written by | October 11, 2021

భారత ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ ప్రభావం

×

Table of Content


భారత‌ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ ప్రభావం

మనదేశ పన్నుల సంస్కరణలలో అతిపెద్ద సంస్కరణగా భావించినగూడ్స్అండ్సర్వీసెస్ టాక్స్‌ (జీఎస్టీ) అమలులోనికి వచ్చి, ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న అనేక రకాల పరోక్ష పన్నులు అంతర్థానమయి, వాటి స్థానంలో జీఎస్టీ విధానం అమలులోనికి వచ్చింది. దీంతొ వివి కాల వస్తువులపై రకరకాల పన్నులుండవు. వాటి స్థానంలో జీఎస్టీ ఒక్కటే వుంటుంది. 2016 సెప్టెంబర్‌ 8 101 రాజ్యాంగ సవరణ అమలులోనికి రావడం, సెప్టెంబర్‌ 15 జీఎస్టీ కౌన్సిల్నోటిఫికేషన్వెలువడటంతో జీఎస్టీ అమలుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2017, ఏప్రిల్‌ 1 నుంచి దీనిని అమలు చేయాలనుకున్నప్పటికీ, అందుకు అవమైన పూర్తి సన్నాహాలు చేయపోవడం వలన మరో మూడు నెలలు వాయిదా వేసుకోవలసి వచ్చింది. జీఎస్టీ విధానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు శిక్షణనిచ్చే భాధ్యతను ఎక్సైజ్‌, కస్టమ్స్కేంద్ర బోర్డు పరిధిలోని నేషనల్అకాడమీ ఆఫ్కస్టమ్స్‌, ఎక్సైజ్అండ్నార్కోటిక్ ఎన్ఏసీఈఎన్కు  అప్పజెప్పారు

ప్రపంచంలో జీఎస్టీ ని మొదటిసారిగా 1954లో ఫ్రాన్స్ అమలు చేసింది. తర్వాత కాలంలో జర్మనీ, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్‌,కెనడా, యనైటెడ్కింగ్డమ్‌, ఆస్ట్రేలియా, బ్రెజిల్మొదలైన దేశాలు అమలు రిచాయి. 1991 లో రష్యా, 1994 లో చైనా దేశాలు జీఎస్టీని అమలులోకి తెచ్చాయి.. ప్రస్తుతం 140 దేశాలలో విధానం అమలవుతోంది. కెనడాలో అమలు అమవుతున్నద్వంద్వ జీఎస్టీ విధానం ఆధారంగా మనదేశంలో జీఎస్టీ విధానానికి రూపకల్పన జరిగింది. మనది సమాఖ్య దేశం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిధిలోని శాసనాల ద్వారా పన్నులను విధించే అధికారం కలిగి ఉన్నాయి. రాజ్యాంగం నిర్ధేశించిన విధులు, అధికారాలు కలిగి వుండడం వలన వాటి నిర్వ హణకు ఆర్థిక వనరులు సమకూర్చుకొనవలిసి ఉంటుంది. జీఎస్టీ ప్రవేశపెట్టడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకాలంలో పన్నులు విధించి వసూలు చేయాల్సిన అవరం ఏర్పడింది. అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయసి వచ్చింది. 101 రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 246 అధికరణం జీఎస్టీని విధించి వసూలు చేసే అధికారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది.

జీఎస్టీలో విలీనమయ్యే కేంద్ర పన్నులు.

కేంద్ర ఎక్సైజ్సుంకం.

ఎక్సైజ్సుంకాలు(ఔషధాలు, సౌందర్యసాదనాలు)

అదనపు ఎక్సైజ్సుంకాలు.

జీఎస్టీలో విలీనమయ్యే రాష్ట్ర పన్నులు.

విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌). అమ్మకం పన్ను

విలాస సుంకం, ప్రవేశ సుంకం

వినోదం, ఉల్లాసపు పన్ను (స్థానిక సంస్థలు విధించేవి మినహా)

ప్రకటనలపై విధించే పన్ను కొనుగోలు సుంకం

లాటరీలు, పందాలు, జూదంపై విధించే పన్ను.

కస్టమ్సుంకాలు

సర్వీస్టాక్స్

వస్తు సేవలపై కేంద్ర సర్చార్జీలు, సెస్లు.

జీఎస్టీలో విలీనం చేయని ప‌న్నులు ( వీటిపై వ్యాట్‌, కేంద్ర ఎక్సైజ్‌ కొనసాగుతుంది)

మద్యం,పెట్రోలియం, ముడిచమురు, మోటారు స్పిరిట్

హైస్పీడ్ డీజల్‌, సహజవాయువు, విద్యుచ్ఛక్తి

జీఎస్టీని రూపొందించడానికి అనేక సూత్రాలను, మార్గదర్శకాలను పరిగణలోనికి తీసుకున్నారు. జీఎస్టీలో విలీనం చేసే పన్నులు ప్రాథమికంగా వస్తువుల సరఫరా లేదా సేవల సరఫరాపై విధించే పరోక్ష పన్నులై  ఉండేలా చూశారు. విలీనం చేసే పన్నులు, వస్తువులు మరియు సేవల దిగుమతి/ ఉత్పత్తితో ప్రారంభించి అంతిమంగా వాటి వినిమయం వరకు జరిగే లావాదేవీల పరంపరలకు చెందినవై ఉండేలా చూశారు. విలీనం వల్ల రాష్ట్రంలోను, రాష్ట్రాల మధ్య పన్ను జమల ప్రవాహం సాఫీగా జరిగే విధంగా జీఎస్టీని రూపొందించడానికి అనువైనసూత్రాలను పాటించారు.

జీఎస్టీని అమలు పర్చడం ద్వారా ప్రభుత్వం అనేక ప్రయోజ నాలను ఆశిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న17 రకాల పన్నులను ఒకే పన్ను విధానమైన జీఎస్టీ గొడుగు కిందకు చేర్చి, ముందస్తు దశ పన్నుల సెటాఫ్కు అనుమతించడం కారణంగా బహుళ పన్నుల దుష్ప్రభావాల నుంచి బయటపడటం రుగుతుంది. విధానం వల్ల ఉమ్మడి జాతీయ మార్కెట్కు మార్గం ఏర్పడుతుందని భాావిస్తున్నారు. వస్తువులపై పన్నుల భారం తగ్గడమే కాకుండా స్వదేశీ, విదేశీ మార్కెట్లలో మనదేశఉత్పత్తులకు పోటీ పెరిగి, గ్ర ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని భావిస్తున్నారు. పన్ను పరిధి, వాణిజ్య పరిమాణాల పెరుగుదలతో పాటు, మెరుగైన పన్ను చెల్లింపుల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుందని, పన్ను పాదదర్శక లక్షణాల కారణంగా దీనిని అమలు చేయడం సులభమౌతుందని ప్రభుత్వం భావిస్తోంది.

దేశంలో అమలులోనికి వచ్చిన జీఎస్టీలో 0, 3, 5, 12, 18, 28 శాతాలతో మొత్తం ఆరు శ్లాబులు ఉన్నాయి. పన్నులేనివి జీరో లోనికి, బంగారం మాత్రమే 3శాతం శ్లాబులో వుంది. జీఎస్టీలో విలీనం చేయనివి మినహా మిగతావన్నీ ఇతర శ్లాబులలో చేర్చారు.

జీఎస్టీ విధానంలో మూడు రకాలున్నాయి.

సెంట్రల్జీఎస్టీ సీజీఎస్టీ: కేంద్ర ఎక్సైజ్సుంకం, ఎక్సైజ్సుంకాలు, అదనపు ఎక్సైజ్సుంకాలు, కస్టమ్సుంకాలు, సర్వీస్టాక్స్దీనిలో విలీనం అవుతాయి.

స్టేట్జీఎస్టీ ఎస్జీఎస్జీ: విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌), అమ్మకం పన్ను, విలాస సుంకం, ప్రవేశ సుంకం, వినోదం మరియు ఉల్లాసపు పన్ను, ప్రకటనలపై విధించే పన్ను, కొనుగోలు సుంకం, లాటరీలు, పందాలు, జూదంపై విధించే పన్ను దీనిలో విలీనం అవుతాయి.

ఇంటిగ్రేటెడ్జీఎస్టీ ఐజీఎస్టీ: ఏవైనా ఉత్పత్తులు రెండు రాష్ట్రాల మధ్య జరిగిన పక్షంలో ఐజీఎస్టీ పరిధిలోనికి చ్చినట్టు రిగణిస్తారు.. ఇక్కడకూడా ఒకే రకమైన పన్ను ఉంటుంది. పన్ను ఉత్పత్తి చేసిన రాష్ట్రానికి కాకుండా వినియోగం చేసిన రాష్ట్రానికి కూడా చెందుతుంది.

పరోక్ష పన్నుల విధానంలో వర్తించని ఇన్పుట్టాక్స్క్రెడిట్జీఎస్టీలోకి వర్తిస్తుంది. ఒక వస్తువు ఉత్పత్తి , విక్రయం రెండూ ఒకే రాష్ట్ర పరిధిలో జరిగినప్పుడు ఇన్పుట్‌, ఔట్పుట్టాక్స్రెండూ చెల్లించాల్సివస్తుంది. జీఎస్టీ మాత్రం ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేసి, మరో రాష్ట్రంలో అమ్మినా సరే ఇన్పుట్టాక్స్క్రెడిట్వస్తుంది. అంటే ఉత్పత్తికి గాను ముడిపదార్థాల కొనుగోలు సమయంలో వాటికి ఇన్పుట్టాక్స్చెల్లించడం వలన విక్రయిం చేసే యంలో మేరకు పన్ను మొత్తాన్ని మినహాయిస్తారు. జీఎస్టీకి ముందు మనదేశంలో పన్నులు విధించే విధానం వైవిధ్యంతో కూడి ఉండేది. వస్తువు ఉత్పత్తి అయ్యే చోటు నుండి అది వినియోగానికి చేరే వరకు వివిధ దశలలో పన్నులు విధించడం రుగుతూ చ్చింది. రాష్ట్రానికి, రాష్ట్రానికి పన్నుల విధింపులో తారతమ్యాలున్నాయి. పన్నుల మీద పన్నులు లేకుండా చూడడం, రాష్ట్రాల మధ్య పన్నుల విషయంలో ఏకరూపతను సాధించడం సాధ్యవుతుంది. తంలో ఒక్కో పన్ను చెల్లించడానికి ఒక్కో రకమైన రిటర్న్దాఖలు చేయాల్సి వచ్చేది. ఇకపై ఒకే టాక్స్రిటర్న్దాఖలు చేస్తే సరిపోతుంది. జీఎస్టీ డెటాబేస్నిర్వహణ కోసం జీఎస్టీ నెట్వర్క్ జీఎస్టీఎన్ ఏర్పాటుచేశారు. పన్ను రిటర్న్లు దీని ద్వారానే ఆన్లైన్లోనే నిర్వహించాల్సివస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగినా, జీఎస్టీ ఐడి నెంబర్లతో సరిపోలకపోయినా తేడా ఎక్కడుందో తేలిపోతుంది

జీఎస్టీ ముందువకూ ఉన్నన్నుల విధానంలో 1.50 కోట్ల టర్నోవర్పైగా ఉన్నకంపెనీలు మాత్రమే ఎక్సైజ్డ్యూటీ పరిధిలో ఉన్నాయి. జీఎస్టీ అమలుతో పరిధి రూ. 20 లక్షలకు కుదించారు. దంతో అనేక చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలు దీని పరిధిలోనికి వచ్చిచేరాయి. లితంగా ఉద్యోగిత, వికేంద్రీక రణకు అవకాశమున్న పరిశ్రమలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడనున్నాయనే భావ ఏర్పడింది. జీఎస్టీ నిర్వహణ పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించాల్సివస్తుంది. చిన్న, మధ్యతరహాసంస్థలకు, వ్యాపారస్థులకు దీనిని నిర్వ హించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నదిగా మారింది. దీని అమలుతో రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులపై నియంత్రణ కోల్పోయాయి. రాష్ట్ర పరిధిలోని పన్ను రేట్లను మార్చుకొనే అవకాశం, అధికారం వీటికి దూరయ్యింది. ఇది ఫెడరల్స్పూర్తికి విఘాతం కలిగించే అంశమే వాద వినిపిస్తుంటుంది

జీఎస్టీని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం అనేక ప్రయోజనాలను ఆశిస్తోంది. పన్నుల మీద పన్నులు లేక పోవడం వలన వస్తుసేవల ధరలు తగ్గుతాయని భావిస్తోంది. వస్తుసేవల ధరలు తగ్గడం, పెరగడం అనేది వాటిపై విధించే శ్లాబులపై ఆధారపడివుంటుంది. జీఎస్టీ ముందువకూ ఉన్నశ్లాబులను పరిశీలిస్తే, దిగువ తరగతి ప్రజానీకం ఉపయోగించే వస్తువులు 5 శాతం -12శాతంలో ఉంచారు. మొదట ప్రకటించిన శ్లాబులలో 66 వస్తువులపై పన్ను కోత విధించారు. పరిస్థితులు, అవసరాలను బట్టి పన్నురేట్లలో మార్పులు సహజమని ఫ్రాన్స్దేశపు జీఎస్టీ అనుభవాలు తెలియజేస్తున్నాయి.

ప్రభుత్వం, సాహాసోపేత నిర్ణయాలను తీసుకొనేటప్పుడు నిర్ణయాలకు అనుగుణంగా వ్యవస్థను సిద్ధం చేయాలి. లేకపోతే రకమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుందో నవంబర్‌ 8, 2016 రూ. 500, 1000 నోట్ల రద్దు నిర్ణయం తర్వాత తలెత్తిన పరిస్థితుల ద్వారా ప్రభుత్వం, ప్రజానీకం ఒకగొప్ప గుణపాఠం నేర్చుకుంది. నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి ప్రధాని చెప్పిన ప్రధాన కారణాలకు నం మెచ్చారు. నల్లధనం వెలికితీసి, బ్లాక్నీని అరికట్టి, ఉగ్రవాదాన్ని అణిచివేయడం, లంచగొండితనాన్ని కూకటి వేళ్ళతో పెకిలించనున్నామని ప్రధాని తెలిపారు. దీంతో భారత ప్రజానీకం  ప్రధాని మాటలకు బ్రహ్మ రథం పట్టింది. నోట్ల రద్దు తర్వాత నెల రోజుల్లోనే ప్రధాని చెప్పిన ప్రధాన కారణాల పల్లవిలో మార్పులు చోటుచేసుకున్నాయి. వెంటనే నగదు రహిత లావాదేవీలనే కొత్త రాగం అందుకున్నారు. డిజటల్లిట్రసీ 1శాతంగా వున్న మనదేశంలో పేటిఎమ్‌, భీమ్లాంటి అనేక కొత్త కొత్త యాప్లతో ఊదరగొట్టారు. వ్యవసాయదారులు, చిన్నవ్యాపారస్తులు, దినసరికూలీలు, కార్మికులు చేతిలో నగదు లేక అవస్థలు డ్డారు. అర్థశాస్త్ర నోబుల్బహుమతి గ్రహీత అమర్త్యసేన్నోట్ల రద్దు నిర్ణయం అమానవీయ, నిరంకుశ నిర్ణయంగా తన అభిప్రాయాన్ని తెలిపారు.

జీఎస్టీ అమలు ప్రధాన ఉద్దేశం పన్నుల మీద పన్నులు లేకుండా చూడటంతోపాటు, రాష్ట్రాలమధ్య పన్నుల విషయంలో ఏకరూపతను సాధించడం. విధానంవల్ల వద్ధిరేటు తగ్గినా, సామాన్య ప్రజానీకంపై భారంపడినా, చిరువ్యాపారస్తులు, చిన్నతరహా ఉత్పత్తిదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నా, ద్రవ్యోల్బణం పరిస్థితులు ఏర్పడ్డా, కేంద్ర ప్రభుత్వం ఆశయం ప్ప నెరవేరుతుందని భావిస్తోంది. అదేవిధంగా పన్ను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు లేకుండాచేసి, దేశంలోని పన్నుల నిర్ణయాధికారాన్ని జీఎస్టీ కౌన్సిల్కు అప్పగించి కేంద్రం పెద్దన్న పాత్రను పోషించేందుకు డుం బిగించింది.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.