written by | October 11, 2021

కిరణా స్టోర్

×

Table of Content


కిరాణ దుకాణంలో లాభాలు పెంచుకునేందుకు ఐదు సూత్రాలు.

వినియోగదారుల వివిధ అవసరాలను ఉపయోగపడే వేదిక లాంటిది కిరాణ దుకాణం. ప్రజల అవసరాలు తీర్చేందుకు అవసరమైన ఉత్పత్తులు ఈ దుకాణాల్లో ఉంటాయి. ప్రతి వీధిలో ఒక్కటన్నా.. కిరణా దుకాణం ఉంటుంది.వీటి మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది. 

ఎక్కువ విక్రయాలు జరిపి, ఎక్కువ లాభాలను గడించేందుకు కిరాణా దుకాణ యజమానులు కొన్ని చిట్కాలను తెలుసుకోవాలి. ఇవి వీధిలోని మిగతా కిరాణా దుకాణాల యజమానులకు తెలియక ముందే తెలుసుకోవటం ముఖ్యం. చిట్కాలు మరియు ఉపాయాలు తెలుసుకోవాలి. ఇది పోటీదారుల కంటే మనల్ని ఒకమెట్టు పైన ఉంచుతుంది. 

2024 నాటికి భారతీయ కిరాణా మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్లు అవుతుందని…  అందులో దాదాపు 60 శాతం పండ్లు, కూరగాయలు, మాంసం లాంటి తాజా ఉత్పత్తులు ఉంటాయని బేన్‌ అండ్‌ కో 2019లో అంచనా వేసింది. 

లాభాలను వెంటనే పెంచుకునేందుకు… స్టోర్ యజమాని, కొన్ని చిట్కాలను పాంటిచాలి.  వాటి గురించి తెలుసుకుందాం. 

మీ కిరానా స్టోర్ ఆన్‌లైన్‌లో తీసుకోండి

నేడు, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో బిజీగా ఉన్నారు. వారి బిజీ షెడ్యూల్‌లో, వారు తమ కుటుంబంతో గడపడానికి తగినంత సమయం పొందలేకపోతున్నారు. వారాంతాల్లో వారి కుటుంబాలతో కలిసి వారు ఇంటి వస్తువుల కోసం షాపింగ్ చేయవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిని లేకుండా ఉండేందుకు, ఈ రోజుల్లో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఎంచుకున్నారు.

2020 లో భారతదేశంలో 170 మిలియన్ల మంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తారని ఇండియన్‌ బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ అంచనా వేస్తోంది. ట్రక్, బైక్ లేదా సూది…ఇలా ఏదైనా ఆన్‌లైన్‌లో కావలసినదాన్ని కనుగొనచ్చు. ఆన్‌లైన్‌లో ప్రతిదీ అందుబాటులో ఉంది. మీ వ్యాపారానికి సంబంధించి కూడా ఆన్‌లైన్‌ గురించి ఆలోచించుకోవచ్చు. 

కిరానా దుకాణాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకెళ్లడం గురించి వ్యాపారులు ఆలోచించవచ్చు. ఆన్‌లైన్ కిరణా స్టోర్ అనేది కొత్త కాన్సెప్ట్ కాదు. చాలా మంది స్టోర్ యజమానులు తమ ఉత్పత్తులను ఇప్పటికే ఆన్‌లైన్‌లో అమ్మడం ప్రారంభించారు. మీరు కూడా అదే ఎంచుకోవచ్చు. 

వినియోగదారులను పొందటానికి, మీరు మీ ఆన్‌లైన్ కిరణా స్టోర్‌ను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. అందులో ప్రకటనల ద్వారా వ్యాపారం పెంచుకోవచ్చు. అదే విధంగా బ్లాగ్‌ ను ప్రారంభించవచ్చు. అంతేకాకుండా వాట్సప్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ లాంటి అధునాతన మార్కెటింగ్‌ వ్యూహాలను అమలు చేయవచ్చు. 

వారాంతాల్లో కిరాణా దుకాణాన్ని తెరిచి ఉంచటం… 

కొంతమంది దుకాణ యజమానులు..  తమ దుకాణాన్ని నిర్ణీత సమయం పరిధిలోనే తెరిచి ఉంచుతారు. దగ్గర్లోనే వారు సమీపంలోనే నివసిస్తున్నప్పటికీ ఈ పని చేస్తారు. ఉదాహరణకు ఉదయం 9 నుండి రాత్రి 8 గంటల వరకు తెరుస్తున్నారనుకోండి. ఈ కిరణ దుకాణాన్ని ఉదయం 8 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు తెరిచే ఉండవచ్చు. 

అధిక అమ్మకాలు పొందడానికి మీరు ఆదివారాలు, ఇతర సెలవు దినాలలో దుకాణాన్ని తెరిచే ఉంచాలి. ఇతర కిరాణా దుకాణ యజమానులు నిద్రపోతున్నప్పుడు, సరదాల్లో నిమగ్నమైనప్పుడు మీరు విక్రయాలు జరగపటం ద్వారా లాభాలను అర్జించవచ్చు. ఇలాంటి సమయాల్లో మూసివేసి ఉన్న దుకాణ కస్టమర్లు కూడా మీ దుకాణంలో కొనుగోల్లు జరుపుతారు. 

ఇలాంటి సందర్భంలో మీకు విశ్వసనీయ కస్టమర్లు దొరుకుతారు. వారు నోటి మాట ద్వారా మనకు ప్రచారం కూడా లభిస్తుంది. తద్వారా మీ దుకాణంలో విక్రయాలు పెరుగుతాయి. 

వారం మొత్తం తీరిక లేకుండా గడిపిన చాలా మంది కస్టమర్లు వారాంతాల్లో ఎక్కువ కొనుగోళ్లను చేస్తారు. ఈ సమయంలో కిరాణ దుకాణం తెరిచి ఉండటం ముఖ్యం. 

దుకాణానికి సంబంధించి వైబ్‌సైట్‌ను ప్రారంభించండి. 

అమెజాన్ వంటి వివిధ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లలో మీ స్టోర్‌లోని వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించవచ్చు. ఈ వెబ్‌సైట్‌లలో కిరాణా దుకాణాన్ని నమోదు చేసుకోవచ్చు. ఈ సైట్ల ద్వారా కిరాణ దుకాణంలో ఉన్న వాటిని ఎవరైనా ఆర్డర్‌ చేసినట్లైతే… వాటిని మీరు పార్సల్‌ చేయవచ్చు. 

మీ కిరాణా దుకాణాన్ని ఆన్‌లైన్‌లో ఉంచటంతో పాటు స్వంత వెబ్‌సైట్‌ను కూడా కలిగి ఉండవచ్చు. దీనివల్ల … మీ దుకాణంలో షాపింగ్‌ చేసే రెగ్యులర్ కస్టమర్‌లకు, వారి ఇంటి సౌలభ్యం నుంచే  షాపింగ్ చేయడానికి వీలు అవుతుంది. ఫోన్ కాల్ ద్వారా మీ స్టోర్ నుండి కొనుగోలు చేసే సదుపాయాన్ని కూడా వారికి అందించవచ్చు. 

మంచి, హెచ్‌డీ చిత్రాలను ఉపయోగించి వెబ్‌సైట్‌ను డిజైన్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో ట్రాఫిక్ పొందడానికి ఎస్‌ఈఓ,ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యూహాలను కూడా ఉపయోగించుకోవచ్చు.

కూరగాయలు ఇతర వస్తువుల ధరలు రోజువారీ మారుతుంటాయన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేయాలి. వాటి ధరలను ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. వెబ్‌సైట్‌లో ప్రతిరోజూ ఉత్పత్తులను కూడా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. బాకీ పద్ధతిలో సరుకులు, వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆన్‌లైన్‌ బిజినెస్‌ ఉపయోగపడుతుంది. వాటిని విక్రయించిన తర్వాత మీ సరఫరాదారులకు చెల్లించవచ్చు. 

పోటీ, పోటీదారులు

కిరణా దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి ముందు.. నిర్ధేశించుకున్న ప్రాంతంలోని పోటీని అంచనా వేయడం చాలా ముఖ్యం. దీనికోసం కొంచెం అధ్యయనం చేసుకోవటం మేలు. సమీప ప్రాంతంలో దుకాణాన్ని ప్రారంభించడం ఎల్లప్పుడూ మంచిది కాదు. 

పది మంది పోటీదారులు ఉన్నప్పటికీ.. భారీ సంఖ్యలో జనాలు ఉండి, ఇంకా వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లయితే అక్కడ దుకాణం ప్రారంభించటం తప్పుడు ఎంపిక కాదు. అవకాశం ఉందా? లేదా? అన్నది మాత్రమే చూసుకోవాలి. 

దీని కోసం, మీరు అధ్యయనం చేసుకోవచ్చు. దీనివల్ల కొత్త అవకాశాల గురించి కూడా తెలుస్తుంది. పోటీదారులపై కూడా పరిశోధన చేయవచ్చు, వారు అనుసరించే అన్ని వ్యూహాలను చూడవచ్చు. దీని వల్ల వారి కంటే మంచి వ్యూహాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. 

కస్టమర్ ఎంగేజ్‌మెంట్

ప్రకటనలు ఇవ్వటం, మార్కెటింగ్‌ చేయటం ద్వారా కస్టమర్లతో మంచి సంబంధాలు నెరపవచ్చని, చాలా మంది దుకాణ యజమానులు అనుకుంటారు. కిరణా స్టోర్ వ్యాపారంలో.. చిన్నపిల్లలు, పెద్దలు, ఇతర వయస్కులు ఎవరైనా సరే.. ప్రతి కస్టమర్‌తో చక్కగా మాట్లాడాలి. దీనివల్ల మంచి వినియోగదారు సంబంధాలు బలపడతాయి. 

దుకాణం యజమాని మాట్లాడినట్లైతే మంచి ప్రభావం ఉంటుంది. సోషల్‌ మీడియా ద్వారా వచ్చే సమాచారం కంటే ఎక్కువ ప్రభావం ఉంటుంది.  తరచూ వినియోగదారులతో సంభాషించాలి. ఇందులో స్థిరత్వాన్ని కొనసాగించాలి. ఇది బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించటంతో పాటు పెంచుతుంది.  వీటితో పాటు, ఉత్పత్తులపై డిస్కౌంట్లను కూడా ఇవ్వవచ్చు. కస్టమర్లను ఆకర్షించడానికి ఉత్తమ మార్గాల్లో డిస్కౌంట్లు ఒకటి. దీనివల్ల దుకాణం నుంచి కస్టమర్లు ఎక్కువ సరుకులను వస్తువులను కొనుగోలు చేస్తారు. 

కస్టమర్ల ప్రాధాన్యతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని చిన్న ఉత్పత్తుల కోసం కస్టమర్లు వచ్చినప్పుడు, వారు సాధారణంగా బ్రాండ్ గురించి పట్టించుకోరు. ఏ బ్రాండ్‌ అయినా వారు తీసుకుంటారు. ఇలాంటి సందర్భంలో కస్టమర్‌ ఉపయోగించే బ్రాండ్‌ ఏంటన్నది తెలుసుకొని అదే బ్రాండ్‌ ఉత్పత్తి ఇవ్వవచ్చు. 

ఇలాంటి పలు సంఘటనల వల్ల… కస్టమర్లు ఏది అడుగుతున్నారు? ఏది ఇష్టపడుతున్నారు? అన్నదానిపై మీకు స్పష్టత వస్తుంది. కస్టమర్ల ఇష్టాలు, అయిష్టాల గురించి మీకు తెలిసినట్లైతే.. వారు దుకామదారులను ఎక్కువగా నమ్ముతుంటారు. దీనివల్ల వారు మళ్లీ మళ్లీ మీ కిరాణ దుకాణానికి వస్తారు. 

ఖాళీగా ఉన్న సమయంలో లేదా రాత్రి వేళల్లో కస్టమర్ల ఇళ్లకు ఉత్పత్తులను అందిచటం లాంటి మరికొన్ని అదనపు చర్యల వల్ల మీపై కస్టమర్లకు నమ్మకం ఏర్పడుతుంది. ఏదైనా లోపం ఉన్నట్లయితే ఆ సరుకును లేదా వస్తువులను తిరిగి తీసుకురమ్మని చెప్పవచ్చు. ఇది మంచి ప్రభావం కనబరుస్తుంది. 

పైన పేర్కొన్న అన్ని వ్యాపార సూత్రాలు..  మీ వ్యాపారాన్ని పెంచడానికి, లాభాలను సంపాదించడానికి మీకు సహాయపడతాయి.

 

మీకు ప్రయోజనం చేకూర్చే ఇతర అంశాలు… 

  • దుకాణం ఒక జంక్షన్ వద్ద ఉన్నట్లయితే, మంచి స్థాయిలో వ్యాపారం అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే దుకాణం ఉండే ప్రాంతం శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే, ప్రజలు శుభ్రమైన ప్రాంతాలను ఇష్టపడతారు. ధర అనేది చాలా ముఖ్యం. ఒక రుపాయి తగ్గింపు కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. క్లియరింగ్‌ సేల్స్ ను పెచ్చవచ్చు. 

 

  • కస్టమర్ లాయల్టీ కార్డులను అందించవచ్చు. దీనికోసం హైటెక్ వ్యవస్థను కలిగి ఉండవలసిన అవసరం లేదు. ప్రతి కార్డుకు ప్రత్యేకమైన ఐడి లేదా నంబర్‌ను ఉండేలా చూడండి.  కార్డ్ వినియోగదారులకు అదనపు బహుమతి లేదా అదనపు క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలను ఇవ్వండి. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ కలిగి ఉన్నట్లయితే… కస్టమర్ ఆ కార్డు సంఖ్యను ఉపయోగించి చిరునామా, మొత్తం అమ్మకం వంటి వివరాలను ఫీడ్ చేయవచ్చు. ఈ కార్డు ద్వారా వారికి ప్రాధాన్యత ఇవ్వవచ్చు. 

 

  • మీరు ఆఫ్‌లైన్ లో వ్యాపార వ్యూహాల ద్వారా మీ కిరాణా దుకాణం అమ్మకాలను మెరుగుపరచాలనుకుంటే, మీ బ్రాండ్ గురించి అందరికి అవగాహన కల్పించాలి. ఆఫ్‌లైన్ మార్కెట్లో, ఎక్కువ మంది వ్యక్తులు మీకు తెలిసి ఉంటారు. నూతన కస్టమర్లను పొందే అవకాశాలు కూడా ఆఫ్‌లైన్‌లో ఎక్కువ. కిరాణ వ్యాపారానికి సంబంధించిన విజిటింగ్‌ కార్డులను రూపొందించుకోవచ్చు. వ్యాపారాన్ని సమీప ప్రాంతాల్లో ప్రచారం చేయాలి. కొత్త కస్టమర్ల కోసం ఎల్లప్పుడూ ఆరాటపడకండి. మరింత నమ్మకమైన, మళ్లీ తరిగి వచ్చే కస్టమర్లను కలిగి ఉండటం చాలా ముఖ్యం. మీ కస్టమర్లను ప్రలోభపెట్టడానికి… మళ్లీ మళ్లీ తిరిగి కొనుగోలుచేసేందుకు… లాయల్టీ బోనస్, రివార్డ్ కార్డులను అందించవచ్చు.

 

  • ఈ రోజుల్లో, ముఖ్యంగా పని చేసే జంటలకు సమయం అనేది ఒక అడ్డంకిగా మారింది. కాబట్టి, మొబైల్ ద్వారా ఆర్డర్ చేయడం, హోమ్‌ డెలివరీ కి వారు మొగ్గూచూపుతున్నారు. కాబట్టి, ఈ సదుపాయాన్ని కిరాణాలో అందించాలి. దీనికోసం లాజిస్టిక్స్‌ కంపెనీలతో ఒప్పందం చేసుకోవచ్చు. ఈ కంపెనీలు డెలివరీకి సంబంధించి పలు రకాల ఆప్షన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. తరువాత, చాలా ముఖ్యమైన అంశం.. క్వాలిటీ. మీరు ప్యాక్ చేసిన వివిధ వస్తువులకు సరైన బరువు కూడా ఉండాలి. 

 

  • తినేందుకు ఏదన్న కావాలనుకున్నప్పుడు… వారు సమీప కిరణా దుకాణానికి వెళతారు. కాబట్టి దుకాణాల్లో సరుకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రజలు తరచూ కొనుగోలు చేసే వాటిపై అవగాహన ఉంటుంది కాబట్టి అవి మాత్రం అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌ కాకుండా చూసుకోవాలి. 
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.