2017లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు, దేశమంతటా విస్తృతమైన అనిశ్చితి నెలకొంది. ఆనాటి నుండి గూడ్స్ లేదా సేవలు అందించే వ్యాపారాలు GST రిజిస్ట్రేషన్ ప్రక్రయనుప్రారంభిచాల్సి వచ్చింది.
GST ప్రవేశపెట్టిన తరువాత, ఒకప్పటి VAT లేదా సర్వీస్ ట్యాక్స్ ప్రక్రియ సమూలంగా తొలగించబడింది, కాబట్టి GSTలో ఉండే వేరు వేరు స్లాబులు, మరియు ఇతర ముఖ్యమైన విషయాలు, అంటే. ఆన్లైన్లో GST రిజిస్ట్రేషన్ చేసుకోవడం, GST రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన పత్రాల గురించి, GST నియమ నిభందనలు, GST సర్టిఫికెట్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే GST రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి అనే వివిధ విషయాలను తెలుసుకోడం చాల ముఖ్యం. ఈ ఆర్టికల్‌లో వాటి గురించి తెలుసుకుందాం.
GST రిజిస్ట్రేషన్‌ను ఆన్లైన్లోనే పూర్తీచేయాలా
క్రింద పేర్కొనబడిన వ్యక్తులు, వ్యాపారాలు తమ GST రిజిస్ట్రేషన్‌ను ఆన్లైన్లో పూర్తిచేయాలి:
- TDS కట్టవలసిన లేదా TCS పొందవలసిన వ్యాపారాలు మరియు ప్రజలు
- అంతర్ రాష్ట్ర సరఫరాలు జరిపే పన్ను చెల్లింపుదారులు
- పన్ను చెల్లిచవలసిన సేవలు, వస్తువులను సరఫరా చేసే వ్యక్తులు
- ఇతర నమోదైన పన్ను చెల్లింపుదారుల తరపున సరఫరా చేసే ఏజెంట్లు
- వ్యాపారం చేతులు మరీనా పక్షాన, క్రొత్త వ్యాపార యజమానులు లేదా పాత యజమానులు కాలం చేసిన తర్వాత వ్యాపారాన్ని చేజిక్కించుకున్న యజమానులు
- రివర్స్ ఛార్జ్ మెకానిజం క్రిందకు వచ్చే వ్యక్తులు
- ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్లు
- నిర్ణిత పరిమితిని మించి వార్షిక టర్నోవర్ ఉన్న సేవలు లేదా వస్తువుల సరఫరాదారులు
- గూడ్స్ లేదా సర్వీసులను సరఫరా చేసే నాన్ రెసిడెంట్ పౌరులు
- ఆన్లైన్ ఈ-కామర్స్ పోర్టల్ ఆపరేటర్లు మరియు సరఫరాదారులు
- దౌత్యకార్యాలయాలు మరియు UN సంస్థలు
- ఇతర గుర్తించబడిన అధికారిక సంస్థలు. ప్రభుత్వ సంస్థలు సహా
GST రిజిస్ట్రేషన్ కొరకు కావాల్సిన పత్రాలు
GST రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన కొన్ని ముఖ్యమైన పత్రాలు:
- చెల్లుబాటు అయ్యే PAN కార్డు నంబర్
- వ్యాపార స్థాపన ధృవీకరణ
- వ్యాపారం నడిచే ప్రాధమిక ప్రదేశానికి ధ్రువీకరణ
- సంబంధిత అధికారి చేత సంతకం చేయబడిన నియామక ధ్రువీకరణ పత్రం
- అధికారిక సంతకం ఉన్న భాగస్వాముల ఫోటోలు
పైన పేర్కొన్న పత్రాలతో పాటుగా, వేయు వేరు వ్యక్తులు, లేదా సంస్థలు అవసరాన్ని బట్టి కొన్ని డాక్యూమెంట్లను సమర్పించవలసి ఉంటుంది.
సాధారణ పన్ను చెల్లింపుదారులు GST రిజిస్ట్రేషన్ చేయించుకొని విధానం
1వ అడుగు: GST వెబ్సైటుకు వెళ్ళండి. 2వ అడుగు: Services మీద నొక్కి, Registrationకు వెళ్ళండి, అక్కడ New Registration అనే ఎంపిక మీద నొక్కండి. 3వ అడుగు: అక్కడ మీరు GST రిజిస్ట్రేషన్ కోసం కావలసిన ధరఖాస్తును చూడగలుగుతారు. ఆ దరఖాస్తులో Part A లో అవసరమైన విషయాలను నింపి, "Proceed" మీద నొక్కండి. 4వ అడుగు: మీ ఫోన్ లేదా ఇమెయిల్‌కు వచ్చే ఓటిపి నంబర్‌ను అక్కడ ఎంటర్ చేయండి. 5వ అడుగు: మీరు మీ దరఖాస్తును ధృవీకరించిన తర్వాత, మీ GST రిజిస్ట్రేషన్‌లో Part A పూర్తయినట్టే. ఆ సిస్టమ్ మీకోసం ఆటోమేటిక్‌గా ఒక టెంపరరీ రిఫరెన్స్ నంబర్ (TRN)ను జెనెరేట్ చేస్తుంది. ఈ TRN, GST రిజిస్ట్రేషన్ పూర్తవడానికి 15 రోజులు పడుతుంది కాబట్టి అప్పటివరకు చెల్లుతుంది.
6వ అడుగు: ఇక్కడ GST ఫామ్‌లో ఉండే Part B గురించి తెలుసుకుందాం. మీరు "My Saved Application" అనే ఎంపిక మీద నొక్కి, Part Bని తెరవగలరు. ఇక్కడ మీ TRN నంబర్ మరియు సంబంధిత క్యాప్చ్ పదాలను ఎంటర్ చేయండి.
7వ అడుగు: ఒకసారి మీరు "Proceed" మీద నొక్కితే, మీరు వెరిఫికేషన్ పేజీకి వెళ్తారు. అక్కడ మీ ఫోన్ లేదా ఇమెయిల్ అడ్రెస్‌కి వచ్చే OTP నంబర్ ఎంటర్ చేయండి.
8వ అడుగు: అక్కడ మీరు My Saved Applications పేజీని చూస్తారు. ఆ పేజీలో Action అనే వరుసకు వెళ్లి, Edit ఐకాన్ మీద నొక్కండి.
9వ అడుగు: క్రింద ఇవ్వబడిన ట్యాబ్స్‌తో మీ GST రిజిస్ట్రేషన్ ఫామ్ కనిపిస్తుంది. ప్రతీ ట్యాబ్‌కు వెళ్లి సంబంధిత వివరాలను నింపవలసి ఉంటుంది. వాటిలో ముఖ్యమైన ట్యాబులను మేము ఇక్కడ చేర్చాము:
- బిజినెస్ వివరాలు
- ప్రమోటర్ లేదా భాగస్వామి
- అధికారిక సంతకం
- అధికారిక ప్రతినిధి
- వ్యాపారం నడిచే ప్రాధమిక ప్రదేశం
- వస్తువులు మరియు సేవలు
- బ్యాంక్ అకౌంట్లు
- రాష్ట్ర నిర్దిష్ట సమాచారం
10వ అడుగు: మీరు మీ GST రిజిస్ట్రేషన్‌ను విజయవంతంగా వెరిఫై చేసిన తర్వాత, 15 నిమిషాలలో మీ ఇమెయిల్‌కు మరియు మొబైల్ నంబర్‌కు గుర్తింపు మెయిలు వస్తుంది. అంతే కాకుండా, మీ అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ (ARN) పత్రాన్ని మీ ఇమెయిల్ మరియు ఫోన్ నంబర్‌కు పంపించబడుతుంది.
GST రిజిస్ట్రేషన్ స్థితిని చూడడం ఎలా?
1వ అడుగు: ఆన్లైన్ GST పోర్టల్‌కు వెళ్ళండి. 2వ అడుగు: Services మీద క్లిక్ చేసి, Registrationకు వెళ్లి, Track Application Statusను ఎంచుకోండి. 3వ అడుగు: ARN బట్టన్‌ను ఎంచుకోండి. తర్వాత GST కోసం రెజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీకు ఇమెయిల్‌లో వచ్చిన ARN నంబర్‌ను నమోదు చేయండి. అక్కడ ఉన్న క్యాప్చ పదాలను ఎంటర్ చేసి, GST అప్లికేషన్ స్థితిని తెలుసుకోవడానికి "Search" మీద నొక్కండి. తర్వాత క్రింద చూపించబడిన వాటిలో ఒక స్థితిని అక్కడ చూస్తారు:
- ప్రొవిజనల్: తాత్కాలిక GST ID మంజూరు చేయబడింది, కానీ రిజిస్ట్రేషన్ ఇంకా పూర్తి కాలేదు.
- వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంది: GST కొరకు ధరఖాస్తు చేయబడింది, కానీ ఇంకా ఆమోదించబడలేదు.
- ధ్రువీకరణ సమస్య: నమోదు చేయబడిన PAN వివరాలు IT డిపార్ట్మెంట్ వారి దగ్గర ఉన్న వివరాలతో సరిపోలలేదు.
- మైగ్రేటెడ్: GST విజయవంతంగా మైగ్రేట్ చేయబడింది.
- రద్దు చేయబడింది: GST రిజిస్ట్రేషన్ రద్దు చేయబడింది
ఒకవేళ GST రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయకపోతే ఏమవుతుంది?
- GST సర్టిఫికెట్ చేసుకోవడంలో విఫలమైన వారు, తమ ట్యాక్స్ మొత్తంలో 10% లేదా రూ. 10,000 జరిమానా, ఏది ఎక్కువైతే అది, చెల్లించవలసి ఉంటుంది.
- కావాలని వంచన చేయాలనే ఉద్దేశంతో GST సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ పూర్తిచేయకుండా విఫలమైన వారిని గుర్తించిన పక్షాన, జరిమానా ట్యాక్స్ కట్టవలసిన మొత్తంలో 100% వరకు విధించబడవచ్చు.
GST సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
GST రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసిన పన్ను చెల్లింపుదారులు క్రింది విధంగా తమ GST సర్టిఫికెట్‌ను పొందగలరు.
1వ అడుగు:GST పోర్టల్‌కు వెళ్లి లాగిన్ చేయండి
2వ అడుగు:Services మెనూ మీద నొక్కండి, User Servicesను ఎంచుకొని, View/Download Certificate ఎంపికను ఎంచుకోండి.
3వ అడుగు: GST సర్టిఫికెట్ కోసం మీరు REG-06 ఫామ్‌ను చూడవచ్చు. అక్కడి నుండి GST సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ ఎంపికను ఎంచుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు, అనగా వ్యాపారం పేరు, అడ్రెస్, రిజిస్ట్రేషన్ తేదీ, మరియు GST ఐడెంటిఫికేషన్ నంబర్ (GSTIN) లాంటివి అన్నీ ఈ సర్టిఫికెట్లో ఉంటాయి.