written by Khatabook | December 21, 2022

SIDBI అంటే ఏమిటి? SIDBI పథకాల లక్ష్యాలు ఏమిటి?

×

Table of Content


SIDBI, లేదా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేశంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల (MSMEలు) రంగాన్ని బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. ఏప్రిల్ 2, 1990న తన కార్యకలాపాలను ప్రారంభించిన ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) యొక్క అనుబంధ సంస్థ ఇది. మొదట్లో, IDBI చిన్న పరిశ్రమల అభివృద్ధి నిధి మరియు నేషనల్ ఈక్విటీ ఫండ్‌కు బాధ్యత వహించింది తరువాత, SIDBI ఈ రెండు నిధులను నిర్వహించడానికి బాధ్యత స్వీకరించింది. MSME రంగానికి ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, ఉత్పత్తిలో శుభ్రమైన పద్ధతులను ప్రోత్సహించడం మరియు శక్తిని సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా వాతావరణ మార్పులను అరికట్టడంలో SIDBI పాత్ర పోషిస్తుంది.

మీకు తెలుసా?

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా SIDBI అనేది పార్లమెంట్ చట్టం, 1988 ప్రకారం స్థాపించబడిన చట్టబద్ధమైన సంస్థ. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB), EXIM బ్యాంక్ మరియు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) వంటి ఇతర ఆర్థిక సంస్థల వలె, SIDBI కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్‌చే నియంత్రించబడుతుంది.

SIDBIపై పూర్తి గైడ్: పథకాలు మరియు విధులు

లోన్ కోసం దరఖాస్తు చేయడానికి దశలు

SIDBI దేనికి సంబంధించినది?

MSME రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఆర్థిక మద్దతు మరియు సహాయాన్ని అందించడానికి బాధ్యత వహించే ప్రధాన ఆర్థిక సంస్థ SIDBI, లేదా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను బలోపేతం చేయడానికి ఇలాంటి ఇతర సంస్థలతో కూడా కలిసి పని చేస్తుంది. పరోక్ష రుణాలు మరియు ప్రత్యక్ష రుణాల ద్వారా సంస్థ తన ఎజెండాను నెరవేరుస్తుంది. SIDBI MSME రంగానికి మద్దతు ఇవ్వడానికి విస్తృత స్థాయిని కలిగి ఉండటానికి, దేశవ్యాప్తంగా శాఖలను కలిగి ఉన్న బ్యాంకుల వంటి ప్రాథమిక రుణ సంస్థలకు రీఫైనాన్స్ అందిస్తుంది. డైరెక్ట్ లెండింగ్ ద్వారా, వ్యాపారాలు సజావుగా సాగేందుకు సెక్టార్‌లోని క్రెడిట్ గ్యాప్‌ను తగ్గించాలని SIDBI లక్ష్యంగా పెట్టుకుంది. SIDBI యొక్క ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఛానెల్ దేశంలోని స్టార్టప్ కంపెనీలకు మద్దతు ఇవ్వడం ద్వారా వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. ఈ సంస్థ ఈ రంగానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ పథకాలకు ఫెసిలిటేటర్‌గా కూడా పనిచేస్తుంది.

SIDBI యొక్క మిషన్ మరియు విజన్

SIDBI యొక్క లక్ష్యం చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు క్రెడిట్-ఫ్లోని సులభతరం చేయడం మరియు మెరుగుపరచడం. ఇది MSME పర్యావరణ వ్యవస్థలో ఫైనాన్సింగ్ మరియు అభివృద్ధి అంతరాలను పూరించడానికి సహాయపడుతుంది. భారతదేశంలోని MSME రంగం యొక్క ఆర్థిక మరియు అభివృద్ధి అవసరాలను తీర్చడానికి ఇది వన్-స్టాప్ పరిష్కారంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలా చేయడం ద్వారా, ఈ రంగాన్ని బలంగా మార్చి ప్రపంచవ్యాప్తంగా పోటీలో ఉండేలా మార్చాలనుకుంటోంది. కస్టమర్‌లు మరియు షేర్‌హోల్డర్‌లు ఒకే విధంగా ఇష్టపడే కస్టమర్-స్నేహపూర్వక సంస్థగా తనను తాను నిలబెట్టుకోవాలనుకుంటోంది.

SIDBI యొక్క లక్ష్యాలు

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దేశంలోని MSMEల కోసం క్రింది లక్ష్యాలు ఉన్నాయి -

 • సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందిచడం.
 • బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు పరోక్ష రుణాలు ఇవ్వడం ద్వారా పెద్ద జనాభాకు సులభంగా చేరువయ్యేలా అందిచడం.
 • చిన్న తరహా పరిశ్రమల ఆధునికీకరణలో మరియు మెరుగైన సామర్థ్యం కోసం సాంకేతికతను అప్‌గ్రేడ్ చేయడంలో సహాయపడటం.
 • మెరుగైన మార్కెటింగ్ వ్యూహాల ద్వారా చిన్న తరహా పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించడం.
 • వాతావరణ మార్పులపై జాతీయ ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం.

SIDBI యొక్క ప్రయోజనాలు

1. కస్టమైజ్డ్ రుణాలు

స్టార్టప్‌లు మరియు చిన్న తరహా పరిశ్రమలు తరచుగా వ్యాపారానికి సరిపడా మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవడం కష్టం. SIDBI వారి కస్టమర్లకు అనేక రుణ పథకాలను అందిస్తుంది. కానీ ఎవరికైనా ప్రత్యేక అవసరం ఉంటే, సంస్థ వ్యాపార అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించిన రుణాలను అందిస్తుంది. ఈ విధానం చిన్న-స్థాయి వ్యాపారాలు వారి అవసరాలకు అనుగుణంగా రుణాలు మరియు క్రెడిట్‌లను పొందడంలో సహాయపడుతుంది.

2. ఆకర్షణీయమైన వడ్డీ రేటు

అధిక-వడ్డీ రేట్ల వల్ల MSME రంగానికి ఇబ్బందులు ఎదురవుతాయి. సరసమైన వడ్డీ రేటును అందించడం ద్వారా సంస్థలకు రుణాలను పొందడాన్ని SIDBI సులభతరం చేస్తుంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ మరియు ప్రపంచ బ్యాంక్ వంటి అనేక జాతీయ మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో టై-అప్‌లను కలిగి ఉన్నందున SIDBI వారి వడ్డీ రేటును తక్కువగా ఉంచుతుంది.

3. తాకట్టు లేని రుణాలు

బ్యాంకులు సాధారణంగా తాకట్టుపై రుణాలు అందిస్తాయి. మరోవైపు, SIDBI తన కస్టమర్‌లకు సెక్యూరిటీ-రహిత రుణాలను అందిస్తుంది మరియు MSMEలు పూచీకత్తును అందించాల్సిన అవసరం లేకుండా ₹1 కోటి వరకు రుణం తీసుకోవచ్చు.

4. ప్రభుత్వ సబ్సిడీలు

ప్రభుత్వం MSMEలకు సబ్సిడీని అందించాలని నిర్ణయించినప్పుడు, SIDBI వ్యాపార యజమానులకు సాధారణ వడ్డీ రేటు కంటే తక్కువ రేటుతో సులభమైన నిబంధనలు మరియు షరతులతో అటువంటి సబ్సిడీ రుణాలు మరియు పథకాలను అందిస్తుంది.

5. టెంపరింగ్ లేని కంపెనీ యాజమాన్యం

వ్యాపార యజమానులు కొన్నిసార్లు తమ వ్యాపారం కోసం మూలధనాన్ని పొందేందుకు కంపెనీ యొక్క పాక్షిక యాజమాన్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది. SIDBI వ్యాపార యజమానులకు క్రెడిట్ మరియు రుణాలను అందించడం ద్వారా వారి కంపెనీ యాజమాన్యంపై ప్రభావం చూపకుండా వారి ప్రయోజనాలను పరిరక్షిస్తుంది..

6. పారదర్శక విధానం

SIDBI రుణ ప్రక్రియ మరియు మంజూరు విధానం చాలా స్పష్టంగా ఉంటాయి, దాచిన ఛార్జీలు ఏమీ ఉండవు. రుణ ప్రక్రియలో అధిక స్థాయి పారదర్శకతను పాటించడానికి వడ్డీ రేట్లు మరియు ఇతర ఛార్జీలు రుణదాతలకు ముందే పేర్కొనబడతాయి.

7. ప్రత్యేక సహాయం

SIDBI బ్యాంక్ వివిధ పథకాల ద్వారా MSMEలకు రుణాలను అందిస్తుంది మరియు వ్యాపారానికి సంబంధించిన విలువైన సమాచారంతో పాటు మార్గదర్శకత్వం అందించడం ద్వారా స్టార్టప్ కంపెనీలు మరియు వ్యవస్థాపకులకు సహాయం చేస్తుంది. లోన్ ప్రక్రియ సమయంలో వ్యాపార యజమానులు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వారి రిలేషన్షిప్ మేనేజర్‌లు సహాయం చేస్తారు.

SIDBI యొక్క విధులు

SIDBI చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం చేయడానికీ, అభివృద్ధి చేయడానికీ దేశంలోని వివిధ సంస్థలతో కలిసి పని చేస్తుంది. వాణిజ్య సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు మొదలైన ఆర్థిక సంస్థలు భారతదేశంలో MSME పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి SIDBIతో కలిసి పనిచేస్తాయి. ఇప్పుడు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వివిధ విధులను చూద్దాం.

 • చిన్న తరహా పరిశ్రమలకు రుణాలు మంజూరు చేయడానికి మరియు చిన్న వ్యాపార యూనిట్ల ద్వారా రుణాలను ప్రోత్సహించడానికి వాణిజ్య బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలకు రీఫైనాన్సింగ్ చేయడం.
 • చిన్న వ్యాపార యూనిట్ల బిల్లులను తగ్గించడంతో పాటు వ్యాపారాలకు సహాయం చేయడానికి మరిన్ని తగ్గింపులు అందించడం.`
 • ఇతర దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే చిన్న-స్థాయి యూనిట్లకు సహాయం చేయడం. అటువంటి ఎగుమతిదారుల ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రదర్శనలలో ప్రదర్శించడానికి SIDBI సహాయం చేయడంతో పాటు ఆ ఖర్చులను కూడా భరిస్తుంది.
 • మంచి వ్యాపారవేత్తలకు సీడ్ క్యాపిటల్ మరియు వ్యాపారాన్ని నిలబెట్టుకోవడం కోసం సాఫ్ట్ లోన్‌లు అందించడం. సాఫ్ట్ లోన్‌లలో వడ్డీ రేటు చాలా తక్కువ. 15-20 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో తిరిగి చెల్లించవచ్చు.
 • నిర్దిష్ట భౌగోళిక స్థానాల్లో సర్వేలు నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతంలో MSMEలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని గుర్తించడం. SIDBI వ్యాపార యజమానుల కోసం ముడి పదార్థాలను సేకరించడంలో సహాయం చేయడం ద్వారా ఆర్థికేతర సహాయాన్ని కూడా అందిస్తుంది.
 • చిన్న-స్థాయి వ్యాపార యజమానులు ఖరీదైన మెషినరీని కొనుగోలు చేయడంలో సహాయం చేయడానికి హైర్‌ల కొనుగోలు ఫైనాన్సింగ్‌ను అందించడం.
 • చిన్న తరహా రంగానికి ఫ్యాక్టరింగ్ సేవలు, లీజింగ్ మొదలైనవాటిని అందించడం.

SIDBI అందించే పథకాలు

1. డైరెక్ట్ ఫైనాన్సింగ్ కింద రుణ పథకాలు

SMILE (MSME కోసం SIDBI మేక్ ఇన్ ఇండియా సాఫ్ట్ లోన్ ఫండ్) సేవ లేదా తయారీ రంగంలో కొత్త వ్యాపారాలకు మూలధనాన్ని అందిస్తుంది.

లోన్ కాలవ్యవధి: 10 సంవత్సరాలు

లోన్ మొత్తం: ₹10 లక్షల నుండి ₹25 లక్షలు

2. STFS (SIDBI ట్రేడర్ ఫైనాన్స్ స్కీమ్)

ఈ పథకం కనీసం మూడు సంవత్సరాలుగా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్న హోల్‌సేల్  వ్యాపారులు, రిటైల్ వ్యాపారుల మరియు ట్రేడర్ల కోసం.

రుణ కాల వ్యవధి: వ్యాపారం యొక్క క్యాష్-ఫ్లో పై ఆధారపడి ఉంటుంది

లోన్ మొత్తం: ₹10 లక్షల నుండి ₹1 కోటి వరకు

3. SEF (స్మైల్ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్)

కొత్త పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న MSMEలకు ఈ ఆర్థిక పథకం సహాయపడుతుంది.

లోన్ కాలవ్యవధి: 72 నెలలు

లోన్ మొత్తం: కనీసం ₹10 లక్షలు

4. TULIP (తక్షణ ప్రయోజనాల కోసం టాప్-అప్ లోన్)

ఇప్పటికే లోన్‌లను కలిగి ఉన్న వ్యాపార యజమానులు ఈ ఫైనాన్స్ స్కీమ్ ద్వారా తమ లోన్‌లను 7 రోజుల్లో  టాప్-అప్ చేసుకోవచ్చు.

రుణ కాల వ్యవధి: గరిష్టంగా 5 సంవత్సరా` లు

లోన్ మొత్తం: నికర అమ్మకాలలో 20% లేదా ఇప్పటికే ఉన్న ఎక్స్‌పోజర్‌లో 30%

5. SPEED (ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ కోసం ఎక్విప్‌మెంట్ కొనుగోలు కోసం లోన్)

ఈ పథకం కొత్త మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్‌లకు ఉపయోగపడుతుంది. ఒక్కటే షరతు ఏమిటంటే, వ్యాపారం కనీసం మూడు సంవత్సరాలు పని చేసి ఉండాలి.

లోన్ కాలపరిమితి: 5 సంవత్సరాలు మరియు 6 నెలల మారటోరియం

లోన్ మొత్తం: కొత్త కస్టమర్‌లకు ₹1కోటి వరకు మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్‌లకు ₹2 కోట్ల వరకు

6. OEM (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారు) భాగస్వామ్యంతో రుణాలు

చిన్న తరహా పరిశ్రమలు ఈ పథకం కింద నేరుగా తయారీదారుల ద్వారా యంత్రాలను మరియు పరికరాలను కొనుగోలు చేయవచ్చు.

లోన్ కాలవ్యవధి: అర్హత ఉన్న మారటోరియంతో 5 సంవత్సరాలు

లోన్ మొత్తం: ₹1 కోటి వరకు

7. వర్కింగ్ క్యాపిటల్ (నగదు క్రెడిట్)

వ్యాపారాలు సౌకర్యవంతమైన రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తక్షణ ఆమోదంతో, ఈ ఆర్థిక ఉత్పత్తి వ్యాపారం యొక్క తక్షణ అవసరాలను తీర్చడానికి ఒక గొప్ప ఎంపిక.

లోన్ కాలపరిమితి: పథకం యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం

లోన్ మొత్తం: రుణగ్రహీత ఆర్థిక స్థితి ప్రకారం

SIDBI యొక్క ఇతర ఆర్థిక పథకాలు

మైక్రోలెండింగ్: వ్యాపారవేత్తలు మరియు మహిళా పారిశ్రామికవేత్తలు SIDBI అందించే మైక్రోలెండింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు.

1. పరోక్ష ఫైనాన్సింగ్

SIDBI చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించే ఇతర ఆర్థిక సంస్థలకు పరోక్ష ఫైనాన్సింగ్ అందిస్తుంది.

2. వెంచర్ క్యాపిటల్

SIDBI యొక్క అనుబంధ సంస్థ అయిన SIDBI వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్, ఆస్పైర్ ఫండ్స్, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ మొదలైన వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు మూలధనాన్ని అందిస్తుంది.

ముగింపు

SIDBI కస్టమర్లు రుణాలు మరియు ఇతర ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చాలా సులభతరం చేసింది. వ్యాపార యజమాని కొన్ని దశల్లో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట,  SIDBI యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌తో నమోదు చేసుకోవాలి, ఆపై పథకం మరియు కావలసిన లోన్ మొత్తాన్ని ఎంచుకోవాలి. చివరగా, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి వ్యక్తిగత వివరాలను చేర్చాలి. దరఖాస్తును పరిశీలించి, ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత, SIDBI అధికారులు MSMEలకు రుణాలను మంజూరు చేస్తారు. ఈ ఆర్థిక సంస్థ అందించే క్రెడిట్ మరియు రుణాలు దేశంలో ఈ రంగం యొక్క అభివృద్ధికి తోడ్పడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

సూక్ష్మ, చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలు (MSMEలు), వ్యాపార చిట్కాలు, ఆదాయపు పన్ను, GST, జీతం మరియు అకౌంటింగ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్‌లు, వార్తల బ్లాగులు మరియు కథనాల కోసం Khatabookని ఫాలో అవ్వండి.

తరుచుగా అడిగే ప్రశ్నలు

ప్రశ్న: SIDBI అంటే ఏమిటి?

సమాధానం:

SIDBI యొక్క పూర్తి రూపం స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. MSMEలను బలోపేతం చేసి వాటిని అభివృద్ధి చేయడానికి వారికి ఆర్థిక సహాయం అందించడం అత్యవసరం.

ప్రశ్న: SIDBI లోన్ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

సమాధానం:

భారతదేశంలోని ఏదైనా సూక్ష్మ, చిన్న లేదా మధ్యస్థ సంస్థ SIDBI ద్వారా నేరుగా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరియు సంస్థ స్టార్టప్‌లు మరియు స్థాపించబడిన వ్యాపార యజమానులకు అనేక ఆకర్షణీయమైన ఆర్థిక పథకాలను అందిస్తుంది.

ప్రశ్న: SIDBI వద్ద రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఏ పత్రాలు అవసరం?

సమాధానం:

వ్యాపార యజమానులు తప్పనిసరిగా గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు వ్యాపారానికి సంబంధించిన ఇతర సంబంధిత పత్రాలను సమర్పించాలి.

ప్రశ్న: చిన్న వ్యాపారానికి రుణాన్ని ఆమోదించేటప్పుడు SIDBI బ్యాంక్ క్రెడిట్ చరిత్రను పరిగణంలోకి తీసుకుంటుందా

సమాధానం:

వ్యాపార యజమాని క్రెడిట్ చరిత్ర ఆధారంగా SIDBI బ్యాంక్ రుణాన్ని ఆమోదించదు. చిన్న వ్యాపార యూనిట్లకు ఆర్థిక సహాయం చేయడం ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం దీని ప్రధాన లక్ష్యం.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.