కన్సల్టెంగ్ సంస్థను ఎలా ఏర్పాటు చేయాలి?
కన్సల్టింగ్ సంస్థలు వివిధ సేవలు అందిస్తూ, వినియోగదారుల నుంచి తగిన మేరకు ఫీజులు వసూలు చేస్తూ ఆదాయాన్ని పొందుతాయి. ఇటువంటి సంస్థలు గంటకు లేదా ఒక్కో ప్రాజెక్ట్ ప్రాతిపదికన ఫీజులు వసూలు చేస్తుంటాయి. కన్సల్టింగ్ సంస్థ ప్రారంభించడానికి కొంతమేరకు మూలధనం అవసరం. వినియోగదారుల సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం, సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం వలన కన్సల్టెంట్లు అధిక ఆదాయాన్ని పొందగలుగుతారు. కన్సల్టింగ్ సంస్థ వ్యాపార ప్రణాళికలో మార్కెటింగ్ వ్యూహాలు ఎంతో ముఖ్యమైనవి. కొత్త క్లయింట్లను పొందేందుకు కన్సల్టెంట్స్ తప్పనిసరిగా పలు వ్యూహాలను కలిగి ఉండాలి.
ఈ వ్యాపారంలోకి ప్రవేశించేవారు ముందుగా సేవల పరిధిని నిర్ణయించుకోవాలి. కస్టమర్ అవసరాలకు మీ నైపుణ్యాలు మరియు సామర్థ్యాలు ఎలా సరిపోతాయో చూసుకోండి. మీరు అందిస్తున్న సేవలకు ఖాతాదారులు తగిన మొత్తంలో డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోండి. మార్కెట్ అవసరాలను గుర్తించండి. మీ సేవలు మీ ఖాతాదారులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యను పరిష్కరించాలి. దానికి కేవలం మీ నైపుణ్యాలు లేదా పరిజ్ఞానం మాత్రమే సరిపోదు. వినియోగదారుల సమస్యలకు పరిష్కాల కోసం వివిధ మార్గాలను అన్వేషించాలి. అప్పుడే ఇతర కన్సల్టింగ్ సంస్థల కంటే మీరు అందించే సేవల ప్యాకేజీ ఎలా భిన్నంగా ఉంటుందో తెలుస్తోంది. అప్పుడే మీ కన్సల్టెన్సీ వ్యాపారం రాణిస్తుంది. మీ దగ్గరకు వచ్చే వినియోగదారులకు మీ సంస్థ అందించే ప్రయోజనాలను స్పష్టంగా వివరించండి.
మీ వ్యాపార నమూనాను క్రియేట్ చేయండి. మీరు అందిస్తున్న సేవలను మరియు ప్రతిదానికి మీరు వసూలు చేసే ఛార్జీలను ఖరారు చేయండి. మీరు మూడేళ్ల వ్యాపార ప్రణాళిక చేసివుంటే, తదుపరి రెండు మరియు మూడు సంవత్సరాల్లో మీరు అందించగల అదనపు సేవలను గుర్తించండి. అప్పుడు మీరు కొత్తగా అందించబోయే సేవలను గుర్తించడానికి మీకు స్థిర కస్టమర్ బేస్ సిద్ధంగా ఉంటుంది. ఇందుకోసం తగిన మార్కెటింగ్ ప్రణాళికను రూపొందించండి. మీ వెబ్‌సైట్‌ను కూడా ఈ ప్రణాళికలో భాగం చేయండి. మీ వెబ్సైట్ కంటెంట్ మరియు సెర్చ్ ఇంజన్ వ్యూహాలు వినియోగదారులను ఆకట్టకునేలా తీర్చిదిద్దండి. సమర్థవంతమైన వెబ్సైట్ మీ సంస్థకు అంతర్జాతీయ స్థాయి వినియోగదారులకు చేరువయ్యేలా చేస్తుంది. మీ వ్యాపారానికి నెట్వర్కింగ్ ప్రయోజనాలు పొందేందుకు మీరు హాజరుకావాల్సిన సమావేశాలు మరియు వాణిజ్య ప్రదర్శనలను జాబితా సిద్ధం చేసుకోండి. క్లయింట్ల సంఖ్యను పెంపొందించుకునేందుకు పోటీ లేని ప్రొఫెషనల్ సేవా సంస్థలను సంప్రదించండి.
వ్యాపారానికి అవసరమైన ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేయండి. మీ అంచనాల మేరకే కార్యాచరణను ప్రారంభించండి. వ్యాపారం ప్రారంభించిన వెంటనే ఆదాయాలు త్వరగా పెరుగుతాయని అనుకోకండి. రిఫెరల్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి కొంత సమయం పడుతుంది. మీ కన్సల్టింగ్ వ్యాపారం కొనసాగించడానికి మీరు తగినంత మూలధనం ఏర్పాటు చేసుకోండి. మీ ప్రణాళికలో ప్రతిపాదిత వ్యయాలను పరిశీలించండి. దీనిలోని ప్రతి ఒక్కటి మీ వ్యాపారం యొక్క వృద్ధికి దోహదపడుతుందని నిర్ధారించుకోండి.
ప్రాజెక్ట్ వసూలు చేసే ఫీజుల విషయంలో ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు కొంత మొత్తాన్ని తీసుకోండి. తరువాత పురోగతి చెల్లింపు మరియు ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు తుది చెల్లింపు… ఇలాంటి ప్రక్రియ కొనసాగించండి. ఇది ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు దానిని వదిలివేయాలని నిర్ణయించుకునే వారి నుండి పాక్షికంగా మిమ్మల్ని రక్షిస్తుంది. మూలధనాన్ని తగ్గించుకునేందుకు ఈ వ్యాపారం మొదట మీ ఇంటి నుండి నిర్వహించాలని మీరు మీ వ్యాపార ప్రణాళికలో రాసుకోవచ్చు. వృత్తిపరమైన ఇమేజ్ను నిర్వహించడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలి. విజిటింగ్ కార్డులో వ్యాపారానికి కేటాయించిన ఫోన్ ఫోన్ నంబర్ ఉంచండి. ఇంటిలో లేదా ఇంటికి సమీపంలో మీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోండి. అప్పుడు మీరు మీ వ్యాపారం విషయంలో మరింత అంకితభావం ప్రదర్శించగలుగుతారు.
అభివృద్ధి చెందుతున్న టాప్ 20 కన్సల్టింగ్ వ్యాపారాలు
- అకౌంటింగ్: అకౌంటింగ్ అనేది ప్రతి వ్యాపారానికి అంటే ఎంత పెద్దది అయినా లేదా చిన్నది అయినా అవసరం. అకౌంటింగ్ కన్సల్టెంట్స్ వ్యాపారానికి దాని అన్ని ఆర్థిక అవసరాల నిర్వహణకు సహాయం అందించగలుగుతాడు.
- ప్రకటనలు: మంచి వ్యూహాత్మక ప్రకటనల ప్రచారాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రకమైన కన్సల్టెంట్‌ను సాధారణంగా వ్యాపారులు సంప్రదిస్తుంటారు.
- ఆడిటింగ్: చిన్న వ్యాపారాల కోసం యుటిలిటీ బిల్లులను ఆడిట్ చేసే కన్సల్టెంట్ల నుండి టెలికమ్యూనికేషన్ సంస్థలకు ప్రధాన పనిని నిర్వహించే కన్సల్టెంట్ల వరకు, ఆడిటింగ్ కన్సల్టెంట్స్ వారి శక్తియుక్తులను అందిస్తున్నారు.
- వ్యాపారం: వ్యాపారంలో లాభాలు పొందేందుకు ఏం చేయాలో తెలుసా? మీకు మంచి బిజినెస్ సెన్స్ ఉంటే, మీరు బిజినెస్ కన్సల్టెంట్‌గా బాగా పనిచేయగలుగుతారు. కంప్యూటర్ కన్సల్టింగ్ తరువాత ఈ విభాగానికి అధిక ఆదరణ దక్కుతోంది.
- బిజినెస్ రైటింగ్: ఏదైనా రిపోర్ట్ రాసేటప్పుడు చాలా మంది వ్యాపారవేత్తలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. సాధారణ మెమో రాసేందుకు కూడా చాలామంది తడబడుతుంటారు. బిజినెస్ కన్సల్టెంట్‌గా ఎదిగినవారు ఈ రంగంలో ఉంటూ సంతృప్తికరంగా జీవిస్తున్నారు.
- కెరీర్ కౌన్సెలింగ్: విద్యారంగంలోకి కార్పొరేట్ తీరుతెన్నులు ప్రవేశించడంతో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. కెరీర్ కౌన్సెలర్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. కెరీర్ కౌన్సెలర్లు తమ దగ్గరకు వచ్చేవారికి ఒక వృత్తిగా లేదా ఉద్యోగానికి తగిన మార్గనిర్దేశం చేస్తారు. అది కన్సెల్టెంట్‌గా సంతోషానివ్వడంతోపాటు మరియు ఉత్పాదకశక్తిగా ఉండేందుకు సహాయపడుతుంది.
- కమ్యూనికేషన్స్: కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ పెద్ద మరియు చిన్న వ్యాపారాలలో ఉద్యోగుల మధ్య ఒకరితో మరొకరు బాగా కమ్యూనికేట్ చేసుకోవడానికి సహాయపడటంలో ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటారు. కమ్యూనికేషన్ అనేది వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తుంది. వ్యాపార నిర్వహణ సజావుగా జరిగేలా చూస్తుంది.
- కంప్యూటర్ ప్రోగ్రామర్: సాఫ్ట్వేర్ నుండి హార్డ్‌వేర్ వరకు, మరియు మధ్యలో ఉన్న ప్రతి సేవలను కంప్యూటర్ ప్రోగ్రామర్ అందిస్తాడు. మీకు కంప్యూటర్లు గురించి బాగా తెలిస్తే కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా ఉంటూ మీ దగ్గరకు వచ్చేవారి డిమాండ్లను తీర్చడానికి ప్రయత్నిస్తుండాలి. ఈ పనిలో రోజులో తగినంత సేపు పనిచేయాల్సివుంటుంది.
- సంపాదకీయ సేవలు: వార్తాలేఖలను రాయడం నుండి కార్పొరేట్ వార్షిక నివేదికల వరకు సేవలు అందిస్తూ, సంపాదకీయ రంగంలో నిపుణులుగా ఉన్న కన్సల్టెంట్స్ ఎల్లప్పుడూ ప్రశంసలు అందుకుంటారు
- ఎగ్జిక్యూటివ్ సెర్చ్ / హెడ్‌హంటర్ సంస్థలు: ఇది అందరికీ అవసరం కానప్పటికీ, కంపెనీ యజమానుల కోసం ప్రతిభను కనుగొనడంలో సహాయపడే వారు ఇటువంటి సేవలు అందిస్తున్నారు.
- తోటపని: గత దశాబ్దంలో గార్డెనింగ్ కన్సల్టెంట్లకు మరింత డిమాండ్ పెరిగింది. దేశంలో సంవత్సరానికి ఒక మిలియన్ ఆదాయ వ్యాపారాన్నిఇది అందిస్తోంది. పలువురు వ్యాపారులు గార్డెనింగ్ కన్సల్టెంట్లను నియమించుకుంటున్నారు. అలాగే తోటలను పర్యవేక్షించడంలో చాలా బిజీగా ఉన్న గార్డెనింగ్ కన్సల్టెంట్లు కూడా లెక్కకుమించి ఉన్నారు.
- గ్రాంట్స్మన్షిప్: గ్రాంట్ ప్రతిపాదనను ఎలా రాయాలో నేర్చుకున్న తర్వాత, మీరు ఈ రంగంలోకి దిగి, ఈ విధమైన సేవలు అందిస్తూ ఉపాధి పొందవచ్చు.
- మానవ వనరులు: మానవ వనరులు అందించే కన్సల్టెన్సీలకు మంచి డిమాండ్ ఉంది. వివిధ వ్యాపారాలకు, సంస్థలకు నిపుణులైన సిబ్బంది అవసరం ఉంటుంది. నిపుణులైన సిబ్బంది సహాయ సహకారాలతోనే ఏ వ్యాపారమైనా వృద్ధి చెందుతుంది.
- బీమా: ప్రతి ఒక్కరికీ బీమా అనేది ఎంతో అవసరం. అలాగే ఈ విషయంలో చాలామందికి ఉత్తమమైన ప్రణాళిక మరియు సరసరమైన ధరలను అందించడంలో సహాయపడటానికి భీమా సలహాదారు అవసరం.
- మార్కెటింగ్: మార్కెటింగ్ ప్రణాళిక రాయడానికి అవసరమై సత్తా మీలో ఉందా? లేదా ఏదైనా వ్యాపారాన్ని ప్రోత్సహించడంలో మీరు సహాయపడగలరని మీరు భావిస్తున్నారా? అయితే మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా ఈరంగంలో రాణించేందుకు ఎందుకు ప్రయత్నించకూడదు?
- పేరోల్ నిర్వహణ: ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని అనుకుంటారు. పేరోల్ నిర్వహణలో పరిజ్ఞానం మరియు నైపుణ్యాన్ని ఉపయోగించడం ద్వారా మీరు మీ సేవలను పెద్ద మరియు చిన్న అనేక వ్యాపార సంస్థలకు అందించవచ్చు.
- ప్రజా సంబంధాలు: ఏ సంస్థకైనా మంచి ప్రెస్ కవరేజ్ పొందడం ఎంతో అవసరం. ఒక సంస్థ మంచి పిఆర్ కన్సల్టెంట్‌ను నియమించుకున్నప్పుడు వారు జీవితాంతం ఆ సంస్థకు సేవలు అందిస్తారు.
- ప్రచురణ: మీకు ప్రచురణ రంగంలో ఆసక్తి ఉంటే, మీరు చేయగలిగిన అన్ని అంశాలను నేర్చుకోండి. మరియు మీరు కూడా ప్రచురణ సలహాదారు గా కూడా రాణించవచ్చు. కొత్త వార్తాపత్రిక, పత్రిక, వార్తాలేఖ మరియు వెబ్సైట్లు మరియు ఎలక్ట్రానిక్ వార్తాలేఖలను ప్రారంభించటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రచురణ కన్సల్టెంట్‌గా కొత్త వెంచర్లను ప్రారంభించవచ్చు.
- పన్నులు: సరైన మార్కెటింగ్ మరియు వ్యాపార ప్రణాళికతో పన్ను సలహాదారుగా మీ కెరీర్ చాలా లాభదాయకంగా ఉంటుంది. పన్ను కన్సల్టెంట్ సాధ్యమైనంత తక్కువ పన్ను చెల్లించేలా చట్టపరమైన పద్ధతులపై వ్యాపారాలకు సలహాలు, సూచనలు అందిస్తాడు.
- రాత సేవలు:రాతపూర్వక పదానికి సంబంధించిన విషయమేదైనా ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. రచనా రంగంలో మీ ప్రత్యేకతను కనుగొనండి. మీ పనికి ఆకాశమే హద్దు అవుతుంది.