ప్రస్తుత రోజుల్లో, ప్రతీ ఒక్కరికి ఇదొక విధంగా సొంత వ్యాపారం ఉంటే సుఖం అనే అభిప్రాయం ఎంతో కొంత ఉంది. ప్రస్తుతం ఇండియాలో ఒక హార్డ్‌వేర్ షాపును తెరవడం చాలా సులభమైన, అలాగే అత్యుత్తమమైన ఆలోచన. అదొక్కటే కాదు, ప్రస్తుతం ఉన్న మార్కెట్ డిమాండ్ కారణంగా, అది మంచి లాభదాయకమైన బిజినెస్ అని కూడా చాలా మంది అంటున్నారు. కానీ ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు మీరు అసలు ఆ ఆలోచన మంచిదో కాదు తెలుసుకోవాలి. ఆ వ్యాపారాన్ని తెరవడానికి ఏమేమి కావాలో తెలుసుకోవాలి, అలాగే అందులో ఉండే రిస్క్ ఎంతో ఒక ఐడియా ఉండాలికి. ఎందుకంటే ఈ బిజినెస్ ఎంత లాభదాయకమో, అంతే పోటీ కూడా ఉంది.
ఒక సాధారణమైన హార్డ్‌వేర్ షాపులో చేతిపనులకు పనికొచ్చే సాధనాలను అమ్ముతుంటారు. తాళాలు, ప్లంబింగ్ సామాన్లు, ఎలెక్ట్రికల్ వస్తువులు, ఇంటి పనికి అవసరమయ్యే సాధనాలు, పెయింట్లు, బ్రష్‌లు లాంటివి. కాబట్టి ఎవరు పడితే వారు ఈ వ్యాపారాన్ని తెరవడానికి వీలు కాదు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆ పని అనుభవం ఉన్నవారు, మంచి అవగాహనా ఉన్నవారు మాత్రమే సరైన వారు.
కాబట్టి మీకు గనుక ఇది మంచి వ్యాపారం అయితే, మీరు తర్వాతి స్టెప్‌కి వెళ్లొచ్చు. తర్వాత మీరు చాలా విషయాలను చక్కబెట్టాల్సి ఉంటుంది. కాబట్టి, లీగల్‌గా, అన్ని విధాలుగా పోటీని తట్టుకోగల షాపును ఎలా తెరవాలో చూద్దాం రండి.
మీ సొంత హార్డ్‌వేర్ షాపును తెరవడం ఎలా?
మార్కెట్ రీసెర్చ్ మరియు వ్యాపారం నడిపించే ప్రదేశం:
మీ హార్డ్‌వేర్ షాపుకు మంచి డిమాండ్ మరియు కస్టమర్లు ఎక్కువాగే వచ్చే అవకాశాలను పెంచాలంటే, మీరు ముందుగా మీకు ఆ చుట్టుప్పక్కల ఎవరైనా పోటీదారులు ఉన్నారో లేదో చూసి, ఆ ప్రదేశంలో సంచరించే వారు ఎంతవరకు హార్డ్‌వేర్ వస్తువులను కొంటారనే విషయాన్నీ పరిగణలోకి తీసుకొని, అప్పుడు అడుగువేయాలి. మంచి డిమాండ్ ఉండి, తక్కువ పోటీ ఉంటే మంచిది. ఆ తర్వాత, నెమ్మదిగా అక్కడ ఎలాంటి వాటికీ డిమాండ్ ఉందొ చూసి, ఆయా వస్తువులతో మీ షాపును తెరవాలి.
ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్ రీసెర్చ్:
ప్రదేశాన్ని ఎంచుకున్న తర్వాత, మీరు ఎలాంటి ఉత్పత్తులు, ఏ రకమైనవి, అలాగే వాటి క్వాలిటీ ఎలా ఉంటుందని రీసెర్చ్ చేసి ఉండాలి. కావాలంటే లోకల్ కిరానా షాపు ఓనర్స్ నుండి మీకోసం చెప్పబడిన టిప్స్‌ను చదివి కొన్ని మార్కెట్‌ను ఎలా చదవాలి, ఎలా అర్ధం చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకోండి.
ఒక మంచి బిజినెస్ ప్లాన్ వెయ్యాలి:
వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మీరు మంచి ప్లాన్ వేసుకోవాలి. ఏ వ్యాపారానికైనా అతి ముఖ్యమైనది ప్లానింగ్! దీని సహాయంతో వ్యాపారం ఎంతవరకు ఎదుగుతుంది, ఎంత పెట్టుబడి కావాలి, షాపును నడిపించడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మందిని పనిలో పెట్టుకోవాలి, ఎలాంటి ఎత్తుగడలు వేయాలి అనే విషయాలన్నీ తెలుస్తాయి.
లోన్, పెట్టుబడి మరియు ఇన్సూరెన్సు గురించి ఆలోచించండి:
వీటి సహాయంతో మీరు లోన్ పొందాలో లేదో తెలుసుకోవచ్చు. అలాగే, మీ వ్యాపారానికి సరిపడే మంచి ఇన్సూరెన్సు ప్లాన్ తీసుకోండి. మీరు తీసుకొనే ఏ ఇన్సూరెన్సు అయినా, అన్ని రకాల నష్టాలను కవర్ చేసేది అయి ఉండాలి. అలాగే, నెలవారీ ఖర్చులు ఎంత ఉంటాయి, ఎలాంటి వాటికీ ఎంత డబ్బు పెట్టాలి అనేవన్ని ముందుగానే లెక్కించుకొని, దానికి తగ్గట్టుగా మాత్రమే ఖర్చు చేయడానికి ప్రయత్నించాలి. షాపు కోసం ఏ వస్తువునైనా కొనే ముందు మీరు వాటి మీద ఎంత లాభం పొందగలరని అంచనా వేసి తెలుసుకోండి.
ఆదాయాన్ని వీలైనన్ని మార్గాల ద్వారా పొందాలి:
మీ హార్డ్‌వేర్ షాప్ నుండి వచ్చే ఆదాయం ఒక్కటే కాకుండా, ఇతర మార్గాలలో కూడా ఆదాయాన్ని ఏ విధంగా పొందగలరో ఆలోచించండి. ఉదాహరణకు, మీరు ప్లంబింగ్ వస్తువులను అమ్ముతుంటే, సమీపంలో ఉన్న ప్లంబర్లకు మీ వస్తువులను డిస్కౌంట్ ధరకు ఇవ్వండి. కాబట్టి వారు ఎక్కడ పని చేసినా, మీ నుండి వస్తువులను కొని తీసుకెళ్లారు.
మీ హార్డ్‌వేర్ షాపును విజయవంతంగా నడిపించడం ఎలా?
మొదటి అడుగు: మీ షాపును రిజిస్టర్ చేయాలి:
మీ వ్యాపారానికి మంచి పేరు పెట్టాలి. అలాగే రిజిస్టర్ చేస్తుండగా, మీ రాష్ట్రంలో ఆ పేరు అందుబాటులో ఉందొ లేదో చూసుకోవాలి. అలాగే, మీ సొంత ట్రేడ్‌మార్క్ పొందడానికి చూస్తుంటే, మీ ట్రేడ్‌మార్క్ మరొకరి ట్రేడ్‌మార్క్ అలాంటిది లేకుండా చూసుకోవాలి.
రెండవ అడుగు: ఒక బిజినెస్ బ్యాంక్ అకౌంట్ తెరవాలి:
మీ వ్యాపారానికి ప్రత్యేకంగా ఒక బిజినెస్ బ్యాంక్ అకౌంట్ తెరవాలి. తద్వారా మీరు మీ వ్యక్తిగత డబ్బుతో వ్యాపారానికి సంబంధించిన డబ్బును కలపకుండా ఉంటారు. ఎందుకంటే, ఎప్పుడైతే వ్యక్తిగత మరియు వ్యాపార ఆర్థిక లావాదేవీలు కలుస్తాయి, మీ ఇల్లు, కారు, ఇతర ఆస్తులు కూడా నష్టపోతే రిస్కులో పడతారు. మరియు, మీకు వ్యాపారం పేరున క్రెడిట్ కార్డులు మరియు ఇతర ఆర్థిక సాకారాన్ని తక్కువ వడ్డీ రేటుకు పొందడానికి వీలు కలుగుతుంది కూడా. మరియి చివరిగా, మీ వ్యాపారం కూడా సాఫీగా సాగుతుంది.
మూడవ అడుగు: మీ బిజినెస్ టీమ్‌ని ఏర్పాటు చేసుకోండి:
మీకు వచ్చే ఆదాయం, అలాగె చేసే ఖర్చులను పకడ్బందీగా వ్రాసుకోవాలి. దీని సహాయంతో ఆర్థికంగా మీ వ్యాపారం ఎలా నడుస్తుందని తెలుసుకోవచ్చు. మీ బిజినెస్ టీమ్ అంటే, మీకోసం ట్యాక్స్ లేక ఇతర ఆర్థిక విషయాలను చక్కబెట్టడానికి పెట్టుకొనే వారు. వీరి సహాయంతో మీరు ట్యాక్స్ ఫైల్ చేయవచ్చు. అలాగే ముఖ్యమైన GST నిబంధనలను మరియు ఇతర నియమాలను కూడా బాగా తెలుసుకోండి.
నాలుగవ అడుగు: అవసరమైన పెర్మిషన్లు మరియు లైసెన్సులను పొందండి:
మీ వ్యాపారం సాఫీగా జరగాలంటే మీరు కచ్చితంగా అవసరమైన అన్ని అనుమతులను, లైసెన్సులను తీసుకొని ఉండాల్సిందే. లేదంటే, మీరు అనధికారికంగా ఏదైనా చేస్తున్నట్టు ప్రభుత్వం వారు గుర్తిస్తే, వ్యాపారాన్ని మూయించడం లేదా పెద్ద మొత్తంలో ఫైన్ వేయడం లేదా రెండూ జరగవచ్చు. అప్పుడు మీ కష్టం అంతా వృధా అయినట్టే.
అయిదవ అడుగు: మీ బ్రాండును స్థాపించి బాగా ప్రోమోట్ చేయాలి:
మీ వ్యాపారం గురించి ఇతరులకు తెలియజేసేది మీ బ్రాండ్ మాత్రమే. మంచి బ్రాండ్ తమ కస్టమర్లను మళ్ళీ మళ్ళీ వెనక్కి వచ్చేలా చేయగలదు. కాబట్టి మీ బ్రాండును ఏ విధంగా ప్రమోట్ చేయాలో తెలుసుకోండి. వివిధ రకాలుగా జనాలలో మీ షాప్ గురించి మంచి అభిప్రాయం పుట్టేలా చేయవచ్చు. మీరు ఇతర పేరున్న బ్రాండులు, మీకు పోటీ కానీ వాటి సహాయం తీసుకొని, వారి నుండి కస్టమర్లను పొందవచ్చు. అదే విధంగా మీరు కూడా వారికీ సహాయం చేయాలి. అలాగే మీ షాపుకు వెబ్సైట్ తయారు చేయించి, దానిని ప్రమోట్ చేయవచ్చు. అలాగే మీ కస్టమర్లను నుండి మంచి రివ్యూలు ఇమ్మని తీసుకోండి. అప్పుడు ఆన్లైన్లో మీ షాపు రివ్యూ చూసిన వారు మీ దగ్గరకు వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయి.
ఆరవ అడుగు: డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వండి:
పండగలు, లేదా ఇతర సందర్భాలలో దివాలి సేల్, అక్టోబర్ బొనాంజా అంటూ కొన్ని వస్తువులపై మంచి డిస్కౌంట్ ఇచ్చి మీరు మీ అమ్మకాలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
మీ సొంత హార్డ్‌వేర్ షాపు - చివరి మాట
హార్డ్‌వేర్ షాపు మీకు మంచి బిజినెస్ అని ఖచ్చితంగా నిర్ణయించుకుంటే మీరు దానిని ఎప్పుడైనా తెరవవచ్చు. మీరు కేవలం పైన చెప్పిన విషయాలను బాగా అర్ధం చేసుకొని, దానికి తగ్గ విధంగా చేస్తే, విజయవంతంగా షాపును నడిపించడానికి వీలవుతుంది. మీరు ఉన్న ప్రదేశాన్ని బట్టి, ఎదుగుదలకు ఉన్న అవకాశాన్ని బట్టి మీరు హార్డ్‌వేర్ షాపు, పెయింట్ షాపు లేదా మరే ఇతర షాపునైనా తెరవవచ్చు.