డేటా సేకరించబడినప్పుడు, అది ఒక నివేదికలో ఉంచబడుతుంది. అదేవిధంగా, వ్యాపార లావాదేవీలు ఒక వ్యాపారం కొరకు రికార్డ్ చేయబడ్డ అన్ని ఆర్థిక లెక్కలకు మూలంగా ఉండేది బుక్ కీపింగ్. అకౌంటింగ్ అనేది డేటాను సేకరించి రిపోర్ట్ ఫార్మెట్ ల్లోకి తీసుకువచ్చే ప్రక్రియ. అందులో, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్ మెంట్, బ్యాలెన్స్ షీట్ మరియు ట్రయల్ బ్యాలెన్స్ అనేవి ముఖ్యమైన ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ లు. అందువల్ల, బుక్ కీపింగ్ అంటే లావాదేవీలను రికార్డ్ చేయడానికి ఒక అకౌంటింగ్ ప్రక్రియ అనొచ్చు. ఇందులో ఒక ఏడాది, ఆరు నెలలు లేదా క్వార్టర్ కి సంబంధించిన లావాదేవీల సారాంశం వంటి ఆర్థిక స్టేట్మెంట్స్ ని జాగ్రత్తగా పొందుపరుస్తారు.
బుక్ కీపింగ్ అంటే ఏమిటి?
- అకౌంటింగ్ లో బుక్ కీపింగ్ అంటే ఏమిటో చాలా మందికి తెలియదు. బుక్ కీపింగ్ అనేది ఒక వ్యాపారాన్ని నడిపించడానికి, ఆ వ్యాపారంలో జరిగిన అన్ని వ్యాపార లావాదేవీలను ఒక క్రమ పద్దతిలో రికార్డు చేసే ప్రక్రియ. అందువల్ల బుక్ కీపింగ్ అనేది అకౌంటింగ్ లో ఒక ముఖ్యమైన భాగం.
- నిజమైన బుక్ కీపింగ్ అంటే, ఒక నిర్ధిష్ట కాలంలో ఏదైనా వ్యాపారంలో జరిగే రోజువారీ లావాదేవీల యొక్క ఫైనాన్షియల్ రికార్డింగ్. అమ్మకాలు, చెల్లించిన పన్నులు, సంపాదించిన వడ్డీ, కార్యాచరణ ఖర్చులు, వేతనాలు మరియు చెల్లించిన వేతనం, తీసుకున్న రుణాలు, చేసిన పెట్టుబడులు మరియు మరిన్ని ఆర్థిక లావాదేవీలను విభిన్న ఖాతా పుస్తకాల్లో నమోదు చేస్తారు.
వ్యాపారాలకు బుక్ కీపింగ్ ఎందుకు అవసరం?
“బుక్ కీపింగ్ చేయని వారు, అకౌటింగ్ చేయలేరు” అనేది ఒక నానుడి.
బుక్ కీపింగ్ యొక్క రికార్డింగ్ ఖచ్చితత్త్వం ఒక సంస్థ యొక్క నిజమైన మరియు ఖచ్చితమైన ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుంది. ఒక సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్ వంటి ముఖ్యమైన ఆర్థిక స్టేట్మెంట్స్ ని తయారు చేయడానికి మరియు నివేదించడానికి పూర్తి అకౌంటింగ్ ప్రక్రియను అనుసరించాలి. అందువల్ల, ఒకరు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ముందు, రుణం తీసుకోవడానికి లేదా కంపెనీ యొక్క ఆర్థిక స్టేట్మెంట్స్ ని నివేదించడానికి ముందు, బుక్ కీపింగ్ తాజాగా, ఖచ్చితమైనదిగా మరియు అన్ని ఆర్థిక లావాదేవీలను కలిగి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకే చిన్నా, పెద్దా అని తేడా లేకుండా, వ్యాపారాలన్నీ తమ అకౌంట్స్ మ్యానేజ్ చేస్తూ మెయింటైన్ చేసుకోవడానికి బుక్ కీపింగ్ కొరకు అకౌంటంట్ల సహాయం పొందుతుంటాయి. బుక్ కీపింగ్ విధానాల యొక్క ప్రాముఖ్యత క్రింద వివరించాము.
- బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ అంటే సంస్థ యొక్క చెల్లింపులు, రసీదులు, కొనుగోళ్లు, అమ్మకాలు మొదలైనవాటిని రికార్డ్ చేయడం మరియు ట్రాక్ చేయడం మరియు వ్యాపార కార్యకలాపాల సమయంలో చేయబడ్డ అన్ని ద్రవ్య లావాదేవీలను రికార్డ్ చేయడం.
- ఒక నిర్ధిష్ట సమయం లేదా క్రమము ప్రకారం ఖర్చు, వివిధ హెడ్ ల నుంచి ఆదాయం మరియు ఇతర లెడ్జర్ రికార్డులను సంక్షిప్తీకరించడానికి మరియు నివేదించడానికి బుక్ కీపింగ్ ఉపయోగించబడుతుంది.
- వ్యాపారం ఎలా ఉంది, అది లాభాలను ఆర్జిస్తున్నదా, ఈ లాభాలు ఎలా వస్తున్నాయి, ఒక కంపెనీ యొక్క నికర విలువ ఎంత అనేటటువంటి వాటి గురించి నిర్దిష్ట సమాచారాన్ని అందించే కీలకమైన ఆర్థిక నివేదికలను రూపొందించడానికి బుక్ కీపింగ్ డేటాను అందిస్తుంది.
బుక్ కీపింగ్ ఉదాహరణలు:
ఒక సంస్థలో జరిగే లావాదేవీలను మ్యానేజ్ చేయడానికి, రికార్డ్ చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి అవసరమైన వివిధ బుక్ కీపింగ్ పనులను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ పనులు చేయడానికి బాధ్యత వహించే వ్యక్తిని అకౌంటెంట్ అని అంటారు. బుక్ కీపింగ్ నిర్వహించడం, వాటిని సరిగ్గా మరియు ఖచ్చితంగా రికార్డ్ చేయడం, వ్యాపారంలో జరిగే అన్ని డబ్బు సంబంధిత లావాదేవీలను అందించడం మరియు ట్రాక్ చేయడం వీరి బాధ్యత. దిగువ పేర్కొన్న పనులు బుక్ కీపింగ్ కు మంచి ఉదాహరణలు:
- కస్టమర్ల పేమెంట్స్ మరియు రసీదులను జారీ చేయడం మరియు రికార్డ్ చేయడం.
- వ్యాపార క్లయింట్ లకు అందించే లేదా విక్రయించిన సేవలు మరియు వస్తువుల కొరకు ఖచ్చితమైన బిల్లులను జారీ చేయడం.
- సప్లయర్ యొక్క పేమెంట్ లను రికార్డ్ చేయడం.
- సప్లయర్ యొక్క ఇన్ వాయిస్ లను రికార్డ్ చేయడం మరియు వాటిని వెరిఫై చేయడం.
బుక్ కీపింగ్ కొరకు అకౌంటింగ్ చేసేందుకు వ్యవధి:
బుక్ కీపింగ్ అనేది నిరంతర ప్రక్రియ, అయితే, అకౌంటింగ్ అనేది సాధారణంగా వార్షికంగా నడిచే వ్యవహారం. కానీ, మీరు ఎంచుకొనే అకౌంటింగ్ కాలం ఒక వ్యాపారానికి అంతర్భాగం, ఆ విషయం మీకు మీ బుక్ కీపింగ్ వ్యవస్థలో ప్రతిబింబిస్తుంది. చాలా సంస్థలు ఏప్రిల్ 1న తమ అకౌంటింగ్ పుస్తకాలను ప్రారంభిస్తాయి మరియు మరుసటి సంవత్సరం మార్చి 31న తమ పుస్తకాలను మూసివేిస్తాయి. దీనిని అకౌంటింగ్ సంవత్సరం అంటారు. భారతదేశంలో అకౌంటింగ్ వ్యవస్థలు, బ్యాంకులు, పన్ను వ్యవస్థలు మరియు మరిన్ని ఆర్థిక వ్యవస్థలు ఈ వ్యవధిని ఆర్థిక సంవత్సరం అని అంటాయి. అయితే, బహ్రయిన్, యుఎఇ, సౌదీ అరేబియా వంటి దేశాలు జనవరి 1వ తేదీని అకౌంటింగ్ సంవత్సరం ప్రారంభంగా పరిగణించి డిసెంబర్ 31న తమ అకౌంటింగ్ సంవత్సరాన్ని పూర్తి చేస్తాయి.
బుక్ కీపింగ్ రకాలు:
రెండు ప్రముఖ బుక్ కీపింగ్ సిస్టమ్ లు ఉన్నాయి, అవి ఏంటంటే:
- సింగిల్ ఎంట్రీ సిస్టమ్
- డబుల్ ఎంట్రీ సిస్టమ్
వ్యాపార సంస్థలకు తాము అనుసరించాలనుకుంటున్న బుక్ కీపింగ్ వ్యవస్థను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. కొన్ని వ్యాపారాలు తమ బుక్ కీపింగ్ లో ఈ రెండు రకాల అకౌంటింగ్ వ్యవస్థల కలయికను ఉపయోగిస్తాయి.
మనం ఉపయోగించే రెండు రకాల సిస్టమ్ లను మనం ఇప్పుడు చూద్దాం:
- సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం, ప్రతీ లావాదేవీకి, ఒకే ఎంట్రీ రికార్డ్ అకౌంట్ ల పుస్తకాల్లో ప్రాతినిధ్యం వహిస్తుంది. అందువల్ల, సింగిల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ లో ప్రతి ఆర్థిక లావాదేవీ లేదా ఫైనాన్షియల్ యాక్టివిటీకి ఒకే ఒక్క రికార్డ్ ఎంట్రీ ఉంటుంది. ఈ ప్రాథమికమైన వ్యవస్థ. ఉదాహరణకు, ఈ వ్యవస్థలో ఒక కంపెనీ ద్రవ్య లావాదేవీలను రికార్డ్ చేయడానికి రోజువారీ రసీదులను ఉపయోగిస్తుంది, అలాగే తరువాత దాని బుక్ కీపింగ్ కొరకు వారపు మరియు రోజువారీ రికార్డును తయారు చేసుకుంటుంది.
- డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ప్రకారంగా ప్రతి డబ్బు లావాదేవీకి, మరొక లావాదేవీ డబుల్ ఎంట్రీగా ఉంటుంది. ఈ రకమైన అకౌంటింగ్ మరియు బుక్ కీపింగ్ సిస్టమ్ మెరుగైన ఖచ్చితత్త్వాన్ని అందిస్తుంది, మరియు ఖచ్చితత్త్వం కొరకు డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఉపయోగించడం ద్వారా మీరు ఎంట్రీలను చెక్ చేయవచ్చు లేదా బ్యాలెన్స్ చేయవచ్చు. ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్ కనుక, ప్రతి డెబిట్ కు సమానమైన క్రెడిట్ ఎంట్రీ కూడా ఉంటుంది. అయితే, ఇది నగదు ఆధారితమైనది కాదు, కాబట్టి ఈ విధానంలో సంస్థ యొక్క ఆర్థిక స్థితిని చూపలేము. ఆదాయం సంపాదించినప్పుడల్లా, లేదా రుణం వచ్చినప్పుడల్లా దాని లావాదేవీలు రికార్డ్ చేయబడతాయి.
అక్యురాల్స్ బుక్ కీపింగ్ విధానం:
అక్యురల్ సిస్టమ్ అని కూడా పిలువబడే ఇది ఒక క్యాష్ ఆధారిత అకౌంటింగ్ సిస్టమ్. ఇందులో పేమెంట్ అందుకున్నప్పుడు లేదా చేసినప్పుడల్లా ద్రవ్య లావాదేవీలను రికార్డ్ చేస్తారు. అకౌంటింగ్ కాలంలో జరిగిన ఆదాయం లేదా ఆదాయాన్ని ఈ వ్యవస్థ గుర్తిస్తుంది, అది ఎప్పుడు అందుకోబడిందనే ఆదాయ రికార్డులను చూడటం ద్వారా, మరియు అది చెల్లించినప్పుడు ఖర్చులు రికార్డ్ చేయబడతాయి. అకౌంటింగ్ సూత్రాలు దీనికి అనుకూలంగా ఉంటాయి, ఎందుకంటే ఈ విధానంలో అకౌంటింగ్ కాలం యొక్క ఆదాయాలు మరియు ఖర్చులను పుస్తకాల్లో ఖచ్చితంగా రికార్డ్ చేస్తారు.
బుక్ కీపింగ్ సూత్రాలు:
ఆర్థిక లావాదేవీలను క్రమబద్ధంగా మరియు కాలక్రమానుసారంగా మ్యానేజ్ చేస్తూ రికార్డ్ చేయడానికి కొన్ని బుక్ కీపింగ్ సూత్రాలు వర్తింపజేయబడతాయి. కాబట్టి క్రింద వివరించిన కొన్ని బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ సూత్రాల వాడకంతో, అకౌంటెంట్ లు ఎలాంటి తప్పులు లేకుండా లెక్కలు వేయడానికి సహాయపడుతుంది. పైగా, రికార్డ్ కీపింగ్ విధానాన్ని ప్రామాణికీకరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.
కామన్ గా వాడే బుక్ కీపింగ్ సూత్రాలు దిగువ పేర్కొనబడ్డాయి:
- వ్యయ సూత్రం: వ్యాపారం ఏదైనా సరఫరాదారు నుంచి సేవలు లేదా వస్తువులను అందుకున్నప్పుడల్లా, ఖర్చు జరుగుతుందని మరియు దానిని తప్పక రికార్డ్ చేయాలని ఈ సూత్రం పేర్కొంటుంది.
- రెవిన్యూ సూత్రం: దీనర్థం అకౌంటింగ్ పుస్తకాల్లో అమ్మకం సమయంలో ఆదాయం నమోదు చేయబడుతుంది.
- మ్యాచింగ్ సూత్రం: మీరు ఆదాయాన్ని రికార్డ్ చేసినప్పుడు సంబంధిత ఖర్చులను కూడా రికార్డ్ చేయాలని ఈ సూత్రం చెప్తుంది. అందువల్ల, అమ్మిన వస్తువులు ఆదాయాన్ని సంపాదించినట్లయితే, ఇన్వెంటరీ ఏకకాలంలో విక్రయించిన వస్తువులను చూపించాలి.
- ఆబ్జెక్టివిటీ సూత్రం: ఈ సూత్రం మీరు వాస్తవిక, ధృవీకరించదగిన డేటాను మాత్రమే ఉపయోగించాలని చెప్తుంది, అంతేకాని ఊహాజనికమైన డేటాను కాదు.
- ఖర్చు సూత్రం: మీరు ఎల్లప్పుడూ అసలు ధరనే ఉపయోగించాలని, అకౌంటింగ్ లో రీసేల్ ధరను ఉపయోగించకూడదని ఈ సూత్రం అర్ధం.
బుక్ కీపింగ్ ఎంట్రీలను రికార్డ్ చేయడం:
బుక్ కీపింగ్ లో ఎంట్రీలు చేయడం ద్వారా డబ్బు లావాదేవీలను రికార్డ్ చేయడానికి సహాయపడుతుంది. అయితే, రాను రానూ, వ్యాపారాలు తమ జర్నల్ ఎంట్రీలు చేయడానికి ఈ పద్ధతిని వాడడం తగ్గిస్తున్నాయి. కారణం టెక్నాలజీ సహాయంతో ఈ ప్రక్రియను ఆటోమేట్ చేసే అకౌంటింగ్ సాఫ్ట్ వేర్లు ఎన్నో ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఇంతకు ముందు, లావాదేవీ జరిగిన ప్రతిసారీ అకౌంటెంట్ లు అన్ని లావాదేవీలు, ఖాతా నెంబర్లు, వ్యక్తిగత క్రెడిట్ లు లేదా డెబిట్ లను మాన్యువల్ గా నమోదు చేయాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ సమయం తీసుకుంటుంది, మరియు మానవ దోషాలు ఏ సమయంలోనైనా జరగవచ్చు. ప్రస్తుతం, ప్రత్యేక ఎంట్రీలు లేదా సర్దుబాటు ఎంట్రీలు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే బుక్ కీపింగ్ ఎంట్రీలు మాన్యువల్ గా నమోదు చేయబడతాయి. దీనిని భరించగల చాలా వ్యాపారాలు టాలీ ఈఆర్ పి9 లేదా టాలీ ప్రైమ్ వంటి బుక్ కీపింగ్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగిస్తుంటాయి. ఇకపోతే, చిన్న సంస్థలు తమ స్మార్ట్ ఫోన్ ల నుండి తమ బుక్ కీపింగ్ ను ట్రాక్ చేయడానికి మరియు రికార్డ్ చేయడానికి Khatabook సాఫ్ట్ వేర్ వంటి ఆటోమేటెడ్ బుక్ కీపింగ్ సాఫ్ట్ వేర్ ను కూడా ఉపయోగించవచ్చు.
డాక్యుమెంటేషన్ మరియు ఎంట్రీలను పోస్ట్ చేయడం:
అకౌంటింగ్ సిస్టమ్ లో, బుక్ కీపింగ్ నిర్వచనం ఏమిటంటే, ఒక వ్యాపార సంస్థ యొక్క అన్ని ఆర్థిక లావాదేవీలు సంబంధిత లెడ్జర్ ల్లో పోస్ట్ చేయబడడమే. ఈ లెడ్జర్ లలో ఇన్ వాయిస్ లు, రసీదులు, బిల్లులు మరియు ఇతర డాక్యుమెంటేషన్ రూపాల నుంచి డేటాను చేర్చుతారు. అందువల్ల, లెడ్జర్ లు డబ్బు లావాదేవీలను రికార్డ్ చేసి సంక్షిప్తీకరిస్తాయి. ఒక అకౌంటెంట్ ద్వారా ప్రతి లావాదేవీని పోస్టింగ్ చేయడం, డాక్యుమెంటేషన్ చేయడం మరియు రికార్డింగ్ చేయడం అనే మాన్యువల్ ఎంట్రీ సిస్టమ్ వలే కాకుండా, ఆధునిక అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ ఆటోమేటిక్ గా రోజువారీ లావాదేవీలను వివిధ రికార్డ్ ఫారాలు, లెడ్జర్ లు మొదలైన వాటిలో పోస్ట్ చేస్తుంది. అందువల్ల అవి మరింత ఖచ్చితమైనవి మరియు మానవ దోషాలు జరగకుండా చూసుకుంటాయి.
చాలా వ్యాపారాలు ఆర్థిక లావాదేవీలను రోజువారీగా పోస్ట్ చేయడానికి ఇష్టపడతాయి. అదే సమయంలో, ఇతరులు వారానికి లేదా నెలవారీగా బ్యాచ్ పోస్టింగ్ సిస్టమ్ ను ఇష్టపడవచ్చు. అయినప్పటికీ, ఇతరులు తమ రికార్డింగ్ మరియు పోస్టింగ్ కార్యకలాపాలను చేయడానికి ప్రొఫెషనల్ అకౌంటెంట్ల సహాయం తీసుకుంటారు. అటువంటి పోస్టింగ్ యాక్టివిటీని రోజూ చేయడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏమిటంటే, బిజినెస్ రికార్డులు మరింత ఖచ్చితంగా, తప్పులు లేకుండా ఉంచుకోవడానికే. నివేదికలు లేదా ఆర్థిక స్టేట్మెంట్స్ అవసరమైనప్పుడల్లా సులభంగా తొలగించవచ్చు మరియు మరింత ఖచ్చితమైనవి కూడా.
వోచర్లు, ఫైళ్లు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్ టి) కొరకు రసీదులు మరియు ట్యాక్సేషన్ ప్రయోజనాల కొరకు ప్రతి బిజినెస్ యొక్క బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ యాక్టివిటీలో ఆర్థిక లావాదేవీల డాక్యుమెంటేషన్ ఒక కీలకమైన అంశం. సౌలభ్యం కోసం, అనేక వ్యాపారాలు ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు అకౌంటింగ్ సంవత్సరంగా ఉపయోగిస్తోంటాయి. అకౌంటింగ్ కాలం సాధారణంగా కంపెనీ యొక్క పాలసీ, ట్యాక్సేషన్ కొరకు దాని ఇతర నిబంధనలు, అవసరాల పై ఆధారపడి ఉంటుంది. కానీ, పైన పేర్కొన్న అకౌంటింగ్ సంవత్సరాన్నే మీ అకౌంటింగ్ విధానంలో అనుసరించాలని జిఎస్టి పన్నుల నిబంధనలు చెప్తున్నాయని గమనించండి. అంతేకాక, అకౌంటింగ్ సాఫ్ట్ వేర్ లో ఉపయోగించే టెక్నాలజీ జిఎస్ టికి అనుకూలంగా ఉండాలని కూడా చెపుతుంది.
ఖాతా ఛార్టులపై బుక్ కీపింగ్ ప్రభావం:
- ఒరిజినల్ ఎంట్రీ యొక్క పుస్తకాలు అని పిలవబడే వాటిని నిర్వహించడంలో బుక్ కీపింగ్ సహాయపడుతుంది. ఇది ఆర్థిక లావాదేవీలను రికార్డు చేసే ఒక కళ. ఇందులో నగదు బదిలీ, ఆ నగదు విలువకు సరిపడే గూడ్స్ లేదా సర్వీసులను పొందుకున్న లావాదేవీలు, ఇంకా వాటి ఒరిజినల్ రికార్డులు అన్నిటినీ రికార్డు చేస్తుంది.
- బుక్ కీపింగ్ వ్యాపార కార్యకలాపాల సంబంధిత ఆర్థిక డేటాను కాలక్రమానుసారంగా మరియు క్రమబద్ధంగా వర్గీకరించడం మరియు రికార్డ్ చేయడంపై దృష్టి పెడుతుంది. మరోవైపు, అకౌంటింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, అందులో ఈ బుక్ కీపింగ్ అనేది అంతర్భాగం. అది మరింత సంక్లిష్టమైన ఆపరేషన్. అందులో రికార్డింగ్ పై దృష్టి సారించరు, బుక్ కీపింగ్ రికార్డులు లేదా ఖాతా పుస్తకాల నుండి పొందిన వ్యాపార ఆర్థిక స్టేట్మెంట్స్ మరియు స్థితిని అర్థం చేసుకోవడానికి బుక్ కీపింగ్ రికార్డులను అర్థం చేసుకుంటారు అంతే.
- బుక్ కీపింగ్ యొక్క అత్యంత సమగ్రమార్గం ఆర్థిక లావాదేవీల యొక్క ప్రతి రకం మరియు వాటి గుణాలకు సమగ్ర రికార్డులను సృష్టించడమే. తరువాత ఖాతాలను వాటి రకము ప్రకారం విడదీసి ఆర్థిక స్టేట్మెంట్స్ లో అవసరమైన విస్తృత వర్గాల కింద చేర్చవచ్చు. అందువల్ల, అకౌంటింగ్ సిస్టమ్ మరియు బుక్ కీపింగ్ ఎంత మెరుగ్గా ఉంటే, ఆర్థిక స్టేట్మెంట్స్ మరియు ఆర్థిక నివేదికలు అంత ఖచ్చితంగా ఉంటాయి.
అన్ని వ్యాపారాలకు అవసరమై, వారు మైంటైన్ చేయాల్సిన సాధారణ ఆర్థిక స్టేట్మెంట్లు ఏమిటంటే:
- ట్రయల్ బ్యాలెన్స్, ఇది అసెట్స్ మరియు అప్పుల స్థితి యొక్క ఖచ్చితమైన స్థితిని వివరిస్తుంది.
- బ్యాలెన్స్ షీట్, ఇది క్యాపిటల్, ఈక్విటీ, అప్పులు, ఆస్తులు, స్టాక్ హోల్డింగ్స్ మొదలైనవాటిని వెల్లడిస్తుంది.
- లాభాపేక్ష మరియు నష్టం ఖాతా, ఇది నాన్ ఆపరేటింగ్ మరియు ఆపరేటింగ్, నష్టాలు, లాభాలు, ఖర్చులు మొదలైన ఆదాయాలను వెల్లడిస్తుంది.
దీనిని కూడా చదవండి: అకౌంటింగ్లో ఉండే మూడు గోల్డెన్ రూల్స్, మంచి ఉదాహారణలతో
ముగింపు:
బుక్ కీపింగ్ ను ఎలా నిర్వచించాలో మరియు చిన్నలేదా పెద్ద, ప్రతి వ్యాపారానికి బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ ఎందుకు అవసరమో మనం తెలుసుకున్నాం. వ్యాపారం యొక్క ఆర్థిక స్థితిని బుక్ కీపింగ్ రికార్డుల వాడే స్టేట్మెంట్ ల సహాయంతో అర్ధం చేసుకొని లెక్క వేస్తారు. అందువల్ల, వ్యాపారం యొక్క స్థిరమైన ఎదుగుదల కొరకు ఖచ్చితమైన బుక్ కీపింగ్ సిస్టమ్ ఉండాలి. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (MSMEలు) వంటి అన్ని వ్యాపారాలకు Khatabook అద్భుతమైన ఆటోమేటిక్ బుక్ కీపింగ్ అప్లికేషన్ అని మీకు తెలుసా? మీ స్మార్ట్ ఫోన్ లో దాని ఫీచర్లను వాడి చూడండి. క్షణంలో మీ ఆర్థిక స్టేట్మెంట్స్ పొందండి.
తరచుగా అడిగే ప్రశ్నలు:
1. 2 బుక్ కీపింగ్ రకాలు ఏవి?
సింగిల్ ఎంట్రీ మరియు డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్స్. ప్రజలు ఎక్కువగా ఉపయోగించే రెండు అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతులు ఇవే. కొన్నిసార్లు ఈ రెండింటి కాంబినేషన్ సిస్టమ్ కూడా ఉపయోగించబడుతుంది. అకౌంటింగ్ లో సంస్థ అవసరాలకు ఏ సిస్టమ్ తగినది అనే దానిపై బుక్ కీపింగ్ సిస్టమ్ ఎంపిక ఆధారపడి ఉంటుంది.
2. ఒక బుక్ కీపర్ బాధ్యతలు ఏమిటి?
బుక్ కీపర్ అంటే అకౌంటెంట్ కూడా కావొచ్చు. వ్యాపారం యొక్క ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడం మరియు రికార్డ్ చేస్తుంటారు. సాధారణంగా ఖర్చులు, కొనుగోళ్లు, అమ్మకాలు మొదలైనవి ఆ రికార్డులలో ఉంటాయి. మనీ రికార్డింగ్ లావాదేవీలు మొదట సాధారణ లెడ్జర్ కు పోస్ట్ చేయబడతాయి, మరియు ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్ మొదలైన ఆర్థిక స్టేట్ మెంట్ లను తయారు చేయడానికి ఈ డేటా ఉపయోగించబడుతుంది.
3. బుక్ కీపర్ గా ఉండటం కష్టమా?
కాదు. ఈ నైపుణ్యం బుక్ కీపింగ్ సూత్రాలను పాటించడంపై ఆధారపడి ఉంటుంది. బుక్ కీపింగ్ అనేది క్లిష్టమైన అడుగులు లేని సరళమైన ప్రక్రియ. అందులోని అంతర్లీన పనితనాన్ని అర్థం చేసుకుంటే తరువాత అంతా సులభమే.
4. బుక్ కీపింగ్ మరియు అకౌంటింగ్ యొక్క అర్థాన్ని వివరించండి.
బుక్ కీపింగ్ అనేది వ్యాపార కార్యకలాపాల యొక్క సంబంధిత ఆర్థిక డేటాను కాలక్రమానుసారంగా మరియు క్రమబద్ధంగా వర్గీకరించడం మరియు రికార్డ్ చేయడంపై దృష్టి సారించే పని. మరోవైపు, అకౌంటింగ్ అనేది ఒక పెద్ద విషయం, దీనిలో బుక్ కీపింగ్ అంతర్భాగమైన పని. ఇది మరింత సంక్లిష్టమైన ఆపరేషన్, ఇక్కడ రికార్డింగ్, అంటే లెక్కలు నోట్ చేయడం పై దృష్టి సారించరు, బుక్ కీపింగ్ రికార్డులు లేదా ఖాతా పుస్తకాల నుండి పొందిన వ్యాపారం యొక్క ఆర్థిక స్టేట్మెంట్స్ మరియు స్థితిని అర్థం చేసుకోవడానికి బుక్ కీపింగ్ రికార్డులను అర్థం చేసుంటారు అంతే