written by khatabook | August 23, 2020

విజయవంతమైన కిరాణా షాపు కోసం పూర్తి గైడ్

×

Table of Content

వ్యాపార, పారిశ్రామిక రంగాలలో అడుగుపెట్టడం మీ కల అయితే, భారతదేశం కంటే పెద్ద వేదిక ఇంకెక్కడా ఉండదు. అలాగని మీరు వ్యాపారం చేయాలంటే గొప్ప గొప్ప కాలేజీలలో పెద్ద పెద్ద చదువులు చదివి ఉండాలి, ఎక్కువ పెట్టుబడులు పెట్టగలిగి ఉండాలి అనే ఆంక్షలేమి లేవు. కావాల్సిందల్లా ఎదగాలనే అభిలాష, కష్టపడే నైజం, కొద్దిగా పెట్టుబడి. వీటితోనే మీరు అనుకున్నంత డబ్బు, పేరు సంపాదించవచ్చు. అది ఎలా అని అనుకుంటున్నారా? ఈ చిన్న చిన్న మార్గదర్శకాలతో మీరు మీ కిరాణా షాపును తెరవచ్చు. ఇవే మీ ప్రయాణంలోని మీరు వేసే మొదటి అడుగులు. 

కిరాణా షాపు అంటే ఏమిటీ?

ఒక ఇంటికి అవసరమైన అన్ని నిత్యావసర సరుకులు దొరికే దుకాణాన్నే కిరానా షాపు అంటారు. మీరు ఎంత పెట్టుబడి పెట్టగలరు అనేదాన్ని బట్టి ఎలాంటి షాపు సిద్ధపరచవచ్చు అనేది అంచనా వేయవచ్చు. క్రింద తెలిపిన వాటినుంచి ఎక్కడ నుంచి మొదలుపెట్టాలి, ఎలా చ్చేయాలి అనే వాటి మీద మెలకువాలు నేర్చుకుని, మీరు కావాలనుకున్న దుకాణాన్ని రెడీ చేసుకోండి.  

కిరాణా షాపును తెరవడమెలా? - దశలవారీగా సూచనలు: 

మొదటి అడుగు : ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి

మొదటిగా చేయవలసినవి:  ముందుగా కింద చెప్పబడిన వివరాలతో ఒక ప్రణాళిక తయారు చేసుకోండి. మీరు వ్యాపారం  పెట్టాలనుకునే దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. 

  • కస్టమర్ల ప్రాధాన్యతలు తెలుసుకోండి.
  • వారు ఎంతవరకు కొనగలరో గుర్తించండి. 
  • వారి ఆర్ధిక పరిస్థితులను ఎలా ఉన్నాయనే అంచనా వెయ్యండి. 
  • మీకు పోటీగా ఎవరైనా ఉన్నారా, వారెలా వ్యాపారం చేస్తున్నారో గమనించండి.

రెండవ అడుగు: స్థలాన్ని ఎంచుకోండి 

ఇప్పుడు మీకు ఆ ప్రాంతంలోని జనాలగురించి ఒక అవగాహన వచ్చింది కాబట్టి, ఇక షాపు కోసం స్థలాన్ని ఎంచుకోండి. మీరు ఎంచుకునే స్థలం ఎక్కువ మంది జనాలకు అందుబాటులో ఉండాలి, ఉదాహరణకి ఊరికి కొద్దిగా దూరంగా ఉండే ప్రజలకు ఏ చిన్న అవసరం ఉన్నా, వారు చాలా దూరం రావాల్సి ఉంటుంది. అలా అవసరం ఉన్న దగ్గర పెట్టండి. ఇకపోతే మీతోటి వ్యాపారులు మీద ఒక కన్నేసి ఉంచండి, కస్టమర్లకు వాళ్ళమీద ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోండి. 

మూడవ అడుగు: మీ పెట్టుబడిని ప్లాన్  చేసుకోండి

మీరు మీ షాప్ పెట్టాలనుకునే స్థలాన్ని నిర్ణయించుకున్నాక, అక్కడ ఉండే జీవనవ్యయాలను లెక్కవేసుకోండి. అప్పుడు మీకు షాప్ అద్దెతో కలిపి, మొత్తంగా ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది ఒక అంచనా వస్తుంది. ఇక ఆ షాప్ కి మౌలికసదుపాయాలు, వినియోగ బిల్లులు, సరుకుకొనడం వంటివి అన్ని లెక్కకట్టుకోవాలి. లేదంటే, ఫ్రాంచైజ్ తీసుకుని నడపడం గురించి ఆలోచించండి. ఇలాచేస్తే, మీకు రెడీమేడ్ గా సరకు వచ్చేస్తుంది, మీరు కేవలం ఫ్రాంఛైజరుకు  మాత్రమే  రాయల్టీ చెల్లించవలసి ఉంటుంది. దీంట్లో  కూడా లాభనష్టాలు ఉంటాయి, కాబట్టి అన్ని తెలుసుకుని అడుగేయండి.

నాలుగవ అడుగు: సరకు సిద్దంచేసుకోండి

మీరు మీ దుకాణం మొత్తాన్ని సిద్ధం చేసేసుకున్నారు, మౌలిక సదుపాయాలన్నీ రెడీ అయిపోయాయి అనుకోండి ఇక మీరు సరకుతెచ్చి అమ్మడమే ఆలస్యం. ఒకవేళ మీరు ఎక్కువ సరకులు కొనేసి, కస్టమర్లు రాకపోతే, నిల్వ ఉండని వస్తువులు పాడైపోతాయి, లాభాల గురించి భయం పట్టుకుంటది. లేదంటే, మీరు తక్కువ సరకులు తెచ్చి, కస్టమర్లు ఎక్కువగా వచ్చి, వారికీ కావాల్సినవి దొరకక వెళ్ళిపోతే, వాళ్ళు మళ్ళీ షాపుకి రాకపోవచ్చు. కాబట్టి, చాలా తెలివిగా, ఎలాగైనా లాభం వచ్చేలా బాలన్స్ చేసుకోవాలి. ఒక మంచి ఇన్వెంటరీ మానేజ్మెంట్ సిస్టమ్ మిమ్మల్ని ఈ సమస్య నుంచి కాపాడుతుంది. 

మీ కిరాణా షాపుకు లాభాలు తెచ్చే 5 చిట్కాలు

మీరు కిరాణా షాపు తెరవడానికి అవసరమైన అన్ని అడుగులు వేసేసారు, కానీ, మీ కస్టమర్ల దగ్గర మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోడానికి ఇంకా చాలా దూరమే ఉంది, ఇలా అంటున్నందుకు నిరుత్సాహపడకండి. ఈ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల మీరు మీ కస్టమర్ల తప్పకుండ చేరువవుతారు.

  1.  షాపు అలంకరణ – ఎవరైనా తమ చూపులతోనే మంచిదా, కదా అని నిర్ణయిస్తారు. కాబట్టి కస్టమర్లకు మంచి అభిప్రాయాన్ని ఇచ్చేలాగా, షాపును సులభంగా గుర్తించే విధంగా సిద్ధం చేయించండి.
  2. పని వేళలు  – మీషాప్ చుట్టూ ఉండే జనాలను దృష్టిలో ఉంచుకుని మీరు దుకాణాన్ని నడపాలి. మీ చుట్టూ ఎక్కువ పగలు ఉద్యోగాలకు వెళ్లేవాళ్ళు ఉన్నట్లు అయితే మీరు సాయంత్రాలు ఎక్కువసేపు దుకాణం తెరిచి ఉంచాలి, ఇక వాళ్లు ప్రశాంతంగా  వచ్చికొనుక్కుని వెళ్ళడానికి ఆదివారాలు కూడా షాప్ తెరిచి ఉంచండి.
  3. డిస్కౌంట్లు మరియు ఆఫర్లు – మీ కస్టమర్లకు డిస్కౌంట్లు, గిఫ్ట్ క్యూపన్లు ఇచ్చి వాళ్ళు ఎప్పటికి మీ దుకాణానికి వచ్చేలా చేసుకోండి. కానీ మీరు ఇచ్చే వస్తువులు లేదా ఆఫర్లు వారికీ పనికొచ్చేవి అయ్యుండాలి అని గుర్తుపెట్టుకోండి. ఏవొకటి అని పిచ్చివి ఇస్తే, మీ వ్యాపారానికే చెడ్డపేరు వస్తుంది.
  4. టెక్నాలజీ వినియోగం  – ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటల్ గానేపనిచేస్తుంది. కాబట్టి మీరుకూడా అప్గ్రేడ్ అవ్వాలి. కస్టమర్లు చాలా ఈజీగా, త్వరగా డబ్బు కట్టడానికి వీలుగా భారత్ QR కోడ్ కోసం అప్లై చేయండి. మీ కస్టమర్ల నుంచి ఫోన్ నంబర్లు తీసుకుని, గ్రూప్ తయారుచేసి, వారికీ అనుగుణమైన డిస్కౌంట్ల వివరాలు వారికీ పంపండి.
  5. వ్యక్తిగత అనుభవం –  ఒక దుకాణంలో ఎన్ని సదుపాయాలున్నా, పర్సనల్ టచ్ ని మించేది ఏదిలేదు. కస్టమర్ల  దగ్గరకి స్వయంగా వెళ్లి వాళ్ళకి ఏమికావాలో తెలుసుకోండి. అవి ఒకవేళ లేకపోతే, తప్పకుండా తీసుకొచ్చి ఉంచుతాను అని భరోసా ఇవ్వండి. దానివల్ల వారికీ నమ్మకం కలిగి, మీ దుకాణానికి రెగ్యులర్ కస్టమర్లు అవుతారు.  

ఆఖరిగా ఒక సలహా

కిరాణా షాపు నడపడం అంటే అదేమీ రాకెట్ సైన్స్ కాదు, తక్కువ టైంలోనే మీరు మీ వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. మీరు మీ వ్యాపారానికి పునాది బలంగా ఉండేలా అవసరమైన మెళకువలు తెలుసుకొని మొదలుపెట్టండి. వ్యాపారం మొదలుపెట్టిన కొన్నిరోజులు కొద్దిగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి, ఒడిదుడుకులను పరిష్కరించుకోండి. ఏ వ్యాపారం అయినా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, వారి పోటీదారులగురించి, వారి  కస్టమర్ల గురించి, అంతే. మీ వ్యాపారం అంచలంచలుగా ఎదుగుతుంది. 

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.