భారతదేశంలో గిఫ్ట్ షాప్ బిజినెస్ నిర్వహించడం ఎలా?
ప్రస్తుతం భారతదేశంలో గిఫ్ట్షాప్ వ్యాపారం ఆదాయాన్ని సమకూర్చిపెట్టే బిజినెస్గా మారింది. ఈ రోజుల్లో బహుమతులు ఇచ్చే ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. అందుకే గిఫ్ట్షాప్ ప్రారంభించడం చాలా లాభదాయకమైన వ్యాపారంగా మారింది. గిఫ్ట్ షాప్‌లలో రూ. 50 మొదలుకొని లక్షల వరకు ఖరీదు చేసే వివిధ గిఫ్ట్ ఐటమ్స్ విక్రయిస్తుంటారు. ఈ వ్యాపారాన్ని కనీస మొత్తంతో కూడా ప్రారంభించేందుకు అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాలలో గిఫ్ట్ షాప్ వ్యాపారానికి అమితమైన డిమాండ్ ఉంది. ఈ ప్రాంతాల్లో ఈ విధమైన వ్యాపారం చేస్తున్నవారు అత్యధిక ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిఫ్ట్ షాప్ వ్యాపారం గురించి ప్రస్తావించాల్సివస్తే, ఈ వ్యాపారానికి ఎంతో ఆదరణ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతీవేడుక సందర్భంలోనూ బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం సాధారణంగా మారింది. అందుకే ఈ వ్యాపారం చేసేవారు వినియోగదారుల కోసం కొత్త కొత్త కానుకలను అందుబాటులో ఉంచుతారు. గిఫ్ట్షాప్ వ్యాపారంలో రెండు విధానాలు ఉన్నాయి. వాటిలో ఒకటి గిప్ట్ ఐటమ్స్ను కొనుగోలు చేసి విక్రయించడం. మరొకటి వ్యక్తిగత బహుమతులు తయారుచేసి అందించడం. అంటే ఫొటోఫ్రేమ్, కీ చెయిన్, టేబుల్ టాప్, గోడ గడియారం, టీషర్ట్ మొదలైన గిఫ్ట్ ఐటమ్స్పై కంపెనీ పేరు లేదా వ్యక్తుల పేర్లు, లేదా లోగోలు, ఫొటోలు ముద్రించి విక్రయించడం. ప్రస్తుతం పలు కంపెనీలు వివిధ సందర్భాల్లో తమ ఉద్యోగులకు బహుమతులను అందజేస్తున్నాయి. ఇటువంటప్పుడు పైన తెలిపిన రెండు రకాల బహుమతులను అందించేందుకు అవకాశం ఉంది. చిన్నపట్టణాలు, నగరాల్లో వ్యక్తిగత బహుమతులు అత్యధికంగా విక్రయమయ్యేందుకు అవకాశాలున్నాయి. అదే కార్పొరేట్ గిఫ్ట్ ఐటమ్స్ విషయానికొస్తే మెట్రో నగరాల్లోని వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు వాటిని అందిస్తుంటాయ.
కస్టమైజ్డ్ గిఫ్ట్‌షాప్ వ్యాపారం
వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా గిఫ్ట్షాప్ వ్యాపారాన్ని ప్రారంభించాల్సివుంటుంది. అంటే పర్సనలైజ్డ్ గిఫ్ట్షాప్, కార్పొరేట్ గిఫ్ట్షాప్, స్పోర్ట్స్ గిఫ్ట్షాప్, ఆర్టిసాన్ గిఫ్ట్షాప్ మొదలైనవి. అయితే మన దేశంలో గిఫ్ట్షాప్ బిజినెస్ విషయానికొస్తే బర్త్‌డే గిఫ్ట్ ఐటమ్స్, వెడ్డింగ్ గిఫ్ట్ ఐటమ్స్, యానివర్సరీ గిప్ట్ ఐటమ్స్కు అత్యధిక ఆదరణ ఉంది. ఈ విధమైన రీతిలో గిఫ్ట్షాప్ వ్యాపారాన్ని ప్రారంభించి, క్రమంగా విస్తరిస్తూ, కార్పొరేట్ గిఫ్టింగ్ వ్యాపారస్థాయికి చేరుకోవచ్చు. అయితే పెద్ద నగరాల్లో కార్పొరేట్ గిఫ్ట్ షాపులను నేరుగా ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిరోజూ ఏదోఒక వేడుక జరగుతుంటుంది. ఇటువంటి సందర్బాల్లో వినియోగదారులు గిఫ్ట్ ఆర్టికల్స్ కొనుగోలు చేస్తుంటారు. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు బహుమతులను అందిస్తుంటాయి. దీనిని గమనిస్తే గిఫ్ట్ షాప్ వ్యాపార అవసరత ఎంతవుందో అర్థమవుతుంది.
గిఫ్ట్షాప్ వ్యాపార ప్రణాళిక
ఈ వ్యాపారాన్ని ప్రారంభించేముందు స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇందుకోసం ఈ రంగంలో ఇప్పటికే ఉన్నవారి అభిప్రాయాలు తీసుకోవచ్చు. ఇది వ్యాపార నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే దానికి సంబంధించి రిపోర్టు తయారు చేసుకోవడంతో పాటు ప్రభుత్వ అనుమతుల గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే మార్కెటింగ్ ప్లాన్ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. దీనికి ముందుగా తాము ఎటువంటి గిఫ్ట్ షాపును ప్రారంభించాలను కుంటున్నామో నిర్ణయించుకోవాలి. తరువాత తాము విక్రయించాలనుకుంటున్న గిఫ్ట్ ఐటమ్స్ను దుకాణంలో ఉంచాలి. తరువాత విక్రయాలకు అనుగుణంగా వినియోగదారులకు గిఫ్ట్ ఆర్టికల్స్ను దుకాణంలో అందుబాటులో ఉంచాలి. కాగా గిఫ్ట్ షాప్లో గ్రీటింగ్ కార్డులు, సాఫ్ట్ టాయ్, మ్యూజికల్ ఐటమ్స్, డిజైనర్ వాచ్, ఫోటో ఫ్రేమ్, బ్రాండెడ్ పెర్ఫ్యూమ్, జ్యువెలరీ, చిల్డ్రన్స్ టాయ్స్, గేమ్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, షో పీసెస్, క్రోకరీ, విగ్రహాలు, క్యాలెండర్లు, డైలు, కీచైన్స్, పెన్నులు, ఫాబ్రిక్ , బాడీ స్ప్రే, పుస్తకాలు, ఆల్బమ్లు, కంప్యూటర్ పెరిఫిల్లర్స్, స్టేషనరీ, బ్యూటీ ప్రొడక్ట్స్ మొదలైనవి అందుబాటులో ఉంచవచ్చు.
ఏ ప్రాంతంలో గిప్ట్‌షాప్ ఏర్పాటు చేయాలి?
గిఫ్ట్షాప్ ఏర్పాటు చేసేందుకు అందుకు తగిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం ఎంతో కీలకం. వ్యాపారవృద్ధి అనేది దీనిపైననే ఆధారపడివుంటుంది. నగరాలు, పట్టణాలు, మెట్రోపాలిటన్ సిటీలలో ఈ వ్యాపారాన్ని నిర్వహించవచ్చు. అయితే గిఫ్ట్షాప్ను జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ప్రారంభించాల్సివుంటుంది. అదేవిధంగా గిఫ్ట్షాప్ ఏర్పాటు చేసే ప్రాంతంలోనివారి ఆర్థిక స్థితిగతులను గమనించి, వారికి అందుబాటులో ఉండేలా గిఫ్టులను షాపులో ఉంచాలి. అదేవిధంగా గిఫ్ట్ షాప్ ఏర్పాటు చేసేముందు దుకాణానికి మూడు వైపులా ఓపెన్ ఉండేలా చూడండి. మూడు వైపులా గ్లాస్ గోడలతో ఓపెన్ లేకపోతే, కనీసం రెండు వైపులా ఓపెన్ ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వలన వినియోగదారులు దూరం నుంచి దుకాణంలోని వస్తువులను గమనించగలుగుతారు. అలాగే ఇది గిఫ్ట్షోరూం అని అర్థం చేసుకోగలుగుతారు. దుకాణాన్ని ఎంపిక చేసుకునే ముందు అది కింది ప్లోర్లో ఉండేలా చూసుకోండి. ఇది సాధ్యం కాకపోతే కనీసం ఫస్ట్ ఫ్లోర్ అయినా ఎంపిక చేసుకోండి.
ఆర్థిక ఏర్పాట్లు
గిఫ్ట్ షాప్ ఏర్పాటు చేయాలనుకునేవారు సమర్థవంతమైన వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోవడంతోపాటు, వ్యాపారానికి అవసరమైన అంచనా వ్యయాన్ని సమకూర్చుకోవాలి. వ్యవస్థాపకుడు ఈ వ్యాపారం కోసం ఫైనాన్స్ ఏర్పాటు చేసుకునేందుకు ఈ కింది పద్ధతులను అవలంబించవచ్చు.
వ్యవస్థాపకుడు బంధువులు, స్నేహితుల దగ్గర రుణం తీసుకోవచ్చు.
ఏదైనా వాణిజ్య బ్యాంకు నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రౌడ్ ఫండింగ్ ద్వారా వ్యాపారం కోసం నగదును సేకరించవచ్చు.
గిఫ్ట్ షాప్ ఏర్పాటుకు లైసెన్స్, రిజిస్ట్రేషన్
గిఫ్ట్ షాప్ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో ప్రారంభించడానికి లైసెన్స్, రిజిస్ట్రేషన్ తప్పనిసరి కానప్పటికీ, ప్రభుత్వ నియమాల గురించి తెలుసుకున్న తర్వాతనే దానిని ప్రారంభించాలి. రిజిస్ట్రేషన్ లేకుండా కూడా బహుమతి దుకాణాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఇలా చేస్తే వ్యవస్థాపకుడు వ్యక్తులకు మాత్రమే బహుమతులు విక్రయించగలుగుతాడు. సంస్థలకు విక్రయించలేడు. ఎందుకంటే వివిధ కంపెనీలు రిజిస్టర్ అయిన విక్రేత నుండి వస్తువులను కొనడానికి మొగ్గుచూపుతాయి. అందువల్ల, వ్యవస్థాపకుడు కార్పొరేట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అతను తన వ్యాపారాన్ని ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయించాల్సివుంటుంది. అదేవిధం వ్యవస్థాపకుడు పాన్ కార్డును కలిగివుండటంతో పాటు బ్యాంకులో కరెంట్ ఖాతాను తెరవాలి. జీఎస్టీ రిజిస్ట్రేషన్కు కూడా దరఖాస్తు చేయాలి. పైన పేర్కొన్న అన్ని ప్రక్రియలను పూర్తి చేసిన తరువాత, వ్యవస్థాపకుడు తన దుకాణంలో ఫర్నిచర్ మొదలైనవి ఏర్పాటుచేసి, బహుమతుల సరఫరాదారుడిని ఎన్నుకొని, అతని నుంచి వాటిని కొనుగోలు చేయవచ్చు.
ఎంతవరకూ ప్రయోజనం?
ఈ వ్యాపారంలో ఇటు విక్రేతకు, అటు వినియోగదారునికి అత్యధిక ప్రయోజనం చేకూరుతుంది. ఎందుకంటే ఈ వ్యాపారంలో ఉత్పత్తులు పాడవడమంటూ జరగదు. కొంతకాలం తరువాతనైనా గిఫ్ట్ షాపులోని వస్తువులు విక్రయమవుతాయి. ఈ ఆధునికకాలంలో పలు సందర్భాలలో వేడుకలు నిర్వహించడం సాధారణంగా మారింది. అటువంటప్పుడు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంటుంది. ఈ అంశమే గిఫ్ట్ షాప్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకుదోహదపడుతుంది. అందుకే ఈ వ్యాపారాన్నిప్రారంభించి, సమర్థవంతంగా నిర్వహించగలిగితే వ్యవస్థాపకుడు ఈ రంగంలో స్థిరపడేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
ఈవిషయాలు గుర్తుంచుకోండి
ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, దానిలో ఉత్పన్నమయ్యే సమస్యల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే వ్యాపారం ప్రారంభించి, దానిని సమర్థవంతంగా నిర్వహించకపోవడం తగినపని కాదు. వ్యాపారమనేది డబ్బుతో ముడిపడిన అంశం. అందుకే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను మందుగానే గ్రహించగలిగితే అవి ఎదురుకాకుండా చూసుకోవచ్చు. లేదా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ విధంగా వ్యవహరించడం ద్వారా నష్టాలు జరిగేందుకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. అందుకే గిఫ్ట్ షాప్ తెరిచేముందు కొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. గిఫ్ట్ షాప్ షాపులో ఎల్లప్పుడూ సరికొత్త వస్తువులను అందుబాటులో ఉంచినపుడు వినియోగదారుల ఆదరణ దొరుకుతుంది. ముఖ్యంగా కస్టమర్ గిఫ్ట్ షాప్పై ఆసక్తి కనబరిచేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇతర దుకాణదారులతో పోలుస్తూ అక్కడి కన్నా తక్కువ ధరలకు వస్తువులను విక్రయించేందుకు ప్రయత్నించాలి. కస్టమర్ దేవుడిలాంటివాడు. కస్టమర్ రాకపోతే దుకాణం ఎలా నడుస్తుంది? అందుకే దుకాణానికి వచ్చేప్రతీ వినియోగదారుని మాట దుకాణదారుడు తప్పనిసరిగా వినాలి. ఈ రోజుల్లో కస్టమర్లను చక్కగా రిసీవ్ చేసుకుంటేనే వారు దుకాణం వైపు ఆకర్షితులవుతారు. అలాగే ఇతరులు కూడా దుకాణానికి వచ్చేలా ప్రేరేపిస్తారు, తద్వారా వ్యాపారం వృద్ధి చెంది, లాభాలబాట పడుతుంది.
గిఫ్ట్ షాప్ వ్యాపారానికి ఎంత ఖర్చవుతుంది?
గిఫ్ట్ షాప్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ. 4 నుంచి 5 లక్షల రూపాయలు అవసరమవుతుంది. వ్యవస్థాపకుడు గిఫ్ట్ ఐటమ్స్ను ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో విక్రయించాలనుకుంటే, అతనికి ఎక్కువ బడ్జెట్ అవసరం అవుతుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లాట్ఫారమ్లలో ఉత్పత్తులను విక్రయించడం ద్వారా అధిక ఆదాయం వచ్చేందుకు అవకాశాలున్నాయి. గిఫ్ట్ షాప్ వ్యాపారాన్ని ప్రారంభించడానికయ్యే అంచనా వ్యయాల గురించి తెలుసుకుందాం.
నగరం మరియు ప్రదేశాన్ని బట్టి దుకాణం అద్దె మారవచ్చు.
నెలకు దుకాణం అద్దె 18, 000 ఉండవచ్చని అనుకుందాం.
దుకాణం లోపల ఫర్నిచర్ మొదలైనవి: రూ .70,000
కంప్యూటర్ / ప్రింటర్ / సాఫ్ట్వేర్ మొదలైన వాటిపై ఖర్చు: రూ. 55,000
లైసెన్స్ మొదలైన వాటికి అయ్యే ఖర్చు: రూ .18,000
ప్రారంభంలో బహుమతి వస్తువులను కొనడానికి ఖర్చు: రూ .1,50,000
దుకాణం ప్రారంభ మరియు మార్కెటింగ్ ఖర్చులు: రూ 52,000
ఇన్వెంటరీ ఇన్స్యూరెన్స్: రూ .13,000
నగదు అవసరం: రూ .50,000
గిఫ్ట్ షాప్ మార్కెటింగ్:
మార్కెటింగ్ అనేది ఎటువంటి వ్యాపారానికైనా ఎంతో కీలకమైనది. మార్కెటింగ్ అనేది వ్యవస్థాపకునికి సంబంధించిన ఉత్పత్తులు లేదా సేవల గురించి ప్రజలకు తెలియజేసేందుకు దోహదపడుతుంది.
కార్పొరేట్ గిఫ్ట్షాప్ ఏర్పాటు చేసే వ్యవస్థాపకుడు ఆర్డర్ల కోసం వివిధ సంస్థలను సంప్రదించాలి.
ఉత్పత్తులను కళాశాల విద్యార్థుల సాయంతో విక్రయించవచ్చు.
గిఫ్ట్ ఐటమ్స్ను ఆన్లైన్లో విక్రయించేందుకు, మార్కెటింగ్ చేయడానికి సొంత గూగుల్ యాడ్వర్డ్ ప్రచారాన్ని క్రియేట్ చేయవచ్చు
కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించాలి.
ప్రముఖ ఇ–కామర్స్ వెబ్సైట్లో ఉత్పత్తుల వివరాలను ఉంచవచ్చు
గిఫ్ట్ షాప్ వ్యాపారాన్ని మరింతగా మార్కెటింగ్ చేసేందుకు ఈ– మార్కెటింగ్ పద్ధతులను కూడా అనుసరించవచ్చు. పలు కంపెనీలు గిఫ్ట్ ఆర్టికల్ వ్యాపారాన్ని ఫ్రాంచైజ్ చేస్తుంటాయి. ఇటువంటి ఫ్రాంచైజ్ తీసుకొని కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ విధమైన వ్యాపార విధానాలతో గిఫ్ట్ షాప్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించవచ్చు