written by Khatabook | July 2, 2021

గ్రాస్ శాలరీ అంటే ఏమిటి? గ్రాస్ శాలరీ లేదా CTCని ఎలా గణించాలి?

కొత్తగా ఉద్యోగంలో చేరినవాళ్లు, కార్పొరేట్ ప్రపంచంలోకి కొత్తగా అడుగు పెట్టిన చాలా మంది, కంపెనీ వాళ్లు ముందు ఇస్తామని చెప్పిన దానికంటే తక్కువ జీతం ఇస్తున్నారు అని ఫిర్యాదు చేస్తారు. గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ మరియు CTC  అనే మూడు పదాల మధ్య ఉండే వ్యత్యాసం వల్ల ఇలా జరుగుతుంది, ఇవి మూడు ఒకేలా కనిపించినా, విభిన్న అర్థాలను కలిగి ఉంటాయి. 

CTC అంటే కంపెనీ ఖర్చుకి సంబంధించినది. దీనికి విరుద్ధంగా, ఒక ఉద్యోగి చేతిలో లభించే జీతం మొత్తం గురించి ఆందోళన చెందుతాడు. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, దీనికి సంబంధించి మీ సందేహాలను మేము స్పష్టం చేస్తాము, తద్వారా మీరు సరైన నిర్ణయం తీసుకోవచ్చు.

గ్రాస్ శాలరీ అంటే ఏమిటి?

 • ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటి మినహాయింపులు, ఆదాయపు పన్ను కొరకు చేయబడ్డ కంట్రిబ్యూషన్లు వంటివి తీసేయకముందు మీ యజమాని మీకు ఇచ్చే మొత్తం జీతాన్ని గ్రాస్ శాలరీ అంటారు.
 • ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ అనేది రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీము. ఉద్యోగి మరియు యజమాని ఇద్దరూ ప్రతినెలా బేసిక్ జీతం మరియు కరువు భత్యం నుండి కనీసం 12% ఈ ఫండ్లోకి విరాళమిస్తారు. 
 • మీ రిటైర్మెంట్ సమయంలో, మీరు పూర్తి మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు ఉద్యోగం చేసే సమయంలో మీరు అందించిన సేవలకు ప్రతిఫలంగా మీ యజమాని  రిటైర్మెంట్ సమయంలో చెల్లించే మొత్తాని గ్రాట్యుటీ అంటారు.
 • మీరు ఆ వ్యాపారానికి కనీసం ఐదు సంవత్సరాల పాటు మీ సేవలను అందించినట్లయితే మీకు గ్రాట్యుటీ అందుతుంది. 
 • అయినప్పటికీ, కొన్ని పరిస్థితులలో, ఐదు సంవత్సరాల సేవ పూర్తి చేయకుముందే ఉద్యోగి మరణించినా లేదా వైకల్యానికి గురైనా యజమాని ఉద్యోగికి పూర్తి గ్రాట్యుటీని చెల్లిస్తారు.

గ్రాస్ శాలరీలో ఏమేమి చేర్చబడతాయి?

గ్రాస్ శాలరీలో భాగంగా ఉండే ప్రత్యక్ష ప్రయోజనాల గురించి అవగాహన కలిగించే కొన్ని సంక్షిప్త వివరాలు:

 1. బేసిక్ శాలరీ- మీ శాలరీలో బోనస్లు, అలవెన్సులు మొదలైన ఇతర చెల్లింపులను జోడించడానికి ముందు మరియు ఫిక్సిడ్ కంట్రిబ్యూషన్లు లేదా ట్యాక్స్ లను మినహాయించక ముందు మీకు ఇవ్వబడే మొత్తం .
 2. హౌస్ రెంట్ అలవెన్స్ - ఉద్యోగ రీత్యా ఎవరైనా వారు ఉన్న ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి మారితే, అతను/ఆమె తీసుకున్న ఇంటి అద్దెకు పరిహారంగా ఇచ్చే మొత్తాన్ని హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు. ఈ అలవెన్స్ పాక్షికంగా పన్ను నుండి మినహాయించబడుతుంది. పన్ను నుంచి మినహాయించబడ్డ హెచ్ ఆర్ ఎ మొత్తం ప్రాథమిక శాలరీ నుంచి లెక్కించబడుతుంది.
 3. లీవ్ ట్రావెల్ అలవెన్స్ - పని నుంచి సెలవు సమయంలో చేయబడ్డ దేశీయ ప్రయాణాల్లో అయ్యే ప్రయాణ ఖర్చుల కొరకు ఉద్యోగి తన యజమాని నుంచి అందుకున్న అలవెన్స్ ఇది. ఈ అలవెన్స్ నాలుగు సంవత్సరాల వ్యవధిలో రెండు ప్రయాణాలకు మాత్రమే ఎల్ టి ఎ చెల్లించబడుతుంది. ఇందులో బస్సు ఛార్జీలు, రైలు టికెట్ వంటి ప్రయాణ ఖర్చులు ఉంటాయి. ఉద్యోగి అందుకునే గ్రాస్ శాలరీలో ఎల్ టిఎ కూడా ఒక భాగం.
 4. టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ అలవెన్స్ - ఉద్యోగికి మొబైల్ మరియు టెలిఫోన్ ఖర్చులను తిరిగి చెల్లించడానికి ఉపయోగించే అలవెన్స్.
 5. కన్వేయన్స్ అలవెన్స్ - ఉద్యోగుల ప్రయాణ ఖర్చులను భర్తీ చేయడానికి బేసిక్ శాలరీకి అదనంగా ఇది అందించబడుతుంది,ఆఫీసుకి వెళ్లి రావడానికి ఉద్యోగికి అయ్యే ఖర్చులను భర్తీ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు.
 6. ప్రత్యేక/ఇతర అలవెన్స్ - పైన తెలిపినవి కాని వివిధ నిర్ధిష్ట ఖర్చులను తీర్చడం కోసం యజమాని ఉద్యోగికి ఇచ్చే అలవెన్సులు  ప్రత్యేక / ఇతర అలవెన్స్ క్రిందికి వస్తాయి. 
 7. పెర్క్విసైట్లు - పెర్క్విసైట్లు లేదా పెర్క్ లు అనేవి డిస్కౌంట్ రేట్లు లేదా ఉచితంగా ఉద్యోగులకు ఇవ్వబడే ప్రయోజనాలు. అవి గ్రాస్ శాలరీలో భాగం.

నెట్ శాలరీ అంటే ఏమిటి?

గ్రాస్ శాలరీని స్పష్టం చేసిన తరువాత, ఇప్పుడు 'నెట్ శాలరీ' అనే మరో పదం గురించి తెలుసుకుందాం.

 • నెట్ శాలరీ అంటే నెల ఆఖరున మీ చేతికి అందే జీతం. మీ గ్రాస్ శాలరీ నుండి పెన్షన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఇతర చట్టబద్ధమైన నిధులు మరియు ప్రొఫెషనల్ ట్యాక్స్, ఆదాయపు పన్ను మొత్తం తీసివేసిన తరువాత మీ చేతికి వచ్చే జీతాన్ని నెట్ శాలరీ అంటారు. 
 • నెట్ శాలరీని టేక్ హోమ్ శాలరీ అని కూడా అంటారు, ఇది అన్ని మినహాయింపుల తర్వాత మీకు లభిస్తుంది. ఉద్యోగంలో చేరక ముందు శాలరీ గురించి చర్చించుకునేప్పుడే టేక్ హోమ్ శాలరీ గురించి స్పష్టంగా తెలుసుకోండి అప్పుడే మీరు చేయబోయే ఉద్యోగం మీకు సరిపడినంత ఆదాయాన్ని ఇస్తుందా, మిమ్మల్ని సంతృప్తి పరుస్తుందా లేదా అనే అంచనా వేయగలుగుతారు .

కంపెనీకి అయ్యే ఖర్చు (సీటీసీ) అంటే ఏమిటి?

సిటిసి అంటే ఒక సంవత్సరంలో యజమాని సగటున ఒక ఉద్యోగిపై ఖర్చు చేసే మొత్తం. ఉద్యోగులే కంపెనీకి విలువైన ఆస్తులు. నైపుణ్యం,అర్హత కలిగిన మరియు సమర్థులైన ఉద్యోగులను నియమించడం మరియు నిర్వహించడం కొరకు కంపెనీ తన డబ్బులో గణనీయమైన భాగాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగులను తమ కంపెనీలో చేరడానికి ఆసక్తి చూపించడానికి వారికి ఆకర్షణీయమైన శాలరీని ఇవ్వవలసి ఉంటుంది.

 • ఉద్యోగులు కంపెనీ కోసం తమ సామర్థ్యాన్ని, సమయాన్ని వెచ్చించి, కస్టపడి పనిచేస్తారు కాబట్టి వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించాలని ఆశిస్తారు. ఉద్యోగులు కంపెనీ ఎదుగుదల, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తారు కాబట్టి పదవీ విరమణ తరువాత సంస్థ కూడా ఉద్యోగుల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలని ఆశిస్తారు. 
 • అందుకే యజమాని కూడా ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్ మరియు గ్రాట్యుటీ వంటి వాటిలో కాంట్రిబ్యూట్ చేస్తాడు. రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్ స్కీమ్లలో చేసిన కంట్రిబ్యూషన్లు కూడా సీటీసీలో చేర్చబడతాయి.
 • ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, భద్రత గురించి శ్రద్ద వహించడం సంస్థ బాధ్యత. ఉద్యోగులకు ఆరోగ్య బీమా, జీవిత బీమా, వైద్య ఖర్చుల రీఎంబర్స్ మెంట్ మరియు ఇతర ప్రయోజనాలు కూడా అందించబడతాయి. ఈ ప్రయోజనాలు అన్ని సీటీసీలో భాగం.
 • వార్షిక పనితీరు ఆధారంగా ఉద్యోగికి చెల్లించే బోనస్ లేదా కమిషన్ వంటి వేరియబుల్ చెల్లింపులు కూడా సీటీసీలో చేయబడతాయి. వేరియబుల్ పేవుట్ అనేది ఉద్యోగి యొక్క బేసిక్ శాలరీలో నిర్ధిష్ట శాతంగా లెక్కించబడుతుంది.
 • ఆఫర్ లెటర్లో పేర్కొన్న విధంగా సీటీసీ కంటే చేతికి అందే శాలరీ ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సీటీసీలో యజమాని నేరుగా ఉద్యోగికి చెల్లించే బదులు కొన్ని ఖర్చులు ఉంటాయి. అటువంటి ఖర్చులు శాలరీ చెక్కులలో ప్రతిబింబించనప్పటికీ, ఉద్యోగికి దాని ప్రయోజనం లభిస్తుంది.
 • కంపెనీ మరియు దాని కాంపోనెంట్లకు అయ్యే ఖర్చు ఆర్గనైజేషన్ నుంచి ఆర్గనైజేషన్ కు మారుతుంది. ఉదాహరణకు, ఒక బ్యాంకింగ్ కంపెనీ తన ఉద్యోగులకు రాయితీ రేట్లకు రుణాలను అందిస్తుంది. మరికొన్ని కంపెనీలు మధ్యాహ్న భోజనానికి ఫుడ్ కూపన్లను అందిస్తున్నాయి. అందువల్ల, కంపెనీకి అయ్యే ఖర్చు యజమాని దృష్ట్యా మొత్తం ఖర్చు. జీతం, రీఎంబర్స్ మెంట్, అలవెన్స్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ అనంతర ప్రయోజనాలు, బీమా లేదా ఇతర ఖర్చుల కొరకు ఉద్యోగిపై ఖర్చు చేయబడుతుంది.

గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ మరియు కంపెనీకి అయ్యే ఖర్చును ఎలా లెక్కించాలో తెలుసుకోవడానికి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం:

మిస్టర్ ఎ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు, మరియు అతడు సంవత్సరానికి గ్రాస్ శాలరీ రూ. 6,00,000 మరియు అతని టేక్ హోమ్ శాలరీ రూ. 5,34,000. అతని జీతంలోని భాగాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

Sl. No.

ఐటెం

అమౌంట్(రూపాయలలో.)

1.

బేసిక్ శాలరీ

3,50,000

2.

(+)హౌస్ రెంట్ ఆలవెన్స్

96,000

3.

(+)లీవ్ ట్రావెల్ అలవెన్స్

50,000

4.

(+)స్పెషల్ అలవెన్స్

1,04,000

5.

(=)గ్రాస్ శాలరీ

6,00,000

6.

(-)ప్రోవిడెంట్ ఫండ్

42,000

7.

(-)గ్రాట్యుటీ

18,000

8.

(-)ఇన్సూరెన్సు ప్రీమియం

3,500

9.

(-)ప్రొఫెషనల్ ట్యాక్స్

2,500

10.

(=)నెట్ శాలరీ

5,34,000

11.

కంపెనీకి అయ్యే ఖర్చు(CTC)

(5+6+7+8)

6,63,500

పై వివరాల ఆధారంగా -

 • బేసిక్ శాలరీ, హౌస్ రెంట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ మరియు ప్రత్యేక అలవెన్స్ కలిపి రూ.6,00,000కు గ్రాస్ శాలరీ లెక్కించబడుతుంది.
 • ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఇన్స్యూరెన్స్ ప్రీమియం మరియు ప్రొఫెషనల్ ట్యాక్స్ మొత్తాన్ని గ్రాస్ శాలరీ నుంచి తీసివేయడం ద్వారా నెట్ శాలరీని లెక్కించండి. అందువల్ల, నెట్ శాలరీ రూ.5,34,000గా ఉంటుంది.
 • ఈ ఉదాహరణలో సీటీసీ అంటే ఒక సంవత్సరంలో ఉద్యోగికి చెల్లించే ప్రావిడెంట్ ఫండ్ మరియు గ్రాట్యుటీ మరియు బీమా ప్రీమియం మినహాయింపుతో సహా ప్రయోజనాల అన్నీ జోడించబడ్డాయి. అందువల్ల సిటిసి రూ.6,63,500.
 • ఉద్యోగి యొక్క గ్రాస్ శాలరీ నుంచి మినహాయించబడ్డ ప్రొఫెషనల్ ట్యాక్స్ సీటీసీలో భాగం కాదు. ఇది పూర్తిగా ఉద్యోగి యొక్క చెల్లింపు కాబట్టి ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లింపు కొరకు యజమాని ఉద్యోగికి రీఎంబర్స్ చేయడు లేదా కంట్రిబ్యూట్ చేయడు.
 • కంపెనీలు సీటీసీని ఆఫర్ లెటర్లో ఉద్యోగికి అందించే మొత్తంతో కలిపి పేర్కొనడం అనేది చాలా సాధారణ పద్ధతి. కంపెనీలు సీటీసీ గురించి ఆలోచిస్తాయి, ఉద్యోగి తన టేక్ హోమ్ శాలరీని తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. కొన్నిసార్లు, ఉద్యోగులు ఈ మొత్తాన్ని నెట్ టేక్ హోమ్ శాలరీగా తప్పుగా అర్థం చేసుకుని ఉద్యోగానికి అంగీకరిస్తాడు.

కాబట్టి, జీతం గురించి యాజమాన్యంతో చర్చించేప్పుడు ఈ అంశాల గురించి ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండటం చాలా ముఖ్యం. సిటిసి మరియు గ్రాస్ శాలరీ మధ్య తేడాను మరియు సిటిసి నుంచి గ్రాస్ శాలరీని ఎలా లెక్కించాలో మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగ ఆఫర్ ఆమోదించడానికి ముందు యాజమాన్యం దగ్గర మీ టేక్ హోమ్ శాలరీని లెక్కించవచ్చు. మీ జీతంయొక్క వేరియబుల్ మరియు ఫిక్సిడ్ కాంపోనెంట్స్ గురించి యజమానితో స్పష్టంగా మాట్లాడడం మంచిది. మీ జీతం యొక్క వివిధ భాగాల గురించి మంచి నాలెడ్జ్ కలిగి ఉండటం వల్ల భవిష్యత్తు పెట్టుబడి మరియు రిటైర్మెంట్ ప్లాన్ లు చేయడానికి చక్కటి సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

దీనిని కూడా చదవండి: శాలరీ క్యాలిక్యులేటర్ 2020-21 - టేక్ హోమ్ శాలరీని లెక్కించడం ఎలా?

తరచుగా అడిగే ప్రశ్నలు

నేను గ్రాస్ శాలరీని ఆన్లైన్ లో లెక్కించవచ్చా?

మీ గ్రాస్ శాలరీ మరియు నెట్ శాలరీ మొత్తాన్ని సులభంగా లెక్కించడానికి అనేక వెబ్ సైట్ లు ఆన్ లైన్ గ్రాస్ శాలరీ కాలిక్యులేటర్లను అందిస్తాయి. మీరు చేయాల్సిందల్లా సీటీసీ మరియు బోనస్ వంటి కొన్ని ప్రాథమిక వివరాలను నమోదు చేయడమే.

ప్రొఫెషనల్ ట్యాక్స్ మరియు ఆదాయపు పన్ను కూడా సిటిసిలో భాగమా?

లేదు, ప్రొఫెషనల్ ట్యాక్స్ మరియు ఆదాయపు పన్ను అనేవి పూర్తిగా ఉద్యోగి ద్వారా చేయబడే చెల్లింపులు మరియు యజమాని ద్వారా భరించబడవు. అందువల్ల, అవి సీటీసీలో లెక్కించబడవు.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం జీతంలో ప్రామాణిక మినహాయింపు ఎంత?

2020-21 ఆర్థిక సంవత్సరానికి, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, ఉద్యోగులందరి గ్రాస్ శాలరీ నుంచి రూ. 50000 ప్రామాణిక మినహాయింపు జరుగుతుంది. అయితే, తక్కువ పన్ను రేటును అందించే కొత్త పన్ను శ్లాబ్ రేట్ల ప్రకారం ఆదాయపు పన్ను లెక్కించినట్లయితే మీరు ఈ మినహాయింపును ఉపయోగించుకోలేరు.

శాలరీ ఆదాయంపై సోర్స్ వద్ద ఏ మొత్తంపై ట్యాక్స్ మినహాయించబడుతుంది?

మూలము (టి డి ఎస్) వద్ద పన్ను మినహాయించబడుతుంది, నెట్ శాలరీ మొత్తంపై లెక్కించబడుతుంది. గ్రాస్ శాలరీ నుంచి అన్ని ఆదాయపు పన్ను, ఆదా మినహాయింపులు, కంట్రిబ్యూషన్ లు మరియు ప్రొఫెషనల్ పన్నులు అన్ని తీసివేసిన తరువాత నెట్ శాలరీ లెక్కించబడుతుంది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా ఆదాయం మరియు పన్ను బాధ్యత ప్రకారంగా టి డి ఎస్ మినహాయించబడుతుంది.

ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ మరియు పన్ను గురించిన లెక్కల బాధ్యత నేనే తీసుకోవాలా ?

కంపెనీలు తమ ఉద్యోగులకు ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన మొత్తం శాలరీ మరియు శాలరీ పై మూలం వద్ద మినహాయించబడిన పన్నును కలిగి ఉన్న Form 16ను అందిస్తాయి. అందువల్ల, ఆదాయపు పన్ను రిటర్న్ లను దాఖలు చేయడానికి మీరు లెక్కల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, Form 16లో ఇవ్వబడ్డ వివరాల ప్రకారంగా మీ నాలెడ్జ్ మరియు అవగాహన కొరకు మీరు మీ శాలరీని తిరిగి లెక్కించవచ్చు.

అలవెన్సులు మరియు పెర్క్విసైట్ ల మధ్య తేడా ఏమిటి?

 • ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించడంలో ఉద్యోగికి సహాయపడటం కొరకు యజమాని ద్వారా ప్రతి నెలా ఉద్యోగికి చేసే స్థిర చెల్లింపులను అలవెన్స్ అంటారు ఉదాహరణకు, కన్వేయన్స్ అలవెన్స్ మరియు హౌస్ రెంట్ అలవెన్స్. 
 • మరోవైపు, పెర్క్విసైట్ లు యజమాని ద్వారా ఉద్యోగికి అందించబడ్డ ద్రవ్యేతర ప్రయోజనాలు, ఉదాహరణకు, అద్దె లేకుండా వసతి సదుపాయం, ఆఫీసుకి వెళ్లి రావడానికి ఉచిత కారు సదుపాయం మొదలైనవి.

Related Posts

None

ఇపిఎఫ్ఓ ఇ-సేవ - ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ


None

శాలరీ స్లిప్ అంటే ఏమిటి? అది ఎందుకు ముఖ్యం? దాని ఫార్మాట్ ఏమిటి?


None

శాలరీ క్యాలిక్యులేటర్ 2020-21 - టేక్ హోమ్ శాలరీని లెక్కించడం ఎలా?