ఇ-వే బిల్లు వస్తువుల రవాణాను అనుమతిస్తుంది. మీరు దీన్ని అధికారిక ఇ-వే బిల్ జనరేషన్ పోర్టల్‌లో జనరేట్ చేయవచ్చు. ఈ బిల్లును Android అప్లికేషన్ ద్వారా లేదా SMS ద్వారా కూడా జనరేట్ చేయడాన్ని సాంకేతికత మరింత సౌకర్యవంతంగా చేసింది. మీరు దీని కోసం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (API)ని కూడా ఉపయోగించవచ్చు.. బిల్లును జనరేట్ చేసిన తర్వాత, గ్రహీతకు ఇ-వే బిల్లు నంబర్ అందించబడుతుంది. జనరేట్ చేయబడిన ప్రతి ఇ-వే బిల్లు నంబర్ ప్రత్యేకమైనది. రవాణా చేయబడే వస్తువుల విలువ ₹50,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మరియు మీరు GST-రిజిస్టర్డ్ వ్యక్తి అయినప్పుడు మాత్రమే ఇ-వే బిల్లు తప్పనిసరి అవుతుంది. ఈ బిల్లుకి రెండు ప్రధాన లక్ష్యాలు ఉంటాయి:
- మీ వస్తువులను రవాణా చేసే వ్యక్తిపై విధించాల్సిన GST మొత్తాన్నిలెక్కించడం.
- పన్ను విధించబడే వస్తువుల అంతర్ రాష్ట్ర కదలికలను మరియు నిర్దిష్ట రాష్ట్రంలో రవాణా అవుతున్న సరుకులను పర్యవేక్షించడం.
ఇ-వే బిల్లు చెల్లుబాటు వ్యవధి అనేది సరుకు రవాణా చేయబడిన దూరంపై ఆధారపడి ఉంటుంది. ఆ దూరం 100 కి.మీ దాటాకపోతే, రవాణా ప్రారంభ తేదీ నుండి 24 గంటల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దీనికి మించితే, చెల్లుబాటు ప్రారంభ రవాణా తేదీ నుండి మరో 24 అదనపు గంటల వరకు పొడిగించబడుతుంది.
మీకు తెలుసా? పన్ను ఎగవేతదారులను గుర్తించడంలో ఇ-వే బిల్లు అత్యంత ప్రభావవంతమైన సాధనంగా పనిచేస్తుంది.
ఇ-వే బిల్లు చెల్లుబాటు వ్యవధిని ఎలా నిర్ణయించాలి?
ఇ-వే బిల్లు చెల్లుబాటు వ్యవధిని నిర్ణయించే అంశాలు ఇవే
- సరుకు రవాణాదారుడు కవర్ చేసే దూరంపై ఇ-వే బిల్లు చెల్లుబాటు వ్యవధి ఆధారపడి ఉంటుంది.
- ఇ-వే బిల్లు రెండు భాగాలను కలిగి ఉంటుంది, పార్ట్ A మరియు పార్ట్ B. పార్ట్ A లోకి ఈ కింది వివరాలు వస్తాయి:
- రవాణా చేయబడే ఉత్పత్తుల పరిమాణం
- ఉత్పత్తుల విలువ
- GSTIN వివరాలు (వస్తువుల గ్రహీతకు సంబంధించిన)
- ఇన్వాయిస్ నంబర్ వివరాలు
- వస్తువులు లేదా రైల్వే రసీదు సంఖ్య లేదా లోడింగ్ బిల్లుతో పాటు ఎయిర్‌వే బిల్లు నంబర్
- సరుకు రవాణా చేయడానికి కారణం
- సరుకు మొత్తం విలువ
- HSN కోడ్
- పార్ట్ B లోకి కింది వివరాలు వస్తాయి:
- సరుకు రవాణా చేస్తున్న వ్యక్తి వాహనం నంబర్
- డాక్యుమెంట్ సంఖ్య
- డాక్యుమెంట్ తేదీ
ఇ-వే బిల్లు యొక్క పార్ట్ B లో సరుకు మరియు రవాణా విధానం యొక్క వివరాలు అప్‌డేట్ అయిన రోజున మాత్రమే ఇ-వే బిల్లు చెల్లుబాటు వ్యవధి మొదలవుతుంది. ఇ-వే బిల్లు చెల్లుబాటు వ్యవధి మరుసటి రోజు అర్ధరాత్రి ముగుస్తుంది (మొత్తం 24 గంటలు).
సంఖ్య |
సరకు రకం |
మొత్తం దూరం |
చెల్లుబాటు వ్యవధి |
1 |
రెగ్యులర్ సరకు |
100 కి.మీ వరకు |
ఒక అదనపు రోజు (24 గంటలు) |
2 |
ప్రతి అదనపు 100 కి.మీ లేదా 100 కి.మీ కంటే తక్కువ దూరానికి |
ఒక అదనపు రోజు (24 గంటలు) |
|
3 |
లోడ్ చేయబడిన వాహనపు డెక్‌కి మించి వస్తువులు ఉన్నప్పుడు |
20 కి.మీ వరకు |
ఒక అదనపు రోజు (24 గంటలు) |
4 |
ప్రతి అదనపు 20 కి.మీ లేదా 20 కి.మీ కంటే తక్కువ దూరానికి |
ఒక అదనపు రోజు (24 గంటలు) |
ఇ-వే బిల్లును జనరేట్ అయిన తర్వాత, ఇ-వే బిల్లు చెల్లుబాటు కాలం మరుసటి రోజు అర్ధరాత్రి వరకు (సరిగ్గా 24 గంటల తర్వాత) లెక్కించబడుతుంది. ఉదాహరణకు, 100 కి.మీ కంటే తక్కువ దూరం వరకు వస్తువులను రవాణా చేసినందుకు 1 జూన్ 2019న ఇ-వే బిల్లును జనరేట్ చేసినట్లయితే , బిల్లు చెల్లుబాటు కాలం 2 జూన్ 2019 అర్ధరాత్రి వరకు పొడిగించబడుతుంది.
అయితే, ఈ చెల్లుబాటుకు సంబంధించి 1 జనవరి 2021 నుండి కొన్ని మార్పులు జరిగాయి. వాటి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
సంఖ్య |
మొత్తం దూరం |
వాహనం రకం |
చెల్లుబాటు కాలం |
1 |
200 కి.మీ వరకు |
రెగ్యులర్ వాహనం |
ఒక రోజు |
2 |
ముందుగా పేర్కొన్న దూరం తర్వాత తదుపరి 200 కిలోమీటర్లు లేదా 200 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి |
రెగ్యులర్ వాహనం |
ఒక అదనపు రోజు (24 గంటలు) |
3 |
20 కి.మీ వరకు |
లోడ్ చేయబడిన వాహనం యొక్క డెక్ కంటే ఎక్కువగా వస్తువులు ఉన్నప్పుడు |
ఒక రోజు |
4 |
ముందుగా పేర్కొన్న దూరం తర్వాత తదుపరి 200 కిలోమీటర్లు లేదా 200 కిలోమీటర్ల కంటే తక్కువ దూరానికి |
లోడ్ చేయబడిన వాహనం యొక్క డెక్ కంటే ఎక్కువగా వస్తువులు ఉన్నప్పుడు |
ఒక అదనపు రోజు (24 గంటలు) |
ఇ-వే బిల్లు చెల్లుబాటు వ్యవధి పొడిగింపు
ఇ-వే బిల్లు చెల్లుబాటును పొడిగించడం ఒక కష్టమైన నిర్ణయం. ఇ-వే బిల్లు చెల్లుబాటును వివిధ పరిస్థితులలో పొడిగించవచ్చు. వీటిలో కొన్ని ఇక్కడ ఇవ్వబడ్డాయి:
- పేర్కొన్న సరుకు వివిధ ఆకస్మిక పరిస్థితుల వల్ల ఇ-వే బిల్లు చెల్లుబాటు సమయం లోపు అనుకున్న చోటికి చేరదు. శాంతిభద్రతలకు అంతరాయం కలిగించడం, భారీ వర్షాలు లేదా వరదలు వంటి వాతావరణం, లేదా ఏదైనా ప్రమాదం వల్ల వస్తువులను తరలింపు చేయడం ఆలస్యం కావచ్చు.
- సరుకును తరలించే వాహనంలో మెషినరీ బ్రేక్‌డౌన్ లేదా ఏదైనా ఇతర బ్రేక్‌డౌన్ కారణంగా సరుకు రవాణాలో జాప్యం ఏర్పడినప్పుడు.
- కొన్ని కారణాల వల్ల, రవాణా కోసం వాహనాన్ని మార్చాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు
- ప్రస్తుతం ఉన్న సరుకు రవాణాదారుకు ఇ-వే బిల్లు చెల్లుబాటు వ్యవధిని పొడిగించే స్వేచ్ఛ ఉంటుంది.
ఇ-వే బిల్లు చెల్లుబాటును పొడిగించడం ఎలా?
బిల్లు చెల్లుబాటు గడువు ముగిసే సమయానికి ఎనిమిది గంటల ముందు లేదా ఎనిమిది గంటల తర్వాత మీరు ఇ-వే బిల్లు పొడిగింపు కోసం అభ్యర్థించవచ్చు.
ఇ-వే బిల్లు చెల్లుబాటును పొడిగించే ప్రక్రియలో వివిధ దశలు క్రింద ఇవ్వబడ్డాయి:
- ముందుగా, మీరు ఇ-వే బిల్లింగ్ పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ www.ewaybillgst.gov.inకి లాగిన్ అవ్వాలి. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ మరియు క్యాప్చా వంటి అన్ని సంబంధిత వివరాలను నమోదు చేసి'లాగిన్' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తరువాత వచ్చే స్క్రీన్‌లో ఎడమ వైపున వివిధ ఆప్షన్‌లు ఉంటాయి. ‘Extend Validity’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- మీరు ఇప్పుడు పొడిగింపు కోరుతున్న ఇ-వే బిల్లు సంఖ్యను నమోదు చేయాలి
- 'Yes’ మరియు 'No' అని రెండు ఆప్షన్‌లు కనిపిస్తాయి
- ‘Yes’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, పొడిగింపు కోసం కారణాలను అందించాలి.
- సరుకును తీసుకువెళుతున్న వాహనం యొక్క నంబర్ మరియు ఇతర వివరాలను ఇవ్వాలి.
- డ్రాప్-డౌన్ మెను కనిపిస్తుంది. అందులో మీ అవసరాలకు తగిన కారణాలను ఎంచుకోండి
- మీరు ఈ ఫార్మాలిటీలను పూర్తి చేసిన వెంటనే, సిస్టమ్ మీకు ఇ-వే బిల్లు చెల్లుబాటు పొడిగింపును అందిస్తుంది. అయితే, పొడిగింపు ఆ సమయం వరకు మీరు కవర్ చేసిన దూరంపై ఆధారపడి ఉంటుంది.
ఇ-వే బిల్లు చెల్లుబాటు విషయంలో గుర్తుంచుకోవలసిన పాయింట్లు
- ఇ-వే బిల్లు చెల్లుబాటు విభిన్న పరిస్థితులలో సాధ్యమవుతుంది. ఇవి రోడ్డు ప్రమాదం, శాంతిభద్రతలకు సంబంధించి ఊహించని ఇబ్బందులు, విపరీతమైన వాతావరణ పరిస్థితులు లేదా వాహనాలు దెబ్బతినడం వల్ల ఆలస్యం కావచ్చు
- పేర్కొన్న సరుకును రవాణా చేసి వ్యక్తికి ఇ-వే బిల్లు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారం ఉంటుంది
- ఇ-వే బిల్లును రూపొందించిన తర్వాత సవరించడం, మార్పులు చేయడం లేదా రద్దు చేయడం సాధ్యం కాదు. అప్‌డేట్ చేయబడే ఏకైక విభాగం పార్ట్ B. అందులో సరుకును తీసుకువెళుతున్న వాహనం యొక్క వివరాలు ఉంటాయి కాబట్టి వాహనం మార్చబడితే, అది ఈ విభాగంలో అప్‌డేట్ చేయబడుతుంది.
- మీరు ఈ-వే బిల్లులో తప్పు వివరాలను అందించినట్లయితే, దానిని రద్దు చేసి కొత్తదాని కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ-వే బిల్లును రూపొందించిన 24 గంటల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది
- ప్రతి ఒక్క ఇ-వే బిల్లు యొక్క చెల్లుబాటు సరుకును సరఫరా చేసే వ్యక్తి లేదా వస్తువులను స్వీకరించబోయే వ్యక్తి అందించిన అధికారిక పత్రంలో పేర్కొన్న వాహనం సంఖ్యను వివరించిన వెంటనే ప్రారంభమవుతుంది.
- మొదటి రోజు చెల్లుబాటు అర్ధరాత్రి ముగుస్తుంది
- ప్రతి ఇన్‌వాయిస్‌కి ఒక ఇ-వే బిల్లు మాత్రమే ఉంటుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ ఇన్‌వాయిస్‌లకు ఇ-వే బిల్లును రూపొందించలేరు
ముగింపు:
ఈ కథనంలో ఉన్న అంశాలు ఇ-వే బిల్లు చెల్లుబాటుపై స్పష్టతను ఇస్తాయి. ఇ-వే బిల్లు యొక్క చెల్లుబాటును నిర్ణయించే విషయాలతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో దానిని ఎలా పొడిగించవచ్చో ఈ కథనం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఇ-వే బిల్లు యొక్క చెల్లుబాటు పొడిగింపు కోసం దరఖాస్తు చేయడంలో ఉన్న వివిధ దశల గురించి కూడా వివరంగా తెలుసుకోవచ్చు. చెల్లింపు నిర్వహణ మరియు GSTతో మీకు సమస్యలు ఉన్నాయా? అయితే ఇప్పుడే Khatabook యాప్ ఇన్‌స్టాల్ చేయండి! ఆదాయపు పన్ను లేదా GST ఫైలింగ్, ఉద్యోగి నిర్వహణ మరియు మరిన్నింటికి సంబంధించిన అన్ని సమస్యలకు ఒక-స్టాప్ పరిష్కారం Khatabook.. ఈరోజే ట్రై చేయండి!