written by khatabook | August 27, 2020

డెబిట్, క్రెడిట్ నోట్లు, మరియు వాటి ఫార్మాట్ ఏమిటి?

×

Table of Content


డెబిట్ నోట్ మరియు క్రెడిట్ నోట్ గురించి తెలుసుకోండి

మీ బందు మిత్రులతో మీరు ప్రారంభించబోయే వ్యాపారం గురించి పంచుకోవడం మంచి విషయమే. కాకపోతే కస్టమర్లకు తగిన సర్వీసును అందించి వారి నమ్మకాన్ని పొందడానికి ప్రారంభంలో ఎదురయ్యే అవకతవకలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ ఒకసారి మీ మొదటి లావాదేవిని పూర్తి చేసిన తర్వాత, ఆ తృప్తే వేరు అన్నట్టు ఉంటుంది. కానీ అంతటితో ఆగిపోదు. ప్రారంభంలో వచ్చే కొంతమంది కస్టమర్లను మ్యానేజ్ చేయడం సులభం. కానీ వ్యాపారం విస్తరించే కొలది, మీకంటూ ఒక మంచి అకౌంటింగ్ విధానం ఉండి తీరాలి. అంతేకాక, మీ లావాదేవీలను నమోదు చేసుకోవడానికి, ఒక మంచి విధానాన్ని ప్రారంభం నుండే ఫాలో అయితే, అది మీకు చాలా సహాయపడుతుంది. అలాంటి విధానాలలో డెబిట్ నోట్ మరియు క్రెడిట్ నోట్ అనేది కూడా ఒకటి.

ప్రస్తుతం మీరు ఇన్వాయిస్‌లు మంజూరు చేయడం ఒక్కటే మార్గం అనే ఉద్దేశంలో ఉండి ఉంటారు. కానీ, ఇన్వాయిస్ లేదా బిల్ అనేది మీరు పలానా వస్తువు మీద ఎంత ఖరీదును ఛార్జ్ చేశారనేది చూపించడానికి ఒక చీటీ మాత్రమే. కానీ ఒకవేళ మీరు ఇచ్చిన వస్తువు లేదా సేవ కస్టమర్‌కు అవసరమైన దానికన్నా ఎక్కువ అయితే ఎలా, లేదా మీరు ఇచ్చిన వస్తువు లేదా సేవలో ఏదైనా సమస్య ఎదురైతే? అటువంటి సమయంలో ఇచ్చేదానినే డెబిట్ నోట్ మరియు క్రెడిట్ నోట్ అని అంటారు.

అవి ఏమిటో, వాటి ఫార్మటు ఏమిటో మరియు వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

డెబిట్ నోట్ అంటే ఏమిటి?

క్లయింట్ లేదా కొనుగోలుదారులు విక్రయించేవారికి లేదా సప్లయర్‌కి రిఫండ్ చెల్లించమని, లేదా తీసుకున్న వస్తువులలో ఏదైనా సమస్య ఉంటే చెల్లించిన పేమెంట్‌కి కాస్త సర్దుబాటు చేయమని ఒక నోట్ ఇస్తారు.

సాధారణంగా, అకౌంట్ ఎంట్రీలలో డెబిట్ అంటే, కంపెనీ బాలన్స్ షీట్‌లో అసెట్స్ మరియు లైబిలిటీస్ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.

డెబిట్ నోట్ ఇవ్వడానికి సరైన సమయం (GSTకి అనుకూలమైనది)

  • ట్యాక్స్ ఇన్వాయిస్ తయారు చేసి ఇచ్చిన తర్వాత, ట్యాక్స్ చెల్లించవలసిన మొత్తం తక్కువైనప్పుడు
  • చెల్లించిన మొత్తం కంటే తక్కువ మొత్తంతో ట్యాక్స్ ఇన్వాయిస్ మంజూరు చేసినప్పుడు.

క్రెడిట్ నోట్ అంటే ఏమిటి?

డెబిట్ నోట్ విషయం పక్కన పెడితే, ఏ సమయంలోనైనా విక్రయించిన వారి సర్వీసు లేదా ఉత్పత్తి ఉండవలసిన విధంగా లేకుండా వినియోగదారులను నిరుత్సాహపరచినప్పుడు, క్రెడిట్ నోట్‌ను మంజూరు చేస్తారు. సప్లయర్ తనంతట తానుగా వచ్చి, పూర్తి మొత్తం, లేదా పార్షిక మొత్తానికి రిఫండ్ జారీ చేస్తారు. జారీ చేయబడిన ఇన్వాయిస్/బిల్లును రద్దు చేయడం సాధ్యం కాదు కాబట్టి క్రెడిట్ నోట్ జారీ చేయబడుతుంది.

ఉదాహారణలతో వివరించబడిన సమస్యలు:

                    

డెబిట్ నోట్ మరియు క్రెడిట్ నోట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం:

సమస్య: కస్టమర్ విక్రయించేవారికి చెల్లించవలసిన మొత్తం తగ్గుతుంది ↓ కస్టమర్లు విక్రయించేవారికి చెల్లించవలసిన మొత్తం పెరుగుతుంది ↑
కారణం: వస్తువుల నాణ్యత లేదా పరిమాణం ఆశించిన విధంగా లేకపోవడం. ఊహించని విధంగా వస్తువుల మొత్తం అధికమైనా లేక కొనుగోలు సమయంలో వాటి వెల తక్కువ వేసినప్పుడు.
ఫలితాలు: గూడ్స్ యొక్క విలువ (ఖరీదు) తగ్గుతుంది ↓ ఇన్వాయిస్ (బిల్లు) యొక్క విలువ పెరుగుతుంది ↑
తరువాత ఏం చేయాలి? కస్టమర్ డెబిట్ నోటు జారీ చేస్తారు విక్రయించిన వారు డెబిట్ నోటు జారీ చేస్తారు
పరిష్కారం: ↓ చెలించవలసిన మొత్తానికన్నా వినియోగదారులు తక్కువ మొత్తం చెల్లించి సెటిల్ చేస్తారు ↑ చెల్లించవలసిన దానికన్నా వినియోగదారులు ఎక్కువ మొత్తం చెల్లించి సెటిల్ చేస్తారు
చివరి స్టెప్? కస్టమర్ యొక్క డెబిట్ నోటుకు ప్రతిగా అమ్మిన వారు క్రెడిట్ నోట్‌ను జారీ చేస్తారు అమ్మినవారు ఇచ్చిన డెబిట్ నోటుకు ప్రతిగా కస్టమర్ క్రెడిట్ నోటును జారీ చేస్తారు

క్రెడిట్ నోట్ ఎందుకు జారీ చేయబడుతుంది? (GSTకి అనుకూలంగా)

  • కొనుగోలు దారులు తీసుకున్న వస్తువులను పూర్తిగా లేక పాక్షికంగా తిరిగి ఇచ్చినప్పుడు
  • కొనుగోలు చేసిన సేవలు లేదా ఉత్పత్తులు వినియోగదారులు ఆశించిన నాణ్యతతో లేని పక్షాన
  • ఉత్పత్తుల పూర్తి పరిమాణానికి ఇన్వాయిస్ జారీచేయబడిన తర్వాత వినోయోగదారులు పాక్షికంగా ఉత్పత్తులను స్వీకరించిన సమయంలో
  • ఉండవలసిన దానికన్నా అమ్మిన వారు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేసిన పక్షాన
  • కొనుగోలుకు అంగింకరించబడిన మోతాదుకన్నా ఎక్కువ మోతాదుకు ఇన్వాయిస్ సృష్టించిన పక్షాన

డెబిట్ Vs క్రెడిట్ నోట్

డెబిట్ నోట్ క్రెడిట్ నోట్
కస్టమర్ తయారు చేసి అమ్మిన వారికి పంపిస్తారు అమ్మిన వారు కొనుగోలు చేసిన వారికి పంపిస్తారు
సప్లయర్ అకౌంట్ నుండి డెబిట్ చేశారు అని చూపించే నోట్ కొనుగోలు చేసిన వారి అకౌంట్‌లో క్రెడిట్ అయింది అని చూపించే నోటు
పర్చేస్ రిటర్న్ పుస్తకంలో అప్‌డేట్ చేస్తారు సేల్స్ రిటర్న్ పుస్తకంలో అప్‌డేట్ చేస్తారు
అకౌంట్ రిసీవబుల్ (AR) అనేది తగ్గుతుంది అకౌంట్స్ పెయబుల్ (AP) అనేది తగ్గుతుంది
కస్టమర్‌కు ఇచ్చిన క్రెడిట్. దీనిని నీలం రంగు ఇంకుతో వ్రాస్తారు అమ్మిన వారి అకౌంట్‌లో డెబిట్. దీనిని ఎర్ర ఇంకుతో వ్రాస్తారు
క్రెడిట్ నోట్ ఇచ్చి డెబిట్ నోటు తీసుకుంటారు డెబిట్ నోట్ ఇచ్చి క్రెడిట్ నోట్ తీసుకుంటారు
పేమెంట్ ముందే జరిగిపోతే జారీ చేయబడుతుంది ఇన్వాయిస్ ముందే తయారు చేయడం జరిగిపోతే జారీ చేయబడుతుంది

డెబిట్ మరియు క్రెడిట్ నోట్ ఫార్మాట్

ఈ రెండు ఫార్మాట్‌లు కూడా MS Excel, MS Word, లేదా PDFలో తయారు చేయవచ్చు. అయితే, టెక్నాలజీలో చోటుచేసుకుంటున్న నవీకరణల కారణంగా, మీ స్మార్ట్ ఫోనులో కూడా వీటిని పొందడానికి ఇప్పుడు వీలుపడుతుంది. మీరు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాం, ఒక్కటే ఫార్మాట్ ఉంటుంది. అలాగే డెబిట్ debit noteమరియుక్రెడిట్ నోట్ల మధ్య స్వల్పమైన మార్పులు మాత్రమే ఉంటాయి. క్రెడిట్ లేదా డెబిట్ నోట్ చేయడానికి ఖచ్చితంగా debit note GST నిబంధనలను ఫాలో అవ్వాలి.

  • శీర్షిక – డెబిట్ నోట్ లేదా క్రెడిట్ నోట్ అని పేర్కొనాలి
  • ఏడాదిని బట్టి ఒక సీరియల్ నంబర్ ను ఏర్పాటు చేసి, పంపించే ప్రతీ నోటుకి ఒక ప్రత్యేకమైన సంఖ్యను ఇవ్వాలి.
    • 16 అక్షరాలకంటే పెద్ద సంఖ్య ఉండకూడదు.
    • డాష్, హైఫన్, లేదా ఇతర క్యారెక్టర్లతో పాటు ఆల్ఫాన్యూమెరిక్ విధానంలో నంబర్‌ను తయారు చేయాలి.
  • నోట్ ఏ రోజున మంజూరు చేయబడిందో ఆ తేదీని చూపించాలి
  • ఇన్వాయిస్ నంబర్ మరియు ఇన్వాయిస్ తేదీని రిఫరెన్స్ కోసం జోడించాలి
  • పంపిణీదారుని పేరు, కాంటాక్ట్ వివరాలు, మరియు GSTIN (గూడ్స్ అండ్ సర్వీసెస్ ఐడెంటిఫికేషన్ నంబర్) ఉండాలి.
  • స్వీకరించే వారి కాంటాక్ట్ నంబర్ మరియు GSTIN (గూడ్స్ అండ్ సర్వీసెస్ ఐడెంటిఫికేషన్ నంబర్) కూడా ఉండాలి
  • అలాగే, స్వీకరించే వారి పేరు, కాంటాక్ట్ నంబర్ మరియు అడ్రెస్ కూడా ఉండాలి
  • బిల్లు లేదా ట్యాక్స్ ఇన్వాయిస్‌ను సూచించే విధంగా తేదీ మరియు సీరియల్ నంబర్ ఉండాలి
  • ఆ తరువాత, మీరు అందించే ఉత్పత్తి లేదా సేవల విలువ మరియు వాటిపై వర్తించే ట్యాక్స్ వివరాలను జోడించాలి.
  • సరఫరాదారు/కొనుగోలుదారు సంతకాలను జోడించి పూర్తి చేయండి

గమనిక: డెబిట్ మరియు క్రెడిట్ నోట్లను సప్లిమెంటరీ ఇన్వాయిస్ అని కూడా పిలుస్తారు.

డెబిట్ లేదా క్రెడిట్ నోటును ఇచ్చేముందు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు:

  • క్రెడిట్ నోట్‌లో ఎంటర్ చేయబడిన మొత్తం నెగిటివ్ (-ve) మరియు డెబిట్ నోట్‌లో ఎంటర్ చేయబడిన మొత్తం పాజిటివ్ (+ve) అయి ఉండాలి.
  • డెబిట్ లేదా క్రెడిట్ నోట్ రికార్డులను సంవత్సరిక ట్యాక్స్ రిటర్న్ జరిగిన తరువాత, అప్పటి నుండి ఆరు సంవత్సరాల వరకు భద్రంగా ఉంచుకోవాలి.
  • GST చట్టం ప్రకారం, డెబిట్ లేదా క్రెడిట్ నోట్ ను సమర్పించాలి, అలాగే రిజిస్టర్ చేయబడిన పార్టీ ఆ డాక్యుమెంట్‌ను జారీ చేయాలి.
  • క్రెడిట్ నోట్‌ను సంవత్సరిక రిటర్న్ ఫైలింగ్ లేదా ఆర్థిక సంవత్సర చివరలో, లేదా సెప్టెంబర్ 30వ తారీఖున జారీ చేయాలి. ఎందుకంటే, డెబిట్ నోట్ ప్రభుత్వ పన్నును సేకరించడానికి సహాయపడితే, క్రెడిట్ నోట్ ట్యాక్స్ మొత్తాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి క్రెడిట్ నోట్ విషయంలో సమయానికి పని పూర్తి చేయడం చాలా ముఖ్యం.
  •  
  •  
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.