written by Khatabook | February 7, 2022

సిజిఎస్‌టి/ఎస్‌జిఎస్‌టి నిబంధనల యొక్క రూల్ 39 అంటే ఏమిటి?

×

Table of Content


సిజిఎస్టి/ఎస్‌జిఎస్‌టి నిబంధనల యొక్క రూల్ 39 ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పంపిణీ చేయడానికి ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్‌లకు విధానాన్ని సూచిస్తుంది.  రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులందరూ కూడా సిజిఎస్‌టి/ఎస్‌జిఎస్‌టి యొక్క రూల్ 39 గురించి తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతీ వ్యాపార యజమానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లేదా జిఎస్‌టి గురించి తెలుసు. అయితే, జిఎస్‌టి రూల్ 39 గురించి వారికి తెలియకపోవచ్చు, కాబట్టి దీనిని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

 

సిజిఎస్‌టి/ఎస్‌జిఎస్‌టి నిబంధనల యొక్క రూల్ 39

రూల్ 39ని అర్థం చేసుకోవడానికి ముందు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటిసి) మరియు ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ (ఐఎస్‌డి) గురించి తెలుసుకుందాం. ఈ రెండిటి గురించి తెలుసుకోవడం ద్వారా జిఎస్‌టి చట్టం యొక్క రూల్ 39ను సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. 

 

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ యొక్క అర్థం

ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే వస్తువుల  కొనుగోలు సమయంలో చెల్లించే పన్ను క్రెడిట్, అవుట్ పుట్‌లపై పన్ను చెల్లించే సమయంలో, చెల్లించాల్సిన పన్నుకు విరుద్ధంగా తీసుకోవచ్చు.

 

ఉదాహరణ – మిస్టర్ ఎక్స్ రూ. 100 + జిఎస్ టి 18 = రూ. 118 ఖరీదు చేసే వస్తువులను సరఫరా చేశారు అనుకుందాం. అది జరిపే సమయంలో, అతను ట్రక్కు రవాణా సేవల కోసం రూ. 20 + జిఎస్‌టి  2 = రూ.22కు ఖర్చు చేసాడు. ఇప్పుడు మిస్టర్ ఎక్స్ సంపాదనలో, ఎంత జిఎస్‌టి పడుతుంది?

 

సమాధానం – మిస్టర్ ఎక్స్ యొక్క జిఎస్టి లయబిలిటీ రూ. 16, ఇది దిగువ పేర్కొన్నవిధంగా లెక్కించబడుతుంది:

అవుట్‌పుట్ లయబిలిటీ - రూ. 18

తగ్గించాల్సిన మొత్తం: ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ - రూ.2

జిఎస్‌టి లయబిలిటీ = రూ.18-2 = రూ.16


 

జిఎస్‌టి చట్టం ప్రకారంగా ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఎవరు?

జిఎస్‌టిలో ఐఎస్‌డి అనగా - 

ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్‌కు జిఎస్‌టి కింద ఈ విధమైన బాధ్యతలు ఉంటాయి- 

  • ఒకే పాన్ కానీ విభిన్న జిఎస్‌టి నంబర్లు ఉన్న వివిధ బ్రాంచీలకు ఐఎస్‌డి ఐటిసిని పంపిణీ చేయాలి.
  • ఒక ఇన్‌వాయిస్ కేవలం ఐటిసి పంపిణీ కోసం అని స్పష్టంగా పేర్కొన్న ఐఎస్‌డి ఇన్‌వాయిస్ ను ఐఎస్‌డి జారీ చేయాల్సి ఉంటుంది.
  • ప్రతి బ్రాంచీ ఉపయోగించే సేవల కొరకు ఐఎస్‌డి ఇన్‌వాయిస్ లను అందుకుంటారు, మరియు ఐటిసిని ఐఎస్‌డి తన వివిధ బ్రాంచీలకు అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తారు.

ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కేవలం ఇన్‌వాయిస్ లపై మాత్రమే క్రెడిట్ ని పంపిణీ చేయగలరు, క్యాపిటల్ గూడ్స్ కొరకు కుదరదు.

జిఎస్‌టి పాలనలో ఐఎస్‌డి: 

సర్వీస్ ట్యాక్స్‌లో ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. జిఎస్‌టి నిబంధనల ప్రకారం ఐఎస్‌డిని విడిగా నమోదు చేయడానికి నిబంధనలు ఉన్నాయి. ఐఎస్‌డి యొక్క సాధారణ రిజిస్ట్రేషన్ కాకుండా ప్రత్యేక రిజిస్ట్రేషన్ పొందాల్సి ఉంటుంది. ఇతర అన్ని బ్రాంచీలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అవుట్‌పుట్ సర్వీసులను సప్లై చేసే బ్రాంచీలకు పంపిణీ చేయబడుతుంది.

  • ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఐఎస్‌డి ఇన్ వాయిస్ జారీ చేయాల్సి ఉంటుంది, దీనిలో ఈ ఇన్‌వాయిస్ కేవలం ఐటిసి పంపిణీకి మాత్రమే కారణమని పేర్కొనబడుతుంది. 
  • ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని ఐఎస్‌డి ద్వారా రెండుగా విభజించవచ్చు, అంటే అర్హత కలిగిన క్రెడిట్ మరియు అనర్హమైన క్రెడిట్‌గా.
  • ఒకవేళ గ్రహీత యూనిట్ ఐఎస్‌డి ఉన్న రాష్ట్రంలోనే ఉన్నట్లయితే, అప్పుడు సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సిజిఎస్‌టి) మరియు స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఎస్‌జిఎస్ టి) క్రెడిట్‌ని సిజిఎస్‌టి లేదా ఎస్‌జిఎస్‌టి లేదా కేంద్ర పాలిత ప్రాంత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (యుటిజిఎస్‌టి)గా పంపిణీ చేస్తారు. 
  • ఒకవేళ గ్రహీత యూనిట్ ఐఎస్‌డి ఉన్న రాష్ట్రంలో లేకపోతే, అప్పుడు సిజిఎస్‌టి లేదా ఎస్‌జిఎస్‌టి లేదా యుటిజిఎస్‌టి యొక్క క్రెడిట్ ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజిఎస్‌టి)గా పంపిణీ చేయబడుతుంది. 

పంపిణీ చేయాల్సిన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ యొక్క మొత్తం మొత్తాన్ని అధిగమించలేమని దయచేసి గమనించండి.

సాధారణ క్రెడిట్ పంపిణీపైన పేర్కొన్న యంత్రాంగాన్ని సిజిఎస్‌టి, ఎస్‌జిఎస్‌టి మరియు ఐజిఎస్ఎస్‌జిఎస్‌టిటి క్రెడిట్ కొరకు విడిగా ఉపయోగించాలి. దిగువ టేబుల్ ఐఎస్ఎస్‌జిఎస్‌టిడి ద్వారా పంపిణీ చేయాల్సిన క్రెడిట్ఎస్‌జిఎస్‌టిని సంక్షిప్తీకరించింది:

 

క్రెడిట్ పంపిణీ చేయాలి

ఐఎస్ డి మరియు గ్రహీత ఒకే రాష్ట్రంలో యూనిట్ కలిగి ఉన్న సందర్భంలో

గ్రహీత యూనిట్ ఐఎస్ డి ఉన్న రాష్ట్రంలో లేకపోతే.

సిజిఎస్‌టి

సిజిఎస్‌టి

ఐజిఎస్‌టి

ఎస్‌జిఎస్‌టి

 

ఎస్‌జిఎస్‌టి

ఐజిఎస్‌టి

ఐజిఎస్‌టి

ఐజిఎస్‌టి లేదా సిజిఎస్‌టి లేదా ఎస్‌జిఎస్‌టి

ఐజిఎస్‌టి

జిఎస్టి మరియు సర్వీస్ ట్యాక్స్ - ఈ రెండింటి కింద ఐఎస్‌డి పనితనం

  • ఎవరెవరు ఐఎస్‌డి కాగలరు?

మునుపటి పాలనలో, అంటే సర్వీస్ పన్ను కాలంలో,  ఒక తయారీదారు లేదా తుది ఉత్పత్తుల ఉత్పత్తిదారు లేదా సేవను అందించే వ్యక్తి  ఎవరైనా ఐఎస్‌డి  కావచ్చు. కానీ జిఎస్టి కింద, వస్తువులు లేదా సేవలు లేదా రెండింటి సరఫరాదారు ఎవరైనా ఐఎస్‌డి  కావచ్చు. 

కాబట్టి జిఎస్‌టి కింద ఐఎస్‌డి అంటే, సప్లై చేసే మరిన్ని రకాల వారిని చేర్చడం జరిగింది - (ఏదైనా అమ్మకం, ట్రాస్ఫర్, అద్దె, లీజ్ కి ఇచ్చే ఎవరైనా కాగలరు)

 

  • క్రెడిట్‌ని ఏ విధంగా పంచిపెట్టడం జరుగుతుంది?

సర్వీస్ ట్యాక్స్ పాలనలో, ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్‌లు, ఏదైనా సర్వీస్ కొనుగోలు చేసిన తర్వాత ఇన్ వాయిస్ అందుకొనేవారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యూనిట్లు లేదా బ్రాంచీల ద్వారా ఈ సేవలు వారు అందుకోవచ్చు. ఆ తరువాత, వివిధ బ్రాంచీలు/ఆఫీసుల మధ్య క్రెడిట్ పంపిణీ చేయడం కొరకు ఐఎస్ డి ఇన్ వాయిస్ లు లేదా బిల్లులు లేదా చలాన జారీ చేస్తారు.

దీనికి విరుద్ధంగా, జిఎస్టి పాలనలో, ఒక ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ బ్రాంచీలు ఉపయోగించే సేవల కొరకు ట్యాక్స్ ఇన్‌వాయిస్‌లను అందుకుంటారు.  అప్పుడు ఈ ఐఎస్‌డి వివిధ శాఖల మధ్య అనుపాత ప్రాతిపదికన క్రెడిట్ పంపిణీ కోసం జిఎస్టి నిబంధనల కింద సూచించిన ఐఎస్ డి ఇన్‌వాయిస్‌ను జారీ చేస్తారు

 

  • క్రెడిట్ ఏవిధంగా పంపిణీ చేయబడుతుంది? 

సర్వీస్ ట్యాక్స్ సమయంలో, ఇన్వాయిస్, బిల్లులు, లేదా చలానాలను ప్రొడ్యూసర్లకు, లేదా ప్రొవైడర్లకు జారీ చేయడం ద్వారా క్రెడిట్‌ని ఇచ్చేవారు. అయితే, జి‌ఎస్‌టి సిస్టమ్ వచ్చిన తర్వాత, పైన పేర్కొన్న ఆఫీసుకు ఉన్న అదే పాన్ నంబరు ఉండి, పన్ను వర్తించబడే గూడ్స్/సర్వీసులు సప్లై చేసే వ్యక్తికీ ఐఎస్‌డి ఇన్వాయిస్ జారీ చేయడం ద్వారా పంపిణి జరుగుతుంది. 

 

  • పాత మరియు కొత్త పాలనలో పంపిణీ చేయగల పన్ను క్రెడిట్ రకం ఏమిటి?

సర్వీస్ ట్యాక్స్ పాలనలో, సర్వీస్ ట్యాక్స్ యొక్క క్రెడిట్ పేర్కొనబడ్డ సర్వీస్ లపై చెల్లించబడేది, కానీ జిఎస్టి పాలనలో పేర్కొన్న సేవలపై సిజిఎస్టి (లేదా ఎస్ జిఎస్టి) మరియు ఐజిఎస్టి యొక్క క్రెడిట్ చెల్లించబడుతుంది.

 

  • దానిని ఎవరెవరికి పంపిణీ చేయవచ్చు?

సర్వీస్ ట్యాక్స్ పాలనలో, క్రెడిట్‌ని అదే ఒకే పాన్ కలిగిన అవుట్ సోర్సింగ్ తయారీదారులు మరియు సప్లయర్‌లకు ఇవ్వవచ్చు. కానీ, జిఎస్టి పాలనలో, క్రెడిట్ అవుట్ సోర్సింగ్ తయారీదారులు లేదా సర్వీస్ ప్రొవైడర్లకు పంపిణీ చేయబడదు.

రెండు పాలనల మధ్య తేడాను గమనిస్తే, ఒకే పాన్ కలిగి పనిచేసే ఆఫీసులకు మాత్రమే క్రెడిట్ పంపిణీ చేయబడుతుంది. ఇది తయారీ నుండి కాక, సరఫరా సమయం నుండి పన్ను వర్తించేలా చేయడం వల్ల కావచ్చు. అలాగే, సప్లై చేసే సమయం నుండే పన్ను చెల్లించమంటారు కాబట్టి, దాన్ని ఐఎస్‌డి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ వాడి చెల్లించగలుగుతారు. 

 

రూల్ 39 ప్రకారం ఐఎస్‌డి ద్వారా నెరవేర్చాల్సిన కండిషన్లు

 

రిజిస్ట్రేషన్ సంబంధిత రూల్: సాధారణ పన్ను చెల్లింపుదారుగా జిఎస్‌టి కింద రిజిస్ట్రేషన్ కాకుండా ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ తప్పనిసరిగా "ఐఎస్‌డి"గా నమోదు చేసుకోవాలి. దీనిని  ఐఎస్‌డిగా ఆర్‌ఈజి-01 ఫారంలో సీరియల్ నెంబరు 14 కింద పేర్కొనాలి. పైన పేర్కొన్న ఫారంలో డిక్లరేషన్ చేసిన తరువాత మాత్రమే గ్రహీత యూనిట్‌లకు క్రెడిట్ పంపిణీ అనుమతించబడుతుంది.

ఇన్ వాయిస్ సంబంధిత రూల్:  ఐఎస్‌డి ఇన్‌వాయిస్ జారీ చేయడం ద్వారా ఇంతకు ముందు చెప్పినట్లుగా ఐఎస్‌డి పన్ను క్రెడిట్ మొత్తాన్ని గ్రహీతలకు పంపిణీ చేయగలరు.

దీనిని కూడా చదవండి: నిల్ జిఎస్‌టి రిటర్న్ ఫైల్ చేయడం ఎలాగో తెలుసుకోండి

రిటర్న్ ఫైలింగ్‌కి సంబంధించిన - సిజిఎస్‌టి/ఎస్‌జిఎస్‌టి రూల్స్ యొక్క రూల్ 39:

  • ప్రతి నెలా రిటర్న్ ఫైలింగ్‌కు సంబంధించిన కండిషన్లను కూడా ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ పాటించాల్సి ఉంటుంది. 
  • ప్రతి నెలా జిఎస్టిఆర్6 ను ఐఎస్‌డి దాఖలు చేయాలి. సాధారణంగా, దీనిని వచ్చే నెల 13వ తేదీలోగా సమర్పించాలి. ప్రభుత్వం మాత్రమే తేదీని పొడిగించగలదు. 
  • ఇది కాకుండా, కొనుగోలు ఇన్‌వాయిస్‌ల క్రెడిట్‌ని ప్రతి నెలా దాఖలు చేయాల్సిన జిఎస్‌టిఆర్3బిలో తీసుకోవచ్చు. ఈ కొనుగోళ్లను జిఎస్టిఆర్2ఎ ఫారం నెంబరు నుంచి వెరిఫై చేయవచ్చు.
  • జిఎస్‌టిఆర్ 9 మరియు జిఎస్టిఆర్ 9సి దాఖలు చేయడానికి ఐఎస్‌డి అవసరం లేదు.  అంటే వార్షిక రిటర్న్ దాఖలు చేయడానికి ఐఎస్‌డి అవసరం లేదు.

రివర్స్ ఛార్జ్ యొక్క బిల్లులను ఐఎస్‌డి వారు తీసుకోలేరు. కారణం ఐఎస్‌డి సదుపాయం కేవలం క్రెడిట్ పంపిణీ కోసం మాత్రమే.

 

సిజిఎస్‌టి/ఎస్‌జిఎస్‌టి నిబంధనల యొక్క రూల్ 39 - ఐఎస్‌డి ద్వారా ఐటిసిని ఎలా పంపిణీ చేయాలి?

సిజిఎస్ టి నిబంధనల యొక్క రూల్ 39 ప్రకారం ఐఎస్ డి ద్వారా ఐటిసి పంపిణీ చేయబడుతుంది. దిగువ పేర్కొన్న విధంగా పంపిణీ చేయబడుతుంది-

(ఎ) ఒక నిర్ధిష్ట నెల క్రెడిట్‌ని ఆ నిర్ధిష్ట నెలలో మాత్రమే పంపిణీ చేయాలని, మరియు ఫారం జిఎస్‌టిఆర్ 6 సాయంతో జిఎస్‌టి పోర్టల్ పై సమాచారాన్ని అందించాలని గమనించండి.

(బి) అర్హత లేని సర్వీస్ మరియు అర్హత కలిగిన సర్వీస్ యొక్క ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని విడిగా సూచించాలి, ఎందుకంటే అర్హత కలిగిన సేవలకు మాత్రమే క్రెడిట్ తీసుకోబడుతుంది.

(సి) క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ యొక్క నిర్ధిష్ట ఫార్ములా/మేనరిజం - 

ఇన్‌పుట్ సర్వీసుల కొరకు పొందే క్రెడిట్ ఒకటి కంటే ఎక్కువ మంది గ్రహీతలకు ఆపాదించబడుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో గ్రహీత టర్నోవర్ ఆధారంగా అటువంటి గ్రహీతలకు క్రెడిట్ ప్రో-రాటా పంపిణీ చేయబడుతుంది.

క్రెడిట్ పంపిణీ చేయాల్సిన యూనిట్లలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ యూనిట్లకు గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ లేదని అనుకుందాం. అలాంటప్పుడు, గత త్రైమాసికం యొక్క టర్నోవర్ కొరకు గ్రహీతల టర్నోవర్ యొక్క వివరాలు ప్రతి నెల ముందు లభ్యం అవుతాయి, దీనిలో క్రెడిట్ పంపిణీ చేయబడుతుంది, టర్నోవర్ లెక్కించడానికి ఉపయోగించబడుతుంది.

ఇది ఈ క్రింది సూత్రమును ఉపయోగించి లెక్కించవలసిన మొత్తం, "C1"-

C1 = (t1÷T) × C

 

ఇక్కడ

"C" అనేది పంపిణీ చేయాల్సిన మొత్తం క్రెడిట్.

"T1" అనేది సంబంధిత కాలంలో నిర్ధిష్ట గ్రహీత యొక్క టర్నోవర్, మరియు

"T" అనేది గ్రహీతలందరి యొక్క మొత్తం టర్నోవర్ 

 

(డి) ఐజిఎస్‌టి కారణంగా ఐటిసిని ప్రతి రిసీవర్‌కు ఐజిఎస్‌టి యొక్క ఐటిసిగా పంపిణీ చేయాలి;

(ఇ) ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఒక ఐఎస్‌డి ఇన్‌వాయిస్ జారీ చేయబడుతుంది, దీనిలో ఈ ఇన్‌వాయిస్ కేవలం ఐటిసి పంపిణీకి మాత్రమే కారణం అని స్పష్టంగా పేర్కొనబడింది. 

(ఎఫ్) ఒకవేళ ఏదైనా ఐఎస్‌డి సప్లయర్ నుంచి ఏదైనా డెబిట్ నోట్ అందుకున్నట్లయితే, అదే నెలలో డెబిట్ నోట్‌ని విధిగా ఫైల్ చేయాలి.

(జి) అందుబాటులో ఉన్న ఐటిసి మొత్తాన్ని తగ్గించే క్రెడిట్ నోట్‌ను ఐఎస్‌డి అందుకున్నట్లయితే, ఒరిజినల్ ఇన్‌వాయిస్ ఆధారంగా క్రెడిట్ పొందిన గ్రహీతలకు ఐఎస్‌డి క్రెడిట్ నోట్ జారీ చేయాలి. ప్రాథమిక క్రెడిట్‌ని పంచిన అదే నిష్పత్తిలో క్రెడిట్ నోట్ జారీ చేయాలి. ఐఎస్‌డి యొక్క జిఎస్‌టిఆర్6ఎలో క్రెడిట్ నోటేషన్ కనిపించే అదే నెలలో ఐఎస్‌డి క్రెడిట్ జారీ చేయబడదు. 

(హెచ్) ఇన్‌పుట్ సేవల కొరకు క్రెడిట్ ఒకే గ్రహీతకు ఆపాదించబడినప్పుడు, ఆ గ్రహీత క్రెడిట్‌ని అందుకుంటాడు. ఉదాహరణకు, మహారాష్ట్రలోని ఒక ఐఎస్‌డి కోల్‌కతాలోని ఒక బ్రాంచీలో డెలివరీ చేయబడ్డ ఐటి మెయింటెనెన్స్ సర్వీసుల కొరకు ఇన్‌వాయిస్ అందుకున్నట్లయితే, ఆ క్రెడిట్ కోల్‌కతా బ్రాంచీకి మాత్రమే పంపిణీ చేయబడుతుంది. 

సిజిఎస్‌టి చట్టంలోని సెక్షన్ 16 కింద, జిఎస్‌టిలో పొందిన క్రెడిట్ కొరకు ఒక ముఖ్యమైన ప్రమాణం ఏమిటంటే, సప్లయర్ సర్వీసును కచ్చితంగా అందుకొని ఉండాలి. ఫలితంగా, సేవ యొక్క వాస్తవ గ్రహీతకు మాత్రమే క్రెడిట్ అందుబాటులో ఉండాలి.

 

ఒక ఉదాహరణతో జి.ఎస్.టి ఇన్ పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్: 

దిగువ పేర్కొన్నవిధంగా ఎబిసి లిమిటెడ్ కు విభిన్న యూనిట్ లు ఉన్నాయని ఊహించండి.

1. కేరళలోని మున్నార్ లో ఇండస్ట్రియల్ యూనిట్; 2020-21 నుండి మూసివేయబడింది, టర్నోవర్ లేదు.

2. ఊటీలో యూనిట్; 2020-21లో రూ. 120 కోట్ల టర్నోవర్;

3. తెలంగాణ లోని అదిలాబాద్ లో సేవా కేంద్రం; 2020-21లో రూ. 12 కోట్ల టర్నోవర్;

4. తమిళనాడులోని కాంచీపురం చెన్నై లో సేవా కేంద్రం; 2020-21 లో 18 కోట్ల టర్నోవర్;

 

ఎబిసి లిమిటెడ్ యొక్క కార్పొరేట్ కార్యాలయం ఐఎస్‌డిగా పనిచేస్తుంది. ఇది డిసెంబర్ 2021కి గాను 18 లక్షల రూపాయల ఐటిసిని పంపిణీ చేయాలి. ఊటీలో ఉన్న టెక్నికల్ కన్సల్టెన్సీకి  యూనిట్ కొరకు రూ. 6 లక్షల పన్నుతో కూడిన ఇన్‌వాయిస్ వెళ్ళింది. ఇప్పుడు క్రెడిట్ యొక్క పంపిణి ఎలా జరుగుతుంది? 

సిజిఎస్‌టి నిబంధనల రూల్ 39 ప్రకారం, రూ. 6 లక్షల క్రెడిట్ ఊటీ యూనిట్‌కు ఆపాదించబడుతుంది, మరియు ఇది సెకెండ్ 20(2) (సి) ప్రకారం మాత్రమే ఊటీ యూనిట్‌కు బదిలీ చేయబడుతుంది. మిగిలిన రూ. 12 లక్షల నుంచి, గూడ్స్ మరియు సర్వీసులను సరఫరా చేసే గ్రహీతలకు మాత్రమే ఐటిసి పంచబడుతుంది కనుక మున్నార్ యూనిట్ కు ఎలాంటి క్రెడిట్ ఇవ్వబడదు. ఊటీ యూనిట్ కు, అదిలాబాద్, కాంచీపురంలోని సేవా కేంద్రాలకు రూ.12 లక్షలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో - 2020-21 లో వారి స్థూల ఆదాయం ఆధారంగా ఇది జరగాలి.

  • ఊటీ యూనిట్ (120 కోట్లు/ 150 కోట్లు) ఎక్స్ 12 లక్షలు = రూ. 9.6 లక్షలు;
  • అదిలాబాద్ సర్వీస్ సెంటర్ కు (12 కోట్లు/150 కోట్లు) ఎక్స్ 12 లక్షలు = రూ. 96,000; మరియు
  • కాంచీపురం సేవా కేంద్రానికి (18 కోట్లు/150 కోట్లు) ఎక్స్ 12 లక్షలు = రూ. 1,44,000 లభిస్తుంది.

 

ముగింపు

అందువల్ల, ఐఎస్‌డి అనేది అనేక భాగస్వామ్య ఖర్చులతో వ్యాపారాలకు అందుబాటులో ఉన్న సేవ, ఇది ఇన్‌వాయిసింగ్ మరియు చెల్లింపును ఒకే ప్రదేశంలో చేయడానికి అనుమతిస్తుంది.  ఈ వ్యవస్థ యొక్క ప్రధాన ఉద్దేశ్యం వ్యాపారాలకు క్రెడిట్ తీసుకునే ప్రక్రియను సులభతరం చేయడం మరియు జిఎస్టి పాలనలో క్రెడిట్ సజావుగా ప్రవహించేలా చూడటం. ఫలితంగా, సిజిఎస్టి/ఎస్‌జిఎస్‌టి నిబంధనల యొక్క రూల్ 39 ఇన్‌పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లను ఎలా పంపిణీ జరుగుతుందో మనం తెలుసుకున్నాం.

తరుచుగా అడిగే ప్రశ్నలు

ప్రశ్న: ఒక ఐఎస్ డి ద్వారా క్రెడిట్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మ్యానరిజాన్ని వివరించండి?

సమాధానం:

ఈ అవసరమైన సమాచారాన్ని కలిగి ఉన్న డాక్యుమెంట్ కు బదులుగా క్రెడిట్ ని ఇవ్వవచ్చు.

పంపిణీ చేయాల్సిన మొత్తం క్రెడిట్ లభ్యం అయ్యే మొత్తం క్రెడిట్ మొత్తాన్ని మించరాదు.

ఒక ఇన్ పుట్ సర్వీస్ పై క్రెడిట్ ని ఒక నిర్ధిష్ట క్రెడిట్ గ్రహీతకు ఆపాదించినప్పుడు, ఆ క్రెడిట్ ఆ వ్యక్తికి మాత్రమే బదిలీ చేయాలి.

ఒకవేళ ఇన్ పుట్ సర్వీస్ కొరకు క్రెడిట్ ఒకటి కంటే ఎక్కువ గ్రహీతలు లేదా గ్రహీతలందరికీ ఆపాదించబడింది అనుకుందాం.  అటువంటి పరిస్థితుల్లో, అటువంటి లబ్ధిదారుల టర్నోవర్ ఆధారంగా సంబంధిత కాలంలో వర్తించే అటువంటి గ్రహీతలందరి యొక్క మొత్తం క్రెడిట్ వారి మధ్య ప్రో-రాటా ప్రాతిపదికన కేటాయించబడుతుంది.

కానీ ప్రస్తుత సంవత్సరంలో, ఆ క్రెడిట్ గ్రహీతలు పనిచేస్తూ ఉండాలి

ప్రశ్న: ఒకటి కంటే ఎక్కువ గ్రహీతలు ఉన్నట్లయితే రూల్ 39 ప్రకారం క్రెడిట్ ఏవిధంగా పంపిణీ చేయబడుతుంది?

సమాధానం:

ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ మంది గ్రహీతలు ఉన్నట్లయితే, గత ఆర్థిక సంవత్సరంలోలో ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో గ్రహీత టర్నోవర్ ఆధారంగా అటువంటి గ్రహీతల్లో క్రెడిట్ ని ప్రో-రాటా విధానంలో పంపిణీ చేస్తారు.

ప్రశ్న: గత ఆర్థిక సంవత్సరంలో యూనిట్ టర్నోవర్ లేనట్లయితే ఏమిటి?

సమాధానం:

గత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ లేనట్లయితే, క్రెడిట్ పంపిణీ నెలకు ముందు చివరి త్రైమాసికం యొక్క టర్నోవర్ ని పరిగణిస్తారు.

ప్రశ్న: క్రెడిట్ పంపిణీ చేయడానికి జిఎస్ టి చట్టం యొక్క రూల్ 39 కు అనుగుణంగా ఐఎస్ డి నెరవేర్చాల్సిన కొన్ని కండిషన్లు ఏమిటి?

సమాధానం:

జిఎస్ టి రిజిస్ట్రేషన్ మాత్రమే కాకుండా ఐఎస్ డి గా ప్రత్యేక రిజిస్ట్రేషన్ పొందాలి, ఐఎస్ డి ఇన్ వాయిస్ జారీ చేస్తూ అవసరమైన రిటర్న్ లను ఫైల్ చేయాలి.

ప్రశ్న: ఒక ఐఎస్ డి స్వయంగా ఐఎస్ డి ఇన్ వాయిస్ జారీ చేయాల్సి ఉంటుందా?

సమాధానం:

ఇన్ పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఐఎస్ డి ఇన్ వాయిస్ జారీ చేయాల్సి ఉంటుంది, దీనిలో ఈ ఇన్ వాయిస్ కేవలం ఐటిసి పంపిణీ కి మాత్రమే కారణమని స్పష్టంగా పేర్కొనబడుతుంది.

ప్రశ్న: సిజిఎస్ టి యొక్క రూల్ 39 ఏమి చెబుతుంది?

సమాధానం:

సిజిఎస్టి యొక్క రూల్ 39 ఇన్ పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ లు తమ ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ ని పంపిణీ చేసే ప్రక్రియను పేర్కొంటుంది.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.