written by khatabook | October 20, 2020

బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏమిటి? - చిన్న వ్యాపారులకు ఏది ఆర్థికంగా ఏ విధంగా సాయపడగలదు?

×

Table of Content


బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అంటే ఏమిటి?

ఏ వ్యాపారానికైనా, అది చిన్నదైనా, పెద్దదైనా, అనేక కారణాకు బిల్లులు వేయవలసి ఉంటుంది. కారణం, ఏ ఉత్పత్తినైనా, సర్వీసునైనా, అందించినప్పుడు, దానికి సంబంధించిన అన్ని వివరాలు బిల్లులో పొందుపరచబడి ఉంటాయి కాబట్టి. బిల్లును, అమ్మేవారు, కొనే వారికీ, కొన్న వస్తువును ధృవీకరిస్తూ ఇచ్చే రసీదు. ఒకప్పుడు, బిల్లును దాని వివరాలన్నింటినీ చేతితో రాసి అందించేవారు. కానీ సాంకేతికంగా జరిగిన ఎన్నో పురోగతుల కారణంగా, ఇప్పుడు ఆ పనిలో మీకు సహాయపడడానికి చాలా బిల్లింగ్ సాఫ్ట్‌వేర్లు మార్కెట్‌లోకి వచ్చాయి. వీటి సహాయంతో మీ పనితనం వేగవంతం కావడమే కాకుండా, మరెన్నో లాభాలు ఉన్నాయి.

బిల్లులో అమ్మిన వారి వివరాలు, కొన్న వారి పేరు, కాంటాక్ట్ వివరాలు లాంటి ముఖ్యమైన వివరాలు ఉంటాయి. అలాగే, బిల్లు నంబర్ సహాయంతో సులభంగా మనం ఏం వస్తువులను అమ్మాము, దానిపై ఎంత ట్యాక్స్ పడింది, పేమెంట్ ఏ విధంగా జరిగింది అనే విషయాలను తెలుసుకోవచ్చు.

బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఉండే ఫీచర్లు

మార్కెట్‌లో ఉన్న ఆన్‌లైన్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లలో వ్యాపారాన్ని వీలైనంత సులభం చేయగల చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కేవలం ఇంస్టాల్ చేస్తే చాలు, ఇక బిల్లులు జెనరేట్ చేయడం ప్రారింభించవచ్చు. వాటిలో కొన్ని ఏమిటంటే:

  • ఇన్వాయిస్ జెనరేషన్ - భారతదేశంలో ఉన్న ప్రతీబిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌కు ఉండే ప్రాధమిక ఫీచర్ ఇది. దీని సహాయంతో, వస్తువు, సమయం, కస్టమర్ వివరాలు గల ప్రొఫెషనల్ ఇన్వాయిస్ పొందగలం.
  • కస్టమర్ రికార్డు సృష్టింపు– కొన్ని అధునాతనమైన బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లలో, కస్టమర్ల వివరాలు, కొనుగోలుకు సంబంధించిన వివరాలు, కస్టమర్ల పేర్లను బట్టి సిస్టం స్టోర్ చేస్తుంది. తద్వారా, అవసరమైనప్పుడు, సులభంగా పలానా కొనుగోలుకు సంబంధించిన వ్యక్తిని తెలుసుకోగలం.
  • క్రెడిట్ కార్డు పేమెంట్లు తీసుకోవడం – ఒక బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో, కొన్ని వ్యాపారాలకు, లేదా హోటళ్లకు, నేరుగా కార్డు ద్వారా పేమెంట్ స్వీకరించే విధంగా సెట్ చేసుకోవచ్చు అలాగే కస్టమర్లకు తర్వాతి వాయిదా ఎప్పుడు చెల్లించాలని గుర్తుచేయవచ్చు కూడా.
  • కస్టమ్ టెంప్లేట్లు – ఈ ఫీచర్ సహాయంతో వ్యాపారాలు కస్టమర్ల అవసరం మరియు అడిగిన ఇన్వాయిస్ విధానాన్ని బట్టి ఇన్వాయిస్‌లు తయారుచేయవచ్చు. కాబట్టి, ఒకసారి ఇన్వాయిస్ రెడీ అయ్యాక, వేర్వేరు కస్టమర్లకు వారి అవసరతని బట్టి రకరకాల ఇన్వాయిస్‌లు ఇవ్వవచ్చు.
  • ట్యాక్స్ రిపోర్ట్ తయారీ – ఏ అత్యుత్తమమైన ఆన్‌లైన్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అయినా సరే, ట్యాక్స్ రిపోర్టులను జనరేట్ చేయగలగాలి. ఈ ఫెచర్ ఉంటే, మరొక సిస్టం సమయం పొందవలసిన అవసరమే ఉండదు.

GST బిల్లింగ్ సాఫ్ట్‌వేర్

భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) ప్రవేశపెట్టి ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది కాబట్టి చిన్న, మధ్యతరహా వ్యాపారాలు త్వరలోనే తమ ట్యాక్స్‌లు మ్యానేజ్ చేయడానికి సన్నాహాలు చేసుకోవాలి. GST సహాయంతో అతితక్కువ అడుగులలో ట్యాక్స్ చెల్లింపు వీలవుతుంది కాబట్టి వేర్వేరు ఆటంకాలు ఎదురుకాకుండా అంతా సక్రమంగా జరుగుతుంది. GST సహాయంతో నడిచే ప్రతీ వ్యాపారం చాలా డబ్బును కూడా ఆదా చేసుకోగలదు.

ఈ ఉచిత GST బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ సహాయంతో, యూజర్లు తమ ట్యాక్స్‌ను సులభంగా లెక్కించి, వెంటనే కట్టడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతీ వ్యాపారం, తమ అన్ని వ్యాపార లావాదేవీలకు GST ఇన్వాయిస్ తయారు చేసి, చూపించాల్సిన సమయం వచ్చింది.

మీకు సరిపడే బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఎంచుకోవడం ఎలా?

  1. మీ సాఫ్ట్‌వేర్ ఖచ్చితమైన ప్రమాణాలతో చేయబడి, అన్ని విధాలా మీ గోప్యమైన సమాచారాన్ని కాపాడగలదని నిర్ధారించుకోండి.
  2. తర్వాత, సౌలభ్యం. మీరు తీసుకోబోయే ఏ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ అయినా, మీరు వాడే ఏ ల్యాప్‌టాప్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ లేదా ఏ ఆపరేటింగ్ సిస్టం సహాయంతో నైనా పనిచేసే విధంగా ఉండాలి.
  3. అలాగే, మీరు ఇప్పటికే ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌లతో అవి అంత వరకు ఇముడుతాయనే విషయాన్ని కూడా చూసుకోవాలికి. తద్వారా, వ్యాపార లెక్కలలో తేడా రాకుండా ఉంటుంది.
  4. అవసరమైనప్పుడు, ఎటువంటి సమస్య లేకుండా, అన్ని ట్యాక్స్ సంబంధిత వివరాలను సిద్ధపరచి ఇవ్వగలగాలి, తద్వారా అకౌంటింగ్ సమయంలో వ్యాపారానికి సమయం వృధా కాదు. ఒక స్మార్ట్ సిస్టం ఉండడం చాలా అవసరం.
  5. చివరిగా, అది పెద్దగా సాంకేతిక నిపుణత లేని వారు కూడా సులభంగా ఉపయోగించగలిగేలా ఉండాలి.

చిన్న వ్యాపారాలు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లు వాడడం వల్ల ఉండే లాభాలు

ఒక బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ కేవలం ఆటోమేటిక్ బిల్లు తయారు చేయడమే కాకుండా, మరెన్నో విధాలుగా మీకు సహాయపడగలదు. అంటే, మీ ఆర్థిక లావాదేవీలను మ్యానేజ్ చేయడం, మరియు వ్యాపారాన్ని లాభం బాట పట్టించడానికి అవసరమైన జవాబుదారీతనాన్ని ఇవ్వడం.

మంచి ధర

వ్యాపారులకు డబ్బు ఆదా చేసి సహాయపడే చాలా ఉచిత ఆన్‌లైన్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ విషయన్ని పక్క్కన పెడితే, ఇవి స్వయంగా ఒక వ్యక్తి ఉండి చేయవలసిన పనిని తగ్గించగలవు. తద్వారా మీకు డబ్బు కూడా ఆదా అవుతుంది. మరొక రూపాయి ఖర్చు లేకుండా సరైన బిల్లును జనరేట్ చేయగలడం వ్యాపార యజమానులకు వరమే!

ఇంటెలిజెంట్ మ్యానేజ్మెంట్ సిస్టం

ఒక కస్టమర్‌ ఖాతాకు వారికి సంబందించిన వివరాలను ఒకసారి ఫీడ్ చేస్తే, తరువాతి లావాదేవీ నుండి, ఎన్నిసార్లయినా సాఫ్ట్‌వేర్ సహాయంతో వారికి సరిపడే సర్వీసును అందించవచ్చు. దీని కారణంగా, చిన్న చిన్న పనులకని వ్యాపారాలు అంగబలాన్ని, సమయాన్ని వృధా చేయనవసరం లేదు. కాబట్టి ఇది మరింత సమర్ధవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.

లోపరహితం

ఈ ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లలో జరిపే అన్ని లెక్కలు ఎటువంటి తప్పులు లేకుండా ఉంటాయి. కేవలం మానవరహిత లెక్కలు మాత్రమే లోపరహితంగా ఉంటాయని మనందరికీ తెలుసు. కాకపోతే, దేనికి లెక్క కట్టాలని నిర్ణయించడంలో తప్పు జరిగే అవకాశం ఉంది. కానీ ఈ ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ సహాయంతో కస్టమర్‌ను కూడా దానికదే ఎంచుకుంటుంది కాబట్టి ఆ తలనొప్పి కూడా ఉండదు.

సురక్షితం & భద్రం

ఈ ఆన్‌లైన్ సిస్టంలు అన్ని మీ గోప్యమైన సమాచారం మరొకరి కంట పడకుండా ఉండేందుకు గుప్తీకరించబడి ఉంటాయి. కాబట్టి వ్యాపారాలు, అలాగే కస్టమర్లు కూడా నిశ్చింతగా ఉండవచ్చు.

నిబంధనలకు అనుగుణంగా

సాఫ్ట్‌వేర్ సహాయంతో GST బిల్లులు మంజూరు చేసినప్పుడు, ప్రభుత్వ నియమాలకు వ్యతిరేకమైన అంశాలు ఏమైనా ఉంటాయేమో అన్న భయమే అక్కరలేదు. కాబట్టి, మీరు చింతకు దూరం కావడమే కాకుండా, వీటిని చూపించి లోన్స్‌కు అప్లై చేసుకోవచ్చు కూడా. విజయవంతమైన ఏ వ్యాపారానికైనా, మొదటినుండి అన్నీ సరిగా ఉండడం ముఖ్యం.

మంచి పేరు

ఎన్ని చెప్పినా కూడా, బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లసహాయంతో మీకు సమర్ధవంతమైన, ఖచ్చితమైన, తక్షణ బిల్లులు జనరేట్ అవుతాయి. తద్వారా కస్టమర్లు కూడా వ్యాపారాన్ని ఇష్టపడతారు. మీ వ్యాపారాన్ని ఇష్టపడే కస్టమర్లే మీకు మరొక 10 మంది వచ్చేలా చేయగలరు. బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ సహాయంతో, మీ వ్యాపారానికి ప్రత్యక్షంగా, అలాగే పరోక్షంగా కూడా చాలా మంచి జరుగుతుంది.

చివరి మాట

మీరు ఇంతకముందు ఉపయోగించి ఉండకపోతే, GST బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లలో ఉండే ఉచిత వెర్షన్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి చూడండి. వాటి సహాయంతో మీకు వాటిని ఎలా ఉపయోగించాలి, ఉపయోగిస్తే ఏంటి లాభం అనేది తెలుస్తుంది. అంతేకాక, పైన చెప్పిన అన్ని లాభాలను పొందగలరు కాబట్టి, త్వరలోనే మీకు నచ్చిన, అన్ని ఫీచర్లు ఉన్న సాఫ్ట్‌వేర్‌ను మీరే కొంటారు. చిన్నగా చెప్పాలంటే, తక్కువ ఖర్చుకే, సులభమైన, ఖచ్చితమైన, తక్షణమైన, సరళమైన ఆన్‌లైన్ బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చూడండి.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.