written by khatabook | August 14, 2020

చాలా తక్కువ పెట్టుబడితో 2023లో నడిపించగల 15 ఆన్‌లైన్ వ్యాపారాలు

×

Table of Content


తక్కువ పెట్టుబడితో ఆన్‌లైన్ బిజినెస్ మొదలుపెట్టడానికి బెస్ట్ ఐడియాలు

సొంతంగా వ్యాపారం మొదలుపెట్టడమంటే చాల కష్టతరమైన విషయంలాగానే అనిపిస్తుంది. ఎలాంటి వ్యాపారం చేయాలి, ఎలా చేయాలి? ఎంత పెట్టుబడి పెట్టాలి? మీరు డబ్బును మ్యానేజ్ చేయగలరా? ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు? అనే బోలెడన్ని ప్రశ్నలతో ఇబ్బంది పడుతున్నారేమో. ఇంటర్నెట్ ఉండగా దిగులెందుకు దండగ. వ్యాపారం అంటే ఒక స్థలం తీసుకోవాలి, చాల డబ్బు పెట్టుబడి పెట్టాలి అనే రోజులు ఎప్పుడో పోయాయి. మన ప్రపంచంలో ఇప్పుడు ఇంటర్నెట్ ఏ స్థాయిలో దూసుకుపోతోందంటే, మనం ఉన్న చోటునుంచే ఆన్లైన్ ద్వారా మీ వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు.

ఆన్‌లైన్ వ్యాపారం మొదలుపెట్టడం వల్ల ఉన్న లాభాలేమిటి?

ఆన్‌లైన్ వ్యాపారానికి ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్, దానివల్ల అయ్యే పరిమిత ఖర్చు. అంతే కాకుండా ఉన్న చిన్న స్థలం లోనే లేదా ఇంట్లో ఉండే నడిపించవచ్చు. ఇక కావలసినవల్లా ఇంట్లో కూర్చుని పని చేసుకోడానికి అనువుగా ఒక చోటు, మంచి ఇంటర్నెట్ కనెక్షన్, వ్యాపారానికి అవసరమైన అద్భుతమైన ఆలోచనలు అంతే. ఇలా ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టి, ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారవచ్చు. ఇలా ఇంటర్నెట్ సాయంతో చేసే బిజినెస్‌లో లాజిస్టిక్స్ వల్ల కానీ, అదనపు ఖర్చుల గురించి కానీ పెద్దగా ఆందోళన పడే పని ఉండదు.

ఆన్‌లైన్ వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి కావాల్సిన కొన్ని

మీరు ఏదైనా చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే, ఇంట్లో ఉండే చేయొచ్చు, దానికి మీరు మీ ఉద్యోగం మానాల్సిన అవసరం లేదు. మీకు ఎంత మంచి వ్యాపార ఆలోచనలు, ఐడియాలు ఉన్నాయన్నదే ముఖ్యం. దానితో పాటు, వ్యాపారానికి ఒక గుర్తింపు ఎలా తేవాలి & మార్కెటింగ్ ఎత్తుగడలు, కస్టమర్ కేర్ సేవలు అనే వాటిపై పూర్తి అవగాహన కలిగివుండాలి. భారతదేశంలో ఇప్పుడు చిన్న వ్యాపారాలను చాలా సులువుగా నడిపించేందుకు అవకాశాన్ని ఇంటర్నెట్ కల్పించింది!

మీరు అనవసరంగా సామాగ్రి, అద్దులు కట్టడం, పెట్టుబడి వంటి వాటి గురించి ఆలోచించకుండా ముఖ్యమైన వాటి మీద ద్రుష్టి నిలపగలరు. నిజానికి, డబ్బులే ఖర్చుపెట్టకుండా మీరు మీ వ్యాపారానికి అవసరమైన చాలా వాటిని అమెజాన్, ఈబే, వర్డ్‌ప్రెస్, యూట్యూబ్ వంటి వాటి నుంచి నేర్చుకొని అమలు చేయవచ్చు. అలా నెమ్మదిగా, మీరు స్వయం ఉపాధిని ఏర్పరచుకుని, ఆదాయం పొందడం ప్రారంభిస్తారు. మీ సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెట్టి మీకు మీరే బాస్ అయితే మరొకరికి జవాబు చెప్పుకోవాల్సిన పని ఉండదు!

15 అత్యుత్తమ ఆన్‌లైన్ బిజినెస్ ఐడియాలు

చాలా తక్కువ లేదా అస్సలు పెట్టుబడే పెట్టవలసిన అవసరం లేని 15 ఆన్‌లైన్‌ బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.

#1. డ్రాప్‌షిప్పింగ్/strong>

మీరు ఒకవేళ ఆన్‌లైన్‌లో వస్తు అమ్మకాలు చేయాలని అనుకుంటూ, పెట్టుబడికి సరిపడా నగదు లేదని ఆలోచిస్తుంటే, ఇది మీకోసమే. డ్రాప్ షిప్పింగ్ అనే ఈ-కామర్స్ వ్యాపార మోడల్ ద్వారా మీరు ఒక ఆన్లైన్ దుఖాణాన్నీ తయారుచేసుకొని, వస్తువులు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్న వారితో భాగస్వామ్యం తీసుకుని, వాటిని వినియోగదారుల వద్దకు పంపవచ్చు.

#2. తర్జుమా

మీకు భాష మీద పట్టు ఉంటే, మీరు అప్ వర్క్, ఫ్రీలాన్సర్ వంటి వాటిలో అకౌంట్ తయారు చేసుకుని, అక్కడ మీ భాషా ప్రావీణ్యతని చూపించండి. అనువాదం చేయించుకునే కంపెనీలకు అప్లై చేసి, మీకు మీరే చాలా పని సంపాదించుకోవచ్చు.

#3. సోషల్ మీడియా కన్సల్టెంట్

మీరు సృజనాత్మకంగా వ్రాయగలగి, సోషల్ మీడియాలో మీ కంటెంట్ ట్రెండింగ్‌లో ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలిసుండీ, సోషల్ మీడియాకి సంబంధించిన వృత్తిని మీరు ఎంచుకోవాలనుకుంటే, ఇది మీకోసం. మీకు సోషల్ మీడియాలో ఉండే చిక్కుల గురించి, జెన్యూన్ ఫాలోవర్లను ఎలా సంపాదించాలో అవగాహన ఉంటే, మీరు దీనిలో అడుగుపెట్టాల్సిందే.

#4. వెబ్ డిజైనర్

మీకు వెబ్‌సైట్‌లు తయారు చేయడం వస్తే, మీకు ఇక తిరుగే లేదు. ప్రస్తుతం చాలా మంది చిన్నగా వ్యాపారాలు మొదలుపెడుతున్నారు, వారందరికీ వెబ్సైట్ల అవసరం ఉంటుంది. కాబట్టి, మీరు ఆ రంగంలో దూసుకుపోండి, ఇక మీకు డబ్బులకు కొరతే ఉండదు.

#5. ఇంటి నుంచే చేసే క్యాటరింగ్ బిజినెస్

మీ వంట అద్భుతంగా ఉంటుందా? అయితే వంటలపై మీకున్న ఇష్టాన్నే ఆదాయంగా మార్చుకోండి. ఆన్లైన్లో మీ చేతివంటలను ఆర్డర్ చేసుకునేలా వ్యాపారం మొదలుపెట్టండి. మీకు ఏది బాగా వస్తుందో, దాని నుండే లాభం సంపాదించండి.

#6. బ్లాగింగ్

మీకు ఏదైనా ఒక రంగం, లేదా కొన్ని విషయాలపై మంచి అవగాహన ఉన్నవారైతే మీ సొంత బ్లాగు మొదలుపెట్టవచ్చు. వర్డ్‌ప్రెస్ మరియు బ్లాగర్ అని మీరు ఉచితంగా బ్లాగులు సృష్టించడానికి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. మీరు గనుక క్రమంగా, పాఠకులకు ఉపయోగపడే మంచి విషయాలపై వ్రాస్తున్నట్లయితే, అతి త్వరలోనే మీ బ్లాగును సెర్చ్ ఇంజిన్లు మంచి పొజిషన్లో చూపించడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత మీరు గూగుల్ AdSense సహాయంతో బ్లాగ్‌లో యాడ్స్ నడిపించి సంపాదన మొదలుపెట్టవచ్చు. మీ బ్లాగులో పెట్టిన యాడ్స్ మీద ఎంత మంది క్లిక్ చేశారనే దానిని బట్టి సంపాదన ఆధారపడి ఉంటుంది. ఇంకొక విధంగా ఎలా సంపాదించవచ్చు అంటే, మీ వెబ్‌సైట్‌లో మరొక వెబ్సైటు వారి వస్తువులు లేదా సర్వీస్‌లకు యాడ్స్ ఇచ్చి, జరిగే అమ్మకాలపై కమిషన్ తీసుకోవచ్చు. దీనిని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు.

#7. కస్టమ్ బహుమతులు

ఎవరికైనా వారి కోసమే ఏదైనా తయారు చేశారంటే, అది వాళ్లకు ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి మీకు అలాంటివి తయారు చేయడం వస్తే, అంటే టీ షర్టులు, ఫోన్ కేసులు, హూడీలు, బ్యాగులు, కాఫీకప్పులు వంటివి, తయారు చేసి వాటిమీద వాళ్ళకి నచ్చేలా ఏదైనా వాళ్ళ కోసం వ్రాయండి. అప్పుడు వాటిని మీరు మీ ఆన్‌లైన్‌ వ్యాపారం సహాయంతో అమ్మవచ్చు.

#8. హస్తకళలు

మీరు సృజనాత్మకంగా ఆలోచించే వారైతే, ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కాండిల్, సోప్లు, కుండలు, బహుమతులు, గ్రీటింగ్ కార్డులు, వంటివి తయారు చేసి ఆన్‌లైన్‌లో అమ్మండి. మీరు మీ సోషల్ మీడియా ద్వారా కూడా వీటిని అమ్మవచ్చు అంటే మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి, యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా. అలా మీ ఫాలోవర్లను పెంచుకుని, మీ పనికి ఒక గుర్తింపు, పేరు వచ్చేలా చేసుకోవచ్చు.

#9. గ్రాఫిక్ డిజైనర్

మీకు లోగోలు, పోస్టర్లు, బ్రౌచర్లు డిజైన్ చేయడం మీద పట్టు ఉంటే, మీరు ఆన్‌లైన్‌లో వీటి మీదే వ్యాపారం మొదలుపెట్టవచ్చు. వేర్వేరు కంపెనీలకు, వ్యాపారాలకు డిజిటల్‌గా తయారు చేసి ఇవ్వండి. మీ అభిరుచిని, మీ నైపున్యతని ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోండి.

#10. యాప్ డెవలపర్

ఈరోజుల్లో, మొబైల్ ఫోన్లు, వెబ్‌సైట్‌లను ఓడించి వాటి స్థానాన్ని పెంచుకున్నాయి, ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లే. ప్రతిదీ మొబైల్ అప్లికేషన్ల రూపంలో ఉంటుంది. కాబట్టి మీరొకలా కోడింగ్ చేయగలిగితే, అప్లికేషన్ డెవలప్ చేయడం మొదలుపెట్టండి. మీరు మీ సొంతంగా అప్లికేషన్ ను తయారుచేయొచ్చు, లేదా ఎవరికైనా కావాలంటే చేసిచ్చి డబ్బు సంపాదించవచ్చు.

#11. ఆన్‌లైన్ కంటెంట్ క్రియేటర్

మీకు జోకులు వేసి పక్కనవారిని నవ్వించడం అలవాటు అయితే, దానినే ఉపాధిగా చేసుకోవచ్చు. మీరు వీడియోలు తయారుచేసి, వాటిని యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయండి. మీ వీడియోలను జనాలు ఇష్టపడి, వాటిని ఎక్కువగా చూస్తూ, లైక్ చేసి, మీ ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు పెరిగితే, మీ ఛానల్లో ప్రకటనలు చేసి వాటి నుంచి షేర్ తీసుకోవచ్చు. మీ సొంతంగా మీరు పాడ్‌క్యాస్ట్, అంటే ప్రస్తుత తరంలో రేడియో ప్రసారం లాంటిది, దానిని ఏర్పాటు చేసి కథలు కవితలు వంటివి చెప్పవచ్చు. వాటికి ఆధరణ పెరిగిన తర్వాత, అక్కడ కూడా ప్రకటనలు ఇచ్చి డబ్బు సంపాదించవచ్చు.

#12. ఈ-బుక్ రచయిత

వ్రాయడం అంటే ఇష్టం ఉండి, అది మీ అభిరుచి అయితే, దానితోనే ఆన్‌లైన్‌లో వ్యాపారం మొదలుపెట్టండి. మీకు ఏ విషయం లేదా అంశం మీద గట్టిపట్టు ఉండి, నేర్పుగా రాయగలరు అని తెలుసో, దాని మీద మీ నైపుణ్యాన్ని అంతా చూపి, ఒక ఈ-బుక్ తయారు చేయండి. దాని గురించి మీరు సోషల్ మీడియాలో ప్రకటనలు పెట్టి, డబ్బులకి దానిని డౌన్లోడ్ చేసుకునేలా సెట్ చేయండి.

#13. ఆన్‌లైన్ కోచింగ్/ట్యూషన్లు

మీరేదైనా పనిలో నైపుణ్యత కలిగుండి, దానిని ఇతరులకి నేర్పాలనే ఉత్సుకత కలిగుంటే, మీరు ఆన్‌లైన్ క్లాసులు మొదలుపెట్టవచ్చు. ప్రస్తుత కొరోనా పరిస్థితులలో అందరు ఇంటి నుంచి తెలుసుకుని, ఇంటిలోనే నేర్చుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి మీరు యోగా, వంటలు, ఇలా ఏ విషయాన్నైనా నేర్పవచ్చు.

#14. వర్చ్యువల్ అసిస్టెంట్

మీరు లేకుండా మీ ఇంటా, లేక స్నేహితులతో చేసే పనులలో ఏదీ సరిగ్గా జరగదా? మీకు అన్ని విషయాలపై ఎంతో కొంత అవగాహనా ఉందా? అయితే ఈ పని మీకు సరిగ్గా సరిపోతుంది. మీరు ఇంటర్‌నెట్ సహాయంతో ఆన్‌లైన్‌లోనే ఉండి, తమకంటూ సమయం లేని వారికి అసిస్టెంట్‌గా పని చేయవచ్చు. వాళ్ళ మ్యానేజ్మెంట్, రీసెర్చ్ లేదా ఇతర పనుల్లో సహాయపడవచ్చు.

#15. ఆన్‌లైన్ ఫాషన్ బోటీక్

మీకు ఫ్యాషన్ గురించి బాగా తెలుసా? మీకు ఇతరులను అందంగా రెడీ చేయడం ఇష్టమా? అయితే మీరే ఆన్‌లైన్‌లో ఒక ఫ్యాషన్ షాప్ ఒక తెరిచి, మీకొక గుర్తింపును సంపాదించుకోండి. ఆన్‌లైన్‌లో మీరు బట్టలు, అలంకరణ సామన్లను ఈ కామర్స్ ద్వారా అమెజాన్, మిన్‌త్రా, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్‌లలో అమ్మవచ్చు. కావాలంటే, ఫ్యాషన్ గురించి తెలియని వారికి మీరే ఒక స్టయిలిస్టుగా కూడా పనిచేయవచ్చు!

చివరి మాట!

ఇప్పుడు మీరు ఇంటర్నెట్ ఏ స్థాయిలో పనిచేస్తుందో, ముఖ్యంగా వ్యాపార రంగంలో, అందరికి సమానమైన అవకాశాలను కల్పించి ఎలా దూసుకుపోతుందో చూస్తున్నారు కదా! ఇంకెందుకు ఆలస్యం? మీ కలలను నిజం చేసుకోండి. మీ రాజ్యానికి మీరే రాజు/రాణి. మీరెలా పనిచేయాలో, ఎప్పుడు చేయాలో, ఎంత చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఇక మీ వ్యాపారాన్ని మొదలుపెట్టండి. వెంటనే మీ ల్యాప్‌టాప్ తెరిచి పని ప్రారంభించండి!

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.