భారతదేశంలో రసాయన వ్యాపారాన్ని ప్రారంభించడం ఎలా?
మీరు చిన్న స్థాయిలో రసాయన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అలా అయితే, తక్కువ మూలధన పెట్టుబడితో ప్రారంభించే లాభదాయకమైన రసాయన వ్యాపార ఐడియాల కోసం మరింత సమాచారాన్ని తెలుసుకోండి. రసాయన పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పారిశ్రామిక రంగాలలో ఒకటి. యునైటెడ్ స్టేట్స్లోని జిడిపిలో రసాయన పరిశ్రమ 5 శాతం వాటా కలిగివున్నదని గణాంకాలు చెబుతున్నాయి. తక్కువ పెట్టుబడితో ఈ పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఎదురుచూస్తున్నవారు చిన్నస్థాయిలో రసాయనాల పంపిణీ లేదా తయారీ విభాగంలోకి ప్రవేశించవచ్చు. ప్రపంచంలో రసాయన పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది. అయితే రసాయన మార్కెట్ వృద్ధి రేటు ఎక్కువగా చైనాలో జరిగిన పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా రసాయనాల ఉత్పత్తిలో చైనా వాటా మూడవంతుగా ఉంది. తక్కువ ప్రారంభ పెట్టుబడితో ప్రారంభించగల రసాయన పరిశ్రమలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల చిన్న తరహా రసాయన వ్యాపారాల జాబితా వివరాలు ఇలా ఉన్నాయి.
టాప్- 30 లాభదాయకమైన రసాయన వ్యాపార ఐడియాల జాబితా
-
డిటర్జెంట్ పౌడర్ తయారీ
డిటర్జెంట్ పౌడర్లను సింథటిక్ డిటర్జెంట్ అని కూడా పిలుస్తారు. తక్కువ ప్రారంభ మూలధన పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ప్రారంభించవచ్చు. వివిధ రకాల డిటర్జెంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయినా ఈ రంగంలో వ్యాపారానికి మరింతగా అవకాశాలున్నాయి. ఈ ఉత్పత్తి తయారీ ప్రక్రియ చాలా సులభం. తగిన సామర్థ్యంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించి, విజయవంతం చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
-
పెర్ఫ్యూమ్ తయారీ
ఈ ఉత్పత్తి యొక్క మార్కెటింగ్ తీరు తెన్నుల గురించి మీకు తెలిసినప్పుడు పెర్ఫ్యూమ్ తయారీ వ్యాపారం లాభదాయకమైన వెంచర్ అవుతుంది. ఇప్పుడున్న రోజుల్లో పెర్ఫ్యూమ్కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. వినియోగదారులు వివిధ సువాసనలు గల పెర్ఫ్యూమ్లను కోరుకుంటున్నారు. ఈ రంగంలో పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
-
నెయిల్ పాలిష్ తయారీ
సౌందర్య ఉత్పత్తులలో నెయిల్ పాలిష్కి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది మిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందిస్తున్న పరిశ్రమ. నెయిల్ పాలిష్ అనేది లక్క తరహా ఉత్పత్తి. దీనిని వేలిగోళ్లను అందంగా అలంకరించుకునేందుకు ఉపయోగిస్తారు. అధిక ఆదాయం వచ్చే వ్యాపారమిది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపనపడేవారు నెయిల్ పాలిష్ను వినియోగిస్తుంటారు. పట్టణ ప్రాంతాల్లో నెయిల్ పాలిష్కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.
-
లిక్విడ్ సబ్బు తయారీ
లిక్విడ్ సబ్బు తయారీ వ్యాపారంలో విస్తృతమైన ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. ఈ వ్యాపారంలో విస్తృతమైన మార్కెట్ పరిశోధన మరియు మార్కెటింగ్ వ్యూహం ఎంతో అవసరం. లిక్విడ్ సబ్బుకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.
-
మ్యాచ్ స్టిక్ తయారీ
భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేస్తూ. మ్యాచ్ స్టిక్ తయారీ వ్యాపారాన్ని చిన్న స్థాయిలో కూడా ప్రారంభించవచ్చు. మ్యాచ్ స్టిక్స్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీటి మార్కెటింగ్లో పరిజ్ఞానం ఉన్న వ్యవస్థాపకుడు ఈ వ్యాపారాన్ని తక్కువ మూలధన పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు.
-
రబ్బర్‌బ్యాండ్ తయారీ
వ్యవస్థాపకుడు మితమైన మూలధన పెట్టుబడితో ఇంటిలోనే రబ్బరు బ్యాండ్ తయారీ ప్రాజెక్టును ప్రారంభించవచ్చు. రబ్బర్ బ్యాండ్ మన దైనందిన జీవితంలో చాలా ఉపయోగకరమైన వస్తువు. భవిష్యత్తులో కూడా దీనికి డిమాండ్ పెరుగుతుంటుంది. రబ్బర్బ్యాండ్ తయారీ అనేది చిన్న వ్యాపార వ్యవస్థాపకులకు ఆర్థికంగా లాభాన్నందించే ఉత్తమ వ్యాపారం.
-
వేప నూనె తయారీ
వేప నూనె తయారీ వ్యాపారీ అనేది ఉత్తమ రసాయన వ్యాపార ఆలోచన. అయితే ఈ ప్రక్రియ గురించి తగిన పరిజ్ఞానం అవసరం. వేప నూనె వెలికితీతలో అనేక పద్ధతులు ఉన్నాయి. ఆల్కహాల్, ఈథర్ మరియు హైడ్రోకార్బన్ల వంటి ద్రావకాలను ఉపయోగించి వేప నూనెను వెలికి తీయడం అనేది పరిశ్రమలో ఎక్కువగా జరుగుతుంటుంది.
-
అగర్‌బత్తీ మేకింగ్
అగర్‌బత్తీ అనేది వినియోగదారులకు ఆకట్టుకునే ఉత్పత్తి . ఏడాది పొడవునా దీనికి డిమాండ్ ఉంటుంది. పండుగ రోజుల్లో డిమాండ్ పెరుగుతుంది. అగర్బ త్తీ తయారీ వ్యాపారం యొక్క పరిధి మరియు ఉత్పత్తి అనేవి వ్యక్తిగత పెట్టుబడి సామర్ధ్యంపై ఆధారపడి ఉంటాయి. ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచి కూడా ప్రారంభించవచ్చు.
-
వాటర్ ప్యూరిఫైయర్
వాటర్ ప్యూరిఫైయర్ అంటే తాగునీటిని శుద్ధి చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియ కోసం అయోడిన్ లేదా క్లోరిన్ డయాక్సైడ్ వినియోగిస్తారు. సరైన సమాచారంతో నీటి శుద్దీకరణ తయారీ వ్యాపారాన్ని చిన్నస్థాయిలో కూడా ప్రారంభించవచ్చు.
-
పురుగుమందుల తయారీ
పురుగుమందుల తయారీ వ్యాపారానికి సరైన సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఉత్పత్తి ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. సరైన ఉత్పత్తిని ఎంచుకోవడం కూడా మరింత ముఖ్యం. పురుగుమందుల తయారీ అత్యంత లాభదాయకమైన రసాయన వ్యాపారాలలో ఒకటి.
-
నైలాన్ ఉత్పత్తి
నైలాన్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన డిమాండ్ ఉంది. మరియు ఇది రోజువారీ అవసరాల్లో ఒకటిగా మారింది. నైలాన్ ఉత్పత్తి రంగంలో విజయం సాధించాలంటే సరైన ఉత్పత్తిని ఎంచుకోవడం మరియు మార్కెట్ను గుర్తించడం చాలా కీలకం..
-
సూక్ష్మపోషక తయారీ
వ్యవసాయ రసాయనాల వ్యాపారంలో సూక్ష్మపోషకం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. బలమైన పంపిణీ వ్యూహాన్ని ఏర్పరుచుకుని ఈ తయారీని ప్రారంభించవచ్చు.
-
టాయిలెట్ క్లీనర్
టాయిలెట్ క్లీనర్ తయారీ ప్రక్రియ గురించి పరిజ్ఞానం కలిగి ఉంటే, ఒక వ్యక్తి చిన్నస్థాయి ప్రాతిపదికన సైతం మితమైన మూలధన పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ రకమైన వ్యాపారంలో సరైన మార్కెటింగ్ వ్యూహాన్ని నిర్ణయించడం చాలా ముఖ్యం.
-
బొటానికల్ పురుగుమందుల తయారీ
పలు సింథటిక్ పురుగు మందులను నిషేధించారు. రసాయనాలను నిరంతరం ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ప్రకృతి సిద్ధమైన పురుగు మందుల తయారీపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. వ్యవసాయంలో వినియోగిందచే ఈ బొటానికల్ పురుగుమందులు అత్యంత ప్రాముఖ్యత కలిగి, తెగుళ్ల వల్ల ఏర్పడే నష్టాలను తగ్గిస్తాయి. ఇటువంటి ప్రకృతి సిద్ధమైన పురుగు మందుల తయారీ ప్రక్రియ గురించి సరైన పరిజ్ఞానంతో, సాధారణ మూలధన పెట్టుబడితో కూడా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
-
హ్యాండ్ శానిటైజర్ తయారీ
కమర్షియల్ హ్యాండ్ శానిటైజర్ తయారీ వ్యాపారం ప్రారంభించాలంలే వివిధ రసాయనాల మిక్సింగ్ మరియు సూత్రీకరణ ప్రక్రియ గురించి సరైన నైపుణ్యం అవసరం. ఈ ఉత్పత్తి ప్రక్రియ చాలా సులభం. వ్యవస్థాపకుడు తక్కువ మూలధన పెట్టుబడితో కూడా ఈ వెంచర్ను ప్రారంభించవచ్చు.
-
శిలీంద్ర సంహారిణి తయారీ
వ్యవసాయం మరియు ఆహార పరిశ్రమలో శిలీంద్ర సంహారిణి ఒక ముఖ్యమైన అంశం. వివిధ కాంబినేషన్లతో కూడిన వివిధ రకాల శిలీంద్రనాశకాలను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. లిక్విడ్ లేదా పొడి రూపంలో శిలీంద్ర సంహారిణి సూత్రీకరణను చిన్నతరహా ప్రాతిపదికన ప్రారంభించవచ్చు.
-
డిష్ వాష్ బార్ – లిక్విడ్ మేకింగ్
డిష్ వాష్ బార్, లేదా డిష్ వాష్ లిక్విడ్ అనేది వినియోగదాలు కోరుకునే మన్నికైన ఉత్పత్తి. ప్రపంచవ్యాప్తంగా దీనికి డిమాండ్ పెరుగుతోంది. తయారీ ప్రక్రియ కూడా చాలా సులభం. పెద్దగా లైసెన్సింగ్ అవసరం లేదు. ఉత్పత్తి ప్రక్రియ గురించి సరైన పరిజ్ఞానంతో ఈ వెంచర్ను ప్రారంభించవచ్చు
-
హెర్బల్ సబ్బు తయారీ
నేడు మూలికా ఉత్పత్తుల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మూలికా ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలలో అవగాహనే దీని వెనుకనున్న ప్రధాన కారణం. మూలికా సబ్బు తయారీ విధానం చాలా సులభం. దీని రూపకల్పనకు కొన్ని ముడి పదార్థాలు అవసరం. మితమైన మూలధన పెట్టుబడితో ఈ వెంచర్ను చిన్న తరహా ప్రాతిపదికన కూడా ప్రారంభించవచ్చు.
-
ఎగుమతి / దిగుమతి
రసాయనాల ఎగుమతులు / దిగుమతులు చాలా లాభదాయకమైన వ్యాపారం. ఇది మితమైన ప్రారంభ మూలధనంతో ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీరు మొదట ఎగుమతి / దిగుమతి లైసెన్స్ పొందాలి. ఎగుమతి మరియు దిగుమతి కోసం మీకు అనువైన ఉత్పత్తులను ఎంచుకోండి. మీ వ్యాపార నెట్వర్క్ను తయారుచేసుకోండి. రసాయన వ్యాపార ఆలోచనలలో ఎగుమతి / దిగుమతి అంశం కూడా ప్రధానమైదని గుర్తించండి.
-
కలబంద జెల్
కలబంద జెల్ ఒక మూలికా ఉత్పత్తి. దీనికి విపరీతంగా డిమాండ్ ఏర్పడుతోంది. ఈ మూలికా ఉత్పత్తి మార్కెటింగ్ గురించి సరైన పరిజ్ఞానంతో మీరు చిన్న తరహాలోనైనా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
-
పురుగుమందుల తయారీ
పురుగుమందుల తయారీ అనేది కాస్త అధిక మూలధన పెట్టుబడితో ప్రారంభించగల అత్యంత లాభదాయకమైన రసాయన వ్యాపార ఆలోచనలలో ఒకటి. నాణ్యమైన పురుగుమందులకు డిమాండ్ భారీగా ఉంది. దీనికి తోడు ఈ వ్యాపారాన్ని మీరు ఒకమాదిరి లేదాపెద్ద ఎత్తున కూడా ప్రారంభించవచ్చు.
-
ఫ్లోర్ పోలిష్ తయారీ
రియల్ ఎస్టేట్ వెంచర్ యజమానులు లేదా ఆస్తి యజమానులు ఫ్లోర్ పాలిష్ సామర్థ్యాన్ని ఎప్పటికీ విస్మరించలేరు. పాలరాయి, గ్రానైట్, విట్రిఫైడ్ టైల్స్ మొదలైన వివిధ రకాల ఫ్లోరింగ్ భాగాలను పాలిష్ చేయడానికి ఫ్లోర్ పోలిష్ను వినియోగిస్తుంటారు. దీని ఉత్పత్తి ప్రక్రియ చాలా సులభం. మీరు ఈ వ్యాపారాన్ని చిన్న మరియు మధ్య తరహా స్థాయిలో ప్రారంభించవచ్చు.
-
హెయిర్ కండీషనర్ తయారీ
హెయిర్ కండీషనర్ అనేది వినియోగదారులు కోరుకునే మన్నికైన జుట్టు సంరక్షణ ఉత్పత్తి. దీని ఉత్పత్తి ప్రక్రియ సాధారణ మిక్సింగ్ మరియు సూత్రీకరణ ద్వారా జరుగుతుంది. మీరు మీ సొంతబ్రాండ్ పేరులో ఈ ఉత్పత్తి విక్రయాలను ప్రారంభించవచ్చు. అలాడే మీరు ఇతర సంస్థల కోసం కూడా ఈ ఉత్పత్తిని తయారు చేయవచ్చు.
-
కలుపు సంహారక తయారీ
రెండు రకాల కలుపు మందులను సాధారణంగా మనం మార్కెట్లో చూస్తుంటాం. ఒకటి మూలికా లేదా బొటానికల్ కలుపు మందు. మరొకటి రసాయన క్రిమి సంహారక మందు. ఈ ఉత్పత్తి ప్రక్రియ సులభం. మూలికా కలుపు సంహారక ఉత్పత్తికి పెద్దగా లైసెన్సింగ్ అవసరం లేదు. దీనికితోడు మీరు ఈ వ్యాపారాన్ని చిన్నస్థాయిలో కూడా ప్రారంభించవచ్చు.
-
పెయింట్స్ తయారీ
పెయింట్స్ తయారీ వ్యాపారం ప్రారంభించాలంటే తగినంత సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఈ వ్యాపారాన్ని ఎవరైనాసరే కాస్త అధిక మూలధన పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
-
ఫేస్ క్రీమ్ తయారీ
ప్రజలలో అందం మరియు ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెరగిన కారణంగా ఫేస్ క్రీమ్ తరహా ఉత్పత్తులకు డిమాండ్ మరింతగా పెరిగింది. ఈ వ్యాపారంలో సరైన ఉత్పత్తిని ఎంచుకోవడం ముఖ్యం. తయారీ ప్రక్రియ అంత సంక్లిష్టం కాదు. దీనికితోడు దీనిని మీరు చిన్న తరహా వ్యాపారంగా ప్రారంభించవచ్చు.
-
బాల్ పెన్ ఇంక్ రీఫిల్ మేకింగ్
బాల్ పెన్ ఇంక్ రీఫిల్ తయారీ అనేది తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల అత్యంత లాభదాయకమైన రసాయన వ్యాపార ఆలోచనలలో ఒకటి. దీని ఉత్పత్తి ప్రక్రియ సులభం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి లైసెన్సింగ్ అవసరం అంతగా ఉండదు.
-
జెర్మిసైడ్ తయారీ
జెర్మైసైడ్ అనేది వినియోగదాలు అన్వేషించే మన్నికైన ఉత్పత్తి. ఇది వివిధ రకాల ఉపరితలాలపై సూక్ష్మక్రిములు మరియు బ్యాక్టీరియాను చంపడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా, జెర్మిసైడ్ అనేది బ్యాక్టీరియా మరియు జెర్మ్స్ను తరిమికొట్టేందుకు సహాయపడుతుంది. ఈ ఉత్పత్తిలో మనుషులకు మరియు ఇతర జీవులకు హాని కలిగించే కారకాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తి ప్రక్రియ చాలా సులభం. జెర్మిసైడ్ తయారీ ప్రస్తుతం అత్యంత లాభదాయకమైన రసాయన వ్యాపార ఆలోచనలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.
-
హెర్బల్ షాంపూ తయారీ
మూలికా షాంపూ అనేది జుట్టు సంరక్షణ ఉత్పత్తి. ఇటువంటి ఉత్పత్తులకు మార్కెట్ సామర్థ్యం రోజురోజుకూ పెరుగుతోంది. సాంకేతిక ప్రక్రియ గురించి పరిజ్ఞానం కలిగి ఉంటే ఏ వ్యక్తి అయినా ఈ వ్యాపారాన్ని చిన్న తరహాలో తక్కువ మూలధన పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
-
టూత్‌పేస్ట్ తయారీ
టూత్పేస్ట్ అనేది వినియోగదారులు కోరుకునే మన్నికైన ఉత్పత్తి. నేటి ప్రపంచంలోని మార్కెట్లలో వివిధ రకాల టూత్పేస్టులు అందుబాటులో ఉన్నాయి. దీని ఉత్పత్తి ప్రక్రియ చాలా సులభం. దీనికితోడు మీరు ఈ వ్యాపారాన్ని చిన్నస్థాయిలో కూడా ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారంలో విజయం సాధించాలంటే సరైన ఉత్పత్తిని ఎంచుకోవడం మరియు సరైన మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించడం ఎంతో ముఖ్యం.