కిరాణా షాప్ అంటే ఏమిటి?
ఒక కిరాణా షాప్ అంటే మన గృహావసరాలకు వస్తువులను పప్పులు, బియ్యం, రోజువారీ ఆహార దినుసులు, వ్యక్తిగత, ఇంటి శుభ్రత పరమైన ఉత్పత్తులు, అలాగే మరొకొన్ని రకాల రోజువారీ వస్తువులను రిటైల్ ధరలకు విక్రయించే దుకాణం. ఎవరైనా సరే, ఒక రిటైల్ కిరాణా షాపును తెరవాలనుకుంటే, ముందుగా మనకు కావలసినన్ని ఉత్పత్తులు అమ్మకానికి సిద్ధంగా ఉండాలి. వ్యాపారుల పెట్టుబడి సామర్ధ్యాన్ని బట్టి, కిరాణా షాపు యొక్క సైజు, ఆ;అలాగే అందుబాటులో ఉండే ఉత్పత్తులలో కూరగాయలు, గృహోపకరణాలు కూడా అమ్మడం జరుగుతుంది.
ఇండియాలో ఒక కిరాణా షాపు ద్వారా ఆర్జించగల లాభాలు
ఇండియాలో కిరాణా షాపులకు 2% నుండి 20% వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. నడిపించే ప్రదేశాన్ని బట్టి, భారతదేశంలో, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు నడిపించే వారు చాలా లాభాలను పొందగలరు. అందుకే, దేశీయ, అంతర్జాతీయ సంస్థలు, భారతదేశ మార్కెట్ కోసం చాలా ప్రయత్నిస్తున్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటి కావడానికి భారతదేశ ముఖ్య బలం దేశంలో టౌన్లు మరియు సిటీలు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. కాబట్టి, మన దేశంలో,రిటైల్ వ్యవస్థలో ఎదుగుదలకు ఇంకా చాలా అవకాశమే ఉంది. చాలా చిన్న గ్రామాలూ, టౌన్ల నుండి ప్రజలు సిటీలకు వలస పోవడం కారణంగా, ప్రజల కొనుగోలు శక్తి కూడా ధారాళంగా పెరుగుతుంది. కాబట్టి కిరాణా వస్తువుల అమ్మకాలలో లాభాలు కొన్ని రూపాయల నుండి వేళా రూపాయల వరకు ఉంటున్నాయి. అందుకే, దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందడానికి, రిటైల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం చాలా మంచి ఆలోచన.
భారతదేశంలో ఒక కిరాణా షాపు తెరవడానికి ఎంత పెట్టుబడి అవసరం?
ఒక కిరాణా షాపు తెరవడానికి, మనకు రూ. 10 లక్షల నుండి రూ. 2 కోట్ల వరకు ఖర్చు అవ్వవచ్చు. మీరు పెట్టాలనుకునే షాపు సైజు, క్యాపాసిటి, అందించే మూలికా సదుపాయాలు మొదలగు వాటిపై అది ఆధారపడుతుంది. మీరు షాపు కోసం చేసే స్థిర పెట్టుబడులు మరియు ఫ్లోట్ పెట్టుబడులను పరిగణలోకి తీసుకోవాలి. అంటే, షాపులో ఎక్కువ కలం ఉండే వస్తువులు మాత్రమే కాకా, షాపు నుండి త్వరగా బయటకు పోయే స్టాక్ కోసమని పెట్టుబడిని రెడీగా ఉంచుకోవాలి. భారతదేశంలో ఒక కిరాణా షాపు తెరవడానికి క్రింద వివరించిన విధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది:
- స్టోరులో ఉండే అల్మారాలు, ఉపకరణాలు, సామాన్లు, డిస్ప్లే రాక్స్ మొదలైన వస్తువులు.
- కంప్యూటర్, క్యాష్ రిజిస్టర్, సెక్యూరిటీ కెమెరా, అద్దాలు, షాపు ముస్తాబు కోసం పెయింటింగ్ మరియు ఇతర పనులు.
- అమ్మడానికి ఉత్పత్తులు మరియు ఇతర షాపు సామాగ్రి.
- పనివారి జీతాలు
- ట్యాక్స్, ఫీజులు మరియు పర్మిషన్లు, మొదలైనవి
- షాపు మరియు పనివారికి ఇన్సూరెన్సు
- మార్కెటింగ్ మరియు అడ్వేర్టైజింగ్ ఖర్చు
- షాపు రోజూ శుభ్రంగా మెయింటైన్ చేయడానికి, శుభ్రపరచడానికి అవసరమయ్యే ఉత్పత్తులు
- కరెంటు, వాటర్, ఫ్యాన్లు, లైట్లు, ఏసీ మొదలైన వాటి ఖర్చు, మరియు
- రెంటు ఖర్చు
కిరాణా షాపును తెరవడం ఎలా?
ఒక విజయవంతమైన కిరాణా వ్యాపారాన్ని స్థాపించడానికి మీరు మీ వ్యాపార ప్లాన్‌లో క్రింద చూపించబడ్డ అడుగులు వేయవలసి ఉంటుంది:
- మొదటిగా GST రిజిస్ట్రేషన్ - మీ వార్షిక టర్న్‌ఓవర్ గనుక రూ. 20 లక్షలకు తక్కువ ఉంటే, మీరు తప్పకుండ 15 అంకెల GST రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొంది తీరాలి.
- లైసెన్సులు - మీ ఫుడ్ లైసెన్స్, షాప్ లైసెన్స్, ఎస్టాబ్లిషమెంట్ రిజిస్ట్రేషన్ మరియు ఎంటిటీ రిజిస్ట్రేషన్ చేయించి ఉండాలి.ఇది జరిపించడానికి లైసెన్స్ అథారిటీ ఆఫీసుకు వెళ్ళాలి.
- ప్రదేశం - మీ షాపును తెరవడానికి మీరు ఎంచుకుని ప్రదేశం చాలా ముఖ్యం. కాబట్టి వ్యాపారం జరుగుతుందనే చోట షాపు తెరవండి.
- షాపులోని మౌలిక సదుపాయాలకు పెట్టుబడి - ప్రదేశాన్ని ఖాయం చేసుకున్న తర్వాత, షాపును కస్టమర్లకు అందంగా కనిపించడానికి బాగా ముస్తాబు చేయాలి.
- కస్టమర్స్ - మీరు మీ కస్టమర్లపై ఒక చిన్న స్టడీ చేయాలి. అంటే, వారు ఎలాంటి వారు, ఎలాంటి రేట్లు ఉంటే కొంటారు, వారి ఆదాయం ఎంతై ఉంటుంది, లాంటి విషయాలపై కొంత పరిశోధన చేయడం మంచిది.
- మీ ప్రత్యర్థులను అర్ధం చేసుకోవాలి - మీరు మీకు పోటీగా ఉన్న షాపులను చూసి, మీ కస్టమర్లకు ఎలాంటి ఉత్పత్తులు ఏ రేంజ్ లో ఉంటే వారిని అధికమించగలరో తెలుసుకోవాలి.
- విక్రేతలు - మీకు అవసరమైనప్పుడు షాపుకు స్టాక్ తీసుకురాగల కొంత మంది వెండార్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
- ఉత్పత్తుల ధర - మీ షాపులో, సరసమైన ధరలకే అమ్మాలని మీకు కూడా తెలిసే ఉంటుంది, దానిని మేము ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు, కాకపోతే, 25% ననుండి 40% లాభం మీకు మిగిలేలా ప్లాన్ చేసుకోండి. కానీ అన్ని వస్తువుల మీద అదే రేంజ్ మార్జిన్ ఉండాలని ఏం లేదు.
- షాపులో పనివారు - మీ షాపులో పని చేయడానికి మనుషులను పెట్టుకోవాలి, కానీ వారు మీ షాపుకు దగ్గరలో నివసించే వారైతే ఎంతైనా మంచిది.
- ఆన్‌లైన్ అందుబాటు - మీ షాపు నుండి ఆన్‌లైన్ ద్వారా కూడా కొనే సదుపాయం కస్టమర్లకు అందించడం ఎంతైనా మంచిది. ఇది సాధ్యం చేయడానికి మార్కెట్‌లో చాలా అప్లికేషన్లు ఉన్నాయి.
- అడ్వర్టైజింగ్ - మీ షాపు గురించి, షాపులో ఉన్న ఆఫర్స్‌ను వివరిస్తూ పామ్‌ప్లేట్లు, నోటీసులు, పోస్టర్స్ లాంటివి ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న జనానికి తెలిసేలా చేయండి.
- డిజిటల్ శకానికి సిద్ధంగా ఉండండి - షాపుకు వచ్చే వారికి, కొనుగోలు చేసి, బయటకు వెళ్లేంత వరకు మంచి అనుభవం ఎదురవ్వాలి, అంటే, బరువు తూచే సమయంలో ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్లు, అలాగే బిల్ వేయడానికి రెడీగా కంప్యూటర్, పేమెంట్ చేయడానికి క్రెడిట్/డెబిట్ కార్డు, Phone Pe, PayTM, Google Pay లాంటి డిజిటల్ పేమెంట్ విధానాలతో సిద్ధంగా ఉండాలి.
కిరాణా షాపు ఫ్రాంచైస్ తెరవడంతో ఉన్న లాభాలు
ఫ్రాంచైజ్ వ్యాపారంలో చాలా ప్రయోజనాలే ఉన్నాయి, అవేమిటంటే,
- మీరు తీసుకునే బ్రాండ్‌ని బట్టి ఆటోమేటిక్‌గా అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది
- షాపు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ
- త్వరగా, తక్కువ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు
- అదనపు ఖర్చు లేకుండా సపోర్ట్, ట్రైనింగ్ ఇవ్వబడుతుంది
- ఇంతకుముందే విజయవంతమైన బిజినెస్ మోడల్
- అన్నివిధాలా మీకు సహకారం అందించబడుతుంది
- ఫండింగ్ ఆప్షన్లు ఉంటాయి
- ఎక్కువ మోతాదులో కొంటారు కాబట్టి ఉత్పత్తుల రేటు కొంచెం చవకగా ఉంటుంది
- మీ తోటి వారిని కలుసుకునే అవకాశాలు ఎక్కువ కాబట్టి మీ మధ్య ఆరోగ్యకరమైన పోటీకి నెలకొంటుంది
ముగింపు
భారతదేశంలో ఒక కిరాణా షాపు తెరావడమంటే మంచి వ్యాపారం జరింగించే సంభావ్యత మరియు ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్, భారతదేశం ప్రతీ ఏడాది 10% వరకు వృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేకాక, ప్రజల కొనుగోలు శక్తి కూడా గత దశాబ్దంలో చాలా పెరిగింది. కాబట్టి మార్కెట్‌ను అర్ధం చేసుకొని, వ్యాపారంలో లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాత, అడుగుపెట్టాలని చూసే వ్యాపారులకు, పెట్టుబడి దారులకు ఇది మంచి అవకాశం.