మీరు ప్రతీ నెలా జీతం పొందుతున్న వేతన ఉద్యోగా? మీకు EPF ఉందా? అయితే EPFO ఈ-సేవ గురించి మీకు పరిచయం చేసేందుకే ఈ బ్లాగును వ్రాస్తున్నాం. EPFO ఈ-సేవ పోర్టల్ అనేది మీ ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్ వివరాలను మ్యానేజ్ చేసుకొనేందుకు ఉన్న ఒక వెబ్సైట్.
వివరణ
EPF: ఉద్యోగులందరికీ ఉండాల్సిన ఒక రిటైర్మెంట్ బెనిఫిట్ ఇది. ప్రతీ ఉద్యోగి బేసిక్ జీతంలో 12 శాతాన్ని కట్ చేసి ఈ అకౌంట్‌లో వేయడం జరుగుతుంది. 2020-2021 ఏడాదికి గాను, ఇప్పుడు ఆ ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్‌పై 8.5 శాతం వడ్డీని ఇస్తున్నారు.
EPFO: EPFO (ఈపిఎఫ్‌ఓ) అంటే ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని అర్ధం. ఇది 1951లో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది. దీని లక్ష్యం ఉద్యోగులు రిటైర్ అయ్యే సమయానికి, వారికి తగినంత ధన సహకారం ఉండడమే.
ఈ ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్ సంస్థ మూడు సూత్రాల ఆధారంగా కేంద్ర ట్రస్టీల బోర్డు క్రింద నడుస్తుంది. అవేంటో చూద్దాం:
- ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ స్కీమ్
- ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్
- ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ స్కీమ్
కేంద్ర ట్రస్టీల బోర్డుకు సహకారం అందించడానికి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ EPFO సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
EPFO ఈ-సేవా
ఈ-సేవా పోర్టల్
ఎంప్లాయ్ ప్రోవిడెంట్ ఫండ్ అభ్యర్థనలను స్వీకరించడానికి ఏర్పాటు చేయబడింది ఈ-సేవ పోర్టల్. ఈ సైట్ ద్వారా, మీరు EPFO ఆఫీసుకు వెళ్లకుండానే ఆన్లైన్ సర్వీసులను వాడుకోవచ్చు. మీ కట్టింగులకు సంబంధించిన వివరాలు, మరియు ఇతర వివరాలను మీరు ఇందులో చూడవచ్చు.
సంస్థలు రిజిస్టర్ చేసుకోవడానికి ఉన్న లిమిట్
20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ప్రోవిడెంట్ ఫండ్ చట్టం ప్రకారం EPFOలో రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ చేసుకోవడానికి చేయవలసిన పనులు
- ముందుగా యజమాని EPFO ఈ-సేవా పోర్టల్ లో తమ సంస్థను రిజిస్టర్ చేసుకోవాలి.
- ఆపై EPFO ఈ-సేవ పోర్టల్ వెబ్సైటు సృష్టించిన ఒక యూజర్ నేమ్ మరియు పాస్‌వర్డ్‌ని యజమాని రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నంబర్‌కి పంపించి లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఈ తాత్కాలిక యూజర్ నేమ్ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి, శాశ్వత యూజర్ నేమ్ మరియు పాస్‌వర్డ్‌ని సృష్టించుకోవాలి.
- ఆ తర్వాత, అవసరమయ్యే అన్ని వివరాలను నింపి, అందులో అడిగే గుర్తింపు, అడ్రెస్ మరియు ఇతర వివరాల డాక్యూమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- ఆపై డాక్యుమెంట్‌ను సబ్మిట్ చేయడమే. డిపార్ట్‌మెంట్ వారు దరఖాస్తును చెక్ చేసి ప్రాసెస్ చేయడానికి దాదాపుగా ఒక వారం పడుతుంది.
- ఒకసారి మీ అప్లికేషన్ ప్రాసెస్ చేయబడి, అప్రూవ్ అయిన తర్వాత మీరు మీ ట్యాక్స్ రిటర్న్స్‌ని ఫైల్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తో ఉండే లాభాలు
- పేపర్ల మీద మీరు వ్రాయాల్సి పని ఏం ఉండదు. అన్ని డాక్యూమెంట్లను మీరు ఆన్లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు కాబట్టి బోలెడంత సమయం ఆదా అవుతుంది.
- అన్ని పేమెంట్లను మీరు సులభంగా ఆన్‌లైన్ ద్వారానే చేసేయవచ్చు. అలాగే మీ పేమెంట్లకు SMS ద్వారా ధ్రువీకరణ కూడా వస్తుంది.
- మీ సమాచారాన్ని ఆన్‌లైన్ నుండే వెరిఫై చేయవచ్చు.
EPFO ఈ-సేవ సేవల సౌలభ్యం
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, సంస్థలు/యజమానులు వారి ట్యాక్స్ రిటర్న్‌లను ఆన్లైన్ నుండే ఫైల్ చేసుకోవచ్చు.
- అప్‌లోడ్ చేయబడిన రిటర్న్ పై మీ డిజిటల్ సంతకం ఉంటుంది. దానిని మీరు ప్రింట్ తీసిపెట్టుకోవచ్చు.
- మీ అప్లికేషన్ అప్రూవ్ చేయబడిన తర్వాత మీరు అప్‌లోడ్ చేయబడిన రిటర్న్ ఆధారంగా ఎంత రుసుము కట్టాలనేది కూడా స్క్రీన్ మీదే కనిపిస్తుంది.
- యజమానులు ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. అలాగే, మీకు కావాలంటే, ఆ రశీదును ప్రింట్ చేసి, మీ దగ్గరలో ఉన్న బ్యాంక్‌కు వెళ్లి అక్కడ ఫీజు చెల్లించే వెసులుబాటు కూడా ఉంది.
- దరఖాస్తుకు రిఫరెన్స్‌గా యజమానులు వారికి అందిన రసీదులు జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది.
ఈ-రిటర్న్ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి చేయవలసినవి:
- EPFO వెబ్‌సైట్‌కి వెళ్ళండి
- ఈ-రిటర్న్ సెక్షన్‌కి వెళ్ళండి
- విండోస్ ఇంస్టాలర్ 3_5 లేదా వేరే నంబర్‌తో ఉండే అవసరమయ్యే ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
- అందులో మీరు రెండు వేర్వేరు వెర్షన్లను చూడగలరు. మీ కంప్యూటర్‌కి తగిన దానిని డౌన్‌లోడ్ చేసుకోండి.
- “సహాయం” సెక్షన్‌లో, మీరు మీ యూజర్ మ్యాన్యువల్‌ని చూడగలరు. దాని ద్వారా ఏమైనా ఇతర సందేహాలు ఉంటే క్లియర్ చేసుకోవచ్చు.
ఈ-చలాన్‌ని జనరేట్ చేసేందుకు మార్గం
- ఈ-సేవ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి
- మీరు ఈసిఆర్ అప్‌లోడ్ అనే ఆప్షన్‌ను ఎంచుకొని, ఆపై జనరేట్ అయ్యే ఈసిఆర్‌ని అప్‌లోడ్ చేయాలి. మీరు అప్‌లోడ్ చేసున్న నెల, మరియు ఏడాదిని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- మీరు సరైన టెక్స్ట్ ఫైల్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత, ఒక సారాంశం మీ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. ఇన్స్పెక్షన్ కోసం ‘మొత్తం EPF ఇన్స్పెక్షన్ ఛార్జీలు, మొత్తం EDLI చందా, మరియు సెపెరేట్ ఛార్జీలను ఎంటర్ చేయండి. ఆటోమేటిక్‌గానే 12 శాతం చందా అప్లై చేయబడుతుంది. చివరిగా మీరు మీ ఈసిఆర్ ని సబ్మిట్ చేయవచ్చు.
- ఆపై సైట్ మీకు డిజిటల్‌గా సంతకం చేయబడిన ఒక ఫైల్‌ని చూపిస్తుంది. ఆపై, మీరు ఒక SMS ను పొందుకుంటారు. తర్వాత మీరు మీ ఈసిఆర్ మరియు పిడిఎఫ్ లలో ఉన్న డేటాను సరి చూసుకోవాలి.
- తర్వాత మీరు పిడిఎఫ్ ని అప్రూవ్ చేసి EPF చలానాని జనరేట్ చేసే బటన్ నొక్కాలి.
- ఒకసారి మీ ఈసిఆర్ అప్రూవ్ చేయబడిన తరువాత, సైట్ మీకోసం ఒక తాత్కాలిక రిటర్న్ రిఫరెన్స్ నంబర్ (TTRN) ని జనరేట్ చేస్తుంది. ఇది మీ చలానా రసీదును, స్వీకరించినట్టు చూపే అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ను చూపిస్తుంది.
- మీరు మీ చలాన్ రశీదును ‘డౌన్‌లోడ్’ ఆప్షన్ మీద నొక్కి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
- డౌన్‌లోడ్ చేసుకున్న TRRN నెంబర్‌తో ఉన్న చలానాని ప్రింట్ తియ్యండి
- “వ్యాపార వాడకానికి మాత్రమే” అని ఉన్న హెడింగ్ క్రింద వివరాలను నింపండి
- ఆన్లైన్ SBI పోర్టల్ ద్వారా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆన్లైన్ పేమెంట్ చేయవచ్చు. అలాగే మీరు చెక్ లేదా డిడి ద్వారా కూడా చెల్లించవచ్చు.
- ఒకసారి చెక్ ని క్యాష్ చేసిన తర్వాత, EPFO వారు మీకు ఒక SMS పంపిస్తారు. అంతటితో మీ ఈసిఆర్ ఫైలింగ్ పూర్తయినట్టే.
దీనిని కూడా చదవండి: గ్రాస్ శాలరీ అంటే ఏమిటి? గ్రాస్ శాలరీ లేదా CTCని ఎలా గణించాలి?
ఎలక్ట్రానిక్ చలానా కమ్ రిటర్న్ జనరేట్ చేయడానికి దిగువ పేర్కొన్న ముందస్తు షరతులు
- యజమాని ఇంతకుముందే యజమానుల E-SEWA పోర్టల్ లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
- ఆపై ECR ని డౌన్లోడ్ చేసుకొని ఉండాలి.
- అలాగే, ప్రాసెస్ పై పూర్తి అవగాహనా ఉండేందుకు గాను, అందులో తరచుగా అడిగే ప్రశ్నల పై మంచి పట్టు ఉండాలి.
ఆండ్రాయిడ్ యాప్స్ కొరకై UAN సభ్యుల E-SEWA.
- యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది 12 అంకెల నంబర్, దీనిని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి మరియు కార్మిక మంత్రిత్వ శాఖ ఆమోదిస్తుంది. EPFO సభ్యులందరికి దీనిని అందజేస్తారు. తద్వారా వారు సులభంగా వారి పిఎఫ్ అకౌంట్లను మ్యానేజ్ చేసుకోగలుగుతారు.
- ప్రతీ వ్యక్తి లబ్ధిదారు కావాలనే ఉద్దేశంతో, ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) స్కీమ్ ద్వారా దీనిని అందుకుంటారు. ఒకవేళ మీరు జీతం తీసుకొనే ఉద్యోగి అయి మరియు తప్పనిసరి సహకారం అందించాల్సి వస్తే మీరు ఈపిఎఫ్ లో సభ్యులు కావొచ్చు.
- UAN లాగిన్ పోర్టల్ ద్వారా ఉద్యోగులు తమ అన్ని పిఎఫ్ అకౌంట్లను యాక్సెస్ చేయవచ్చు. KYC, UAN కార్డు, సర్వీస్ రికార్డులు లాంటి ఎన్నో వివరాలు ఇక్కడ ఉద్యోగులకు అందుబాటులో ఉంటాయి. EPF ఈ-సేవ సభ్యులకు, నగదు బదిలీ మరియు తీసుకోవటానికి ప్రాసెస్ కూడా ఇప్పుడు చాలా సులభమైంది.
ఉద్యోగులకు UAN సభ్యుల పోర్టల్
- అన్నిటికంటే ముందుగా ఉద్యోగులు యాక్టివేట్ చేయబడిన UAN కలిగి ఉండాలి. అందుకే గాను, మీరు ముందుగా EPF సభ్యుల పోర్టల్ కి వెళ్లి, ‘యాకీవేట్ UAN’ ఎంపికపై వెళ్లాలి. మీ UAN కి సంబంధించిన సమాచారం అంతా ఇవ్వాలి. అంటే ఆధార్, ఫోన్ నంబర్, PAN, ఇమెయిల్ అలాగే పుట్టిన తేదీ.
- ఆపై, ‘అథరైజేషన్ PIN పొందండి’ మీద నొక్కాలి. PIN మీ రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్ కి వస్తుంది. దానిని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి.
- చివరిగా UAN పోర్టల్ లో మీ యూజర్ పేరు, పాస్ వర్డ్ సృష్టించండి.
ఉద్యోగులు UAN సభ్యుల పోర్టల్ లో లాగిన్ చేయడానికి ఈ అడుగులను పాటించాలి
- EPFO సైట్ కి వెళ్ళండి.
- ఆ తర్వాత ‘మా సర్వీసులు’, పై క్లిక్ చేసి ‘ఉద్యోగుల కోసం’ అనే ఎంపికను ఎంచుకోండి.
- ఆ తర్వాత ‘సభ్యుల UAN / ఆన్లైన్ సర్వీసులు’ని ఎంచుకోండి.
- UAN, పిఎఫ్ మెంబెర్ ఐడి, రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్, లాంటి అన్ని వివరాలను ఎంటర్ చేయండి.
- క్యాప్చ ఫిల్ చేయండి.
- ‘ధ్రువీకరణ పిన్ పొందండి’ మీద నొక్కండి
- ‘నేను అంగీకరిస్తున్నాను’ మీద నొక్కి మీ రిజిస్టర్ నంబర్ కి పంపబడిన OTP ఎంటర్ చేయండి.
- ఆపై మీ మొబైల్ కి పంపబడిన పాస్ వర్డ్ ఎంటర్ చేసి మీరు పోర్టల్ లోకి వెళ్ళవచ్చు.
యజమానులకు UAN మెంబెర్ పోర్టల్
యజమానుల EPFO పోర్టల్ లోకి లాగిన్ కావడం, ఉద్యోగులు లాగిన్ చేసిన విధంగానే ఉంటుంది. మీరు ఒక యజమానిగా EPFO పోర్టల్ లో లాగిన్ కావడానికి ఇలా చేయండి.
- మొదటిగా EPFO వెబ్సైటుకు వెళ్ళండి.
- EPFO యజమానులు లాగిన్ మీద క్లిక్ చేయండి. పేజీలో కుడి వైపున సైన్-ఇన్ అని కనిపిస్తుంది.
- అక్కడ మీ యూజర్ పేరు, పాస్ వర్డ్ ఎంటర్ చేసి సైన్-ఇన్ అవ్వండి
- ఆపై మీరు యజమానులు EPFO పోర్టల్ లో మరొక పేజీకి వెళతారు, అక్కడ మీరు మీ KYC వివరాలను ఎంటర్ చేయాలి.
UAN మెంబెర్ పోర్టల్ లో రిజిస్టర్ అవ్వడం ఎలా?
మీరు క్రింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ UAN పోర్టల్ లో లాగిన్ అయి మీ UAN నంబర్ యాక్టివేట్ చేసుకోవచ్చు:
- ముందుగా EPF మెంబెర్ పోర్టల్ కి వెళ్ళండి
- అక్కడ ‘ముఖ్యమైన లింక్స్’ సెక్షన్లో, ‘యాక్టివేట్ UAN’ అనే ఆప్షన్ ఎంచుకోండి.
- ఆపై అవసరమైన వివరాలు అన్నిటిని ఎంటర్ చేసి ‘యాక్టివేట్ UAN’ ఆప్షన్ మీద నొక్కండి.
- EPFO నుంచి మీకు మీరు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబరుకు ఒక పిన్ వస్తుంది.
- ఆ పిన్ ఎంటర్ చేసి మీ UAN నంబర్ యాక్టివేట్ చేసుకోవచ్చు
- ఆపై EPFO నుంచి మీకు ఒక SMS వస్తుంది, దాని ద్వారా మీరు పాస్ వర్డ్ సెట్ చేసుకోవచ్చు.
- మీరు లాగిన్ చేసిన ప్రతీ సారి మీ పాస్ వర్డ్ ని మార్చుకోవడం మంచిది.
మీ UAN స్టేటస్ తెలుసుకోవడం ఎలా?
ఈ క్రింద చెప్పబడిన విధంగా మీరు ఒక ఉద్యోగికి తమ EPF అకౌంట్ లో UAN స్టేటస్ ఎంత వరకు వచ్చిందని తెలుసుకోగలుగుతారు.
- www.epfoesewa.com వెబ్సైటు కి వెళ్ళండి
- ‘ఈ స్టేటస్ తెలుసుకోండి’ ఆప్షన్ మీద క్లిక్ చేయండి
- అక్కడ అవసరమైన అన్ని వివరాలు, అంటే మెంబెర్ ఐడి, PF నెంబర్, పాన్, ఆధార్ నెంబర్ అన్నీ ఎంటర్ చేయండి.
- ఆపై మెంబెర్ ఐడి మీద క్లిక్ చేసి, మీరు ఉంటున్న రాష్ట్రము, ప్రస్తుతం పని చేస్తున్న ఆఫీసు, మీ మెంబెర్ ఐడి, లాంటి అన్ని అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి.
- ఆపై మీ పేరు, కాంటాక్ట్ నెంబర్, పుట్టిన తేదీ, ఎంటర్ చేసి క్యాప్చ కూడా ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత ‘ధ్రువీకరణ పిన్ పొందండి’ మీద క్లిక్ చేయండి.
- మీ రిజిస్టర్ చేయబడిన మొబైల్ నుంబర్ కి ఒక OTP వెళ్తుంది, దానియం ఎంటర్ చేసి ‘OTP ని ధృవీకరించు’ మీద నొక్కండి.
- EPFO మీకు మీ UAN స్టేటస్ ను మీ రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్ కి పంపుతుంది.
UAN మెంబెర్ పోర్టల్ లో పాస్ వర్డ్ రీసెట్ చేయడం ఎలా?
ఈ క్రింద స్టెప్స్ ఫాలో అవుతూ మీరు మీ UAN పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు:
- ముందుగా లాగిన్ పేజీ ఓపెన్ చేసి ‘ఫోర్గెట్ పాస్ వర్డ్’ మీద నొక్కండి
- మీ UAN నెంబర్ మరియు క్యాప్చ ఎంటర్ చేయండి.
- ఆపై OTP పంపు మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ అయిన నెంబర్ కి OTP వస్తుంది.
- దానిని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద నొక్కండి
- అప్పుడు మీరు మీ పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు.
దీనిని కూడా చదవండి: శాలరీ క్యాలిక్యులేటర్ 2020-21 - టేక్ హోమ్ శాలరీని లెక్కించడం ఎలా?
యజమానులు E-SEWA పోర్టల్ ఉపయోగించడం వల్ల ఉండే లాభాలు
EPF E- SEWA వల్ల ఉండే లాభాలు ఏమిటంటే:
- యజమానులు పేపర్ లెస్ రిటర్న్స్ చెయ్యవచ్చు
- 5/10/12A,3A, మరియు 6A క్రింద ఉండే రిటర్న్స్ ఇకపై సబ్మిట్ చేయాల్సిన పని లేదు.
- పేమెంట్ చేసిన వెంటనే EPFO ఎలాంటి క్లిష్టత లేకుండా SMS పంపుతుంది.
- సభ్యుల అకౌంట్ లో EPF ప్రతీ నెల జమ చేయబడుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
ఉద్యోగం ఇచ్చేవారు EPFO E-SEWA లో రిజిస్టర్ కాకపోతే ఏమవుతుంది?
యజమాని తమ సంస్థని రిజిస్టర్ చేసుకుంటే మాత్రమే ఈ-చలాన్ ఆన్లైన్ జనరేషన్ వీలుపడుతుంది. యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ సృష్టించడం వల్ల మీరు యజమానుల EPFO పోర్టల్ కి వెళ్ళగలరు.
ఆన్లైన్ జనరేషన్ చేసిన చలాన్ ఎంత సేపు చెల్లుతుంది?
పన్నెండు రోజులు చెల్లుతుంది
యజమాన ఒకే లాగిన్ వివరాలతో ఒకటికంటే ఎక్కువ సంస్థలను మైంటైన్ చేయవచ్చా?
కుదరదు. వేర్వేరు సంస్థలకు వేర్వేరు వివరాలతో లాగిన్ కావలసి ఉంటుంది.
ఎవరైనా E-SEWAలో అకౌంట్ తయారు చేసి తమ అకౌంట్ చూడడానికి వీలవుతుందా?
లేదు. EPF నంబర్ కలిగిన ఉద్యోగులు మాత్రమే లాగిన్ చేసి తమ వివరాలను చూసుకోవటానికి వీలవుతుంది.
మొబైల్ నెంబర్ మరియు ఇతర వివరాలను ఇవ్వడం వాళ్ళ ఏం లాభం?
రిజిస్టర్ కావడం, అలాగే మీ ప్రొఫైల్ ఎడిట్ చేసే సమయాల్లో తప్ప, మిగతా వాటికీ EPFO నుండి మీరు రిజిస్టర్ అయిన నెంబర్ కి OTPలు వస్తాయి.
ఒక సంస్థ యొక్క ప్రొఫైల్ ను ఎలా మార్చగలం?
- ముందుగా మీరు యజమానులు పోర్టల్ కి వెళ్ళాలి. ప్రొఫైల్ అనే హెడింగ్ క్రింద ఎడిట్ ప్రొఫైల్ అనే లేబుల్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు అవసరమైన మార్పులు చేసి PIN పొందండి మీద నొక్కాలి.
- అప్పుడు మీరు రిజిస్టర్ అయిన ప్రాధమిక మొబైల్ నెంబర్ కి కొన్ని వివరాలు వస్తాయి. ఆ వచ్చిన పిన్ ఎంటర్ చేసి ప్రొఫైల్ అప్డేట్ చేయండి.
- ఆపై చివరిగా మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కి మీ ప్రొఫైల్ అప్డేట్ అయినట్లు ధ్రువీకరణ వస్తుంది.