written by Khatabook | August 9, 2021

సెక్షన్ 87 ఎ ప్రకారం ఆదాయపు పన్ను తగ్గింపు - మీ ఆర్థిక సంవత్సరం 2020-21, అస్సేస్మెంట్ సంవత్సరం 2021-22లో రిబేట్ పొందండి

×

Table of Content


మీ ఐటీ రిటర్న్స్ ను ఫైల్ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన ఇటీ నిబంధన సెక్షన్ 87 ఏ గురించి తెలుసుకోవాలి. ఇది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు పన్ను పరిధిలోకి వచ్చే అవకాశాన్ని తగ్గించడం లేదా వారు కట్టాల్సిన సొమ్ము (పన్ను)ను తగ్గించడంలో సహాయపడుతుంది. FYలో మొత్తం ఆదాయం రూ .5,00,000 కంటే తక్కువగా ఉన్నప్పుడు సెక్షన్ 87 ఎ క్రింద మీరు ఈ పన్ను తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. ఈ తగ్గింపును క్లెయిమ్ చేసిన తర్వాత మీపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత దాదాపు శూన్యంగా ఉంటుంది.

సెక్షన్ 87 ఎ ప్రకారం మినహాయింపు/ తగ్గింపు అంటే ఏమిటి?

సెక్షన్ 87 ఎ ప్రకారం గల ఆదాయపు పన్ను నిబంధన, పన్ను చెల్లింపుదారులకు వారి ఆదాయపు పన్నును తగ్గించడానికి సహాయపడుతుంది. మీ వార్షిక ఆదాయం రూ .5,00,000 మించకపోతే మీరు సెక్షన్ 87 ఎ కింద రిబేటు( తగ్గింపు/ మినహాయింపు) పొందవచ్చు. ఈ రిబేటును క్లెయిమ్ చేసిన కారణంగా, మీకు ఆదాయపు పన్ను చెల్లించే భారం పడదు.

నవీకరించబడిన కేంద్ర బడ్జెట్ 2019

పన్ను చెల్లింపుదారులకు ఈ క్రింది ప్రయోజనాలను అందించేందుకు 2019 బడ్జెట్ లో  కొన్ని ప్రకటనలు ప్రవేశపెట్టబడ్డాయి.

  • పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 5,00,000 రూపాయల ఉన్న అందరు పన్ను చెల్లింపుదారులు / వ్యక్తులు కూడా ఆదాయపు పన్ను సెక్షన్ 87 ఎ కింద పూర్తిగా పన్ను మినహాయింపులకు అర్హులు.
  • జీతం తీసుకునే ఉద్యోగులకు స్టాండర్డ్ తగ్గింపు పరిమితి రూ .40,000 నుండి రూ .50 వేల వరకు పెరిగింది.
  • సెక్షన్ 54 కింద క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు యొక్క ప్రయోజనాలు ఒక వ్యక్తి తన జీవితకాలంలో కొనుగోలు చేసిన 2 ఇళ్ల వరకు వర్తిస్తాయి.
  • పోస్టాఫీసులో చేసిన పొదుపులు మరియు బ్యాంక్ డిపాజిట్ల ద్వారా సంపాదించిన వడ్డీపై టిడిఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) పరిమితులు రూ.10,000 నుండి రూ .40,000 కు పెంచబడ్డాయి. 

పన్ను రిబేట్(తగ్గింపు/మినహాయింపు) u / s 87A ను క్లెయిమ్ చేసే విధానం

పొరపాట్లు చేయకుండా ITR దాఖలు చేయడానికి మరియు తగ్గింపులను క్లెయిమ్ చేయడానికి, ప్రతీ దశలోనూ ముందే మార్గదర్శకాలను తెలుసుకుని ఉండటం మంచిది. 

87A కింద రిబేటు (తగ్గింపు/మినహాయింపు) కోసం :

  • మొదట, FY లో స్థూలంగా ఉన్న మొత్తం ఆదాయాన్ని తెలుసుకొనడానికి కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.
  • పన్ను ఆదా సాధనాలను ఉపయోగించి మరియు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఖాతాలు వంటి చెల్లుబాటు అయ్యే పన్ను మినహాయింపులను డిడక్ట్ చేయండి.
  • అన్ని తగ్గింపులు చేసిన తర్వాత నికర FY ఆదాయానికి రండి
  • మీ స్థూల ఆదాయం, నికర ఆదాయం మరియు తగ్గింపులను చూపిస్తూ మీ ITR ని ఫైల్ చేయండి.
  • మీ ఆదాయం రూ .5,00,000 కన్నా తక్కువ ఉంటే సెక్షన్ 87 ఎ కింద పన్ను రాయితీ పొందండి.
  • 2020-21 87A ప్రకారం AY కోసం రిబేటు  (తగ్గింపు/మినహాయింపు) కింద అనుమతించబడిన గరిష్ట పరిమితి రూ .12,500.

60 ఏళ్ల కంటే వయసు తక్కువగా గల ఒక వ్యక్తికి  2020-21 AY లేదా 2019-20 FY  ప్రకారం రిబేటు లెక్కింపు ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ ద్వారా నేర్చుకుందాం.

వివరాలు (FY 2019-20)

ఆదాయం

మొత్తం స్థూల ఆదాయం

6,25,000

లెస్: సెక్షన్ 80 సి కింద మినహాయింపు *

1,50,000

మొత్తం ఆదాయం

4,75,000

ఆదాయ స్లాబ్ రూ .2.5 మరియు 5 లక్షల మధ్య ఉన్నప్పుడు  వర్తించే ఆదాయ-పన్ను రేటు 5% ప్రకారం కట్టాల్సిన పన్ను రూ. 

11,250

లెస్: రి u / s 87A ప్రకారంగా

రిబేట్ గరిష్టంగా రూ .12, 500 / - వరకు క్లెయిమ్

11,250

చెల్లించాల్సిన పన్ను

Nil

దీనిని కూడా చదవండి: ఆదాయపు పన్ను మినహాయింపుల గురించిన పూర్తి సమాచారం

u/s 87A క్రింద రిబేట్ ను ఎవరు క్లెయిమ్ చేయుకోగలరు? 

ఆరోగ్యం మరియు విద్య సెస్‌ను లెక్కించే ముందే మీరు u / s 87A  ప్రకారం రిబేటు కోసం దరఖాస్తు చేసుకోవాలి.

  • భారతీయ నివాసితులు అయిన వ్యక్తులు రిబేటు U / S 87a కోసం క్లెయిమ్ చేయవచ్చు.
  • సీనియర్ సిటిజన్లు (60 నుండి 80 సంవత్సరాలు) కూడా ఈ రిబేటు U / S 87a ను ఉపయోగించవచ్చు.
  • సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే 80 ఏళ్లు పైబడిన వారు ఈ రిబేటును పొందలేరు.
  • రిబేటు మొత్తం రూ .12,500, ఇది u / s 87A  ప్రకారం పేర్కొన్న పరిమితి లేదా అసలు చెల్లించాల్సిన పన్ను. పై ఉదాహరణలో చూపిన విధంగా మీరు దీన్ని సెస్ లెక్కలకు వర్తింపజేయాలి.

u/s 87A రిబేట్ ను పొందడానికి ఉండవల్సిన అర్హతలు: 

మీరు క్రింద ఇచ్చిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకి  రిబేటు u / s 87A ను పొందవచ్చు:

  • ITR దాఖలు చేసే నివాసిత వ్యక్తి.
  • నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర ఆదాయం రూ .5 లక్షలకు మించకూడదు.

2017-18, 2018-19 FYలు  u/s 87A ITR రిబేటుకు అర్హత కలిగి ఉండాలంటే

  • మీరు భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి అయ్యి ఉండాలి.
  • సెస్ మినహాయింపుకు ముందు మరియు U / C VI-A U / S 80C, 80G, 80D, 80E మొదలైన తగ్గింపుల తరువాత మీ మొత్తం ఆదాయం INR 3.5 లక్షల కన్నా తక్కువ ఉంటే.
  • మొత్తం రిబేటు గరిష్టంగా 2,500 రూపాయలు.

తగ్గింపులు మరియు మినహాయింపుల తరువాత మీరు పన్ను మినహాయింపు u / s 87A ను పన్ను పరిధిలోకి వచ్చే స్థూల ఆదాయానికి వర్తింపజేయాలి. కానీ దీనిని ఆరోగ్య మరియు విద్యా సెస్ లెక్కింపు ముందే చేయాలి.

FY 2019-20 ఆర్థిక సంవత్సరానికి u/s 87a రిబేటు, AY 2020-21 u/s 87a రిబేటుకు సమానమని మరియు సెస్ మాత్రం మారిందని గమనించండి. 2017-18 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన పన్ను కోసం మీరు 3% సెస్ రేటుతో లెక్కించాలి. కాబట్టి రూ .2,500 పై 3% సెస్ రూ .75 కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికి రిబేట్ u/s 87a ప్రకారం 4% సెస్ అంటే రూ. 2500కు  రూ .100 గా ఉంటుంది.

అన్ని FY లకు వర్తించే  రిబేట్ U/S 87A చార్ట్

రేట్లు కొన్నిసార్లు గందరగోళంగా ఉంటాయి. 2013-14 నుండి 2021-22 వరకు గల అన్ని ఆర్థిక సంవత్సరాలకు అందుబాటులో ఉన్న రిబేటు రేట్లను జాబితా చేసి ఉంచిన చార్ట్ ఇక్కడ ఉంది.

ఆర్థిక సంవత్సరం

మొత్తం ఆదాయ పరిమితి రూ.

 

87a రిబేట్ రూ.

2021-22

5 లక్షలు 

12,500

2020-21

5 లక్షలు

12,500

2019-20

5 లక్షలు

12,500

2018-19

3.5 లక్షలు

2,500

2017-18

3.5 లక్షలు

2,500

2016-17

5 లక్షలు

5,000

2015-16

5 లక్షలు

2,000

2014-15

5 లక్షలు

2,000

2013-14

5 లక్షలు

2,000

2021-22 లేదా FY 2020-21 వరకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల రేట్లు

ఆదాయ-పన్ను చట్టాల ప్రకారం, వ్యక్తిగత భారతీయ పన్ను చెల్లింపుదారులను 3 గ్రూపులుగా వర్గీకరించవచ్చు.

  • 60 ఏళ్లలోపు ప్రవాసులు / నివాసితులు.
  • 60-80 సంవత్సరాల మధ్య ఉన్న సీనియర్ సిటిజన్ వ్యక్తులు.
  • 80 ఏళ్లు పైబడిన రెసిడెంట్ సూపర్ సీనియర్ సిటిజన్స్.

పన్ను రేట్లను మరింత అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక  చార్ట్ ఇచ్చారు.

ఆదాయ పరిధి రూ.

పన్ను రూ. ( 60 ఏళ్ళ వరకు)

2.5 లక్షలు

పన్ను లేదు 

2.5 నుండి 5 లక్షలు

2.5 లక్షలను మించితే 5 % పన్ను 

5 నుండి 10 లక్షలు

5 లక్షలను  మించితే మొత్తాలలో 12,500 ప్లస్ 20%అదనం 

20 లక్షల పైన 

10 లక్షలను మించితే మొత్తాలలో 1,12,500 ప్లస్ 

30%అదనం 

 

ఆదాయ పరిధి రూ.

పన్ను రూ. ( 60-80 సంవత్సరాలు)

3 లక్షలు 

టాక్స్ లేదు

3 నుండి 5 లక్షలు

3 లక్షలను మించితే 5 % పన్ను

5-10 లక్షలు

5 లక్షలను  మించితే మొత్తాలలో 10,000 ప్లస్ 20%అదనం 

10 లక్షల పైన

10 లక్షలను  మించితే మొత్తాలలో 1,10,000 ప్లస్ 30%అదనం 

 

 

ఆదాయ పరిధి రూ.

పన్ను రూ. ( 80 ఏళ్ళ వయసు పైన)

5 లక్షలు 

టాక్స్ లేదు

5-10 లక్షలు 

5 లక్షలను మించితే 20% పన్ను 

10 లక్షలు ఆపైన 

10 లక్షలను  మించితే మొత్తాలలో 1,00,000 ప్లస్ 30%అదనం 

గమనిక: లెక్కించే ప్రతీ సర్‌చార్జ్ మరియు ఆదాయపు పన్ను మొత్తంలో మీరు అదనంగా 4% ఆరోగ్య మరియు విద్య సెస్ చెల్లించాలి. వసూలు చేసే సర్‌చార్జ్ ఆదాయ స్లాబ్‌పై ఆధారపడి ఉంటుంది.

ముగింపు

ITR రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు నివాసిత భారతీయ వ్యక్తులు u/s 87Aరిబేటును పొందవచ్చు. ఈ రిబేటు యొక్క ప్రయోజనాన్ని పొందడానికి, మీ ఆదాయం చాప్టర్ VI-A మినహాయింపుల తరువాత 5 లక్షల రూపాయలకు మించి ఉండకూడదు.

తరచుగా అడిగే ప్రశ్నలు

1. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87 ఎ ప్రకారం ఒక NRI రిబేటు క్లెయిమ్ చేసుకోవచ్చా?

లేదు. రిబేట్ కేవలం నివాసిత వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది.

2. 87A ప్రకారం రిబేటు అన్ని భారతీయ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంటుందా?

87a రిబేటు వ్యక్తిగత HUF సభ్యులు / నివాస భారతీయులు / సీనియర్ సిటిజన్లు, వ్యక్తుల AOP / ట్రస్టుల సంఘం మొదలైన వాటికి అందుబాటులో ఉంది. ఇది కంపెనీలు, సంస్థలు, మొత్తం HUF వంటి వాటికి వర్తించదు.

3. AY 2019-20కి నేను ఎప్పుడు రిబేటును క్లెయిమ్ చేసుకోవాలి?

మీరు FY 2020-21 లో AY 2019-20 కోసం ITR ఫైల్ చేసే సమయంలో 

4. మీ TDS ఇప్పటికే మినహాయించబడి ఉంటే మరియు మీరు 87 ఎ రిబేటుకు కూడా అర్హులు అయితే ఏంచేయాలి?

ITR రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు నివాసిత భారతీయ వ్యక్తులు ఈ రిబేటును పొందవచ్చు. FY 2019-20 ఆర్థిక సంవత్సరానికి వర్తించే విధంగా, మీ ఆదాయం చాప్టర్ VI-A తగ్గింపుల తరువాత 5 లక్షల రూ. లకంటే తక్కువగా ఉంటే మరియు మీరు స్వీయ-అంచనా పన్ను చెల్లించినట్లయితే, మీరు 87a రిబేటును పూర్తిగా అంటే 12,500 రూ. ల వరకు క్లెయిమ్ చేయవచ్చు. ఇక్కడ TDS తీసివేయబడింది కాని చాప్టర్ VI-A తగ్గింపుల తర్వాత మీ ఆదాయం రూ .5 లక్షల కన్నా తక్కువ కాబట్టి, మీరు రూ .12,500 వరకు చెల్లించిన TDS మొత్తాలను తిరిగి పొందవచ్చు. 

5. తగ్గింపుల తరువాత కూడా నా పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ .5 లక్షలకు మించి ఉంటే నేను ఇంకా రిబేటు u / s 87A ను క్లెయిమ్ చేయవచ్చా?

లేదు, ముందుగా పేర్కొన్న అన్ని పరిమితుల తగ్గింపుల తరువాత, సెస్ దరఖాస్తుకు ముందు పన్ను పరిధిలోకి వచ్చే నికర ఆదాయం రూ .5 లక్షలు. మినహాయింపులు మరియు తగ్గింపులను చేసికోవడానికి మీరు పైన పేర్కొన్న ఇతర పన్ను ఆదా ఎంపికల కోసం అన్వేషించవచ్చు మరియు తద్వారా 12,500 రూపాయల వరకు రిబేటు u / s 87A పొందటానికి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని 5 లక్షలకు తగ్గించవచ్చు.

6. IT స్లాబ్ లు ప్రతీ సంవత్సరం మారుతూ ఉంటాయా? 

IT స్లాబ్‌లు వార్షిక బడ్జెట్‌లో నిర్దేశించబడ్డాయి కాబట్టి ప్రతీ సంవత్సరం మారవచ్చు.

7. పురుషులు మరియు మహిళలు వేర్వేరు ID స్లాబ్‌లలోకి వస్తారా? 

లేదు, ఆదాయపు పన్ను స్లాబ్‌లు లింగ ఆధారితం కావు కాబట్టి ఆడ, మగ వ్యక్తులందరికీ సమానంగా వర్తిస్తాయి.

8. నా ఆదాయం అసలు పన్ను పరిధిలోకి రావడానికి మినహాయింపు ఉంటే, ITR లో నేను పొందే అన్ని ఆదాయ వనరులనుమరియు వడ్డీలను వెల్లడించాల్సి ఉంటుందా?

అవును, పన్ను చెల్లించాల్సిన బాధ్యతతో సంబంధం లేకుండా ITR ని దాఖలు చేసేటప్పుడు మీరు అన్ని వనరుల నుండి వచ్చే ఆదాయాన్ని, సంపాదించిన వడ్డీని మరియు పన్ను పరిధిలోకి రాకుండా ఉన్న ఆదాయాన్ని కూడా  తెలియజేయాల్సి ఉంటుంది.

9. వ్యవసాయం పై వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలా?

వ్యవసాయంపై వచ్చే ఆదాయాన్ని ఆదాయపు పన్ను నుండి మినహాయించారు. అయినప్పటికీ, పన్ను చెల్లింపుదారుడు సంపాదించిన జీతం, పెన్షన్లు, పొందే అద్దెలు, ఎఫ్డిలపై వచ్చే వడ్డీ వంటి అన్ని ఇతర వనరులపై పన్ను పడుతుంది.

10. పన్ను చెల్లింపుదారులు అందరికీ ITR దాఖలు చేయవలసిన చివరి తేదీ ఒకటిగానే ఉంటుందా?

లేదు, వ్యక్తులు, కంపెనీలు, HUF వంటి మొదలైన వాటి కోసం ITR ఫైలింగ్ ఒకేలా ఉండదు.

11. సెక్షన్ 87 ఎ కింద రిబేటును ఎలా లెక్కించాలి?

  • మొదట, FY లో స్థూలంగా ఉన్న మొత్తం ఆదాయాన్ని తెలుసుకొనడానికి కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి.
  • పన్ను ఆదా సాధనాలను మరియు SCSS ఖాతాలను ఉపయోగించి చెల్లుబాటు అయ్యే పన్ను మినహాయింపులను డిడక్ట్ చేయండి.
  • అన్ని తగ్గింపులు చేసిన తర్వాత నికర FY ఆదాయానికి రండి
  • మీ స్థూల ఆదాయం, నికర ఆదాయం మరియు తగ్గింపులను చూపిస్తూ మీ ITR ని ఫైల్ చేయండి.
  • మీ ఆదాయం రూ .5,00,000 కన్నా తక్కువ ఉంటే సెక్షన్ 87 ఎ కింద పన్ను రాయితీ పొందండి.
  • 2020-21 87A ప్రకారం AY కోసం రిబేటు  (తగ్గింపు/మినహాయింపు) కింద అనుమతించబడిన గరిష్ట పరిమితి రూ .12,500.

12. AY 2020-21 కోసం ఏ రిబేటు u / s 87A వర్తిస్తుంది?

కొత్త మరియు పాత పన్ను నిబంధనల ప్రకారం AY 2020-21 యొక్క రిబేటు మొత్తం మారదు. 5 లక్షల లోపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నప్పుడు లేదా వ్యక్తిగత నివాస పన్ను చెల్లింపుదారుడికి రూ .12,500 లోపు చెల్లించాల్సిన పన్ను ఉన్నప్పుడు మొత్తం రూ .12,500 రిబేటు పొందుతాడు. 

13. AY 2019-20 రిబేటు u / s 87A అంటే ఏమిటి?

AY 2019-20 మధ్యంతర బడ్జెట్ 5 లక్షల లోపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న వ్యక్తులకు సెక్షన్ 87 ఎ కింద పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించింది. అంటే ఉనికిలో ఉన్న రూ .2,500 పరిమితిని రూ .12,500 కు పెంచారు.

14. కొత్త పన్నుల విధానం 87A రిబేటును ఇస్తుందా?

అవును. రిబేటు ప్రయోజనాలు u / s 87A కొత్త మరియు పాత పన్ను నిబంధనల ప్రకారం భారతీయ నివాసితులుగా ఉన్న అన్ని వ్యక్తులు మరియు వయస్సుల వారికి సమానం. 5 లక్షల రూపాయల లోపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్న వ్యక్తుల కోసం 2019-20 మధ్యంతర బడ్జెట్ సెక్షన్ 87 ఎ క్రింద పూర్తి పన్ను తగ్గింపును  అనగా దాదాపు రూ .12,500  u / s 87A వరకు ప్రకటించింది.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.