ప్రపంచ బ్యాంకు యొక్క 2020 నివేదిక ప్రకారం, వ్యాపారం చేయడానికి అవసరమైన అంశాల లెక్క ప్రకారం, భారతదేశం 190 దేశాలలో 63 వ స్థానంలో ఉంది. 5 సంవత్సరాలలో (2014-2019) భారతదేశం తన ర్యాంకింగ్ ను 79 స్థానాలు మెరుగుపరుచుకుంది. ర్యాంకింగ్ లో ఈ పెరుగుదలకు ప్రాథమిక కారణాలు దివాలా మరియు దివాలా కోడ్ మరియు గూడ్స్ & సర్వీస్ ట్యాక్స్ అమలు చేయడం.
ప్రపంచవ్యాప్తంగా, చైనాతో పాటు, భారతదేశం వ్యాపారం చేయడానికి కొత్త గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతున్నది. మౌలిక సదుపాయాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, సృజనాత్మకత, నైపుణ్యం కలిగిన, ఇంగ్లిష్ మాట్లాడగల చవకైన కార్మిక శక్తితో సేవలలో ప్రత్యేకత ఉండడం భారతదేశానికి ఒక ప్రయోజనంగా మారింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్ డిఐలకు) భారతదేశం కొత్త మార్కెట్ గా అభివృద్ధి చెందుతున్నది. యుఎన్ సిటిఎడి యొక్క 2020 ప్రపంచ పెట్టుబడి నివేదిక ప్రకారం, ఎఫ్ డిఐ పెట్టుబడులు 2018 తో పోలిస్తే 20% పెరుగుదలతో 2019 లో 51 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి.
వ్యాపారాలకు అనువైన లొకేషన్ ఎందుకు ప్రాముఖ్యం?
సరైన ప్రతిభావంతులైన ఉద్యోగులు, ముడిపదార్థాలు, పెట్టుబడిదారులు మొదలైన వాటికి ప్రాప్యత కారణంగా వ్యాపారాన్ని ప్రారంభించే ప్రదేశం దాని వృద్ధి మరియు విస్తరణ అవకాశాన్ని నిర్ణయిస్తుంది. భారతదేశంలో వ్యాపారాన్ని స్థాపించాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే, భారతదేశంలో వ్యాపారం చేయడానికి టాప్ 10 నగరాల జాబితా ఇక్కడ ఉంది.
1. ముంబై
ముంబైలో వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా ఫైనాన్స్, ప్రతిభావంతులైన శ్రామిక శక్తి మరియు ఇప్పటికే అభివృద్ధి చేయబడ్డ మౌలిక సదుపాయాలను సులువుగా అందుకోగలుగుతాము.
- స్థాపించబడిన అన్ని బ్యాంకులు ముంబైలో తమ ప్రధాన కార్యాలయాలను కలిగి ఉన్నాయి, ఇక్కడ వ్యాపారాలు వేగవంతమైన లోన్ (స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక) ప్రాసెసింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రయాణం మరియు కనెక్టివిటీ కోసం, ముంబైలో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, ఇది భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో రెండవ స్థానంలో ఉంది. ముంబై పోర్ట్ ట్రస్ట్ మరియు జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ భారతదేశం నుండి వస్తువుల దిగుమతి మరియు ఎగుమతికి సహాయపడే రెండు ప్రధాన ఓడరేవులు.
- ముంబై వివిధ జాతీయ రహదారులు, ఆరు లైన్ల ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వే, బాంద్రా-వర్లీ సీ లింక్ వంతెనతో అనుసంధానించబడింది, ఇది విస్తృతమైన రహదారి రవాణా సౌకర్యాలను అందిస్తుంది.
- ఐఐటి-బాంబే, నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, జమ్నాలాల్ బజాజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ మరియు అనేక ఇతర సంస్థల నుంచి ప్రతిభ కలిగిన వారిని పొందగలరు. తద్వారా గుణాత్మక మరియు ఉత్పాదక శ్రామిక శక్తి మీ సంస్థకు అందుతుంది.
- అయితే, ముంబైలో వ్యాపారం చేయడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి, అవి జనాభా పెరగడం, వేగంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలు, రోజువారీ ఖర్చులు అధిక ఖర్చు మొదలైనవి.
- సవాళ్లతోనే అవకాశాలు కూడా వస్తాయి, అలాంటి పరిస్థితులలో భారతదేశం యొక్క ఆర్థిక రాజధానిగా, ముంబై ప్రతి సమస్యకు పరిష్కారాలను చూపగలదు కాబట్టి నేడు వ్యాపారం చేసే అగ్ర నగరాల్లో ఒకటిగా మారింది. ముంబైలో ప్రారంభమైన విజయవంతమైన స్టార్టప్ లలో Quikr, Booksmyshows.com, Nykaa మొదలైనవి ఉన్నాయి.
2. పూణే
పూణే కూడా మహారాష్ట్రలోని నగరమే. ఇది ముంబైకి దగ్గరగా ఉంటుంది. పూణే నుండి ముంబైలో ఉన్న క్యాపిటల్ మార్కెట్లు, వినియోగదారులు, సరఫరాదారులను చేరుకోవడానికి వ్యాపారాలకు ఒక ప్రత్యేక అవకాశం ఉంటుంది.
- ఆరు లైన్ల ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ వే కారణంగా వ్యాపారాలు పూణేలో మరియు ముంబైలో కూడా చక్కగా నడిపించుకోవచ్చు.
- పూణేలో రియల్ ఎస్టేట్ ఖర్చు తక్కువ, కాబట్టి వ్యాపారాలు అటువంటి తక్కువ ధర రియల్ ఎస్టేట్ల కారణంగా కాస్త లాభ పడవచ్చు. పూణేకి అద్భుతమైన రోడ్డు కనెక్టివిటీ ఉంది, ఇది బెంగళూరు, ముంబై, గోవా మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు కలుపుతుంది. పూణే నగరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో లోహెగావ్ లో పూణే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది.
- డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వంటి ప్రధాన సంస్థలు సెంట్రల్ పూణేలో ఉన్నాయి, ఇది వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి అవసరమయ్యే ప్రతిభావంతులైన శ్రామిక శక్తిని అందిస్తుంది
- ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసులు, యాక్సెంచర్ సొల్యూషన్స్ వంటి టెక్ దిగ్గజాలు టెక్నాలజీ సపోర్ట్ మరియు ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే అభివృద్ధి చేశాయి. మహారాష్ట్ర రాష్ట్రంలో ఎఫ్ డిఐలను పెంచడానికి మహారాష్ట్ర ప్రభుత్వ పథకాలు మహాపర్వానా (మెగా పర్మిషన్) పథకాన్ని పూణేలోప్రారంభించింది. ఈ పథకం వ్యవస్థాపకులకు సులభంగా అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ పూణేను భారతదేశంలో వ్యాపారం చేసే ప్రధాన నగరాల్లో ఒకటిగా చేస్తాయి.
3. బెంగళూరు
- బెంగళూరు టెక్నాలజీ లేదా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గా ప్రసిద్ధి చెందింది. ఇది 50 లక్షలకు పైగా జనాభా కలిగిన కర్ణాటక రాజధాని, ఇది భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరాలలో 3వ స్థానంలో ఉంది. మొత్తం సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో 1/3 వంతు ను అందించే భారతదేశపు టాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) ఎగుమతిదారు బెంగళూరు. కొన్ని ప్రధాన టెక్ దిగ్గజాలలో ఇన్ఫోసిస్, యాక్సెంచర్, విప్రో, సిస్కో మొదలైనవి ఉన్నాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కూడా బెంగళూరు నగరంలో ఉంది.
- బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో 4వ రద్దీ విమానాశ్రయం. బెంగళూరు భారతీయ రైల్వేలు మరియు జాతీయ రహదారులతో అనుసంధానించబడింది, ఇది వస్తువులు మరియు ప్రజలు సులభంగా అందిస్తుంది.
- ఐఐఎం- బెంగళూరు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్, మరియు జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనేవి బెంగళూరు నగరంలోని కొన్ని ప్రధాన సంస్థలు, ఇవి ప్రతిభావంతులైన మరియు సృజనాత్మక శ్రామిక శక్తిని అందిస్తాయి.
- అర్బన్ లాడర్, హెక్టర్ బేవరేజస్, జూమ్ కారు వంటి కొన్ని ప్రముఖ స్టార్టప్ లు బెంగళూరులో తమ వ్యాపారాన్ని ప్రారంభించాయి. టెక్నాలజీపై ఆధారపడిన వ్యాపారాలకు ఇది బాగా సరిపోతుంది. ప్రధానంగా టెక్నాలజీపై ఆధారపడని కంపెనీలు కూడా తమ ప్రక్రియలు మరియు సిస్టమ్ లను మెరుగుపరచడానికి బెంగళూరులో ఉన్నాయి.
4. ఢిల్లీ
- దేశ రాజధానిగా మాత్రమే కాకుండా, ఢిల్లీ తీవ్రమైన వాతావరణాలకు ప్రసిద్ధి చెందింది. మెట్రో ప్రాజెక్టులను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఢిల్లీ; ఢిల్లీ మెట్రోలో నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్ మొదలైన వాటిని కలిపే 280కి పైగా స్టేషన్ల నెట్ వర్క్ ఉంది. ఇది జాతీయ రహదారులు మరియు రైలు నెట్ వర్క్ ల విస్తృత వ్యాప్తిని కలిగి ఉంది. ఢిల్లీలో జనాభా ముంబై జనాభాకు దగ్గరగా ఉన్నప్పటికీ, ముంబైలో ఉన్నంత జనసాంద్రత ఉండదు, ఇక్కడ మౌలిక సదుపాయాలు మరింత అందుబాటులో ఉంటాయి.
- ఈ నగరంలో ఐఐటి ఢిల్లీ, జవహర్ లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్స్, న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మరియు అకడమిక్ మరియు శ్రేష్టతకు ప్రసిద్ధి చెందిన వివిధ ఇతర ప్రధాన సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే వ్యాపారాలకు ఢిల్లీ నిలయం
- నగరంలో వ్యాపారాన్ని నిర్వహించడానికి ఎదురయ్యే సవాళ్లలో వాయు కాలుష్యం, మహిళా భద్రత మరియు వలస కార్మికుల ఇబ్బందులు ముఖ్యమైనవి. మాస్ మీడియా కవరేజీ, క్లియరెన్స్ కొరకు ప్రభుత్వ కార్యాలయాలు ఢిల్లీలో వ్యాపారాన్ని నిర్వహించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి, ఇది భారతదేశంలో వ్యాపారం చేసేందుకు అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా ఉంటుంది.
5. హైదరాబాద్
- హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని మరియు ఇది ప్రతిభావంతులైన శ్రామిక శక్తి మరియు ఐటి సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. బెంగళూరు సాంకేతిక కేంద్రంగా మారడానికి ముందు, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఈ నగరం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, దివిస్ ల్యాబ్ వంటి ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్లకు ప్రసిద్ధి చెందింది.
- ఇటీవలి కాలంలో, జినోమ్ వ్యాలీ, నానో టెక్నాలజీ పార్క్, మరియు ఫ్యాబ్ సిటీతో సహా వివిధ బయోటెక్నాలజీ పార్కులు అభివృద్ధి చేయబడ్డాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఫేస్బుక్ వంటి టెక్ దిగ్గజాలు భారతదేశంలో తమ వ్యాపారానికి హైదరాబాద్ తో అడుగు పెట్టాయి.
- హైదరాబాద్ నగరంలో ప్రతిభావంతులైన శ్రామిక శక్తి, మూలధనం, అలాగే స్థాపించడానికి మరియు ఎదగడానికి ప్రభుత్వం నుండి అవసరమయ్యే మద్దతు పుష్కలంగా దొరుకుతుంది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఎన్ ఎంఐఎంఎస్ వంటి సంస్థలు హైదరాబాద్ లోని ప్రముఖ సంస్థలు. స్థానిక ప్రతిభను పొందడానికి ప్రత్యేక అవకాశాన్ని ఇవి కల్పిస్తున్నాయి.
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ నగరంలో ఉంది, ఇక్కడి నుండి వ్యాపారానికి వినియోగ సేవలు, రవాణా, మరియు వ్యాపార సమావేశాల కోసం ప్రపంచంలోని ఏ భాగానికైనా సులభంగా చేరుకోవడానికి వీలవుతుంది.
- పరిశ్రమలలో చాలా వరకు ఫార్మాస్యూటికల్స్, బయోటెక్ మరియు టెక్నాలజీ వంటి సేవా పరిశ్రమలు ఉన్నాయి. అందువల్ల మీ వ్యాపారం సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నట్లయితే, అప్పుడు హైదరాబాద్ మీకు మంచి ఆప్షన్ అవుతుంది.
6. చెన్నై
- గతంలో మద్రాసుగా పిలువబడే చెన్నై తమిళనాడు రాజధాని. ఇంగ్లీష్ మాట్లాడే జనాభా కలిగిన 5వ అతిపెద్ద జనాభా కలిగిన నగరం ఇది. చెన్నై తన ఆటో పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది, దేశం యొక్క ఆటో అవసరాలలో సుమారు 30% చెన్నై నుండే వెళతాయి, అలాగే దేశం నుండి 60% ఆటో ఎగుమతులు కూడా ఇక్కడి నుండే జరుగుతాయి. హ్యుందాయ్, ఫోర్డ్, బిఎమ్ డబ్ల్యు మొదలైన ప్రధాన కార్ల తయారీ కంపెనీలు చెన్నైలో ఉన్నాయి.
- కాంపోనెంట్లతో పాటు చెన్నై దేశంలో అతిపెద్ద కార్ల తయారీ నగరంగా అభివృద్ధి చెందుతోంది. భారతీయ రైల్వేల ఇంటిగ్రేటెడ్ కోచ్ కూడా చెన్నైలోనే తయారు చేయబడుతుంది.
- ఇక్కడ టెలికమ్యూనికేషన్ పరిశ్రమతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమ కూడా బలంగా ఉంది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, సిటీ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ వంటి టాప్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లకు ఇక్కడ కార్యాలయాలు ఉన్నాయి.
- చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నగర కేంద్రం నుండి సుమారు 21 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇక్కడ కమర్షియల్ విమానాలు మరియు కార్గో విమానాలు కూడా నడుస్తాయి. ఆటోమోటివ్ మరియు ఇండస్ట్రియల్ ఉత్పత్తులను ఎగుమతి చేసే పోర్టులలో దేశంలోనే చెన్నై సీపోర్ట్ అత్యంత రద్దీగా ఉంటుంది.
- ఐఐటి- మద్రాస్, తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ లాంటివి చెన్నైలోని కొన్ని ప్రధాన సంస్థలు. అలాగే, ఈ నగరం 80% కంటే ఎక్కువ అక్షరాస్యత రేటును కలిగి ఉంది, ఇది ప్రతిభ కలిగిన ఉద్యోగులను పొందడానికి సహాయపడుతుంది. ఇవన్నీ భారతదేశంలో వ్యాపారం చేయడానికి చెన్నై అగ్రశ్రేణి నగరాల జాబితాలో ఉండటానికి మంచి కారణాలు.
7. కోల్కతా
- ఇంతకు ముందు కలకత్తాగా పిలువబడే కోల్కతా పశ్చిమ బెంగాల్ రాజధాని. కోల్కతానిగామా నగరం అని కూడా పిలుస్తుంటారు. పారిశ్రామికీకరణలో ఇటీవలి జరిగిన అభివృద్ధి ఈ జాబితాలో నగరం చోటు సంపాదించడానికి కారణం. ఇది వాణిజ్యపరంగాను మరియు తూర్పు భారతదేశలో ఆర్థిక పరంగాను బలమైన నగరంగా పరిగణించబడుతుంది.
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడం వల్ల తూర్పు భారతదేశం యొక్క అవసరాలను తీర్చడం కొరకు ఎమ్ఎన్ సి లు వచ్చి తమ వ్యాపారాలను స్థాపించడానికి అవకాశం కల్పిస్తుంది. ఐటిసి లిమిటెడ్, బ్రిటానియా లిమిటెడ్ అనే ప్రసిద్ధ కంపెనీలు ఇక్కడ స్థాపించబడ్డాయి. ప్రధాన ఆర్థిక సంస్థలైన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యుసిఒ బ్యాంక్ మొదలైనవి కూడా ఇక్కడి నుండి కార్యకలాపాలను జరుపుతున్నాయి. ఇది జనపనార, చెరకు, మైనింగ్ మరియు ఇతర పరిశ్రమలకు కూడా బాగా ప్రాచుర్యం పొందింది.
- డమ్ డమ్ వద్ద ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కోల్కతా విమానాశ్రయ అవసరాలకు సేవలందిస్తుంది. ఇది నగర కేంద్రం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాల్డియా ఓడరేవు నగరం యొక్క దిగుమతి మరియు ఎగుమతి అవసరాలకు సేవలందించే ప్రధాన నౌకాశ్రయంగా ఉంది.
- ఐఐటి - కలకత్తా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేవి నగరంలోని కొన్ని ముఖ్యమైన సంస్థలు, ఇవి శ్రామిక శక్తి అవసరాలను పూర్తి చేయడానికి ప్రతిభను అందించగలవు. కోల్కతా సహజ వనరులతో నిండి ఉంది అలాగే ఇక్కడ జీవించడం చాలా చవకగా కాబట్టి, నగరం వివిధ వ్యాపార సంస్థలను ఆకర్షించింది.
8. ఇందోర్
- ఇండోర్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద నగరం మరియు వాణిజ్య రాజధాని. నగరంలో ప్రధాన పరిశ్రమలు తయారీ, ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్స్ మరియు టెక్స్ టైల్స్. ఇది పితంపూర్ స్పెషల్ ఎకనామిక్ జోన్, సాన్వర్ ఇండస్ట్రియల్ బెల్ట్ తో సహా ఇతర పారిశ్రామిక భాగాలు, తయారీలో విస్తృతమైన పరిశ్రమను కలిగి ఉంది. 2020లో నిర్వహించిన సర్వే ప్రకారం, ఇండోర్ వివిధ పరామితులను పరిగణనలోకి తీసుకొని భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ర్యాంక్ పొందింది.
- ఐఐఎం- ఇండోర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యాపార అవసరాల కోసం ప్రతిభ మరియు సృజనాత్మకతను అందించగల ప్రతిష్టాత్మక సంస్థలు. ముంబై మరియు ఢిల్లీ మధ్య వ్యూహాత్మక ప్రదేశం కావడం వల్ల, ఐటి, టెక్నాలజీ, ఫ్యాక్టరీ మరియు మిడిల్ ఆఫీస్ ఆపరేటర్ ల్లో వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి ఇది మంచి ప్రదేశం.
- నగర కేంద్రం నుండి 8 కి.మీ దూరంలో ఉన్న దేవి అహిల్యా బాయి హోల్కర్ విమానాశ్రయం ప్రధానంగా ఇండోర్ అలాగే ప్రక్కనే ఉన్న నగరం యొక్క వ్యాపార అవసరాలకు సేవలందిస్తుంది.
- ఇండోర్ నగరం భోపాల్, ఉజ్జయిని, రత్లామ్ మొదలైన వాటిని కలిపే ప్రధాన మరియు చిన్న నగరాలతో అనుసంధానించబడింది. అలాగే, ఇండోర్ నగరం భారతీయ రైల్వే ద్వారా దట్టంగా అనుసంధానించబడింది, ఇది వస్తువులతో పాటు ప్రజల కదలికకు సహాయపడుతుంది.
9. అహ్మదాబాద్
- ఇది గుజరాత్ రాష్ట్రానికి అతిపెద్ద నగరం, వాణిజ్య మరియు ఆర్థిక రాజధాని. మౌలిక సదుపాయాలు, నిర్మాణం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీలో గణనీయమైన అభివృద్ధి కారణంగా అహ్మదాబాద్ కొత్త వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి పెరగడం మరియు ఆర్థిక మూలధన లభ్యత పెరగడం వల్ల, సౌరాష్ట్ర ఇతర రాష్ట్రాలలో పెరుగుతున్న డిమాండ్లను స్వాధీనం చేసుకోటం కారణంగా అనేక వ్యాపార సంస్థలు ఇక్కడికి తరలి వస్తున్నాయ్.
- ఈ నగరం దాని ఫార్మాస్యూటికల్స్ & కెమికల్స్ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది, ఎందుకంటే జైడస్ కాడిలా మరియు టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ ఇక్కడ ఉన్నాయి. నిర్మా మరియు అదానీ గ్రూప్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఈ నగరంలోనే ఉంది.
- దేశంలో డెనిమ్స్ దుస్తులు అహ్మదాబాద్ నుండే ప్రధానంగా ఎగుమతి అవుతాయి. ఈ నగరం జెమ్ స్టోన్ మరియు ఇతర ఆభరణాల ప్రధాన ఎగుమతిదారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్ తో పాటు గాంధీనగర్ నగరంలో వ్యాపార అవసరాలకు సేవలందిస్తుంది. రైలు నెట్వర్క్ లు నగరాన్ని ముంబై, ఢిల్లీ, కోల్ కతా మరియు చెన్నైలకు అనుసంధానిస్తుంది.
- ఐఐఎం-అహ్మదాబాద్, ఎంటర్ ప్రెన్యూర్షిప్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ముద్రా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేవి నగరంలోని కొన్ని ప్రతిష్టాత్మక మరియు గుర్తించదగిన సంస్థలు, ఇది వ్యాపారాలకు ప్రతిభావంతులైన మరియు సృజనాత్మక శ్రామిక శక్తిని అందిస్తుంది. అహ్మదాబాద్ సాంకేతిక మద్దతుతో పాటు విభిన్న సంస్కృతి కలిగిన నగరం.
10. నాగ్పూర్
- నాగ్పూర్ మధ్య భారతదేశంలో అతిపెద్ద నగరం మరియు మహారాష్ట్ర రాష్ట్రంలో జనాభా పరంగా 3 వ అతిపెద్దనగరం. ఈ నగరం మహారాష్ట్రలోని విదర్భల విభాగానికి వాణిజ్య, రాజకీయ మరియు ఆర్థిక కేంద్రంగా ఉంది. ఇది ఆరెంజ్, మామిడి పండ్లకు చాలా ప్రసిద్ధి చెందింది, అయితే, ఈ నగరంలో చాలా వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- మధ్య నాగపూర్ లోని సితాబుల్డి మార్కెట్ నగరానికి నడిబొడ్డున ప్రసిద్ధి చెందింది. ఈ నగరం సింథటిక్ పాలిస్టర్ నూలుకు ప్రసిద్ధి చెందింది. నగరంలో కొరాడి థర్మల్ స్టేషన్ మరియు ఖపర్ఖేడా థర్మల్ స్టేషన్ అని పిలువబడే రెండు థర్మల్ స్టేషన్లు కూడా ఉన్నాయి, ఇది నగరానికి విద్యుత్తును అందిస్తుంది.
- హింగానా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో 900 కు పైగా ఎమ్ఎస్ఎమ్ఈలు ఉన్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో గ్రూపు యొక్క ట్రాక్టర్ తయారీ యూనిట్ ఇక్కడ ఉన్న ప్రధాన తయారీ యూనిట్లు. డ్రై ఫుడ్ తయారీదారు హల్దీరామ్ మరియు ఆయుర్వేద ఉత్పత్తుల కంపెనీ విక్కో ఈ నగరంలో ఉన్నాయి.
- నగరంలో మల్టీమోడల్ కార్గో హబ్ మరియు విమానాశ్రయం కూడా ఉంది, ఇది నాగ్పూర్ లో వ్యాపారాన్ని స్థాపించడానికి తయారీ సంస్థలకు కాస్త సులభం.
- ఐఐటి- నాగ్పూర్, ఐఐఎం- నాగ్పూర్ లు నగరంలోని కొన్ని ప్రతిష్టాత్మక మరియు గుర్తించదగిన సంస్థలు, ఇవి వ్యాపార అవసరాల కోసం ఉత్తమ విద్యార్థులకు శిక్షణ ఇస్తాయి.
ఇప్పుడు బోనస్ గా మరొక రెండు నగరాల గురించి తెలుసుకుందాం!
11. సూరత్
- గుజరాత్ లోని ఈ పెద్ద నగరంలో వ్యాపారం చేయడం చాలా సులభం. నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, సూరత్ అత్యధిక జిడిపి వృద్ధి రేటు 11.5% కలిగి ఉంది. అలాగే ఇది ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. సూరత్ ను భారతదేశం యొక్క డైమండ్ రాజధాని అని కూడా పిలుస్తారు, ఇక్కడ ప్రపంచంలోని 92% వజ్రాలు ప్రాసెస్ చేయబడి అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. పాలిషింగ్ మరియు కట్టింగ్ చాలా వరకు చిన్న రాళ్లకే పరిమితం అయినప్పటికీ, త్వరలో పెద్ద రాళ్లతో కూడా వ్యాపారం చేయడానికి వ్యాపారాలు యోచిస్తున్నాయి.
- సూరత్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇతర పరిశ్రమ టెక్స్ టైల్ మరియు సిల్క్ ఉత్పత్తి. సూరత్ లో పురాతన వ్యాపారం జెఎఆర్ఐ అని ఒకటి ఉంది, ఇక్కడ 80000 కంటే ఎక్కువ ఎంబ్రాయిడరీ యంత్రాలను పనిచేస్తుంటాయి. ఈ ప్రదేశంలో ఉన్న ఇతర పరిశ్రమలు ఎస్సార్, ఎల్ అండ్ టి ఇంజనీరింగ్ మరియు రిలయన్స్ పెట్రోకెమికల్.
- సూరత్ నుండి రోడ్డు మార్గాలు భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలకు అనుసంధానించబడ్డాయి. అలాగే న్యూ ఎక్స్ ప్రెస్ వే కూడా నిర్మించబడింది. సూరత్ రైల్వే స్టేషన్ భారతదేశంలోని ఇతర నగరాలు మరియు రాష్ట్రాలకు అనుసంధానించే ప్రధాన స్టేషన్లలో ఒకటి. అహ్మదాబాద్ తరువాత గుజరాత్ లో సూరత్ విమానాశ్రయం 2వ రద్దీ విమానాశ్రయం. ఈ నగరంలో ఒక సీపోర్ట్ కూడా ఉంది.
12. జైపూర్
- జైపూర్ నగరం 17 వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది. ఇది పురాతన వాటిలో ఒకటి. బనాస్ మరియు బంగంగా నది నగరం గుండా వెళుతుంది. జైపూర్ లో జూన్ మరియు సెప్టెంబర్ నెలలో వర్షా కాలం. ఇక్కడి వాతావరణం వేడిగా పాక్షిక శుష్క వాతావరణం. జైపూర్ దాని ప్రీ-మోడరన్ ఆర్కిటెక్చర్ కు ప్రసిద్ధి చెందింది. దీని పింక్ నగరం అని కూడా పిలుస్తారు, దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, ఒకప్పుడు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కు స్వాగతం పలకడానికి మొత్తం నగరం పింక్ రంగులో పెయింట్ చేయబడింది.
- నగరంలో ప్రధాన పరిశ్రమలు లోహాలు మరియు మార్బల్. ఈ నగరం ఆధునిక అలాగే సాంప్రదాయ పరిశ్రమలకు ప్రధాన కేంద్రం. జెన్ పాక్ట్, ఇన్ఫోసిస్ వంటి సేవా పరిశ్రమలకు నగరంలో వారి బిపిఒ కార్యాలయాలు ఉన్నాయి. నగరంలోని కొన్ని ప్రసిద్ధ కంపెనీలు ఐబిఎమ్, కోకా కోలా, టిసిఎస్, విప్రో, టెక్ మహీంద్రా. మహీంద్రా వరల్డ్ సిటీగా పిలువబడే సిటీ భారతదేశపు అతిపెద్ద ఐటి సెజ్ జైపూర్ లో ఉంది.
- జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నగరంలో ప్రయాణ అవసరాలతో పాటు రవాణా అవసరాలకు సేవలందించే ప్రాథమిక విమానాశ్రయం. జైపూర్ సమీకృత రోడ్డు మార్గాలతో పాటు భారతదేశంలోని ప్రధాన నగరాలను కలిపే రైల్వేలతో బాగా అనుసంధానించబడింది.
మీ వ్యాపారానికి సరిపోయే నగరాన్ని ఎంచుకోండి
ఘజియాబాద్, నోయిడా, విశాఖపట్నం వంటి అనేక ఇతర నగరాలు కూడా ఉన్నాయి, ఇవి వారి స్వంత నిర్దిష్ట పరిశ్రమలలో ప్రత్యేకత పొందినవి. వ్యాపారాలు తమ తమ నగరాల్లోని ప్రజల అవసరాలను అర్థం చేసుకొని వారి సమస్యలను తీర్చగలగాలి. ఉత్పత్తులు, కార్మిక శక్తి, ముడి పదార్థాలు, వినియోగదారులు, మార్కెట్ డైనమిక్స్, నగరంలో ఎదురయ్యే సవాళ్లు వంటి అనేక కీలక విషయాలను పరిగణనలోకి తీసుకొని దానిని బట్టి అడుగులు వేయాలి, అప్పుడే సంస్థ యొక్క భవిష్యత్తు వృద్ధి మరియు త్వరలో రాబోయే అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యం అవుతుంది.
కంపెనీ యొక్క కీలక సామర్థ్యాలు మరియు బలంతో పాటు నగరంలో ప్రస్తుతం ఉన్న పర్యావరణ వ్యవస్థను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకొని అడుగులు వేయాల్సి ఉంటుంది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సరిపోయే వ్యాపారాన్ని ఏర్పాటు చేయడం మంచిది. వ్యాపారాలు కంపెనీ యొక్క ఆవశ్యకతకు అనుగుణంగా విభిన్న నగరాల్లో విభిన్న బిజినెస్ వర్టికల్ లను ఏర్పాటు చేయవచ్చు. లభ్యం అవుతున్న వనరులను ఉత్తమంగా ఉపయోగించుకోవాలి. ఇది భారతదేశంలో వ్యాపారం చేయడానికి అగ్రశ్రేణి నగరాల్లో వ్యాపారాన్ని కలిగి ఉండటానికి కూడా అన్ని విధాలా మంచిది.
దీనిని కూడా చదవండి: మీ సొంత బేకరీ తెరవడం ఎలా?
తరచుగా అడిగే ప్రశ్నలు
వ్యాపారాన్ని నిర్వహించడానికి మీరు నగరాలను ఎలా ఎంచుకోవాలి?
వ్యాపారాలు తమకు అవసరమైన వనరుల రకం, మూలధనం, వారి ఉత్పత్తులు మరియు సేవల ఆధారంగా మానవ శక్తి ఎంత కావాలనే విషయాలపై స్పష్టమైన క్లారిటీ కలిగి ఉండాలి. ఈ విషయాల ఆధారంగా, వ్యాపారాలు తమ అవసరాలకు సరిపోయే నగరాలను షార్ట్ లిస్ట్ చేయాలి. అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆప్షన్ ఎంచుకోండి. అదేవిధంగా, ఎదుగుదలను తెలుసుకోవడం కొరకు భవిష్యత్తు అవకాశాలను అలోచించి లొకేషన్ ని నిర్ణయించాలి.
తయారీ యూనిట్లను స్థాపించడానికి అత్యుత్తమ నగరం ఏది?
తయారీ యూనిట్ కొరకు, రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా ఉండి ప్రతిభావంతులైన శ్రామిక శక్తి అందుబాటులో ఉన్న నగరాన్ని ఎన్నుకోవాలి. కాబట్టి దాని ఆధారంగా చెన్నై, నాగపూర్ లేదా కోల్కతా మంచి ఎంపికలు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి అత్యుత్తమ నగరం ఏది?
మౌలిక సదుపాయాలు, మూలధనం, వనరులు అదేవిధంగా ప్రతిభావంతులైన శ్రామిక శక్తి లభ్యత కారణంగా భారతదేశం యొక్క సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరు ఈ రకమైన వ్యాపారానికి ఉత్తమమైనది, తరువాత పూణే మరియు హైదరాబాద్ నగరాలను పరిగణలోకి తీసుకోవచ్చు.
ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లు లేదా కన్సల్టెంట్ లకు అత్యుత్తమ నగరం ఏది?
ముంబై భారత ఆర్థిక రాజధాని, అలాగే బిఎస్ఇ, అలాగే ఎన్ఎస్ఈ ముంబైలో ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు మరియు కన్సల్టెంట్లకు ఇది సరైన నగరం.
ముంబైలో వ్యాపారాలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి?
పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలు. ప్రత్యామ్నాయంగా పూణేలో వ్యాపారం చేయవచ్చు. అవసరమైనప్పుడు ముంబైకి వెళ్లి పని చేయడానికి ముంబై-పూణే ఎక్సప్రెస్ వె ఎలాగో ఉంది. కానీ మరొక ప్రధాన సవాలు అక్కడి జనాభా, కాకపోతే దీని కారణంగా ప్రతిభావంతులైన శ్రామిక శక్తిని పొందడం సులభం.