written by | October 11, 2021

జీఎస్టీ ప్రభావం కిరణా దుకాణంపై

×

Table of Content


కిరాణ దుకాణంపై జీఎస్టీ ప్రభావం

ఇంట్లో వంటకు, తినేందుకు కావాల్సిన సరుకులు కొనేందుకు గతంలో చాలా మంది కిరాణ దుకాణాలను అశ్రయించేవారు.
మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సూపర్‌ మార్కెట్లు ప్రాచూర్యంలోకి వచ్చాయి. కిరాణ దుకాణాల పరిధి
తగ్గినప్పటికీ.. ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. వీధికి ఒకటైనా కిరాణ దుకాణం ఉండటం అనేది సాధారణం.

కిరాణ దుకాణాల పని తీరులో జీఎస్టీ ప్రభావం కబడుతోంది. ఇది వాటి వ్యవహాల్లో మార్పులను తీసుకొచ్చింది. అప్పటి
వరకు ఒకలా ఉన్న పరిస్థితి, అనంతరం మరోలా మారింది. సాంకేతికత వినియోగం, చట్టపరమైన కాంప్లియన్సస్‌ పై కిరాణ
దుకాణదారులకు అవగాహన ఏర్పడేలా చేసింది.

జీఎస్టీ అంటే?

వస్తు సేవల పన్ను (జీఎస్టీ)) అనేది వస్తువులు మరియు సేవల సరఫరాపై భారతదేశంలో ఉపయోగించే పరోక్ష పన్ను.ఇది
సమగ్రమైన, మల్టీస్టేజ్ పన్ను. కొన్ని రాష్ట్ర పన్నులు మినహా దాదాపు అన్ని పరోక్ష పన్నులకు జీఎస్టీ ముగింపు పలికింది.
ఇందులో వ్యాట్‌ మాదిరిగా పన్ను పై పన్ను ఉండదు. భారత రాజ్యాంగ 101వ సవరణ ద్వారా ఈ పన్ను 1 జూలై 2017
నుంచి అమల్లోకి వచ్చింది.

ఉత్పాదక ప్రక్రియలో అడుగడుగునా జీఎస్టీ విధించబడుతుంది. కానీ తుది వినియోగదారుడు మినహా వివిధ ఉత్పత్తి దశలలో
భాగస్వాములైన అందరికి తిరిగి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ రూపంలో చెల్లింపు జరుగుతుంది.

జీఎస్టీ పన్ను రేటును ఐదు వేర్వేరు పన్ను స్లాబ్‌లుగా విభజించారు – 0%, 5%, 12%, 18%, 28%. పెట్రోలియంఉత్పత్తులు, మద్య పానీయాలు, విద్యుత్తు జీఎస్టీ పరిధిలోకి రాదు. వీటిని పాత పన్ను విధానం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వాలువిడిగా పన్నును విధించుకుంటాయి.

ఒకప్పుడు కిరాణ, వాణిజ్య సముదాయాల పరిస్థితి…

ఒకప్పుడు కిరాణ దుకాణాల యజమానుల జీవితం చాలా సులభంగా ఉండేది. సరఫరా చేసే వాల్లు, డీలర్లు.. దుకాణానికివచ్చి ఆర్డర్లు తీసుకునే వారు. సామాగ్రి కూడా వీలైనంత త్వరగా వచ్చేది. అప్పుడు కిరాణ దుకాణాలల యజమానులలోచాలామందికి వ్యాట్ రిజిస్ట్రేషన్ లేదు. వినియోగదారులు బిల్లు అడిగే వారు కాదు. డీలర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులకు చెల్లించేపన్ను మాత్రమే వారు చెల్లించేవారు. వ్యాట్‌లో భాగంగా పన్నుపై పన్ను గణన అవుతుండేది.

అమ్మకపు పన్నుకు సంబంధించిన అధికారులు వాణిజ్య సముదాయాలపై ఆకస్మాత్తుగా దాడి చేసే రోజులు ఉండేవి. వారికి
నిర్ధేశించిన పన్ను వసూలు లక్ష్యాలను చేరుకోకపోవటంతో ఉన్నతాధికారుల.. వారిపైన ఒత్తడి తీసుకొచ్చేవారు. దాదాపుఆర్ధిక సంవత్సరం చివరిలో ఇలాంటి పరిస్థితి ఉండేది. పన్ను ఆదాయం తగ్గినప్పుడు ఈ సంఘనటలు జరిగేవి.

గత సంవత్సరం పన్ను బాకీలను కట్టాలని, పన్ను వసూలు చేసే అధికారులు… వాణిజ్య దుకాణల యజమానులనుఅడిగేవారు. ఈ ప్రక్రియ నియంతృత్వంగా ఉండేది. ఇది భూస్వామ్యం కాలంలో పన్ను వసూలను తలపించేది. కానీ ఈపరిస్థితి మారిపోయింది.

జీఎస్టీతో మార్పులు..

జీఎస్టీలో పన్నుపై పన్ను లెక్కించటం కుదరదు. దీనికోసం జీఎస్టీలో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ అనే యంత్రాంగం ఉంది.ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పొందాలంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి పన్ను వసూలు కూడా సరిగా అవుతుంది.

కిరాణ దుకాణాలు పన్నును తప్పించుకోలేరు. ఎందుకంటే పూర్తి వాల్యు చైన్ ఆన్‌లైన్‌లో ట్రాక్ అవుతుంది. మార్జిన్‌ లపైఆధారపడి కార్యకలాపాలు నిర్వహించే వారికి వ్యూహంలో మార్పులు తీసుకొచ్చింది జీఎస్టీ.

పూర్తి ఆన్‌లైన్‌..

ఆన్‌లైన్‌లో పన్నులు దాఖలు చేయాల్సిన డిజిటల్ వ్యవస్థపై జీఎస్టీ ఆధారపడి ఉంటుంది. కిరాణ దుకాణాల, తదితర చిన్న
వ్యాపారులకు సాంకేతిక విషయాలపై అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద కార్పొరేట్ సంస్థలు… ట్యాక్స్‌కన్సల్టెంట్ల నియమించుకుంటాయి. జీఎస్టీ విషయంలో చిన్న వ్యాపారుల్లో చాలా గందరగోళం ఉంది. జీఎస్టీ కింద పన్నురిటర్నులు దాఖలు చేసే విధానాన్ని అర్థం చేసుకోవడంలో చిన్న వ్యాపారాలకు కొంత ఇబ్బంది ఎదురౌతుంది.

జీఎస్టీని అమలు చేసేందుకు కావాల్సిన ఐటీ పరిజ్ఞానాన్ని , జీఎస్టీ నెట్‌వర్క్‌ అభివృద్ధి చేసింది. అనేక టూల్స్‌ను కూడాతయారు చేసింది. వీటిని ఉచితంగా పొందవచ్చు. వీటి ద్వారా సులభంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు.

రిటైలర్లపై జీఎస్టీ ప్రభావం…

కిరాణ దుకాణాల తదితర చిన్న తరహా రిటైలర్లపై జీఎస్టీ ప్రభావం చూపుతుంది. నమోదు చేసుకున్న వ్యాపారులందరికీ…
శాశ్వత ఖాతా నంబర్, దానితో అనుసంధానించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. ప్రతి ఆర్థిక లావాదేవీలు పన్నుల
శాఖ పరిశీలనలోకి వస్తాయి. చట్టం గురించి తగినంత అవగాహన లేకుండా వ్యాపారి చేసే చిన్న లావాదేవీకి కూడా ఆయనే
జవాబుదారీగా ఉంటాడు.

రిటర్న్‌లు దాఖలు చేయాలి.

వ్యాపారులు తమ వార్షిక టర్నోవర్ రూ .10 లక్షల లోపు ఉంటే జీఎస్టీ కింద నమోదు చేసుకోవలసిన అవసరం లేదు. వార్షిక
టర్నోవర్ రూ .50 లక్షల వరకు ఉన్న వ్యాపారులు కాంపోజిషన్‌ పథకం తీసుకోవచ్చు. దీని ప్రకారం 1% జీఎస్టీచెల్లించడానికి అవకాశం ఇవ్వబడుతుంది. వార్షిక టర్నోవర్ విషయంలో ఆధారాలు పొందుపరుచుకోవాలి. రోజుకుసగటున కేవలం 3,000రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపారి కూడా జీఎస్టీ ప్రకారం నమోదు చేసుకోవాల్సి ఉంది. పన్నుమినహాయింపు ఉన్న సరుకు ను కూడా మొత్తం టర్నోవర్‌ కు జమౌతుంది. పాలు, గుడ్లు, ఉప్పు, హస్తకళల తదితరాలనుమొత్తం అమ్మకాలలో భాగంగా పరిగణిస్తారు.

ఉపయోగకరంగా సాఫ్ట్‌వేర్లు…

కిరాణ దుకాణాల్లో జీఎస్టీ తదితర పనుల కోసం వివిధ రకాల సాఫ్ట్‌వేర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారాఅమ్మకాలు, కొనుగోళ్లు వాటిని నమోదు చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ల ద్వారా అకౌంట్స్‌ అన్నీ సరిగ్గా నిర్వహించుకోవచ్చు.జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసే సందర్భంలో ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.

కొన్ని కంపెనీలు… ఎక్విప్‌మెంట్‌తో సహా సాఫ్ట్‌వేర్‌ ను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటిని.. చిన్నవ్యాపారులకు తగినట్లు కంపెనీలు అభివృద్ధి చేశాయి. వీటి ద్వారా డిజిటల్‌ పేమెంట్లు కూడా చేసే వీలుంటుంది. కొన్నికంపెనీలు జీఎస్టీకి సంబంధించి కొన్ని టూల్స్‌ను ఉచితంగానే అందిస్తున్నాయి.

జీఎస్టీ రిటర్నుల దాఖలు కోసం పన్నుకు సంబంధించి నిపుణులను సంబంధించవచ్చు. వీరు రిటర్నుల దాఖలు పూర్తి
ప్రక్రియను పూర్తి చేసి కొంత ఫీజు తీసుకుంటారు. వీరి వల్ల ఫైలింగ్‌ ఎలాంటి టెన్షన్‌ లేకుండా పూర్తి చేసుకోవచ్చు.

జీఎస్టీకి సంబంధించి పరిగణించవలసిన కొన్ని విషయాలు:

● వ్యాపారానికి సంబంధించిన వార్షిక ఆదాయం రూ. 20 లక్షలు దాటినట్లైతే తప్పనిసరిగా వస్తు సేవల పన్నురిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. పన్ను విధించదగిన, పన్ను లేని తదితరాల వాటి నుంచి వచ్చిన ప్రతిదీ ఇందులోఉంటుంది.
● వార్షిక టర్నోవర్ రూ. 75 లక్షలు ఉన్నట్లయితే… మీరు జీఎస్టీలో కాంపోజిషన్‌ పథకాన్ని ఎంచుకోవచ్చు.
● కంపోజిషన్ పథకంలో… 4 త్రైమాసిక రిటర్నులు, 1 వార్షిక రాబడి ఉంటుంది. దాఖలు చేయవలసిన మొత్తంరిటర్నుల సంఖ్య 5 అవుతుంది. ప్రతి త్రైమాసికం చివర్లో.. ఆ త్రైమాసికం టర్నోవర్‌లో 1 శాతాన్ని చెల్లించాల్సిఉంటుంది. మీరు చెల్లించిన జీఎస్టీ క్రెడిట్‌ను తీసుకోలేరు. ఇతరుల నుంచి దీన్ని రికవరీ చేసుకోలేరు. ఇది మీస్వంత జేబులో నుంచి చెల్లించాలి. అయితే ఇది కాంప్లియన్స్‌ పై ఖర్చును చాలా వరకు తగ్గిస్తుంది.
● సాధారణ వస్తు సేవల పన్ను రిటర్నులు దాఖలు చేయటం మరో మార్గం. ఇందులో మీరు 3 నెలవారీ రిటర్నులు, 1వార్షిక రిటర్న్ దాఖలు చేయాలి. సంవత్సరానికి దాఖలు చేయాల్సిన మొత్తం రిటర్న్‌ల సంఖ్య 37 అవుతుంది.ఇక్కడ, మీరు చెల్లించిన జీఎస్టీ యొక్క క్రెడిట్ తీసుకోవచ్చు మరియు మీరు మీ జేబు నుండి చెల్లించాల్సిన అవసరంలేదు. అయినప్పటికీ, మీరు కంపోజిషన్ స్కీమ్ కంటే ఎక్కువ సమ్మతి ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఇక్కడ,మీరు చెల్లించిన జీఎస్టీకి సంబంధించి క్రెడిట్తీసుకోవచ్చు. స్వంత జేబులో నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు.అయితే కాంపోజిషన్‌ పథకం కంటే ఇందులో కాంప్లియెన్స్‌పై ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.

పన్ను ఎగవేత కుదరదు.. ఎందుకు?

జీఎస్టీలో పన్ను ఎగవేత కుదరదు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు ముందస్తుగా వెళ్లి ఒకే మొత్తంలో పన్ను అడ్వాన్సులను
చెల్లించలేవు. దుకాణాలు ఎంత పన్ను కట్టాలన్నది? ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కాబట్టి దుకాణాలు.. మొత్తం పన్నును
చెల్లించటం లేదా పన్ను చెల్లింకపోవటం లాంటివి చేయటానికి మాత్రమే వీలుంది. అన్ని లావాదేవీలునమోదఅవుతున్నందున… కొంత పన్నును వసూలు చేయమని పన్ను వసూలు చేసేవారు అడిగేందుకు వీలు లేదు. కాబట్టి మొత్తంప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.

జీఎస్టీ ప్రభావం.. కిరాణ దుకాణాల్లో కింది విధంగా ఉంటుంది.

1. చట్టపరంగా కాంప్లియన్స్‌ భారం..

నెలకు మూడు రిటర్న్‌లు దాఖలు చేయాలి. దీనికోసం రికార్డులను సరిగ్గా నిర్వహించుకోవాలి. దీనివల్ల భారం
పెరుగుతుంది.

2. పన్నుల పెరుగుదల

జీఎస్టీ మూలంగా ప్రధాన ఉత్పత్తుల రేటు 12% లేదా 18% పెరిగింది. ఒక వ్యాపారికి ఇది పన్ను భారం అవుతుంది.

3. టెక్నాలజీపై అవగాహన

జీఎస్టీ ప్రకారం పలు ఖాతాలను సరిగా నిర్వహించాలి. దీనికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం. కాబట్టి దీనిపై అవగాహన
అవసరం.

రిటైల్‌ రంగంపై ప్రభావం…

కిరాణ దుకాణాలే కాకుండా రిటైల్ రంగంపై జీఎస్టీ ప్రభావం పడింది.

1. తగ్గిన పన్నులు –

జీఎస్టీ రాకముందు ఉన్న ప్రస్తుత పన్నుల వ్యవస్థలో, చాలా రిటైల్ ఉత్పత్తులపై సగటున 30% పరోక్షపన్ను ఉండేది. ఇందులో ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తదితర పన్నులు ఉన్నాయి. జీఎస్టీ వల్ల చిల్లర వ్యాపారులపై పన్నుభారం తగ్గనుంది.

2. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ –

జీఎస్టీలో పన్నుకు సంబంధించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ లభిస్తుంది. అన్ని ముడిసరుకులనుంచి అంతిమ ఉత్పత్తి వరకు అన్నింటిపై జీఎస్టీ ఉంటుంది. పనున్నపై పన్ను ఉండదు.

3. పెరిగిన సరఫరా గొలుసు సామర్థ్యం-

రిటైల్ పరిశ్రమల గిడ్డంగి నెట్‌వర్క్‌లపై జీఎస్టీ ప్రధాన ప్రభావం చూపెట్టింది.వీటికి సంబంధించిన పన్ను రద్దు అయింది. దీనివల్ల కొన్ని గిడ్డంగులు ఏకకీకరణ జరిగింది. జీఎస్టీకి సంబంధించి రాష్ట్రసరిహద్దులు తక్కువగా ఉండటం వల్ల రవాణాకు ప్రయోజనం కలిగింది. చెక్ పోస్టులు, రాష్ట్ర సరిహద్దుల వద్ద సుదీర్ఘంగావేచి ఉండే సమయం తగ్గిపోయింది. జీఎస్టీ యొక్క ప్రభావం సరఫరా గొలుసులపై స్పష్టంగా కనిపించింది.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.