written by Khatabook | January 2, 2022

1లక్ష లోపు పెట్టుబడితో చేయగల మంచి వ్యాపారాలు

వ్యాపారం మొదలు పెట్టాలంటే, చాలా డబ్బు అవసరం అనేది సాధారణంగా ప్రజలలో ఉన్న భావన. కానీ అది నిజం కాదు. ప్రస్తుత రోజులలో, మీరు తక్కువ పెట్టుబడితోనే, ఎలాంటి ఒత్తిడి లేకుండా కూడా వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. కేవలం 1 లక్ష రూపాయలతో, అద్భుతమైన వ్యాపారాలను మొదలుపెట్టి, విజయవంత కావడానికి, మనకు ఈ రోజుల్లో, ఎన్నో అవకాశాలు ఉన్నాయ్. అందుకుగాను, మీకు కావాల్సిందల్లా, మీరు చేయబోయే వ్యాపార రంగం పై తగిన జ్ఞానం, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అలాగే కాస్త జాగ్రత్త. ఈ ఆర్టికల్ లో, మనం కేవలం లక్ష పెట్టుబడితో చేయగల కొన్ని వ్యాపారాల గురించి తెలుసుకుందాం. 

 

మీరు లక్ష రూపాయలతో మొదలుపెట్టగల కొన్ని వ్యాపారాలు ఏమిటి?

మనం ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో ఉంటున్నాం. అందులోనూ, ప్రపంచంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా, ఈ దశాబ్ధాన్ని ఆన్లైన్ దశబ్దంగా పేర్కొన్నారు. కాబట్టి, ఈ రోజుల్లో, మీరు ఆన్లైన్ వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనుకుంటే, అది చాలా ఈజీ. అలా మీరు మొదలుపెట్టగల కొన్ని వ్యాపారాలు ఏమిటంటే….

  • ఆన్లైన్ భోదన 

ప్రస్తుతం, ఈ లెర్నింగ్ బిజినెస్, ఉన్న వ్యాపారాలన్నిటిలో, అత్యంత లాభదాయకంగా ఉంది. ఇటీవలి సర్వేలలో తెలిసింది ఏమిటంటే, రానున్న భవిష్యత్తులో ఆన్లైన్ భోధన వ్యాపారాలు ఎన్నో రెట్ల డిమాండ్ ని పొందనున్నాయి అంట. కాబట్టి, మీరు గనుక విద్యకు సంబంధించిన బిజినెస్ మొదలుపెట్టాలి అనుకుంటే, మీరు ఉన్న చోట నుండే ఆన్లైన్ ట్యూషన్స్ మొదలుపెట్టవచ్చు. కేవలం లక్షతో లోపు పెట్టుబడితో ప్రారంభించి, మంచి లాభాలను పొందగల అద్భుతమైన వ్యాపారాలలో ఇది ఒకటి. 

మరి మీ ఆన్లైన్ ట్యూషన్ బిజినెస్ ప్రారంభించడం ఎలా? ఆన్లైన్ లో ట్యూషన్ అంటే, విద్యార్థులు, తల్లిదండ్రులు ఒకే చోట నుండి అన్ని సబ్జెక్టులకు శిక్షణ పొందడానికి చూస్తారు. కాబట్టి, మీరు ముందుగా అన్ని రాగాలకు సంబంధించిన, మంచి అనుభవం ఉన్న టీచర్లను సిద్ధం చేసుకోవాలి. ముందుగా, ఈ-ట్యూషన్ సర్వీసు కంపెనీ మొదలుపెట్టడానికి మీకు 11,000 రూపాయలు కావాలి. ఆ తర్వాత, మీ బిజినెస్ కి సంబంధించిన వెబ్సైట్ కోసం ఇంకొక 5000-6000 వేలు ఖర్చు చేయాలి. అలాగే, మెటీరియల్స్, ఇంటర్నెట్ లాంటి వాటికి ఇంకొక అయిదు లేక ఆరు వేలు ఖర్చు అవుతుంది. ఇంకా, మీరు ఒప్పించే దాన్ని బట్టి, టీచర్లకు కూడా కొంత ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 

  • జూస్ కౌంటర్ 

మన దేశంలో, ఎండలు ఎక్కువ. కాబట్టి, మంచి జూస్ షాపుకు ఎక్కడైనా గిరాకీ ఉండక మానదు. అందుకే జూస్ వ్యాపారం, తక్కువ ఖర్చుతో చేయగల అత్యంత లాభసాటి వ్యాపారాలలో ఒకటిగా నిలిచింది. 

మీ ఊర్లో జూస్ షాప్ మొదలుపెట్టాలంటే, మీరు కనీసం 25 వేలు ఖర్చు చేసి మంచి ప్రదేశాన్ని రెంట్ కి తీసుకోవాలి. మంచి ప్రదేశం కోసం ఒక్కోసారి 50 వేలు ఖర్చు చేసిన పర్వాలేదు. ఆపై, మిక్సీ, గ్లాసులు, గిన్నెలు వగైరా వంటి వాటికి ఇంకో 20-25 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

  • డ్రాప్-షిప్పింగ్ సర్వీసు

ఇంటర్నెట్ క్రేజ్ కారణంగా, ప్రస్తుతం డ్రాప్-షిప్పింగ్ సర్వీసులు చాలా ప్రాముఖ్యతను సంపాదించుకున్నాయి. డ్రాప్-షిప్పింగ్ వ్యాపారాలు పుట్టగొడుగుల్లా వెలసిన కారణంగా, తమ వస్తువులను వేగంగా, సురక్షితముగా, చేరవేయగల సర్వీసులకు మంచి డిమాండ్ పెరిగింది. 

మరి అలాంటి వ్యాపారాన్ని మొదలుపెట్టడం ఎలా? ముందుగా, ఏదైనా సిటీలో డ్రాప్-షిప్పింగ్ సర్వీసు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు కనీసం 35,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ పై, కాస్త తక్కువ ఖర్చులు ఉండే చోట, మీరు రవాణా చేసే వస్తువులను స్టోర్ చేసుకోవడానికి ఒక ప్రదేశాన్ని రెంటుకి తీసుకోవాలి. అలాగే, పనికి గాను, కొంతమందిని పెట్టుకోవాల్సి ఉంటుంది కూడా. ఆపై, మీరు రవాణా చేసి వస్తువులను ప్యాక్ చేయడానికి, అలాగే ఆర్డర్లు పొందడానికి వెబ్సైటు చేయించాలి. దీనికి మళ్ళీ ఒక 20-30 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆపై, మిగతా డబ్బుతో మీరు రవాణా ఏర్పాట్లు చేసుకోవాలి. 

  • క్లౌడ్ కిచన్ 

ఫుడ్ సెక్టార్ లో ఉన్న అవకాశాలు అన్ని ఇన్ని కాదు. సాధారణ రెస్టారెంట్ కోసం అయ్యే భారీ ఖర్చు, పెట్టుబడుల కారణంగా, ఆన్లైన్ సర్వీసుల సహాయంతో అమ్మకాలు జరపగల క్లౌడ్ కిచన్ల ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొందాయి. కేవలం ఒక వెబ్సైట్ లేదా డెలివరీ సర్వీసు సహాయంతో, ఆరోగ్యకరమైన మంచి ఆహారాన్ని అందించడమే క్లౌడ్ కిచన్ల ఉద్దేశం. 

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీకు మంచి వెంటిలేషన్ ఉన్న ప్రదేశం, వంట సామాగ్రి ఇంకా పనివారు కావాలి. ప్రారంభ బడ్జెట్ కనీసం 1లక్ష ఉంటుంది. 

  • వెబ్సైట్లు అమ్మడం

చిన్నా, పెద్దా అని తేడా లేకుండా, ప్రతీ వ్యాపారం ఇప్పుడు ఆన్లైన్ ఉనికి కలిగి ఉండడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి, మార్కెట్ లోకి వచ్చిన నూతన కాన్సెప్ట్ గా, అలాంటి వ్యాపారాలకు తమ వెబ్సైటుపై పని చేసి, వాటిని చక్కగా రూపొందించగల వారి అవసరం ఎంతైనా ఉంది.  మీకు గనుక, పాత వెబ్సైట్ల పై పని చేసి, వాటిని నూతనంగా, చూడడానికి చక్కగా తయారు చేసి, వాటికోసం ఒక యాప్ చేయగల జ్ఞానం ఉంటే, మీరు ఈ వెబ్సైట్ లను కొని, అమ్మే బిజినెస్ మొదలుపెట్టొచ్చు. లక్షలోపు మీరు ప్రారంభించగల మంచి వ్యాపారాలలో ఇది కూడా ఒకటి. మీరు చేసే పని, దానికి పెట్టె సమయాన్ని బట్టి, మీరు మీ ఛార్జీలు నిర్ణయించవచ్చు. 

మరి ఇలాంటి వ్యాపారాన్ని స్థాపించి, నడిపించడం ఎలా? ఇలాంటి వ్యాపారంలో ఎదగాలంటే, ముందుగా మీకంటూ ఒక వెబ్సైట్ ఇంకా యాప్ ఉండాలి. వాటిని మీరు ఎంత అందంగా రూపొందిస్తారో, మీకు క్లయింట్లు అంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే, వాటిని నిర్మించడానికి మీరు వాడే కంప్యూటర్ భాష, విధానాలు కూడా చాలా ముఖ్యం. కాబట్టి, ముందుగా అలాంటి పని చేయడానికి మీకు మంచి ల్యాప్ టాప్ అవసరం అవుతుంది. దానికి మీరు సుమారు 65,000 నుండి 80 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆపై, మంచి ఇంటర్నెట్ కనెక్షన్, కొన్ని సాఫ్ట్వేర్ ల కోసం ఇంకో 10 వేలు ఖర్చు చేయాల్సి రావచ్చు. 

  • బోటీక్ సర్వీసు

లక్ష రూపాయల లోపు మొదలుపెట్టగల అత్యంత డిమాండ్ లో ఉన్న వ్యాపారాలలో బోటీక్ వ్యాపారం ఒకటి. ప్రస్తుతం, ప్రజలు ఎప్పటిలా పెద్దమొత్తంలో ఉత్పత్తి చేసే దుస్తులంటే ఇష్టపడడం లేదు. తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవడానికి, డిజైనర్ బట్టలు, యాక్ససిరీస్ పై బాగా మక్కువ చూపుతున్నారు. కాబట్టి, మీకు గనుక ఫాషన్ పై మంచి అవగాహనా ఉండి, అద్భుతమైన డిజైనర్ బట్టలు డిజైన్ చేయగల నైపుణ్యం ఉంటే, మీరు బోటీక్ వ్యాపారాన్ని తప్పక ప్రారంభించాలి. ఇందులో ఉన్న మంచి విషయం ఏంటంటే, మీరు ఈ వ్యాపారాన్ని ఇంటి నుండే, తక్కువ ఖర్చుతో, మీ దగ్గర అప్పటికే ఉన్న వనరులతో మొదలుపెట్టవచ్చు. 

సుమారు 40 వేలతో ప్రారంభించగల ఈ వ్యాపారానికి, మీరు ముందుగా డిజైన్ చేయడానికి, కుట్టడానికి కొన్ని వస్తువులను కొనాల్సి ఉంటుంది. కానీ అవేంటో మీకు ఇప్పటికే తెలిసి ఉండకపోతే, ఈ వ్యాపారం మీకు సరైనది కాకపోవచ్చు. 

  • రైటింగ్ సర్వీసు 

ప్రస్తుత కాలంలో, కంటెంట్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఏలుతుంది. కాబట్టి, మీకు మంచి కంటెంట్ రాసే అనుభవం ఉండి, బ్లాగులు ఆర్టికల్స్ రాయడం ఇష్టమై, వెబ్సైటు కంటెంట్, SEO, బ్లాగ్ ఆర్టికల్స్ లాంటివి రాసిన అనుభవం ఉండి ఉంటే, తప్పకుండ రైటింగ్ సర్వీసు బిజినెస్ చేయాల్సిందే. మీ రైటింగ్ అనుభవం, ఇంకా ఏ విధమైన సర్వీసు అందిస్తున్నారని దాన్ని బట్టి, మీరు మీ రేట్లను నిర్ణయించవచ్చు. 

మరి మీ రైటింగ్ బిజినెస్ ని ప్రారంభించడానికి మీ వద్ద ఉన్న లక్షను ఎలా వాడాలి అనుకుంటున్నారా? రైటింగ్ సర్వీసు ముఖ్యంగా మీరు పొందే క్లయింట్స్ పై ఆధారపడి ఉంటుంది. అందుకు గాను, మీరు ఏం ఖర్చు చేయాల్సిన పని లేదు. 

  • బేకింగ్ సర్వీసు

మీకు బేకింగ్ చేయడం బాగా వచ్చి, ఇంటి నుండి చేయగల ఏదైనా వ్యాపారం ఉందేమో అని చూస్తుంటే, మీరు బేకింగ్ వ్యాపారం చేయడం మంచి ఆలోచన. కాకపోతే మీరు మనోహరమైన కేకులు, కుకీలు, మఫిన్లు మరియు హాట్-పైపింగ్ బ్రౌనీలను అమ్మడానికి మంచి ప్లాన్ రెడీ చేసుకోవాలి. 

ముందుగా మీ ఇంటి నుండి బేకింగ్ వ్యాపారం ప్రారంభించడానికి, మీరు కనీసం 20,000 రూపాయలు ఖర్చు చేసి బేకింగ్ కి సంబంధించిన సామాన్లు కొనాలి. టోస్టర్ గ్రిల్, బేకింగ్ సామాగ్రి, గిన్నెలు, మౌల్డ్, బరువు చూసే స్కేల్, కేక్ చేసే టేబుల్స్, బటర్ షీట్స్, గరిటెలు, మిక్సీలు తదితర సామాన్లు అన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి పైన, వ్యాపారం చేసి అమ్మడానికి కావాలిన సర్టిఫికెట్స్ సిద్ధం చేసుకోవాలి, లైసెన్సులు, రక్షణ సామాగ్రి, వాటన్నిటికీ మరొక 5 వేలు ఖర్చు చేయాల్సి రావచ్చు. అలాగే ఫసాయి లైసెన్స్ లాంటి వాటికి మరొక 10 వేల వరకు ఖర్చు అవ్వొచ్చు. 

  • కేఫ్ బిజీనెస్

ఈ మధ్య చిన్ని చిన్ని కేఫ్ లకు ఆధరణ బాగా పెరుగుతుంది. కోలాహలంగా ఉండే అలాంటి చోట్ల గడపడానికి, మీటింగ్స్ పెట్టుకోవడానికి జనం ఇష్టపడుతున్నారు. కాబట్టి మీరు మంచి టీ, కాఫీ ఇంకా స్నాక్స్ చేయగల నైపుణ్యం ఉన్నవారు అయితే, తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను పొందాగల కేఫ్ బిజినెస్ పెట్టడం మంచి ఆలోచన. 

  • ఫుడ్ ట్రక్ 

మాములు హోటల్ పెట్టడానికి చాలా ఖర్చు కావొచ్చు.  కానీ ఫుడ్ ట్రక్ ప్రారంభించాలంటే, అందుకు అవసరమయ్యే శ్రమలో సగం సరిపోతుంది. ప్రస్తుత రోజుల్లో, లక్ష పెట్టుబడి లోపు మొదలుపెట్టగల అద్భుతమైన వ్యాపారాల్లో ఫుడ్ ట్రక్ ఒకటి. ఇందులో, మీకు ఎక్కువగా ట్రక్ కొనడానికి, పెర్మిషన్ల ఇంకా లైసెన్సు లు పొందడానికే ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. ఆపై, పనిలో పెట్టుకొనే మనుషులు, సామాగ్రికి ఖర్చు అవుతుంది. 

  • ఇంట్లో చేసిన టిఫిన్స్ ఇంకా ఆహరం 

కార్పొరేట్ కల్చర్ బలపడుతున్నందుకు, చాలా మంది తమ సొంత ఊర్ల నుండి సిటీలకు వస్తున్నారు. అలాగే, సిటీలలో ఉండే ప్రజలకు కూడా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద ఇప్పుడు చాలా పెరిగింది. కాబట్టి, అందరూ ఇంట్లో వండబడిన, ఆరోగ్యకరమైన ఆహరం దొరుకుతుందేమో అని చూస్తున్నారు. ఈ వ్యాపారానికి, కొంత మంది పని వారు, వంట సామాగ్రి ఇంకా చిన్ని ప్రదేశం ఉంటే చాలు. చాలా బాగా నడుస్తుంది. 

  • ఈవెంట్ మ్యానేజ్మెంట్ సర్వీసు 

లక్షతో ప్రారంభించగల ఇంకొక మంచి వ్యాపారం ఈవెంట్ మ్యానేజ్మెంట్ సర్వీసు. బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లు, ఆఫీసు కార్యక్రమాలు, ఇంకా ఇలా ఎన్నో ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇక్కడ మీకు ఉండే లాభం ఏంటంటే, పని చేయడనికి, పెట్టుబడి ఎక్కువ అవసరం ఉండదు, కస్టమర్లు ఇచ్చే అడ్వాన్స్ తోనే పనిని జరిగించవచ్చు. లాభం పొందడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. కాకపోతే, పనిని జరిగించుకోవడానికి నమ్మదగిన పనివారు, ఆలాగే మీరు ఏర్పాట్లు చేయడానికి విశ్వసనీయమైన సర్వీసు వారు మీకు ఉండాలి. 

  • ఎలెక్ట్రానిక్ రిపైర్ షాపు 

ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్లు, అలాగే ఇతర టెక్నలాజికల్ గ్యాడ్జెట్ కాలంలో, అన్ని ఆఫీసు ఎక్విప్ మెంట్ లు మరియు గృహోపకరణాలకు రిపేర్ మరియు సర్వీసింగ్ అవసరం అవుతుంది. అవసరాలకు అనుగుణంగా విడి భాగాలను విక్రయించగలిగితే లాభం చాలా బాగుంటుంది. కాస్త ప్రయత్నిస్తే, క్లయింట్ ల నుంచి సర్వీసింగ్ ఎక్విప్ మెంట్ కొరకు వార్షిక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (ఎఎంసి)ని కూడా తీసుకోవచ్చు. హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ రిపేర్, అప్లికేషన్ సాఫ్ట్ వేర్, కొంతమంది టెక్నీషియన్ లు మొదలైన విషయాలు మీకు మీ పెట్టుబడి సహాయపడుతుంది. అందువల్ల, ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి 70,000-80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 

  • డైటీషియన్ లేదా న్యూట్రిషనిస్ట్ గా పనిచేయండి

ఊబకాయం స్థాయిలు పెరగడం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనే కోరిక కారణంగా ఆహారం మరియు పోషకాహార ఆధారిత సర్వీసులకు ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగింది. క్లయింట్స్ మీరు ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ రెండింటిలోనూ సేవలను అందించవచ్చు. లక్ష పెట్టుబడితో మీ వ్యాపారాన్ని స్థాపించిన తరువాత, మీరు మీ క్లయింట్స్ నుండి వారి శరీర అవసరాలకు అనుగుణంగా, నెలవారీ ఫీజులు తీసుకొని ఆరోగ్యకరమైన ఆహార డైట్ ని సూచించవచ్చు. కానీ ఈ వ్యాపారం చేయడానికి మీకు తగిన అర్హతలు కచ్చితంగా ఉండాలని మాత్రం మర్చిపోకండి. 

  • హస్త కళల ట్రైనింగ్

పిల్లలకు, పెద్దలకు అని తేడా లేకుండా నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడటానికి మీరు హస్త కళల తరగతులను ప్రారంభించవచ్చు.  ఈ వ్యాపారానికి గాను, మీరు ముందుగా కొన్ని ప్రకటనలు ఇవ్వడానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ తరగతులు గంటల వారీగా కూడా తీసుకోవచ్చు, అలాగే ఆన్లైన్ నుండే నేర్పించవచ్చు. ఇలాంటి తరగతులు ప్రారంభించడానికి సుమారు 25,000 రూపాయలు అవసరం అవుతుంది. 

  • హెచ్.ఆర్ సర్వీసు

తగిన నైపుణ్యం, ఇంగ్లీష్ పై మంచి పట్టు ఉంటే, కంపెనీలకు హెచ్.ఆర్ గా కూడా పని చేయవచ్చు. దాని కొరకు, మీరు విభిన్న ఎమ్ ఎన్ సిల కంపెనీలతో జతకట్టాలి. అలాగే తగిన స్థాయి నైపుణ్యం కలిగిన సరైన వ్యక్తులను వెతికి పట్టుకోవడం కంపెనీలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను పూర్తి చేయాలి. కంపెనీ ఉద్యోగులను నియమించినప్పుడు కమిషన్ వసూలు చేయవచ్చు. ఆఫీసు స్థలం కోసం లక్ష పెట్టుబడి వ్యాపారం అవసరం ఉండొచ్చు. అలాగే పనులు జరిగించడానికి కొంతమంది ఉద్యోగులను పెట్టుకోవాలి. ఈ హెచ్ ఆర్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రకటనలు కూడా అవసరం కావచ్చు.

  • ఇస్యూరెన్సు ఏజెంట్

ఎస్.బి.ఐ, ఎల్.ఐ.సి లాంటి కంపెనీలకు ఇన్సూరెన్సు ఏజెంట్ కావడం ఈ రోజుల్లో చాలా సులభం. కాకపోతే మీరు కొన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, తగిన అర్హతలు కలిగి ఉండాలి. ఒకసారి పూర్తి చేసిన తరువాత, ఇన్సూరెన్సు చేయించినందుకు మీకు మంచి మొత్తం చెల్లించడమే కాకుండా, భవిష్యత్తు ప్రీమియం చెల్లింపులపై కమిషన్ లు అందే విధంగా చాలా అదనపు బెనిఫిట్ లు ఉంటాయి. ఆర్థిక ప్రణాళికలో ఇన్సూరెన్సు చాలా అవసరం కనుక, లక్ష లోపు పెట్టుబడితో ప్రారంభించగల చిన్న వ్యాపార ఆలోచనలలో ఇది ఒకటి.

  • అనువాద సర్వీసు (ట్రాన్సలేషన్)

వివిధ దేశాల ప్రజలు, సంస్కృతులు మరియు నేపథ్యాల మధ్య దూరం తగ్గి, ప్రజలు కలిసి పని చేస్తున్నందున, అనువాదాల అవసరం చాలా పెరిగింది. ప్రాంతీయ భాషలు తెలిసిన చాలా మంది ఇప్పుడు ఇంటర్నెట్ ని మొదటిగా వాడుతున్నారు. అందువలన అనువాద సేవలను అందించే కంపెనీలు రోజు రోజుకూ పుట్టుకువస్తూ, ఎంతగానో ఎదుగుతున్నాయి. మీ భాషలో అనర్గళమైన పట్టు ఉండడం మాత్రమే  ఈ బిజినెస్ ప్రారంభించడానికి మీకు అవసరమయ్యే విషయం, అప్పుడే మీరు డబ్బును సంపాదించడమైన, వ్యాపారాన్ని స్థాపించడమైన చేయగలరు. 

  • మెడికల్ టూరిజం

అస్వస్థతలు పెరగడం మరియు మెరుగైన మరియు మరింత చవకైన ఆరోగ్య సంరక్షణ సేవల డిమాండ్ తో, మెడికల్ టూరిజం మరింత ప్రాచుర్యం పొందుతోంది. తక్కువ పెట్టుబడి మరియు అద్భుతమైన లాభాలతో పెరుగుతున్న వ్యాపార అవకాశం ఇది. తగినంత సమాచారాన్ని పొంది, రోగులకు తగిన వైద్య డిమాండ్ లకు అనుగుణంగా కస్టమ్ మేడ్ సేవలను అందించడం వస్తే ఈ వ్యాపారం తప్పక అభివృద్ధి చెందుతుంది. 

దీనిని కూడా చదవండి: ఇండియాలో బిజినెస్ చేయడానికి టాప్ 10 సిటీలు

ముగింపు

లక్ష లోపు పెట్టుబడి అవసరమయ్యే ఈ వ్యాపారాలలో దేనినైనా ప్రారంభించి, స్వేచ్ఛగా వ్యాపారం చేసుకుంటూ బ్రతకండి. ఈ ఆర్టికల్ మీరు కోరుకున్న విధంగా అవసరమయ్యే సమాచారాన్ని అందించిందని ఆశిస్తున్నాం. మీ నైపుణ్యానికి పదును పెట్టి తక్కువ పెట్టుబడులతో లాభదాయకమైన వ్యాపారాలకు ప్రణాళికను సిద్ధం చేసుకోండి. అలాగే మీ వ్యాపార అకౌంటింగ్ అవసరాలకు Khatabook యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. 

తరచుగా అడిగే ప్రశ్నలు

1. బిజినెస్ సెటప్ కొరకు లక్ష పెట్టుబడి పెట్టడం కచ్చితంగా అవసరమా?

లేదు, బిజినెస్ సెటప్ కొరకు లక్ష పెట్టుబడి అవసరం లేదు.  లక్ష లోపు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి వివిధ రకాల అవకాశాలు ఎన్నో ఉన్నాయి. 

2. ఈ రోజుల్లో ఫుడ్ వ్యాన్ ఏర్పాటు చేయడానికి ఎందుకు ప్రజలు బాగా ముందుకు వస్తున్నారు?

రెస్టారెంట్ తెరవడానికి గణనీయమైన పెట్టుబడి అవసరం, అయితే ఫుడ్ వ్యాన్లను లక్ష కంటే తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. అందువల్ల, ఈ రోజుల్లో ఫుడ్ వ్యాన్ ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది.

3. సొంతంగా బొటిక్ ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి అవసరం?

సుమారు 25,000 రూపాయల పెట్టుబడితో, మీరు ఇంటి నుంచి బొటిక్ ని  ప్రారంభించవచ్చు.

4. ఆహారం మరియు పోషకాహార ఆధారిత సంప్రదింపులకు ఎందుకు చాలా డిమాండ్ ఉంది?

ఊబకాయం స్థాయిలు పెరగడం మరియు ఫిట్టర్ మరియు ఆరోగ్యకరమైన జీవితం పట్ల ఆందోళన తో, ఆహారం మరియు పోషకాహార ఆధారిత సంప్రదింపులకు చాలా డిమాండ్ పెరిగింది.

5. క్లౌడ్ కిచెన్ ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి అవసరం?

మీరు సుమారు రూ. 50000తో క్లౌడ్ కిచెన్ ప్రారంభించవచ్చు.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
chat-icon
0