written by khatabook | September 26, 2020

డబ్బు యొక్క సమయం విలువ అంటే ఏమిటీ? వివరణ, ఉదాహరణలతో!

సమయం చాలా విలువైనది, ఇది జగమెరిగిన సత్యం. ప్రతి వ్యాపారం లాభాల బాట పట్టాలనే చూస్తుంది కాబట్టి ఇప్పుడున్న కొద్ది మొత్తం సొమ్ము రేపటి ఎక్కువ మొత్తం కంటే చాలా ముఖ్యం. దీనివల్ల సమయం డబ్బు విలువని నిర్దారిస్తుంది అని మనం తెలుసుకోగలం.

డబ్బు యొక్క సమయం విలువ ఏమిటి?- మీకోసం ఒక ఉదాహరణ!

ఉదాహారణకి, రెండేళ్ల క్రితం మీరు గ్రాముకి 60 రూపాయల చొప్పున ఒక కిలో వెండి కొన్నారు. ఇప్పుడు అదే వెండి గ్రాముకి 40 రూపాయలు అయ్యింది. అంటే, మీరు కొన్నప్పటికంటే ఇప్పుడు వెండి విలువ తగ్గింది. కొన్నిసార్లు అది పెరగొచ్చు కూడా. కానీ వ్యాపారం విషయానికొస్తే, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఆలోచించడం కంటే ప్రస్తుత మార్కెట్ విలువనే దృష్టిలో పెట్టుకోవడం మంచిది.

అందువలన, డబ్బు సమయం విలువను చూడాలి, అంటే ఏ వ్యక్తి దగ్గరైనా ప్రస్తుతం ఉన్న డబ్బు విలువ. ప్రస్తుతం ఉన్న డబ్బుతోనే వ్యాపారం వృద్ధి చేసుకోవడానికి పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, ముడిసరుకు కొనడం వంటివి చేయవచ్చు. భవిష్యత్తులో రాబోయే డబ్బు ఇప్పుడున్న మన అవసరాలు తీర్చలేదు కాబట్టి ఇప్పుడు, భవిష్యత్తులో వచ్చే ఆదాయానికి ఎటువంటి విలువ లేదు.

డబ్బు - సమయం విలువని ఆర్ధిక నిపుణులు టివీఎం అని అంటారు. దానినే ప్రెసెంట్ డిస్కౌంటెడ్ వేల్యూ, లేదా ప్రస్తుత రాయితీ విలువ అని కూడా అంటారు.

టీవీఎం యొక్క 3 ప్రమాణాలు

 1. ద్రవ్యోల్బణం – ధరలు పెరగడం వలన వస్తువులు విలువ పెరుగుతుంది, డబ్బు విలువ తగ్గుతుంది. ధరలు పెరిగే కొద్ది ఆ డబ్బుతో కొనగలిగే వస్తువుల మొత్తం తగ్గుతుంది, పోనుపోను మరిక తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
 2. అవకాశ వ్యయం – ఒకచోట పెట్టుబడి పెట్టిన లాభం పొందుకున్న తర్వాత, అంతే డబ్బును, దాని లాభాన్ని పొందడానికి పట్టిన సమయాన్ని మరొక చోటే అంతే పెట్టుబడి పెడితే వచ్చే లాభాన్ని పోల్చి, తద్వారా ఎదురయ్యే నష్టాన్ని లెక్కిస్తారు.
 3. రిస్క్– ఇది పెట్టుబడి పెట్టె ప్రతి పెట్టుబడిదారుడు తీసుకోవాల్సిన రిస్క్ కి సంబందించినది.

డబ్బు-సమయం యొక్క ప్రాముఖ్యత

ఆర్ధిక నిర్వహణ కోణం నుంచి సమయానుకూలమైన డబ్బు విలువ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకోండి .

 1. మన చేతిలో ఇప్పుడున్న అంటే ప్రస్తుతమున్న డబ్బు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి సాయపడుతుంది. పెద్దవాళ్ళు అంటారు కదా “దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో” అని, అలాగే అవసరం, అవకాశం ఉన్నప్పుడే చేతిలో డబ్బు ఉండాలి.
 2. డబ్బు యొక్క సమయ విలువ వ్యాపార రుణాన్ని అంచనా వేయడంలో మీకు సహాయపడుతుంది.
 3. భవిష్యత్తు అనిశ్చితిని బట్టి ఆర్ధిక నిర్వహణాలలో డబ్బు యొక్క సమయం విలువ వ్యాపారాల్లో లాభాన్ని పొందుకోడానికి, అలాగే ఆర్థిక విషయాలను సవ్యంగా నిర్వహించడంలో ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

డబ్బు యొక్క సమయం విలువ ఫార్ములా:

టీవీఎం యొక్క ప్రాధమిక సూత్రం -

భవిష్యత్ విలువ (FV) = ప్రస్తుత విలువ (PV) + T

FV = PV (1 + (I/N)) NT

 • ఎన్ - ఒక ఏడాదిలో ఉండే కాంపౌండింగ్ పిరియడ్ల సంఖ్య
 • టి - సంవత్సరాల సంఖ్య
 • ఐ - వృద్ధి రేటు
 1. PV – చేతిలో ప్రస్తుతం ఉన్న డబ్బు
 2. FV – భవిష్యత్తులో వచ్చే విలువ, అది వ్యాపారంలో లాభం వల్ల కావచ్చు, పెట్టుబడులు తిరిగి రావడం వలన అవ్వచ్చు, రావాల్సిన డబ్బు వెనక్కి రావడం వలనైనా కావచ్చు.
 3. N – మీరు ఎన్నాళ్ళు పెట్టుబడి పెట్టారు లేదా మీరు మీ డబ్బు వెనక్కి పొందడానికి పట్టే సమయం మొదలైనవి.
 4. I – జీవితకాలపు పెట్టుబడి వలన అయిన వృద్ధిరేటు.

డబ్బు యొక్క సమయం విలువలో ఉండే కాన్సెప్ట్‌లు

డబ్బు యొక్క సమయం విలువలో రెండు కాన్సెప్టులు క్రింద వివరించబడ్డాయి:

#1. ఒకసారి చేసే చెల్లింపుకు ఉండే డబ్బు యొక్క సమయం విలువ

మీరు 10% వడ్డీ వేసిచ్చే ఒక బ్యాంకులో 10000 రూపాయలు పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాల వరకు అది క్రమంగా వృద్ధి చెందుతూ ఉంటుంది.

ఇక్కడ, ఐదేళ్ల తర్వాత మీ చేతికి ఎంత డబ్బు అందుతుంది అనేదిమీరు చాలా సులువుగా, సింపుల్ ఇంటరెస్ట్ ఫార్ములా PNR/100 వాడి లెక్కకడతారు. ఏడాదికి ఎంత వడ్డీ వస్తుందో లెక్కేసి, దానిని మీరు మీ డబ్బుతో కూడి, క్రమక్రమంగా మీ క్యూములేటివ్ ఇంటరెస్ట్ ఎంత అనే లెక్కకేసుకుంటారు.

అలా చేయడం వలన ఐదేళ్లు అయ్యేసరికి మీకు 14641రూపాయలు అందుతాయి.

ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే,10000 ఎక్కువా? 14641ఎక్కువా ? దానికి సమాధానం ధరల పెరుగుదల, వడ్డీశాతం, దానికి అనుసంధానమై ఉన్న రిస్క్‌ల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ధరలు పెరిగితే, అది నష్టంగానే ఎంచాలి. కాబట్టి ఐదేళ్ల తర్వాత 14641 వస్తుందనే నమ్మకం లేదు, మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి ఇప్పుడున్న ఈ 10000 రూపాయలను వ్యాపారంలో పెట్టడమే తెలివైన నిర్ణయం.

#2.రెట్టింపు వ్యవధి - డబ్బు యొక్క సమయం విలువ

గడిచే సమయంతో పాటు ఈ డబ్బు యొక్క విలువ రెండింతలు ఎప్పుడు అవుతుందని తెలుసుకోవడానికి ఇంకొక ఉదాహరణని చూద్దాము. ఇది రూల్ అఫ్ 72 సహాయంతో అవుతుంది. ముందు చెప్పినట్లుగా 10000 రూపాయలు 8% వడ్డీతో 5 ఏళ్ళ పాటు ఉంచారు. అలా ఆ డబ్బుని 9 ఏళ్ళ పాటు ఉంచితే ఆ డబ్బు రెండింతలు అవుతుంది.

డబ్బు యొక్క సమయం విలువ ఉదాహరణ

 • డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ (DDM)

మీ కంపెనీనైనా దాని నగదు ప్రవాహానికి, అంటే క్యాష్ ఫ్లోకు ఉండే భవిష్యత్తు అంచనా విలువను సహాయంతో, నికర ప్రస్తుత విలువ లెక్కించబడుతుంది. ఈ విధంగా, కంపెనీ స్టాక్ ధర ప్రస్తుత మార్కెట్ రేటు ఆధారంగా లెక్కించబడుతుంది. అందువల్ల పొందిన DDM విలువ ప్రస్తుత వాణిజ్య విలువ కంటే ఎక్కువగా ఉంటే, కంపెనీ స్టాక్స్ తక్కువగా అంచనా వేయబడతాయి. అందువల్ల డబ్బుకు ప్రస్తుత విలువ ముఖ్యం. "

 • లోన్ EMI క్యాలిక్యులేటర్

డబ్బుకు సమయంతో ముడిపడి ఉండే విలువకు ఇది మరొక మంచి ఉదాహరణ. ఇక్కడ, ఎవరైనా సరే ఒక నిర్ణిత వడ్డీ రేటుకు ఋణం తీసుకుంటారు. అది ఫిక్స్డ్ అయినా కావొచ్చు, లేదా ఫ్లోటింగ్ రేటు అయినా కావచ్చ. కానీ రుణం కోసం తమ వ్యాపారం చెల్లించే వడ్డీతో సంబంధం లేకుండా, పొందిన ప్రస్తుత మొత్తం వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది.

గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు

   • ఇది వ్యాపారాలు ఆ సమయానికి అందుబాటులో ఉన్న డబ్బు లేదా సొమ్ముని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలి అనే సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని చెప్పబడింది. భవిష్యత్తులో ఇప్పుడున్న దానికంటే ఎక్కువ రావచ్చు కానీ ఇపుడున్న డబ్బే కదా వ్యాపారానికి అవసరమయ్యేది.
   • ఈ డబ్బుకి కచ్చితంగా కాంపౌండ్ ఇంటెరెస్ట్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి సంవత్సరాల తరువాత కంటే ఇప్పుడే ఆ డబ్బుకి విలువ ఎక్కువ.
   • టీవీఎం సూత్రం ప్రస్తుత పేమెంట్, భవిష్యత్ విలువ, టైం మరియు వడ్డీ %ని పరిశీలనలోకి తీసుకుంటుంది.
   • అలాగే డబ్బు సమయం విలువను నిర్ణయించడంలో ఆ డబ్బు మొత్తం రొటేట్ అవ్వడానికి ఒక్కొక్క టైం స్లాట్‌కి పట్టె కాంపౌండింగ్ పీరియడ్లు చాలా కీలకం.

Related Posts

None

డబ్బు యొక్క సమయం విలువ అంటే ఏమిటీ? వివరణ, ఉదాహరణలతో!

1 min read