Home జీఎస్టీ GST నంబర్: ప్రతీ వ్యాపారానికి కావాల్సిన 15 అంకెల నంబర్

GST నంబర్: ప్రతీ వ్యాపారానికి కావాల్సిన 15 అంకెల నంబర్

by Khatabook

భారతదేశంలో GST అంటే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST) విధానాన్ని ప్రవేశపెట్టిన నాటి నుండి దేశమంతటా ఎంత గందరగోళం నెలకొన్నదో అంతే ఆసక్తి కూడా నెలకొంది. కాబట్టి GST అంటే ఏమిటి, GST నంబర్ లేదా దానికి సంబంధించిన అనేక విషయాల మీద చాలా మందికి అవగాహన ఉండకపోవడం సహజమే. ఈ ఆర్టికల్‌లో, మీకు GST నంబర్ మరియు దానికి సంబంధించిన ఇతర విషయాలను క్షుణ్ణంగా వివరిస్తున్నాము. జాగ్రత్తగా చెడివి లబ్దిపొందండి.

GSTIN అంటే ఏమిటి?

GSTIN అంటే గూడ్స్ అండ్ సెర్విసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్. వ్యాపారులకు, సరఫరాదారులు కేటాయించబడే ప్రత్యేకమైన గుర్తింపు నంబర్ ఇది. GSTని ప్రవేశపెట్టిన తర్వాత, పన్ను చెల్లింపుదారులు లెక్కలు, రికార్డులను మ్యానేజ్ చేయడానికి ఒకే ఒక్క ప్లాట్ఫార్మ్ ఉంది.

GSTIN ఫార్మాట్

GST నంబర్ అనేది పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేకంగా కేటాయించబడే 15-అంకెల సంఖ్య.

 • మొదటి రెండు అంకెలు రాష్ట్రానికి సంభందించిన కోడ్. దేశంలో ఉన్న ప్రతీ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన కోడ్ కేటాయించబడి ఉంటుంది.
 • GST నంబర్‌లో ఉండే తరువాతి 10 సంఖ్యలుపన్ను చెల్లింపుదారులు PAN కార్డు నంబర్ ఉంటుంది.
 • ఆ తరువాత ఉండే రెండు సంఖ్యలు సంబంధిత వ్యాపారానికి సంబంధించినవి. ఆ సంఖ్య ఆధారంగా ఆ రాష్ట్రంలో ఆ వ్యాపారం లేదా సంస్థ ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసిందనే విషయం తెలుసుకోగలుగుతాము.
 • చివరి సంఖ్య ఏదైనా సమస్య వస్తే తెలుసుకోవడానికి వీలుగా చెక్ కోడ్ గా ఏర్పాటు చేయబడింది.

మీరు GST నంబర్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా?

ఒక ఆర్థిక సంవత్సరంలో గనుక మీ వ్యాపార లావాదేవీలు రూ. 40 లక్షలు మించితే, మీరు GST నంబర్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. కానీ హిమాచల్ ప్రదేశ్, మరియు ఈశాన్య రాష్ట్రాలలో అయితే, రూ. 20 లక్షలు దాటిన వెంటనే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

క్రింద వివరించబడిన పరిస్థితుల్లో మీరు GST నంబర్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని గుర్తించండి:

 • మీరు అంతర్-రాష్ట్ర సరుకు లేదా సేవల సరఫరాలో పాల్గొంటున్నట్లు అయితే
 • మీరు ఈ-కామర్స్ వ్యాపారం చేస్తున్నా
 • మీ వ్యాపారానికి ఉన్న బ్రాంచి ఆఫీసులు ఉపయోగించుకునే సేవలకు ఇన్వాయిస్‌లు స్వీకరిస్తున్నా
 • ఏదైనా సప్లయర్‌కు మీరు ఏజెంట్‌గా పనిచేస్తున్నా

GST నంబర్ ఎందుకు చాలా ముఖ్యం?

 • GST నంబర్ సహాయంతో మీరు సరుకులు లేదా సేవల సరఫరాదారునిగా గుర్తించబడతారు. తమ వ్యాపార నిర్వహణలో, లొసుగులు లేని, పారదర్శకంగా వ్యవహరించే సంస్థలు గుర్తింపు పొంది, ఇతరుల దృష్టిలో పడుతుంటాయి. అంతే కాకుండా, ప్రభుత్వం, నాయకుల విశ్వసనీయతను పొందుకుంటాయి.
 • GST నంబర్ సహాయంతో కొనుగోలు చేసిన ధరను, పన్ను చెల్లించే సమయంలో క్రెడిట్‌గా పొందే ప్రక్రియ మరింత సులభం అవుతుంది. అంతే కాకుండా, స్థిరంగా తమ పన్నులు చెల్లించే వ్యాపారాలు, కొనుగోలు సమయంలో చెల్లించిన ట్యాక్సుల విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు పొందుకునే వెసులుబాటు కూడా ఉంది.
 • అంతర్-రాష్ట్ర చెల్లింపులు జరపడానికి మీ వ్యాపారానికి ఖచ్చితంగా రిజిస్టర్ చేయబడిన GST నంబర్ ఉండాలి. అంతేకాక, GST నంబర్ మీరు ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ వ్యాపారం చేయడానికి వీలు కల్పిస్తుంది.
 • సరైన GST నంబర్‌ను పేర్కొనడం ద్వారా, మీకు అర్హమైన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ దక్కేలా సహాయపడుతుంది. అంతే కాక, మీ ఇన్వాయిస్‌లలో ఇతర వ్యాపారాలు, లేదా వినియోగదారులను చేర్చడానికి మీరు మీ GST నంబర్‌ను జోడించవల్సి ఉంటుంది.

GST నంబర్ కోసం వ్యాపారాన్ని రిజిస్టర్ చేయించడం

మొదటి అడుగు

ఆన్‌లైన్‌ GST పోర్టల్‌కు వెళ్లి, ‘Taxpayers (Normal) క్రింద ‘Register Now’ అనే ఎంపిక మీద నొక్కండి.’

రెండవ అడుగు

దీనిట్ GST రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మొదటి భాగం పూర్తవుతుంది. ‘New Registration’ మీద క్లిక్ చేసి దాని క్రింద కనిపించే ‘I am a’ అనే లైన్ క్రింద ‘Taxpayer’ అనే ఎంపికను ఎంచుకోండి. ఆ తర్వాత, సంబంధిత రాష్ట్రం మరియు జిల్లా వివరాలను ఎంచుకోండి. ఈ వ్యాపారం మరియు మీ ఫోన్ నంబర్, ఇమెయిల్‌తో అనుసంధానించబడిన PAN కార్డు నంబర్‌ను ఎంటర్ చేయండి. అప్పుడు మీరు రిజిస్టర్ చేయించుకున్న మొబైల్ నంబర్‌కు ఒక OTP కోడ్ వస్తుంది.

మూడవ అడుగు

OTP పొందుకున్న తర్వాత, మీ పాస్‌వర్డ్ టైప్ చేసి, ‘Continue’ మీద నొక్కండి.

నాలుగవ అడుగు

మీకు ఒక టెంపరరీ రిఫరెన్స్ నంబర్ (TRN) వస్తుంది, ఈ నంబర్‌ మీరు రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నంబర్, మరియు ఇమెయిల్‌కు పంపించబడుతుంది.

అయిదవ అడుగు

మళ్ళీ తిరిగి GST పోర్టల్‌కు వెళ్లి ‘Register now’ బటన్ మీద నొక్కండి.

ఆరవ అడుగు

TRN ఆప్షన్‌ను ఎంచుకొని, మీ TRN సంఖ్యను ఎంటర్ చేయండి, తర్వాత అక్కడ ఇవ్వబడిన క్యాప్చ కోడ్ కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత, ‘Proceed’ మీద నొక్కండి. మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి, ‘Proceed’ మీద నొక్కండి.

ఏడవ అడుగు

మీ అప్లికేషన్‌ డ్రాఫ్ట్‌గా కనిపిస్తుంది. కచ్చితంగా ఎడిట్ ఐకాన్ మీద నొక్కండి.

ఎనిమిదవ అడుగు

GST నంబర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇది రెండవ భాగం. మీ వివరాలను నింపి, క్రింద పేర్కొనబడిన డాక్యుమెంట్‌లను సబ్మిట్ చేయండి.

 • రాజ్యాంగ రుజువు (ప్రూఫ్ ఆఫ్ కాన్‌స్టిట్యూషన్)
 • మీ వ్యాపార లొకేషన్, ప్రదేశాన్ని రుజువు చేసే డాక్యూమెంట్లు
 • గుర్తింపు రుజువు కోసం ఫోటోలు.
 • మీ బ్యాంక్ ఖాతా వివరాలు
 • మీ అధికార పత్రం

తొమ్మిదవ అడుగు

వెరిఫికేషన్ పేజీకి వెళ్ళండి, అక్కడ డిక్లరేషన్, అంటే ప్రకటన మీద క్లిక్ చేసి, క్రింద చూపించిన మార్గాలలో ఒకదాని ద్వారా మీ అప్లికేషన్‌ను పంపించవచ్చు:

 • ఎలక్ట్రానిక్ సంతకం చేసి (E-Sign): ఈ సంతకం (E-sign) అనేది ఆధార్ కార్డు ఉన్న భారతీయులకు ఏవైనా డాక్యూమెంట్లను డిజిటల్ మాంద్యమం సహాయంతో సంతకం చేసేందుకు అనుకూలించే సదుపాయం. మీ రిజిస్టర్ చేయబడ్డ ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది
 • ఎలెక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ ద్వారా : ఒక OTP మీ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.
 • డిజిటల్ సంతకం సర్టిఫికెట్ (DSC): డిఎస్‌సి (DSC) అనేది కంపెనీలకు తప్పనిసరి.

పదవ అడుగు

మీ వెరిఫికేషన్ విజయవంతం అని మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీ అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ (ARN) మీ రిజిస్టర్ చేయబడ్డ ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌కు పంపించబడుతుంది.

GST నంబర్ కోసం వెతకడం

పేరును ఉపయోగించి GST నంబర్‌ను తెలుసుకోండి

KnowYourGST మరియు Masters India లాంటి అనేకమైన వెబ్‌సైట్స్ ద్వారా పేరును ఉపయోగించి GST నంబర్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. కాకపోతే, మరింత కచ్చితమైన ఫలితాల కోసం, వ్యాపారం పేరు లేదా PAN కార్డు నంబర్‌లోని సంఖ్యలను కూడా ఉపయోగించడం మంచిది.

PAN సహాయంతో GST నంబర్ తెలుసుకోవడం ఎలా?

GST నంబర్ మరియు అదే విధంగా GST వివరాలను తెలుసుకోవడానికి, PAN నంబర్ వాడాలి అనుకుంటే కింది చూపించినట్టు చేయండి:

Step 1: GST పోర్టల్‌కు వెళ్ళండి

Step 2: మెనులో ‘Search Taxpayer’ అనే ట్యాబ్ మీద నొక్కండి

Step 3: ‘Search by PAN’ అనే ఆప్షన్ మీద నొక్కండి

ముగింపు

ప్రస్తుతం కాలంలో GST నంబర్ యొక్క ప్రాముఖ్యతను మీకు అర్థమయ్యేలా వివరించాము అనుకుంటున్నాము. GST పన్నును అమలు చేస్తున్న విధానాన్ని బట్టి, ప్రతీ వ్యాపారం దాని ప్రాముఖ్యతను తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Related Posts

Leave a Comment