written by khatabook | October 4, 2020

అకౌంటింగ్‌లో ఉండే మూడు గోల్డెన్ రూల్స్, మంచి ఉదాహారణలతో

×

Table of Content

అకౌంటింగ్‌లో ఉండే గోల్డెన్ రూల్స్ అంటే, ఏ వ్యాపారానికైనా లావాదేవీలను నోట్ చేసుకునేటప్పుడు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన నిభందనలు. వీటిని అకౌంటింగ్ యొక్క ట్రెడిషనల్ రూల్స్, బుక్ కీపింగ్ గోల్డెన్ రూల్స్, లేదా రూల్ ఆఫ్ క్రెడిట్ అండ్ డెబిట్ అని కూడా అంటారు, అకౌంటింగ్‌లో చేసే అన్ని విధమైన కార్యకలాపాలకు ఇవి చాలా ముఖ్యం. జర్నల్ ఎంట్రీ చేయడానికి అత్యంత కీలకమైన నియమాలు ఇవి, ఇవే లేకపోతే, లెక్కల పుస్తకమంతా చాలా గందరగోళంగా తయారవుతుంది.

అకౌంట్ లో ఉన్న ఈ గోల్డెన్ రూల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ముందు, మనం అకౌంట్స్ లో ఉండే రకాలు ఏమిటో చూడాలి. ఎందుకంటే, మనం ఎంటర్ చేసే లావాదేవినీ బట్టి ఈ రూల్స్ మారుతుంటాయి.

అకౌంట్స్ లో ఉండే రకాలు

అకౌంటింగ్ యొక్క గోల్డెన్ రూల్స్ ప్రకారం, మూడు రకాల అకౌంట్ ఉంటాయి: పర్సనల్, రియల్, నార్మల్.

#1. పర్సనల్ అకౌంట్:

ఇవి వ్యక్తిగతంగా మైంటైన్ చేసే అకౌంట్స్. వ్యక్తిగతంగా అంటే, నిజమైన వ్యక్తయినా కావొచ్చు, లేదా నామమాత్రపు వ్యక్తి అయినా కావొచ్చు. ఇలా మూడు రకాల వ్యక్తులు ఉంటారు.:

  • నిజమైన వ్యక్తి: ఒక నిజమైన వ్యక్తి అకౌంట్, రాజు గారి అకౌంట్స్, లేదా సురేష్ గారి అకౌంట్స్.
  • కృత్రిమ వ్యక్తి: ఇవి పార్టనర్‌షిప్ సంస్థలు, అసోసియేషన్లు, ట్రస్ట్ కంపెనీలు, ఇండస్ట్రీలు, టాటా అండ్ సన్స్ లాంటి సంస్థలకు వర్తిస్తాయి.
  • రెప్రెసెంటేటివ్ పర్సన్స్: ఇవి వ్యక్తిల శాలరీ అకౌంట్స్, ప్రీపెయిడ్ ఖర్చుల అకౌంట్స్, అలాగే చెల్లించవలసిన శాలరీ అకౌంట్ లకు వర్తిస్తాయి.

#2. రియల్ అకౌంట్స్:

ఇవి ఏదైనా బిజినెస్ ఎంటర్ప్రైస్ యొక్క అన్ని ఆస్తులను చూపించడానికి ఉపయోగించబడే లెడ్జెర్ అకౌంట్స్. ఈ రియల్ అకౌంట్స్ టాంజబుల్ మరియు ఇన్-టాంజబుల్ అని ఇంకొక రెండు విధాలుగా వేరుచేయబడి ఉంటాయి.

  • ట్యాంజబుల్ రియల్ అకౌంట్స్ అంటే, ఏవైనా బౌతికంగా ఉన్న ఆస్తులు, అంటే స్థలం, బిల్డింగ్లు లాంటివి, కంపెనీ యంత్రాలకు సంబంధించిన అకౌంట్స్, సామాగ్రికి సంబంధించిన అకౌంట్స్, పెట్టుబడుల అకౌంట్స్ లాంటివి.
  • ఇన్-ట్యాంజబుల్ అకౌంట్స్ అంటే కంపెనీకి సంబంధించిన ట్రేడ్ మార్క్ అకౌంట్, పేటెంట్ అకౌంట్, గుడ్విల్ అకౌంట్, కాపీరైట్ అకౌంట్ లాంటి బౌతికంగా ఉండని ఆస్తులు.

#3. నామినల్ అకౌంట్:

ఆ అకౌంట్లలో ఖర్చులు, లాభాలు, నష్టాలు, వ్యాపారం రెవెన్యూ లాంటివి చూపించబడతాయి. అంతేకాక, నామినల్ అకౌంట్ లలో, జీతభత్యాల అకౌంట్స్, అద్దె అకౌంట్, విద్యుత్ బిల్లు ఎకౌంట్, ఖర్చుల అకౌంట్స్, ప్రయాణాలకు చేసే ఖర్చుల అకౌంట్స్, మరియు పొందిన కమిషన్ అకౌంట్స్ ఉంటాయి.

అకౌంటింగ్ యొక్క మూడు గోల్డెన్ రూల్స్

ఇప్పటివరకు మనం అకౌంట్లలో ఉండే రకాల గురించి తెలుసుకున్నాం కాబట్టి, ఇక లావాదేవీలకు వర్తించే రూల్స్ ఉదాహారణలతో గురించి తెలుసుకుందాం.

పర్సనల్ అకౌంట్:

పర్సనల్ అకౌంట్ అంటే ఏ వ్యక్తికైనా తన వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునే అకౌంట్. కాబట్టి ఏ వ్యక్తయినా, లేదా బృందమైన తమ వ్యాపారానికి గాను కొంత మొత్తాన్ని అందుకుంటే, అప్పుడు వారు రిసీవర్ అనబడతారు, కాబట్టి అకౌంట్ లో వారికి ఆ మొత్తం డెబిట్ చేయబడుతుంది. అలాగే, ఒకవేళ ఎవరైనా ఒక వ్యాపారానికని కొంత డబ్బును ఇచ్చినప్పుడు, వారిని గివర్ అంటారు, అలాగే వ్యాపార పుస్తకాలలో వారి లెక్క క్రెడిట్ గా వ్రాయబడుతుంది.  

Example: మీరు శ్యామ్ నుండి రూ. 10,000 విలువైన వస్తువులు కొనుగోలు చేశారు.

ఈ లావాదేవీల్లో, మీరు వస్తువులకు రిసీవర్, కాబట్టి మీ అకౌంట్ పుస్తకాలలో, మీ కొనుగోళ్ల అకౌంట్ నుండి డబ్బు బయటకు వెళ్తుంది కాబట్టి అక్కడ డెబిట్ చేసి, శ్యామ్ కి డబ్బు అందుతుంది కాబట్టి అతనికి క్రెడిట్ అని రాస్తారు.

తేదీ అకౌంట్ డెబిట్ క్రెడిట్
XX/XX/XXXX కొనుగోళ్ల అకౌంట్ రూ. 10,000/-  
  అకౌంట్ పెయబుల్   రూ. 10,000/-

Real రియల్ అకౌంట్:

రియల్ అకౌంట్ రూల్ ప్రకారం, ఏదైనా వ్యాపారం (ఆస్తి లేదా సామాగ్రిని) పొందుకుంటే, దాని అకౌంటింగ్ ఎంట్రీలో దానిని డెబిట్ గా చూపిస్తారు. అలాగే వ్యాపారం నుండి ఏదైనా బయటకు వెళ్తే, దానిని క్రెడిట్ గా చూపిస్తారు.

Example: మీరు రూ.10,000 క్యాష్ పెట్టి ఆఫీస్ కుర్చీలను కొన్నారు అనుకోండి. అప్పుడు, కుర్చీల అకౌంట్ మరియు క్యాష్ A/అకౌంట్ లో కూడా లెక్కలు వ్రాయాలి. కుర్చీలు వ్యాపారానికి అందుతాయి కాబట్టి, కుర్చీల అకౌంట్ లో డెబిట్ చేస్తారు. కానీ వ్యాపారానికి చెందిన క్యాష్ బయటకు వెళ్తుంది కాబట్టి అక్కడ క్రెడిట్ చేస్తారు.

తేదీ అకౌంట్ డెబిట్ క్రెడిట్
XX/XX/XXXX కుర్చీల అకౌంట్ రూ.10,000/-  
  క్యాష్ అకౌంట్   రూ. 10,000/-

నామినల్ అకౌంట్:

నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం, ఏదైనా వ్యాపారానికి నష్టం లేదా లేదా ఖర్చు ఏర్పడినప్పుడు, బిజినెస్ బుక్స్ లో, ఆ ఎంట్రీని డెబిట్ గా చూపించడం జరుగుతుంది. అలాగే ఏదైనా సర్వీసు కారణంగా లాభం లేదా ఆదాయం వచ్చినప్పుడు, దానిని క్రెడిట్ గా చూపిస్తారు.

Example: మీరు రూ. 1000 ఆఫీసు రెంటుగా చెల్లించారు అనుకోండి. అప్పుడు మీరు వ్యాపారానికి గాను ఖర్చు చేసినట్టు, కాబట్టి దానిని అకౌంట్స్ లో డెబిట్ గా చూపిస్తారు.

తేదీ అకౌంట్ డెబిట్ క్రెడిట్
XX/XX/XXXX రెంట్ అకౌంట్ రూ. 1,000/-  
  క్యాష్ అకౌంట్   రూ. 1,000/-

గోల్డెన్ అకౌంటింగ్ రూల్స్ నుండి తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రతీ అకౌంటింగ్ విధానానికి ఈ గోల్డెన్ రూల్స్ మూల స్థంభాలు లాంటివి. లావాదేవీల నమోదుకు అవసరమైన నియమాలను అందించి, ఆర్థిక స్టేట్మెంట్లను ఒక క్రమంలో చూపించడానికి ఇవి సహాయపడతాయి. వీటి సహాయంతో ఎవరైనా తమ ఆదాయాన్ని, వ్యయాలను ఖచ్చితత్వంతో నమోదు చేసి, వ్యాపార అకౌంట్స్ ను సమర్పించగలరు. ఈ రూల్స్ ను పాటించడానికి:

  • ముందుగా లావాదేవీ ఏ విధమైనదని తెలుసుకోవాలి.
  • దాని కారణంగా వ్యాపార విలువ పెరుగుతుందో తగ్గుతుంది చూడాలి.
  • అది పూర్తైన తర్వాత, డెబిట్ మరియు క్రెడిట్ లావాదేవీలకు ఈ గోల్డెన్ రూల్స్ ని ఉపయోగించి నమోదు చేయాలి.

కాబట్టి, మీరు మీ వ్యాపార లెక్కలను సరిగా, ఎప్పటికప్పుడు ఖచ్చితంగా చూపించాలంటే, ఈ గోల్డెన్ రూల్స్ ని ఉపయోగించి అకౌంట్స్ మెయింటైన్ చేయండి.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.