మీకు ప్రత్యేకమైన ఆలోచనలు మరియు డిజైన్లు ఉంటే మీరు ఫర్నిచర్ మరియు గృహాలంకరణ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఉత్పత్తులను మీరే తయారు చేయకూడదనుకున్నా, మీరు మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళవచ్చు. అలాగే, బ్రాండ్‌ను కూడా నిర్మించవచ్చు. మొదలవ్వడానికి సంవత్సరాలు పట్టినా, మీ ఫర్నిషింగ్ మరియు హోమ్ డిజైన్ లైన్ అనేక సీజన్లు మరియు స్టైల్‌ల ద్వారా కొనసాగవచ్చు. మీరు సరసమైన ధరలకు అధిక నాణ్యత ఉత్పత్తులను అందిస్తే, మీకు నమ్మకమైన కస్టమర్లు ఉంటారు.
మీకు తెలుసా? కోవిడ్-19 మహమ్మారి సమయంలో 2020లో ప్రపంచవ్యాప్తంగా $98.4 బిలియన్ల మార్కెట్‌తో ఆన్లైన్ హోమ్ డెకర్ మార్కెట్ మంచి వృద్ధిని సాధించిందని Researchandmarkets.com నివేదించింది.
మీ హోమ్ డెకర్ కంపెనీని ప్రారంభించండి
మీ హోమ్ డెకర్ కంపెనీని ప్రారంభించేటప్పుడు ఈ ఉపయోగకరమైన చిట్కాలను ఫాలో అవ్వండి
మార్కెట్‌ను గుర్తించడం
ఇంటీరియర్ డిజైన్ మార్కెట్ స్కేల్‌తో సంబంధం లేకుండా పోటీదారులతో నిండి ఉంది. మీరు ప్రారంభించే కంపెనీ చాలా మంది పోటీదారులను ఎదుర్కొంటుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ పోటీదారులు మీరు అందించే శ్రేణి ఉత్పత్తులు మరియు సేవలనీ తక్కువ ధరలకు అందించే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ, మీ కంపెనీ ఖచ్చితంగా ఎదిగే అవకాశం ఉంది.
అలైడ్ మార్కెట్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే ప్రకారం, గ్లోబల్ హోమ్ డెకర్ మార్కెట్ 2027 నాటికి $838.6 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేయబడింది.
రాబోయే సంవత్సరాల్లో చైనా మరియు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో గృహాలంకరణ ఉత్పత్తుల మార్కెట్ క్రమంగా పెరుగుతుందని అంచనా వేయబడింది.
గృహాలంకరణ వస్తువులలో లివింగ్ రూమ్ డెకర్, బాత్రూమ్ ఫ్లోరింగ్, రగ్గులు, పరుపులు మరియు కిచెన్ వాల్ హ్యాంగింగ్‌లు ఉన్నాయి. ఈ ఉత్పత్తులను వినియోగదారులకు ప్రత్యేకమైన సేవలను అందించడానికి చేతి నైపుణ్యాలు లేదా యంత్రాలను ఉపయోగించి కస్టమైజ్ చేయవచ్చు.
అంతేకాకుండా, పర్యావరణ అనుకూలమైన గృహాలంకరణకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పర్యావరణ అనుకూల ఉత్పత్తులు మరియు పర్యావరణాల విలువ గురించి తెలుసుకుంటున్నారు, ఫలితంగా ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. వస్తువుల రకం మరియు మీ నైపుణ్యం పై ఆధారపడి, మీరు లాభదాయకమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
బలమైన బిజినెస్ ప్రణాళికను రూపొందించండి
బిజినెస్ ప్రణాళికను రూపొందించడం విజయవంతమైన గృహాలంకరణ వ్యాపారాన్ని ప్రారంభించడంతో పాటు కొనసాగించడంలో ఒక ప్రాథమిక అడుగు. అంటే, ఇంటి అలంకరణ కోసం ఒక మంచి కంపెనీ ఆలోచనతో రండి. ముందుగా, మీరు మీ వ్యాపార ప్రణాళికలో చేర్చాలనుకుంటున్న ముఖ్యమైన విషయాల జాబితాను సిద్ధం చేయండి. మీ వ్యాపార ప్రణాళిక ఉత్పత్తి-కేంద్రీకృతమై ఉండాలి, విక్రయాలను పెంచడం డిజైన్‌తో మొదలై మార్కెటింగ్‌తో ముగుస్తుంది.
అయితే, అద్భుతమైన ఇంటి డిజైన్ ఉత్పత్తి ఆలోచనను అభివృద్ధి చేయాలంటే మీ పని ఇక్కడితో ఆగదు. వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమయ్యే వాటి గురించి కూడా మీరు కూడా ఆలోచించాలి. మీ వ్యాపార ప్రణాళికలో ఉత్పత్తిని అభివృద్ధి చేయడం మరియు దానిని అభివృద్ధి చేయడానికి అవసరమైన పదార్థాలు మరియు సామగ్రి గురించి పూర్తి సమాచారం కూడా ఉండాలి.
మీ హోమ్ డెకర్ ఉత్పత్తుల కోసం, మీరు లైసెన్స్ మరియు ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేయాలి. మీకు కన్ఫర్మేషన్ లేకపోతే, డిజైన్ చేయడం ప్రారంభించవద్దు.
మీ హోమ్ డెకర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన డబ్బు మీ వ్యాపార ప్రణాళికలో ఒక భాగం. ఫలితంగా, అవసరమైన నిధులను భద్రపరచడానికి పని చేయండి.
బ్రాండింగ్
మీరు మీ కంపెనీకి పేరు పెట్టాలి, లోగోను డిజైన్ చేయాలి, అలాగే ట్యాగ్ లైన్‌ను కూడా రూపొందించాలి. మీరు ఏమి విక్రయిస్తున్నారో మీ కంపెనీ పేరు కస్టమర్లకు తెలియజేయాలి. ఉదాహరణకు, మీరు ఎకో-ఫ్రెండ్లీ ఫర్నీచర్ తయారు చేస్తే, మీ నినాదం దానికి అనుబంధంగా ఉండాలి. దీన్ని సరళంగా మరియు గుర్తుండిపోయేలా ఉంచాలని గుర్తుంచుకోండి. అందరూ నమ్ముతున్నట్టు, వ్యాపార పేర్లు, లోగోలు మరియు నినాదాలు కాపీరైట్ ద్వారా రక్షించబడవని మీరు గమనించాలి.
మీ వస్తువులు లేదా సేవలను పేర్కొనండి
చాలా విజయవంతమైన గృహాలంకరణ వ్యాపారాలు తమ వినియోగదారులకు అనేక రకాల ఫర్నిచర్ ఉత్పత్తులను అందిస్తాయి. మీరు మొత్తం ఇల్లు లేదా గది మేక్ఓవర్లు, ఫర్నిచర్ అప్-స్ట్రెచింగ్, డెకర్ సర్వీసెస్ మరియు హోమ్ విండో రీడెకరేటింగ్ వంటి అనేక రకాల గృహాలంకరణ వస్తువులు మరియు సేవలను అందించవచ్చు
మీరు మీ కస్టమర్లకు సేవలను అందించడం ప్రారంభించే ముందు, మీరు అందించడానికి సిద్ధంగా ఉన్న సేవలను మరియు వాటి ధరలను ఎలా నిర్ణయించాలో మీరు ముందుగా పరిగణించాలి.
మీ సేవల ఫీజును నిర్ణయించండి
గృహాలంకరణ మరియు ఫర్నిచర్ కంపెనీని ప్రారంభించడంలో ధరను నిర్ణయించడం మొదటి అడుగు. మీ ఉత్పత్తులు మరియు సేవల ధరల విషయానికి వస్తే, మీరు సెట్ చేసే రేట్లు ప్రాజెక్ట్ చేయడానికి మీకు పట్టే సమయం లేదా మీరు పొందవలసిన వనరులపై ఆధారపడి ఉండకూడదని గుర్తుంచుకోండి. ధర గురించి మంచి అవగాహన పొందడానికి, వివిధ గృహాలంకరణ సేవల ధరలను చూడండి లేదా గృహాలంకరణ మరియు ఫర్నిచర్ దుకాణాలకు వెళ్లి తెలుసుకోండి.
బలమైన పోర్ట్‌ఫోలియోను రూపొందించడానికి ప్రయత్నించండి
మీరు అసైన్మెంట్ను అప్పగించినప్పుడు చాలా మంది క్లయింట్లు మీ పోర్ట్‌ఫోలియో అడుగుతారు. మీరు ఇతరుల కోసం ఏం ఏం చేశారో తెలుసుకోవాలనుకుంటారు. మీకు ఎంత నైపుణ్యం ఉందొ తెలుసుకోవడానికి మరియు పూర్తి చేయడానికి వారు మిమ్మల్ని విశ్వసించగలరో లేదో తెలుసుకోవడానికి మీ పోర్ట్‌ఫోలియోను చూడాలనుకుంటున్నారు. ఫలితంగా, మీరు పనిని పూర్తి చేసిన తర్వాత, మీరు దానిని ఫోటోగ్రాఫ్ చేసి మీ పోర్ట్‌ఫోలియోకు జోడించవచ్చు.
మీరు వైవిధ్యాన్ని చూపించడానికి వివిధ విధానాలను ప్రయోగించవచ్చు. మీరు పని చేసిన క్లయింట్లందరిని ట్రాక్ చేయడానికీ, వారి అభిప్రాయాన్ని స్వీకరించడానికి మీరు గెస్ట్బుక్ను కూడామెయింటైన్ చేయవచ్చు. ఆ అభిప్రాయాలను ఇతర క్లయింట్లతో పంచుకోవచ్చు, తద్వారా వారు మీ గురించి తెలుసుకోవడం మరింత సులభం అవుతుంది.
మీ క్లయింట్లు మరియు ప్రాజెక్ట్‌ల సంఖ్యను పెంచుకోండి
మీరు గత ప్రాజెక్ట్‌ల యొక్క బలమైన పోర్ట్‌ఫోలియోను రూపొందించిన తర్వాత, మీరు వాటిని క్లయింట్లకు చూపించి కొత్త పనిని పొందవచ్చు.
అదనపు క్లయింట్లు మరియు ప్రాజెక్ట్‌లను పొందేందుకు స్థానిక సరఫరాదారులతో భాగస్వామ్యం మరొక మంచి వ్యూహం. మీరు ఫ్లోరింగ్, ఫ్యాబ్రిక్స్, వాల్పేపర్లు, కార్పెట్లు, ఫర్నీచర్ మరియు ఇతర వస్తువులను డీల్ చేసే కంపెనీలను కూడా సంప్రదించవచ్చు. ప్రస్తుత ధరల గురించి మరింత తెలుసుకోవడానికి వడ్రంగులు మరియు పెయింటర్లను సంప్రదించండి, మీరు అలా చేస్తే మార్క్ డౌన్లకు అర్హులు కావచ్చు.
మీ కంపెనీని ప్రమోట్ చేయండి
ప్రతి ఒక్కరూ తమది అత్యుత్తమ కంపెనీ అనీ చెబుతారు, కానీ దానిని లాభదాయకంగా మార్చడం మాత్రమే ఫలితాలను చూడటానికి ఏకైక మార్గం. కాబట్టి ఆ వవిషయాన్ని వినియోగదారులకు తెలియజేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది సాధించడానికి మీరు ఆర్కిటెక్ట్‌లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు ఇతర గృహాలంకరణ కంపెనీల నిపుణులతో నెట్వర్క్ని నిర్మించుకోవచ్చు. అదనపు కస్టమర్లను ఆకర్షించడానికి వారితో కలిసి పని చేయవచ్చు.
వెబ్‌సైట్‌ను రూపొందించండి
మీ ప్రచార ప్రయత్నాల నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి, లోగో మరియు వెబ్సైట్ డిజైన్ వంటి సేవలపై ఖర్చు చేయడం కూడా మంచి ఆలోచన. అదేవిధంగా, మీరు మీ ఉత్పత్తులు లేదా సేవల గురించి కొనుగోలుదారులకు తెలియజేసే ఆకర్షణీయమైన సోషల్ మీడియా ప్రెజెన్స్‌ని నిర్మించుకోవచ్చు.
ఒక స్థలాన్ని అద్దెకు తీసుకోండి
మీరు స్వయంగా చేయాలనుకుంటే మీ ఫర్నిచర్ విక్రయించడానికి స్థలాన్ని అద్దెకు తీసుకోండి. మీ ఫర్నిచర్ మరియు డెకర్‌ని ఉంచడానికి లేదా కస్టమర్లకు విక్రయించడానికి కార్యాలయం అత్యంత అనుకూలమైన ప్రదేశం కాకపోవచ్చు. మీ వ్యాపారానికి సరిపోయే ప్రాంతంలో స్థలం కోసం చూడండి. మీరు హై-ఎండ్ పీసులను విక్రయిస్తున్నట్లయితే, చిన్నవి లేదా కళాత్మకమైన ప్రదేశాల కంటే హై-ఎండ్ స్టోర్ బాగుంటుంది.
నెట్వర్కింగ్
గృహోపకరణాల సంబంధించిన వ్యాపార కార్యక్రమాలకి వెళ్ళండి. మీ కంపెనీని నమోదు చేసుకోండి. అలాగే, బూత్‌ను పొందడానికి మీ దగ్గరున్న ఉత్పత్తుల్లో కనీసం ఒకటైనా తీసుకువెళ్ళండి. వినియోగదారులు ఇతర ఉత్పత్తుల ప్రకాశవంతమైన మరియు పెద్ద ఫోటోలను చూడగలగాలి. జనాలు తీసుకోవడానికి కంపెనీ సమాచారంతో వ్యాపార కార్డ్‌లు, మాగ్నెట్లు మరియు స్టిక్కర్లను తీసుకువెళ్ళండి. మీరు కేటలాగ్‌ను ప్రచురించాలని ప్లాన్ చేస్తే, షోకి ముండే చేయండి, తద్వారా వినియోగదారులు మీ వస్తువులు మరియు ధరలను చూడవచ్చు.
ముగింపు
మీరు అవసరమైన కృషి చేస్తే గృహోపకరణాలు మరియు డెకర్ వ్యాపారాన్ని ప్రారంభించడం లాభదాయకంగా ఉండడంతో పాటు విజయవంతమవుతుంది. ఆన్లైన్లో చాలా ప్రమోషన్లు జరుగుతున్నందున ఇంటి అలంకరణ కూడా అగ్ర ఇంటర్నెట్ వ్యాపార ఆలోచనలలో ఒకటి. ఖచ్చితంగా, మీరు మొదట ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు, కానీ ఆలోచన క్లిక్ అయితే సంస్థ విజయవంతమవుతుందని మీరు నమ్మవచ్చు. హోమ్ డెకర్ కంపెనీ కాన్సెప్ట్‌లో పెట్టుబడి పెట్టే ముందు, మీరు మీ హోమ్‌వర్క్ చేశారని నిర్ధారించుకోండి.
సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు (MSMEలు), వ్యాపార చిట్కాలు, ఆదాయపు పన్ను, GST, జీతం మరియు అకౌంటింగ్‌కు సంబంధించిన తాజా అప్డేట్లు, వార్తల బ్లాగులు మరియు కథనాల కోసం Khatabookని అనుసరించండి.