written by Khatabook | July 5, 2022

భారతదేశంలో పాసివ్/నిష్క్రియ ఆదాయాన్ని ఎలా సంపాదించాలి?

×

Table of Content


పాసివ్/నిష్క్రియ ఆదాయం అంటే తక్కువ ప్రయత్నంతో వచ్చే ఆదాయం. సాంకేతికత మరియు వైద్య సౌకర్యాలలో అభివృద్ధి కారణంగా, మనుషులు సాధారణ ఆయుర్దాయం కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఈ సమయంలో, స్థిరమైన నిష్క్రియ ఆదాయాన్ని ప్రతి ఒక్కరికీ అవసరం.

వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా లేదా విలువ పెరిగే సేవలను అందించడం ద్వారా కాలక్రమేణా నిష్క్రియ ఆదాయాన్ని పొందవచ్చు. ఈ ఆదాయం ప్రోగ్రెసివ్ గ్రోత్ మీద ఆధారపడి ఉంటుంది, అంటే ఈ విధంగా సంపాదించేవారు లాభాల బాట పట్టడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి.

నిష్క్రియ ఆదాయం అనే కాన్సెప్ట్ ఇప్పటికీ  సామాన్య ప్రజలలో ప్రాచుర్యం పొందలేదు. కానీ ధనికులు మాత్రం దీన్ని తరచూ ఫాలో అవుతారు. ధనవంతులుగా మారడానికి మరియు ధనవంతులుగానే ఉండడానికి బలమైన మార్గాలలో నిష్క్రియ ఆదాయం ఒకటి. సాధారణ 9 నుండి 5 ఉద్యోగాలు చేసినప్పుడు ఆదాయం ఆదాయం స్థిరంగా ఉంటుంది, అలాగే ఆ ఆదాయానికి ఒక పరిమితి కూడా ఉంటుంది. కానీ అనేక మార్గాల నుండి సంపాదించే నిష్క్రియ ఆదాయానికి మాత్రం పరిమితి ఉండదు. .

మీకు తెలుసా?

ఆదాయంలో మూడు సాధారణ వర్గాలు ఉంటాయి: క్రియాశీల, నిష్క్రియ మరియు పోర్ట్‌ఫోలియో ఆదాయం.

భారతదేశంలో నిష్క్రియ ఆదాయ ఉత్పత్తి రకాలు

అద్దె నుండి వచ్చే ఆదాయాన్ని లేదా మీరు చురుకుగా పాల్గొనని వ్యాపారం నుండి వచ్చే ఆదాయాన్ని పాసివ్ ఆదాయం లేదా నిష్క్రియ ఆదాయం అంటారు. దీన్ని సంపాదించడానికి "చురుకైన" శ్రమ అవసరం లేదు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా డబ్బు సంపాదించడమే ఇక్కడ ప్రధాన లక్ష్యం. అలా చేయడానికి, కొంచెం అదనపు శ్రమతో ఆదాయాన్ని సంపాదించడంలో మీకు సహాయపడేలా దేన్నైనా అభివృద్ధి చేయడానికి కొంత సమయం లేదా డబ్బును ముందుగానే కేటాయించాల్సి ఉంటుంది. భారతదేశంలో 

సాంప్రదాయ పద్దతి

ఇటువంటి పెట్టుబడుల నుండి అదనపు ఆదాయం పొందబడుతుంది: -

  • FD నుండి వడ్డీ - పెట్టుబడి పెట్టిన ప్రారంభ మొత్తం కాలానుగుణంగా సమ్మేళనం చేయబడడం వల్ల  వడ్డీ ఉత్పత్తి అవుతుంది..
  • రియల్ ఎస్టేట్ నుండి అద్దెలు - భారతదేశంలో నిష్క్రియ ఆదాయాన్ని సంపాదించడానికి అద్దె ఆస్తిలో పెట్టుబడి పెట్టడం ఒక ప్రభావవంతమైన మార్గం. తనఖా మరియు నిర్వహణ ఖర్చులను తిరిగి చెల్లించడం ఒక్కటే ఇందులో ఉండే ప్రమాదం.
  • మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డివిడెండ్‌లు - మీ దగ్గర ఉన్న ఉన్న స్టాక్‌లపై రెగ్యులర్ వ్యవధిలో డివిడెండ్‌లు చెల్లించబడతాయి. స్టాక్‌లు లేదా షేర్‌ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ఆదాయం అంత ఎక్కువగా ఉంటుంది.
  • REITలు (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు) - ఇది మీరు అద్దె ఆదాయాన్ని పొందని పెట్టుబడి, కానీ ఇక్కడ మీరు డివిడెండ్ రూపంలో ఆదాయాన్ని పొందుతారు. ఉదాహరణకి, ఒక కంపెనీ IT పార్క్‌ని నిర్మించడంలో పెట్టుబడి పెడితే, అది కంపెనీకి అద్దె చెల్లిస్తుంది మరియు మీరు ఈ సంస్థ యొక్క REITలను కొనుగోలు చేస్తే, అద్దె ఆదాయంలో కొంత భాగం డివిడెండ్ రూపంలో చెల్లించబడుతుంది. ఇది షేర్లు మరియు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి భిన్నంగా ఉంటుంది.
  • షేర్లు, బాండ్‌లు, ఫ్యూచర్‌లు మరియు ఎంపికలలో పెట్టుబడి పెట్టడం (మంచి పరిజ్ఞానంతో) కూడా సాంప్రదాయ పద్ధతిలోకే వస్తుంది

ఈ పద్ధతికి డబ్బు మరియు సమయం యొక్క కొంత ప్రారంభ పెట్టుబడి అవసరం. కానీ కొంత కాల వ్యవధి తర్వాత సమ్మేళనం ద్వారా డబ్బు మీ కోసం 24/7 పని చేస్తుంది 

సృజనాత్మక పద్ధతి

ఈ పద్ధతికి అద్భుతమైన సృజనాత్మక మనస్సు అవసరం. కమ్యూనికేషన్, స్థిరత్వం, కీలక జ్ఞానం మరియు సృజనాత్మకత ఈ విధానంలో విజయం సాధించడానికి పునాది. దీన్ని ఆన్‌లైన్ నిష్క్రియ ఆదాయం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది ప్రధానంగా ఇంటర్నెట్ ద్వారా జరుగుతుంది. నిష్క్రియ ఆదాయాన్ని సృష్టించగల అనేక సృజనాత్మక స్ట్రీమ్‌లు ఉన్నాయి. వాటిలో కొన్ని క్రింద పేర్కొనబడ్డాయి:

  • Youtube ఛానెల్ - వీక్షకులు చూసే ప్రకటనల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కొత్త వీడియోలు ఆదాయానికి సక్రియ మూలం, పాత వీడియోలు నిష్క్రియ ఆదాయ వనరు. మీరు అల్గారిథమ్‌లో అగ్రస్థానంలో ఉండేందుకు కొత్త వీడియోలను రెగ్యులర్ వ్యవధిలో పోస్ట్ చేయాలి.
  • బ్లాగింగ్ మరియు వ్లాగింగ్ - బ్లాగింగ్ మరియు వ్లాగింగ్ చేయడానికి చాలా సమయం, కృషి మరియు డబ్బు అవసరం. డబ్బు రావాలంటే కనీసం రెండేళ్లు నిజాయితీగా కృషి చేయాలి. ఈ రెండు స్ట్రీమ్‌లలోని ప్రమాదం ఏమిటంటే మీ విజయం పూర్తిగా ఇంటర్నెట్ అల్గారిథమ్‌లపై ఆధారపడి ఉంటుంది..
  • ఆన్‌లైన్ కోర్సులు, ఇ-బుక్స్, ఫోరమ్ రైటింగ్, ఆర్టికల్స్, డిజిటల్ ప్రోడక్ట్‌లు - ఆన్‌లైన్‌లో కోర్సును విక్రయించడం లేదా పాడ్‌క్యాస్ట్‌ను స్టార్ట్ చేయడానికి మొదట్లో చాలా ఎక్కువగా కష్టపడాలి. ఇక్కడ కోర్ జ్ఞానం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
  • అనుబంధ మార్కెటింగ్/ప్రోగ్రామ్‌లు - ఇది కంపెనీ తరపున ఒక ఉత్పత్తి లేదా సేవను ప్రచారం చేయడం మరియు వారి ద్వారా చెల్లింపును పొందడం. మూడవ పక్షం యొక్క లింక్ తప్పనిసరిగా ప్రచారం చేయబడాలి మరియు భాగస్వామ్యం చేయబడాలి. లింక్ ద్వారా ప్రతి క్లిక్ మరియు కొనుగోలుపై దాదాపు 3% నుండి 9% వరకు కమీషన్ పొందవచ్చు.
  • అనుబంధ మార్కెటింగ్ / ప్రోగ్రామ్‌లు - కంపెనీ తరపున ప్రోడక్ట్ లేదా సేవను ప్రచారం చేసి వారి నుండి పేమెంట్ పొందడం. థర్డ్ పార్టీ లింక్‌ను ప్రచారం చేసి షేర్ చేయాలి. లింక్ ద్వారా వచ్చిన ప్రతి క్లిక్ మరియు కొనుగోలుపై మీరు సుమారుగా 3% నుండి 9% వరకు కమీషన్ పొందవచ్చు.
  • సాఫ్ట్‌వేర్ ప్రోడక్టులు తయారుచేయడం.
  • వెబ్‌సైట్‌ల రూపకల్పన
  • Google AdSense ద్వారా అడ్వర్టైజింగ్ కమిషన్.
  • రెఫరల్ ప్రోగ్రామ్‌లు.
  • సభ్యత్వ సైట్‌ల సృష్టి.
  • E-Bay మొదలైన టెలిమార్కెటింగ్ కంపెనీలకు పునఃవిక్రేతలుగా మారడం
  • వ్యక్తిగత ఫైనాన్స్, ఇన్సూరెన్స్ మరియు గేమ్‌ల వంటి వివిధ అంశాలు మరియు సమాచారం కోసం వెబ్‌సైట్‌లు తయారుచేయడం.
  • ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నెట్ మార్కెటింగ్ మరియు టెలిమార్కెటింగ్.

ఆన్‌లైన్ వ్యాపారంలో కూడా అనేక సవాళ్లు ఉంటాయి. దాని ద్వారా ధనవంతులు కావడం అంత సులభం కాదు. నిజానికి ఇది సుదీర్ఘ ప్రయాణానికి నాంది. అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని వాటిని అమలు చేయడానికి మరియు వాటిని స్థిర ఆదాయంగా మార్చడానికి సమయం మరియు కృషి అవసరం. చాలా మంది వర్ధమాన వ్యవస్థాపకులు ఆన్‌లైన్‌లో ఆదాయాన్ని సంపాదించడానికి మార్గాలను సృష్టిస్తున్నారు. దాని ఫలితంగా నిష్క్రియ ఆదాయాన్ని సంపాదించడానికి చట్టబద్ధమైన మరియు సమర్థవంతమైన మార్గాలతో ముందుకు వచ్చారు.

నిష్క్రియ ఆదాయం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. మీరు సాధారణ ఉపాధిపై ఆధారపడకుండా ఆర్థిక స్వాతంత్ర్యం పొందుతారు. సంపాదించిన నిష్క్రియ ఆదాయం మీ అన్ని ప్రాథమిక అవసరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు సాధారణ ఉపాధిని కొనసాగించాల్సిన అవసరం లేదు.
  2. లక్ష్యాలను వేగంగా సాధించవచ్చు. సొంత ఇల్లు, కారు మరియు మీ బిడ్డ విదేశీ విద్యను పొందడం వంటి జీవితంలోని ముఖ్యమైన మైలురాళ్లను సులభంగా అందుకోవచ్చు.
  3. మీకు కావలసిన చోట, మీకు కావలసినప్పుడు పని చేసే స్వేచ్ఛ.
  4. నిర్ణీత సమయంపై ఆధారపడకుండా 24/7 ఆదాయం వస్తుంది.
  5. అనేక ఆదాయ మార్గాలను సమాంతరంగా సృష్టించవచ్చు.
  6. మీరు సంపాదించే ఆదాయం మొత్తం మీ సామర్థ్యం మరియు కృషిపై ఆధారపడి ఉంటుంది.
  7. మీరు మీ కుటుంబంతో గడపడానికి ఎక్కువ ఖాళీ సమయాన్ని పొందవచ్చు. జీవన నాణ్యత మెరుగుపడుతుంది.
  8. నిష్క్రియ ఆదాయ ఉత్పత్తి కారణంగా మీరు సురక్షితంగా ఉన్నారని భావించడం మొదలుపెట్టినప్పుడు, మీ విశ్వాసం పెరుగుతుంది.
  9. సాధారణ ఉద్యోగం పోయినప్పుడు సంక్షోభ సమయాల్లో నిష్క్రియ ఆదాయం ఒక రక్షణగా ఉంటుంది.
  10. చివరగా, సమాజానికి మరియు స్వచ్ఛంద సంఘాలకు మరింత సహకారం అందించగల సామర్ధ్యం మీకు వస్తుంది.

నిష్క్రియ ఆదాయం యొక్క లోపాలు

ప్రతి ఇతర వ్యాపారం వలె, నిష్క్రియ ఆదాయంలో లోపాలు ఉంటాయి. అనేక ఆదాయ వనరులను ఏర్పాటు చేయడం వల్ల కలిగే కొన్ని ప్రతికూలతలు క్రింద పేర్కొనబడ్డాయి:

రిస్క్ ఎక్కువ

ప్రతి వ్యాపారంలో ఉన్నట్టే నిష్క్రియ ఆదాయంలో కూడా రిస్క్‌లు ఉంటాయి  ఆదాయ ఉత్పత్తి రకాన్ని బట్టి రిస్క్ కూడా మారుతుంది. షేర్లు, డిబెంచర్లు, REITలు, కొత్త వ్యాపారం మొదలైన వాటిలో పెట్టడంలో అధిక-రిస్క్ ఫ్యాక్టర్‌ ఉంటుంది. కాబట్టి, పెట్టుబడిదారుడు తగినంత రిస్క్‌కి సిద్ధంగా ఉండాలి.

పెట్టుబడి అవసరం

నిష్క్రియ ఆదాయానికి ప్రారంభ పెట్టుబడి అవసరం. షేర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు,  షేర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, వ్యాపారంలో పెట్టుబడి మొదలైన అనేక వనరులకు మీ వైపు నుండి ప్రారంభ పెట్టుబడి అవసరం. కాబట్టి, ఎక్కువ డబ్బు సంపాదించడానికి మీరు ముందుగా ప్రారంభ మొత్తాన్ని సంపాదించాలి.

ఆధారపడలేని వనరులు 

నిష్క్రియాత్మక ఆదాయ వనరు యొక్క ప్రధాన లోపం ఏమిటంటే దీన్ని పూర్తిగా నమ్మలేము.ఈ కారణంగా వాటిని నిష్క్రియ ఆదాయ వనరులు అంటారు.ఎల్లప్పుడూ ప్రాథమిక లేదా క్రియాశీల ఆదాయ వనరు ఉంటుంది. యాక్టివ్ సోర్స్ అనేది మీ ప్రాథమిక ఆదాయ వనరు. ఇక్కడ మీరు డబ్బు సంపాదించడానికి మీ సమయాన్ని వెచ్చించి ప్రయత్నిస్తారు. ఈ సంపాదించిన డబ్బు మీకు నిష్క్రియ ఆదాయాన్ని అందిస్తుంది. మీ రోజువారీ జీవన ఖర్చుల కోసం కనీసం ప్రారంభ దశలో మీరు పూర్తిగా నిష్క్రియ వనరులపై ఆధారపడలేరు.

మార్కెట్ పరిస్థితుల ప్రభావం

దాదాపు అన్ని ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఆర్థిక వ్యవస్థలో ప్రబలంగా ఉన్న మార్కెట్ స్థితి ద్వారా ప్రభావితమవుతాయి. అవి మీరు చేసే ప్రయత్నాల కంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువగా ఆధారపడతాయి. కాబట్టి ఇవ్వన్నీ అస్థిర ఆదాయ ప్రత్యామ్నాయాలు. ఉదాహరణకు, మీరు మీ డబ్బును ఇన్వెస్ట్ చేసిన షేర్ల ధరను మీరు నియంత్రించలేరు. మీ అద్దెదారుగా మారమని మీరు ఎవరినీ బలవంతం చేయలేరు. కోవిడ్ వంటి సందర్భాల్లో, చాలా మంది అద్దెదారులు నగరాల్లోని ఇళ్లని ఖాళీ చేసి వారి స్వస్థలాలకు వెళ్లిపోవడంతో రియల్ ఎస్టేట్ భారీగా నష్టపోయింది.  ఈ విధంగా, బయట ఉన్న మార్కెట్ పరిస్థితులు సాధారణంగా మీ నిష్క్రియ ఆదాయ వనరులను భారీగా పెంచవచ్చు లేదా విచ్ఛిన్నం చేయవచ్చు.

ముగింపు

మంచి ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉండటానికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఉండటం చాలా ముఖ్యం. పైన చర్చించిన పద్ధతులు కొన్ని అత్యుత్తమ నిష్క్రియ ఆదాయ మార్గాలు. మీ వ్యక్తిగత ప్రాధాన్యత, ఆసక్తి, సామర్థ్యం, లభ్యత, ప్రారంభ పెట్టుబడి మొదలైన వాటిపై ఆధారపడి సరైన మార్గాన్ని ఎంచుకోండి.

నిష్క్రియ ఆదాయం, దాని ప్రయోజనాలు మరియు లోపాల గురించి ఇప్పుడే మీరు తెలుసుకున్నారు. మీ ప్రాధాన్యత, మీరు తీసుకొగలిగే  రిస్క్ బట్టి మీకు బాగా సరిపోయేదాన్ని మీరు పరిగణించవచ్చు. మీరు నిర్దిష్ట వ్యవధిలో ఎంత సంపాదించాలనుకుంటున్నారో లక్ష్యంగా పెట్టుకొని దాన్ని సాధించే దిశగా అడుగులు వేయండి. ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని ఉందా?సూక్ష్మ, చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలు (MSMEలు), వ్యాపార చిట్కాలు, ఆదాయపు పన్ను, GST, జీతం మరియు అకౌంటింగ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌లు, వార్తల బ్లాగులు మరియు కథనాల కోసం Khatabookని అనుసరించండి.

తరుచుగా అడిగే ప్రశ్నలు

ప్రశ్న: భారతదేశంలో నిష్క్రియ ఆదాయపు పన్ను విధించబడుతుందా?

సమాధానం:

అవును.  భారతదేశంలో నిష్క్రియ ఆదాయపు పన్ను విధించబడుతుంది.

ప్రశ్న: నిష్క్రియ ఆదాయానికి మరో పేరు ఏమిటి?

సమాధానం:

నిష్క్రియ ఆదాయాన్ని అవశేష ఆదాయం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది తక్కువ శ్రమతో లేదా ఎటువంటి ప్రయత్నం లేకుండా సంపాదించబడుతుంది

ప్రశ్న: అద్దె ఆదాయం యాక్టివ్ ఆదాయమా లేదా నిష్క్రియ ఆదాయమా?

సమాధానం:

అద్దె ఆదాయం నిష్క్రియ ఆదాయంలోకి వస్తుంది, ఎందుకంటే ప్రారంభ పెట్టుబడి తర్వాత సంపాదించడానికి 100% కృషి ఉండదు.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.