మీకు కేకులు చేయడం లేదా బేకింగ్ వంటలు చేయడం బాగా వచ్చా? సరదాగా కాళీ టైములో వంటలతో ప్రయోగాలు చేసే అలవాటు ఉందా? కప్‌కేకులు, బిస్కట్లు అంటూ వాటి గురించే ఆలోచిస్తుంటారా? మీ బేకింగ్ నైపుణ్యానికి పని పెట్టి సంపాదించాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు సరైన చోటికే వచ్చారు. ప్రస్తుతం మీ సొంత బేకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం! అదెలాగో చూద్దాం రండి.
ప్రస్తుత రోజులలో ఇండియాలో బేకింగ్ షాపులకు మంచి ఆదరణ లభిస్తుంది. పాశ్చాత్త కల్చర్ ప్రభావంతో, మన వారిలో కూడా కొత్త వాటిని ప్రయత్నించాలని ఇష్టం పుడుతుంది. కానీ బేకింగ్ బిజినెస్ అంటే మా వీధి చివర కూడా ఒకటి ఉంది అని తీసిపడేయకండి. అలా ఉండడానికి కారణం డిమాండ్ ఉంది కాబట్టి. ఆ డిమాండునే మీరు కూడా ఉపయోగించుకొని మంచి సంపాదన సంపాదించవచ్చు.
మార్కెట్లో పేరుగాంచిన రీసెర్చ్ సంస్థ IMARC వారు చేసిన పరిశోధనలో తెలిసింది ఏమిటంటే, 2018 నాటికి భారతీయ మెకారి మార్కెట్ 722 కోట్ల అమెరికన్ డాలర్ల విలువైనది అని. అంటే దాదాపు అయిదున్నర లక్షల కోట్ల రూపాయలు. రానున్న అయిదు సంవత్సరాలలో, ఈ మార్కెట్ విలువ 5 వందల కోట్ల డాలర్లను దాటుతుందని కూడా తెలిసింది. కాబట్టి, ఒక బేకరీ షాపును తెరవడానికి ఏమేమి అవసరమో మరికొంత క్షుణ్ణంగా తెలుసుకుందాం.
మీ సొంత బేకరీ షాపును తెరవడం ఎలా?
ముందు మీ బేకరీ వ్యాపార విధానం మరియు రకం ఏమై ఉండాలో నిర్ణయించుకోండి
- ఆన్లైన్ హోమ్ బేకరీ: అద్భుతమైన వెబ్సైట్, మరియు మీ పనితనాన్ని రుజువు చేయగల మంచి ఫొటోలతో మీరు మీ సొంత ఆన్లైన్ బేకరీని ప్రారంభించవచ్చు. దీనికి మీరు సొంత షాపు కలిగి ఉండాల్సిన పనే లేదు.
- కౌంటర్ సర్వీస్ బేకరీ షాపు: మీరు కావాలనుకుంటే కేవలం పార్సెల్ మాత్రమే అందించే టేక్-అవే బేకరీని కూడా తెరవవచ్చు. ఈ విధంగా మీరు మీ షాపుకు అదనంగా ఖర్చు చేయాల్సిన పని ఉండదు.
- డైన్-ఇన్ బేకరీ షాపు: అలాగే, మీ బేకరికి వచ్చి, కూర్చొని నెమ్మదిగా ఎంజాయ్ చేయడానికి కూడా మీరు కస్టమర్లకు అవకాశాన్ని కల్పించవచ్చు.
- ఫుడ్ ట్రక్ బేకరీ షాప్: అందరిలా ఒక షాపు తీసుకొని, అక్కడే ఉండి వ్యాపారం చేయడం ఇష్టం లేకపోతే, మీరు ఒక మొబైల్ ట్రక్‌ను ఏర్పాటు చేసికొని కూడా మీ బేకరీని నడిపించవచ్చు.
- హోల్‌సేల్ బేకరీ: నేరుగా కస్టమర్లకు మీ బేకరీ ఉత్పతులను అమ్మడానికి బదులు, మీరు ఇతర వ్యాపారాలకు, అంటే రెస్టారెంట్లకు, కిరాణా దుకాణాలకు, కేఫ్‌లకు కూడా మీరు మీ బేకరీ ఉత్పత్తులను అమ్మవచ్చు.
ఒక బేకరీ షాపు వ్యాపార ప్రణాళికను ఎలా తయారు చేయాలి?
మీరు మీ సొంత బేకరిని ప్రారంభించే ముందు, ఈ వ్యాపారంలో ఆరితేరిన వారితో కలవాలి. కలిసి వారు తమ వ్యాపారాన్ని ఎలా నడిపించుకుంటున్నారో చూసి నేర్చుకోవాలి. ఆ విధంగా మీరు మీ వ్యాపార విధానాన్ని ఎలా పెట్టాలో తెలుసుకోగలుగుతారు.
- బిజినెస్ ప్లాన్: మీ బేకరీ వ్యాపారం ద్వారా మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏమిటి, దాన్ని ఎలా సాధించబోతున్నారనే విషయాలపై మీకు పూర్తి అవగాహనా ఉండాలి.
- మార్కెట్ అనాలిసిస్: మీ మార్కెట్, మీరు ఉంటున్న ప్రదేశం, అక్కడి ప్రజలు, పెట్టుబడికి ఎవరైనా ముందుకు వస్తారా లేదా అనే విషయం, మీకున్న పోటీ గురించి పూర్తిగా పరిశోధించి తెలుసుకోవాలి.
- మీ మెనూ మరియు ఇతర విషయాలు: మీరు ఎలాంటి వాటిని విక్రయిస్తారు, మీ మెనూ ఏమిటి, మీ బేకరీలో ఏమేమి లభ్యమవుతాయనే విషయాలు అన్నికస్టమర్లకు మెన్యులో తెలియజేయాలి.
- మీ వ్యాపార పనితీరును చక్కబెట్టండి: మీ రోజువారీ వ్యాపార పనితీరును, అంటే ముడి సరుకులు పొందడం నుండి వస్తువు అంమ్ముడయ్యే వరకు జరిగే ప్రక్రియను ఏర్పరచి, మీరు అందించే సర్వీసులు అలాగే పనివారు ఏమేమి చేయాలనే విషయాలను చూసుకోవాలి.
- ఆర్థిక విశ్లేషణ: మీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, మీ వ్యాపార సంబంధిత ఖర్చులు, ఫిక్స్డ్ మరియు నెలవారీ చెల్లింపులు, మీకున్న ప్రాఫిట్ మార్జిన్ వంటి విషయాలపై మీకు మంచి అవగాహన ఉండాలి.
- SWOT అనాలసిస్: SWOT అనాలసిస్ అంటే, మీ వ్యాపారానికి ఉన్న బలం, అవకాశం, ప్రమాదం మరియు బలహీనతలను మీరు క్షుణ్ణంగా తెలుసుకుని దానిని బట్టి అడుగు చేయడానికి సహాయపడే వ్యాపార సంబంధిత విశ్లేషణ.
మీ బేకరికి ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
- మీ షాపు అమ్మకాలపై నేరుగా ప్రభావం చూపగల విషయం ఏమైనా ఉంది అంటే అది మీ షాపు ఉన్న ప్రదేశమే. జనాలు ఎక్కువగా సంచెరించే ప్రదేశమైతే మీ వ్యాపారానికి సరిగ్గా సరిపోతుంది. అలాగే, నీటి సరఫరా మరియు సరైన డ్రైనేజి ఉన్న చోటును వెతికి పట్టుకోవడం చాలా ముఖ్యం.
- బౌతికంగా ఒకే చోట ఉండే సాంప్రదాయ షాపులలో, బేకరీల ముందు భాగం అందరికి కనిపించే విధంగా బిల్డింగ్ ఉండడం మంచిది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాలి. అవసరమైతే అన్ని వసతులు ఉన్న కిచెన్ మొదటి అంతస్తులో ఉండి, క్రింద కస్టమర్స్ కూర్చోవడానికి వీలు ఉంటే మరింత బాగుంటుంది. అప్పుడు కస్టమర్లపై మంచి ద్రుష్టి నిలిపి బాగా సర్వ్ చేయగలుగుతారు.
- అంతే కాక, మీ బిల్డింగ్ యజమాని నుండి ఇలా ఒక బేకరీ లేదా ఆహార పదార్దాలు విక్రయించే షాపును పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని యజమాని నుండి నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను పొందడం మర్చిపోకండి. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఉంటుంది.
ఒక బేకారిని ప్రారంభించడానికి ఎంత ఖర్చు అవుతుంది?
మన దేశంలో ఒక బేకరీ ప్రారంభించడానికి ఎంత ఖర్చు అవుతుందని ఒక అంచనాను క్రింద ఇస్తున్నాం. దీనిని కేవలం ఉదాహరణగా మాత్రమే పరిగణించండి.
- అద్దె: రూ. 60,000
- లైసెన్సులు: బేకారిని నడపడానికి పలు విధాల లైసెన్స్‌లు కావాలి. వాటిలో ఫసాయ్ లైసెన్సు పొందడానికి దగ్గరగా రూ. 15,000 ఖర్చు అవుతుంది. అలాగే TIN నంబర్ పొందడానికి రూ. 10,000 ఖర్చు చేయాలి. మునిసిపల్ హెల్త్ లైసెన్స్ పొందడానికి రూ. 3000 మరియు ఫైర్ లైసెన్స్ పొందడానికి దగ్గరగా రూ, 1000 నుండి రూ. 2000 వరకు ఖర్చు అవుతుంది. అన్ని కలిపి లైసెన్సులు పొందడానికి మీకు రూ. 30,000 వరకు ఖర్చు చేయాలి.
- పనివారి జీతాలు: హెడ్ చెఫ్, సహాయకులు, సర్వీస్ బాయ్స్, క్యాషియర్ మరియు శుభ్రం చేసేవారికి మీరు దగ్గరగా రూ. లక్ష వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు.
- వంట సామాగ్రి: ఒక బేకరీ కోసం పూర్తి కిచెన్ సెటప్ పొందడానికి దగ్గరగా రూ. 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది.
- మార్కెటింగ్: డిస్ప్లే బోర్డులు, పామ్ప్లెట్లు, సోషల్ మీడియా మార్కెటింగ్ మరియు ఇతర యాడ్లకు దగ్గరగా రూ. 50,000 వరకు వెచ్చించాలి.
- ఇతర ఖర్చులు: పనివారి యూనిఫామ్, కరెంట్, డిస్ప్లే లాంటి వాటికీ మరొక రూ. 20,000 పక్కన పెట్టాలి.
మొత్తంగా ఒక బేకరీని ప్రారంభించడానికి దాదాపు రూ. 10 నుండి 12 లక్షల వరకు పెట్టుబడి పెట్టలండి ఉంటుంది. అయితే, మీరు బేకరీని ఏర్పాటు చేసే ప్రదేశం, కొనే ఉపకరణాలను బట్టి ఆ రేటు మారుతుంది.
మీరు సొంత బేకరీ తెరవడానికి ఎలాంటి సామాగ్రి కావాలి?
మీరు మాములు సాధారణ బేకరీ తెరచిన లేక అన్ని హంగులు ఉన్నదానిని తెరచినా, మంచి క్వాలిటీ ఉన్న ఆహారాన్ని తయారు చేయడానికి మీకు మంచి కిచెన్ ఉపకరణాలు కావాలి. ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్న వస్తువులు మన్నిక బాగుండడమే కాకుండా అన్ని పర్ఫెక్ట్గా జరిపిస్తాయి.
- పిండి కలిపే వస్తువులు మరియు కేకు చేసేవి: ఒక బేకరీలో ఉండాల్సిన వాటిలో ముఖ్యమైనవి పిండి కలపడానికి ప్లానెటరీ మిక్సర్లు, ఒవేన్, డీప్ ఫ్రిడ్జ్‌లు, కూలింగ్ ఫ్రిడ్జ్‌లు, టేబుల్స్, గ్యాస్ స్టవ్, సిలిండర్లు మొదలైనవి.
- స్టోరేజి: కిచెన్‌లో మంచి స్టోరేజి ఉంటే పని సాఫీగా జరుగుతుందని మీకు చెప్పాల్సిన పనే లేదు. అలాగే, అవసరాన్ని బట్టి పెద్ద బ్యాగుల పంచదార, పిండి లాంటివాటిని తీసుకెళ్లడానికి మొవర్లను కూడా కొనడం మంచి ఆలోచన.
- డిస్ప్లే మరియు సేల్స్: మీరు షాపు కోసం పెట్టే డిస్ప్లేలు, ఇతర బోర్డులను జాగ్రత్తగా డిజైన్ చేయించుకోవాలి. ఎందుకంటే అవి బాలేకపోతే, కస్టమర్లను ఆకర్షించడం కష్టం. మీరు పార్సెల్ పంపించే బాక్సులు కూడా అందంగా ఉండాలి.
- శుభ్రత మరియు మైంటైసెన్స్ : మీ క్లీనింగ్ ఏరియాలో మూడు కంపార్ట్మెంట్లు ఉండే సింకును ఏర్పాటు చేయండి. మీ పనివారు క్రమంగా వారి చేతులు కడుకోవాలి. అలాగే ఆహారాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు గ్లోస్ వేసుకోవాలి. శుభ్రం చేయడానికి అవసరమయ్యే అన్ని ఇతర వస్తువులను ఎలాగో కొనాల్సిందే అనుకోండి.
- ఒక POS మెషిన్ని మరియు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఏర్పాటు చేసుకోవాలి: ఈ రోజుల్లో POS మెషిన్లు ఇన్వెంటరీ మ్యానేజ్మెంట్ సాఫ్ట్వేర్లతో కలిసి వస్తున్నాయి. ఇవి మీ బిల్లింగ్ ప్రక్రియను చూసుకోవడమే కాకుండా వీ దగ్గర ఉన్న ముడి సరుకులను మ్యానేజ్ చేయడానికి, వాటి లెక్క సరిచూసుకోవడానికి కూడా సహాయపడుతుంది.
మీరు మంచి లాభాలను ఎలా అర్జించగలరు?
- మీ ప్యాకేజింగ్ అందంగా ఉండాలి: ఈ రోజులలో చిన్న బ్రాండులు కూడా ఇతర బ్రాండుల నుండి ప్రత్యేకింపబడడానికి అందమైన, ఆకర్షణీయమైన ప్యాకింగ్లతో ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా మీ బేకరిని తలపించే ప్రత్యేకమైన ప్యాకింగ్ దానిని చూసినప్పుడల్లా జనానికి మీ షాపు గుర్తుకువచ్చేలా చేస్తుంది.
- సోషల్ మీడియా ఉనికి: మీ బేకరీలో కస్టమర్లు తింటుండగా, లేదా మీరు బేకింగ్ చేస్తుండగా ఆకర్షణీయమైన ఫోటోలు తీయండి. వీటిని తర్వాత ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, స్నాప్‌చాట్ లాంటి సామజిక మాంద్యమాలల్లో అప్లోడ్ చేస్తే, అక్కడ చూసే ప్రజలను ఆకర్షించగలుగుతారు. అలాగే, అక్కడి నుండి ఆన్లైన్ ఆర్డర్ చేయడానికి లింక్‌లను కూడా పోస్ట్ చేయండి.
- ఆకర్షణీయమైన డిస్ప్లే మరియు షాపులో ఆహ్లాదకరమైన వాతావరణం: షాపుకు వచ్చే వారు తిరిగి రావాలంటే అక్కడి అందంతో వారిని కట్టిపడేయగలగాలి. షాపులోని డిస్ప్లేలలో మంచి మంచి కేకులు, పేస్ట్రీలు, పఫ్లూ పెట్టి అలంకరించండి. సదుపాయంగా కూర్చోడానికి ఉండాలి. మంచి లైటింగ్ ఉండాలి. కస్టమర్లకు ఏమాత్రం అసంతృప్తిగా ఉండకుండా ఉండాలి.
- ఫ్రీ శాంపిల్స్ ఇవ్వండి: కేకైనా, పేస్ట్రీ అయినా, ఫ్రీ గా వస్తే ఎవరికీ మాత్రం నచ్చదు చెప్పండి? కాబట్టి మీ షాపు రుచులను ప్రజలకు అలవాటు చేయడానికి శాంపిల్ళ్లు ఇవ్వండి. తద్వారా తర్వాత సారి వచ్చినప్పుడు వారికి అది కావాలనే కోరిక పుడుతుంది. అలాగే ఈ మార్గం ద్వారా పెద్దగా అమ్ముడవ్వని వాటిని కూడా కస్టమర్లకు అలవాటు చేయొచ్చు.
- బేకింగ్ క్లాసులు ఇవండి: మీకు బేకింగ్ చేయడం బాగా వస్తే, అది నేర్చుకోవాలనుకునే వారికి నేర్పించండి. డబ్బు సంపాదించడానికి ఇది కూడా ఒక మంచి మార్గమే. ఆఫ్‌లైన్ బేకింగ్ క్లాసులు తీసుకుంటూ మీకంటూ పేరు సంపాదించండి
మరి ఆలస్యం చేయకండి ఇక. మొదటి అడుగు వేసేయండి. సరైన ప్రదేశాన్ని వెతికి పట్టుకోండి. అవసరమైన పెట్టుబడిని సంపాదించి, కావాల్సిన లైసెన్సులు, అనుమతులు పొంది మీ బేకరీని తెరవండి. ఇదే మంచి సమయం. ఆల్ ద బెస్ట్! మీరు కచ్చితంగా సక్సెస్ అవుతారు!