కిరాణా షాప్ అంటే ఏమిటి?
ఒక కిరాణా షాప్ అంటే మన గృహావసరాలకు వస్తువులను పప్పులు, బియ్యం, రోజువారీ ఆహార దినుసులు, వ్యక్తిగత, ఇంటి శుభ్రత పరమైన ఉత్పత్తులు, అలాగే మరొకొన్ని రకాల రోజువారీ వస్తువులను రిటైల్ ధరలకు విక్రయించే దుకాణం. ఎవరైనా సరే, ఒక రిటైల్ కిరాణా షాపును తెరవాలనుకుంటే, ముందుగా మనకు కావలసినన్ని ఉత్పత్తులు అమ్మకానికి సిద్ధంగా ఉండాలి. వ్యాపారుల పెట్టుబడి సామర్ధ్యాన్ని బట్టి, కిరాణా షాపు యొక్క సైజు, ఆ;అలాగే అందుబాటులో ఉండే ఉత్పత్తులలో కూరగాయలు, గృహోపకరణాలు కూడా అమ్మడం జరుగుతుంది.
ఇండియాలో ఒక కిరాణా షాపు ద్వారా ఆర్జించగల లాభాలు
ఇండియాలో కిరాణా షాపులకు 2% నుండి 20% వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. నడిపించే ప్రదేశాన్ని బట్టి, భారతదేశంలో, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు నడిపించే వారు చాలా లాభాలను పొందగలరు. అందుకే, దేశీయ, అంతర్జాతీయ సంస్థలు, భారతదేశ మార్కెట్ కోసం చాలా ప్రయత్నిస్తున్నాయి.
ప్రపంచంలోనే అతి పెద్ద మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటి కావడానికి భారతదేశ ముఖ్య బలం దేశంలో టౌన్లు మరియు సిటీలు చాలా వేగంగా వృద్ధి చెందుతున్నాయి. కాబట్టి, మన దేశంలో,రిటైల్ వ్యవస్థలో ఎదుగుదలకు ఇంకా చాలా అవకాశమే ఉంది. చాలా చిన్న గ్రామాలూ, టౌన్ల నుండి ప్రజలు సిటీలకు వలస పోవడం కారణంగా, ప్రజల కొనుగోలు శక్తి కూడా ధారాళంగా పెరుగుతుంది. కాబట్టి కిరాణా వస్తువుల అమ్మకాలలో లాభాలు కొన్ని రూపాయల నుండి వేళా రూపాయల వరకు ఉంటున్నాయి. అందుకే, దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందడానికి, రిటైల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం చాలా మంచి ఆలోచన.
భారతదేశంలో ఒక కిరాణా షాపు తెరవడానికి ఎంత పెట్టుబడి అవసరం?
ఒక కిరాణా షాపు తెరవడానికి, మనకు రూ. 10 లక్షల నుండి రూ. 2 కోట్ల వరకు ఖర్చు అవ్వవచ్చు. మీరు పెట్టాలనుకునే షాపు సైజు, క్యాపాసిటి, అందించే మూలికా సదుపాయాలు మొదలగు వాటిపై అది ఆధారపడుతుంది. మీరు షాపు కోసం చేసే స్థిర పెట్టుబడులు మరియు ఫ్లోట్ పెట్టుబడులను పరిగణలోకి తీసుకోవాలి. అంటే, షాపులో ఎక్కువ కలం ఉండే వస్తువులు మాత్రమే కాకా, షాపు నుండి త్వరగా బయటకు పోయే స్టాక్ కోసమని పెట్టుబడిని రెడీగా ఉంచుకోవాలి. భారతదేశంలో ఒక కిరాణా షాపు తెరవడానికి క్రింద వివరించిన విధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది:
- స్టోరులో ఉండే అల్మారాలు, ఉపకరణాలు, సామాన్లు, డిస్ప్లే రాక్స్ మొదలైన వస్తువులు.
- కంప్యూటర్, క్యాష్ రిజిస్టర్, సెక్యూరిటీ కెమెరా, అద్దాలు, షాపు ముస్తాబు కోసం పెయింటింగ్ మరియు ఇతర పనులు.
- అమ్మడానికి ఉత్పత్తులు మరియు ఇతర షాపు సామాగ్రి.
- పనివారి జీతాలు
- ట్యాక్స్, ఫీజులు మరియు పర్మిషన్లు, మొదలైనవి
- షాపు మరియు పనివారికి ఇన్సూరెన్సు
- మార్కెటింగ్ మరియు అడ్వేర్టైజింగ్ ఖర్చు
- షాపు రోజూ శుభ్రంగా మెయింటైన్ చేయడానికి, శుభ్రపరచడానికి అవసరమయ్యే ఉత్పత్తులు
- కరెంటు, వాటర్, ఫ్యాన్లు, లైట్లు, ఏసీ మొదలైన వాటి ఖర్చు, మరియు
- రెంటు ఖర్చు
కిరాణా షాపును తెరవడం ఎలా?
ఒక విజయవంతమైన కిరాణా వ్యాపారాన్ని స్థాపించడానికి మీరు మీ వ్యాపార ప్లాన్‌లో క్రింద చూపించబడ్డ అడుగులు వేయవలసి ఉంటుంది:
- మొదటిగా GST రిజిస్ట్రేషన్ – మీ వార్షిక టర్న్ఓవర్ గనుక రూ. 20 లక్షలకు తక్కువ ఉంటే, మీరు తప్పకుండ 15 అంకెల GST రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొంది తీరాలి.
- లైసెన్సులు – మీ ఫుడ్ లైసెన్స్, షాప్ లైసెన్స్, ఎస్టాబ్లిషమెంట్ రిజిస్ట్రేషన్ మరియు ఎంటిటీ రిజిస్ట్రేషన్ చేయించి ఉండాలి.ఇది జరిపించడానికి లైసెన్స్ అథారిటీ ఆఫీసుకు వెళ్ళాలి.
- ప్రదేశం – మీ షాపును తెరవడానికి మీరు ఎంచుకుని ప్రదేశం చాలా ముఖ్యం. కాబట్టి వ్యాపారం జరుగుతుందనే చోట షాపు తెరవండి.
- షాపులోని మౌలిక సదుపాయాలకు పెట్టుబడి – ప్రదేశాన్ని ఖాయం చేసుకున్న తర్వాత, షాపును కస్టమర్లకు అందంగా కనిపించడానికి బాగా ముస్తాబు చేయాలి.
- కస్టమర్స్ – మీరు మీ కస్టమర్లపై ఒక చిన్న స్టడీ చేయాలి. అంటే, వారు ఎలాంటి వారు, ఎలాంటి రేట్లు ఉంటే కొంటారు, వారి ఆదాయం ఎంతై ఉంటుంది, లాంటి విషయాలపై కొంత పరిశోధన చేయడం మంచిది.
- మీ ప్రత్యర్థులను అర్ధం చేసుకోవాలి – మీరు మీకు పోటీగా ఉన్న షాపులను చూసి, మీ కస్టమర్లకు ఎలాంటి ఉత్పత్తులు ఏ రేంజ్ లో ఉంటే వారిని అధికమించగలరో తెలుసుకోవాలి.
- విక్రేతలు – మీకు అవసరమైనప్పుడు షాపుకు స్టాక్ తీసుకురాగల కొంత మంది వెండార్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
- ఉత్పత్తుల ధర – మీ షాపులో, సరసమైన ధరలకే అమ్మాలని మీకు కూడా తెలిసే ఉంటుంది, దానిని మేము ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు, కాకపోతే, 25% ననుండి 40% లాభం మీకు మిగిలేలా ప్లాన్ చేసుకోండి. కానీ అన్ని వస్తువుల మీద అదే రేంజ్ మార్జిన్ ఉండాలని ఏం లేదు.
- షాపులో పనివారు – మీ షాపులో పని చేయడానికి మనుషులను పెట్టుకోవాలి, కానీ వారు మీ షాపుకు దగ్గరలో నివసించే వారైతే ఎంతైనా మంచిది.
- ఆన్లైన్ అందుబాటు – మీ షాపు నుండి ఆన్లైన్ ద్వారా కూడా కొనే సదుపాయం కస్టమర్లకు అందించడం ఎంతైనా మంచిది. ఇది సాధ్యం చేయడానికి మార్కెట్లో చాలా అప్లికేషన్లు ఉన్నాయి.
- అడ్వర్టైజింగ్ – మీ షాపు గురించి, షాపులో ఉన్న ఆఫర్స్‌ను వివరిస్తూ పామ్ప్లేట్లు, నోటీసులు, పోస్టర్స్ లాంటివి ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న జనానికి తెలిసేలా చేయండి.
- డిజిటల్ శకానికి సిద్ధంగా ఉండండి – షాపుకు వచ్చే వారికి, కొనుగోలు చేసి, బయటకు వెళ్లేంత వరకు మంచి అనుభవం ఎదురవ్వాలి, అంటే, బరువు తూచే సమయంలో ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్లు, అలాగే బిల్ వేయడానికి రెడీగా కంప్యూటర్, పేమెంట్ చేయడానికి క్రెడిట్/డెబిట్ కార్డు, Phone Pe, PayTM, Google Pay లాంటి డిజిటల్ పేమెంట్ విధానాలతో సిద్ధంగా ఉండాలి.
కిరాణా షాపు ఫ్రాంచైస్ తెరవడంతో ఉన్న లాభాలు
ఫ్రాంచైజ్ వ్యాపారంలో చాలా ప్రయోజనాలే ఉన్నాయి, అవేమిటంటే,
- మీరు తీసుకునే బ్రాండ్‌ని బట్టి ఆటోమేటిక్‌గా అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది
- షాపు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువ
- త్వరగా, తక్కువ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు
- అదనపు ఖర్చు లేకుండా సపోర్ట్, ట్రైనింగ్ ఇవ్వబడుతుంది
- ఇంతకుముందే విజయవంతమైన బిజినెస్ మోడల్
- అన్నివిధాలా మీకు సహకారం అందించబడుతుంది
- ఫండింగ్ ఆప్షన్లు ఉంటాయి
- ఎక్కువ మోతాదులో కొంటారు కాబట్టి ఉత్పత్తుల రేటు కొంచెం చవకగా ఉంటుంది
- మీ తోటి వారిని కలుసుకునే అవకాశాలు ఎక్కువ కాబట్టి మీ మధ్య ఆరోగ్యకరమైన పోటీకి నెలకొంటుంది
ముగింపు
భారతదేశంలో ఒక కిరాణా షాపు తెరావడమంటే మంచి వ్యాపారం జరింగించే సంభావ్యత మరియు ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్, భారతదేశం ప్రతీ ఏడాది 10% వరకు వృద్ధి చెందే అవకాశం ఉంది. అంతేకాక, ప్రజల కొనుగోలు శక్తి కూడా గత దశాబ్దంలో చాలా పెరిగింది. కాబట్టి మార్కెట్‌ను అర్ధం చేసుకొని, వ్యాపారంలో లాభనష్టాలను బేరీజు వేసుకున్న తర్వాత, అడుగుపెట్టాలని చూసే వ్యాపారులకు, పెట్టుబడి దారులకు ఇది మంచి అవకాశం.
ಕಿರಾಣಿ ಅಂಗಡಿ ಎಂದರೇನು?
“ಮನೆಯ ಅಡುಗೆ ಮನೆಗೆಅವಶ್ಯಕತೆ ಇರುವದ್ವಿದಳ ಧಾನ್ಯಗಳು, ಅಕ್ಕಿ, ಗೋಧಿ, ಮಸಾಲೆ ಪದಾರ್ಥಗಳು, ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಮಗ್ ಗಳು, ಬ್ರಷ್, ಬಕೆಟ್, ಇತ್ಯಾದಿ ಮತ್ತು ಡಿಟರ್ಜೆಂಟ್, ಟಾಯ್ಲೆಟ್ ಕ್ಲೀನರ್, ಸಾಬೂನುಗಳು, ಟೂತ್ಪೇಸ್ಟ್, ಸ್ನಾನಗೃಹದಂತಹ ಇತರ ಮನೆಯ ಅವಶ್ಯಕತೆಗಳಿಗಾಗಿ ಬೇಕಾದ ವಸ್ತುಗಳನ್ನು ಹೊಂದಿರುವುದೇ ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯಾಗಿದೆ. ಯಶಸ್ವಿ ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯೊಂದನ್ನು ತೆರೆಯಲು, ನೀವು ಬೇಕಾದಷ್ಟು ಕಿರಾಣಿ ಉತ್ಪನ್ನಗಳನ್ನು ನೀವು ಹೊಂದಿರಬೇಕು. ದಿನಸಿ ವಸ್ತುಗಳುಕಿರಾಣಿ ಅಂಗಡಿಯಲ್ಲಿ ಹೆಚ್ಚು ಅಥವಾ ಕಡಿಮೆ ಸ್ಥಳಾವಕಾಶ ಕಲ್ಪಿಸಲು ಅಂಗಡಿಯವರು ಹೂಡಿಕೆ ಮಾಡಿದ ಗಾತ್ರ, ಸಾಮರ್ಥ್ಯ ಮತ್ತು ಹಣವನ್ನು ಅವಲಂಬಿಸಿರುತ್ತದೆ. ಕೆಲವೊಮ್ಮೆ ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯು ಜನರ ಅಗತ್ಯಗಳನ್ನು ಬೆಂಬಲಿಸಲು ಒಂದು ನಿರ್ದಿಷ್ಟ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ತರಕಾರಿಗಳು ಮತ್ತು ಹಣ್ಣುಗಳನ್ನು ಹೊಂದಿರುತ್ತದೆ.
ಭಾರತದ ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯ ಲಾಭಾಂಶ
ಭಾರತದ ಕಿರಾಣಿ ಅಂಗಡಿಗಳ ಲಾಭಾಂಶವು 2% ರಿಂದ 20% ವರೆಗೆ ಇರುತ್ತದೆ. ಕಿರಾಣಿ ಭಾರತದಲ್ಲಿ ಲಾಭದಾಯಕ ಮಾರುಕಟ್ಟೆಯಾಗಿದ್ದು, ಅನೇಕ ವಿದೇಶಿ, ಭಾರತೀಯ ಮತ್ತು ಸ್ಥಳೀಯ ಬ್ರಾಂಡ್ಗಳು ಮಾರುಕಟ್ಟೆಗೆ ಪೈಪೋಟಿ ನೀಡುತ್ತವೆ ಮತ್ತು ಕಿರಾಣಿ ಅಂಗಡಿಗಳು ತಮ್ಮ ಉತ್ಪನ್ನಗಳನ್ನು ಹೊಂದಿದೆಯೆ ಎಂದು ಖಚಿತಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ.
ಭಾರತದ ಪಟ್ಟಣಗಳು ಮತ್ತು ನಗರಗಳು ವೇಗವಾಗಿ ಬೆಳೆಯುತ್ತಿದ್ದು, ಭಾರತವು ಮೂರು ಜಾಗತಿಕ ಆರ್ಥಿಕತೆಗಳಲ್ಲಿ ಒಂದಾಗಿದೆ. ಚಿಲ್ಲರೆ ಅಂಗಡಿ ಅಥವಾ ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯು ಎಲ್ಲಾ ಸಣ್ಣ, ದೊಡ್ಡ ಮತ್ತು ಮಹಾನಗರಗಳಲ್ಲಿ ಬೆಳೆಯುವ ಅಪಾರ ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ಹೊಂದಿದೆ. ಜನರು ತಮ್ಮ ಜೀವನವನ್ನು ರೂಪಿಸಿಕೊಳ್ಳಲು ಅನೇಕ ಸಣ್ಣ ಪಟ್ಟಣಗಳಿಂದ ದೊಡ್ಡ ನಗರಗಳಿಗೆ ವಲಸೆ ಹೋಗುತ್ತಿದ್ದಾರೆ, ಅಂತಹ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ, ಭಾರತದ ಎಲ್ಲಾ ಮೂಲೆಗಳಲ್ಲಿ ಜನರ ಖರೀದಿ ಶಕ್ತಿಯ ಬೆಳವಣಿಗೆ ಇದೆ. </ Span> ಕಿರಾಣಿ ವಸ್ತುಗಳನ್ನು ಅವಲಂಬಿಸಿ ಲಾಭವು ಕೆಲವು ರೂಪಾಯಿಗಳಿಂದ ಸಾವಿರಾರು ರೂಪಾಯಿಗಳವರೆಗೆ ಇರುತ್ತದೆ. ಹೀಗಾಗಿ, ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯ ಹೂಡಿಕೆ ಲಾಭದಾಯಕವಾಗಿದೆ ಮತ್ತು ದೀರ್ಘಾವಧಿಯಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಲಾಭವನ್ನು ನೀಡುತ್ತದೆ.
ಭಾರತದಲ್ಲಿ ಕಿರಾಣಿ ಅಂಗಡಿ ತೆರೆಯಲು ಎಷ್ಟು ಹಣ ಬೇಕು?
ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯ ಹೂಡಿಕೆಗಳು ಎಎಲ್ಲಿಯಾದರೂ ರೂ. 10 ಲಕ್ಷದಿಂದ 2 ಕೋಟಿ ರೂ. ಇದು ಅಂಗಡಿಯ ಗಾತ್ರ, ಆಕಾರ, ಸಾಮರ್ಥ್ಯ ಮತ್ತು ಮೂಲಸೌಕರ್ಯ ಇತ್ಯಾದಿಗಳನ್ನು ಅವಲಂಬಿಸಿರುತ್ತದೆ. ನೀವು ಸ್ಥಿರ ಹೂಡಿಕೆಗಳು ಮತ್ತು ಫ್ಲೋಟ್ ಹೂಡಿಕೆಗಳನ್ನು ನೋಡಬೇಕು. ಭಾರತದಲ್ಲಿ ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯ ಬೆಲೆ ಈ ಕೆಳಗಿನವುಗಳನ್ನು ಒಳಗೊಂಡಿದೆ:
- ಕಪಾಟುಗಳು, ಪೀಠೋಪಕರಣಗಳು, ಡಿಸ್ಪ್ಲೇ ಕಪಾಟುಗಳು ಸೇರಿದಂತೆ ಮೂಲಸೌಕರ್ಯಗಳು
- ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ನಗದು ರೆಜಿಸ್ಟರ್ಗಳು, ಭದ್ರತಾ ಕ್ಯಾಮೆರಾಗಳು ಮತ್ತು ಗಡಿಯಾರಗಳು ಮುಂತಾದ ಉಪಕರಣಗಳು
- ದಾಸ್ತಾನು ಇಡಲು ವಸ್ತುಗಳು ಮತ್ತು ಮಾರಾಟ ಮಾಡಲು ವಸ್ತುಗಳು
- ನೌಕರರಿಗೆ ಸಂಬಳ
- ತೆರಿಗೆ, ಶುಲ್ಕ ಮತ್ತುಪರವಾನಗಿಗಳು , ಇತ್ಯಾದಿ
- ಅಂಗಡಿ ಮತ್ತು ಉದ್ಯೋಗಿಗಳಿಗೆ ವಿಮೆ
- ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಮತ್ತು ಜಾಹೀರಾತು ವೆಚ್ಚಗಳು
- ಸಾಮಗ್ರಿಗಳೊಂದಿಗೆ ಅಂಗಡಿಯನ್ನು ಸ್ವಚ್ಚಗೊಳಿಸುವ ವಸ್ತುಗಳು
- ವಿದ್ಯುತ್ ಮತ್ತು ಇತರ ಸಾಧನಗಳಾದ ಎಸಿ, ಫ್ಯಾನ್ ಮತ್ತು ದೀಪಗಳು, ಮತ್ತು
- ಬಾಡಿಗೆ ವೆಚ್ಚ
ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸುವುದು ಹೇಗೆ?
ಲಾಭದಾಯಕ ಕಿರಾಣಿ ವ್ಯಾಪಾರವನ್ನು ಸ್ಥಾಪಿಸುವ ಪರಿಣಾಮಕಾರಿ ವ್ಯಾಪಾರ ಯೋಜನೆ ಈ ಕೆಳಗಿನ ಹಂತಗಳನ್ನು ಒಳಗೊಂಡಿದೆ:
- ಮೊದಲನೆಯದು ಜಿಎಸ್ಟಿ GST – ನಿಮ್ಮ ವಾರ್ಷಿಕ ವಹಿವಾಟು ರೂ. 20 ಲಕ್ಷಗಳಾಗಿದ್ದರೆ ನಿಮ್ಮ 15 ಅಂಕಿಯ GST ನೋಂದಣಿಸಂಖ್ಯೆಯನ್ನು ಪಡೆಯಬೇಕು
- ಪರವಾನಗಿಗಳು -ನಿಮ್ಮ ಆಹಾರ ಪರವಾನಗಿ, ಅಂಗಡಿ ಮತ್ತು ಸ್ಥಾಪನೆ ನೋಂದಣಿ ಮತ್ತು ಘಟಕ ನೋಂದಣಿಯನ್ನು ಪಡೆಯಿರಿ. ಇದನ್ನು ಮಾಡಲು ಪರವಾನಗಿ ಪ್ರಾಧಿಕಾರ ಕಚೇರಿಗೆ ಭೇಟಿ ನೀಡಿ
- ಸ್ಥಳಗಳು – ನಿಮ್ಮ ಅಂಗಡಿಗೆ ಸೂಕ್ತವಾದ ಸ್ಥಳ ಅಥವಾ ಸ್ಥಳಗಳನ್ನು ಆರಿಸಿ.
- ಅಂಗಡಿಯಲ್ಲಿನ ಮೂಲಸೌಕರ್ಯದಲ್ಲಿ ಹೂಡಿಕೆ – ಸ್ಥಳವನ್ನು ನಿರ್ಧರಿಸಿದ ನಂತರ ನೀವು ನಿಮ್ಮ ಅಂಗಡಿಯನ್ನು ಆಕರ್ಷಕವಾಗಿಸಬೇಕು ಮತ್ತು ಅಂಗಡಿಯಲ್ಲಿನ ವಸ್ತುಗಳನ್ನು ಪ್ರದರ್ಶಿಸಬೇಕು.
- ಗ್ರಾಹಕರು – ನಿಮ್ಮ ಗ್ರಾಹಕರ ಆದ್ಯತೆಗಳು, ಜೀವನ ಮಟ್ಟ ಮತ್ತು ಮಾರುಕಟ್ಟೆ ಗಾತ್ರದ ಬಗ್ಗೆ ನೀವು ಒಂದು ಸಣ್ಣ ಅಧ್ಯಯನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿದೆ.
- ನಿಮ್ಮ ಪೈಪೋಟಿಯನ್ನು ಅಧ್ಯಯನ ಮಾಡಿ – ನಿಮ್ಮ ಅಂಗಡಿಯ ಸುತ್ತಲಿನ ಇತರ ಅಂಗಡಿಯವರ ಬಗ್ಗೆ ಅರ್ಥಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು ಮತ್ತು ಗ್ರಾಹಕರು ನಿಮ್ಮಿಂದ ಖರೀದಿಸುವ ಉತ್ಪನ್ನಗಳ ಬಗ್ಗೆ ಯೋಚಿಸಬೇಕು.
- ಮಾರಾಟಗಾರರು – ನೀವು ಅಂಗಡಿಯಲ್ಲಿ ಮಾರಾಟ ಮಾಡಲು ಬಯಸುವ ಸರಕುಗಳನ್ನು ನಿಮಗೆ ತಲುಪಿಸಲು ಕೆಲವು ಮಾರಾಟಗಾರರೊಂದಿಗೆ ಹೊಂದಾಣಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು.
- ಉತ್ಪನ್ನದ ಬೆಲೆ – ಅಂಗಡಿಯಲ್ಲಿನ ವಸ್ತುಗಳಿಗೆ ಸರಿಯಾದ ಮತ್ತು ಸ್ಪರ್ಧಾತ್ಮಕ ಬೆಲೆಗಳನ್ನು ನಿಗದಿಪಡಿಸಿ. ವಸ್ತುಗಳಿಗಾಗಿ 25% ರಿಂದ 40% ಮಾರ್ಜಿನ್ ಇರಿಸಿ, ಆದರೆ ಎಲ್ಲ ವಸ್ತುಗಳಿಗೆ ಇದು ಅಗತ್ಯವಿಲ್ಲ.
- ನಿಮ್ಮ ಅಂಗಡಿಗೆ ಸಿಬ್ಬಂದಿ -ನಿಮಗೆ ಸಹಾಯ ಮಾಡಲು ನಿಮ್ಮ ಅಂಗಡಿಗಾಗಿ ಕೆಲವು ಸಿಬ್ಬಂದಿ ಅಥವಾ ಸಹಾಯಕರನ್ನು ನೇಮಿಸಿ.
- ಆನ್ಲೈನ್ ಅಂಗಡಿಯನ್ನು ಹೊಂದಿರಿ – ನಿಮ್ಮ ಅಂಗಡಿಗೆ ಆನ್ಲೈನ್ ಪ್ರೆಸೆನ್ಸ್ ಪ್ರಯೋಜನಕಾರಿಯಾಗಿದೆ ಇದರಿಂದ ಜನರು ನಿಮ್ಮ ಅಂಗಡಿಯಿಂದ ಆನ್ಲೈನ್ನಲ್ಲಿ ವಸ್ತುಗಳನ್ನು ಆರ್ಡರ್ ಮಾಡಬಹುದು.
- ಜಾಹೀರಾತು – ನೀವು ಕರಪತ್ರಗಳು, ನೋಟಿಸ್ ಸಿದ್ಧಪಡಿಸಬೇಕು ಮತ್ತು ಸ್ಥಳೀಯವಾಗಿ ಮತ್ತು ದೂರದ ಸ್ಥಳಗಳಿಗೂ ನಿಮ್ಮ ಅಂಗಡಿಯ ಬಗ್ಗೆ ತಿಳಿಯುವಂತೆ ಮಾಡಬೇಕು
- ಡಿಜಿಟಲ್ ಸಿದ್ಧತೆ – ಬಿಲ್ಲಿಂಗ್ಗೆ ಸಿದ್ಧವಾಗಿರುವ ಕಂಪ್ಯೂಟರ್ಗಳ ಜೊತೆಗೆ ವಸ್ತುಗಳನ್ನು ಸ್ಕೇಲಿಂಗ್ ಮಾಡಲು ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ತೂಕದ ಯಂತ್ರಗಳನ್ನು ಇರಿಸಿ ಮತ್ತು ಪಾವತಿ ವಿಧಾನಗಳಿಗಾಗಿ ಕ್ರೆಡಿಟ್ / ಡೆಬಿಟ್ ಕಾರ್ಡ್ಗಳು, Phone Pe, PayTM, Google Pay, ಇತ್ಯಾದಿಗಳನ್ನು ಹೊಂದಿರಿ.
ದಿನಸಿ ಅಂಗಡಿ ಫ್ರ್ಯಾಂಚೈಸ್ನ ಪ್ರಯೋಜನಗಳು
ಫ್ರ್ಯಾಂಚೈಸ್ ವ್ಯವಹಾರವು ಈ ಕೆಳಗಿನಂತೆ ಸಾಕಷ್ಟು ಪ್ರಯೋಜನಗಳನ್ನು ಹೊಂದಿದೆ,
- ಬ್ರಾಂಡ್ ಹೆಸರು ಮಾರಾಟ ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ಹೆಚ್ಚಿಸುತ್ತದೆ
- ಯಶಸ್ಸಿನ ಪ್ರಮಾಣ ಹೆಚ್ಚು
- ಪ್ರಾರಂಭದ ಸಮಯ ಕಡಿಮೆ ಮತ್ತು ತ್ವರಿತವಾಗಿ ಸ್ಥಾಪಿಸಬಹುದು
- ಯಾವುದೇ ವೆಚ್ಚವಿಲ್ಲದೆ ಬೆಂಬಲ ಮತ್ತು ತರಬೇತಿಯನ್ನು ನೀಡಲಾಗುವುದು
- ಸ್ಥಾಪಿತ ವ್ಯವಹಾರ ಮಾದರಿ
- ಎಂಡ್ ಟು ಎಂಡ್ ನೆರವು ನೀಡಲಾಗುವುದು
- ಫಂಡ್ ಆಯ್ಕೆ ಸುರಕ್ಷಿತವಾಗಿದೆ
- ಪರಿಮಾಣದಲ್ಲಿ ಖರೀದಿಸುವುದರಿಂದ ಖರೀದಿ ವೆಚ್ಚ ಕಡಿಮೆಯಾಗುತ್ತದೆ
- ಗೆಳೆಯರೊಂದಿಗೆ ನೆಟ್ವರ್ಕಿಂಗ್ ಆರೋಗ್ಯಕರ ಸ್ಪರ್ಧೆಯನ್ನು ಎದುರಿಸಲು ನಿಮಗೆ ಅನುಮತಿಸುತ್ತದೆ
ಕೊನೆಯ ಮಾತು
ಭಾರತದಲ್ಲಿ ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯನ್ನು ಪ್ರಾರಂಭಿಸುವುದರಿಂದ ಸಾಕಷ್ಟು ಅನುಕೂಲಗಳಿವೆ ಮತ್ತು ಇದು ಲಾಭದಾಯಕ ವ್ಯವಹಾರವಾಗಿದೆ. ಭಾರತವು ವಾರ್ಷಿಕವಾಗಿ ಸುಮಾರು 10% ರಷ್ಟು ಬೆಳೆಯುತ್ತದೆ ಎಂದು ಟ್ರೆಂಡ್ ಗಳು ತೋರಿಸುತ್ತವೆ. ಕಳೆದ ಒಂದು ದಶಕದಲ್ಲಿ ಜನರ ಕೊಳ್ಳುವ ಸಾಮರ್ಥ್ಯ ಮಹತ್ತರವಾಗಿ ಹೆಚ್ಚಾಗಿದೆ. ಆರಂಭಿಕ ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯ ವಿವಿಧ ಪ್ರಯೋಜನಗಳು ಮತ್ತು ಅಪಾಯಗಳನ್ನು ಅರ್ಥಮಾಡಿಕೊಳ್ಳುವ ಮೂಲಕ ಹೂಡಿಕೆದಾರರು ಮತ್ತು ಉದ್ಯಮಿಗಳು ಕಿರಾಣಿ ಅಂಗಡಿಯನ್ನು ವಿಶ್ವಾಸದಿಂದ ಪ್ರಾರಂಭಿಸಲು ಇದು ಸರಿಯಾದ ಸಮಯ.