written by Khatabook | August 29, 2022

బ్రాండింగ్ అంటే ఏమిటి? అది ఎందుకు ముఖ్యం?

×

Table of Content


బ్రాండింగ్ ప్రక్రియలో అనేక టెక్నిక్‌లు ఉంటాయి. ప్రతి టెక్నిక్‌ ఉత్పత్తి గురించి ఔచిత్యాన్ని సృష్టించడానికి రూపొందించబడింది. సంవత్సరాలుగా, బ్రాండింగ్ కాన్సప్ట్ అమలు పరంగా అసాధారణ మార్పుకు గురైంది. బ్యాక్‌గ్రౌండ్ బ్యానర్‌లు మరియు బ్రాండింగ్ స్టాండ్‌ల నుండి షార్ట్ ఫిల్మ్‌లు మరియు వాణిజ్య ప్రకటనలు, ఆన్‌లైన్ పోటీలు, సరదా కార్యకలాపాలు, ఉచిత బహుమతులు మరియు మరిన్నింటిని సృష్టించడం వరకు, బ్రాండింగ్ నిత్యం మన చుట్టూ ఉంటుంది. ఈ రోజు, మీరు సంగీత ఈవెంట్‌లలో ఫుట్‌వేర్‌ను ప్రమోట్ చేసే ప్రముఖులను, తమ పాటల్లో బ్రాండ్ పేర్లను ఉపయోగించే గాయకులు మరియు ఇంటర్వ్యూలో ఒక ఉత్పత్తి లేదా సేవను ప్రస్తావిస్తున్న ప్రముఖులను చూడవచ్చు. బ్రాండింగ్ అంటే సందేశాన్ని చాలా స్పష్టమైన విధంగా వ్యక్తీకరించడం మరియు లక్ష్య ప్రేక్షకులకు వారు ఏమి ఆశించవచ్చో తెలియజేయడం.. మార్కెటింగ్‌లో బ్రాండింగ్ ఉత్పత్తి అవగాహనను పెంచడంలో సహాయపడడంతో పాటు వ్యాపారం మరియు సంస్థ యొక్క విలువలను వివరిస్తూ ప్రేక్షకులలో నమ్మకాన్ని కలిగిస్తుంది. బ్రాండింగ్ అన్ని పరిమాణాలు మరియు ఆకారాలలో వస్తుంది.బ్రాండింగ్ అనేది లోగో రూపకల్పనతో మొదలయ్యే సర్వశక్తివంతమైన యాక్టివిటీ.

మీకు తెలుసా?

"The magical experiences that hosts bring to guests." అనే పంచ్ లైన్ కారణంగా ఒక్క Airbnb ప్రచార వీడియోకి 3.5 మిలియన్ల వీక్షణలు వచ్చాయి.

మార్కెటింగ్‌లో బ్రాండింగ్ అంటే ఏమిటి?

ప్రపంచీకరణ కొన్ని లక్షల ఉత్పత్తులతో వినియోగదారుల మార్కెట్లను ముంచెత్తింది. చాలా వరకు అన్నీ ఒకదానితో ఒకటి పోలి ఉంటాయి, కానీ కొన్ని ఉత్పత్తులలో ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాటి సమకాలీనులతో సమానంగా ఉన్నప్పటికీ కొన్ని బ్రాండ్‌లు మెరుగైనవీ,  విశ్వసనీయమైనవిగా గుర్తించబడతాయి. ప్రజలు తక్షణమే వాటితో కనెక్ట్ అవుతారు. బ్రాండ్‌కి ఉన్న మంచి పేరు ఎప్పటికీ తగ్గదు, కస్టమర్లు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నారు. మీరు వాటిని మాల్స్, కమర్షియల్ అవుట్‌లెట్‌లు మరియు సినిమా హాళ్లలో చూడవచ్చు. బ్రాండ్ కోసమే ఉత్పత్తులను కొనే వ్యక్తులను కూడా చూడవచ్చు. ఈ మ్యాజిక్ ఎలా పని చేస్తుందనేది పెద్ద ప్రశ్న? ఇక్కడ బ్రాండింగ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బ్రాండ్ యొక్క గుర్తింపుకు పునాది వేసే బ్రాండ్ సందేశంలో ఆ మ్యాజిక్ ఉంటుంది.

వారి లక్ష్య ప్రేక్షకులు బ్రాండ్ పేరును చదవకుండానే ప్రతి మార్కెటింగ్ ఇనిషియేటివ్‌ను  వెంటనే బ్రాండ్‌తో కనెక్ట్ చేస్తారు.

దీనికి తిరుగులేని ఉదాహరణ, నైకీ యొక్క 'రైట్-టిక్' గుర్తు మరియు దాని ట్యాగ్‌లైన్ 'జస్ట్ డూ ఇట్.' వినియోగదారులలో ఉత్సాహం నింపేందుకు ఆ మూడు మాటలు సరిపోతాయి.

టెలికమ్యూనికేషన్ రంగంలోకి ప్రవేశించిన నాల్గవ సంస్థ ఎయిర్‌టెల్, కానీ ఇది నేడు అత్యంత ఆదరణ పొందుతున్న వాటిలో వాటిలో ఒకటి. దీని లోగో 'A' యొక్క శక్తి మరియు చైతన్యాన్ని వ్యక్తీకరిస్తుంది. మార్కెటింగ్ కమ్యూనికేషన్‌లలో ఎయిర్‌టెల్ ఉపయోగించిన వివిధ ట్యాగ్‌లైన్‌లు వినియోగదారులతో తక్షణమే కనెక్ట్ అయ్యాయి. వాటిల్ప్ క్లాసిక్ ట్యాగ్‌లైన్‌లు:

  • ఎయిర్‌టెల్ టెలి-సర్వీసెస్‌లో - 'ఎక్స్‌ప్రెస్ యువర్‌సెల్ఫ్', 'భారతదేశం యొక్క మొదటి 4G నెట్‌వర్క్',
  • ఎయిర్‌టెల్ బ్యాంకింగ్‌లో - 'బ్యాంకింగ్ ఇప్పుడు మీ చేతివేళ్ల వద్ద, భారతదేశపు మొట్టమొదటి చెల్లింపుల బ్యాంక్’ అని ఉంటుంది. 

ఈ ట్యాగ్‌లైన్‌లలో చాలా బలమైన సందేశం ఉంటుంది. అవి చాలా సూటిగా మరియు బ్రాండ్ సందేశాన్ని కీర్తించకుండా సేవ గురించి ఖచ్చితమైన ప్రకటన ఇస్తాయి. 'మీ చేతివేళ్ల వద్ద బ్యాంకింగ్’ అంటే మీరు చెల్లింపులను ప్రారంభించవచ్చని సూచిస్తుంది. చాలా మంది ఎయిర్‌టెల్ వినియోగదారులు ఈ అనుకూలమైన ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు.

ప్రజలు బ్రాండ్ యొక్క నిబద్ధతతో మంచి సంబంధాన్ని పెంచుకుంటారు. ఒకసారి ఆ నమ్మకం బలంగా ఉంటే, వినియోగదారుకు మరొక బ్రాండ్‌కి మారారు. ఇది జరిగినప్పుడు, ఉత్పత్తి లేదా సేవలో స్వల్పంగా ధర పెరగడం చర్చనీయాంశం కాదు ఎందుకంటే వినియోగదారులకు బ్రాండ్‌పై విశ్వాసం అప్పటికే ఉంటుంది. ఇతర టెలికాం ఆపరేటర్లు తక్కువ సబ్‌స్క్రైబర్ రేట్లు మరియు ప్యాకేజీలను అందిస్తున్నప్పటికీ, ఎయిర్‌టెల్ దాని అత్యుత్తమ నెట్‌వర్క్ మరియు బ్రాండింగ్ కారణంగా ఆదరణలో ఉంది. బ్రాండ్ అనుభవం కారణంగా ధరలో స్వల్ప పెరుగుదల వినియోగదారులను దూరం చేయదు. అసంఖ్యాక విలువ ఆధారిత సేవలతో పాటు, భారతదేశంలోని స్నేహితులు మరియు అన్యదేశ ప్రదేశాల గురించి Airtel యొక్క థీమ్-ఆధారిత జింగిల్స్ వినియోగదారులలో ఉత్సాహాన్ని నింపుతాయి. ఇది ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు కాని వారిలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది.

కస్టమర్ స్మార్ట్‌ఫోన్‌ను రిపేర్ చేస్తానని ఎయిర్‌టెల్ మాట ఇవ్వడం ఒక ఆకట్టుకునే ఉదాహరణ, అది అనుకోకుండా పాడైంది. ఎయిర్‌టెల్ ఫోన్ యొక్క ఉచిత పిక్-అప్‌ సేవను అందించి, ఫోన్‌ను తమ సర్వీస్ సెంటర్‌లో రిపేర్ చేసి, తిరిగి వినియోగదారుకు డెలివరీ కూడా చేస్తుంది. మార్కెటింగ్ ద్వారా ప్రచారం చేయబడిన ఈ బ్రాండింగ్ సేవలు వినియోగదారుల నమ్మకాన్ని మరింత బలపరుస్తాయి. కాబట్టి, ఒక సంస్థగా, మీరు మీ మార్కెటింగ్ కార్యక్రమాల ద్వారా మీ విజన్‌‌ను వివరిస్తారు. వినియోగదారులు మీ బ్రాండ్‌తో అనుబంధించడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను అర్థం చేసుకుంటారు.

మార్కెటింగ్‌లో బ్రాండింగ్ అనేది 'అవుట్-ఆఫ్-ది-బాక్స్' థింకింగ్ మరియు పవర్-ప్యాక్డ్ మార్కెటింగ్ ద్వారా దానిని వ్యక్తీకరించడం. వినియోగదారులు ప్రత్యేకమైన, భిన్నమైన, ఆశాజనకమైన మరియు నమ్మదగిన వాటిని గమనించడంలో తెలివిగా ఉంటారు. అన్ని ఎయిర్‌లైన్స్ మీకు సౌకర్యవంతమైన మరియు స్నేహపూర్వక వాతావరణాన్ని అందజేస్తాయి. అయితే, ఎయిర్‌లైన్ సిబ్బంది మొరటుగా లేదా గర్వంగా ప్రవర్తించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక సంఘటన బ్రాండ్ యొక్క గుర్తింపు మరియు విలువను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. మార్కెటింగ్‌లో బ్రాండింగ్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో శక్తివంతమైన ఛానెల్‌గా పనిచేస్తుంది. స్థిరమైన మరియు మెరుగైన ఉత్పత్తులూ, సేవల వాగ్దానాలతో సరైన ప్రేక్షకుల కోసం సరైన సందేశం బ్రాండ్ విలువను ప్రోత్సహించడానికి సరైన వ్యూహంగా పనిచేస్తుంది.

బ్రాండింగ్ ఎందుకు ముఖం?

వాణిజ్య ప్రకటనల ద్వారా ఆఫ్‌లైన్ బ్రాండింగ్ మరియు ఆన్‌లైన్ సందేశాలకు మాత్రమే బ్రాండింగ్ పరిమితం కాదు. మీ మార్కెటింగ్‌లోని ప్రతి అంశం మీ బ్రాండింగ్‌ను ప్రతిబింబిస్తుంది. మీ ఇన్-స్టోర్ మరియు టెలిమార్కెటర్లు మీ క్లయింట్‌లను ఎలా సంబోధిస్తారు, వారితో ఎలామాట్లాడతారు, వారి సమస్యలను అర్థం చేసుకోవడం, వాటిని పరిష్కరించడంలో వారి నిబద్ధత బ్రాండ్ సంస్కృతిని వ్యక్తీకరిస్తుంది. ప్రభావవంతమైన బ్రాండింగ్ మీ కోసం ఒక సముచిత స్థానాన్ని సృష్టించుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ పోటీదారులు ఒకే విధమైన ఉత్పత్తులను విక్రయిస్తూ ఉండవచ్చు, కానీ మీరు మీ క్లయింట్‌లకు స్థిరంగా సేవలందిస్తామనే వాగ్దానంతో శక్తివంతమైన బ్రాండ్ మెసేజింగ్‌ను ప్రాక్టీస్ చేసినప్పుడు, మీకొక ప్రత్యేకత వస్తుంది.

మీ బ్రాండ్ యొక్క ఉద్దేశ్యం మీ మార్కెటింగ్‌లో నిజాయితీగా, పారదర్శకంగా మరియు సానుకూలంగా గుర్తించబడినప్పుడు, మీరు మార్కెట్‌లో విలువైన పెట్టుబడిగా పరిగణించబడతారు. ఈ విషయాల్లో మీ బ్రాండ్ కీర్తిని స్థాపించగలిగితే, కొత్త లాంచ్‌లకు మీ రాక ముందు ఉంటుంది. బ్రాండింగ్ అనేది కథ చెప్పడం లాంటిది. ఈ కారణంగానే టాటా గ్రూప్ అత్యంత విశ్వసనీయ బ్రాండ్‌లలో ఒకటి.

నాణ్యతను అందిస్తామన్న తమ వాగ్దానాన్ని బ్రాండ్ ఎప్పుడూ మర్చిపోదు. ఇది సంవత్సరాలుగా బలంగా పెరిగిన భావోద్వేగ బంధాన్ని స్థాపించడంలో సహాయపడింది. బ్రాండ్ మరియు విభిన్న పరిశ్రమలలో దాని వైవిధ్యం దాని దృష్టి, ఉపాధి అవకాశాలు, కస్టమర్ సంతృప్తి మరియు సామాజిక బాధ్యతల గురించి మాట్లాడుతుంది.

TATA గ్రూప్ లోగో డిజైన్ స్ఫూర్తికి చిహ్నం. ఇది 'ట్రీ ఆఫ్ నాలెడ్జ్'ని సూచిస్తుంది మరియు వివిధ అనుబంధ సంస్థలు ఆ వాగ్దానానికి అనుగుణంగా జీవించాయన్నది నిజం. మీరు ఆటోమొబైల్స్, ఎయిర్‌లైన్స్, విద్య, ఆతిథ్యం, ​​FMCG, లగ్జరీ దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఇ-కామర్స్ మరియు ఆప్టికల్‌లలో TATA ఉనికిని చూడవచ్చు. బ్రాండ్ యొక్క పెరుగుదల నమ్మకంపై ఆధారపడి ఉంటుంది, ఇది చాలా గౌరవప్రదమైన పద్ధతిలో మార్కెటింగ్ ద్వారా తెలియజేస్తుంది.

ఇ-కామర్స్‌లో బ్రాండింగ్ ఎందుకు ముఖ్యమైనది?

డిజిటలైజేషన్ వినియోగదారులను ముంచెత్తింది. వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్‌ల యొక్క వివిధ ఉత్పత్తులతో వెబ్ నిండిపోయింది. ఇ-కామర్స్‌లో బ్రాండింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, మీ బ్రాండ్ ఈక్విటీని సమర్థవంతంగా నిర్మించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడం. విభిన్న బ్రాండ్ విలువను సృష్టించడం ద్వారా పోటీని అధిగమించడానికి బాగా సన్నద్ధం కావడం దీని అర్థం. ప్లాట్‌ఫారమ్‌లలో మీ బ్రాండ్ ఈక్విటీని విస్తరించడానికి బ్రాండ్ లాయల్టీని సృష్టించడానికి మీరు మీ కాలి మీద ఉండాలి.

ప్రారంభంలో మీ సందేశం మీ ఆన్‌లైన్ మార్కెటింగ్ అంతటా చాలా స్పష్టంగా మరియు స్థిరంగా ఉండాలి. ఇది వినియోగదారులకు మరియు భాగస్వాములకు మీ వ్యాపార ఉద్దేశంతో పాటు దృష్టి గురించి స్పష్టమైన సూచన అందిస్తుంది. మీ బ్రాండింగ్ ఆశాజనకంగా, ప్రతి ఒక్కరూ మీ స్వాభావిక విలువలను అర్థం చేసుకునేలా ఉండాలి.

ఈ అవగాహన ఏర్పడిన తర్వాత, మీ క్లయింట్‌ల విశ్వసనీయత ఖచ్చితంగా చాలా కాలం పాటు ఉంటుంది. ఇ-కామర్స్‌లో వినియోగదారులు మీ ఉత్పత్తులను ఎందుకు ఎంచుకోవాలో మీరు బలంగా చెప్పాలి. మీరు చాలా మర్యాదపూర్వకమైన కస్టమర్ ఇంటరాక్షన్, డెలివరీల మరియు అమ్మకాల తర్వాత సేవను అందించాలి. మీ లక్ష్య ప్రేక్షకులను గుర్తించడంలో సరైన పరిశోధన మీ బ్రాండ్‌ను వారికి త్వరగా ప్రచారం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, ఇది మీ బ్రాండ్ మరియు దాని వాగ్దానాలను గుర్తించడంలో వారికి సహాయపడుతుంది.

వారు మీ బ్రాండ్ సందేశాన్ని అర్థం చేసుకున్న తర్వాత, నిబద్ధత ఏర్పడుతుంది. మీరు చాలా మంది విశ్వసనీయ వినియోగదారులను పొందుతారు. మీ బ్రాండింగ్ సందేశం ఇ-కామర్స్ ప్రేక్షకులకు మీ బ్రాండ్ అంటే ఏమిటి, దాని ప్రధాన విలువలు మరియు దాని సమకాలీనుల నుండి దాని ప్రత్యేకత ఏమిటో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

ముగింపు

ఈ కథనం మార్కెటింగ్ మరియు ఇ-కామర్స్‌లో బ్రాండింగ్ పాత్రను చర్చిస్తుంది. బ్రాండింగ్ యొక్క అతిపెద్ద సవాళ్లలో సందేశం యొక్క స్థిరత్వం ఒకటి. వినియోగదారులలో సందేహాలను కలిగించకుండా ఉండడానికి, మీ బ్రాండ్‌కి విభిన్న సందేశాలు ఉండకుండా చూసుకోండి . స్థిరమైన మరియు ప్రామాణికమైన బ్రాండ్ సందేశం మీ దృష్టి యొక్క తీవ్రతను నొక్కి చెబుతుంది. బ్రాండింగ్ మీ వ్యాపారానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బ్రాండింగ్ నిర్దిష్ట ప్రాంతానికి సరిపోయేలా ఉండాలి. మీరు ప్రజల అంచనాలను అర్థం చేసుకొని తదనుగుణంగా మీ బ్రాండ్ మార్కెటింగ్ ద్వారా వారి ఆకాంక్షలను నెరవేర్చగలగాలి.

సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు (MSMEs), వ్యాపార చిట్కాలు, ఆదాయపు పన్ను, GST, జీతం మరియు అకౌంటింగ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌లు, వార్తల బ్లాగులు మరియు కథనాల కోసం Khatabookని అనుసరించండి.

 

తరుచుగా అడిగే ప్రశ్నలు

ప్రశ్న: బ్రాండింగ్ అంటే ఏమిటి?

సమాధానం:

ప్రతి వ్యాపారం యొక్క ముఖ్య లక్షణాలలో బ్రాండింగ్ ఒకటి. మీ సంస్థ బ్రాండింగ్ బ్రాండ్ లోగో, డిజైన్ మరియు రంగులతో మొదలై మీ సంస్థ విలువలతో ముగుస్తుంది. ఇది వినియోగదారులకు మీ సందేశాన్ని తెలియజేస్తుంది.

ప్రశ్న: బ్రాండింగ్ నిర్వచనాన్ని మీరు ఎంత ఉత్తమంగా వివరించగలరు?

సమాధానం:

పెద్దదైనా చిన్నదైనా, ప్రతి వ్యాపారం దాని బ్రాండ్ గుర్తింపును నిర్వచించడం ద్వారా బాగా అర్థం చేసుకోబడుతుంది. బ్రాండింగ్ అనేది మీ వ్యాపారం యొక్క విజన్‌ని స్థాపించడం. కంపెనీకి, క్లయింట్‌లకు మధ్య ఉండే ఒక శక్తివంతమైన కమ్యూనికేషన్ ఛానెల్ - బ్రాండింగ్.

ప్రశ్న: వ్యాపారం గురించి అవగాహన కల్పించడంతో పాటు దాని ప్రధాన విలువలను ప్రోత్సహించడంలో సహాయపడే వివిధ బ్రాండింగ్ రకాలు ఏవి?

సమాధానం:

నాలుగు ప్రధాన బ్రాండింగ్ రకాలు ఉన్నాయి, అవి:

  • ప్రత్యేకత - విస్తృత శ్రేణి ఉత్పత్తులతో వ్యాపారంలో, ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకమైన బ్రాండ్ పేరు కేటాయించబడుతుంది.
  • వైఖరి - ది భావోద్వేగంతో నిండిన వైఖరిని ఏర్పరచడం. తరచుగా, వ్యాపార సంస్థలు తమ బ్రాండ్‌ను ఆమోదించడానికి ప్రముఖుల సేవలను ఉపయోగిస్తాయి.
  • బ్రాండ్ పొడిగింపు - మాతృ సంస్థ ఒకటే, కానీ ఉత్పత్తులు విభిన్నంగా ఉంటాయి. అందుకు మంచి ఉదాహరణ టాటా గ్రూప్. దాని బ్రాండ్ పొడిగింపులలో కొన్ని ఈ క్రింది విధంగా ఉన్నాయి: గడియారాలలో టైటాన్, దుస్తుల విభాగంలో వెస్ట్ సైడ్, ఫార్మసీ ఉత్పత్తులలో 1mg డీల్స్ మరియు ఆభరణాలలో తనిష్క్.
  • ప్రైవేట్-లేబుల్ బ్రాండింగ్ - ఈ రకమైన బ్రాండింగ్‌లో, వ్యాపారం ప్రైవేట్ లేబుల్‌లను ఉపయోగిస్తుంది, అంటే దాని స్వంత బ్రాండ్‌తో విక్రయించబడే మరొక స్థాపించబడిన వ్యాపారం ద్వారా తయారు చేయబడిన లేబుల్‌లు.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.