యాక్ససరీస్ వ్యాపారం ప్రారంభించడం ఎలా?
వినియోగదారులు తమ వార్డ్రోబ్లను రిఫ్రెష్ చేయడానికి తరచూ యాక్ససరీస్‌ను కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా 2011 నుంచి యాక్ససరీస్ వ్యాపారానికి ఎంతో ఆదరణ పెరుగుతూ వస్తోంది. 2011 మరియు 2016 మధ్య హ్యాండ్‌బ్యాగులు, వివిధ ఉపకరణాలు మరియు వస్త్ర ఉపకరణాల దుకాణాల ద్వారా 3.4 శాతం మేరకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఈ రంగంలో సంవత్సరానికి 9 శాతం వృద్ధి రేటు చోటుచేసుకుంటోంది. అంటే ప్రతీయేటా ఈ రంగం ద్వారా 9 శాతం వార్షిక ఆదాయ పెరుగుదల కనిపిస్తోంది. ఈ వ్యాపారంలోకి ప్రవేశించేముందు ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన సంస్థ ఏర్పాటుకు, వ్యాపార అవకాశాల మెరుగుదలకు వ్యవస్థాపకుడు తగినంత హోంవర్క్ చేయడం ఎంతో ముఖ్యం. మీకు ఉపకరణాలు (ఆభరణాలు, బ్యాగులు, టోపీలు మొదలైనవి) విక్రయించాలనే ఆసక్తి ఉంటే, ఇందుకోసం కొన్ని అంశాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.
తగిన పేరు, ప్రణాళిక సిద్ధం చేసుకోండి
బ్రాండ్ పేరు గురించి ఆలోచిస్తున్నప్పుడు, జాబితా కోసం నోట్‌ప్యాడ్‌ను సిద్ధం చేసుకోవడం మంచిది. అది మీకు అన్ని పేర్లను గుర్తుంచుకోవడానికి మరియు తొలగింపు ప్రక్రియను సులభతరం చేయడానికి సహాయపడుతుంది. మీ వ్యక్తిత్వం లేదా బ్రాండ్ సందేశాన్ని నొక్కి చెప్పేలా ఆలోచిస్తూ వ్యాపారానికి మంచి పేరును నిర్ణయించండి. మీ ఉపకరణాల స్టోర్ కోసం వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోండి. వ్యాపార ప్రణాళిక అనేది పెట్టుబడిదారునికి మాత్రమే సంబంధించనది కాదు. ఇది మీ వ్యాపారం ప్రారంభించడానికి మరియు నిర్వహణకు మార్గదర్శకంగా నిలుస్తుంది. మీ ఉపకరణాల దుకాణాన్ని ఆన్లైన్ స్టోర్‌లో కియోస్క్‌గా ఉండేలా మీ ప్లాన్ ఉండటం ఉత్తమం. మీరు వ్యాపారం ప్రారంభించడానికి వ్యాపార ప్రణాళికకు టెంప్లేట్‌ను ఉపయోగించండి. మీ వ్యాపార ప్రణాళికలో లాభదాయకమైన ఉపకరణాల సంస్థను నడపడానికి ఎంత ఖర్చవుతుంది? మరియు లాభం అందుకునేందుకు ఏమేమి చేయాలనే దానిని పేర్కొనండి. మీ స్థానిక షాపింగ్ లేదా స్ట్రిప్ మాల్లో స్టోర్ ఫ్రంట్ లేదా కియోస్క్‌ను లీజుకు తీసుకునేందుకు ఎంత ఖర్చవుతుందో పరిశోధించండి. ఫ్యాషన్ ఉపకరణాల కొనుగోలుకు హోల్‌సేల్ రేట్లను అన్వేషించండి. ఆన్లైన్ దుకాణాల కోసం అంతర్గత ఖర్చులను సరిపోల్చి చూసుకోండి. సారూప్య ఉపకరణాల కోసం మీ పోటీదారుల ధర పాయింట్లను పరిశోధించండి. మరియు నగలు మరియు ఉపకరణాలను ఎలా ప్రదర్శించాలో పరిశోధించండి. అదనంగా మీ దుకాణంలో సిబ్బంది జీతాలకు ఎంత ఖర్చవుతుందో, వారు మీ వ్యాపారాన్ని మీరు ఎలా మార్కెట్ చేస్తారు? ఎలా ప్రోత్సహిస్తారు? తదితర వివరాలను పొందుపరచండి.
ఇంటర్నెట్ సాయం తీసుకోండి
యాక్ససరీస్‌కు సంబంధించిన కొన్ని అనుబంధ తయారీ కోర్సులు / తరగతుల గురించి తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. ఇది మీ బ్రాండ్‌ను మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుంది. మరియు మీ వ్యాపార నిర్వహణకు మరింత సులభతరం చేస్తుంది. టోకులో దొరికే యాక్ససరీస్, అనుబంధ డిజైన్ల కోసం ఆన్లైన్ శోధనను నిర్వహించండి. మీరు వాటిని రూపకల్పన చేసినా లేదా కొనుగోలు చేసినా, అవి మీ లక్ష్య మార్కెట్‌కు అనువైనవిగా ఉండేలా చూసుకోండి. రకరకాల చెవిపోగులు, నెక్లెస్‌లు,ఉంగరాలు, హ్యాండ్‌బ్యాగులు, పర్సులు, బెల్టులు మొదలైన ఉపకరణాలను అధికంగా కొనుగోలు చేయండి.
మీ బ్రాండ్‌కు తగిన థీమ్‌ను ఎన్నుకోండి
మీరు బ్రాండ్‌కు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించాలనుకుంటున్నారో తగిన విధంగా నిర్ణయించుకోండి. మీరు ఉల్లాసంగా గడిపే వ్యక్తి అయితే లేత రంగులు మరియు సరదా డిజైన్లను ఎంచుకోండి. మీరు సీరియస్‌గా ఉండే వ్యక్తి అయితే ఎటుంటి బ్రాండ్ మీకు సరిపోతుందో దానికి రూపకల్పన చేయండి. ఇది చాలా కీలకమైన అంశం. మీ బ్రాండ్ మరియు మార్కెటింగ్ ప్రణాళికను అభివృద్ధి చేయండి. ఇందుకోసం మంచి విశ్లేషణను నిర్వహించండి. ఇది ఇప్పటికే ఉన్న పోటీ వ్యాపారులు, మీ వ్యాపార బలాలు, బలహీనతలు, అవకాశాలు మరియు ఉపకరణాల సంస్థను ప్రారంభించడానికి లేదా స్వంతం చేసుకోవడానికి తగిన వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేయండి. ఉపకరణాల విషయంలో వినియోగదారుల అభిరుచులను మరియు వారి కొనుగోలు ప్రవర్తనలను అర్థం చేసుకుని, మీ లక్ష్య మార్కెట్‌కు రాబోయే కస్టమర్లను తెలుసుకోండి. ఈ పరిజ్ఞానం ద్వారా మీరు మీ వ్యాపారాన్నిఅభివృద్ధి చేసేందుకు మరియు బ్రాండ్ చేయడానికి ఉత్తమమైన పద్ధతులను గ్రహించవచ్చు. ఉదాహరణకు, ఫ్యాషన్ బ్లాగులు లేదా వీడియో షేరింగ్ సైట్లలో కనిపించే ఉత్పత్తి సమీక్షలు లేదా ట్యుటోరియల్స్ ఆధారంగా మీ లక్ష్య మార్కెట్ వారి కొనుగోలు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఫలితంగా మీరు మీ ఉపకరణాలను వివిధ దుస్తులకు మ్యాచ్ అయ్యేలా ఎలా ఉపయోగించాలో ఆన్లైన్ ట్యుటోరియల్‌లను క్రియేట్ చేయవచ్చు. వాటిని బ్లాగ్ లేదా వీడియో షేరింగ్ సైట్లో పోస్ట్ చేయండి. మీ వ్యాపార ప్రణాళికలో మీరు మీ స్వంత ఉపకరణాలకు రూపకల్పన చేస్తారా? లేదా వాటిని నగల డిజైనర్లు లేదా ఫ్యాషన్ అనుబంధ టోకు వ్యాపారుల నుండి కొనుగోలు చేస్తారా? అనేది మీరే నిర్ణయించుకోవాలి.
వివిధ అంశాలను పరిశీలించండి
మీరు నిజంగా ఏదైనా ఉత్పత్తి చేసేముందు లేదా మీ బ్రాండ్‌ను ఖరారు చేయడానికి ముందు, క్రాఫ్ట్ ఫెయిర్లకు వెళ్లి, వారు అందుబాటులో ఉంచిన ఆభరణాలను పరిశీలించండి. మీకు నచ్చిన ఉపకరణాల రూపురేఖలను, రూపకల్పన లక్షణాలను గమనించండి. తద్వారా మీరు వాటిని రూపొందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. వివిధ రకాల ఉపకరణాలు రూపొందించండి. ఇతరులు ఆభరణాలను వివిధ రకాలుగా ఎలా తయారు చేస్తుంటారో యూట్యూబ్‌లో చూసి తెలుసుకోండి.
వినియోగదారులకు మీ ఉత్పత్తులను చూపించండి
మీరు అద్భుతమైన ఉత్పత్తులను తయారు చేసిన తరువాత, వాటికి తగిన ప్రచారాన్ని కల్పించండి. ఇందుకోసం మీ స్నేహితులను కలవండి.వారి అభిప్రాయాలను తెలుసుకోండి. వాటిని విక్రయించడానికి ప్రయత్నించండి. మీరు ఇంకా పెద్ద బ్రాండ్‌లో భాగం కానందున మీ ఉత్పత్తులకు అధిక ధరలు నిర్ణయించకూడదు. మీ వ్యాపారాభివృద్ధికి కరపత్రాలను తయారు చేయండి. వ్యాపార కార్డులను బులెటిన్ బోర్డులలో పోస్ట్ చేయడమనేది వ్యాపారాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అలాగే మీ స్వంత వెబ్‌సైట్‌ను సెటప్ చేయడం అనేది మీరు ఆభరణాలను విక్రయించడానికి,పెద్ద బ్రండ్గా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుంది.
నిర్వాహకులను కలవండి
మీ యాక్ససరీస్ అమ్ముడవుతుంటే కొంతమంది హై స్ట్రీట్ స్టోర్ నిర్వాహకులతో మాట్లాడటానికి సమయం ఆసన్నమైందని గుర్తించండి. అది మీకు నిధులు సమకూర్చే బ్రాండ్ ఇమేజ్ ఇస్తుంది. లోయర్ ఎండ్ ఫ్యాషన్ స్టోర్‌తో అపాయింట్మెంట్ ఇవ్వడం ప్రారంభించడానికి ఇది మంచి మార్గం. ఇందుకోసం నిరంతరం కృషి చేస్తుండండి. మీరు క్రాఫ్ట్ ఫెయిర్లకు వెళ్లే టప్పుడు మీ ఉపకరణాలను అక్కడ విక్రయించండి. ఈ విధానం మీ వ్యాపారాభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. కొన్ని ఇతరులకన్నా మీ వ్యాపారానికి ఎక్కువ ప్రాచుర్యం పొందాలంటే ఇటువంటి ప్రక్రియల తప్పనిసరిగా చేయాలి.
అత్యుత్తమ వ్యాపారం ఆరంభం అవసరం
ఈ వ్యాపారానికి అవసరమైన మేరకు తగినంత డబ్బు మీ దగ్గర ఉంటే మీ స్వంత దుకాణాన్ని తెరవడానికి ఇదే తగిన సమయం అని భావించండి. మీ వ్యాపారానికి అనువైన ప్రాంతం ఎక్కడవుందో తెలుసుకునేందుకు విస్తృతంగా పరిశీలన చేయండి. షాపింగ్ సెంటర్ మధ్యలో మీ స్వంత స్టాల్ ఏర్పాటు చేసుకోండి. మీరు నివసించే ప్రదేశానికి దగ్గరగా ఒక గ్రౌండ్ ఫ్లోర్ అపార్ట్మెంట్లో ఈ వ్యాపారం ప్రారంభించడం కూడా ఉత్తమ ఆలోచనే. అపార్ట్మెంట్ యజమాని అనుమతితో దుకాణం ఏర్పాటు చేసుకోవచ్చు.
సిబ్బంది నియామకం
మీ దుకాణం నిర్వహణకు కొంతమంది సిబ్బందిని నియమించుకోండి. జాబ్ మార్కెట్ వేగంగా తగ్గుతున్నందున, మీరు మీ స్నేహితుడికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా వారికి సహాయపడవచ్చు. మీరు మీ స్వంత వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ మరొక దుకాణంతో కలసి బ్రాండ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. వ్యాపారం అనుకున్నంత బాగా జరగకపోతే, దానిని చక్కదిద్దేందుకు మీ స్నేహితులను అడగండి. విస్తృతంగా ప్రకటనలు ఇవ్వడం ద్వారా వ్యాపారాన్ని గాడిలో పెట్టండి
మీరు వ్యాపారాన్ని ప్రారంభించే ముందు వ్యాపార నమోదు, లైసెన్సింగ్, అనుమతులు మరియు పన్నులపై అవగాహన పెంచుకోండి. ఈ విషయంలో ప్రతి రాష్ట్రానికి నియమాలు మరియు ప్రక్రియలకు వేర్వేరుగా ఉంటాయి. మీ రాష్ట్ర రిటైల్ పన్ను విధాలను కూడా తెలుసుకోండి. అమ్మకపు పన్ను అనేది మీ వ్యాపారానికి అవసరం. మీ మీ రాష్ట్ర లైసెన్సింగ్ విభాగంలో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కనుగొనండి. కొత్త స్టోర్ లేదా కియోస్క్ అవసరాల కోసం మీరు షాపింగ్ మాల్ నిర్వహణ కార్యాలయాల నుండి కూడా అదనపు సమాచారాన్ని పొందవచ్చు. మీ ఉత్పత్తులు, సరఫరా మరియు డిమాండ్‌ను అర్థం చేసుకోవడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. ఇది మీ వ్యాపారాభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది.