written by | October 11, 2021

వాట్సాప్ మార్కెటింగ్

×

Table of Content


వాట్సప్‌ మార్కెటింగ్‌ ద్వారా వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి?

వ్యాపారాన్ని పెంచుకోవటానికి మార్కెటింగ్‌ గురించి ఆలోచించినప్పుడు మీకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి? ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రా, ట్విట్టర్, లింక్డిన్‌ తదితర సామాజిక మాధ్యమాలు మీ దృష్టిలోకి రావొచ్చు. ఎక్కువ మంది వినియోగదారులు ఉండటమే దానికి కారణం. 

ఇవే కాకుండా మార్కెటింగ్‌ కోసం మరో ప్రత్యామ్నాయం ఉంది. అది టెక్స్ట్‌ రూపంలో సందేశాలు పంపించేది. దానికి ఇన్‌స్ట్రా, లింక్డిన్‌ కంటే ఎక్కువ మంది వినియోగదారులున్నారు. అదే వాట్సప్‌. 

టెక్స్ట్‌ సందేశాల్లో ఓపెనింగ్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. అదే మిగతా మార్గాల్లో ఇది తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే చాట్‌బాట్‌లు మంచి స్థాయిలో ప్రదర్శన కనబరుస్తున్నాయి. దీనివల్ల వాట్సప్‌.. కస్టమర్లతో అనుసంధానంగా ఉండేందుకు మంచి మార్గంగా మారింది. 

వాట్సప్‌ అంటే ఏమిటి ?

వాట్సప్‌ అనేది ఓ మొబైల్‌ అప్లికేషన్. దీని ద్వారా ఉచితంగా మెసేజ్‌లు ఎవరికైనా పంపుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న అందరు దాదాపు దీనిని ఉపయోగిస్తుంటారు. కాబట్టి మిగతా యాప్‌ల కంటే వాట్సప్‌ మార్కెటింగ్‌ మేలు. 

వాట్సప్‌ను 2000 సంవత్సరంలో ఇద్దరు మాజీ యాహు ఉద్యోగులు తయారు చేశారు. కమ్యునికేషన్‌ ఉచితంగా ఉండాలన్న లక్ష్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఫేస్‌బుక్‌.. 19 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. 

కేవలం టెక్స్ట్‌ సందేశాలను మాత్రమే కాకుండా వాట్సప్‌ ద్వారా ఫోటోలు, వాయిస్‌ మెసేజ్‌లు, లోకేషన్‌, వీడియోలు, డాక్యుమెంట్లు, జీఫ్‌లు పంపుకోవచ్చు. వాయిస్‌, వీడియో కాల్స్‌ కూడా చేసుకోవచ్చు. 

వ్యక్తిగతం… 

వాట్సప్‌ ద్వార ప్రజలతో అనుసంధానమై ఉండి, లీడ్స్‌ పొందాలనుకుంటే… వారి ఫోన్లలో మీ కాంటాక్ట్‌ జాబితాలో మీ నంబరు ఉండాలి. 

కొంత కాలం క్రితం వరకు… డాటాబేస్‌ కొనుక్కొని, వారికి ఈ-మెయిల్‌ పంపే వీలుండేది. ఇది ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌లో భాగం. అయితే వినియోగదారులకు మంచి సంబంధాలు నెరిపేందుకు ఇది సరైన మార్గం కాదు.

వాట్సప్‌ అనేది వ్యక్తిగతమైనది. వాట్సప్‌ ద్వారా తెలియని వారికి మెసేజ్‌ చేసినట్లైతే… వారు బ్లాక్‌ చేసే అవకాశం ఉంటుంది. ఇది వ్యాపారులకు సరైనది కాదు. మీ కాంటాక్ట్‌ నంబర్‌ అవతలి వారి ఫోన్‌లో సేవ్‌ చేసి ఉన్నందున… ఈ-మెయిల్‌ మార్కెటింగ్‌ కంటే వాట్సప్‌ మార్కెటింగ్‌ చాలా మంచిది. 

వాట్సప్‌ ఎవరు ఉపయోగిస్తున్నారు?

చాలా దేశాల్లో వాట్సప్‌ ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ గా ఉంది. బ్రెజిల్‌, జర్మనీ,ఇండోనేషియా, ఇటలీ, నెదర్లాండ్స్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా, థాయిలాండ్‌, టర్కీ , అర్జెంటీన, హాంకాంగ్‌, భారతదేశం, మలేషియా, మెక్సికో, సింగపూర్, సౌత్‌ ఆఫ్రికా, స్పెయిన్‌ లలో దీనికి 50 శాతం కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. 

ఒకప్పుడు అమెరికాలో తప్ప మిగతా అన్ని దేశాల్లో టెక్ట్స్‌ మెసేజ్‌లు ఖర్చుతో కూడుకున్నవిగా ఉండేవి. వాట్సప్‌ కు కేవలం డాటా అవసరం మాత్రమే ఉండటంతో… వచ్చి రాగానే విజయవంతం అయింది. ఎక్కువ మంది వినియోగదారులను స్వంతం చేసుకుంది. 

అన్ని దేశాల యువతలో వాట్సప్‌ కు మంచి క్రేజ్‌ ఉంది. వాట్సప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండటం లేదంటే అతిశయోక్తి కాదు. వీరందరిని చేరుకోవాలంటే వాట్సప్‌ మార్కెటింగ్‌పై ఆలోచించాలి. 

వ్యక్తిగత వాట్సప్‌ కుంటే వాట్సప్‌ ఫర్‌ బిజినెస్‌ను వాడుకోవటం ఉత్తమం. ఎందుకు?

చాలా మంది వ్యక్తిగత ఫోన్‌ ను బిజనెస్‌ ఫోన్‌ నంబరు వాడుతుంటారు. ఇలాంటి వారే కాకుండా, మార్కెటింగ్‌ కోసం వ్యక్తిగత వాట్సప్‌ కంటే బిజినెస్‌ వాట్సప్‌ ఉపయోగించటం మేలు. 2018 మొదట్లో వాట్సప్‌ ఫర్‌ బిజినెస్ విడుదలైంది.

ఇది ఆండ్రాయిడ్‌ తో పాటు యాపిల్‌ ఫోన్లలో కూడా అందుబాటులో ఉంది. దీన్ని చిన్న వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని అభివృద్ది చేశారు. దీని ద్వారా కస్టమర్లకు వెంటనే స్పందించేందుకు కొన్ని టూల్స్‌ ఉపయోగించుకోవచ్చు. 

సాధారణ వాట్సప్‌ కంటే దీనిలో ఉన్న కొన్ని ప్రయోజనాలు… 

బిజినెస్‌ ప్రొఫైల్‌-  అవసరమైన సమాచారంతో బిజినెస్‌ ప్రొఫైల్‌ను ఇందులో పొందుపరవచ్చు. చిరునామా, వ్యాపారానికి సంబంధించిన సమాచారం, ఈ-మెయిల్‌, వెబ్‌సైట్‌ లాంటివి ఇందులో ఉంటాయి. 

క్విక్‌ రిప్లై – దీని ద్వారా తరచూ పంపించే సందేశాలను ఆటోమేటిక్‌ గా పంపించవచ్చు. తరచూ అడిగే ప్రశ్నలకు దీని ద్వారా సమాధానం ఇవ్వవచ్చు. 

ఆటోమేటిక్‌ సమాధానాలు- చాట్‌ బాట్‌ల వలే ఈ ఆప్షన్‌ ద్వారా ఆటోమేటిక్‌ గా మెసేజ్‌లను పంపించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు దీని ద్వారా సమాచారం పంపించవచ్చు. మీరు మీటింగ్‌లో ఉన్నా, విరామం తీసుకుంటున్న సమయంలో కస్టమర్లకు స్పందించటం కష్టం. దీనివల్ల లీడ్స్‌ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో వ్యాపారిని సంప్రదించినవారు.. వ్యాపారి నుంచి వెంటనే స్పందనను కోరుకుంటారు. ఆటోమేటిక్‌ మెసేజ్‌ల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. 

మెసేజ్‌ల స్టాటిస్టిక్స్‌ – మెసేజ్‌ల గురించి లోతుగా తెలుసుకునే సదుపాయం ఈ ఆప్షన్ ఇస్తుంది. ఎన్ని మెసేజ్‌లు పంపించాం? ఎన్ని డెలివరి అయ్యాయి? ఎంత మంది చదివారు? అన్న దానిపై స్పష్టత పొందవచ్చు. 

లేబల్స్‌ – దీని ద్వారా కాంటాక్ట్‌లను లేబలింగ్‌ చేసుకోవచ్చు. తద్వారా కాంటాక్ట్‌ను తొందరగా గుర్తించవచ్చు. 

సాధారణంగా వాట్సప్‌లో ప్రొఫైల్‌ చేసుకోవాలంటే మొబైల్‌ నంబర్ కావాలి. కానీ వాట్సప్‌ ఫర్‌ బిజినెస్‌లో ల్యాండ్‌ లైన్‌ ద్వారా కూడా ఈ పనిచేయవచ్చు. 

కస్టమర్లను ఎలా చేరుకోవాలి

వాట్సప్‌ ను ఎక్కువగా కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రజలు.. ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు ఉపయోగిస్తారు. వ్యక్తిగత విషయాలను ఎక్కువగా మాట్లాడుకుంటారు. మీ వ్యాపారం వారి చర్చల్లో ఎలా భాగస్వామ్యం చేయాలో ఆలోచించుకోవాలి. దీనికోసం సృజనాత్మకతో ఆలోచించాలి. 

మీ తరుపున ఈ కార్యకలాపాలు చూసుకునేందుకు వర్చువల్‌ వ్యక్తిని నియమించుకోవటం ఉత్తమం. వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునే వాట్సప్‌లో మీరు వ్యాపారం గురించి మాట్లాడుతున్నందున.. వారిని నచ్చే బ్రాండ్‌ను తయారుచేసుకోవాలి. 

వాట్సప్‌ ద్వారా మీ వినియోగదారులతో మాట్లాడుతున్నట్లయితే ఓ వ్యక్తిని నియమించుకోవటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. పేరుతో పరిచయం చేసుకోవటం వల్ల వ్యక్తిగతంగా చర్చ చేయవచ్చు. పనిలో ఉండే వారు వర్చువల్‌ వ్యక్తితో మాట్లాడటం కంటే వాస్తవంగా వ్యక్తితో మాట్లాడేందుకు ప్రాధాన్యతనిస్తారు. 

ఆడియన్స్‌ ను పెంచుకోండి

గతంలో సంప్రదించిన మీ వినియోగదారుల ఉన్నట్లయితే వారిని సంప్రదించవచ్చు. కానీ వారి మొబైల్‌లో మీ ఫోన్‌ నంబర్‌ సేవ్‌ చేసి ఉండాలి. 

తొందరగా మీ వినియోగదారులు మిమ్మల్ని సంప్రదించేందుకు వెబ్‌సైట్‌లో క్విక్‌ స్టార్ట్‌ అనే ఆప్షన్‌ ను కూడా ఉంచవచ్చు.వాట్సప్‌ హెల్ప్‌ నుంచి విడ్జెట్‌ సహాయంతో ఇది చేయవచ్చు. ఎలా దీన్ని ఉపయోగించుకోవాలన్నది వాట్సప్‌ హెల్ప్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

మీ దగ్గరికి వచ్చిన వారికి ఏదైనా ప్రయోజనం చేకూర్చటం ద్వారా కూడా మీ వినియోగదారులను పెంచుకోవచ్చు. ఉచిత కూపన్లు, ప్రమోషనల్‌ ఆఫర్‌, విలువైన సమాచారం అందించటం ద్వారా వారిని మీతోనే అట్టిపెట్టుకోవచ్చు. 

ఆటోమేటిక్‌ మెసేజ్‌ ఆప్షన్‌ ద్వారా ప్రోమోల ఆఫర్లను ప్రత్యక్షంగా వారికే పంపవచ్చు. కేవలం ఇదే కాకుండా ఇతర విషయాలను వారితో చర్చించటం ద్వారా వారితో సంబంధాలు మెరుగుపరుచుకోవచ్చు. 

కాంటాక్ట్‌లను విభజించుకోవాలి

ప్రజలు మీ వ్యాపారం గురించి మీతో సంభాషణలు ప్రారంభించి, మీతో కాంటాక్ట్‌ జాబితా పెరుగుతున్నట్లయితే… దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లండి. మీ వ్యాపార వినియోగదారులతో సంభాషించుకునేందుకు వాట్సప్‌ పలు ఆప్షన్లను అందుబాటులో ఉంచింది. 

వాట్సప్‌లో ఇన్‌బిల్ట్‌గా లేబలింగ్‌ ఆప్షన్‌ ఉంటుంది. మీరు కూడా మీ అవసరానికి అనుగుణంగా లేబలింగ్‌ చేసుకోవాలి. దీని ద్వారా మీ వినియోగదారులను వెంటనే సంప్రదించవచ్చు. 

వాట్సప్‌లో వచ్చే డిఫాల్ట్‌ లేబల్స్‌ కొన్ని :

  • న్యూ కస్టమర్‌
  • న్యూ ఆర్డర్‌
  • పెండింగ్‌ పేమెంట్‌
  • పేడ్‌
  • ఆర్డర్‌ కంప్లీట్‌

లేబలింగ్‌ ద్వారా కాంటాక్ట్‌లను తొందరగా గుర్తించవచ్చు. దీని ద్వారా సరైన వ్యక్తితో సంభాషించే వీలు ఉంటుంది. గ్రూప్‌ లేదా బ్రాడ్‌క్యాస్ట్‌ జాబితా ద్వారా మీ వినియోగదారులతో సంభాషించవచ్చు. వాట్సప్‌లో ఉపయోగించే గ్రూప్‌ల లాంటి ఈ బిజినెస్‌ వాట్సప్‌లోని గ్రూప్‌లు. దీనిద్వారా మీ వినియోగదారులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు అవకాశం ఉంటుంది.  దీని ద్వారా మీ వ్యాపారం గురించి వారికి మరింత లోతుగా తెలుస్తుంది. 

గ్రూప్‌లు… 

గ్రూప్‌లో గరిష్ఠంగా 256 మంది సభ్యులు ఉండవచ్చు. కానీ మనకు కావాల్సినన్ని గ్రూపులను తయారుచేసుకుకోవచ్చు. దీనికి లిమిట్‌ లేదు. న్యూ గ్రూప్‌ అనే ఆప్షన్‌ ద్వారా కొత్త గ్రూప్‌ను తయారు చేయవచ్చు. 

గ్రూప్‌ పేర్లు కూడా మీ కంపెనీని ప్రతిబింబించేదిగా ఉండాలి. బ్రాండ్‌ లోగోను గ్రూప్‌ ఐకాన్‌గా పెట్టండి. వాట్సప్‌ గ్రూప్‌ కోసం ప్రత్యేకంగా లోగో తయారు చేసుకోవటం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. 

గ్రూప్‌ కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు నిర్ణయించి, అందరికి తెలియజేయండి. మీ ఉద్దేశానికి సరిపోని సందేశాలు గ్రూప్‌లో పోస్ట్‌ కాకుండా చూసుకోండి. మార్గదర్శకాలు తప్పనిసరిగా అనుసరించేలా చూడండి. సరైన కంటెంట్ పోస్ట్‌ చేయని వారికి హెచ్చరికలు జారీ చేయండి. 

సంభాషణను మంచి అంశాలతో ప్రారంభించడి. వారం ప్రారంభంలో మాట్లాడుతున్నట్లయితే… వచ్చే వారం మీ లక్ష్యాలు ఏంటి? లాంటి వాటితో సంభాషణ మొదలు పెట్టండి. అంతేకాకుండా మంచి కంటెంట్‌ పోస్ట్‌ చేయవచ్చు. దీనిపై వారి అభిప్రాయాలను అడగవచ్చు. 

బ్రాడ్‌కాస్ట్‌ గ్రూప్‌లు…

బ్రాడ్‌కాస్టింగ్‌ అంటే న్యూస్‌ లెటర్లు పంపించంటం లాంటిది. ఒక్క సందేశాన్ని బ్రాడ్‌కాస్టింగ్‌ జాబితాలో ఉన్న వారందిరికి పంపించవచ్చు. సందేశాన్ని అందుకున్న వారికి మాత్రం సాధారణ మెసేజ్‌ వలే కనిపిస్తుంది. బ్రాడ్‌కాస్టింగ్‌లో మీరు పంపించే నంబర్‌ అవతలి వారి ఫోన్‌లో సేవ్‌ చేసి ఉండాలి. 

రిప్లై ఇచ్చినట్లైతే సాధారణ సందేశంవలే మనకు వస్తుంది. అప్పటి నుంచి ప్రత్యేకంగా సంభాషించవచ్చు. బ్రాడ్‌కాస్టింగ్‌లో కూడా గ్రూప్‌లాగ … 256మందికి ఒకేసారి మెసేజ్‌ చేయవచ్చు. 

వాట్సప్‌ బిజినెస్‌ ద్వారా ఏం చేయవచ్చు

  • కస్టమర్‌ సపోర్ట్‌ను అందించవచ్చు. ఇది చిన్న వ్యాపారులు, అంకురాలకు ఉపయోగపడుతుంది. 
  • మీ సేవలు, ఉత్పత్తులపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయవచ్చు. అంతేకాకుండా వినియోగదారుల గురించి సర్వే కూడా నిర్వహించుకోవచ్చు. 
  • మీ వ్యాపారంపై రివ్యూలు, రేటింగ్‌ తీసుకోవచ్చు. 
  • మీ అందిన అర్డర్‌ లపై స్టేటస్‌ రిపోర్ట్‌ను మీ వినియోగదారులకు పంపవచ్చు. చాలా మంది ప్రస్తుతం రోజుల్లో వాట్సప్‌ను ఉపయోగిస్తున్న దృష్ట్యా ఇది చాలా ఉపయోగపడుతుంది. 
  • వాట్సప్‌ స్టేటస్‌ ఫీచర్‌ను మీ వ్యాపారం పెంచుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా…  జనాత్మకతను పెంచుకోవచ్చు. 
  • వాట్సప్‌ స్టేటస్‌లకు ఎక్కువగా చూసే వీలుంటుంది. దీనికి ఓపెనింగ్‌ రేట్‌ కూడా ఎక్కువ. దీని ద్వారా ప్రత్యేకమైన ఆఫర్లను మీ వినియోగదారులకు అందించవచ్చు. 
  • మీరు వ్యాపారమే కాకుండా ఇతర మంచి పనులకు కూడా చేయవచ్చు. వీటిని వాట్సప్‌ ద్వారా ప్రాచూర్యంలోకి తెచ్చుకోవచ్చు. ఈ మంచి పనులు వ్యాపారానికి అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. 
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.