written by khatabook | September 3, 2020

GST ఇన్వాయిస్ ఎక్సెల్ - మీ కంప్యూటర్ నుండే GST అర్హమైన ఇన్వాయిస్‌లను తయారు చేయండి

చాలా ఏళ్ల క్రితం, 2000 సంవత్సరంలో, అటల్ బిహారి వాజ్పాయి గారి ప్రభుత్వం, దేశమంతటా వర్తించే ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చూసింది. ఎన్నో సంవత్సరాల జాప్యం తర్వాత, సెప్టెంబర్ 8, 2016 సంవత్సరంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) బిల్లును ఆమోదించి, 10 నెలల తర్వాత, జులై, 2017 సంవత్సరంలో పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకువచ్చారు. బిల్లు అమలులోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు, దేశంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి అని అనడం అతిశయోక్తి కాదు.

దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల పన్నులకు బదులు, దేశమంతటా వర్తించగల ఒక ట్యాక్స్ చట్టాన్ని తీసుకువచ్చే ట్యాక్స్ స్కీమును ప్రవేశపెట్టి, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం ఆలోచించింది. GST కారణంగా ఉన్న లాభాలు ఏమిటంటే, వివిధమైన పరోక్ష పన్నులను నిర్ములించి, బదులుగా అన్నిటికి ఒకే ప్రామాణిక గల పన్నును ప్రవేశపెట్టడం. సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్ససైజ్, వేల్యూ-యాడెడ్ ట్యాక్స్ (VAT), ఎంట్రీ ట్యాక్స్, వినోద పన్ను, మొదలైన పనులన్ని పోయి, వాటి ప్రదేశంలో GST అనే ఒక్క ట్యాక్స్ మాత్రమే వర్తిస్తుంది.

GST అమలు చేయడం వల్ల ఉండే లాభం ఇంకొకటి ఏమిటంటే, బోలెడన్ని ట్యాక్సుల కారణంగా ఎదురయ్యే ట్యాక్స్ ఎగవేతను అరికట్టి, ట్యాక్స్ అవినీతిని తగ్గించడం వీలవుతుంది.

GST కోసం రిజిస్టర్ చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు

మీరు రిజిస్టర్ చేసుకోవాలో వద్దో అనే సందేహంలో ఉంటే, ఈ కింది కేటగిరీలలోకి వస్తారో లేదో చూసుకోండి.

 • మీరు ఎక్ససైజ్, VAT లేదా సర్వీస్ ట్యాక్స్ చెల్లించే వ్యక్తి.
 • ఏడాదికి రూ. 40 లక్షలకు మించి వ్యాపారం చేసే బిజినెస్.
 • ఒక సాధారణ ట్యాక్స్ చెల్లించే వ్యక్తి.
 • ఏజెంట్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు.
 • ఈ-కామర్స్ సంస్థలు.
 • రివర్స్ ఛార్జ్ మెకానిజం మీద ఆధారపడే ట్యాక్స్ చెల్లింపుదారులు.

ఆన్‌లైన్ GST పోర్టల్‌ను GST వ్యవస్థఅందించే వివిధ కార్యకమాలను అందుకోవడానికి మరియు అన్ని ట్యాక్స్ కార్యకలాపాలను ఒకే చోట జరిగించాలి అనే లక్ష్యంతో నిర్మించడం జరిగింది. GST పోర్టల్ సహాయంతో అధికారులు ప్రతీ ట్యాక్స్ రికార్డును పరిశీలించడానికి వీలవుతుంది, అదే సమయంలో పన్ను చెల్లింపు దారులు, తమ ఆన్లైన్‌లో రిటర్న్‌లను ఫైల్ చేయడానికి మరియు చూసుకోవడానికి వీలవుతుంది.

GST పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ అనేది ఒకసారి మాత్రమే చేసే పని. అధికారిక ట్యాక్స్ ఏజెన్సీ మరియు సాధారణ ట్యాక్స్ చెల్లింపుదారులు మధ్య ఉన్న దూరాన్ని తొలగిచడం దాని ప్రధాన ఉద్దేశం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ (GSTN), ఈ పోర్టల్‌కు వెన్నెముకగా నిలిచి, సంక్లిష్టమైన మరియు అధునాతనమైన ఈ నెట్వర్క్‌ను ఆన్‌లైన్‌లో మైంటైన్ చేస్తూ, భారత ప్రభుత్వానికి, మరియు పన్ను చెల్లింపుదారులు అవసరమైన కంప్యూటింగ్ శక్తిని అందించి, ఒకరితో ఒకరు పరస్పరం అందుబాటులో ఉండడానికి సహాయపడుతుంది.

మీ GST ఫైలింగ్స్‌ ప్రక్రియను సులభం చేయడానికి GST పోర్టల్‌లో అనేకమైన సర్వీసులు అందించబడుతున్నాయి. వాటిలో కొన్నిటిని కింద పేర్కొన్నాము.

 • GST కోసం రిజిస్ట్రేషన్.
 • GST స్కీము కోసం అప్లికేషన్.
 • కాంపోజిషన్ స్కీములో పాల్గొనడం లేదా నుండి బయటకు రావడం.
 • GST రిటర్న్స్ ఫైల్ చేయడం.
 • GST చెల్లింపులు.
 • ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు (ITC) సంబంధించిన ఫార్మ్స్ ఫైల్ చేయడం.
 • అందుకున్న నోటీసులను ట్రాక్ చేయడం.
 • GST రిఫండ్ కోసం ఫైల్ చేయడం.
 • వేర్వేరు మార్పులు చేయడానికి అవసరమయ్యే ఫార్మ్స్‌లను ఫైల్ చేయడం.
 • నింపిన సమాచారాన్ని సరిచేయడం లేదా మార్చడం.

GST పోర్టల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, ఎప్పటి నుండో పేపర్ డాక్యూమెంట్ల సహాయంతో నడిపించబడ్డ అనేక కార్యక్రమాలు డిజిటల్ రూపాన్ని సంతరించుకున్నాయి.

GST అర్హమైన ఇన్వాయిస్‌లు అంటే ఏమిటి?

GST కిందకు వచ్చే వ్యాపారాన్ని మీరు నడిపిస్తున్నట్లు అయితే, మీరు కొనుగోలుదారులకు GST ఇన్వాయిస్‌ను ఇవ్వవలసి ఉంటుంది. కంపొజిషన్ స్కీము కింద నమోదు చేయబడిన వ్యాపారాలు బిల్ ఆఫ్ సప్లైను ఇవ్వవలసి ఉంటుంది. సప్లై చేయబడ్డ వస్తువు లేదా, ఉత్పత్తి గుణాన్ని బట్టి, మూడు ఇన్వాయిస్‌లు ఉంటాయి.

ఇంట్రా-స్టేట్ ఇన్వాయిస్

ఆయా రాష్ట్రాలలో రిజిస్టర్ చేయబడ్డ వ్యాపారం నుండి సప్లై చేయబడ్డ ఉత్పత్తికి ఈ ఇన్వాయిస్‌ను ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఇన్వాయిస్ పైన CGST మరియు SGST కూడా వసూలు చేయబడతాయి.

అంతర్-రాష్ట్ర ఇన్వాయిస్

ఇది రెండు వేరు వేరు రాష్ట్రాలలో ఉన్న వ్యాపారి, కొనుగోలు దారు మధ్య లావాదేవీ జరిగినప్పుడు అవసరం అవుతుంది. ఈ ఇన్వాయిస్ పై IGST వసూలు చేయబడుతుంది.

ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్

ఇతర దేశాలకు సప్లై చేయబడినప్పుడు ఇది అవసరం

GST ఇన్వాయిస్ తయారు చేయడానికి నియమాలు

ప్రభుత్వం ప్రకారం, సెక్షన్ 31లో చూపించిన విధంగా, కేవలం రిజిస్టర్ చేయబడ్డ వ్యక్తి మాత్రమే ఇన్వాయిస్‌ను జారీ చేయాలి, అదే సమయంలో ఆ ఇన్వాయిస్‌లో కింద పేర్కొన్న సమాచారం ఉండాలి.

 • పేరు, అడ్రస్ మరియు సప్లయర్ యొక్క GSTIN.
 • ట్యాక్స్ చెల్లించే వ్యక్తి పేరు, అడ్రెస్ మరియు GSTIN (రిజిస్టర్ చేయబడినట్లు అయితే).
 • ట్యాక్స్ చెల్లించే వ్యక్తి పేరు, అడ్రెస్ మరియు డెలివరీ అడ్రెస్. అలాగే, రాష్ట్రము పేరు మరియు సంబంధిత రాష్ట్ర కోడ్.
 • గూడ్స్ లేదా సర్వీస్ యొక్క వివరణ.
 • జారీ చేయబడిన తేదీ.
 • పరిమాణం, గూడ్స్ అయినట్లైయితే.
 • ఆ సర్వీసు లేదా గూడ్స్ యొక్క GST రేటు.
 • ఆ సర్వీసు లేదా గూడ్స్ పై ట్యాక్స్ మొత్తం.
 • గూడ్స్ లేదా సర్వీసు యొక్క పూర్తీ మొత్తం.
 • హార్మోనైజ్డ్ సిస్టం ఆఫ్ నామెన్‌క్లేచర్ (HSN) కోడ్ లేదా అకౌంటింగ్ కోడ్ ఆఫ్ సర్వీస్.
 • సరఫరా చేయబడిన ప్రదేశం మరియు రాష్ట్రము యొక్క పేరు.
 • ట్యాక్స్ చెల్లింపు ఆధారంగా రివర్స్ ఛార్జి.
 • అధికారిక సరఫరాదారుని ప్రతినిధి యొక్క డిజిటల్ సంతకం.

ఎక్సెల్‌లో GST ఇన్వాయిస్ ఫార్మాట్

GST ఇన్వాయిస్‌లో అయిదు సెక్షన్లు ఉంటాయి:

                                                                                                                 

హెడర్ సెక్షన్

వ్యాపారం పేరు, అడ్రెస్, లోగో మరియు GSTIN.

కస్టమర్ వివరాల సెక్షన్

కస్టమర్ పేరు, అడ్రెస్, GSTIN, ఇన్వాయిస్ నంబర్, మరియు ఇన్వాయిస్ తేదీని నమోదు చేయాలి.

ఉత్పత్తి మరియు ట్యాక్స్ వివరాల సెక్షన్

ఉత్పత్తి యొక్క వివరణ, HSE/SAC కోడ్స్, పరిమాణ, యూనిట్లు, డిస్కౌంట్లు, CGST, SGST, మరియు IGST రేట్లు.

బిల్లు వివరణ సెక్షన్

కస్టమర్ చెల్లించవలసిన మొత్తాన్ని ఇక్కడ పేర్కొనాలి. CGST, SGST మరియు IGST మొత్తం, ట్యాక్స్ చెల్లించవలసిన మొత్తం, పూర్తి సేల్ మొత్తం మరియు ఫైనల్ ఇన్వాయిస్ మొత్తం అన్నీ ఆటోమేటిక్‌గా లెక్కించబడతాయి.

సంతకం సెక్షన్

ఈ విభాగంలో ఇతర సూచనలతో పాటు రిసీవర్ మరియు అకౌంటెంట్ సంతకాలు ఉంటాయి."

ఈ ఎక్సెల్ ఇన్వాయిస్ టెంప్లేట్ల యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు మొదటి నుండి మీ సొంత GST ఇన్వాయిస్‌ను తయారు చేయవలసిన అవసరం లేదు. GST ఇన్వాయిస్‌ల కోసం ఎక్సెల్ టెంప్లేట్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ఆన్‌లైన్‌లో లింకులు అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు ఉచితంగా ఉపయోగించవచ్చు. వాటిలో ఉన్న నాలుగు ప్రధాన రకాలు: స్టాండర్డ్ ఫార్మాట్, టాక్స్ బ్రేకప్, టాక్స్ మరియు IGST ఫార్మాట్.

ఎక్సెల్‌లో GST ఇన్వాయిస్ ఫార్మాట్ ఇంకొక అడుగు ముందుకేసి, మీ ట్యాక్స్ బ్రేక్-అప్ కోసం ఒక ఫార్ములాతో నిర్మించబడి ఉంటుంది. దీని సహాయంతో మీరు ఇచ్చిన డిస్కౌంట్, ట్యాక్స్ వివరాలు లెక్కించడానికి వీలవుతుంది. ఒకవేళ ఇవి గనుక సరిపోకపోతే, మీరు మరిన్ని జోడించడానికి వీలవుతుంది.

mail-box-lead-generation

Got a question ?

Let us know and we'll get you the answers

Please leave your name and phone number and we'll be happy to email you with information

Related Posts

None

ఎక్సెల్ మరియు వర్డ్ లో జాబ్ వర్క్ కొరకు డెలివరీ చలాన్ ఫార్మెట్


None

మన దేశంలో ఉన్న వివిధ రకాల GST - SST, CGST, IGST మధ్య తేడా ఏంటి?


None

మీరు ఒక సర్టిఫైడ్ GST ప్రాక్టీషనర్ ఎలా అవ్వగలరు?


None

ఈ-వె బిల్లు అంటే ఏమిటి? ఈ-వె బిల్లును జనరేట్ చేయడం ఎలా?


None

GST నంబర్: ప్రతీ వ్యాపారానికి కావాల్సిన 15 అంకెల నంబర్

1 min read

None

GST ఇన్వాయిస్ ఎక్సెల్ - మీ కంప్యూటర్ నుండే GST అర్హమైన ఇన్వాయిస్‌లను తయారు చేయండి

1 min read

None

డిజిటల్ పేమెంట్స్ చిన్న వ్యాపారులకు వరంగా ఎలా మారాయి?

1 min read

None

చాలా తక్కువ పెట్టుబడితో 2021లో నడిపించగల 15 ఆన్‌లైన్ వ్యాపారాలు

1 min read

None

MahaGST – మహారాష్ట్రలో GST కోసం ఆన్‌లైన్ పోర్టల్

1 min read