written by Khatabook | February 17, 2022

గృహిణుల కొరకు ఇంటి నుండి చేయగల బిజినెస్ ఐడియాలు

×

Table of Content


మార్కెట్లు పెరిగాయి, అలాగే డబ్బు సంపాదించే ఆలోచనలు కూడా పెరిగాయి. ఈ రోజుల్లో సర్టిఫికేట్ ల కంటే అనుభవం అలాగే నాలెడ్జ్ కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పరిమాణం కంటే, నాణ్యతకు డిమాండ్ బాగా పెరిగింది. తమకు నచ్చిన క్వాలిటీ కోసం, కాస్త ఎక్కువైనా సరే జనం ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. అలాగే, టెక్నాలజీ ఇంకా ఇంటర్నెట్ కారణంగా, వ్యాపారాలు భౌగోళిక హద్దులను మీరి బిజినెస్ చేయగలుగుతున్నాయి. కాబట్టి, ప్రస్తుత కాలంలో, మీకు ఉన్న నైపుణ్యానికి పని పెట్టి, ఇంటర్నెట్ బిజినెస్ చేయడానికి ఇది సరైన సమయం. మీరు గనుక ఇంటి వద్ద ఉండే గృహిణి అయితే, మీరు ఇంటి నుండే చేయగల కొన్ని వ్యాపారాల గురించి ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకుందాం.  

 

మీకు తెలుసా, గూగుల్ కి మొదట పెట్టిన పేరు బ్యాక్ రబ్. 

 

గృహిణులకు 10 అద్భుతమైన బిజినెస్ ఐడియాలు

 

  1. బేకరీ మరియు కేకే తయారు బిజినెస్ 

ఈ కరోనా సమయంలో బాగా పెరిగిన వ్యాపారాలలో బేకరీ వ్యాపారం. ఎలాంటి వేడుకలో అయినా, తప్పకుండ ఉండాల్సినది కేక్. ఎవరైనా సరే, కేకులు, బేకింగ్ లాంటివి చేయడం సులభంగా నేర్చుకోగలరు. అలాగే, వాటాకోసం అయ్యే ఖర్చు కూడా ఎక్కువ ఉండదు. ఇంటి నుండే తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టగల వ్యాపారం ఇది. 

 

అలాగే, మీకు మంచి నైపుణ్యం ఉంటే, ఇంటి నుండే ఇతరులకు బేకింగ్ నేర్పించగలరు కూడా. అలాగే, కేకులు డెకరేషన్ చేయడం కూడా ఇప్పుడు డిమాండ్ పెరుగుతున్న పని. మీరు మీ దగ్గర బంధువులు, మిత్రులు, ఇంకా సన్నిహితులకు విక్రయిస్తూ మీ వ్యాపారాన్ని నెమ్మదిగా విస్తరించుకోవచ్చు. ముఖ్యంగా మీ కేకులు క్వాలిటీ ద్వారా ఒకరి నుండి ఒకరికి తెలిసే విధంగా పేరు సంపాదించుకోవచ్చు. దానికి పైన, కాస్త మార్కెటింగ్ చేస్తే, మరిన్ని ఆర్డర్లు పొందగలరు. 

 

పెట్టుబడి ఇంకా లాభాలు: ఇంటి నుండి చేయగల ఈ వ్యాపారానికి మీరు 10,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

 

  1. చేతితో చేసిన వస్తువులు

వ్యక్తిగతీకరించబడిన బహమతులకు కూడా ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగింది. ఏదో ఇచ్చాము అన్న ఫార్మాలిటీకి రెడీమేడ్ బహుమతులు కొని ఇచ్చే రోజులు దాదాపుగా పోయాయి. నేడు, ప్రజలు ఆప్యాయత మరియు శ్రద్ధ చూపించడానికి తమ ప్రియమైనవారికి చేతితో తయారు చేసిన వస్తువులను ఇవ్వడానికి ఇస్తాడుతున్నారు. ఇష్టపడుతున్నారు. మీరు హస్తకళల్లో సృజనాత్మకత ఉన్న వ్యక్తి అయితే, మీ అభిరుచిని వ్యాపార ఆలోచనగా మార్చడానికి ఇది ఒక మార్గం. 

 

ప్రత్యేక ప్యాకేజింగ్ తో రూపొందించబడి మంచి డిమాండ్ కలిగి ఉండే చేతితో తయారు చేసిన ఉత్పత్తులు ఎవరికైనా బాగా నచ్చుతాయి. ఇవి పెయింటింగ్లు, ఆభరణాలు, కొవ్వొత్తులు, ఇంటి-డెకార్లు, దుస్తులు ఏవైనా కావచ్చు. మీ నైపుణ్యం ద్వారా సంపాదన ఆర్జించడానికి ఇది అద్భుతమైన మార్గం. 

 

పెట్టుబడి: మీరు పెట్టాల్సిన పెట్టుబడి వ్యాపారం కోసం మీరు వాడబోయే వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. అది కేవలం ₹500/- నుండి ₹10,000/- మధ్య ఎంతైనా కావొచ్చు. మీ ఉత్పత్తి యొక్క క్వాలిటీ పై మీ లాభాలు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా, స్వయంగా చేతులతో చేసిన వస్తువులకు రేటు ఎక్కువ ఉండడంతో, లాభాలు ఎక్కువ సంపాదించగలం. 

3. క్యాటరింగ్ బిజినెస్ లేదా హోమ్ డెలివరీ

 

మీకు వంట చేయడం ఇష్టమైతే, మంచి వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి వీలవుతుంది. బిజీగా నడిచే ఈ రోజుల్లో, వంట వండుకునే సమయం, సదుపాయం చాలా మందికి దొరకదు. కాబట్టి చాలామంది హోటళ్లు, రెస్టారెంట్ల నుండి ఆర్డర్ చేసుకొని తినడం అలవాటైపోయింది. కారణంగా ఆరోగ్యం పాడైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇంటి దగ్గర చేయబడిన ఆహారానికి డిమాండ్ బాగా పెరుగుతుంది. కాబట్టి మిగతా వాటితో పోల్చితే ఇంటి దగ్గర చేయబడే వంటలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. కాబట్టి, మీకు వంటలు బాగా వచ్చినట్లయితే, వ్యాపారాన్ని మొదలెట్టి మంచి లాభాలు సంపాదించగలరు. ఆఫీసుకు వెళ్లే వారికి టిఫిన్ వండడం, మీ స్వంత క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడం కూడా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీకు తగినంత ఆదాయాన్ని తెస్తుంది. 

 

వంట తరగతులకు కూడా భారీ డిమాండ్ ఉంది కాబట్టి గృహిణులకు బాగా సంపాదించడానికి అవకాశం ఉంది. 


 

పెట్టుబడి: క్యాటరింగ్ బిజినెస్ కోసం, మీరు కనీసం 1000 రూపాయలతో ముందు అడుగు వేయొచ్చు. కాకపోతే, మీరు వాడే సామాన్లు, ఇంకా ఇతర వంట దినుసులకు, వంటలను బట్టి ఖర్చు చేయాల్సి ఉంటుంది.


 

4. డేకేర్ సెంటర్ మరియు పెంపుడు జంతువులను చూసుకొనే సర్వీసులు

తల్లితండ్రులు ఇద్దరూ ఆఫీసులకు వెళ్లాల్సి వస్తున్నా ఈ రోజుల్లో, పిల్లల డేకేర్ సెంటర్లకు మంచి డిమాండ్ ఉంది. అలాగే, పెంపుడు జంతువులను పెంచుకొనే వారు కూడా, తమ జంతువులను ఇళ్లలో ఒంటరిగా వదలడానికి బదులు, పెట్ కేర్ సెంటర్ల వైపు చూస్తున్నారు. మీరు గనుక పిల్లల్ని  బాగా చేసుకోగల నైపుణ్యం ఉన్నవారు అయితే, మీరు డేకేర్ సెంటర్ ప్రారంభించవచ్చు. ఇందుకు గాను, మీరు టవల్స్, న్యాప్కిన్స్, బట్టలు, బొమ్మలు, పిల్లలు పడుకోవడానికి పక్కలు లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. కొంత పెట్టుబడి, సరైన నైపుణ్యం ఉంటే పిల్లల్ని చూసుకోవడం చాలా సులభం అవుతుంది. 

 

అలాగే జంతువుల విషయంలో కూడా చేయవచ్చు. కాకపోతే, ఇక్కడ మీరు కొన్ని విషయాలను వేరుగా చేయాల్సి ఉంటుంది. మొదటిగా జంతువులను సురక్షితంగా, వాటికి ఇష్టం పుట్టే విధంగా ఆడిస్తూ చూసుకుంటూ, వాటి గ్రూమింగ్ కు చూసుకోవాలి. ఒక్కొక్క జంతువుకు, ఒక్కో విధమైన అవసరం ఉంటుంది. కాబట్టి ఓనర్ల నుండి అవన్నీ తెలుసుకుని, వాటికీ కావాల్సిన మందులు, సరిపడే ఆహరం లాంటివి ఏర్పరచుకోవాలి. మీకు ఎదురయ్యే కష్టం ఇక్కడే ఉంటుంది. మీకు ఇంతకు ముందు జంతువులను చూసుకున్న అనుభవం ఉంటే, మీరిది సులభంగా చేయగలరు. 

పెట్టుబడి: పిల్లల డేకేర్ కోసం, మీరు ₹10,000 నుండి ₹20,000/- రూపాయల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక మీ లాభం మీరు అంత మంది పిల్లల్ని చూసుకుంటారు, అలాగే వారికీ ఎంత ఫీజు తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. 

 

జంతువుల కేర్ విషయంలో, ₹20,000 నుండి ₹30,000 వరకు పెట్టుబడి అవసరం అవ్వొచ్చు. ఎన్ని జంతువులు, ఏ జాతి జంతువులు అలాగే వాటికీ పెట్టె ఆహరం ఎలాంటిది అనేదానిపై మీ లాభం ఆధారపడి ఉంటుంది. 

 

5. ఆన్లైన్ కన్సల్టెన్సీ 

ఈ రోజుల్లో, ప్రతీఒక్కరు కన్సల్టెన్సీల సహాయం కొరకు చూస్తున్నారు. అది వ్యాపార విషయమైనా, ఆరోగ్య విషయమైనా, లేక జీవిత బంధాల కొరకు, పని, విద్య ఇంకా దేనికోసమైన కావచ్చు. అన్ని విషయాలలో, సహాయం చేయగల వారి కొరకు జనం చూస్తున్నారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సైకాలజీపై ఆవాహన, సంబంధిత రంగం పై జ్ఞానం ఉన్నవారు తమ సొంత కన్సల్టెన్సీని ప్రారంభించడానికి వీలవుతుంది. ఒక ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ ప్రారంభించడానికి, మీకు సరిపడా డిగ్రీ, సర్టిఫికెట్లు, ఆర్థిక బలం ఇంకా ట్యాక్ విధానాలు కచ్చితంగా ఎలాగో ఉండాలి. కాబట్టి అవసరమైన అన్ని విషయాలపై మీకు తగిన అవగాహనా ఏర్పరుచుకున్న తర్వాతే ముందడుగు వేయడం మంచిది. మీరు ఫోన్స్, వ్యక్తిగత అపాయింట్మెంట్, వెబ్ క్లాసులు మొదలైన విధానాలలో మీ సర్వీసులను అందించవచ్చు. 

 

అంతేకాక, మీ కోర్స్ లను ఆన్లైన్ లో వీడియో, లేదా ఆడియో ఫార్మాట్ లలో విక్రయించడానికి కూడా వీలవుతుంది. సరైన మార్కెటింగ్ చేయగలిగితే, అవసరమున్న వారిని చేరగలిగి, మంచి సేల్స్ చేయడానికి వీలవుతుంది. 

 

పెట్టుబడి: దీనికి మీరు సున్నా పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఆపై, ఎంతగా పెంచాలనే దాన్ని బట్టి మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. మీకు దొరికే క్లయింట్స్ ఇంకా వారి నుండి తీసుకొనే ఫీజు ఆధారంగా మీ లాభాలు ఉంటాయి. 

 

6. YouTube ఛానల్ లేదా బ్లాగింగ్

ప్రస్తుత రోజుల్లో, అద్భుతమైన, ఆసక్తికరమైన కంటెంట్ రాజ్యమేలుతుంది. విషయం తెలిసిన ఎవరైనా, తమ ఆలోచనలను, జ్ఞానాన్ని ప్రపంచానికి ఇంటర్నెట్ సహాయంతో చేరవేయవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ రైటింగ్ లేదా యూట్యూబ్ ఛానెల్ ద్వారా, మీరు ప్రజలకు అవగాహన కల్పించగలరు.  టెక్నాలజీ, ఆధ్యాత్మిక, ప్రేరణాత్మక, ఆరోగ్యం, ఫిట్ నెస్, విద్య, నైపుణ్యాలు, స్వయం సహాయం, కళ, సంస్కృతి, గానం మరియు నృత్యం మొదలైన విషయాలపై మీరు కంటెంట్ చేయవచ్చు. వీక్షకులు, చందాదారులు, పెయిడ్ కొలాబరేషన్ లు, ప్రకటనలు మొదలైనవాటితో మీరు ఆర్థికంగా ఎదగడానికి సహాయపడుతుంది. అందువల్ల, ఇంట్లో ఉండే మహిళలకు ఇది గొప్ప అవకాశం.

 

పెట్టుబడి మరియు లాభాలు: ఇక్కడ అతి తక్కువ పెట్టుబడితో పనిని ప్రారంభించవచ్చు. మంచి ఇంటర్నెట్ కనెక్షన్ మరియు నాలెడ్జ్ ఉంటే చాలు. కంటెంట్ యొక్క నాణ్యత మరియు మీరు పొందే ఫాలోవర్ లను బట్టి లాభాలు మారతాయి.


 

7. డిజిటల్ మార్కెటింగ్, అనుబంధ మార్కెటింగ్, మరియు ఫ్రీలాన్సింగ్

ఆన్ లైన్ మార్కెటింగ్ మరియు వ్యాపారంలో పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలలో ఉత్పత్తులు మరియు సేవలను అందుబాటులో ఉంచింది. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇది జరిగేలా చేసిన ఒక విషయం. ప్రజలు కొత్త ఉత్పత్తులు మరియు సేవలను ఆకర్షణీయంగా కనుగొన్నట్లయితే వాటిని కొనడానికి ఇష్టపడతారు. డిజిటల్ మార్కెటింగ్ అదే జరిగేలా చేస్తుంది. చిన్న ప్రచార వీడియోల ద్వారా, ఆకర్షణీయమైన వివరణలు, ఉత్పత్తులు మరియు సేవలు వివిధ వెబ్ పేజీలు, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు మొదలైన వాటిలో ఇంటర్నెట్ లో అందించబడి ప్రచారం చేయబడతాయి. మీరు ఇతర వ్యాపారాల ఉత్పత్తులను ప్రోత్సహించి వాటి కొనుగోళ్లపై మీరు అనుబంధ మార్కెటింగ్ సహాయంతో సంపాదన ఆర్జించవచ్చు. అలాగ వినియోగదారులకు సరైన సేవలను ఎలా అందించాలని అర్థం చేసుకోవడానికి మీరు కృత్రిమ మేధస్సు లేదా ఎఐ సాఫ్ట్ వేర్ ను కూడా ఉపయోగించవచ్చు, తద్వారా అమ్మకందారుల కోసం వ్యాపారాన్ని సులభతరం చేయవచ్చు.


 

ఫ్రీలాన్సింగ్ అనేది మరో ఆదాయ వనరు. గృహిణిలు ఆదాయాన్ని సంపాదించడానికి ఇది ఇంకొక మంచి మార్గం. ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా తమ క్లయింట్ కొరకు పని చేసి మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. తమ అవసరాలకు తగిన ప్రజలను పనిలో పెట్టుకొని, అనుభవజ్ఞులైన వారి సేవలకు మంచి మొత్తాన్ని చెల్లించడానికి ఎన్నో కంపెనీలు సిద్ధంగా ఉండడంతో ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అయింది. 

 

పెట్టుబడి మరియు లాభాలు: ఒక మంచి ఇంటర్నెట్ కనెక్షన్ మరియు పనిని నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలు మాత్రమే అవసరం. లాభాలు మీ వద్ద ఉన్న ఖాతాదారుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. మీరు చేస్తున్న పనిని బట్టి ఇది ప్రతి క్లయింట్ కు ₹ లక్ష వరకు లాభం పొందవచ్చు. 

 

8. యోగా శిక్షణ

 

మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఫిట్ నెస్ మరియు ఆరోగ్యంపై ప్రజలలో చాలా ప్రాముఖ్యత ఏర్పడింది.  యోగాను ఒక జీవన కళగా చూస్తుంటారు. అయితే, ప్రజలు ఈ జీవన కళను అభ్యసించడం కంటే సమయం మరియు డబ్బును సరదాకి గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ సమస్యలపై మీకు మంచి నాలెడ్జ్ మరియు అనుభవం ఉన్నట్లయితే, గృహిణులకు ఇది భారతదేశం యొక్క అత్యుత్తమ వ్యాపార ఆలోచనలలో ఒకటి అనొచ్చు. కాబట్టి యోగా శిక్షకులిగా మారవచ్చు. మీకు కావలసిందల్లా యోగాకు సంబంధించిన జ్ఞానం మరియు నైపుణ్యాలు. అప్పడు మీరు ఫిట్ నెస్ ఔత్సాహికులకు వ్యక్తిగతీకరించబడిన శిక్షణ ఇవ్వవచ్చు.

 

పెట్టుబడి: కనీసం ₹500 నుంచి గరిష్టంగా ₹5000 పెట్టుబడి


 

9. ఆన్ లైన్ ట్యూషన్లు 

 

అర్థం చేసుకోదగిన మరియు ఆహ్లాదకరమైన రీతిలో దేనినైనా వివరించడం చాలా అష్టమైన పని.  మీకు గనుక ఈ నైపుణ్యం ఉంటే, ఆన్ లైన్ ట్యూటరింగ్ చేయడం ఒక గృహిణిగా చాలా మంచి ఆలోచన. ప్రారంభంలో, మీరు మీ జూనియర్ల కొరకు క్లాసులు నిర్వహించవచ్చు. కాస్త అనుభవం వచ్చిన తర్వాత, మీరు మంచి వీడియోలు మరియు ఆడియో కంటెంట్ తో కోర్సుల ప్యాకేజీని చేసి వివిధ ఫ్లాట్ ఫారాలపై లైవ్ ట్యూటరింగ్ సెషన్ లను నిర్వహించవచ్చు.

పెట్టుబడి మరియు లాభం: మంచి ఆడియో మరియు వీడియో పరికరాలు  కొనాల్సి ఉంటుంది. అందుకు ₹ 5000 నుండి పై చిలుక ఖర్చు చేయాల్సి రావచ్చు. మీరు ఎంతమంది పిల్లలకు చదివి చెప్తే, అంతగా లాభాన్ని సంపాదించవచ్చు. 

 

10. బ్యూటీ పార్లర్ లేదా సెలూన్

 

అందం మరియు చర్మ సంరక్షణలో కొత్త పోకడలతో, సౌందర్య చికిత్సలు, మేకప్ లు, కేశాలంకరణలు, డ్రేపెరీ కోసం ఒక సెలూన్ ను తెరవడం, మీకు అవసరమైన నైపుణ్యం ఉంటే లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు లైసెన్స్ ఆవశ్యకతల గురించి తెలుసుకొని వాటిని పొందాలి. చిన్న అద్దె స్థలం మరియు కొన్ని రకాల పరికరాలతో, ఈ వ్యాపారం తెరవడం మంచిది. అలాగే, ఆకర్షణీయమైన ప్యాకేజీలను అందించడం ద్వారా నిర్ధిష్ట క్లయింట్ ఆర్డర్ లను పొందవచ్చు. గృహిణులకు ఇంటి నుండి చేయగల ఉత్తమమైన వ్యాపారాలలో ఇది ఒకటి. అలాగే, బ్యూటీ బ్లాగులు మరియు బ్యూటీ ఛానల్స్ ఈ వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి సహాయపడతాయి. వీలైతే మీరు తరగతులు నిర్వహించవచ్చు మరియు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు.


 

పెట్టుబడి మరియు లాభం: పెట్టుబడిలో కనీసం ₹ 50,000/-ఉండవచ్చు. ఖాతాదారుల సంఖ్యను బట్టి లాభాలు మారతాయి. 

 

ముగింపు

 

ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి సర్టిఫికేట్ ల కంటే నైపుణ్యం అలాగే అనుభవం కంటే నాలెడ్జ్ ఉండడం చాలా ముఖ్యం. గృహిణిలు చేయగల చాలా ఆన్ లైన్ వ్యాపారాల కోసం మంచి ఇంటర్నెట్ కనెక్షన్ మరియు అద్భుతమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను ఉండాలి. మీ అభిరుచిని గుర్తించి, దానికి తగిన రంగంలో ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని వ్యాపారాన్ని జాగ్రత్తగా ప్రారంభించాలి. ఈ విషయాలను తమ సామర్థ్యాలకు తగ్గట్టుగా ఉపయోగించుకోగల వ్యక్తులు తమ ఇంటి నుండే బాగా సంపాదించవచ్చు. ఇంటి ఇంటర్నెట్ యుగం మనకు అందించిన ఒక గొప్ప బహుమతి అనొచ్చు

తరుచుగా అడిగే ప్రశ్నలు

ప్రశ్న: పోటీ కారణంగా ఆన్ లైన్ వ్యాపారాన్ని స్థాపించడం కష్టమా?

సమాధానం:

ఆన్ లైన్ వ్యాపారానికి విస్తృత రీచ్ ఉంది మరియు కొత్తగా ప్రవేశించేవారికి అన్ని అవకాశాలు ఉంటాయి.  అందువల్ల, కఠినమైన పోటీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఒక వ్యాపారానికి దాని ప్రత్యేకతను ఇచ్చేది వారు అందించే సేవల నాణ్యత మాత్రమే. ఆన్లైన్ లో ఏదైనా ఒక సేవను లేదా ఉత్పత్తిని కొనేముందు వాటికి ఉండే రివ్యూలు, వ్యాఖ్యలు, టెస్టిమోనియల్స్, రేటింగ్ లు ఆన్ ఏ కస్టమర్ కైనా అత్యంత ముఖ్యమైనవి.

ప్రశ్న: ఆన్ లైన్ వ్యాపారానికి భారీ పెట్టుబడులు అవసరమా?

సమాధానం:

ఆన్ లైన్ వ్యాపారం ప్రారంభించడానికి ఎలాంటి భారీ పెట్టుబడి అవసరం లేదు. దీనికి కాగలిగిందల్లా నైపుణ్యాలు మరియు జ్ఞానం మాత్రమే. ఒకవేళ ఇవి ఉన్నట్లయితే, మిగిలినవి మరింత సులభతరం అవుతాయి.  వాస్తవానికి, పెట్టుబడి అనేది స్థలం అద్దెకు తీసుకోవడం, లైసెన్సింగ్ మరియు అప్రూవల్స్, పరికర ఆవశ్యకతలు, ఎక్విప్ మెంట్ మొదలైన ఇతర విషయాలు మరియు వ్యాపారం యొక్క స్కేలు మరియు రకంపై ఆధారపడి ఉంటుంది.

ప్రశ్న: ఆన్ లైన్ బిజినెస్ పై ఇన్ కమ్ ట్యాక్స్ పడుతుందా?

సమాధానం:

ఆదాయం యొక్క పన్ను విధించడం అనేది ఆదాయ వనరు మరియు సేవలు అందించే ప్రదేశంపై ఆధారపడి ఉంటుంది. దేశం యొక్క ఆదాయ చట్టాల ప్రకారం, ఆదాయం ఒక నిర్దిష్ట పరిమితిని దాటిన తరువాత ఒక వ్యాపారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే, ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని దాటితే, అది పన్ను పరిధిలోకి మారుతుంది.

ప్రశ్న: ఆన్ లైన్ ఫ్లాట్ ఫారాలపై వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి ఎలాంటి నైపుణ్యాలు అవసరం అవుతాయి?

సమాధానం:

చాలా ముఖ్యమైన విషయం ప్రమోషన్ మరియు ప్రకటన. మంచి నాణ్యమైన సేవలు ముఖ్యమే, కానీ సరిగ్గా ప్రచారం మరియు మార్కెట్ చేయకపోతే పెరుగుతున్న పోటీని తట్టుకోవడం కష్టం. వ్యాపారాన్ని విస్తరించడానికి ఖచ్చితమైన ప్రేక్షకులను చేరుకునే సామర్థ్యం ఉండాలి.

ప్రశ్న: గృహిణులు ఆన్ లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఏమి అవసరం అవుతుంది?

సమాధానం:

ఆన్ లైన్ వ్యాపారానికి అవసరమైన రంగంలో నైపుణ్యాలు మరియు నాలెడ్జ్ తో పాటు మంచి పరికరం మరియు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అవుతుంది.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.