written by khatabook | August 21, 2020

BHIM UPI ఎంత సురక్షితం? | సంపూర్ణ గైడ్

BHIM UPI పై పూర్తి సమాచారం

భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ లేదా BHIM అనేది ఆన్‌లైన్ నుంచే ప్రెమెంట్స్ చేయడానికి తయారు చేయబడ్డ అప్లికేషన్. దీనిని డిసెంబర్ 30, 2016న ప్రారంభించారు. ఈ అప్లికేషన్, UPI సాయంతో ఆర్థిక లావాదేవీలు నడిపిస్తుంది. UPI అంటే యూనిఫైడ్ ప్రెమెంట్స్ ఇంటర్ఫేస్, ఒకే అప్లికేషన్ సాయంతో మీరు మీ వేర్వేరు బ్యాంకు అకౌంట్లకు డబ్బు పంపించవచ్చు, వేరే వారి నుంచి పొందవచ్చు కూడా. BHIM అప్లికేషన్ మీ మొబైల్ నెంబర్ లేదా వర్చ్యువల్ ప్రైవేట్ అడ్రస్ (వీపిఏ )ద్వారా ఒక బ్యాంకు అకౌంట్ నుంచి మరొక అకౌంటుకు డబ్బును మార్చుకునే సదుపాయం కలిగిస్తుంది. BHIMలో ఉన్న ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సులభంగా నగదు బదిలీ చేయొచ్చు

BHIM ద్వారా మనం నిముషాల్లో ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు డబ్బుని బదిలీ చేయవచ్చు. VPA, అకౌంట్ నెంబర్, IFSC లేదా QR కోడ్ ద్వారా ఎవరికైనా డబ్బు పంపించాలి అనే ఆప్షన్ సహాయంతో డబ్బు పంపవచ్చు.

నగదు కోసం అభ్యర్థన

మీరు ఎవరి నుంచైనా డబ్బు అడగాలనుకుంటున్నారా? అయితే BHIM UPI సహాయంతో ఈజీగా అడగవచ్చు. BHIM UPI ద్వారా డబ్బుని అర్దించు అనే ఆప్షన్ వాడి, వర్చ్యువల్ పేమెంట్ అడ్రెస్ - (VPA) ఎంటర్ చేసి డబ్బుని పొందవచ్చు.

స్కాన్ & చెల్లించు

మీకు VPA గుర్తులేదా? అయినా ఏం పర్వాలేదు, స్కాన్ & పే ఆప్షన్ ద్వారా పంపవచ్చు. స్కాన్ & పే ద్వారా QR కోడ్‌ను స్కాన్ చేయండి, పే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని పేమెంట్ జరిగించండి. మీరు వ్యాపారం చేసేవారైతే, ఒక ప్రత్యేకమైన QR కోడ్ ద్వారా మీ లావాదేవీలను నడపవచ్చు.

లావాదేవీలు

BHIM UPI ద్వారా మీరు ముందు చేసిన లావాదేవీలను, పెండింగ్‌లో ఉన్న ప్రెమెంట్లను కూడా చూడవచ్చు. అక్కడి నుంచి మీరు వాటిని అంగీకరించడం లేదా తిరస్కరించడం చేయవచ్చు. సమస్యను నివేదించు అనే ఆప్షన్ ద్వారా ఫిర్యాదులను కూడా దాఖలు చేయవచ్చు.

ప్రొఫైల్

ప్రొఫైల్ నుండి మీరు మీ అకౌంట్‌కి సంబంధించిన వివరాలు, మీ QR కోడ్, పేమెంట్ చిరునామాను తెలుసుకోవచ్చు. అంతే కాకుండా, మీరు మీ QR కోడ్‌ను WhatsApp, ఇమెయిల్ వంటి అప్లికేషన్ల ద్వారా ఇతరులకు పంపించవచ్చు.

బ్యాంక్ అకౌంట్

BHIM UPIలోని బ్యాంకు అకౌంట్ ఆప్షన్ ద్వారా మీ బ్యాంకు అకౌంట్ మరియు మీ UPI PIN స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. మీరు మీ UPI PINను కొత్తగా సెట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు అలాగే మెనూలో ఉండే బ్యాంక్ అకౌంట్‌ను మార్చు అనే ఆప్షన్ ద్వారా ప్రస్తుతం అప్లికేషన్‌తో జత చేయబడ్డ బ్యాంకు అకౌంట్‌ను కూడా మార్చవచ్చు. మీ అకౌంట్‌లో డబ్బు ఎంత ఉంది అనేది కూడా బ్యాలన్స్ అనే ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

BHIM UPI పేమెంట్ యాప్ స్వాట్ విశ్లేషణ

BHIM UPI యాప్‌ను విశ్లేషించి చూస్తే, ఒక ఆన్‌లైన్ పేమెంట్ అప్లికేషన్‌లోని అనుకూలతలు, ప్రతికూలతలు, అవకాశాలను మనం తెలుసుకోగలము.

బలం NPCI, అంటే 9జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా గుర్తించబడింది, అలాగే ఉపయోగించడానికి చాలా సులువైనది.
బలహీనతలు అప్లికేషన్ యొక్క ఫీచర్ల పై వినియోగదారులకు సరైన అవగాహనా లేకపోవడం, యాప్‌లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే బలమైన విధాన లోపం చాలా మంది కస్టమర్లకు చేదు అనుభవాన్ని కలిగిస్తుంది.
అవకాశాలు దేశమంతటా డిజిటల్ పేమెంట్స్ బ్యాంకింగ్ మరియు లావాదేవీల సౌలభ్యాన్ని అందించే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. దీని కారణంగా నాన్-మెట్రో (టయర్ II మరియు III) గ్రామాలూ మరియు టౌన్‌లలో ఇంటర్నెట్ సర్వీసుల వినియోగం గణనీయంగా పెరిగింది.
ప్రమాదం డిజిటల్ లావాదేవీల భద్రత ఈ అప్లికేషన్ యొక్క అతిపెద్ద సమస్య. దీని కారణంగా యాప్ వినియోగం దెబ్బ తినవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా BHIM వాడగలమా?

ఖచ్చితంగా, మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ లేకపోయినా, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా మీరు మీ డిజిటల్ లావాదేవీలను BHIM UPI app సహాయంతో పూర్తీ చేయవచ్చు. అది ఎలా పాన్ చేస్తుంది అంటే:

 1. మీ ఫోన్ నుండి *99# డయల్ చేయండి.
 2. మీకు నచ్చిన భాషను ఎంచుకోండి.
 3. మీరు ఏ విధమైన లావాదేవీ జరపాలని అనుకుంటున్నారో ఎంచుకోండి.
 4. మీ బ్యాంక్ పేరు లేదా మీ బ్యాంక్ IFSC కోడ్ లోని మొదటి నాలుగు అక్షరాలను ఎంటర్ చేయండిఆ తర్వాత “రిప్లై” మీద నొక్కండి.
 5. మీకు ఒకటికి మించి అకౌంట్లు ఉంటే, ఏ అకౌంట్ ద్వారా లావాదేవీ జరపాలని అనుకుంటున్నారు ఆ అకౌంట్‌ను ఎంచుకోండి.
 6. అది కాకపోతే, మీ డెబిట్ కార్డు సంఖ్యలో చివరి ఆరు నంబర్లు, తర్వాత స్పెస్ ఇచ్చి, కార్డు చెల్లె తేదీ ఎంటర్ చేసి, రిప్లైమీద నొక్కండి.
 7. మీ ఆరు నంబర్ల UPI PIN నొక్కడి.

అంతే. మీ లావాదేవీ ప్రాసెస్ చేయబడుతుంది!

BHIM UPI అప్లికేషన్ వాడటం వలన ఉపయోగాలు ఏమిటీ?

BHIP UPI అప్లికేషన్ వాడటం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

 • ఈ డిజిటల్ ప్లాటుఫారమ్ ద్వారా దేశంలోని ఏ బ్యాంకుతో అయినా లావాదేవీలు జరపవచ్చు.
 • ఈ అప్లికేషన్ వాడటం వలన ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు.
 • ఇలా చేయడం వలన చాలా ఈజీగా, త్వరగా, సురక్షితంగా మీ పని పూర్తవుతుంది
 • సెలవురోజు, ఆదివారం అని లేకుండా సంవత్సరంలోని 365 రోజులు పనిచేస్తుంది.
 • BHIM వాడటానికి ఇంటర్నెట్ అవసరం లేదు, కాబట్టి ఒక సాధారణ ఫోన్ నుంచి కూడా మీరు UPI లావాదేవీలు జరపొచ్చు.
 • ఒకసారికి మీరు UPI ద్వారా రూ. 20000 వరకు పంపవచ్చు.
 • మీరు ఏ బ్యాంకు అప్లికేషన్ లోనైనా BHIM UPI వాడవచ్చు.
 • ఆఖరిగా, BHIM app ద్వారా లావాదేవీలు జరిపి అద్భుతమైన కాష్ బ్యాక్ పొందండి.

BHIM యాప్‌కు సంబంధించిన కొన్ని ముఖ్య ప్రశ్నలు - మీకోసం మా సమాధానాలు!

BHIM అప్లికేషన్ సురక్షితమేనా?

ఇది చాల ఎక్కువగా అడిగే ప్రశ్న. ఖచ్చితంగా, ఈ యాప్ నుంచి చేసే అన్ని లావాదేవీలు అత్యంత సురక్షితం. ఇది ప్రభుత్వ పరిపాలక సంస్థ అయిన NPCI చేయ తయారు చేయబడి, అత్యంత సురక్షితమైన గేట్వే నుంచి నడపబడుతుంది, 90సెకన్లు అప్లికేషన్‌ను గనుక వాడకపోతే, దానికదే లాక్ అయిపోతుంది.

BHIM UPI ద్వారా GST పేమెంట్లు చేయగలమా?

చేయగలరు, 29వ GST కౌన్సిల్ మీటింగ్ అనుసారంగా, ఒకవేళ మీరు GST పేమెంట్లుBHIM ద్వారా చేసినట్లయితే, మీ రసీదు ఆధారంగా మీకు అదనంగా కాష్ బ్యాక్ రూపంలో ప్రోత్సాహకాలు కూడా వస్తాయి. అంతేకాకుండా, GST కట్టిన ప్రతిసారి 100 రూపాయల వరకు, 20 శాతం కాష్ బ్యాక్ మీ అకౌంట్‌లో పడతాయి

తెలియని అదనపు చార్జీలు ఏమైనా ఉన్నాయా?

మనకందరికీ తెలిసినచాలా మంది షావుకార్లు కార్డుతో డబ్బు కట్టిన ప్రతిసారి అదనంగా కొంత కట్ చేసుకుంటారు, BHIM ద్వారా అలాంటి అనవసర ఖర్చులన్నీ తగ్గించి, ఈజీగా డబ్బుని పంపుకోవచ్చు, పైగా ఈ యాప్ ఇలాంటి సేవలన్నిటికి మీ దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోదు. BHIM ఒక చక్కని ఆలోచనతో, సరైన సమయంలో ప్రారంభించబడింది. ఈ యాప్ డీమోనీటిజైషన్ టైములో ప్రజల్లోకి వచ్చింది. అలా ఒక్క రోజులోనే సూపర్ హిట్ అయిపొయింది. ఇప్పుడు, మనమున్న ఈ డిజిటల్ యుగంలో ప్రభుత్వం లావాదేవీలన్నిటిని డిజిటల్ చేసి, సురక్షితంగా డబ్బు వాడుకునే అవకాశం కలిపించింది. అందుకు BHIMకి కృతజ్ఞతలు చెప్పితీరాలి. ఇంకేమైనా సమాచారాన్ని మేము ఇందులో కలపాలి అని అనుకుంటున్నారా? కామెంట్ చేసి, అదేంటో మాకు చెప్పండి!

Related Posts

None

వ్యయ ద్రవ్యోల్బణ సూచికకు పూర్తి గైడ్

1 min read

None

మీ వ్యాపారాలకు UPI QR కోడ్‌ను పొందడం ఎలా?

1 min read

None

వేర్వేరు బ్యాంకులకు ధ్రువీకరణ పత్రాలు ఎలా రాయాలి

1 min read

None

డెబిట్, క్రెడిట్ నోట్లు, మరియు వాటి ఫార్మాట్ ఏమిటి?

1 min read

None

BHIM UPI ఎంత సురక్షితం? | సంపూర్ణ గైడ్

1 min read