written by | October 11, 2021

పచారి కొట్టు

×

Table of Content


ఆన్‌లైన్ కిరాణా దుకాణాన్ని ప్రారంభించే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితాన్ని పూర్తిగా మార్చాయి. దుస్తుల నుంచి ఫర్నీచర్ వరుకు, ఆహారం నుంచి ఇళ్ల వరకు కొనుగోలు చేయడానికి దాదాపు ప్రతిదీ.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుత ఆధునిక తరం ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. దాదాపు ప్రతి వ్యాపారం… డిజిటల్ వేదికలపై ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. తద్వారా కస్టమర్లను త్వరగా చేరుకోవచ్చు. 

కిరాణా అనేది ఎక్కువగా భౌతికంగా దుకాణం, తదితర విషయాలపై ఆధారపడేది.. కొన్ని సంవత్సరాల ముందు అందరు… కిరాణా,  కూరగాయలను కొనడానికి బయటికి వెళ్లడానికి ఇష్టపడేవారు. కానీ ప్రస్తుతం ఈ ధోరణి మారుతోంది. ఇంటి వద్దకే సరుకులు రావాలని ప్రజలు అనుకుంటున్నారు. దీనితో ఈ-కామర్స్ ఇండస్ట్రీపై దృష్టి పెరుగుతోంది. 

ఆన్‌లైన్ కిరాణా వ్యాపారం ప్రారంభించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. దీన్ని ప్రారంభించేందుకు సరైన సమయం ఉండదు. కస్టమర్ల డిమాండ్‌లను తీర్చడానికి ప్రతివేళ సరైనదే. 

ఆన్‌లైన్ కిరాణా దుకాణాన్ని ఎందుకు ప్రారంభించాలి?

పెరిగిన డిమాండ్‌ … 

కొవిడ్‌ మాహమ్మారి…  ప్రతి పరిశ్రమ, వ్యాపారాన్ని ప్రభావితం చేసింది. అవసరాల తీర్చుకునేందుకు వ్యక్తులతో, ఇతరులతో కనెక్ట్‌ అయి ఉండేందుకు ఇంటర్నెట్‌ పై ఆధారపడటం పెరిగింది. కొవిడ్‌ 19 కారణంగా, ప్రజలు వస్తువులను కొనడానికి బయటికి  వెళ్లడానికి భయపడుతున్నారు. వారు ఎక్కువగా ఆన్‌లైన్‌లో వస్తువులను కొనడానికి ఇష్టపడతారు.

భారతదేశంలో కిరాణా, కూరగాయలకు సంబంధించి ఆన్‌లైన్‌ లో సెర్చ్ చేస్తున్న వారు పెరిగారు. కీ వర్డ్స్‌ ట్రెడ్‌ దీన్నే స్పష్టం చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ గ్రాసరీ స్టోర్‌, గ్రాసరీ షాపింగ్‌, ఆర్డర్‌ గ్రాసరీస్‌ ఆన్‌లైన్‌ తదితర కీవర్డ్స్‌ ఎక్కువగా సెర్చ్‌ అవుతున్నాయి. 

ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేయడంలో వినియోగదారులకు అనేక ఆప్షన్లు ఉంటాయి. ఇంట్లో, వారి సౌకర్యం వద్ద డెలివరీ పొందవచ్చు. ఈ కారణాల వల్ల,ప్రతి పరిశ్రమలో ఈ-కామర్స్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. 

అమలు చేయగల వ్యాపార నమూనా…

డిమాండ్‌ ఉన్న సరైన ఉత్పత్తిని గుర్తించడం, తదనుగుణంగా వ్యాపార నమూనాను అమలు చేయడం వల్ల వ్యాపారంలో లాభదాయకత ఉంటుంది. ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. డెలివరీ ప్రాంతాన్ని నిర్ణయించుకోవటం, ఆన్‌లైన్ కిరాణా మోడల్‌తో కనెక్ట్ అవ్వటం, సమయపాలనతో డెలివరీ చేసేందుకు డెలివరీ నెట్‌వర్క్‌ను బలమంతగా తయారు చేసుకోవటం వంటివి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్ కిరాణా వ్యాపార నమూనా…. అమలు చేయడానికి చాలా ఆచరణాత్మకమైనది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత దీనికి ఆశీర్వాదం లాంటింది. ఎందుకంటే సాంకేతికత ద్వారా వచ్చే స్మార్ట్ ఫీచర్ల.. ఉపయోగించాల్సిన శక్తి, శ్రమను తగ్గిస్తుంది.

ప్రస్తుతం,ఈ- కామర్స్ ద్వారా వ్యాపార నిర్వహించుకునేందుకు… అనేక సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి, వీటి ద్వారా ఆర్డర్‌లు, వాటి జాబితా, కస్టమర్‌లు తదితర మరెన్నో అంశాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. కాబట్టి, ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం మునుపటిలా అంత కష్టమేమి కాదు. 

సులభతరమైన మార్కెటింగ్…

 వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లో మార్కెట్ చేసుకోవటానికి ఇంటర్నెట్‌ ఓ మంచి మార్గం. ఎందుకంటే ఇంటర్నెట్‌, చాలా ఎక్కువ మంది కస్టమర్లను చేరుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. నిర్దిష్ట ప్రదేశంలో, ప్రేక్షకులలో.. వ్యాపారం గురించి ప్రకటనలు చేసేందుకు డిజిటల్‌ మార్కెటింగ్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. 

ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చు, వ్యాపారానికి సంబంధించిన పలు గణంకాలు తెలుసుకునేందుకు, వాటిని ట్రాక్‌ చేసేందుకు, కాలనుగుణంగా మార్కెటింగ్, కొనుగోలు దారులతో మంచి సంబంధాలు తదితర మరెన్నో ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.

వ్యాపారాన్ని పెంచుకునేందుకు గూగుల్‌ ద్వారా ప్రచారం చేసుకోవచ్చు. సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఈ-మెయిల్ మార్కెటింగ్ మొదలైన వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. 

వ్యాపార అవకాశం…

భారతదేశంలోని ఆన్‌లైన్ కిరాణా వస్తువల విక్రయానికి సంబంధించి… ఎక్కువ భాగం మల్టీ-వెండర్ కామర్స్ వ్యాపార నమూనాపై పనిచేస్తుంది. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌తో సహా భారతదేశంలోని కొన్ని ప్రముఖ ఆన్‌లైన్‌ కిరాణా దుకాణం మల్టీ-వెండర్ బిజినెస్ మోడల్‌లో మాత్రమే నడుస్తున్నాయి. వేరు వేరు నగరాల్లో అమ్మకందారులు.. తమ ఉత్పత్తులను ఈ వెబ్‌సైట్‌లో పెడతారు. అలాగే, ఇప్పటికే ఉన్న ఆన్‌లైన్ రిటైలర్లు తమ సేవలను మెట్రోలు, ప్రధాన నగరాల్లో మాత్రమే అందిస్తున్నారు. కిరాణాపై రోజువారీ ఖర్చులు అనేవి ప్రతి భారతీయుడి ఖర్చులో స్థిరంగా ఉంటాయి. వేగంగా మారుతోన్న జీవనశైలిలో, ఆన్‌లైన్ కిరాణా గొలుసుల వ్యాపారానికి మంచి అవకాశాలు ఉన్నాయి. స్థానిక కిరాణా స్టోర్ నుండి షాపింగ్ చేయడానికి.. గంటలు గడపడానికి బదులు, రోజువారీ పనులపై దృష్టి పెట్టాలని ప్రజలు భావిస్తున్నారు. మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా సౌకర్యంగా ఎక్కడైనా, ఎప్పుడైనా సరుకులు కొనేందుకు ఆన్‌లైన్‌ స్టోర్‌లు ఉపయోగపడుతాయి. పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, మొబైల్ పరికరాలతో… ఆన్‌లైన్ కిరాణా వేగంగా పెరుగుతూనే ఉంటుంది.

ఆన్‌లైన్‌ గ్రాసరీ స్టోర్‌లో.. చెల్లింపుల గేట్‌వేను ఏకీకృతం చేయనవసరం కూడా లేదు. ఆన్‌లైన్‌లో చెల్లింపును అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు.వెబ్‌సైట్‌లో క్యాష్ ఆన్ డెలివరీను ప్రాథమిక చెల్లింపు పద్ధతిగా ఉపయోగించవచ్చు. మీకు డెలివరీకి సంబంధించి వేరే సంస్థల భాగస్వామ్యం అవసరం లేదు. స్థానికంగా ఉండే డెలివరీ కుర్రాళ్లను ఈ పనికోసం ఉపయోగించుకోవచ్చు. అయితే మంచి స్థాయిలో ఆన్‌లైన్‌ స్టోర్ ప్రారంభించాలంటే మాత్రం ఇవన్నీ అవసరమే. 

ఆన్‌లైన్‌లో కిరాణా దుకాణాన్ని ఎలా ప్రారంభించాలి?

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ కిరాణ వ్యాపారం సరిగ్గా సరిపోతుంది. ప్రతి వ్యాపారానికి.. సవాళ్లు, వాటి పరిష్కారాలు అనేవి ఉంటాయి. కానీ మీరు సరైన మార్గంలో వెళితే, ఈ వ్యాపారం కష్టమైనదేమి కాదు. ఆన్‌లైన్ కిరాణా దుకాణాన్ని ప్రారంభించడానికి ముందు పరిగణించాల్సిన విషయాలున్నాయి. ఆన్‌లైన్ కిరాణా దుకాణం మరింత లోతుగా తెలుకునేందుకు ఇవి ఉపయోగపడుతాయి. 

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవటం –

ఆన్‌లైన్ వ్యాపారంలో ప్రవేశించేందుకు వెబ్‌సైట్‌ కావాలి. ఇదే అన్నింటికి కంటే ముఖ్యమైనది.  ఆన్‌లైన్‌ స్టోర్‌కు గుర్తింపునిచ్చేది ఇదే. ప్రజలకు వెబ్‌సైట్‌ ద్వారనే మీ బ్రాండ్‌, వ్యాపారం గురించి తెలుస్తుంది. ఈ కామర్స్ స్టోర్ కోసం ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడం కూడా ఒక ముఖ్యమైన పని. ఈ-కామర్స్ వెబ్‌సైట్ల కోసం వివిధ ప్లాట్‌ఫామ్‌ల గురించి అధ్యయనం చేయాలి. మీరు అనుకున్న ఫీచర్లు, మీ బడ్జెట్‌ ఆధారంగా అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు. 

చెల్లింపులు గేట్‌వే, ఉత్పత్తుల నిర్వహణ,సామాజిక మాధ్యమాల ఇంటిగ్రేషన్‌, ఆర్డర్ ట్రాకింగ్, డిజిటల్ పనితీరు మానిటర్ సాధనం వంటి అవసరమైన ఫీచర్లు అందించే ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవటం ఉత్తమం. ఉత్పత్తులను నేరుగా విక్రయించడానికి అనేక ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ- కామర్స్ వ్యాపారం కోసం ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవడం, వినియోగదారుడు ఉపయోగించటానికి సులభంగా ఉండే వెబ్‌సైట్‌ను రూపొందించడం… ఆన్‌లైన్‌ వ్యాపారం ప్రారంభించే ముందు చేయాల్సిన ముఖ్యమైన పనులు. 

ఉత్పత్తులు, వాటికి సంబంధించిన కేటగిరీ జాబితా తయారీ… 

ఈ-కామర్స్‌ ద్వారా ఏ ఉత్పత్తులను విక్రయించాలన్నది నిర్ణయించుకోవటం చాలా ముఖ్యం. దీనిపై నిర్ణయం తీసుకోవాలి. ఉత్పత్తులు, వాటి కేటగిరీలకు సంబంధించి స్పష్టమైన జాబితా తయారు చేసుకోవాలి. ఉత్పత్తులను సరిగ్గా వర్గీకరించి, వాటి నిర్వహణ కోసం స్మార్ట్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ను ఉపయోగించినట్లైతే… వ్యాపార నిర్వహణ కోసం తక్కువ మానవశక్తి అవసరం అవుతుంది. సరైన వర్గీకరణ, జాబితా నిర్వహణ సాధనాల ద్వారా ఈ-కామర్స్ స్టోర్‌లో వేలాది ఉత్పత్తులను విక్రయించే వీలు ఉంటుంది. 

టార్గెట్ మార్కెట్, ప్రాంతం నిర్ణయించుకోవాలి

కిరాణా, కూరగాయలను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి నిర్దిష్ట ప్రాంతాన్ని లేదా మార్కెట్‌ను నిర్ణయించుకోవాలి. ఈ ప్రాంతాల కోసం కొంచెం అధ్యయనం చేసుకోవాలి. ఏ రకమైన ఉత్పత్తులను డిమాండ్ ఉంటుంతో నిర్ణయించుకోవాలి. వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు ఉత్పత్తుల కోసం మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. దీనికోసం ప్రకటనలు ఇవ్వవచ్చు. 

మంచి డెలివరీ ఛానెల్‌ను సృష్టించుకోవటం .. 

డెలివర్‌ నెట్‌వర్క్‌ అనేది ఈ-కామర్స్‌లో భాగం. ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభించాలనుకునే వారు మంచి డెలివరీ ఛానల్స్‌ను ఎంచుకోవాలి. వ్యాపారానికి, కస్టమర్లకు అనుసంధానంగా ఉండేది డెలివరీ నెట్‌వర్క్‌.  ఎంచుకున్న డెలివరీ ఛానల్స్‌..వ్యాపారానికి సరిపడే, నమ్మదగినదిగా ఉండటం చాలా ముఖ్యం. డెలివరీ స్టేటస్‌ గురించి వినియోగదారుడికి సమాచారం తెలిసే విధంగా డెలివరీ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలి. డెలివరీ గురించి వినియోగదారుడు అభిప్రాయం తెలిపే సదుపాయం ఉండాలి. ఈ ఫీచర్ల ద్వారా వినియోగదారుడి నమ్మకాన్ని పొందవచ్చు. కిరాణా, కూరగాయల పట్ల.. వినియోగదారులు జాగ్రత్తగా ఉంటారు, అంతేకాకుండా వీటిని వేగంగా పొందాలనుకుంటారు. కాబట్టి వినియోగదారుడికి వీలైనంత తొందరగా ఆర్డర్‌ డెలివరీ చేయాలి. 

మార్కెటింగ్

సాధారణంగా సమీప ప్రాంతాల వినియోగదారులే కిరాణా దుకాణాలకు వస్తారు. కిరాణా వ్యాపారం కూడా వారి అవసరాలకు అనుగుణంగానే ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి మార్కెటింగ్‌ చేసుకునేదుకు డిజిటల్‌ మార్కెటింగ్‌ వీలు కల్పిస్తుంది. మీ ఆన్‌లైన్‌ స్టోర్‌కు వచ్చే ఆర్గానిక్‌ ట్రాఫిక్‌ ను సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌ టూల్స్‌ చాలా వరకు వినియోగదారుల ప్రవర్తనకు సంబంధించి లోతైన పరిశీలన చేసి దాని ఫలితాలను మీకు అందిస్తాయి. ఇవి మీ వ్యాపార ప్రకటనలు సమర్థవంతంగా ఇచ్చేందుకు ఉపయోగపడుతాయి. 

స్కేలబిలిటీ

ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడం, ఆ వ్యాపారం లాభదాయకంగా నిర్వహించటం… రెండూ వేర్వేరు. వ్యాపారాన్ని పెంచుకోవటానికి, మార్కెట్‌ పరిస్థితులపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది కస్టమర్లు మీ స్టోర్‌ నుంచి కొనుగోలు చేసేలా చూడటమే… వ్యాపారాన్ని విస్తృత పరచటం లక్ష్యంగా ఉంటుంది. కొత్త కస్టమర్లను ఆకర్షించటానికి… అనలైటిక్స్‌ టూల్స్ ద్వారా కస్టమర్లకు సంబంధించి లోతుగా అధ్యయనం చేయాలి. వీటి ప్రకారం… మార్కెటింగ్‌ చేసుకోవచ్చు. అలాగే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చడంపై దృష్టి పెట్టాలి.  

కింది సూచనలను పరిగణనలోకి తీసుకొండి

  • ప్రస్తుతం చాలా ఇళ్లలో స్మార్ట్‌ఫోన్‌ అనేది సాధారణం అయిపోయింది. చాలా మంది గృహిణులు, శ్రామిక ప్రజలు ఇప్పటికే.. ఇంటర్నెట్‌ వాడుతున్నారు. కాబట్టి యూప్‌లను వినియోగించటం అందరికి అలవాటు ఉంటుంది. మీ ఆన్‌లైన్‌ స్టోర్‌కు సంబంధించిన యాప్‌ను కూడా విడుదల చేయవచ్చు. వ్యాపారానికి వెబ్‌సైట్‌ కు సంబంధించిన సేవలందించే వారితోనే ఈ యాప్‌ అభివృద్ధి చేయించుకోవచ్చు.
  • వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లలో గూగుల్ ట్రాన్స్‌లేట్ లేదా అనువాదానికి సంబంధించి అవసరైన టూల్స్‌ ఇంటిగ్రేట్‌ చేసుకోవచ్చు. గూగుల్ కొన్ని సర్వీసులను ఉచితంగా అందిస్తుంది. అనువాదానికి సంబంధించిన టూల్స్ ద్వారా 100కు పైగా భాషల్లో అనువాదం అవుతుంది. దీని ద్వారా స్థానికంగా ఉండే పేర్లతో వస్తువలు ఉండటం వల్ల మీ వ్యాపారానికి లబ్ధి కలుగుతుంది. 
  • వినియోగదారులు సంప్రదించేందుకు వీలుగా, అందరికి కనిపించే స్థానంలో కాంటాక్ట్‌ నంబర్‌ను ప్రదర్శించండి. అందువల్ల మీ కస్టమర్‌లు ఫోన్‌లో కూడా ఆర్డర్‌లను ఇవ్వగలరు.

 

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.