written by khatabook | July 24, 2020

GST కౌన్సిల్ – 33 మంది సభ్యుల పాలనా విధానం

చాలా కాలం తర్వాత, భారత ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన, దేశానికి లాభదాయకమైన నిర్ణయాలలో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST) కూడా ఒకటి. పలు విధాల పరోక్షమైన పన్నులకు బదులు ఒకే ప్రామాణికతతో కూడిన ట్యాక్స్ ఉండాలనేది GSTని ప్రవేశ పెట్టడానికి గల మూల కారణం. ఇది జులై 1, 2017 నుండి అమలు చేయబడింది.

పలు విధాల సేవలు మరియు వస్తువులను విక్రయించే వ్యాపారాలకు వర్తిస్తున్న ట్యాక్స్ చట్టాలను సులభతరం చేయడం  GST యొక్క ముఖ్య లాభం. దీని అమలుతో బిల్లులు లేకుండా కొనుగోళ్లు, అమ్మకాలకు చెక్ పెట్టి, అసంఘటిత రంగాలలో ఉన్న లొసుగులు, అక్రమాన్ని తగ్గించి, పన్ను ఎగవేతదారులకు అడ్డుకర్ర వేయడం ప్రభుత్వ ఉద్దేశం.

ఇందులో అయిదు స్లాబులు (0%, 5%, 12%, 18% and 28%) ఉంటాయి. ఇవి మాత్రమే కాక, బంగారం లేదా ఇతర విలువైన లోహాలకు 3% మరియు నాణ్యత తక్కువగా ఉండే వజ్రాలు, ఇతర విలువైన రాళ్లపై 2.5% అదనపు పన్ను విధించబడుతుంది. 

ఇక, మనలో చాలామందికి GST మీద ఒక మోస్తరు అవగాహన ఉన్నా, ఒక్కోసారి GST వర్తించబడ్డ బిల్లును చూస్తే, దాని మీద CGST + SGST, లేదా CGST +UTGST అని వ్రాసి ఉండడం చూస్తాం. ఇప్పుడు వాటి అర్ధం ఏమిటో తెలుసుకుందాం.

GSTలో ఉన్న వివిధ రకాలు

సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (CGST)

వ్యాపార కార్యకలాపాలకు అంతర్‌‌రాష్ట్ర రవాణా వెసులుబాటు కల్పించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం గూడ్స్ మరియు సర్వీసెస్ మీద ఈ పన్నును వసూలు చేస్తుంది.

స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (SGST)

ఈ SGST రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్ను. SGSTలో రాష్ట్ర సేల్స్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, వినోద పన్ను, సెస్ ఛార్జీలు, సర్‌ఛార్జీలు, విలువ ఆధారిత పన్ను, బెట్టింగ్ & జ్యుదం పై పన్ను, లాటరీ బహుమతిపై పన్ను మరియు ప్రవేశ పన్ను లాంటి రక రకాల పన్నులు దీని క్రిందకు వస్తాయి.

 ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (IGST)

ఎగుమతి కాని, అంతర్ రాష్ట్ర రవాణా జరిగే సరుకులపై CGST లేదా SGSTకి బదులు కేంద్ర ప్రభుత్వం ఈ పన్నును విధించవచ్చు. ఇది భారతదేశమంతటా వర్తిస్తుంది.

యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (UTGST)

కేంద్ర పాలిత ప్రాంతాలను యూనియన్ టెరిటరీలు అంటారు. తమకంటూ ఒక గవర్నమెంటును ఏర్పరచుకోలేని ప్రాంతాలలో ఈ పన్నును విధిస్తారు. భారతదేశంలో ఉన్న అయిదు కేంద్ర పాలిత ప్రాంతాలు, అనగా అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా మరియు నగర్ హవేలీ, దమన్ మరియు దియు, చంఢీగర్, మరియు లక్షద్వీప్ దీవులలో లభించే సేవలు మరియు వస్తువులపై ఈ పన్నును విధిస్తారు. 

GST కౌన్సిల్ అంటే ఏమిటి?

GST నియమాలను, నిబంధనలను రూపించడానికి కేంద్ర ప్రభుత్వం 33 మంది సభ్యులు గల బృందాన్ని ఏర్పరచింది. ఈ బృందానికి ప్రస్తుత దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తున్నారు.         

                                                                            

సభ్యుల జాబితా ఇది:

 • యూనియన్ ఫైనాన్స్ మినిష్టర్, వీరిని కౌన్సిల్‌కు అధ్యక్షులుగా నియమిస్తారు.
 • దేశ రెవెన్యూ వ్యవస్థ ఇన్-ఛార్జ్ అయిన యూనియన్ మినిస్టర్ కౌన్సిల్ సభ్యునిగా ఉండాలి. 
 • ప్రతీ రాష్ట్రం నుండి మరియు కేంద్ర పాలిత ప్రాంతం నుండి సంబంధిత ఆర్థిక మంత్రి ఒకరు. 
 • ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రుల నుండి GST కౌన్సిల్ సభ్యులు ఒకరిని ఉప అధ్యక్షునిగా ఎన్నుకుంటారు.
 • రెవెన్యూ విభాగం సెక్రటరీని GST కౌన్సిల్ యొక్క సెక్రటరీగా కూడా పరిగణిస్తారు.

కేంద్ర ఎక్సయిజ్ మరియు కస్టమ్స్ అధ్యక్ష్యుడిని అన్ని చర్చలలో శాశ్వత సభ్యునిగా ఆహ్వానిస్తారు. GST కౌన్సిల్ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంటుంది, ఇప్పటి వరకు మొత్తం 37 సభలు, నేరుగా కలిసి, లేదా వీడియో కాల్స్ సహాయంతో నిర్వహించడం జరిగింది.

దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా GST గురించిన అన్ని రకాల ముఖ్య నిర్ణయాలు తీసుకొనేందుకు అధికారమున్న రాజ్యాంగ సమాఖ్య సంస్థ అయిన GST కౌన్సిల్ యోక్క ధ్యేయం తమ ఆధ్వర్యంలో అత్యంత బలమైన, ఉన్నతమైన ప్రమాణాలు గల సహకార సమాఖ్యవాద దృక్పధాన్ని నెలకొల్పడం అని వారి వెబ్సైట్ నందు పేర్కొన్నారు.

అనేక మంది నిపుణుల సహాయం పొంది ఉపయుక్తమైన ప్రణాళిక సౌలభ్యంతో, మేలైన, టెక్నాలజీ ఆధారిత గూడ్స్ మరియు సర్వీస్ ట్యాక్స్ నిర్మాణాన్ని రూపుదిద్దడం GST కౌన్సిల్ ముఖ్య ఉద్దేశం. 

GST కౌన్సిల్ పాత్ర

GST కౌన్సిల్ క్రింద ఇవ్వబడిన విషయాల మీద కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తుంది:

 • GST పరిధిలోకి వచ్చే కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ట్యాక్సులు, సెస్ చార్జీలు, సర్ ఛార్జీలు.
 • GST నుండి మినహాయింపు లేదా పన్నును ఆహ్వానించే సేవలు మరియు వస్తువుల విషయం.
 • ఇంటిగ్రేటెడ్ గూడ్స్ & సర్వీస్ ట్యాక్స్ యొక్క అమలు, GST చట్టాలు మరియు వాటి అమలు విధాన విషయం మరియు సేవలు & వస్తువుల సరఫరా స్థలం గురించి.
 • ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన పక్షాన, ప్రభుత్వాలకు రాబడిని పెంచేందుకు వీలుగా అమలు చేయబడే ప్రత్యేక పన్నుల విషయం.
 • ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక పన్ను వెసులుబాట్లు (జమ్మూ కాశ్మిర్, ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు).
 • హై-స్పీడ్ డీజిల్, పెట్రోలియం క్రూడ్, సహజ వాయువులు, మరియు విమానయాన ఇంధనాలపై GST విధిచాల్సిన తేదీని నిర్ణయించడం.
 • GST నుండి మినహాయింపునకు గరిష్ట టర్నోవర్‌ను నిర్ణయించడం.
 • GST యొక్క ఫ్లోర్ రేట్లను నిర్ణయించడం.
 • కౌన్సిల్ ద్వారా అనివార్యమని నిర్ణయించబడ్డ మరే ఇతర GST సంబంధిత విషయమై తీసుకోవాల్సిన నిర్ణయాలు.

GST కౌన్సిల్ నిర్ణయాలు తీసుకొనే విధానం

GST సంబంధిత నిర్ణయాలు జారీ చేసే ముందు 3 ముఖ్యమైన విషయాలను కౌన్సిల్ సభ్యులు పరిగణలోనికి తీసుకొవాల్సి ఉంటుంది.

 • ఏదైనా ఒక సభను అధికారికంగా గుర్తించాలి అంటే, కనీసం 50% GST కౌన్సిల సభ్యులు సభకు హాజరయ్యి ఉండాలి.
 • క్రింద వివరించబడిన విధముగా, ఏదైనా నిర్ణయం తీసుకొవడానికి సభకు హాజరైన సభ్యులలో 75% మంది మద్దతు తెలపాలి.

ఆర్టికల్ 279A ప్రకారం, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల మధ్య వేయబడే ఓట్లు విభజించబడతాయి:

మొత్తం ఓట్లలో, కేంద్ర ప్రభుత్వం మూడవ భాగం మట్టుకు ఓట్లు వేయవచ్చు. అలాగే సభలో మిగిలిన రెండంతలు ఓట్లు రాష్ట్ర ప్రభుత్వం వారు వేయగలరు.

ఏదైనా నిర్ణయం తీసుకున్న తరువాత, GST కౌన్సిల్ నందు ఏర్పడిన సభ్యత్వ ఖాళీ కారణంగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు. అందుకు క్రింద సూచించబడిన పరిస్థితులు వర్తిస్తాయి:

 • సభ్యుల సంఖ్యలో ఖాళీ ఉన్నా.
 • కౌన్సిల్ యొక్క రాజ్యంగంలో ఉన్న లోపాల కారణంగా.
 • విధానపరమైన అసమ్మతి కారణంగా.
 • కౌన్సిల్ సభ్యుని ఎన్నికలో లోపం ఉందని తేలినా.

ఒకవేళ GST కౌన్సిల్ సభ్యుల మధ్య అసమ్మతి తలెత్తితే, ఆ సందర్భంలో విభేదాలపై న్యాయానిర్ణయం చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోబడ్డాయి. వాటిని 'వివాద విధానాలు' ఆంటారు, అవసరం ఏర్పడినప్పుడు వాటిని అనుసరించేందుకు రాజ్యాంగ బద్దంగా కొన్ని నిభందనలు ఏర్పాటు చేయబడ్డాయి.

నూట ఒక్కటో సవరణ చట్టం క్రింద 2016లో జారీ చేయబడిన రాజ్యాంగం ప్రకారం, క్రింద సూచించబడిన పార్టీల మాధ్య విభేదం నెలకొంటే తీర్చడానికి ఒక విధానం ప్రవేశపెట్టబడింది:

 • భారతదేశ ప్రభుత్వం మరియు ఒకటి లేదా, అంతకు మించిన రాష్ట్రాల మధ్య ఏర్పడిన విభేదం.
 • భారతదేశ ప్రభుత్వంతో ఏకిభవించే మరొక రాష్ట్రానికి మరియు ఒకటి లేదా అంతకు మించి రాష్ట్రాలకు మధ్య నెలకొన్న విభేదం.
 • రెండు లేదా అంతకు మించిన రాష్ట్రాల మధ్య, GST కౌన్సిల్ సిఫార్సుల కారణంగా ఏర్పడిన విభేదాలు.
 • మరియు, భారతదేశ ప్రభుత్వం మధ్య ఏర్పడే విభేదాలు.
mail-box-lead-generation

Got a question ?

Let us know and we'll get you the answers

Please leave your name and phone number and we'll be happy to email you with information

Related Posts

None

జిఎస్‌టి: త్రైమాసిక రిటర్న్ ఫైలింగ్ మరియు నెలవారీ ట్యాక్స్ చెల్లింపు (QRMP)


None

జిఎస్‌టి ప్రకారం సప్లై ప్రదేశం


None

నిల్ జిఎస్‌టి రిటర్న్ ఫైల్ చేయడం ఎలాగో తెలుసుకోండి


None

జిఎస్‌టి క్రింద ఐటిసి రివర్స్ చేయడం ఎలాగో తెలుసుకోండి


None

ఎక్సెల్ మరియు వర్డ్ లో జాబ్ వర్క్ కొరకు డెలివరీ చలాన్ ఫార్మెట్


None

మన దేశంలో ఉన్న వివిధ రకాల GST - SST, CGST, IGST మధ్య తేడా ఏంటి?


None

మీరు ఒక సర్టిఫైడ్ GST ప్రాక్టీషనర్ ఎలా అవ్వగలరు?


None

ఈ-వె బిల్లు అంటే ఏమిటి? ఈ-వె బిల్లును జనరేట్ చేయడం ఎలా?


None

GST నంబర్: ప్రతీ వ్యాపారానికి కావాల్సిన 15 అంకెల నంబర్

1 min read