written by Khatabook | August 29, 2022

భారతదేశంలోని ఉత్తమ చాక్లెట్ బ్రాండ్‌లు

×

Table of Content


చాక్లెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా మన దేశంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చాక్లెట్‌ను ఇష్టపడతారు. ప్రియమైన వారికి బహుమతిగా లేదా ట్రీట్‌గా, చాక్లెట్లు ఇవ్వడం సర్వసాధారణం. ప్రత్యేక సందర్భాలలో మీ ప్రేమను మరియు శుభాకాంక్షలు తెలియజేయడానికి హృదయాన్ని కరిగించే చాక్లెట్ బొకేతో పాటు వివిధ రకాల ఇతర బహుమతులు సరైనవి. దీపావళి, వివాహాలు, నిశ్చితార్థాలు, పుట్టినరోజు వేడుకలు వంటి ప్రముఖ భారతీయ 

అనేక చాక్లెట్ బ్రాండ్‌లు మరియు రుచులు ఉన్నందున సరైన చాక్లెట్ బ్రాండ్‌ను కనుగొనడం ప్రతి ఒక్కరికి చాలా సులభం. భారతదేశంలోని చాలా చాక్లెట్ బ్రాండ్‌లు వివిధ రకాల పరిమాణాలు, ఆకారాలు మరియు నమూనాలలో, ధరలకు సరిపోయే విధంగా చాక్లెట్‌లను ఉత్పత్తి చేస్తాయి. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డెయిరీ మిల్క్ మరియు ఫైవ్ స్టార్ వంటి చాక్లెట్‌లను కేవలం ₹5కి కొనుగోలు చేయవచ్చు.

భారతదేశంలో చాక్లెట్ ఇచ్చే సంప్రదాయం కొనసాగుతూనే ఉంది, ఎందుకంటే ఇక్కడి జనాభాలో ఎక్కువ మంది 25 ఏళ్లలోపు వారే. చాక్లెట్ పరిశ్రమ యువ తరాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. పాశ్చాత్యీకరణ, ప్రగతిశీల వైఖరులతో పాటు ఆహ్లాదకరమైన జీవనశైలి వంటివి చాక్లెట్ విక్రయానికి దోహదపడే ఇతర అంశాలు. దీనికి మద్దతు ఇచ్చే అధ్యయనాలు కూడా ఉన్నాయి. అందుకే భారతదేశ చాక్లెట్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 2021-2026 కాలానికి, అంచనా వేసిన CAGR 11.34 శాతం.

మీకు తెలుసా? 1/2 కిలోగ్రాముల కంటే తక్కువ చాక్లెట్‌ను తయారు చేయడానికి, 400 కోకో బీన్స్ అవసరం!

భారతదేశంలోని ప్రసిద్ధ చాక్లెట్ బ్రాండ్లు

కొన్ని ప్రసిద్ధ భారతీయ చాక్లెట్ బ్రాండ్‌ల జాబితా క్రింద ఉంది:

Cadbury

క్యాడ్‌బరీ అనేది యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న ఒక చాక్లెట్ కంపెనీ, దీనిని 1824లో ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జాన్ క్యాడ్‌బరీ స్థాపించారు. క్యాడ్‌బరీ మొదటిసారిగా 1948లో భారతదేశానికి వచ్చి చాక్లెట్‌లను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ చాక్లెట్ బ్రాండ్ అయిన క్యాడ్‌బరీకీ మోండెలెజ్ ఇండియా (గతంలో క్యాడ్‌బరీ ఇండియా) బాధ్యత వహిస్తోంది. యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం, 2014లో భారతదేశంలో జరిగిన మొత్తం చాక్లెట్ అమ్మకాలలో క్యాడ్‌బరీ వాటా 55.5 శాతం. క్యాడ్‌బరీ యొక్క ప్రముఖ బ్రాండ్ డైరీ మిల్క్ మరియు కొన్ని అత్యంత ప్రసిద్ధ క్యాడ్‌బరీ వైవిధ్యాలు డైరీ మిల్క్, 5 స్టార్, జెమ్స్, పెర్క్, సిల్క్, బోర్న్‌విల్లే, సెలబ్రేషన్స్, మార్వెలస్ క్రియేషన్స్ మరియు హాట్ చాక్లెట్.

Nestle

ప్రపంచంలోని ప్రముఖ ఆహార మరియు పానీయాల కంపెనీలలో నెస్లే  ఒకటి, భారతదేశంతో సహా అనేక దేశాలలో అనుబంధ సంస్థలను నిర్వహిస్తోంది. భారతదేశం అంతటా ఎనిమిది నెస్లే ఫ్యాక్టరీలు ఉన్నాయి, అలాగే పెద్ద సంఖ్యలో కో-ప్యాకర్లు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. నెస్లే కిట్-క్యాట్ భారతదేశంలోని అత్యుత్తమ చాక్లెట్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది మృదువైన, అధిక నాణ్యత గల చాక్లెట్ పూతతో కూడిన వేఫర్. అత్యంత విస్తృతంగా వినియోగించబడే నెస్లే బ్రాండ్‌లు ఎక్స్‌ట్రా స్మూత్, కిట్ కాట్ సెన్స్, కిట్ కాట్ డార్క్ సెన్స్, ఆల్పినో, కిట్ క్యాట్, బార్-వన్, మంచ్ మరియు మిల్కీ బార్.

Ferrero

ఫెర్రెరో రోచెర్ అనేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోరూరించే గోల్డెన్ బాల్, ఇక నుటెల్లా అయితే ఒకసారి తింటే మర్చిపోలేని చాక్లెట్-హాజెల్ నట్ స్ప్రెడ్. 1946లో, మిచెల్ ఫెర్రెరో ఈ ఇటాలియన్ బహుళజాతి సంస్థను స్థాపించారు. 2004లో కంపెనీ భారతదేశంలో వ్యాపారం ప్రారంభించింది. చక్కటి చాక్లెట్ పరిశ్రమలో అత్యుత్తమ ఉత్పత్తులను రూపొందించడానికి మరియు ఉత్పత్తి చేయడం వల్ల భారతదేశంలోని అగ్రశ్రేణి చాక్లెట్ బ్రాండ్‌లలో ఒకటిగా చాలా త్వరగా ఎదిగింది.

ఈ బ్రాండ్ యొక్క చాక్లెట్లు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఫెర్రెరో రోచర్ దాని ఆకర్షణీయమైన రూపానికి, ప్యాకేజింగ్ మరియు రుచికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో అత్యుత్తమమైన చాక్లెట్‌ ఎంపికలను అందించిన మొదటి బ్రాండ్ ఇది. కొన్ని ఫెర్రెరో వేరియంట్‌లలో ఫెర్రెరో రోచర్, నుటెల్లా, కిండర్, రాఫెల్లో మరియు మోంటే చెర్రీ ఉన్నాయి.

Amul

అమూల్ భారతదేశపు అతిపెద్ద పాలు మరియు చాక్లెట్ కంపెనీ. ఇది పాలకు బాగా ప్రసిద్ధి చెందినప్పటికీ, భారతదేశంలో కొన్ని అత్యుత్తమ చాక్లెట్లను కూడా ఉత్పత్తి చేస్తుంది.  అమూల్ యొక్క పాలు మరియు సంబంధిత ఉత్పత్తులు గతంలోనూ, ఇప్పుడూ చాలా దృష్టిని ఆకర్షించాయి, అలాగే అమూల్ చాక్లెట్లు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.

1948లో స్థాపించబడిన ఈ సంస్థ భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చడంలో కూడా విజయం సాధించింది. మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, ఫ్రూట్ & నట్ చాక్లెట్, ట్రాపికల్ ఆరెంజ్ చాక్లెట్, ఆల్మండ్ బార్, మిస్టిక్ మోచా మరియు సింగిల్ ఆరిజిన్ డార్క్ చాక్లెట్ వంటి రకాలు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చాక్లెట్‌లలో కొన్ని.

చాక్లెట్ ప్రియుల అభిప్రాయం ప్రకారం, చాక్లెట్ ప్రపంచంలో అమూల్ డార్క్ చాక్లెట్ ఎదురులేనిది. ఇది శక్తివంతమైన మరియు గొప్ప రుచిని కలిగి ఉంటుంది మరియు 99 శాతం కోకోను కలిగి ఉంటుంది. చేదు రుచి మరియు కనిష్ట చక్కెరతో అమూల్ డార్క్ చాక్లెట్ జనాలు వారి ఆహార ప్రణాళికలకు కట్టుబడి ఉండటానికి సహాయపడటంతో పాటు వారు కొద్దిగా చాక్లెట్ ఆనందాన్ని పొందేలా చేస్తుంది. ఈ బ్రాండ్ యొక్క ప్రసిద్ధ డార్క్ చాక్లెట్‌లలో కొన్ని అమూల్ డార్క్ 55 శాతం, అమూల్ 90 శాతం బిట్టర్ మరియు అమూల్ 75 శాతం బిట్టర్ చాక్లెట్‌లు.

The Hershey Company

హెర్షే కంపెనీ పెన్సిల్వేనియాలోని హెర్షేలో ఉన్న ఒక మిఠాయి కంపెనీ. ఇది అమెరికాలో ప్రారంభించబడింది, కానీ చాలా త్వరగా భారతదేశంలో అందరికీ తెలిసిన పేరుగా మారింది. ప్రస్తుతం దీని జనాదరణకు హద్దులు లేవు, ఇప్పుడు ఇది భారతదేశంలోని అగ్ర చాక్లెట్ బ్రాండ్‌లలో ఒకటి. ఈ అమెరికన్ కంపెనీ చాక్లెట్లు, అలాగే సిరప్‌లు, పుదీనా మరియు ఇతర క్యాండీలను విక్రయిస్తుంది. ఇప్పుడు హెర్షేస్‌లో ఉన్న కొన్ని ఉత్తమ చాక్లెట్ బార్‌లు హెర్షేస్ మిల్క్ చాక్లెట్ బార్‌లు, హెర్షేస్ వైట్ క్రీమ్ విత్ ఆల్మండ్ బార్, హెర్షేస్ డార్క్ చాక్లెట్.

హెర్షే ప్రపంచవ్యాప్తంగా 80 కంటే ఎక్కువ బ్రాండ్‌లను అందిస్తుంది, వాటిలో బ్రూక్‌సైడ్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇది ప్రత్యేకమైన ఫ్రూటీ కాంబినేషన్‌తో కూడిన పరిమిత-ఎడిషన్ డార్క్ కోకో-రిచ్ చాక్లెట్. అధిక నాణ్యత గల పదార్థాలతో రూపొందించబడ్డ హెర్షే చాక్లెట్ స్ప్రెడ్‌లు మరియు సిరప్‌లు భారతదేశంలో కూడా అందుబాటులో ఉన్నాయి.

మీ ప్రియమైన వ్యక్తి మిల్క్ చాక్లెట్ల యొక్క కమ్మని రుచిని ఆస్వాదించాలని మీరు కోరుకుంటే, వారితో హెర్షీస్ చాక్లెట్లు తినిపించాల్సిందే. ఈ భారతీయ చాక్లెట్ బ్రాండ్ యొక్క నగ్గెట్స్ మిల్క్ చాక్లెట్, బాదంపప్పులతో నిండి రెండు-బైట్స్ బార్ రూపంలో వస్తుంది,  మిల్క్ చాక్లెట్‌లో వేయించిన బాదంపప్పుల కమ్మని రుచిని కలిగి ఉంటుంది.

Godiva Chocolatier 

1940లలో బెల్జియంలో డోప్స్ కుటుంబం ఒక చిన్న కుటుంబ వ్యాపారంగా స్థాపించిన గోడివా చాకోలేటియర్‌ ఇప్పుడు ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్‌గా ఎదిగింది. చాలా కాలంగా చాక్లెట్ బ్రాండ్‌గా ఉన్న గోడివా చాలా ప్రత్యేకమైనది మరియు అనే చోట్ల  'హై క్లాస్'గా పరిగణించబడుతుంది. ఈ చాక్లెట్లు ప్రతి స్టోర్‌లో అందుబాటులో ఉండవు. మీ నగరంలోని పెద్ద పెద్ద చాక్లెట్ స్టోర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీనికి కారణం అధిక ధర మరియు తక్కువ షెల్ఫ్-లైఫ్. డార్క్ చాక్లెట్లు మరియు కమిట్‌లు వారి అత్యంత ప్రజాదరణ పొందిన ఐటమ్స్.

Mars

క్యాండీ తయారీలో అగ్రగామిగా ఉన్న మార్స్ కంపెనీ 1911లో స్థాపించబడింది, వీళ్ల ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్‌లో ఉంది. ఈ  కంపెనీ సుమారు 13 పాక బ్రాండ్‌లు మరియు 25 చాక్లెట్ లైన్‌లను 30కి పైగా దేశాలలో విక్రయిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా 12 పారిశ్రామిక ఫెసిలిటీలలో  విస్తరించి ఉన్న మార్స్ ఉత్పత్తి లైన్లలో 20,000 మందికి పైగా పని చేస్తున్నారు. దీని ప్రజాదరణ సమర్థవంతమైన మార్కెటింగ్ ప్రయత్నాలు మరియు తక్కువ ధరలకు ఆపాదించబడింది. స్నికర్స్  భారతదేశంలో వారి అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్పత్తి.

మరోవైపు, భారతీయ చాక్లెట్ మార్కెట్‌లో కేవలం 1.1 శాతాన్ని మాత్రమే స్వాధీనం చేసుకోవడంతో వారి ఇతర ఐటమ్స్ ప్రభావం చూపలేకపోయాయి. వీళ్ళ ఉత్పత్తులలో స్నికర్స్, గెలాక్సీ, మార్స్,మిల్కీ వే, స్కిటిల్స్, M&M's మరియు ట్విక్స్ ఉన్నాయి.

Lindt

ఒకరి రిఫ్రిజిరేటర్‌లో లిండ్ట్ చాక్లెట్‌లను కలిగి ఉండటం 1990లలో విలాసవంతమైన వస్తువుగా పరిగణించబడింది. లిండ్ట్ చాక్లెట్‌లు భారతదేశంలోని అత్యుత్తమ చాక్లెట్ బ్రాండ్‌లలో ఒకటిగా పరిగణించబడుతున్నాయి. బ్రాండ్ అత్యధిక నాణ్యత గల పదార్థాలు, ముడి పదార్థాలు మరియు ప్రయోగాత్మక అనుభవాన్ని ఉపయోగించడం కోసం చాలా ప్రసిద్ధి చెందింది, దీని ఫలితంగా అద్భుతమైన శ్రేణి చాక్లెట్‌లు లభిస్తాయి. 

1990లలో, రిఫ్రిజిరేటర్‌లో లిండ్ట్ చాక్లెట్‌లను కలిగి ఉండటం ఒక లగ్జరీగా పరిగణించబడేది. లిండ్ట్ చాక్లెట్స్ భారతదేశంలోని అత్యుత్తమ చాక్లెట్ బ్రాండ్‌లలో ఒకటిగా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నాయి. అత్యధిక నాణ్యత గల పదార్థాలు, ముడి పదార్థాలు మరియు ఆచరణాత్మక అనుభవాన్ని అందించడంలో ఈ బ్రాండ్ చాలా ప్రసిద్ధి చెందింది, దీని ఫలితంగా అద్భుతమైన చాక్లెట్‌లు అందిస్తూ వస్తుంది. లిండ్ట్ చాక్లెట్‌లు ఉత్తమ అనుభూతి మరియు రుచినిచ్చే అధిక నాణ్యత గల ఐటమ్స్.

కుమారుడి మద్దతుతో, డేవిడ్ స్ప్రంగ్లీ-స్క్వార్జ్ 1845లో ఈ స్విస్ చాక్లెట్ పరిశ్రమను సృష్టించాడు. భారతీయ చాక్లెట్ మార్కెట్ కోసం ఈ కంపెనీ అత్యధిక నాణ్యత మరియు ప్రజాదరణ అవసరాలను సాధించింది, ఇదంతా వారి చాక్లెట్ ఫార్ములా మహిమ.

Pacari

పకారీ ప్రపంచంలోనే మొట్టమొదటి బయోడైనమిక్ చాక్లెట్ బ్రాండ్. ఇది అంతర్జాతీయ చాక్లెట్ అవార్డ్స్‌లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న చాక్లెట్ బ్రాండ్, అలాగే ప్రపంచంలోని మొట్టమొదటి సర్టిఫైడ్ బయోడైనమిక్ చాక్లెట్ కంపెనీ. ఇది ఈక్వెడార్‌లో ఉత్తమ సర్టిఫైడ్ ఆర్గానిక్ అర్రిబా నేషనల్ కోకో మరియు దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిన ఇతర అసాధారణ ఆర్గానిక్ పదార్థాలను ఉపయోగించి మాత్రమే తయారు చేయబడుతుంది.

భారతదేశంలోని ప్రముఖ గౌర్మెట్ ఫుడ్ డెస్టినేషన్ మందారా ఆర్చర్డ్, ఈ ప్రీమియం చాక్లెట్‌ను భారతీయ తీరాలకు, ముఖ్యంగా చాక్లెట్ ప్రియుల కోసం తీసుకువచ్చింది. పకారీ 100 శాతం కోకో, పకారి లెమోన్‌గ్రాస్ ఆర్గానిక్ డార్క్ చాక్లెట్, పకారి ఆండియన్ రోజ్ ఆర్గానిక్ డార్క్ చాక్లెట్ మరియు పకారి చిల్లీ ఆర్గానిక్ డార్క్ చాక్లెట్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన చాక్లెట్‌లు.

Ghirardelli Chocolate Company

ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన చాక్లెట్లను ఉత్పత్తి చేస్తుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో 160 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యిన ఈ కార్పొరేషన్ ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు.

బీన్ ఎంపిక నుండి తుది ఉత్పత్తుల వరకు చాక్లెట్ తయారీ ప్రక్రియలో గిరార్డెల్లి పాల్గొంటుంది, అందుకే వారి చాక్లెట్‌లు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవి. ఇది వారి వస్తువులలో ఉపయోగించే పదార్థాలపై పూర్తి నియంత్రణను నిర్వహించడానికి అనుమతిస్తుంది.

ఇంటెన్స్ డార్క్, ప్రెస్టీజ్ చాక్లెట్ బార్‌లు మరియు చాక్లెట్ స్క్వేర్స్ ఈ బ్రాండ్ పేరు వినగానే గుర్తుకు వచ్చే కొన్ని ఐటమ్స్ 

ముగింపు

ఇప్పుడు మీరు భారతదేశంలోని ప్రసిద్ధ చాక్లెట్ కంపెనీల గురించి తెలుసుకున్నారు కాబట్టి, ఇక మీ ప్రియమైన వారి కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన చాక్లెట్‌లను పంపవచ్చు. ఈ ప్రసిద్ధ చాక్లెట్‌లు వివిధ ప్రతిష్టాత్మకమైన ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌లలో లభ్యమవుతాయి.

సూక్ష్మ, చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలు (MSMEలు), వ్యాపార చిట్కాలు, ఆదాయపు పన్ను, GST, జీతం మరియు అకౌంటింగ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌లు, వార్తల బ్లాగులు మరియు కథనాల కోసం Khatabookని అనుసరించండి.

 

తరుచుగా అడిగే ప్రశ్నలు

ప్రశ్న: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చాక్లెట్ ఏది?

సమాధానం:

మార్స్ చాక్లెట్లు మరియు క్యాడ్బరీ చాక్లెట్లు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చాక్లెట్లు.

ప్రశ్న: ప్రపంచంలోకెల్లా గొప్ప చాక్లెట్ ఏది?

సమాధానం:

క్యాడ్‌బరీ చాక్లెట్‌లు, కిట్‌కాట్, మార్స్ (స్నికర్స్) వంటి నెస్లే చాక్లెట్‌లు, అమూల్ చాక్లెట్‌లు మరియు ఇతరాలు ప్రపంచంలోని అత్యుత్తమ చాక్లెట్‌లలో కొన్ని.

ప్రశ్న: వివిధ రకాల చాక్లెట్లు ఏవి?

సమాధానం:

చాక్లెట్లు ప్రధానంగా మూడు రకాలు: డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ మరియు వైట్ చాక్లెట్.

ప్రశ్న: భారతదేశంలో అత్యంత ఖరీదైన చాక్లెట్ ఏది?

సమాధానం:

భారతదేశంలో అత్యంత ఖరీదైన చాక్లెట్లు LINDT, Fabelle మరియు Toblerone బ్రాండ్‌లచే తయారు చేయబడతాయి.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.