భారత దేశంలో మిఠాయిల దుకాణం ఎలా ప్రారంభించాలి?
మిఠాయిలు, బిస్కెట్లు, కేకులు మరియు పల్లీపట్టీలలో కెరీర్. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ ఈ విషయం మనోహర్ లాల్ అగర్వాల్ మరియు శ్యామ్ సుందర్ అగర్వాల్లకు లకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే వారిలో ఒకరు హల్దీరామ్ యజమాని. మరొకరు బికనేర్వాలా మిఠాయి దుకాణం యజమాని. వీరిని స్పూర్తిగా తీసుకుని మీరు కూడా మిఠాయిల దుకాణాన్ని నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు.
భారతదేశం అనేక అంశాలలో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్న దేశం. వీటిలో ఒకటి ఇక్కడ లభ్యమయ్యే ఆహారం. దీని వైవిధ్యం, తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఆహారం తినే విషయంలో, అభిరుచులలో ఎంతో భిన్నంగా ఉంటుంది. ఇక స్వీట్స్ గురించి గురించి చెప్పాల్సివస్తే మనల్నిమనం మరచిపోతాం. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రత్యేకమై స్వీట్స్ లభిస్తాయి. స్వీట్స్కు ప్రతి ప్రాంతంలో ప్రత్యేకమైన పేరు ఉంటుంది. స్వీట్స్ రుచిని తలచుకోగానే దానిని దీనిని తినాలనే కోరిక కలుగుతుంది. ప్రజలు ప్రతీ వేడుక సందర్భంలోనూ స్వీట్స్ కొనుగోలు చేస్తారు. అందుకే ఈ వ్యాపారంలో అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఎవరైనాసరే స్వీట్స్ మరియు స్నాక్స్ కు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అది మంచి ఆలోచనగా భావించాలి. ప్రస్తుత రోజుల్లో స్వీట్స్తో పాటు, స్నాక్స్ కు కూడా ఎంతో ఆదరణ దక్కుతోంది. అందుకే ఇప్పుడు స్వీట్స్ దుకాణాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం.
మిఠాయిలు అని వినగానే మనకు వివిధ రకాల స్వీట్లు కేకులు, బ్రెడ్, స్నాక్స్ మొదలైనవాటివైపు మనను మళ్లుతుంది. ఈ రోజుల్లో మార్కెట్లో ఇలాంటి ఆహారపదార్థాలకు భారీ డిమాండ్ ఉంది. పుట్టినరోజు అయినా లేదా మరేదైనా పార్టీ అయినా మిఠాయి లేకుండా అది అసంపూర్ణంగా ఉంటుంది. వివిధ రకాల స్నాక్స్, బిస్కెట్లు మరియు కేకులు ఈ రోజుల్లో మార్కెట్లో అత్యంత సులభంగా లభిస్తున్నాయి. ఈ ఆహార విభాగంలో ప్రతిరోజూ కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు మార్కెట్లో కొన్ని రకాల మిఠాయిలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు లెక్కలేనన్ని రకాల మిఠాయిలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ మిఠాయిలలో అధికశాతాన్ని వంటవచ్చినవాళ్లే తయారు చేస్తుంటారు. అందుకే ఈ రంగంలో ఉపాధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. మీలో హార్డ్ వర్క్ చేయగల సామర్థ్యం ఉంటే, అప్పుడు మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీతో పాటు మరెందరికో ఉపాధి తలుపులు తెరవవచ్చు.
స్వీట్స్ బిజినెస్‌కు డిమాండ్ ఉందా?
ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, మీరు ప్రారంభించబోయే వ్యాపారం యొక్క డిమాండ్ ఏమిటి? అని అంచనా వేయడం చాలా ముఖ్యం? ఈ ప్రాతిపదికన, మీరు మీ వ్యాపారం యొక్క భవిష్యత్తు ప్రణాళికలను నిర్ణయించవచ్చు. భారతదేశం పండుగల దేశం అని అంటారు కనుక ఈ వ్యాపారానికి భారీ మార్కెట్ ఉంది. సంక్రాంతి, వినాయకచవితి, దసరా,హోళీ, దీపావళి, ఈద్ ఇలా ఒకదాని తరువాత మరొక పండుగలు వస్తుంటాయి. మన సమాజంలో కూడా పండుగల్లో స్వీట్లు ఉండాలనే సంప్రదాయం ఉంది. మిఠాయిని శుభానికి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి స్వీట్స్ వ్యాపారం రాబడి కలిగిన వ్యాపారంగా నిరూపితమవుతున్నదని చెప్పవచ్చు. మీరు స్వీట్స్ దుకాణాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగితే దీనిలో ఎటువంటి నష్టం వాటిల్లదని భావించండి. స్వీట్స్ భారతీయుల దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ విషయాలన్నింటికీ కలిపి చూస్తే స్వీట్ మరియు స్నాక్స్ వ్యాపారం లాభదాయకమైన వ్యాపారమని నిర్ణయించుకోవచ్చు.
మిఠాయి దుకాణం అంటే?
ప్రస్తుల బిజీ రోజుల్లో ప్రతి ఒక్కరికీ సమయం తక్కువగానే ఉంటుంటోంది. ఈ నేపధ్యంలోనే మిఠాయిలకు డిమాండ్ పెరిగింది. గతంలో బిస్కెట్లు మరియు నమ్కీన్లను మిఠాయిలుగా పరిగణించేవారు. కానీ ఈ వ్యాపారంలో మారుతున్న ధోరణి ఈ రంగాన్ని మరింత విస్తృతం చేసింది. ఇప్పుడు మార్కెట్లో పెద్ద సంఖ్యలో మిఠాయి దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. అన్నిరకాల ఆదాయవర్గాల వారికీ తగినవిధంగా మిఠాయిలు మార్కెట్లో లభిస్తున్నాయి. బిస్కెట్లు, బన్స్, బ్రెడ్, రస్కులు, నమ్కీన్, కేకులు, పల్లీపట్టీలు మరియు టాఫీలు మొదలైనవి మిఠాయిలలో ముఖ్యమైనవిగా గుర్తింపు పొందాయి. ఈ విభాగంలో బ్రాండెడ్ కంపెనీలతో పాటు, చిన్న కంపెనీల ఉత్పత్తులు కూడా మార్కెట్లోకి విరివిగా వస్తూ, ఆదరణ పొందుతున్నాయి.
ఈ పరిశ్రమను ఎవరు ప్రారంభించవచ్చు?
ఇది ఆహారపానీయాలకు సంబంధించిన రంగం కాబట్టి ఇక్కడ ఎంతో శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. కస్టమర్లు మీ ఉత్పత్తులకు సంతృప్తిచెంది, వారు తిరిగి డిమాండ్ చేసేలా మీరు చూసుకోవాలి. మీరు ఈ రంగంలో సృజనాత్మకంగా ఉంటూ కొత్తదనాన్ని కోరుకుంటే, వివిధ రకాల ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడం మరింత అవసరం. ఆహార పదార్థాల తయారీనే మీ అభిరుచి అయితే ఈ ఫీల్డ్ మీకు తగినదని గుర్తించి, ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి.
ఈ వ్యాపారానికి కావసిన అర్హతలు
మిఠాయి దుకాణ వ్యాపార అభిరుచి ఉన్నవారెవరైనా ఈ పని చేయవచ్చు. మీరు హైస్కూల్ లేదా ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉంటే, మీరు ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు అర్హత సరిపోతుంది. ఎందుకంటే ఇది నైపుణ్యం కలిగిన రంగం. మీ నైపుణ్యాలు మరింతగా పెంచుకుంటే మీరు ఈ రంగంలో మాస్టర్ అవుతారు. అంతవరకూ మీరు ఓపికపట్టాలి.
శిక్షణ పొందాలా?
ఈ వ్యాపారం నిర్వహించేందుకు ప్రత్యేక కోర్సు చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఈ రంగంలో నైపుణ్యం సాధించాలంటే హోటల్ నిర్వహణకు సంబంధించిన కోర్సులు చాలా సహాయకారిగా ఉంటాయి. ఇది కాకుండా అనేక విశ్వవిద్యాలయాలు గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులను కూడా అందిస్తున్నాయి. మీరు స్వల్పకాలిక కోర్సు చేయాలనుకుంటే ఎన్ఎస్ఐసి చాలా సహాయకారిగా ఉంటుంది.
మిఠాయి దుకాణం ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి ఉండాల్సిన లక్షణాలు
రస్క్ సామర్థ్యం.
అంకితభావం మరియు సహనం.
ఈ రంగానికి సంబంధించిన పనులలో శిక్షణ తీసుకోండి.
నాణ్యత, పోటీ మరియు ధర గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
మీరు వ్యాపారం ప్రారంభించే మార్కెట్ గురించి సమాచారం.
అవసరమైన సాంకేతిక వివరాలు.
అర్హత మరియు నైపుణ్యాల ప్రకారం స్వయం ఉపాధి ఎంపిక.
బ్యాంకింగ్ సమాచారం.
మార్కెట్ నిబంధనల గురించిన సమాచారం.
మిఠాయి దుకాణాన్ని ఎలా ప్రారంభించాలి?
నిజానికి మిఠాయి దుకాణం నడిపించడం కష్టమైన పనిగా అనిపిస్తుంది. కానీ కొంచెం కష్టపడితే ఈ రంగంలో రాణించడం సులభమవుతుంది. ఈ పనిని ఇంటి నుండే ప్రారంభించవచ్చు. అయితే మీరు పని ప్రారంభించే ముందు కొన్ని చట్టపరమైన విధానాలను పూర్తి చేయాలని గుర్తుంచుకోండి. మొదట మీరు మీ జిల్లా లేదా స్థానిక ఆరోగ్య విభాగాన్ని సంప్రదించాలి. మీకు అక్కడ నుంచి మీరు లైసెన్స్ పొందవచ్చు. అప్పుడే మీరు ఆహార పదార్థాలను తయారు చేయవచ్చు. ఆహార ఉత్పత్తులకు సంబంధించిన లైసెన్స్ తీసుకున్న తరువాత, స్థానిక పరిపాలన అధికారులను సంప్రదించండి. వారు మీకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడే మీరు ఉత్పత్తులను ప్రారంభించగలుగుతారు. మీరు ప్యాకేజీ చేసిన వస్తువులను అమ్మాలనుకుంటే, మీరు తప్పక అందుకోసం ఐఎస్ఓ సర్టిఫికేట్ తీసుకోవాలి. లేనిపక్షంలో సమస్యలు ఎదురుకావచ్చు.
ఎటువంటి వస్తువులు అవసరం?
మిఠాయిలను తయారు చేయడానికి చాలా పరికరాలు అవసరం లేదు. మిఠాయిలకు సంబంధించిన అన్ని వస్తువులు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. వీటి తయారీకి వినియోగించే ఆహార పదార్థాలు వివిధ రకాల పప్పులు, పిండి పదార్థాలు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. కాబట్టి ఈ వస్తువులను దూరప్రాంతాల నుంచి తీసుకురావాలన్న ఆలోచన కూడా అవసరం లేదు.
ప్రారంభ ఖర్చు
ప్రారంభ దశలో మిఠాయి దుకాణం కోసం రూ. 50 వేల నుండి లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. మీకు దుకాణానికి అవసరమైన పరికరాలతోపాటు మిఠాయిలు తయారుచేసేందుకు వంటపాత్రలు కూడా అవసరం. కాబట్టి ఖర్చులు ప్రారంభంలో కాస్త అధికంగానే ఉంటాయి.
ప్రభుత్వ మద్దతు / ప్రభుత్వ విధానాలు
ఇటువంటి చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ అనేక పథకాలను అందిస్తున్నాయి. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే మంచి ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలి. అది ఆమోదం పొందితే మీరు సులభంగా యాభై వేల నుండి ఇరవై ఐదు లక్షల రుణం పొందే అవకాశం ఉంటుంది. దీనితో మీరు మంచి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇవే కాకుండా, సహకార సంఘాలు, బ్యాంకులు కూడా రుణాలు ఇస్తాయి.
మిఠాయి దుకాణానికి ఈ లైసెన్స్‌లన్నీ అవసరం
ఆహార లైసెన్స్: ఏదైనా ఆహార ఆధారిత వ్యాపారం చేయాలంటే ఈ లైసెన్స్ చాలా ముఖ్యం. ఈ లైసెన్స్ పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదట, మీరు ఆన్లైన్లోకి వెళ్లి మీరే దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ పనిచేసేందుకు చాలా ఏజెన్సీలు ఉంటాయి. మీరు ప్రతి సంవత్సరం ఈ లైసెన్స్ను రెన్యువల్ చేయించుకోవాలి.
జీఎస్టీ రిజిస్ట్రేషన్: జీఎస్టీ అమలు తరువాత వ్యాపారాలకు ఈ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి అయింది. ఇందుకోసం చార్టర్డ్ అకౌంటెంట్ సహాయంతో ఈ ప్రక్రియ పూర్తిచేయవచ్చు.
ఆరోగ్య లైసెన్స్: దుకాణం ఏర్పాటు కోసం మీరు మీ నగర అధికారుల నుండి ఈ లైసెన్స్ పొందాలి. దీని కోసం మీరు మునిసిపల్ కార్పొరేషన్ను సంప్రదించాలి. తరువాత మునిసిపల్ ఇన్స్పెక్టర్ మొదట మీ దుకాణాన్ని తనిఖీ చేస్తారు. ఆ తర్వాత మీకు ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ లైసెన్స్ లభిస్తుంది.
ఫైర్ లైసెన్స్: మీ దుకాణం అగ్ని నుండి సురక్షితంగా ఉందని నిర్ధారించినప్పుడు ఈ లైసెన్స్ మీకు అందుతుంది. స్వీట్స్ వ్యాపారంలో నైపుణ్యం కలిగిన బృందం అవసరం. ఈ ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడానికి, దీనికి సంబంధించిన బాధ్యతలను నిర్వహించగల బృందం కూడా అవసరమే.
సంపాదన సామర్థ్యం
ఇది ఆహార నాణ్యత, విశ్వసనీయతపై ఆధారపడివుంటుంది. ఇది మీ దుకాణం చుట్టుపక్కల ఉన్నవారి నుంచి దీనిని దక్కించుకోవడం మీ బాధ్యతగా గుర్తించాలి. మీరు మీ కస్టమర్ యొక్క హృదయాన్ని గెలుచుకున్న తర్వాత మీ మిఠాయి దుకాణ నిర్వహణకు ఎటువంటి ఢోకా ఉండదు. వ్యాపార ప్రారంభ కాలంలో మీరు నెలకు ఇరవై నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకూ సంపాదించే అవకాశం ఉంటుంది.
స్వీట్స్ దుకాణంలో ఆహార పదార్థాలను ఎలా మార్కెట్ చేయాలి?
ప్రస్తుతం నడుస్తున్నది మార్కెటింగ్ యుగం. ఈరోజుల్లో ప్రతీదానికీ మార్కెటింగ్ అనేది అత్యవసరం. తద్వారా ఇది గరిష్ట సంఖ్యలో ప్రజలలో ఆకట్టుకుంటుంది. అందుకే మీ కొత్త వ్యాపారంలో మార్కెటింగ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గ్రహించండి. ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ అవసరంగా మారిపోయింది. డిజిటల్ మార్కెటింగ్లో భాగంగా మీరు మీ దుకాణానికి సంబంధించిన వెబ్సైట్ లేదా బ్లాగును సృష్టించవచ్చు. దానిలో మీ వ్యాపారానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఉంచవచ్చు. ఇంతేకాకుండా మీ దుకాణానికి సంబంధించిన ప్రకటనను వార్తాపత్రికలలో ప్రచురించవచ్చు. చిన్న పాంప్లెట్లు పంచవచ్చు. ఇవన్నీ మార్కెటింగ్ పరిధిలోకే వస్తాయి. వ్యాపార విషయంలో నిరిర్థి లక్ష్యం ఉండాలి. అప్పుడే వ్యాపారం రాణిస్తుంది.
స్వీట్ షాప్ వ్యాపారం నుంచి ఎంత లాభం పొందవచ్చు?
స్వీట్స్ వ్యాపారం నుండి వచ్చే లాభాలను అంచనా వేసేముందు, పాలు మరియు చక్కెర, కోవా మొదలైన ఖర్చులు ఉంటాయని గమనించవచ్చు. ఇక చౌకగా లభించే స్వీట్ల గురించి మాట్లాడాల్సివస్తే, కిలోకు 200 రూపాయల కన్నా తక్కువకే అందించవచ్చు. ఈ ఖరీదు ఆహారప్రియులకు అందుబాటులోనే ఉంటుంది. ఇందుకోసం ఒక అంచనా ప్రకారం వంద రూపాయల వరకూ ఖర్చవుతుంది. అయితే ఇందుకోసం ఎంతో ప్రణాళికా బద్దంగా వ్యవహరించాల్సివుంటుంది. ఆహార పదార్థాల వ్యాపారం ఎప్పటికీ ఉండేదే కాబట్టి సమర్థవంతంగా నిర్వహించగలిగితే ఈ వ్యాపారంలో విజయవంతం కావచ్చని చెప్పవచ్చు.