written by Khatabook | July 5, 2022

వ్యాపార అభివృద్ధికి గైడ్

×

Table of Content


ప్రతి వ్యాపార ప్రయత్నంలో వ్యాపార అభివృద్ధి అనేది ముఖ్యమైన అంశం. వ్యాపార అభివృద్ధి నిపుణులు కంపెనీ పనితీరును అంచనా వేసి అభివృద్ధి కోసం అవకాశాలను కనుగొంటారు. వ్యాపారాలలో సమర్థవంతంగా ఉండటానికి, వ్యాపారులకు కొన్ని సామర్థ్యాలు ఖచ్చితంగా అవసరం.

ఈ కథనంలో, మేము వ్యాపార అభివృద్ధికి సరైన అర్ధమేంటో వివరిస్తాము, కంపెనీ విజయంలో దాని ప్రాముఖ్యత గురించి మరియు వ్యాపార అభివృద్ధి నిపుణుడిగా పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాల గురించి వివరంగా చెప్తాము.

మీకు తెలుసా?

2020లో 1,246 స్టార్టప్‌లపై నిర్వహించిన ఆర్‌బీఐ సర్వేలో కేవలం 3% కంపెనీలు మాత్రమే 100 మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయని తేలింది.

వ్యాపార అభివృద్ధి అంటే ఏమిటి?

కనెక్షన్‌లు, మార్కెట్‌లు మరియు వినియోగదారుల వృద్ధి ద్వారా కంపెనీ విలువను జనరేట్ చేయడానికి దీర్ఘకాలిక పద్ధతుల అభివృద్ధిని వ్యాపార అభివృద్ధిగా సూచిస్తారు.

వ్యాపారాలు యొక్క యాక్టివిటీలు మరియు ఆదాయాన్ని పెంచడంలో సహాయపడే వ్యాపార అభివృద్ధి నిపుణుడుని వ్యాపార డెవలపర్ అని కూడా అంటారు. వారు సంస్థ కోసం సంప్రదాయ, పూర్తి-సమయ ఉద్యోగిగా లేదా స్వతంత్ర కన్సల్టెంట్‌లుగా ఒప్పందంపై పని చేస్తారు. సెక్టార్ బట్టి వ్యాపార డెవలపర్‌ల రోజువారీ పనులు మరియు వ్యూహాలు మారవచ్చు, కానీ లక్ష్యం మాత్రం ఎక్కడైనా ఒకటే ఉంటుంది.

వ్యాపార అభివృద్ధి పాత్ర

కొన్ని వ్యాపారాలు ఆకస్మికంగా విస్తరించి అభివృద్ధి చెందుతాయి. కార్పొరేషన్‌లు తమ విస్తరణను ప్రణాళికాబద్ధంగా వ్యూహరచన చేయకపోతే వారి వనరులన్నీ అయిపోయే ప్రమాదంతో పాటు బడ్జెట్‌లను మించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటాయి. ఫలితంగా, ఒక సంస్థ విస్తరించి అభివృద్ధి చెందాలని కోరుకుంటే, వ్యాపార వృద్ధి అవకాశాలు గొప్ప మార్గం కావచ్చు. ఇతర వృత్తులు మరియు వ్యాపారాలతో దీర్ఘకాలిక పొత్తులను నిర్మించి స్మార్ట్ వ్యాపార డెవలపర్ మరిన్ని లీడ్‌లు మరియు ఒప్పందాలను రాబట్టగలడు. ఫలితంగా, కంపెనీ నగదు, ఆస్తులు లేదా సిబ్బందిలో గణనీయమైన పెరుగుదల అవసరం లేకుండానే అభివృద్ధి చెందవచ్చు.

వ్యాపార అభివృద్ధి కోణాలు

వ్యాపార అభివృద్ధిలో అనేక భాగాలు ఉంటాయి. సేల్స్ రిప్రజెంటేటివ్‌లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజ్‌మెంట్ మరియు వెండర్‌లతో సహా అనేక రకాల వృత్తులతో బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు కలిసి పని చేస్తారు. ఇతర విభాగాలతో పని చేయడంతో పాటు, వ్యాపార డెవలపర్‌లు తప్పనిసరిగా సంస్థకు యూక పొత్తులు, జాయింట్ వెంచర్‌లు, ఖర్చు తగ్గించే చర్యలు, కమ్యూనికేషన్ వంటి వాటిని నిర్వహించాలి. వ్యాపార డెవలపర్‌లు ఏకీకృత వ్యూహాత్మక లక్ష్యాలను ఉపయోగించి వివిధ విభాగాల లక్షణాలను ఒకచోట చేర్చడానికి ప్రయత్నిస్తారు

సేల్స్

బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు సేల్స్ ఉద్యోగుల కోసం వాస్తవిక విక్రయ లక్ష్యాలను సెట్ చేసి వాటిని సాధించడానికి సలహాలు ఇస్తారు. అభివృద్ధి కోసం అవకాశాలను కనుగొనడానికి అనేక మార్కెట్లలో లేదా వివిధ త్రైమాసికాలలో కంపెనీ విక్రయాల పనితీరును కూడా వారు పరిశీలించవచ్చు.

వ్యాపార అభివృద్ధి vs అమ్మకాలు

లీడ్స్ లేదా అవకాశాలను కొత్త క్లయింట్‌లుగా మార్చే పద్ధతిని సేల్స్ అంటారు. వ్యాపార అభివృద్ధిలో సేల్స్‌తో పాటు అనేక ఇతర అంశాలు కూడా వస్తాయి. 

సేల్స్ మరియు వ్యాపార అభివృద్ధి మధ్య తేడా తెలియక చాల మంది కన్ఫ్యూజ్ అవుతారు. సేల్స్‌లో పనిచేస్తున్న చాలా మంది వ్యక్తులు బిజినెస్ డెవలపర్ అనే లేబుల్‌ని పొందినందున ఇది ఊహించని విషయమైతే కాదు. వ్యాపార అభివృద్ధి వర్గీకరణ సేల్స్‌పై ఇప్పటికే ఉన్న ప్రతికూలతాను కొంత తొలగిస్తుందని సంస్థలు భావించినందున ఇలా జరుగుతుంది. 

ఈ కన్ఫ్యూజన్ ఫలితంగా, అనేక వ్యాపారాలు సేల్స్‌ను "వ్యాపార అభివృద్ధి"గా సూచిస్తాయి. అలాగే, ప్రతి సీనియర్ ఉద్యోగి యొక్క ఉద్యోగ వివరణలో ఈ పదాలు చేర్చబడతాయి. బిజినెస్ డెవలపర్ బాధ్యతలలో లీడ్ క్రియేషన్ మరియు లీడ్ నర్చర్ వంటి కొన్ని విక్రయ విధులను కూడా చేర్చవచ్చు.

మార్కెటింగ్

కంపెనీ ఉత్పత్తులు/సేవలను ప్రమోట్ చేసే వాణిజ్య ప్రకటనలు మరియు ప్రచారాల ద్వారా, మార్కెటింగ్ టీమ్ ఆదాయ వృద్ధిని పెంచడానికి కృషి చేస్తుంది. వ్యాపార అభివృద్ధి నిపుణులు మార్కెటింగ్ ప్రయత్నాలను నిర్దిష్ట ప్రదేశం, జనాభా లేదా యూజర్ గ్రూప్‌కి అనుగుణంగా మార్చడానికి మార్కెట్ పరిశోధనను నిర్వహించవచ్చు. మార్కెటింగ్ వ్యయాలను తెలివిగా ఎలా కేటాయించాలో కూడా వారు మేనేజ్‌మెంట్‌కి సలహా ఇవ్వవచ్చు.

వ్యాపార అభివృద్ధి vs మార్కెటింగ్

సాంప్రదాయకంగా, వ్యాపార అభివృద్ధి అనేది కొత్త ప్రచార లేదా పంపిణీ కాంటాక్ట్‌లు మరియు ప్లాట్‌ఫారమ్‌లను పొందడంపై కేంద్రీకృతమైన మార్కెటింగ్ శాఖ. ఈ ఉద్యోగం ఇప్పటికీ అనేక సంస్థలలో కొనసాగుతుండగా, "బిజినెస్ డెవలప్‌మెంట్" ఇప్పుడు అనేక మార్కెటింగ్ మరియు సేల్స్ టాస్క్‌లకు పర్యాయపదంగా మారింది.

భాగస్వామ్యాలు

వ్యాపారాలు తరచుగా తమ యాక్వివిటీలను పెంచుకోవడానికి మరియు కొత్త మార్కెట్‌లో పట్టు బలపరచుకోవడానికి భాగస్వామ్యాలను ఉపయోగిస్తాయి. వ్యాపార డెవలపర్‌లు తమ కంపెనీకి పోటీగా ఉన్నవాటిని విశ్లేషించడానికి, పొత్తులు మరియు ఇతర వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక మరియు న్యాయ విభాగాల సహాయాన్ని పొందుతారు.

ప్రాజెక్ట్ నిర్వహణ

ప్రాజెక్ట్ టైమ్‌ఫ్రేమ్‌లు, లాజిస్టిక్స్, టైమ్‌టేబుల్‌లు, ఖర్చులు మరియు ఇతర అంచనా లెక్కలకు వ్యాపార అభివృద్ధి నిపుణులు బాధ్యత వహిస్తారు. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టీమ్‌కి ప్రారంభ మార్గదర్శకత్వం మరియు బ్రీఫింగ్‌లను అందించడానికి ప్రాజెక్ట్ యొక్క అభివృద్ధిని పర్యవేక్షించే టాప్ మేనేజ్‌మెంట్‌తో వారు సహకరించవచ్చు. 

విక్రేత నిర్వహణ

తమ వస్తువులు లేదా సేవలకు సంబంధించిన రిటైల్ అనుభవాన్ని పర్యవేక్షించే వ్యాపార సహచరులు లేదా ఉద్యోగులను విక్రేతలు అంటారు. వ్యాపార అభివృద్ధి నిపుణులు విక్రేతలను గుర్తించడంతో పాటు వెండింగ్ సేవల ఖర్చు మరియు చట్టపరమైన పరిణామాలను అంచనా వేయడంలో సంస్థకు సహాయం చేస్తారు.

చర్చలు, నెట్‌వర్కింగ్ మరియు లాబీయింగ్

వ్యాపార అభివృద్ధి మేనేజర్లు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల ప్రయోజనాల కోసం చురుగ్గా బేరసారాలు మరియు చర్చలు జరపాలి. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో లాబీయింగ్ చట్టబద్ధంగా అస్పష్టమైన విషయం అయినప్పటికీ, చాలా సందర్భాల్లో కంపెనీ అభివృద్ధికి ఇది చాలా కీలకం, ప్రత్యేకించి కార్పొరేషన్లు కొత్త మార్కెట్లలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు లాబీయింగ్ కీలక పాత్ర పోషిస్తుంది . వ్యాపార డెవలపర్‌లు ప్రభుత్వ అధికారులు, నియంత్రకాలు మరియు సరఫరాదారులతో ఈ చర్చలు మొదలుపెడుతుంటారు.

ఖర్చు తగ్గింపు

విక్రయాలు మరియు యాక్టివిటీలను పెంచడం ద్వారా మాత్రమే కాకుండా ఖర్చు తగ్గించే చర్యలను సరిగ్గా అమలు చేయడం ద్వారా కూడా లాభాలను పెంచుకోవచ్చు. వ్యాపార డెవలపర్‌లు ఈ రంగంలో నిపుణులు. ఖర్చులను తగ్గించి ఆదాయాలను పెంచడానికి కీలక నిర్ణయాలు తీసుకునేలా కార్పొరేట్ వాటాదారులకు వ్యాపార డెవలపర్‌లు సహాయం చేస్తారు.

బిజినెస్ డెవలప్మెంట్‌కి అవసరమైన నైపుణ్యాలు

మీరు బిజినెస్ డెవలప్మెంట్‌లో పని చేయాలనుకుంటే, జాబ్ వివరణలో మీరు చూడవలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి వ్యక్తిగత లక్ష్యాలను ఏర్పరచుకోవడం ఈ ఉద్యోగానికి పోటీదారుగా నిలబడడంలో మీకు సహాయపడుతుంది. బిజినెస్ డెవలప్‌మెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో మీ CVలో హైలైట్ చేయడానికి ఇక్కడ కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి:

సేల్స్ స్కిల్స్

వ్యాపార అభివృద్ధి మరియు విక్రయ ఉద్యోగాలకు విభిన్న విధులు ఉన్నప్పటికీ, ఈ రెండిట్లో కామన్‌గా ఉండే యాక్టివిటీలు మరియు బాధ్యతలు కొన్ని ఉంటాయి. కాబట్టి, ఈ వృత్తిలో విజయం సాధించదానికి ప్రాథమిక విక్రయ సామర్థ్యాలు మీకు సహాయపడతాయి. వ్యాపార అభివృద్ధి నిపుణులు లక్ష్య వినియోగదారులను సమర్థవంతంగా గుర్తించాలి మరియు వృద్ధిని ప్రోత్సహించడానికి వారి మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి. సాధ్యమైన భాగస్వాములతో కూడా సహకరించడంతో పాటు ఇతర నిపుణులు మరియు వ్యాపారాలతో సంభావ్య భాగస్వామ్యాలను నిర్మించుకోవాలి.

కమ్యూనికేషన్ నైపుణ్యాలు

వ్యాపార డెవలపర్‌గా, మీరు ప్రతిరోజూ విస్తృత శ్రేణి నిపుణులతో మాట్లాడాలి. ఈ వృత్తిలో ప్రభావవంతంగా ఉండటానికి మీరు మీ విద్యా మరియు కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలి. ప్రతి సందర్భంలోనూ కమ్యూనికేషన్ స్పష్టంగా మరియు ప్రొఫెషనల్‌గా ఉండాలి. ఈ పరిస్థితికి ఏ కమ్యూనికేషన్ మోడ్ ప్రత్యేకంగా సరిపోతుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

వ్యాపార అభివృద్ధిలో భాగంగా ఏర్పడిన వృత్తిపరమైన కనెక్షన్‌లకు క్రమబద్ధమైన ప్రోత్సాహం అవసరం కాబట్టి సమర్ధవంతంగా మాట్లాడేవాళ్లు ఈ రంగంలో వృద్ధి చెందవచ్చు. మీ ఆలోచనలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసేలా చూసుకుంటూ మీ అభిప్రాయాలను వ్యక్తపరచగలగాలి.

మార్కెటింగ్ నైపుణ్యాలు

వ్యాపార అభివృద్ధి విభాగం విక్రయ బృందంతో మాత్రమే కాకుండా అనేక వ్యాపారాలలో మార్కెటింగ్ బృందంతో సన్నిహితంగా పనిచేస్తుంది. వ్యాపార డెవలపర్‌లు కొన్ని విక్రయ సామర్థ్యాలను కలిగి ఉన్నప్పటికీ, వారు తమ పనిలో ప్రాథమిక మార్కెటింగ్ ఆలోచనలను అమలు చేయాలి. మార్కెటింగ్ మరియు బిజినెస్ డెవలప్‌మెంట్ స్పెషలిస్ట్‌ల యొక్క అంతిమ లక్ష్యం వ్యాపారాన్ని విస్తరించడమే అయినా దాన్ని వారు సాధించడానికి ఉపయోగించే పద్ధతులు మారవచ్చు.

వ్యాపార డెవలపర్లు వివిధ రకాల మార్కెటింగ్ సంబంధిత విధులకు బాధ్యత వహిస్తారు. ఇందులో భాగస్వామ్యాల కోసం వెతకడం, ప్రచార నిర్వహణ, బ్రాండింగ్ కార్యక్రమాలతో సహాయం చేయడం, కొత్త కస్టమర్ బేస్‌లను సృష్టించడం మరియు కొత్త కస్టమర్‌లలో బ్రాండ్ గుర్తింపు మరియు నమ్మకాన్ని విజయవంతంగా పెంచడం వంటివి ఉంటాయి.

వ్యాపార నైపుణ్యం

అంతర్గత వాస్తవాలను తెలుసుకోవడానికి మరియు మార్కెట్‌పై క్షుణ్ణంగా పట్టు సాధించడానికి వ్యాపార చతురత అవసరం. కంపెనీ కార్యకలాపాలకు సంబంధించిన వ్యాపారం, దాని ఉత్పత్తి శ్రేణులు, ప్రత్యర్థులు మరియు స్థూల ఆర్థిక పరిస్థితుల గురించి విస్తృతమైన విశ్లేషణ మరియు పరిశోధన చేయడం ద్వారా వ్యాపార చతురతను పెంచుకోవచ్చు.

సమాచార సేకరణ మరియు విశ్లేషణ కూడా వ్యాపార మేధస్సుకు సంబంధించిన  అంశాలు. పొటెన్షియల్ మార్కెట్ యొక్క పరిమాణం, దానిని ప్రభావితం చేసే మార్పులు మరియు నిర్దిష్ట మార్కెట్ సమూహాల నుండి మంచి ప్రతిచర్యలను పొందే అనేక రకాల కార్యక్రమాలు కంపెనీ డెవలపర్‌కు సహాయపడే అత్యంత విలక్షణమైన సమాచారం. పరిశోధన నిర్వహించడం, డేటాను సేకరించడం మరియు లక్ష్య మార్కెట్ల గురించి మరింత తెలుసుకోవడం ద్వారా ఈ ప్రతిభను మెరుగుపరచుకోవడం మొదలుపెట్టవచ్చు.

విశ్లేషణాత్మక నైపుణ్యాలు

విధానాలు మరియు ప్రణాళికలను నిర్మించడానికి వ్యాపార అభివృద్ధి నిపుణులు ముఖ్యమైన సమాచారం పొందేందుకు అపారమైన డేటాను విశ్లేషిస్తారు. భారీ మొత్తంలో నిర్మాణాత్మకంగా లేని డేటా నుండి ముఖ్యమైన సూచనలు మరియు కష్టమైన సమాచారాన్ని పొందేందుకు వారు తప్పనిసరిగా వివరాల  మీద శ్రద్ధ పెట్టాలి.

అంతేకాకుండా, ఇతరులు సమర్థవంతంగా అర్థం చేసుకునే విధంగా కమ్యూనికేట్ చేయడానికి వారు ఈ వాస్తవాలను సేకరించి, నిర్వహించగలగాలి. కార్పొరేట్ విజయాన్ని సమర్థవంతంగా వివరించే సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో పాటు కంపెనీని విస్తరించడంలో సహాయపడటానికి మీరు ఏమి చేస్తున్నారో విశ్లేషించే సంస్థాగత సామర్ధ్యాలు ఈ కెరీర్ మార్గంలో వృద్ధి చెందడానికి మీ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

ప్రాజెక్ట్ నిర్వహణ నైపుణ్యాలు

వ్యాపార అభివృద్ధి అనేది అనేక ప్రక్రియలు మరియు విధానాలతో కూడిన సంక్లిష్టమైన ప్రయత్నం. అద్భుతమైన ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉండటానికి అవసరమైన అనేక లక్షణాలు వ్యాపార అభివృద్ధి వృత్తికి కూడా అవసరమవుతాయి. ఈ సామర్ధ్యాలలో నాయకత్వం, టీమ్ బిల్డింగ్, రిస్క్ మానిటరింగ్ మరియు మేనేజ్‌మెంట్ వంటివి ఉంటాయి.

ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నప్పుడు, శ్రామిక శక్తిని నిర్వహించగల సామర్థ్యం చాలా అవసరం. ఎందుకంటే మీరు ప్రతి విధిని ఒంటరిగా నిర్వహించలేరు. టీమ్‌వర్క్‌ను ప్రోత్సహించడం, విభేదాలను అధిగమించడం మరియు పనితీరును అంచనా వేయడం టీమ్ మేనేజ్‌మెంట్‌లోని అంశాలు. ఇవే సామర్థ్యాలు వ్యాపార డెవలపర్‌లకు కూడా వర్తిస్తాయి.

ముగింపు

కొన్ని వ్యాపారాలకు, వ్యాపార వృద్ధి దీర్ఘకాలిక విజయాన్ని సాధించే పద్ధతి. మిత్రపక్షాలు మరియు భాగస్వాములతో సంబంధాలను ఏర్పరచుకోవడం మరియు కొనసాగించడం ప్రయోజనకరంగా ఉండవచ్చు, ఇతర మార్గాల ద్వారా అభివృద్ధికి గల సామర్థ్యాన్ని గుర్తించవచ్చు. వ్యాపార అభివృద్ధి అనేది సంస్థ యొక్క దీర్ఘకాలిక స్థిరత్వం మరియు ఆ విజయాన్ని సాధించడానికి ఉత్తమ మార్గాలకు సంబంధించినది. 

సూక్ష్మ, చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలు (MSMEలు), వ్యాపార చిట్కాలు, ఆదాయపు పన్ను, GST, జీతం మరియు అకౌంటింగ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌లు, వార్తల బ్లాగులు మరియు కథనాల కోసం Khatabookని అనుసరించండి.

 

తరుచుగా అడిగే ప్రశ్నలు

ప్రశ్న: వ్యాపార అభివృద్ధికి ముఖ్యమైనది ఏమిటి?

సమాధానం:

వ్యాపార అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం వృద్ధి.

ప్రశ్న: కంపెనీలు ఉపయోగించే వ్యాపార అభివృద్ధి వ్యూహం ఏమిటి?

సమాధానం:

వ్యాపార అభివృద్ధి ప్రక్రియలో ఉపయోగించే కీలక వ్యూహం నష్టాలను తగ్గిస్తూ సంస్థలోకి వచ్చే డబ్బు మొత్తాన్ని పెంచడంలో సహాయపడే వ్యూహాలను రూపొందించడం.

ప్రశ్న: వ్యాపార అభివృద్ధి అనేది మార్కెటింగ్ పోస్ట్‌నా లేదా సేల్స్ పోస్ట్‌నా?

సమాధానం:

మార్కెటింగ్ అనేది కమ్యూనికేషన్ మరియు వినియోగదారులపై దృష్టి పెడుతుంది. క్వాలిఫైడ్ లీడ్‌లను అంచనా వేయడంతో పాటు మార్కెటింగ్ మరియు సేల్స్ టీమ్ రెండూ సంపాదించిన డీల్‌లను మూసివేయడంపై సేల్స్ టీమ్ పని చేస్తుంది. వ్యాపార సంబంధాలు మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలపై బిజినెస్ డెవలప్మెంట్ బాధ్యత వహిస్తుంది.

ప్రశ్న: వ్యాపార అభివృద్ధి ప్రక్రియ ఏమిటి?

సమాధానం:

వ్యాపార అభివృద్ధి ప్రక్రియలో 4 ప్రధాన దశలు ఉంటాయి. అది చిన్న వ్యాపారం అయినా లేదా బహుళజాతి సంస్థ అయినా సరే, దశలు క్రింది విధంగా ఉన్నాయి:

  • ప్రారంభ దశ
  • వృద్ధి దశ
  • పరిపక్వత దశ
  • పునరుద్ధరణ లేదా క్షీణత దశ

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.