written by | October 11, 2021

డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ

×

Table of Content


డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఏర్పాటు చేయడం ఎలా?

ప్రపంచ టెక్నాలజీని మన అరచేతిలో చిన్న స్మార్ట్ ఫోన్లో వీక్షిస్తున్నాం. చిన్నపిల్లనుండి సుపైబడినవారి వరుకు ప్రతి ఒక్కరూ కు కావాల్సిన సమాచారం కోసం సెర్చ్ ఇంజిన్ని ఉపయోగిస్తున్నారు. ఇలా ఇంటర్నెట్ని వాడే యంలో బయట చేసే మార్కెటింగ్ను ఇంటర్నెట్ ద్వారా చేస్తే అదే డిజిటల్ మార్కెటింగ్. ఆన్లైన్లో ప్రొడక్ట్స్ మార్కెటింగ్ చేసేవాళ్ళకి , తమ కంపెనీల బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకోవాలనుకునే వాళ్లకి డిజిటల్ మార్కెటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్కి పూర్తి భిన్నం. ఇంతకు ముందు టీవీ, రేడియోలలో ప్రలు ఇచ్చేవారు. ఇవి చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. అయితే ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్, సోషల్ మీడియాల ద్వారా యాడ్స్ ఇస్తున్నారు. దీనితోపాటు మనం ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటున్నామో వారికి మాత్రమే మన సమాచారం చేరేలా డిజిటల్ మార్కెటింగ్ సహాయపడుతుంది. తక్కువ టైములో ఎక్కువ మంది కస్టమర్స్ ని రీచ్ అయ్యేలా చేసేదే డిజిటల్ మార్కెటింగ్. అయితే మనలో చాలా మందికి తలెత్తే ప్రశ్న, డిజిటల్ మార్కెటింగ్ ఎవరు చేయొచ్చు? ఎవరికి ఉపయోగం? అసలు నేను అర్హుడునా? అని అనుకుంటారు. ఇది ఎవరైనా చేయొచ్చు. విద్యార్థులు దీనిని కెరియర్గా తీసుకోవచ్చు, మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్నట్లయితే పార్ట్ టైంగా వ్యాపకాన్ని చేసుకోవచ్చు, లేక మీ సొంత బిజినెస్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు

చాలా విషయాల్లో మీకు డిజిటల్ మార్కెటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ప్రకటనదారులను వయస్సు, లింగం, ఆసక్తికీలకపదాలు, వెబ్సైట్లు, నగరం, పిన్ కోడ్ మొదలైన వాటితో సహా ఖచ్చితంగా ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకోవడానికి అనుమతిస్తుంది. సాంప్రదాయ మాధ్యమాలతో పోలిస్తే ఇది చాలా ఖచ్చితమైనది. డిజిటల్ మార్కెటింగ్ అనేది వారి వినియోగదారులతో నెక్ట్ కావడానికి వివిధ బ్రాండ్లకు సహాయపడుతుంది, ఇది సోషల్ మీడియా ద్వారా నిజ సమయ ప్రాతిపదికన వినియోగదారులతో సంభాషించడానికి సహాయపడుతుంది. బ్రాండ్లు నిజ సమయంలో వినియోగదారులతో కనెక్ట్ అవుతాయి. డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని మోడ్యూల్స్ ఉన్నాయి. అందులో మీకు ఏది రిలేటెడ్గా ఉంటుందో అది చేస్తే మీరు కూడా నెలకి వేలల్లో సంపాదించుకోవచ్చు. మరి డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే క్రింద పేర్కొన్న ది విషయాలపై అవగాహన లిగి ఉండాలి.

డిజిటల్ మార్కెటింగ్ ప్రాధమిక అంశాలు మరియు ప్రణాళిక

వెబ్సైట్తయారుచేయడం

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్

ఇన్ఫ్లుయెన్సుర్ మార్కెటింగ్

యూట్యూబ్ మార్కెటింగ్

కంటెంట్ మార్కెటింగ్

గూగుల్ ఆడ్వార్డ్స్

గూగుల్ అనలిటిక్స్

సోషల్ మీడియా మార్కెటింగ్

మెయిల్ మార్కెటింగ్

డిజిటల్ మార్కెటింగ్ ప్రణాళిక

మనం పని చేయాలన్నా దాని మీద మనకి పూర్తి అవగాహన ఉండటం చాలా అవసరం. అవగాహన లేకుండా ఏదీ చేయలేం. మనకి సాధారణ మార్కెటింగ్ గురించి తెలుసు. మరి డిజిటల్ మార్కెటింగ్ గురించి కూడా తెలుసుకోండి. అందుకే మోడ్యూల్లో డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి? ఏమి చేయాలి? ఎటువంటి టూల్స్ ఉపయోగించాలి అనేది తెలుసుకోవాల్సివుంటుంది. డిజిటల్ మార్కెటింగ్లో దశాబ్ద కాలం నుండి సరికొత్త విధానాలను అమలు చేయడం జరుగుతుంది.

వెబ్సైట్తయారుచేయడం

డిజిటల్ మార్కెటింగ్ చేసేవారికి అతి ప్రధానమైనది వెబ్సైట్ రూపల్ప‌. ఒక వెబ్సైట్ క్రియేషన్కి కావాల్సిన డొమైన్ పేరు ని ఏవిధంగా పెడతారు? రిజిస్టర్ చేసుకొనే పద్దతి, దానికి హోస్టింగ్ ఇచ్చే ప్రక్రియ, అందులో వర్డుప్రెస్ని ఇన్స్టాల్ చేయడం మొదలైనవి తెలుసుకోవాలి. అంతే కాకుండా కామర్స్ మరియు ఆన్ లైన్ అమ్మకాలు ఎలా చేయాలో నించాలి. వెబ్సైట్ రూపకల్పన మరియు దానిని అభివృద్ధి చేయడం కూడా తెలుసుకొని తీరాలి.

సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్ అంటే

ఒక వెబ్సైట్ని మొదటి పేజీలోకి తీసుకు రావడమే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్. అయితే ఇది చెప్పినంత సులభం కాదు. చాలా ఓపిక ఉండాలి కానీ ఖర్చు లేనిది. ఉదా: ఏదైనా ఒక సమాచారం కోసం సెర్చ్ ఇంజిన్స్ లో వెతుకుతున్నప్పుడు అక్కడ మనకి దానికి సంభందించిన పేజీలు చాలా కనిపిస్తాయి. ఇలా ఎన్నిపేజీలు కనిపించినా కూడా మనం మొదటి పేజీలో ఉన్న వెబ్‌‌సైట్కిమాత్రమే ప్రాముఖ్యతనిస్తాం. విధంగా మొదటిపేజీలోకి ఒక వెబ్సైట్ ని తీసుకు రావడం ఎలా అనేదానిని రూపొందించమే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజషన్. దీనిద్వారా గూగుల్లో సెర్చ్ చేసే యూజర్స్ ని మన వెబ్సైట్కి ఒక ట్రాఫిక్ గా మలుచుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా  ప్రకటనల ప్రచారాలను నిజసమయంలో ఆప్టిమైజ్ చేయవచ్చు (మార్పులు చేయవచ్చు) అంటే వ్యూహం పని చేయకపోతే, నం వెంటనే మరొక వ్యూహానికి మారవచ్చు. అయితే సాంప్రదాయ రూపంలో మార్కెటింగ్లో, మా ప్రకటన విడుదలైన తర్వాత మార్పులు చేయడం ష్టం

సోషల్ మీడియా మార్కెటింగ్

సోషల్ మీడియా అనగానే మన అందరికీ వెంటనే గుర్తొచ్చేవి ఫేస్బుక్, పింటరెస్ట్ , లింక్డ్ఇన్ ఇలా చాలా ఉన్నాయ్. సోషల్ మీడియా మనం ప్రపంచంలో ఎక్కడున్నా ఒకే చోటకనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఆలాంటి సోషల్ మీడియా మాధ్యమాలను వాడుకుంటూ, ఒక బ్రాండ్ ప్రచారం కానీ, ఒక కంపెనీ ప్రొడక్ట్స్ ని కానీ మార్కెటింగ్ చేయడమే సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియాలో కూడా చాలా రకాల సైట్స్ ఉన్నప్పటికీ మనకి కావాల్సిన కస్టమర్స్ సైట్ లో దొరుకుతారో చూసుకోవాలి. తక్కువ ఖర్చుతో మనకి కావాల్సిన వ్యక్తులకు మాత్రమే ప్రచారం చేయడం సోషల్ మీడియా మార్కెటింగ్గా పేర్కొనచ్చు.

మెయిల్ మార్కెటింగ్

మెయిల్ మార్కెటింగ్ అంటే మనం తరచూ ఉపయోగించే మెయిల్స్ ద్వారా ఒక కంపెనీ ఇన్ఫర్మేషన్ కానీ, బ్రాండ్ ప్రచారానికి గానీ, మన కస్టమర్లకి సమాచారాన్ని మెయిల్ ద్వారా చెప్పడాన్ని మెయిల్ మార్కెటింగ్ అని అంటారు. ఇది కొన్నిసెకండ్ల కాలంలో కస్టమర్కి నేరుగా చేరిపోతుంది. అంతేకాక కస్టమర్ అభిప్రాయాలను, సందేహాలను విధానంలో నేరుగా తెలుసుకోవచ్చు.మెయిల్ మార్కెటింగ్ ద్వారా కస్టమర్కి మరింత చేరువయ్యే అవకాశం ఏర్పడుతుంది.

ఇన్ఫ్లుయెన్సుర్ మార్కెటింగ్ అంటే ఏమిటి?

ఇన్ఫ్లుయెన్స్ అంటే మనకి తెలుసు. మంచిపేరు ఉన్న వ్యక్తి సపోర్ట్గా చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అంటాం. అలాగే ఒక బాగా పేరు ఉన్న ఒక కంపెనీ సపోర్ట్ తీసుకొని మార్కెటింగ్ చేయించుకుంటే అదే ఇన్ఫ్లుయెన్సుర్ మార్కెటింగ్ అని అంటారు. అయితే డిజిటల్ మార్కెటింగ్లో ఒక బ్రాండ్ని ప్రచారం చేయడానికి ఇన్ఫ్లుయెన్సుర్ మార్కెటింగ్ ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఇది సోషల్ మీడియా మార్కెటింగ్. కంటెంట్ మార్కెటింగ్తో సంబం|ధం కలిగి ఉంటుంది.

యూట్యూబ్ మార్కెటింగ్ చేయాలంటే

యూట్యూబ్ కూడా గూగుల్ తర్వాత సెర్చ్ ఇంజిన్ లో రెండస్థానాన్ని సంపాదించుకుంది. యూట్యూబ్ సాధారణ వ్యక్తుల్ని కూడా ప్రముఖులుగా మార్చేస్తుంది. అలాగే బ్రాండ్ ప్రచారాలకు కూడా యూట్యూబ్ను ఎలా ఉపయోగిస్తారో తెలుసుకోవాలి. యూట్యూబ్లో వీడియో చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చే బ్రాండ్ ప్రచారాలను ఎలా పెట్టవచ్చు అనేది తెలుసుకోగలుగుతాం. అంతేకాకుండా యూట్యూబ్ మార్కెటింగ్లో వీక్షించేవారి సంఖ్య పెరిగే కొద్దీ డబ్బులు సంపాదించుకోవడం సులభంగా ఉంటుంది.

కంటెంట్ మార్కెటింగ్

డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ మార్కెటింగ్ రారాజు అని చెప్పుకోవచ్చు. కొనుగోలుదారుడు ఎంపిక చేసుకునే ప్రతి విషయములోనూ కంటెంట్ని రికించి చూస్తాడు. కంటెంట్ ఎంత బాగుంటే ప్రోడక్ట్కి అంత విలువ పెరుగుతుంది. కంటెంట్ను బట్టి కస్టమర్స్ ఆకర్షితులవుతారు. మోడ్యూల్ లో కంటెంట్ ను అభివృద్ధి చేయడం నేర్చుకుంటారు. కంటెంట్ రాయడం అనేది మనం చేసే సాధన బట్టి వస్తుంది. ఒక వెబ్సైట్లో కంటెంట్ బట్టి వెబ్ సైట్కి ట్రాఫిక్ పెరుగుతుందని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.

గూగుల్ యాడ్ర్డ్

గూగుల్ యాడ్ర్డ్ అనేది ఒక వెబ్సైట్కి డబ్బులు చెల్లించి ప్రచారం చేసుకోడానికి, మరియు వెబ్సైట్  ట్రాఫిక్ ని ఎక్కువుగా పెంచడానికి దీనిని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాక వెబ్సైట్ని వీక్షించే వారి సంఖ్యను కూడా పరిశీలించుకోవచ్చు. ఒక కంపెనీ ప్రచారాలను అభివృద్ధి చేయడం, పెట్టుబడికి తగినప్రతిఫలం పొందడానికి ఆడ్వార్డ్స్ చాలా అవసరమవుతుంది.

గూగుల్ అనలిటిక్స్

గూగుల్ అనలిటిక్స్ తో మీ వెబ్సైట్ ఎంతమంది సందర్శిస్తున్నారు? ఎంత మంది విజిటర్స్ వస్తున్నారు? ఎక్కడినించి వస్తున్నారు? ఏమి చేస్తున్నారు? ఎంత సేపు ఉంటున్నారు? ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవడం రుగుతుంది. మీరు చేయాల్సిందల్లా గూగుల్ అనలిటిక్స్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సివుంటుంది. లితంగా వచ్చిన కోడ్ను తీసుకువెళ్లి మీ వెబ్సైట్‌‌లో యాడ్ చేయాల్సివుంటుంది. ఇలా చాలా విషయాలను డిజిటల్ మార్కెటింగ్ లో నేర్చుకోవడం జరుగుతుంది. రానున్న కాలం లో దీని మీద మరింత ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయి. డిగ్రీ చేసినవారెవరైనా కూడా కోర్స్ లో రాణించవచ్చు. ఇప్పటికే చాలా మంది కోర్స్ చేసిన వారు సొంతంగా చిన్న చిన్న స్టార్ట్ అప్స్ పెట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు. అయితే ఏదో కోర్స్ జాయిన్ అయిపోయాం , జాబ్ చేసేద్దాం అనుకుంటే కాదు. చేసే పని లో ఏకాగ్రత చూపించగలిగితేనే పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోగలం

విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు అందరికీ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉపాధి ల్పిస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ రిణామాత్మమైనది. ప్రకటనలు ఎంతమంది వినియోగదారులకు చేరుకున్నాయో, వాటిని ఎంత మంది క్లిక్ చేశారనేది తెలుసుకోవచ్చు.   ప్రకటనలనుండి ఎంత మంది వ్యక్తులు లిపోయారు? మా వెబ్సైట్లో ప్రజలు ఎంత సమయం గడుపుతున్నారు? వారు ఎన్ని పేజీలను సందర్శిస్తున్నారు? అనేవి తెలుసుకోవచ్చు. అయితే సాంప్రదాయ మాధ్యమంలో ఇటువంటివాటిని తెలుసుకోవడం అసాధ్యం. డిజిటల్ మార్కెటింగ్ అందించే ప్రయోజనాల ద్వారా వినియోగదారుకు కమ్యూనికేషన్ను వ్యక్తిగతీకరించే అవకాశం లుగుతుంది. వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి తోడు వ్యక్తిగత వినియోగదారులకు ముఖ్య సందేశాలను అందించేందుకు, బ్రాండ్ లక్ష్యాలను సాధించడంలో డిజిటల్మార్కెటింగ్ అనేది మరింత సహాయపడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ ఖర్చుతో కూడుకున్నది. సాంప్రదాయ మీడియాతో పోలిస్తే కనీస బడ్జెట్తో మీరు విస్తృత ప్రేక్షకులను చేరుకోవచ్చు. ఇది మీ మొత్తం మార్కెటింగ్ వ్యయాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సాంప్రదాయ మీడియాతో పోలిస్తే డిజిటల్ మార్కెటింగ్ అధిక ఆర్ఓఐని కలిగి ఉంటుంది. ఎందుకంటే లక్ష్యం ఖచ్చితంగా ఉంటుంది. డిజిటల్ ద్వారా మీరు ప్రకటనను క్లిక్ చేసిన వినియోగదారులను ట్రాక్ చేయవచ్చు.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.