ఫ్రాంచైజీ ఖర్చు కాస్త ఎక్కువే అయినప్పటికీ, మొదటి నుండి ప్రతీ దానిని ఏర్పరచుకోవాల్సిన తలనొప్పి ఉండదు. జిమ్ ఫ్రాంచైజీని ఎంచుకోవడం ద్వారా మీరు ఈ పరిశ్రమ గురించి చాలా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఆ పరిజ్ఞానంతో, మీరు మీ స్వంత జిమ్ ప్రారంభించవచ్చు అలాగే తర్వాత ఎదురయ్యే సమస్యలను పరిష్కరించవచ్చు.

జిమ్ మ్యానేజ్మెంట్ సాఫ్ట్‌వేర్

మీ జిమ్ వ్యాపారం వందలాది మంది సభ్యులతో పెద్దదిగా ఉండాలని యోచిస్తే, అప్పుడు మీకు ఖచ్చితంగా జిమ్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ అవసరం అవుతుంది. సాఫ్ట్‌వేర్ మీ జిమ్‌లో సభ్యులు, వారి దినచర్యలు, పురోగతి, ప్రత్యేక అవసరాలు, ఫీడ్‌బ్యాక్ మరియు వారి ప్రోగ్రస్‌ని ట్రాక్ చేయగలదు. ఈ సమాచారం మొత్తం కూడా మీకు ముఖ్యమైన వ్యాపార సంబంధిత మెట్రిక్స్ తెలుసుకోవడంలో సహాయపడుతుంది. మీరు చిన్నగా ప్రారంభిస్తుంటే, వెంటనే సాఫ్ట్‌వేర్ కొనాల్సిన పని లేదు, ఎందుకంటే ఇవి కాస్త ఖరీదైనవి. కాబట్టి మీ వ్యాపారం పెరగడం ప్రారంభించినప్పుడు ఉపయోగించవచ్చు.

ముగింపు

మంచి జిమ్ వ్యాపారం అనేది అది ఏర్పాటు చేయబడిన ప్రాంతం, దాని ఎక్విప్‌మెంట్, ఇంటీరియర్‌లు, స్పేస్ మరియు ట్రైనర్‌లపై పెట్టె ప్రారంభ పెట్టుబడి పై అలాగే మీ బిజినెస్ ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పరిశ్రమలో అనుభవం ఉన్నవారికి లేదా ఫ్రాంచైజీని ఎంచుకోవడానికి ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి వ్యాపారం. మీరు తర్వాత ఏ స్టెప్ వేయాలనే దానికి ఈ సమాచారం సరిపోతుంది. 

దీనిని కూడా చదవండి: చాలా తక్కువ ఖర్చుతో కిరాణా షాప్ తెరవడానికి సూచనలు

తరచుగా అడిగే ప్రశ్నలు

జిమ్ తెరవడం లాభసాటి విషయమేనా?

మీ జిమ్ ఎక్కడ ఉంది, అలాగే మీరు ఎలాంటి సర్వీసులను అందజేస్తున్నారనే విషయం మీదే మీ లాభాలు ఆధారపడి ఉంటాయి. రఫ్‌గా వేసే అంచనా ప్రకారం, మీరు రూ. 50 లక్షలు పెడితే, ఒక ఏడాదికి అన్ని ఖర్చులు పోను, కనీసం రూ. 15 లక్షలు మిగులుతాయి. 

జిమ్ తెరవడం ఇప్పుడు మంచి ఐడియానేనా?

అది మీరు పెట్టె పెట్టుబడి, మీ మార్కెటింగ్, జిమ్‌ని తెరిచిన స్థలం అలాగే మీ అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. ఎలాంటి అనుభవం లేకుండా తెరిస్తే లాభసాటి వ్యాపారం అవుతుందని చెప్పలేం. కానీ మీ బిజినెస్ మోడల్, మరియు ప్లానింగ్ ప్రకారం అన్ని సక్రమంగా ఉంటే కచ్చితంగా లాభం పొందవచ్చు. 

జిమ్ తెరవడానికి ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది?

మంచి ఏరియా అయి, కస్టమర్లు బాగా వస్తారనే చోట జిమ్ తెరవాలంటే మీరు రూ. 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. బడ్జెట్ తక్కువై, చిన్నగా ప్రారంభించాలి అనుకుంటే, రూ. 10 లక్షలు కనీసం పెట్టుబడి ఉండాలి. 

జిమ్ ట్రైనర్‌కి ఎంత జీతం ఇవ్వాలి?

కొత్తగా ట్రైనర్ అయిన వ్యక్తికీ కనీసం రూ. 15,000 నుండి రూ. 20,000 వరకు ఇవ్వాలి. మంచి అనుభవం ఉన్నవారికి రూ. 40,000 నుండి రూ. లక్ష వరకు జీతాలు ఇవ్వాలి. స్పెషల్ సర్టిఫికెట్ ఉన్న ట్రైనర్‌లకు అయితే రూ. 60,000 నుండి స్టార్టింగ్ జీతం ఉంటుంది. 

జిమ్ ఓనర్లు ఎదుర్కొనే కొన్ని సమస్యలు ఏమిటి?

ప్రారంభంలో ఉండే పెద్ద సమస్య, జిమ్‌ని జనాలను ఎలా ఆకర్షించాలనేదే. ఆపై, స్టాఫ్ మ్యానేజ్మెంట్, ఇంకా ఇతర ఫైనాన్స్ సమస్యలు అన్ని వ్యాపారాలలాగే ఉంటాయి. 

సాధారణంగా జిమ్‌లకు కనీసం ఎంతమంది సభ్యులు ఉంటారు?

ఫ్రాంచైజ్ ఉండే జిమ్‌లకైతే కనీసం 1000 మంది వరకు కస్టమర్లు ఉంటారు, అలాగే చిన్న వాటిని కనీసం 200 మంది ఉంటారు.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.