written by Khatabook | August 10, 2021

మన దేశంలో ఉన్న వివిధ రకాల GST - SST, CGST, IGST మధ్య తేడా ఏంటి?

×

Table of Content


భారతదేశంలో సేవా పన్ను, వ్యాట్ మరియు ఎక్సైజ్ సుంకం వంటి అనేక ఇతర పన్నుల స్థానాన్ని GST భర్తీ చేసింది. GST చట్టం 29 మార్చి 2017 న ఆమోదించబడింది. ఇది భారత ప్రభుత్వం చేత ఆమోదించబడిన నూటా ఒకటవ రాజ్యాంగ సవరణగా 2017 జూలై 1 నుండి అమలు చేయబడింది. GST అనేది భారతదేశమంతటా ఒకేవిధంగా అమలుచేయబడే ప్రత్యేకమైన పన్ను చట్టం. CGST, SGST, UTGST మరియు IGST లాంటి వివిధ రకాల జీఎస్టీలు మొత్తం దేశానికి ఒకే విధంగా అమలవుతాయి. సరఫరా చేయబడిన వస్తువు లేదా సేవTheల విలువను బట్టి GST  మారుతూ ఉంటుంది.

ప్రధానమైన పన్ను స్లాబ్‌లు 0%, 5%, 12%, 18 % మరియు 28%గా ఉన్నాయి. చవకైన లేదా అత్యవసర వస్తువులు, సేవలు వంటివి 0% కేటగిరీ కిందకు వస్తాయి. ఖరీదైనవి మరియు విలాసవంతమైనవి మాత్రం  28% కేటగిరీ కిందకు వస్తాయి.

భారతదేశంలో GST పన్నుల రకాలు?

భారతదేశంలో CGST, SGST, UTGST మరియు IGST  వంటి GST రకాలు అందుబాటులో ఉన్నాయి, ఇవి నిర్దిష్ట పన్ను రేట్లను కలిగి ఉంటాయి. అయితే, ఈ పన్ను రేట్లు భారత ప్రభుత్వం ద్వారా నిర్ణయించబడతాయి ఇంకా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వర్తింపబడతాయి.

ఈ GST ఎన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది? 

ఇక్కడ GST అనేది మూడు రకాలుగా ఉంటుంది:

  • CGST ( వస్తువులు మరియు సేవలపై కేంద్రం విధించే పన్ను)
  • SGST (వస్తువులు మరియు సేవలపై రాష్ట్రం విధించే పన్ను
  • UTGST ( వస్తువులు మరియు సేవలపై కేంద్ర పాలిత ప్రాంతాలలో విధించే పన్ను)
  • IGST (ఇంటిగ్రేటెడ్ వస్తువులు మరియు సేవలపై పన్ను)

SGST అంటే ఏంటి?

వస్తువులు మరియు సేవలపై రాష్ట్రం విధించే పన్ను అనేది  GST రకాలలో ఒక రకం, ఇది ఒక్కో రాష్ట్రానికి నిర్ధిష్టంగా ఉంటుంది. ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం తన రాష్ట్రంలోని వస్తువులు ఇంకా ఇతర సేవలపై పన్నులు వేస్తుంది (రాష్ట్రీయ, ఉదాహరణకు మైసూర్), మరియు సేకరించిన ఈ ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకైక లబ్ధిదారుగా ఉంటుంది.

  • SGST అనేది లాటరీ పన్ను, లగ్జరీ పన్ను, VAT, కొనుగోలు పన్ను మరియు అమ్మకాల పన్ను వంటి వివిధ రాష్ట్ర స్థాయి పన్నులకు ఒక ప్రత్యామ్నాయం వంటిది.
  • ఒకవేళ, వస్తువుల లావాదేవీలు  అంతరాష్ట్రంగా ఉంటే గనక (రాష్ట్రం వెలుపల), అప్పుడు SGST మరియు CGST రెండూ వర్తిస్తాయి. కానీ, వస్తువులు మరియు సేవలకు సంబంధించి రాష్ట్రంలో మాత్రమే లావాదేవీలు జరిగినట్లయితే, SGST మాత్రమే విధించబడుతుంది.
  • రెండు రకాల GST లు విధించబడినట్లయితే, GST రేటు రెండు రకాల GST లకు సమానంగా విభజించబడుతుంది. ఉదాహరణకు, వ్యాపారులు తమ రాష్ట్రంలో తమ వస్తువులను విక్రయించినప్పుడు, వారు తప్పనిసరిగా SGST మరియు CGST లను చెల్లించాలి. SGST నుండి వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతుంది మరియు CGST నుండి ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంది.
  • వివిధ వస్తువులు మరియు సేవల యొక్క SGST ఎంత ఉండాలనేది ఎప్పటికప్పుడు ప్రచురించబడే ప్రభుత్వ నోటిఫికేషన్‌పై ఆధారపడుతుంది.

SGST రేట్లు

వస్తువులు

SGST

టీ, ఉప్పు, మసాలా దినుసులు, చక్కెర మొదలైన కిరాణా సామాగ్రి.

2.5%

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ఎలక్ట్రానిక్ వస్తువులు

6%

క్యాపిటల్ గూడ్స్, మరుగుదొడ్లు మొదలైనవి

9%

ప్రీమియం లగ్జరీ వస్తువులు

14%

CGST అంటే ఏంటి?

వస్తువులు మరియు సేవలపై కేంద్రం విధించే పన్ను  వస్తువులు మరియు సేవల యొక్క అంతర్ రాష్ట్ర (రాష్ట్రంలో) సరఫరాకు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పన్నును విధిస్తుంది. CGST చట్టం ఈ రకమైన GST ని నియంత్రిస్తుంది. ఇక్కడ, CGST నుండి వచ్చే ఆదాయం SGST తో పాటు సేకరించబడుతుంది మరియు ఈ ఆదాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల  మధ్య విభజించబడుతుంది.

ఉదాహరణకు, ఒక వ్యాపారి రాష్ట్రంలో లావాదేవీలు జరిపినప్పుడు, వస్తువులపై SGST మరియు CGST తో కలిపి పన్ను విధించబడుతుంది. GST రేటు SGST మరియు CGST ల మధ్య సమానంగా విభజించబడుతుంది, CGST కింద సేకరించిన ఈ ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది.

CGST రేట్లు

వస్తువులు

CGST

టీ, ఉప్పు, మసాలా దినుసులు, చక్కెర మొదలైన కిరాణా సామాగ్రి.

2.5%

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ఎలక్ట్రానిక్ వస్తువులు

6%

క్యాపిటల్ గూడ్స్, మరుగుదొడ్లు మొదలైనవి

9%

ప్రీమియం లగ్జరీ వస్తువులు

14%

IGST అంటే ఏంటి?

ఇంటిగ్రేటెడ్ వస్తువులు మరియు సేవల పన్ను అనేది ఒక రకమైన GST, దీని ప్రకారం వస్తువులు మరియు సేవల అంతర్రాష్ట్ర సరఫరాపై పన్ను వేయబడుతుంది. ఈ GST రకం దిగుమతి మరియు ఎగుమతి చేయబడిన వస్తువులు మరియు సేవలపై కూడా విధించబడుతుంది. IGST చట్టం దానిని నియంత్రిస్తూ ఉంటుంది మరియు IGST సేకరణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది.

సేకరించబడిన IGST సమానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగాలుగా విభజించబడుతుంది. ఏ రాష్ట్రంలో అయితే వస్తువులు మరియు సేవలు వినియోగించబడ్డాయో ఆ రాష్ట్రానికి IGST యొక్క రాష్ట్ర ప్రభుత్వ భాగం అందించబడుతుంది, మిగిలిన IGST కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది.

ఉదాహరణకు, ఒక వ్యాపారి ఏవైనా రెండు రాష్ట్రాల మధ్య సరఫరా జరిపిన సందర్భంలో పన్ను రకం IGST విధించబడుతుంది.

IGST రేట్లు

వస్తువులు

IGST

టీ, ఉప్పు, మసాలా దినుసులు, చక్కెర మొదలైన కిరాణా సామాగ్రి.


 

5%

ప్రాసెస్ చేసిన ఆహారాలు

ఎలక్ట్రానిక్ వస్తువులు


 

12%

క్యాపిటల్ గూడ్స్, మరుగుదొడ్లు మొదలైనవి

18%

ప్రీమియం లగ్జరీ వస్తువులు


 

28% 

UGST అంటే ఏంటి? 

వస్తువులు మరియు సేవలపై కేంద్ర పాలిత ప్రాంతాలలో విధించే పన్ను అనేది మరొక GST రకం. ఇది SGST మాదిరిగానే ఉంటుంది కానీ కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది.

UGST పాండిచ్చేరి మరియు ఢిల్లీతో పాటు దాద్రా, నగర్ హవేలి, చండీగఢ్, అండమాన్ మరియు నికోబార్‌లలో వర్తిస్తుంది. ఇక్కడ సేకరించబడిన ఆదాయం కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వానికి చెందుతుంది. SGST కి UGST ప్రత్యామ్నాయం కాబట్టి, దీనితో పాటుగా CGST సేకరించబడితుంది.

GST ఎలా నిర్ణయించబడుతుంది?

  • వస్తువులు మరియు సేవల అమ్మకందారు మరియు కొనుగోలుదారు ఉండే స్థానాన్ని బట్టి GST నిర్ణయించబడుతుంది.
  • వస్తువులు మరియు సేవలు రాష్ట్రం లోపల సరఫరా జరిగితే CGST మరియు SGST వర్తిస్తాయి. దీనికి విరుద్ధంగా  IGST అంతరాష్ట్ర (రాష్ట్రం వెలుపల) సరఫరాకు వర్తిస్తుంది.
  • అందువలన, IGST రేటు CGST మరియు SGST రేట్ల మొత్తంగా ఉంటుంది.

GST యొక్క లక్ష్యాలు

GST కి గల ప్రధాన లక్ష్యాలు ఇవి

  • ఇతర పన్నుల తొలగింపు- GST చట్టం అనేది అన్ని ఇతర పరోక్ష పన్నుల రీప్లేస్ మెంట్ కు దారితీసింది. అన్ని ప్రధాన పన్నులు GST లో కలపబడ్డాయి.
  • అనుకూలత  పెరుగుదల - MSME లేదా చిన్న తరహా వ్యాపారాలకు పన్ను సమ్మతి సులభతరం అయ్యింది. అదనంగా, ఒకే పన్ను అమలు అనేది ఉండటం వల్ల రిటర్న్ దాఖలు ప్రక్రియ సులభతరం అవుతుంది.
  • పారదర్శకత పెరుగుదల - GST వల్ల అవినీతి తగ్గుముఖం పట్టి పారదర్శకత పెరగడం జరుగుతుంది. ఉదాహరణకు, వ్యాపారాలలో తప్పుడు ఇన్‌పుట్ చేస్తూ పన్ను క్రెడిట్ ను పొందే అవకాశాలు తగ్గుతాయి.
  • ధర తగ్గింపు-GST జోడించిన బిల్లు నికర విలువపై ప్రత్యేకంగా పన్నులు విధిస్తుంది, అందువల్ల మునుపటి పన్ను పై పన్ను వేసే విధానాన్ని  తొలగిస్తుంది ఇంకా వస్తువుల ధరను కూడా తగ్గిస్తుంది.
  • దేశ ఆదాయాన్ని పెంచడం-  పన్ను - GDP కి గల నిష్పత్తి గరిష్టంగా ఉంటే అది ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను సూచిస్తుంది మరియు పెరిగిన ప్రభుత్వ ఆదాయాన్ని కూడా సూచిస్తుంది. అదనంగా, విస్తృత మైన పన్ను బేస్ మరియు పన్నుకు గల కాంప్లియన్స్, GST కార్యకలాపాల నుండి ప్రభుత్వ ఆదాయం పెరిగేందుకు సహాయపడుతుంది. 
  • అధిక సామర్థ్యం మరియు ఉత్పాదకత - భారతదేశంలో GST ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ కోసం లాజిస్టికల్ పరిమితులను మరియు అధిక సమయం తీసుకునే ఫైలింగ్ ప్రక్రియను తొలగించాలని భావిస్తోంది. ఇంకా, ప్రవేశ పన్నును తొలగించడం ద్వారా, వ్యాపారాల ఉత్పాదకత స్థాయిలు పెరుగుతాయని అంచనా వేస్తోంది.

GST అసలు ఎందుకు అవసరం?

  • భారతదేశంలో అతి పెద్ద మరియు అత్యంత ముఖ్యమైన పన్ను సంస్కరణ GST. GST లో వివిధ పరోక్ష పన్నులను చేర్చడం వలన తయారీ మరియు ఉత్పత్తి వ్యయాలు తగ్గుముఖం పట్టి దేశ ఆర్థిక వృద్ధికి సహాయపడతుంది.
  • VAT రేట్లు మరియు నిబంధనలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. అలాగే, పెట్టుబడిదారులను ప్రలోభపెట్టడానికి రాష్ట్రాలు తరచూ ఈ రేట్లను తగ్గించాలని కోరుతున్నట్లు గమనించబడింది. దీని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది.

మరోవైపు GST, అన్ని రాష్ట్రాలలో ప్రామాణిక పన్ను నిబంధనలను అమలు చేస్తుంది, విస్తృత శ్రేణి వ్యాపారాలను కవర్ చేస్తుంది. ముందుగా నిర్ణయించిన మరియు ముందుగా ఆమోదించిన ఫార్ములా ప్రకారం, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వసూలు కాబడిన పన్నులు సమంగా పంపిణీ చేయబడతాయి. ఇంతే కాకుండా, ఇక్కడ మళ్లీ అదనంగా రాష్ట్ర పన్ను విధించబడదు కాబట్టి, దేశవ్యాప్తంగా సేవలు మరియు వస్తువులను ఒకే రకంగా విక్రయించడం చాలా సులభం.

దీనిని కూడా చదవండి - మీరు ఒక సర్టిఫైడ్ GST ప్రాక్టీషనర్ ఎలా అవ్వగలరు?

GST యొక్క లక్షణాలు

  • GST కింద నమోదైన ప్రతి వ్యాపారం వస్తువులు మరియు సేవల పన్నుల గుర్తింపు సంఖ్య (GSTIN) లేదా GST చట్టం కింద GST నంబర్‌ను పొందుతుంది. GST బకాయిలు మరియు లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఈ GSTIN GST అధికారులకు సహాయపడుతుంది.
  • GST కింద ముందుగా నమోదు చేయకుండా ఏ వ్యాపారం లేదా సంస్థ పనిచేయదు. అసంపూర్ణమైన GST రిటర్న్స్ సమర్పణలు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ తిరస్కరణతో పాటు జరిమానాలు విధించడానికి దారితీస్తుంది.
  • GSTIN తప్పనిసరిగా చట్టబద్ధతకు గుర్తు. ఖాతాదారులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, పబ్లిక్ టెండర్లు, ఆర్థిక సంస్థలు, కార్పొరేట్‌లు మరియు ఇతరాల కోసం మీ బ్రాండ్ గుర్తింపుకు ఇది దోహదం చేస్తుంది.
  • GST అనేది కంపోజిషన్ స్కీమ్ అని పిలువబడే సరళీకృత నమోదు పథకాన్ని అందిస్తుంది. ఇది వ్యక్తిగత వ్యాపారాల కోసం సరళమైన మరియు సూటిగా ఉండే పథకం. ఇది సమయం వృధా జరిగే GST అవసరాలను తొలగిస్తుంది మరియు ముందుగా నిర్ణయించిన టర్నోవర్ రేటుతో GST ని చెల్లిస్తుంది.
  • భారతదేశంలో జీఎస్టీ వల్ల వ్యయాల పెరుగుదల, ప్రత్యేకించి వ్యాపారాల నిర్వహణ వ్యయాలను పెంచే సాఫ్ట్‌వేర్ వంటి కొన్ని ప్రతికూలతలు ఏర్పడ్డాయి. అందువల్ల, ఇది వ్యాపార పనితీరులో సంక్లిష్టతను పెంచింది.

ముగింపు

వస్తువులు మరియు సేవల పన్ను (GST) రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు విధించిన సుమారు 17 పరోక్ష పన్నులను భర్తీ చేసింది. ప్రతీ రాష్ట్రం యొక్క వివిధ పన్ను నిబంధనల కారణంగా, పన్ను వ్యవస్థలో ఏకరూపత ఉండేది కాదు. ఫలితంగా, అంతర్గత వాణిజ్యం మరియు కామర్స్ ప్రమాదంలో ఉండేవి మరియు పన్ను ఎగవేత ఆందోళన కలిగించేవి. ఇప్పుడు జీఎస్టీ అమలు వల్ల ఈ ఇబ్బందులన్నీ పరిష్కారమయ్యాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు

భారతదేశంలో ఎన్ని రకాల GST లు ఉన్నాయి?

భారతదేశంలో GST మూడు క్యాటగిరీలుగా వర్గీకరించబడింది. అవి CGST ( వస్తువులు మరియు సేవలపై కేంద్రం విధించే పన్ను), SGST (వస్తువులు మరియు సేవలపై రాష్ట్రం విధించే పన్ను/UTGST ( వస్తువులు మరియు సేవలపై కేంద్ర పాలిత ప్రాంతాలలో విధించే పన్ను) మరియుIGST (ఇంటిగ్రేటెడ్ వస్తువులు మరియు సేవలపై పన్ను).

భారతదేశంలో అన్ని రకాల GST లు వర్తిస్తాయా!

అవును, భారతదేశంలో అన్ని రకాల GST లు వర్తిస్తాయి.

GST నుండి మినహాయించబడిన వస్తువులు ఏవైనా ఉన్నాయా?

అవును, పెట్రోలియం, సహజ వాయువు మరియు హై-స్పీడ్ డీజిల్ వంటి కొన్ని వస్తువులు మరియు సేవలు GST పరిధిలోకి రావు.

GST ఫైలింగ్ తప్పనిసరా?

అవును, అన్ని వ్యాపారాలు GST రిటర్న్‌లను దాఖలు చేయాలి. ఇచ్చిన వ్యవధిలో లావాదేవీలు తక్కువ జరిగినా లేదా ఉనికిలో లేనప్పటికీ, మీరు తప్పనిసరిగా రిటర్న్‌లను దాఖలు చేయాలి. లేకపోతే, ఇది తర్వాతి రాబడులతో సమస్యలను కలిగించవచ్చు, ఫలితంగా జరిమానాలు పడే అవకాశం ఉంది.

CGST, SGST, IGST మరియు UGST అంటే పూర్తి పేరు ఏంటి?

CGST అనగా వస్తువులు మరియు సేవలపై కేంద్రం విధించే పన్ను,  SGST అనగా వస్తువులు మరియు సేవలపై రాష్ట్రం విధించే పన్ను, IGST  అనగా ఇంటిగ్రేటెడ్ వస్తువులు మరియు సేవలపై పన్ను, UTGST అనగా వస్తువులు మరియు సేవలపై కేంద్ర పాలిత ప్రాంతాలలో విధించే పన్ను.

జీఎస్టీ రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేయాలి?

ఒక GST రిటర్న్ లేదా GSTR అనేది పన్ను చెల్లింపుదారులు గడువు తేదీలోపు దాఖలు చేయవలసిన రికార్డు. ఈ రికార్డు ఆదాయం, కొనుగోళ్లు మరియు ఖర్చుల గురించి సమాచారాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది ఒక వ్యక్తి పై పన్ను భారాన్ని లెక్కించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది.

GST ని ఎలా లెక్కిస్తారు?

భారతదేశంలో జీఎస్టీని ఛార్జ్ ప్రాతిపదికన, ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ వస్తువులు మరియు సేవలపై చెల్లించాల్సిన GST మొత్తంగా నిర్ణయించబడుతుంది. ఈ మొత్తం ప్రతి నెలా విడివిడిగా నిర్ణయించబడుతుంది. మరియు ప్రతి నెలా మీ GST రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా ఆ పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.