గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) భారతదేశంలో ప్రవేశ పెట్టడంతో, ఒకప్పటి ట్యాక్స్ విధానం సముర్ణంగా మార్చబడింది. 2017లో అమలులోకి వచ్చిననాటి నుండి, అనేక వ్యాపారాలు దీని కారణంగా లబ్ది పొందాయని చెప్పడం అతిశయోక్తి కాదు.
స్పష్టంగా నిర్వచించబడిన ట్యాక్స్ విధానం, ప్రధానంగా ఈ-కామర్స్ మరియు లాజిస్టిక్ రంగాలలో వ్యాపారాలను ఎన్నో రెట్లు వృద్ధి చెందడానికి సహాయపడింది. ఒకప్పటి ట్యాక్స్ విధానంలో ఇది సాధ్యం కాలేదు, కారణం అప్పటి ట్యాక్స్ విధి విధానాలు క్లిష్టంగా ఉండి, పన్ను చెల్లింపుదారులు అర్ధం చేసుకోవడానికే వీలుపడేది కాదు.
మీరు గనుక GST చట్టానికి అనుగుణంగా మీ వ్యాపారాన్ని రిజిస్టర్ చేసుకున్నట్లయితే, ఆన్లైన్ పోర్టల్ నుండే ఆన్లైన్లో GST పేమెంట్లను చెల్లించగలరు. అలాగే మీరు గనుక మహారాష్ట్రలో టాక్స్ చెల్లించేవారైతే, ఖచ్చితంగా MahaGST సైటుకి వెళ్లడం మర్చిపోకండి.
దేశంతో కలిసి కాకుండా, ఒక రాష్ట్రం కోసమని ప్రత్యేకంగా ఆన్లైన్ సైట్ ఎందుకా అని మీకు సందేహం రావచ్చు, కాబట్టి మహారాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు నిర్వహస్తున్న వివిధమైన కార్యక్రమాలలో రుణాలను సెటిల్ చేయడానికి సెటిల్మెంట్ స్కీములను ప్రకటించింది.
MahaGST అంటే ఏమిటి?
MahaGST అనేది మహారాష్ట్రలో ఉన్న ప్రజలకు తమ GST రిజిస్ట్రేషన్ మరియు GST ఆన్లైన్ పేమెంట్లను సులభతరం చేయడానికి ప్రవేశపెట్టబడిన ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ పోర్టల్.
MahaGSTలో అనేకమైన సర్వీసులు మరియు వైవిధ్యమైన ఫీచర్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో GST రిజిస్ట్రేషన్, GSTIN ట్రాకింగ్, GST రూల్స్ & నోటిఫికేషన్స్, సర్కులర్లు మరియు సంబంధిత వార్తలు కొన్ని ప్రాముఖ్యమైనవి. వీటితో పాటు రకరకాల వాట్, మరియు తరచుగా అడిగే ప్రశ్నల సెక్షన్లు కూడా ఉన్నాయి.
MahaGST విధులపై క్షుణ్ణంగా తెలుసుకుందాం
మహారాష్ట్ర వేల్యూ యాడెడ్ టాక్స్, 2002, సెంట్రల్ సేల్స్ టాక్స్ చట్టం, 1956, ప్రొఫెషన్ టాక్స్ చట్ట, 1975, చెరుకు మీద విడిచిన మహారాష్ట్ర పర్చేస్ టాక్స్, 1962, స్థానిక ప్రదేశాలలోనికి గూడ్స్ అనుమతిపై విధించిన మహారాష్ట్ర టాక్స్ వంటి రకరకాల టాక్స్ చట్టాలు MahaGST క్రిందకు వస్తాయి.
మహారాష్ట్ర వేల్యూ యాడెడ్ టాక్స్, 2002
ప్రీ - వ్యాట్ టాక్స్ విధానం క్రింద, పన్నులు రెండింతలు కావడం, కొన్ని వస్తువులపై ట్యాక్స్ రెట్టింపుగా విధించడం లాంటి కారణాల వల్ల ప్రజలపై ట్యాక్స్ భారం బాగా ఎక్కువయ్యేది.
ఉదాహరణకు, వస్తువును తయారు చేయకముందు, చేసిన తర్వాత కూడా ట్యాక్స్ విధించేవారు. దీని కారణంగా అన్యాయంగా ప్రజలపై ట్యాక్స్ భారాన్ని మోపడం జరిగేది. వ్యాట్ టాక్స్ ప్రవేశపెట్టబడిన తర్వాత, టర్నోవర్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ మీద విధించే సర్‌చార్జీ వంటి అనేక రకాల పన్నులు నిర్ములించబడ్డాయి.
వ్యాట్ పన్ను పద్దతి కారణంగా మరింత పారదర్శకమైన, సులువైన వ్యవస్థ ఏర్పడింది. దీని కారణంగా కలిగిన లాభాలు ఏమిటంటే:
- ట్యాక్స్ యొక్క భారాన్ని తెలుసుకోగలిగారు
- ధరలు తగ్గుముఖం పట్టాయి
- వ్యవస్థలో పదర్శకత పెరిగింది
- ఆదాయం పెరిగింది
ప్రొఫెషనల్ ట్యాక్స్ చట్టం, 1975
సమాజంలో ఉన్న బలహీన వర్గాలకు మేలు కలగడానికి, ప్రభుత్వం ఉపాధి హామీ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకం క్రింద నైపుణ్యం లేని గ్రామీణ కార్మికులకు వారు చేసిన పని యొక్క నాణ్యత మరియు పరిమాణం ప్రకారం సంపాదన ఆర్జించే అవకాశం ఉంటుంది.
స్థానిక ప్రాంతాలలో మోటారు వాహనాల ప్రవేశం పై మహారాష్ట్ర పన్ను చట్టం, 1962
ఈ చట్టాన్ని 18/12/1987లో అమలులోకి తీసురావడం జరిగింది. ఈ చట్టం అమలులోకి రాకముందు, అనేకమైన మోటారు వాహనాల తయారీదారులు, అమ్మకాల పై ట్యాక్స్ తక్కువగా ఉండే కేంద్ర పాలిత ప్రాంతాలు, లేదా ఇతర రాష్ట్రాలలో వాహనాలను తయారు చేసి, మహారాష్ట్రాలో అమ్మకాలు జరిపేవారు. ఆ కారణంగా రాష్ట్ర ఆదాయం దెబ్బతినడం మొదలుపెట్టింది. కాబట్టి సేల్స్ ట్యాక్స్ లో కోల్పోయిన రాబడికి ప్రత్యామ్నాయంగా ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారు.
ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తయారుచేయబడ్డ వాహనాలను, మహారాష్ట్రలోనికి తీసుకువచ్చి విక్రయించడానికైనా, లేదా ఉపయోగించడానికైనా, ప్రభుత్వానికి ఈ పన్నును చెల్లించవలసి ఉంటుంది.
ఈ నియమం రాష్ట్రంలోని తీసుకురాబడ్డ వాహనాన్ని మోటారు వాహనాల చట్టం ప్రకారం మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ చేయించే పక్షాన మాత్రమే వర్తిస్తుంది.
MahaGST యొక్క సర్వీసులు
GST రిజిస్ట్రేషన్
మీరు గనుక మీ వ్యాపారాన్ని ఇంకా GST నంబర్ (GSTIN) కోసం రిజిస్టర్ చేయించకపోతే, MahaGST సహాయంతో రిజిస్టర్ చేసుకోవచ్చు. GST రిజిస్టర్ చేయించుకున్న వారికి రాత్రి ప్రభుత్వం నుండి అనేకమైన లాభాలు ఉంటాయి.
- GST రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా మీరు వస్తువులు లేదా సేవల సరఫరాదారుగా చట్టబద్ధంగా గుర్తించబడతారు.
- మీ వ్యాపారం స్థిరంగా GST పేమెంట్లు చేస్తూ, క్రమంగా రిటర్న్స్ కోసం ఫైల్ చేస్తున్నట్లయితే, ప్రభుత్వం మరియు అధికారుల దృష్టిలో మీ వ్యాపారానికి విశ్వసనీయత పెరిగి, గుర్తించబడే అవకాశాలు ఉన్నాయి.
- మీ GST నంబర్ (GSTIN) ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రక్రియను చాలా సులభం చేస్తుంది. మీరు క్రమంగా GST పేమెంట్లను ఆన్లైన్లో చేస్తుంటే, మీరు కొనుగోళ్లపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయాన్ని పొందగలరు.
- అనవసరమైన ఇబ్బందులను ఎదురుకోకుండా, సాఫీగా అంతర్ రాష్ట్ర వ్యాపారాన్ని నడిపించడానికి ప్రతీ వ్యాపారానికి ఖచ్చితంగా GSTIN ఉండాలి.
GSTIN ధృవీకరణ
GST రిజిస్ట్రేషన్ ప్రస్తుతం వ్యాపారులు, సరఫరాదారులకు తప్పనిసరి చేయడం కారణంగా, చాలా మంది నకిలీ GST నంబర్లను ఉపయోగిస్తూ ప్రభుత్వాన్ని మోచ్చపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు.
తమ వ్యాపారాలపై ప్రభుత్వం కన్ను పడకుండా తప్పించుకోవడానికి, నకిలీ GST నంబర్లతో చూడడానికి చట్టబద్ధంగా కనిపించే పన్ను లెక్కలు గల బిల్లులు మంజూరు చేస్తూ తప్పించుకుంటున్నారు.
కానీ ఆ విధంగా వసూలు చేసిన పన్ను ప్రభుత్వాన్ని చేరదు కాబట్టి, ప్రతీ వ్యాపారం తమ విశ్వసనీయతను నిరూపించుకోవడానికి తప్పకుండ వారి GSTINను ఆన్లైన్లో ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.
ముందు చెప్పినట్టు, GSTIN వ్యాపారులు మరియు సరఫరాదారుల ప్రామాణికతను గుర్తించడానికి సహాయపడుతుంది, కాబట్టి మీరు మోసగాళ్ల నుండి తప్పించుకోగలుగుతారు.
GST నంబర్ ధృవీకరణ సహాయంతో పన్ను తారుమారు మరియు ఎగవేతకు ఆస్కారం గణనీయంగా తగ్గిందని నిరూపించబడింది. కాబట్టి వ్యాపార రంగంలో పారదర్శకత ఏర్పడింది.
MahaGST మీరు కావాలనుకున్న GST నంబర్‌ను ధృవీకరించడానికి సహాయపడుతుంది. అధికారిక MahaGST వెబ్సైటుకు వెళ్లి, 'Dealer Services' ట్యాబ్‌కు వెళ్లి, 'Know your GST taxpayer' అనే ఎంపికపై నొక్కి, GSTIN నంబరును ఎంటర్ చేయండి.
ఒకవేళ GSTIN నంబర్ బదులు తాత్కాలిక గుర్తింపు నంబర్‌ను (TIN) ఉంటే, TIN ఎంపిక పై, 'Know your Taxpayer' పైన నొక్కండి, అక్కడ తాత్కాలిక గుర్తింపు నంబర్‌ను (TIN) ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.
ముగింపు
ఇవి MahaGST అందించే కొన్ని ముఖ్యమైన సేవలు. వీటితో పాటు GST అప్డేట్స్ మరియు నోటిఫికేషన్లు, ట్యాక్స్ క్యాలెండరు, అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ను (ARN) ట్రాక్ చేయడం మరియు మరెన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా చదివి తెలుసుకోండి.