ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించడం ఎలా?
భారతదేశంలో బంగారం మరియు వజ్రాల ఆభరణాల వ్యాపారానికి అపరిమితమైన అవకాశాలున్నాయి. బంగారు ఆభరణాల విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో భారత్ ఒకటి. భారతదేశం అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేశంలోని రత్నాలు మరియు ఆభరణాల రంగం జిడిపిలో దాదాపు 6 నుంచి 7శాతం తోడ్పాటునందిస్తోంది. ఇది అతిపెద్ద పరిశ్రమగా మారుతోంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి వర్గంతోపాటు, పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. దీంతో రాబోయే సంవత్సరాల్లో బంగారానికి మరింత డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఆభరణాల వ్యాపారం దేశంలో అభివృద్ధి బాటలో కొనసాగుతోంది. మతం, భాషలు, అభిరుచులు, సంస్కృతుల కారణంగా భారతదేశంలో ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించడం కొంతవరకూ సవాలుగానే నిలుస్తుంది. ఈ వ్యాపారంపై సరైన పరిజ్ఞానం కలిగివుండి, నిపుణుల సలహాలు తీసుకుంటూ ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కొన్ని చట్టపరమైన మరియు ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవడం ఈ వ్యాపారంలో ముఖ్యమైన అంశం. ఆభరణాల వ్యాపారానికి తగిన పేరును ఎన్నుకోవడం మరియు దానిని రిజిస్ట్రర్ చేయించడం, వ్యాపార లైసెన్స్ పొందడం, మీ వ్యాపారం కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను ఏర్పాటు చేయడం మొదలైనవి ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు భారతదేశంలో ఆభరణాల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.
ఆభరణాల వ్యాపారంలోని రకాలు
భారతదేశంలో రత్నాలు మరియు ఆభరణాల పరిశ్రమ 2013లో సుమారు రూ. 251,000 కోట్ల మార్కెట్ పరిమాణాన్ని కలిగివుంది. ఇది 2018 నాటికి రూ . 500,000 కోట్లకు చేరింది. మొత్తంమీద చూసుకుంటే రత్నాలు మరియు ఆభరణాల పరిశ్రమ ఆరోగ్యకరమైన వార్షిక వృద్ధి రేటుసు సాధిస్తోంది. బంగారు ఆభరణాల రంగంపెట్టుబడులకు కేంద్రంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇండియన్ జ్యువెలరీ బిజినెస్ను ఈ కింద పేర్కొన్న రకాలుగా విభజించవచ్చు
రిటైల్ ఆభరణాల దుకాణాలు
ఆన్లైన్ జ్యువెలరీ రిటైల్
గోల్డ్ ట్రేడింగ్
బంగారం దిగుమతిదారులు
ఆభరణాల తయారీదారులు
రిటైల్ ఆభరణాల దుకాణాన్ని ప్రారంభించడం
భారతదేశంలో 2.5 మిలియన్లకు పైగా ఆభరణాల దుకాణాలు, 4,50,000 మంది స్వర్ణకారులు ఉన్నారు. రిటైల్ ఆభరణాల దుకాణాలు భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. భారతీయ వినియోగదారులు బ్రాండ్ ఆభరణాలను కొనడానికి తక్కువ ఆసక్తిని చూపుతుంటారని, స్థానికంగానే ఆభరణాలను తయారు చేయించుకునేందుకు ఇష్టపడతారనే వాదన వినిపిస్తుంటుంది. భారతదేశంలోని మొత్తం ఆభరణాల రిటైల్ దుకాణాలలో దాదాపు 96 శాతం కుటుంబ యాజమాన్యంలో ఉంటున్నాయి. ఏదైనా రిటైల్ వ్యాపారం ఏర్పాటుకు తగిన ప్రాంతాన్ని ఎంచుకోవడం అత్యం ముఖ్యమైన విషయం. దీనిని ఎన్నుకునే ముందు మీరు మార్కెట్ పరిశోధన చేసి, వ్యాపారావకాశానికి గల విజయావకాశాలను తెలుసుకోవాలి. ఇటువంటి దృక్ఫధమే విజయానికి ప్రధాన కారమని గ్రహించండి. దీనిని అర్థం చేసుకున్న తర్వాత మీ వ్యాపారానికి తగిన ప్రాంతాన్ని సులభం అవుతుంది. ఆభరణాల దుకాణాన్ని బిజీగా ఉండే వాణిజ్య ప్రదేశంలో ఏర్పాటు చేయాల్సివుంటుంది. వాణిజ్య స్థలంలో అద్దెలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి చదరపు అడుగుకు అద్దెను లెక్కిస్తారు. అందుకే మీరు ఏ స్థాయిలో దుకాణం ఏర్పాటు చేయాలనుకుంటున్నార మీరే నిర్ణయించుకోవాలి.
తగిన పేరును ఎన్నుకోండి
ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించేముందు దానికి తగిన పేరును ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. మీ వ్యాపారానికి పెట్టుకునే పేరులో మీరు ఏ విధమైన ఆభరణాలను సృష్టిస్తున్నారో స్ఫురించేలా ఉంటే ప్రభావవంతంగా ఉంటుంది. అది మీ వ్యాపారాన్ని అభివృద్ధ చేసేందుకు కూడా దోహదపడుతుందని చెప్పవచ్చు. అలాగే మీ వ్యాపారానికి సంబంధించిన వెబ్సైట్ వినియోగదారుల దృష్టిలో పడుతుంది. ఈ వ్యాపారంలో ఇప్పటికే ఉన్నవారు ఏదో ఒక పేరును ఎన్నుకుని పొరపాటు చేస్తుంటారు. ఉదాహరణకు మీ స్టోర్ పేరు క్లాసిక్ జ్యువెలరీ అనివుంటే బాగుంటుంది. ఆ పేరు ఎప్పటికీ క్లాసిక్గా నిలిచిపోతుంది. మీ వ్యాపారానికి ఖచ్చితమైన పేరును ఎన్నుకున్నాక ఆ పేరును మరెవరూ ఉపయోగించడం లేదని నిర్ధారించుకోవాలి. తరువాత దానిని రిజిస్ట్రర్ చేయించాలి. ఆభరణాల వ్యాపారానికి పేరు నమోదు చేయించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఆ పేరును నమోదు చేయకపోతే, మరొకరు నమోదు చేసుకోవచ్చు అప్పుడు మీరు ఆ పేరును ఉపయోగించుకునే హక్కును కోల్పోతారు. మొదట మీరు ఎంచుకున్న పేరును మరొకరు నమోదు చేసుకున్నారో లేదో చూడటానికి వెబ్ను తనిఖీ చేయండి. మీ వ్యాపార శ్రేణిని బట్టి, మీకు వేర్వేరు రిజిస్ట్రేషన్లు మరియు లైసెన్సులు అవసరం అవుతాయి.
జ్యువెలరీ బిజినెస్కు పెట్టుబడి
మీరు మీ వ్యాపారానికి తగిన స్థానాన్ని ఎన్నుకున్న తర్వాత అద్దెలు, ఇంటీరియర్స్, లైటింగ్, ఫర్నిచర్ మరియు ఫిట్టింగులు, కంప్యూటర్లు మొదలైన వాటిపై పెట్టుబడి పెట్టాలి. వ్యాపారంలోకి రాకముందే ఈ ప్రాజెక్టుకు ఎంత డబ్బు అవసరమో తెలుసుకోవాలి. మీరు వేసుకున్న బడ్జెట్ కంటే 30 శాతం ఎక్కువగానే ఖర్చు అవుతుందని గ్రహించండి. ధరల పెరుగుదల కూడా దీనికి కారణంగా నిలుస్తుంది. ఇక రిక్రూట్మెంట్, మార్కెటింగ్ వంటి ఇతర అంశాలకు కూడా తగినంత డబ్బు అవసరమవుతుంది. మొదటి 6 నెలలు వ్యాపారం నుండి ఎటువంటి ఆదాయాన్ని ఆశించకుండా, కనీసం 6 నెలలు వ్యాపారాన్ని నడపడానికి మీకు తగినంత మూలధనం ఏర్పాటు చేసుకోవాలి. మొదటి రోజు నుంచే ఆదాయాన్ని ఆశించడం కారణంగా చాలామంది వ్యాపారంలో దెబ్బతింటారు. మొదటి రోజు నుండే ఆదాయం వస్తే అది మంచిదే కానీ అన్ని చోట్లా ఇది సాధ్యం కాదు. ముఖ్యంగా ఆభరణాల దుకాణాన్ని నడిపేందుకు తగినంత ఓపిక ఉండాలి.
వ్యాపార నమోదు
ఆభరణాల వ్యాపారాలు పెద్ద టర్నోవర్ను (రూ .1 కోట్ కంటే ఎక్కువ టర్నోవర్) కలిగి ఉంటాయి. అందువల్ల ఈ వ్యాపారంలో మరిన్ని ప్రయోజనాలను అందుకునేందుకు ఆభరణాల వ్యాపారాలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నమోదు చేయాలని నిపుణులు చెబుతుంటారు. ఈ వ్యాపారాన్ని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేపట్టడం ద్వారా రుణం లేదా ఈక్విటీ రూపంలో నిధులను సులభంగా సేకరించవచ్చు.
పన్ను రిజిస్ట్రేషన్
రత్నాలు మరియు ఆభరణాల అమ్మకంపై జీఎస్టీ కింద పన్ను విధించబడుతుంది. అందువల్ల అన్ని ఆభరణాల వ్యాపారాలు స్థానిక రాష్ట్ర పన్ను శాఖ నుండి జీఎస్టీ నమోదు కలిగివుండాలి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందిన తరువాత వ్యాపార యజమానులు జరిమానాలను నివారించుకోవచ్చు. భారతదేశంలోకి బంగారు ఆభరణాలను దిగుమతి చేసుకోవడానికి దీనికి దిగుమతి, ఎగుమతి కోడ్ లేదా ఐఈ కోడ్ అవసరం. భారతదేశంలోకి బంగారాన్ని దిగుమతి చేసుకునే ముందు సంబంధిత వ్యాపారులు ఇందుకువున్న నిబంధనలు పాటించాలి. భారతదేశంలోకి బంగారాన్ని దిగుమతి చేసే విధానం గురించి తెలుసుకోండి.
హాల్మార్క్ ఆభరణాలను అమ్మడానికి బీఐఎస్ లైసెన్స్
హాల్మార్కింగ్ అనేది ఆభరణాలలో విలువైన లోహం యొక్క దామాషా కంటెంట్కు సంబంధించిన ఖచ్చితమైన నిర్థారణ. మరియు అధికారిక గుర్తింపు. హాల్మార్క్ ఆభరణాలు విలువైన లోహం యొక్క స్వచ్ఛతకు హామీగా నిలుస్తాయి. హాల్మార్కింగ్ అనేది నకిలీ ఉత్పత్తుల నుండి ప్రజలను రక్షించడానికి దోహదపడుతుంది. అలాగే తయారీదారులు స్వచ్ఛత ప్రమాణాలను చక్కగా నిర్వహించేందుకు సహకరిస్తుంది. హాల్మార్క్ గుర్తింపు పొందిన ఆభరణాలను విక్రయించాలనుకునే ఆభరణాల నిర్దిష్ట రిటైలర్ తన అవుట్లెట్ కోసం బీఐఎస్ నుండి లైసెన్స్ పొందాలి. అలాగే బహుళ అవుట్లెట్లు కలిగి ఉన్న ఒక సంస్థ హాల్మార్క్ ఆభరణాలను విక్రయించడానికి అధిక బీఐఎస్ లైసెన్స్‌లను పొందాలి. లైసెన్స్ మంజూరు అయిన తరువాత ఆభరణాల విక్రయ ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలు మరియు షరతులను పాటించాలి. విలువైన లోహం (బంగారం మరియు / లేదా వెండి) యొక్క స్వచ్ఛతలో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే సంబంధిత వ్యాపారుల లైసెన్స్ను రద్దు చేయడంతోపాటు జరిమానా విధిస్తారు.
మీ వ్యాపారం కోసం ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరవాలి
మీరు ఆభరణాల వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ఈ ఖాతా మీ ఆభరణాల వ్యాపారం నుండి వచ్చే మొత్తం ఆదాయాన్ని నిర్వహిస్తుంది. మరియు అన్ని ఖర్చులను చెల్లించేందుకు దోహదపడుతుంది. మీ వ్యాపారం మరియు వ్యక్తిగత ఆర్ధికవ్యవస్థల ఖాతాలను వేరుచేయడం వలన మీ వ్యాపార రికార్డ్ కీపింగ్ పారదర్శకంగా ఉంటుంది.
సిబ్బంది నియామకం
మీ వ్యాపారంలో సమర్థవంతమైన సిబ్బందిని నియమించడం వ్యాపార విజయానికి మరియు స్థిరత్వానికి కీలకంగా నిలుస్తుంది. కస్టమర్ల విశ్వసనీయతను పొందేందుకు దుకాణంలోని సిబ్బంది ప్రవర్తన ప్రధాన పాత్ర పోషిస్తుంది. విశ్వసనీయ కస్టమర్లే లాభాలకు కీలకం. అలాగే నమ్మకస్తులైన ఉద్యోగులు సంస్థ దీర్ఘకాలిక విజయానికి కీలకంగా మారుతారు.
మార్కెటింగ్
రిటైల్ వ్యాపారంలో మార్కెటింగ్ మరొక ముఖ్యమైన అంశం. మీ ఉత్పత్తులు మరియు సేవల గురించి అందరికీ తెలిస్తేనే వినియోగదారులు మీ దుకాణానికి వస్తారు. మీరు అన్ని మాధ్యమాలలో మీ వ్యాపారానికి సంబంధించిన ప్రకటనలు ఇవ్వాలి. వార్తాపత్రికల్లో ప్రకటనలు, టీవీ ప్రకటనలు, హోర్డింగ్స్ మరియు థియేటర్ ప్రకటనలు తరచూ ఇస్తుండాలి. మీ బడ్జెట్ను అనుసరించి, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.
వ్యాపారాన్ని నిర్వహించడం
మీరు మీ దుకాణాన్ని అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నాక తదుపరి సవాలు దానిని సమర్థవంతంగా నిర్వహించడం. మీ నాయకత్వ సామర్థ్యాలతో పాటు, మీ వ్యాపారాన్ని సజావుగా నడిపించడానికి మీరు మార్కెట్లోని వనరులను కూడా ఉపయోగించుకోవాలి. మీ ఆభరణాల దుకాణంలో మీరు ప్రతి కొనుగోలుకు మీ కస్టమర్లకు బిల్ ఇవ్వాలి. ఇందుకోసం సాఫ్ట్వేర్ను ఉపయోగించడం ఉత్తమం. వ్యాపార యజమానిగా మీరు కొత్త వ్యూహాలను రూపొందిస్తూ అభివృద్ధి పథంలో ముందుకుసాగాలి.
పాయింట్ ఆఫ్ సేల్ సాఫ్ట్వేర్
ఆభరణాల దుకాణానికి అవసరమైన మొట్టమొదటి సాఫ్ట్వేర్ కస్టమర్లకు బిల్లింగ్ చేయడానికి ఉపకరించేది పీఓఎస్ సాఫ్ట్వేర్. ఏ రిటైల్ వ్యాపారానికైనా నగదు రిజిస్టర్ ముఖ్యం. లావాదేవీలను ప్రాసెస్ చేయగల సామర్థ్యం మరియు టెండర్ నగదు వ్యాపారం యొక్క సమర్థవంతమైన ఆపరేషన్కు ఇది అవసరం. పీఓఎస్ వ్యవస్థ విక్రయాలను, నగదు వ్యవహారాలను ట్రాక్ చేయడానికి ఉపకరిస్తుంది. పీఓఎస్ వ్యవస్థ మీ వ్యాపారంలో అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. కొత్త వ్యాపారానికి పీఓఎస్ వ్యవస్థ ఏర్పాటు స్మార్ట్ పెట్టుబడిలాంటింది. ఇది శ్రమను తగ్గించేందుకు, వ్యాపార సామర్థ్యం పెరుగుదలకు దారితీస్తుంది. ఈ వ్యవస్థ సమయాన్ని–ఇంటెన్సివ్ పనులను ఆటోమేట్ చేస్తుంది.