"ప్రస్తుతం అన్ని వ్యాపారాలు ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ACH)పేమెంట్లను అంగీకరిస్తున్నాయి. అలాంటి లావాదేవీలు జరపాలంటే, మీ బ్యాంకు అకౌంట్, బ్యాంకుచే ధృవీకరించబడింది అనే బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్ ఉండాలి. ఇంకా, ఆ లెటర్ వలన, ఆ వ్యాపారం చేస్తున్న అన్ని లావాదేవీలు చట్టబద్దమైనవే అనే నిర్దారణ ఉంటుంది. కొనుగోలుదారుడు, వ్యాపార భాగస్వామి, రుణాలు ఇచ్చేవారు, మిగిలిన వాటాదారులందరు కూడా ఆ బ్యాంక్ ధ్రువీకరణ పత్రం ద్వారా ఆ సంస్థ నమ్మకమైనదని నిర్ధారించగలుగుతారు.
అందువలన, మీ వ్యాపారం ఏ బ్యాంకు తో అనుసందించనది ఉందో, ఆ బ్యాంకు కి ఒక చక్కటి ఫార్మాట్ కలిగిన బ్యాంకు బ్యాంక్ వెరిఫికేషన్ పత్రాన్ని తయారుచేసుకోవాలి. మరియు, అందులో వినియోగదారుని క్రెడిట్ యోగ్యత కూడా ద్రువీకరించబడుతుంది.
బ్యాంకు ధ్రువీకరణ పత్రం రాయడానికి అవసరమైన స్టెప్స్
ఈ బ్యాంకు ధ్రువీకరణ లెటర్ విషయంలో ఒక్కో బ్యాంకు ఒక్కో ఫార్మాట్ కలిగి ఉంటుంది. అయినా వాటి అన్నిటిలోను ప్రాథమిక దశలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. మీరు ఆ పత్రికలోని ముఖ్యఅంశాలను అర్ధం చేసుకోగలిగితే, ఏ బ్యాంకుకి సంబంధించినది అయినా ఈజీగా చేయగలుగుతారు.
మీరు ఆ లెటర్ని ఒక సింపుల్ కాగితం మీద కూడా చేయగలుగుతారు. కాకపోతే లెటర్ మీద బ్యాంక్ యాజమాన్యం సంతకం తీసుకోవాలి.
- బ్యాంక్ వివరాలు:బ్యాంకుపేరు, చిరునామా, పైన ఎడమవైపున వ్రాయండి.
- వివరాలు: వినియోగదారుని వివరాలు( మీ వ్యాపార ధ్రువీకరణ నిమిత్తం లెటర్ పెట్టేవారు).
- స్వీకరించువారు: లెటర్ అందజేయబడిన వారికి.
- అంశం: మీరు ఏ కారణంతో బ్యాంకు మీ వినియోగదారునికి లెటర్ ఇవ్వాలనుకుంటున్నారో తెలపండి. (చిరునామా ధ్రువీకరణ, క్రెడిట్ యోగ్యత, వంటివి ఏదైనా).
- వివరణ: Iఇక్కడ మీరు మీ వ్యాపారానికి సంబంధించిన వివరాలు తెలపండి. పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, వెబ్సైట్ చిరునామా, ఇమెయిల్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్. బ్యాంకు వీటిని ఆథరైజ్ చేసి, మరిన్ని వివరాలను జోడిస్తుంది.
- మీ బ్యాంకు వివరాలు
- అకౌంట్ నెంబర్
- అకౌంట్ టైపు
- అకౌంట్ తెరిచిన తేదీ
- ఆఖరిగా, బ్యాంకు మీ క్రెడిట్ యోగ్యతను అనుమతిస్తుంది.
- బ్యాంకు ఆఫీసర్ పేరు మరియు సంతకం
బ్యాంకు నిర్దారణపత్రం యొక్క ఫార్మాట్
సాధారణంగా, వ్యాపారంలోని లెక్కలు తనిఖీ చేసేటప్పుడు నిర్దారణపత్రం అవసరమవుతుంది. అసలు ఈ నిర్ధారణపత్రం ఎందుకు అవసరమవుతుంది అంటే:
- బ్యాంకు ఆపరేషన్ నిర్దారణ– బ్యాంకు మీ లావాదేవీలను నిర్దారిస్తుంది.
- బ్యాంకు బాలన్స్ నిర్ధారణ - బ్యాంకు మీ అకౌంట్ బాలన్స్ విషయంలో మీ వినియోగదారులకు ఒక ఆరోగ్యవంతమైన నిర్దారణ ఇస్తుంది.
- చిరునామా నిర్దారణ పత్రం – ఈ పత్రం మీ వ్యాపారం యొక్క చిరునామా కోసం ఇవ్వబడుతుంది.
నిర్దారణ/ ధ్రువీకరణ పత్రాలు పైన చెప్పబడిన విధంగా ఇవ్వవలసి ఉంటుంది. మీరు ఏ కారణంతో లెటర్ ఇవ్వాలనుకుంటున్నారో బట్టి అంశం దగ్గర రాయవలసింది ఉంటుంది.
బ్యాంకర్ ధ్రువీకరణపత్రం యొక్క ఫార్మాట్:
క్రింద ఇవ్వబడిన ఫార్మాట్ లో బ్యాంకు వివరాలు, అంశం వివరణ తరువాత ఉంటుంది. మీరు మీ బ్యాంకు నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని చూడండి. ప్రధానమైన వివరాలు అన్నిటిలో ఒకేలా ఉన్నప్పటికీ, ప్రతి బ్యాంకు పత్రం వైవిధ్యంగా ఉంటుంది.
గౌరవనీయులైన బ్యాంక్ అధికారికి అయ్యా,
బ్యాంకర్ సంతకం మరియు ముద్ర తేదీ పేరు ప్రదేశం హోదా |
బ్యాంకు స్టేట్మెంట్ లెటర్ ఫార్మాట్
మీకు మీ వ్యాపార లావాదేవీలకు సంభందించిన నివేదిక తీసుకోవలసిన అవసరం వచ్చినపుడు, మీరు దీనికోసం బ్యాంక్ కు అభ్యర్థన పెట్టవచ్చు. ఈ లెటర్లో ధ్రువీకరణ పత్రంలో ఉండేట్టుగానే అన్ని వివరాలు ఉంటాయి, అదనంగా మీ అకౌంట్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ వివరాలు జోడించబడి ఉంటాయి. ఈ లెటర్లో లావాదేవీల గురించి పూర్తి సమాచారం ఉండటం వలన, సరాసరి బ్యాంకు నుంచి వ్యాపార యజమానికే పంపబడుతుంది. ఇది ఆడిట్ మరియు పన్ను ధ్రువీకరణ సమయంలో అవసరమవుతుంది.
PACL బ్యాంకు ధ్రువీకరణ లెటర్
సుప్రీమ్ కోర్ట్ తీర్పు అనుసారంగా, లోధా కమిటి, ప్రతి పెట్టుబడిదారునికి పెర్ల్ ఆగ్రోటెక్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వారు పెట్టిన పెట్టుబడి మొత్తాన్ని వాపసు తీసుకోవాలని ప్రకటించింది. మీరు PACL బ్యాంకు ధ్రువీకరణ లెటర్ పిడిఎఫ్ ఉపయోగించి, క్రింద చెప్పిన ప్రక్రియలో మీ డబ్బుని వాపసు పొందవచ్చు.
- పిడిఎఫ్ ఫారం డౌన్లోడ్ చేసుకుని, వివరాలు నింపండి.
- ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో (ప్రింట్ మరియు స్కాన్) క్రింద అడిగిన అన్ని వివరాలు సేకరించండి.
- PACL ధ్రువీకరణ పత్రం
- PAN కార్డు
- క్యాన్సిల్ చేసిన చెక్
- బ్యాంక్ వెరిఫికేషన్ లెటర్
- పాస్‌పోర్ట్ ఫోటో
- www.sebipaclrefund.co.inలోకి వెళ్లి PACL మీకు ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ సమయంలో మీరిచ్చిన ఫోన్ నెంబర్ ఇవ్వండి. అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది.
- OTP వచ్చిన తరువాత పాస్వర్డ్ తయారు చేసుకుని నిర్దారించండి.
- ఇప్పుడు మీ బ్యాంకు వివరాలు, రసీదు వివరాలు, పాన్ నెంబర్, చెక్ నెంబర్ మొదలైనవి రాసి మీ పెట్టుబడి వాపసు ప్రక్రియను మొదలుపెట్టండి.
- 2వ పాయింట్ లో అడిగిన అన్ని డాక్యూమెంట్స్ అప్లోడ్ చేయండి.
- Agree అనే బాటమ్ మీద టిక్ కొట్టి, సబ్మిట్ చేయండి.
- మీకు ఒక SMS వస్తుంది, దాని నుంచి మీరు మీ వాపసు ప్రక్రియను ఆన్లైన్లోనే చెక్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు:
- బ్యాంకు ధ్రువీకరణ లెటర్లు దాదాపు అన్ని బ్యాంకు వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంటాయి, మీరు కావాలనుకుంటే, పైన చెప్పిన విధాలుగా తయారుచేసుకోవచ్చు, అన్ని బ్యాంకు లెటర్లు చిన్న చిన్న మార్పులతో సుమారుగా ఒకేలా ఉంటాయి.
- దానివల్ల మీ వ్యాపారాన్నీ బ్యాంకు యొక్క లైన్ అఫ్ క్రెడిట్ తో ద్రువీకరించవచ్చు.
- మీరు కావాలంటే, బ్యాంకులో అభ్యర్థన పెట్టి, వ్యక్తికి లేదా వ్యాపారానికి కూడా లేటర్‌ను పొందవచ్చు.
- మీరు పన్ను చెల్లింపుల కోసం లెటర్ కావాలనుకుంటే, దానిమీద బ్యాంకర్ సంతకం కచ్చితంగా ఉండాలి, అప్పుడే ఆ లెటర్ చెల్లుతుంది.
- మీరు ఏ పనిమీద, ఏ కారణంతో ఆ లెటర్ తీసుకుంటున్నారో, కేవలం దానికి మాత్రమే అది పనిచేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. బ్యాంకు మీరు చెప్పిన కారణాన్ని స్పష్టంగా ఆ లెటర్లో నమోదుచేస్తుంది కాబట్టి వేర్వేరు పనులకి వాడలేరు.
- ఈ లెటర్ మీ వ్యాపార విలువను తెలపడానికి, జేవీ ప్రాజెక్టులోకి అడుగుపెట్టడానికి మొదలైన వాటికోసం వాడుకోవచ్చు.
అయినప్పటికీ, బ్యాంకు జారీ చేసిన ఈ లెటర్, మీ ఎటువంటి లావాదేవీలకు, మరే ఇతర ఫండ్ ప్రొవిజిన్కు వారెంటీ ఇవ్వదు. ఇది కేవలం బ్యాంకు వినియోగదారుని క్రెడిట్ యోగ్యతకు ఇచ్చే అధికారపత్రం మాత్రమే.